రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల్లో వైస్‌చాన్స్‌లర్(వీసీ) పోస్టుల కోసం 1,289 మంది దరఖాస్తు చేసుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల్లో వైస్‌చాన్స్‌లర్(వీసీ) పోస్టుల కోసం 1,289 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారుల్లో వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, సైంటిసులూ ఉన్నారు. కొందరు ప్రొఫెసర్లు తొమ్మిది వర్సిటీలకూ దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 330 మంది 1,289 దరఖాస్తులు పంపారు. గత నెలలో వర్సిటీ వీసీ పోస్టులకు నిబంధనలను ప్రభుత్వం మార్పు చేసి, పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నెల 8 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించింది. వీరిలో 15 మంది తాము ఏ వర్సిటీ వీసీ పోస్టును కోరుకుంటున్నారో తెలపకుండా దరఖాస్తు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి చెప్పారు. వీటిని పరిశీలించి ప్రతి వీసీ పోస్టుకు ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేసేందుకు సెర్చ్ కమిటీ కసరత్తు చేస్తోంది. కాగా దరఖాస్తు చేసుకున్న వారినే కాకుండా చేసుకోని వారిని కూడా వీసీలుగా నియమించే అవకాశం ఉండనుంది. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అత్యధికంగా 182 దర ఖాస్తులు వచ్చాయి. ఆ తరువాతి స్థానంలో మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ పోస్టు కోసం 176 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం.