కట్‌ అండ్‌ పేస్ట్‌ పీహెచ్‌డీలు వద్దు: గవర్నర్‌ | mahatma-gandhi-university-first-convocation-held-today | Sakshi
Sakshi News home page

కట్‌ అండ్‌ పేస్ట్‌ పీహెచ్‌డీలు వద్దు: గవర్నర్‌

Published Fri, May 5 2017 2:04 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

కట్‌ అండ్‌ పేస్ట్‌ పీహెచ్‌డీలు వద్దు: గవర్నర్‌

కట్‌ అండ్‌ పేస్ట్‌ పీహెచ్‌డీలు వద్దు: గవర్నర్‌

నల్లగొండ : ధనార్జన కోసమే విద్య అనే భావం నుండి యువత బయటపడాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఉద్బోధించారు. నల్లగొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాలంలో విలువలతో కూడిన విద్య ఎంతో ముఖ్యమని, కట్ అండ్ పేస్ట్ పీహెచ్‌డీలు నిరుపయోగమన్నారు. ప్రజల వాస్తవ అవసరాలపై పరిశోధనలు జరగాలన్నారు.
 
నైతిక విలువలను బోధించడంలో అధ్యాపకులదే కీలకపాత్ర అని, నాణ్యమైన, సృజనాత్మక విద్యకు విశ్వవిద్యాలయాలు పెద్ద పీట వేయాలని సూచించారు. చదువుతోనే సమాజంలోని రుగ్మతలకు చరమ గీతం పాడాలని, ఆచార్య దేవోభవ అనే భావాన్ని ఎవ్వరూ మరవొద్దని అన్నారు. జీవితంలో ఆత్మపరిశీలన చాలా ముఖ్యమని, మానవతా విలువలకు నిలయాలు విశ్వవిద్యాలయాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement