ఎంజీయూ(నల్లగొండ రూరల్),న్యూస్‌లైన్: ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పర్యావరణవేత్త ప్రొఫెసర్ పి.పురుషోత్తంరెడ్డి పిలుపునిచ్చారు. బుధవా రం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ‘సోషల్ ఎంటర్ పెన్యూర్‌షిప్ ఇన్ ఇండియా ప్రాబ్లమ్ అండ్ ప్రాస్పెక్టివ్స్’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో పరిశుద్ధ జలాలను అందించేందుకు కృషిచేయాలని కోరారు.
ప్రజ ల్లో గ్లోబల్ వార్మింగ్‌పై అవగాహన పెంపొందించాలన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక శాస్త్రవేత్త కావాలన్నారు. విద్యుత్ రంగంలో స్వయంసమృద్ధి సాధించాలని అందుకోసం సోలార్, పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవాలన్నారు. జిల్లాలో యురేనియం, సున్నపురాయి లాంటి ఎంతో విలువైన ఖనిజ సంపద ఉందన్నారు. యురేనియం నిక్షేపాలను వెలికి తీయడకుండా అడ్డుకోవడం జిల్లా ప్రజల గొప్ప విజ యమన్నారు.
జిల్లాలో నిక్షేపాలను వెలికి తీస్తే అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. సాంకేతిక ఉత్పత్తి పెరిగిన కొద్దీ అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని , వాటి నుం చి రక్షణ కూడా పొందాల్సిన అవసరం ఉందన్నారు. భారత దేశం మొదటి నుంచీ స్వయం సమృద్ధిసాధించిందన్నారు. అందుకే మనదేశంవైపు పాశ్చాత్య దేశాలు చూస్తున్నాయన్నారు. జిల్లాలో భూదానోద్యమం, సాయుధ పోరా టం, చేనేత రంగానికి మంచి గుర్తింపు ఉందని తెలిపారు. జలసాధన సమితి ఉద్యమం .. భారత ఎన్నికల కమిషన్ దృష్టిని, పార్లమెంట్ దృష్టిని ఆకర్శించి ఫ్లోరిన్ పీడిత గ్రామాలకు కృష్ణాతాగునీరు అందించేందుకు దోహదపడిందన్నారు.
రైతులు సొసైటీలుగా ఏర్పడాలి
గిట్టబాటు ధర రాక రైతులు నష్టపోకుండా ఉం డాలంటే సొసైటీలుగా ఏర్పడాలని సూచిం చారు. తద్వారా రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకోవచ్చన్నారు. పంట దిగుబడులను పెంచుకోవడానికి అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వనరులను కాపాడుకోవాలి :
ప్రశాంత్ ఆత్మ, ఓయూ ప్రొఫెసర్
వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉస్మానియా యూనివర్సిటీ సీని యర్ ప్రొఫెసర్ ప్రశాంత్ ఆత్మ అన్నారు. భూగర్భ జలాలను పరిరక్షించుకోవాలన్నారు. ప్రతినీటి బొట్టును భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయరంగంలో అభివృద్ధిసాధించేందుకు కొత్తరకాల వంగడాలను ఉత్పత్తి చేయాలని వివిధ వంగాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో రిజిస్ట్రార్ పోచన్న, డీన్, బి.కృష్ణారెడ్డి, నరేందర్‌రెడ్డి, రవి, ఎంవి.రెడ్డి, శ్రీదేవి, శాఖల్ అలీమీర్జా, రామ్మోహన్‌రావు, హర్షవర్దన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పరస్పర సహకారం ఉండాలి : ఫౌండేషన్ డెరైక్టర్
సాంకేతిక రంగాల్లో దేశాల మధ్య పరస్పర సహకారం ఉండాలని టర్కీ దేశస్తుడు ఇండియాలాగ్ ఫౌండేషన్ డెరైక్టర్ ఉస్మాన్ కయావొగ్లు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశాలు ఇచ్చి పుచ్చుకోవడం వల్ల సమాన అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అభివృద్ధిలో అసమానతలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. తమ ఫౌండేషన్ ద్వారా భారతదేశంలో 9కేంద్రాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా నిరక్షరాస్యత, దారిద్య్ర నిర్మూలన, సామాజిక రుగ్మతలపై ఉమ్మడి పోరు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సామాజిక సేవలో అందరూ భాగస్వాములు కావాలి
Published Thu, Jan 30 2014 4:02 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM
Advertisement
Advertisement