నల్లగొండ రూరల్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ఆదివారం నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని ఎన్జీ కాలేజీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ(అన్నెపర్తి)లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 51 బీఈడీ కాలేజీలు ఉండగా, 5100 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
21 నుంచి 28వ తేదీ దాకా కౌన్సెలింగ్
మ్యాథ్స్ కౌన్సెలింగ్ 21వ తేదీన ప్రారంభమై 22వ తేదీతో ముగుస్తుంది. మ్యాథ్స్ అభ్యర్థులు 23, 24 తేదీల్లో వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం కల్పించారు. ఫిజికల్‌సైన్స్, ఇంగ్లిష్ విభాగాల్లో 23వ తేదీ ఒక్కరోజే కౌన్సెలింగ్ ఉంటుండగా, ఫిజికల్‌సైన్స్‌వారికి 25, 26 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. 24, 25 తేదీల్లో బయాలాజికల్ సైన్స్‌వారి కౌన్సెలింగ్ జరుగుతుంది. వీరికి 26, 27 తేదీల్లో వెబ్‌ఆప్షన్స్ ఇచ్చారు. 26 నుంచి 28వ తేదీ దాకా సోషల్ స్టడీస్ వారికి కౌన్సెలింగ్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ విషయాని వస్తే 26వ తేదీన కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారికి 28, 29న, 27న కౌన్సెలింగ్ హాజరయ్యేవారికి 29, 30 తేదీల్లో, 28న కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారికి 30, అక్టోబర్ 1 వరకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం ఇచ్చారు.
ప్రత్యేక కేటగిరి వారికి....
22న మ్యాథ్స్ - ఎన్‌సీసీ, క్యాప్, పీహెచ్‌సీ, స్పోర్ట్స్
23న ఫిజికల్‌సైన్స్/ఇంగ్లిష్ -ఎన్‌సీసీ, క్యాప్, పీహెచ్‌సీ, స్పోర్ట్స్
24న బయాలాజికల్ సైన్స్ -ఎన్‌సీసీ, క్యాప్
25న బయోలాజికల్ సైన్స్-స్పోర్ట్స్, పీహెచ్‌సీ
26న సోషల్ స్టడీస్ - ఎన్‌సీసీ, క్యాప్
27న సోషల్ స్టడీస్ -స్పోర్ట్స్, పీహెచ్‌సీ
ప్రత్యేక కేటగిరి అభ్యర్థులకు నిజాం కాలేజీ హైదరాబాద్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ సుబేదారి, వరంగల్‌లో కౌన్సెలింగ్ జరుగుతుంది.
అభ్యర్థులు ముందుగా హాజరుకావాలి :
అంజిరెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి
కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందుగానే సంబంధిత కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 10గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభిస్తాం. అభ్యర్థులు ఒరిజినల్, జీరాక్స్, పాస్‌పోర్టు సైజు ఫొటోలతో హాజరుకావాలి.
కౌన్సెలింగ్ షెడ్యూల్ ర్యాంకుల వారీగా..
తేదీ సబ్జెక్టు సమయం హెల్ప్‌లైన్ సెంటర్స్
ఎన్జీ కాలేజీ ఎంజీ యూనివర్సిటీ
21న మ్యాథ్స్ ఉదయం 1 -2500 2501-5000
మధ్యాహ్నం 5001-7500 7501-10,000
22న ॥ ఉదయం 10,001-14,000 14,001-18,000
మధ్యాహ్నం 18,001-24,000 24,000 నుంచి చివరి ర్యాంకు దాకా
23న ఫిజిక్స్,ఇంగ్లిష్ ఉదయం 1-2500 2501-5000
మధ్యాహ్నం 5001-9500 9501 నుంచి చివరి ర్యాంకు దాకా
24న జీవశాస్త్రం ఉదయం 1-4000 4001-8000
మధ్యామ్నం 8001-12,000 12,001-16,000
25న ॥ ఉదయం 16,001-20,000 20,001-24,000
మధ్యాహ్నం 24,001-30,000 30,001 నుంచి చివరి ర్యాంకు దాకా
26న సాంఘికశాస్త్రం ఉదయం 1-5000 5001-10,000
మధ్యాహ్నం 10,001-15,000 15,001-20,000
27న ॥ ఉదయం 20,001-25,000 25,001-30,000
మధ్యాహ్నం 30,001-35,000 35,000-40,000
28న ॥ ఉదయం 40,001-45,000 45001-50,000
మధ్యాహ్నం 50,001-58,000 58,001 నుంచి చివరి ర్యాంకు దాకా
నేటినుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
Published Sun, Sep 21 2014 2:57 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement