ఇంజనీరింగ్ విద్యను ఒకే చోట అందించాలని కోరుతూ మహాత్మాగాంధీ ఇంజనీరింగ్ విద్యార్థులు యూనివర్సిటీలో శనివారం ధర్నాకు దిగారు.
నల్లగొండ : ఇంజనీరింగ్ విద్యను ఒకే చోట అందించాలని కోరుతూ మహాత్మాగాంధీ ఇంజనీరింగ్ విద్యార్థులు యూనివర్సిటీలో శనివారం ధర్నాకు దిగారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో మొదటి సంవత్సరం తరగతులను అనపర్తి వద్ద ఉన్న యూనివర్సిటీలో చెబుతున్నారు.
రెండు, మూడో ఏడాది తరగతులను నల్లగొండ పట్టణంలోని పానగల్లు చెరువు సమీపంలో ఉన్న క్యాంపస్‌లో చెబుతున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే అన్ని సంవత్సరాల తరగతులను ఒకేచోట బోధించాలని డిమాండ్ చేస్తూ వారు ధర్నాకు దిగారు.