సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌ను నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా ప్రభుత్వం నియమించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం సంతకం చేశారు. వరంగల్ జిల్లా ఖాజీపేటకు చెందిన ఖాజా అల్తాఫ్ ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.