ఎంజీయూ (నల్లగొండ రూరల్): యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కోర్సును మూడేళ్లు ఒకేచోట నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అన్నెపర్తి మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గురువారం ఇంజినీరింగ్ విద్యార్థులు దీక్ష చేపట్టారు. ప్రథమ సంవత్సరం అన్నెపర్తి మెయిన్ క్యాంపస్‌లో, ద్వితీయ, తృతీయ సంవత్సరం పానగల్ క్యాంపస్‌లో తరగతులు, హాస్టల్ నిర్వహిస్తే తాము అంగీకరించేది లేదని వారు స్పష్టం చేశారు. పానగల్ క్యాంపస్‌లో క్లాస్‌లకు హాజరయ్యే రెండో, మూడో సంవత్సరం విద్యార్థినులు హాస్టల్ కోసం మళ్లీ అన్నెపర్తి మెయిన్ క్యాంపస్‌కు రావాల్సి ఉందన్నారు.
అన్నెపర్తి మెయిన్ క్యాంపస్‌లో ప్రథమ సంవత్సరం విద్యార్థులు హాస్టల్ కోసం పానగల్ క్యాంపస్‌కు రావాల్సి ఉందన్నారు. దీంతో విద్యార్థుల మధ్య చదువుపరంగా సహకారం అండదని ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీలో రూ.24 కోట్ల నిధులు మూలుగుతున్న ఒక్క కొత్త భవనం నిర్మించకపోవడం అధికారుల పని తీరుకు నిదర్శనమని విద్యార్థులు ఆరోపించారు. తమ సమస్యలను వీసీ మణిప్రసాద్ దృష్టికి తీసుకపోకుండా రిజిస్ట్రార్ ఉమేష్‌కుమార్ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. అన్ని కోర్సుల విద్యార్థులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు దీక్షను కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.
వర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థుల దీక్ష
Published Fri, Aug 21 2015 12:49 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement