
హార్టీ కల్చర్
అవగాహన ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు– డాక్టర్ నీరజా ప్రభాకర్
‘అన్నం ముద్దను మన నోటికి చేర్చే రైతు కష్టానికిఅవగాహన, సాంకేతికత, ఆర్థిక వెన్నుదన్ను అందిస్తేవ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చు’ అంటున్నారు డాక్టర్ నీరజా ప్రభాకర్. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్శిటీకి ఫస్ట్ ఉమన్ వైస్ ఛాన్సలర్‌గా చేసి, అగ్రికల్చర్‌యూనివర్శిటీలో హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌కి హెడ్‌గా, సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. 42 ఏళ్లుగా ఈ రంగంలో చేస్తున్న కృషిని, చోటు చేసుకుంటున్న మార్పులను, నేటి తరం ఆలోచనలనూ మన ముందు ఆవిష్కరించారు.
‘‘రైతు నేలలో విత్తనాలు వేసిన రోజు నుంచి నీటి సదు΄ాయాలు, భూసారం, వాతావరణం, తెగుళ్లు.. అన్నింటినీ దాటుకొని రైతు కష్టం మన చేతికి వచ్చేవరకు ఏయే దశలు దాటుతుంది అనే విషయాల పట్ల అందరికీ అవగాహన ఉండాలి. అప్పుడే ఈ రంగంలో అద్భుతాలు సృష్టించగలం.
ఉల్లిపా యలు వేసిన మార్గం..
మాది వ్యవసాయం కటుంబం. చదువుకునే రోజుల నుంచి ఉల్లిపాయలపై మార్కెట్లో వచ్చే హెచ్చు తగ్గులు ఎప్పుడూ విస్మయానికి లోను చేస్తుండేవి. ఆ ఆలోచనతోనే 1983లో ఎమ్మెస్సీ హార్టీ్టకల్చర్, అటు తర్వాత ‘ఉల్లిపాయలు– నీటి యాజమాన్యం’ మీద పీహెచ్‌డీ చేశాను. 1994 లో సంగారెడ్డి ఎఆర్‌వో నర్సరీ ఇంచార్జ్‌గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మూడేళ్లకు ఉల్లి ధరలుæపెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రైతులు ఉల్లి సాగులో ఎక్కువ దిగుబడి సాధించడానికి శిక్షణాతరగతులు నిర్వహించాం. అక్కణ్ణుంచి మామిడి, జామ, స΄ోట, సీతాఫలం అంటు మొక్కలతోపాటు జామ, పనస వంటి పండ్లు, మల్లె మొక్కల... అమ్మకాలు కూడా ప్రాంరంభించాం.ప్రాంతానికి తగిన విధంగాఏ ప్రాంతానికైనా అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పండే పంటలు కొన్ని ఉంటాయి. వాటిని గుర్తించి అన్ని సీజన్‌లలో ఎలా పండించవచ్చో సాధించి చూ΄ాం. వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ (అఖిల భారత సమన్వయ సంస్థ కూరగాయల పరిశోధన)లో ఆరేళ్లు పని చేశాను. రైతుల దగ్గరకు వెళ్లి, వాళ్లు ఎంచుకున్న సాగు పద్ధతులు స్వయంగా తెలుసుకొని, మార్పులూ చేశాం. బీర, దోస, సొరకాయ, గుమ్మడి.. మొదలైన వాటిలో క్రాసింగ్,, హైబ్రీడ్స్ మీద వర్క్ చేశాను.
పారిశ్రామిక రంగానికి జత చేయాలి
ఆ తర్వాత 15 ఏళ్లు అధ్యాపకురాలిగా ఉన్నాను. సీనియర్ ప్రొఫెసర్‌గా ప్రమోషన్ ఆ తర్వాత 20 రోజుల్లోనే కొండాలక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్శిటీ కి ఫస్ట్ రెగ్యులర్ వైస్ ఛాన్స్‌లర్ పోస్టింగ్ వచ్చింది. దేశంలోనే హార్టికల్చర్ యూనివర్శిటీస్‌లో ఫస్ట్ ఉమన్ వైస్ ఛాన్సలర్‌గానూ గుర్తింపు లభించింది. మొదటిసారి విద్యార్థులనుపారిశ్రామిక రంగానికి అటాచ్ చేస్తూ స్కిల్స్ నేర్పించే విధంగా ప్రోగ్రామ్స్ చేశాం. కమర్షియల్ హార్టికల్చర్, నర్సరీ, ఫ్లోరికల్చర్, మష్రూమ్స్‌పై పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌తో తయారుచేసే నిల్వ పదార్థాలు, సుగంధ తైలాల తయారీలోనూ ట్రైనింగ్ ఇచ్చాం. టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్స్, మామిడిపై పరిశోధన, ప్రదర్శనలు, డ్రాగన్ ఫ్రూట్ సాగులను ప్రోత్సహించాం. వివిధ దేశాల నుంచి వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలతో మన రైతులకు, స్టూడెంట్స్‌కు మధ్య చర్చలు జరిపాం.
నవతరం దృష్టి మారాలి..
ఐదారేళ్ల నుండి ఈ రంగంలోకి వచ్చే అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. అయితే, అమ్మాయిలు ఫీల్డ్‌కి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అవగాహన కలిగినవారు వెనుకంజ వేస్తే వ్యవసాయ రంగం సమతుల్యత దెబ్బతింటుంది. ఈ రంగంలోకి వచ్చేవారు పొలాలకు వెళ్లడానికి ఉదయం, సాయంత్రం సమయాలను ఎంచుకోవడం వంటి స్మార్ట్ వర్క్ నేర్చుకోవడం కూడా ముఖ్యం. రైతులు ఏ విధంగా కష్టపడతారో ఈ రంగంలోకి వచ్చి శిక్షణ తీసుకున్నవారు కూడా అంత కష్టపడాల్సి ఉంటుంది. చేసే పనిలో అంకితభావం ఉంటే మంచి ఫలితాలను ΄÷ందగలం’’అని వివరించారు.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి