కొడుకుని ఎంసెట్ పరీక్ష కేంద్రానికి తీసుకువెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం చెందారు.
నల్లగొండ: కొడుకుని ఎంసెట్ పరీక్ష కేంద్రానికి తీసుకువెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం చెందారు. కొడుకుకు గాయాలయ్యాయి. నార్కెట్పల్లికి చెందిన ఈ తండ్రీకొడుకులు తెల్లవారుజామునే లేచి నల్లగొండలోని పరీక్షా కేంద్రానికి బైకుపై బయలుదేరారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షాకేంద్రలోకి అనుమతించరని, వీరు కాస్త ముందుగానే బయలుదేరారు. ఒక్కగానొక్క కొడుకు చేత పరీక్ష రాయించడానికి తండ్రి స్వయంగా తీసుకువస్తున్నారు.
వారి బైకు మహాత్మగాంధీ యూనివర్సిటీ సమీపంలోకి రాగానే ఒక లారీ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. కొడుకు గాయపడ్డారు. తన కళ్ల ఎదుటే తండ్రి మరణించడం చూసి కొడుకు తట్టుకోలేకపోతున్నాడు. పరీక్ష రాసే పరిస్థితి కూడాలేదు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు.