అపోలో మెడికల్ కాలేజ్ కాన్వోకేషన్ ఉత్సవం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. అపోలో మెడికల్ కాలేజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేశారు. 2018 బ్యాచ్ ఎంబీబీఎస్ చదివిన 100 మంది విద్యార్థులకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీవోవో అపర్ణా రెడ్డి, డీన్ మనోహర్, మెడికల్ కాలేజ్ విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.
జనరల్ మెడిసిన్‌లో అవినాష్‌కు గోల్డ్ మెడల్
2018 బ్యాచ్ జనరల్ మెడిసిన్‌కు గాను డాక్టర్ దండు అవినాష్ రెడ్డి గోల్డ్ మెడల్ అందుకున్నారు. "కష్టపడి చదవడం వల్ల గోల్డ్ మెడల్ సాధించగలిగానని, తల్లితండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని, అత్యుత్తమ విద్య బోధించినందుకు అపోలోకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని" అవినాష్ తెలిపారు. ఇక డాక్టర్ ప్రతాప్‌రెడ్డికి సంబంధించి ఛైర్మన్ మెడల్‌ను సిద్ధాంత్ బర్మేచ అందుకున్నారు.
700 దాటిన అపోలో మెడిసిన్ గ్రాడ్యుయేట్లు
అపోలో కాలేజ్ ప్రారంభించి ఇప్పటికీ పుష్కరకాలం దాటింది. 2012లో ప్రారంభమైన అపోలో మెడికల్ కాలేజ్ నుంచి ఇప్పటివరకు 700 మంది విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగారు. ఇదే విషయాన్ని కాన్వోకేషన్‌లో ప్రస్తావించారు డాక్టర్ నాగేశ్వరరెడ్డి. "భారతదేశంలోనే నాణ్యమైన వైద్య విద్యను అందిస్తోన్న అపోలోలో చదువుకునే అదృష్టం మీకు దక్కడం గొప్ప విషయం. ఈ పునాదిని మరింత బలంగా మార్చుకుని వైద్యులుగా రాణించాలని కోరుకుంటున్నాను. అలాగే నేర్చుకోవాలన్న మీ ధృడ సంకల్పం జీవితాంతం కొనసాగాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment