
ఎంజీయూ (నల్లగొండ రూరల్): తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్వరలో నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ)లో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరణకు హాజరుకానఉన్నారు. అక్టోబర్ 7వ తేదీన గవర్నర్ విగ్రహావిష్కరణ అనంతరం పలు అంశాలపై విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమై చర్చించనున్నారు. దీంతో బుధవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్.. వీసీ గోపాల్‌రెడ్డితో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశం జరిగే హాల్, రక్తదాన శిబిరం ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, గోలి అమరేందర్‌రెడ్డి ఉన్నారు.
చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్
రిపబ్లిక్ డే పరేడ్‌కు వలంటీర్ల ఎంపిక
యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రీ - రిపబ్లిక్ డే (ఆర్‌డీ) పరేడ్‌కు బుధవారం వలంటీర్లను ఎంపిక చేశారు. ఈ మేరకు బుధవారం వీసీ గోపాల్‌రెడ్డి ఎంపిక ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిత్వ వికాసానికి ఎన్‌ఎస్‌ఎస్ దోహదపడుతుందన్నారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలని చెప్పారు. నిష్పక్షపాతంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే పరేడ్‌కు విద్యార్థులను ఎంపిక చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రాంతీయ అధికారి రామకృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment