convocation
-
ఘనంగా అపోలో మెడికల్ కాలేజ్ కాన్వోకేషన్
అపోలో మెడికల్ కాలేజ్ కాన్వోకేషన్ ఉత్సవం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. అపోలో మెడికల్ కాలేజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేశారు. 2018 బ్యాచ్ ఎంబీబీఎస్ చదివిన 100 మంది విద్యార్థులకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీవోవో అపర్ణా రెడ్డి, డీన్ మనోహర్, మెడికల్ కాలేజ్ విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.జనరల్ మెడిసిన్‌లో అవినాష్‌కు గోల్డ్ మెడల్2018 బ్యాచ్ జనరల్ మెడిసిన్‌కు గాను డాక్టర్ దండు అవినాష్ రెడ్డి గోల్డ్ మెడల్ అందుకున్నారు. "కష్టపడి చదవడం వల్ల గోల్డ్ మెడల్ సాధించగలిగానని, తల్లితండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని, అత్యుత్తమ విద్య బోధించినందుకు అపోలోకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని" అవినాష్ తెలిపారు. ఇక డాక్టర్ ప్రతాప్‌రెడ్డికి సంబంధించి ఛైర్మన్ మెడల్‌ను సిద్ధాంత్ బర్మేచ అందుకున్నారు.700 దాటిన అపోలో మెడిసిన్ గ్రాడ్యుయేట్లుఅపోలో కాలేజ్ ప్రారంభించి ఇప్పటికీ పుష్కరకాలం దాటింది. 2012లో ప్రారంభమైన అపోలో మెడికల్ కాలేజ్ నుంచి ఇప్పటివరకు 700 మంది విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగారు. ఇదే విషయాన్ని కాన్వోకేషన్లో ప్రస్తావించారు డాక్టర్ నాగేశ్వరరెడ్డి. "భారతదేశంలోనే నాణ్యమైన వైద్య విద్యను అందిస్తోన్న అపోలోలో చదువుకునే అదృష్టం మీకు దక్కడం గొప్ప విషయం. ఈ పునాదిని మరింత బలంగా మార్చుకుని వైద్యులుగా రాణించాలని కోరుకుంటున్నాను. అలాగే నేర్చుకోవాలన్న మీ ధృడ సంకల్పం జీవితాంతం కొనసాగాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. -
నల్సార్ స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి ముర్ము
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోజు పర్యటన నిమిత్తం నగరానికి వచ్చారు. శనివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి.. మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్‌లో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయాలనికి వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయల్దేరారు. అక్కడ భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. -
బహదూర్‌పల్లిలోని మహీంద్రా యూనివర్శిటీ మూడవ వార్షిక స్నాతకోత్సవం (ఫొటోలు)
-
భారతీదాసన్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధాని
-
జనాభా పెరుగుదలపై ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు..
ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి (Narayana Murthy) ఇటీవల కోల్‌కతాలోని టెక్నో ఇండియా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గురించి, జనాభా నియంత్రణ గురించి వ్యాఖ్యానించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నారాయణ మూర్తి స్నాతకోత్సవంలో మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తన విశ్వాసాలను స్వేచ్ఛగా ఆచరించుకోవచ్చు. అలాంటి సమాజంలో ప్రజాస్వామ్యం ఉత్తమంగా ఉంటుందని వ్యక్తం చేశారు. దేశ జనాభా నియంత్రణకు సరైన ప్రాధాన్యం లేదని వెల్లడించారు. దేశంలోనో కొన్ని ప్రాంతాల్లో నియంత్రణ ఉన్నప్పటికీ.. చాలా ప్రాంతాల్లో దీన్ని పూర్తిగా విస్మరించినట్లు చెప్పుకొచ్చారు. నిజనమైన ప్రజాస్వామ్యానికి నాలుగు స్వేచ్ఛలు ఉంటాయని, అవి.. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల మీద స్వేచ్ఛ, భయం నుంచి స్వేచ్ఛ, కోరికల పట్ల స్వేచ్ఛ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్వెల్ట్ మాటలు గుర్తు చేశారు. ఇదీ చదవండి: అదే జరిగితే 70 వేల ఉద్యోగాలు పోతాయ్.. ఎక్కడో తెలుసా? భారతదేశం గత మూడు దశాబ్దాలుగా ప్రశంసనీయమైన ఆర్థిక పురోగతి ఉన్నప్పటికీ, పేదరికం, త్రాగునీరు, విద్య, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిలో ఇంకా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నట్లు తెలిపారు. జనాభా పెరుగుదలను తగ్గించడం ఇప్పుడు చేయవల్సిన ముఖ్యమైన పని. జనాభా సమస్య రానున్న 20 నుంచి 25 ఏళ్లలో మన దేశంపై విధ్వంసం సృష్టించే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు. -
ప్రిన్సిపాల్ ఎదుట డాన్స్.. ఊహించని షాక్.. డిగ్రీ గోవిందా!
అమెరికా: అమెరికాలో ఒక హై స్కూల్లో స్టేజి మీద డాన్స్ చేసినందుకు ఓ విద్యార్థినికి డిప్లొమా పట్టా ఇవ్వడానికి నిరాకరించారు ఆ స్కూలు ప్రిన్సిపాల్. దీంతో ఇన్నేళ్ల శ్రమ మొత్తం బూడిదలో పోసినట్టయ్యిందని ఆ విద్యార్థిని తోపాటు ఆమె తల్లిదండ్రులు వాపోతున్నారు. జూన్ 9న ఫిలడెల్ఫియా బాలికల హై స్కూల్ స్నాతకోత్సవంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తమ పిల్లలు డిగ్రీలు స్వీకరిస్తున్న సమయంలో ఎలాంటి గోల, అరుపులు చేయవద్దని.. కనీసం చప్పట్లు కూడా కొట్టవద్దని స్ట్రిక్ట్ గా చెప్పింది స్కూల్ యాజమాన్యం. దీంతో నిశ్శబ్ద వాతావరణంలో పట్టా ప్రదానోత్సవం జరుగుతుండగా హఫ్సా అబ్దుల్ రహ్మాన్ అనే అమ్మాయి తన పేరు పిలవగానే స్టేజి మీదకు వచ్చింది. కానీ డిగ్రీ పట్టా సాధిస్తున్నానన్న సంతోషంలో ఉండబట్టలేక చిన్నగా చిందేసింది. అదికాస్తా ప్రిన్సిపాల్ దృష్టిలో పడేసరికి ఆమెకు పట్టా అందివ్వలేదు సరికదా మర్యాదగా స్టేజి విడిచి వెళ్ళమని ఆదేశించారు. దీంతో స్టేజి విడిచి వెళ్లిన హఫ్సా అబ్దుల్ రహ్మాన్ ప్రిన్సిపాల్ పట్టా అందివ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. నేనే తప్పూ చేయలేదు, ఏ నిబంధనను అతిక్రమించలేదని తెలిపింది. ఇదే స్నాతకోత్సవంలో హఫ్సా తనతో పాటు 2014లో కాల్పుల్లో చనిపోయిన తన సోదరి ఐషా తరపున కూడా డిగ్రీ పట్టా స్వీకరించాల్సి ఉంది. కానీ అంతలోనే ఆమెను స్టేజి విడిచి వెళ్ళమనడంతో బోరున ఏడ్చేసింది. హఫ్సా తల్లి మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు కోవిడ్ సమయంలో మానసికంగానూ, శారీరకంగానూ చాలా ఇబ్బందులు ఎదుర్కొని చదువుకున్నారని. ప్రిన్సిపాల్ ఇలా చేయడం అమానుషమని అన్నారు. Controversy at Philadelphia Girls' High School as Muslim graduate Hafsah Abdur-Rahman's diploma denied on stage for a celebratory dance. Despite the district's apology, her family calls for rule changes. pic.twitter.com/qbiIG0Rlr7 — Middle East Eye (@MiddleEastEye) June 18, 2023 ఇది కూడా చదవండి: మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ ఉగ్రవాది హతం.. -
20న ఏఎన్‌యూ స్నాతకోత్సవాలు
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 37, 38వ స్నాతకోత్సవాలు కలిపి ఈనెల 20న నిర్వహించనున్నామని వీసీ ఆచార్య పి.రాజశేఖర్ తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నామని పేర్కొన్నారు. చాన్సలర్ హోదాలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొంటారని తెలిపారు. స్నాతకోత్సవంలో పలువురికి డిగ్రీలు, బంగారు పతకాలు అందజేయనున్నామని వివరించారు. స్నాతకోత్సవ ఏర్పాట్లపై మంగళవారం వీసీ పలు కమిటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కమిటీ సభ్యులకు సూచించారు. (క్లిక్: ‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం) -
CM YS Jagan: సీఎం జగన్ పారిస్‌కు పయనం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారిస్‌కు బయలుదేరారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో పారిస్ బయలుదేరారు. బుధవారం ఉదయం 5.10 గంటలకు పారిస్ చేరుకుంటారు. అక్కడ తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్ వేడుకలో పాల్గొననున్నారు. తిరిగి జూలై 2న సాయంత్రం 4 గంటలకు పారిస్‌లో బయలుదేరి, 3వ తేదీ ఉదయం 6.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో 3 లక్షల మందికి కొత్త పింఛన్లు) -
ISB Hyderabad: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. అరుదైన ఘనతలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది నగరంలోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఐఎస్బీ). దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది ఈ కళాశాల. గురువారం ఐఎస్బీ స్నాతకోత్సవం, వార్షికోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయనుండటం దీని ప్రాధాన్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఐఎస్బీ విశిష్టతలపై ప్రత్యేక కథనం ఇదీ.. స్థాపన ఇలా.. ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహకారంతో పలువురు వ్యాపారవేత్తలు నగరంలోని గచ్చిబౌలిలో 260 ఎకరాల విస్తీర్ణంలో 1999 డిసెంబర్ 20న ఐఎస్బీని ఏర్పాటు చేశారు. ఇండియన్ బిజినెస్ స్కూల్‌కు అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ శంకుస్థాపన చేశారు. ఇది లండన్ బిజినెస్ స్కూల్, వార్టన్ బిజినెస్ స్కూల్, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్, లండన్ బిజినెస్ స్కూళ్లతో భాగస్వామ్య సంబంధాలు కలిగి ఉంది. ► ఐఎస్బీకి దేశంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, పంజాబ్‌లోని మొహలీలో క్యాంపస్‌లు ఏర్పాటు చేశారు. ఇది ఏఎంబీఏ, ఈక్యూయూఐఎస్, ఏఏసీఎస్బీల ద్వారా అక్రిడిటేషన్ల ‘ట్రిపుల్ క్రౌన్’ పొందిన ప్రపంచంలోని 100వ కళాశాలల్లో ఐఎస్బీ ఒకటి. గచ్చిబౌలిలోని ఐఎస్బీ క్యాంపస్‌కు ఈ నెల 26న ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. 930 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నారు. అప్పట్లో ప్రముఖుల సందర్శన.. ఐఎస్బీ గచ్చిబౌలి క్యాంపస్‌ను డిసెంబర్ 2, 2001న అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రారంభించారు. 2006 డిసెంబర్ 5న డాక్టర్ మన్మోహన్సింగ్ క్యాంపస్‌కు విచ్చేశారు. 2006 మార్చి 1న అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ సందర్శించారు. 2002 జనవరి 2న సింగపూర్ అధ్యక్షుడు ఎస్ఆర్ నాథన్ పరిశీలించారు. 2002 జనవరి 2న అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ఐఎస్బీ క్యాంపస్‌ను సందర్శించారు. (క్లిక్: బేగంపేటలో మోదీ స్వాగత సభ?) ప్రపంచంలో 38వ స్థానం.. ఐఎస్బీ తాజాగా 2022లో ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్స్ ప్రోగ్రామ్స్ ర్యాంకింగ్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్‌లో ప్రపంచంలోనే 38వ స్థానం పొందింది. ఇండియాలోనే నెంబర్ వన్ బిజినెస్ స్కూల్‌గా కూడా ర్యాంకింగ్‌ను సాధించింది. ఎఫ్టీ ర్యాంకింగ్, అధిక– నాణ్యత పరిశోధన, విద్య కోసం భారతదేశాన్ని ప్రపంచ మ్యాప్‌లో ఉంచింది. ఇదిలావుండగా ఐఎస్బీ ఫ్యూచర్ యూస్ పారామీటర్‌లో అంతర్జాతీయంగా 7వ స్థానంలో నిలిచింది. ‘డీ ల్యాబ్స్’తో నూతన ఆవిష్కరణలు.. ఐఎస్బీలోని గచ్చిబౌలి క్యాంపస్‌లో డీ ల్యాబ్స్ పేరిట నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ కేంద్రాన్ని 2015లో ప్రారంభించారు. దీంట్లో ఇప్పటి వరకు 125కు పైగా స్టార్టప్‌లను వివిధ రంగాలలో ఏర్పాటు చేశారు. దీనికి అంతర్జాతీయ ఇంక్యుబేటర్ నుంచి మద్దతు లభిస్తోంది. ఇటీవలే కేంద్రం రూ.5 కోట్ల నిధులను స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్కింద మంజూరు చేసింది.70 స్టార్టప్‌లకు దాదాపు 350 కోట్ల నిధుల సేకరణ కోసం స్టార్టప్‌లు ముందంజ వేశాయి. ప్లేస్‌మెంట్స్‌లోనూ టాపే.. ► ప్లేస్‌మెంట్స్‌లోనూ ఐఎస్బీ దేశంలోనే టాప్‌గా నిలుస్తోంది. ప్రతియేటా 100 శాతం విద్యార్థులు ఉద్యోగాలు పొందడం విశేషం. 2019–20లో ఏడాదికి సరాసరి వేతనం రూ.42 లక్షలు, అత్యల్పంగా రూ.24.10 లక్షల వేతనం, 20–21లో సరాసరి వేతనం రూ.72 లక్షలు, అత్యల్పంగా రూ.27 లక్షల వేతనం లభించింది. 2021–22లో సరాసరి వేతనం రూ.34.07 లక్షలుగా పొందారు. ► 2019–20లో 1,504 ఆఫర్లు, 20–21లో 1,195 ఆఫర్లు, 2021–22లో 2,066 ఆఫర్లను విద్యార్థులు పొందారు. (క్లిక్: మోదీ హైదరాబాద్ టూర్; ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్) ► అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, హనీవెల్, యాక్సిస్ బ్యాంక్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, జెన్‌ప్యాక్ట్, విప్రో, సీకే బిర్లా గ్రూపు, కేపీఎంజీ, హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, టెక్ మహీంద్ర, డీబీఎస్ బ్యాంక్, డిలాయిట్ యూఎస్ఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి ప్రధాన కంపెనీలు ప్లేస్మెంట్లో పాల్గొన్నాయి. ఐఎస్బీ–20 ఏళ్ల వేడుకల్లో ప్రధాని పాల్గొనడం విశేషం.. ఐఎస్బీ 20 ఏళ్ల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. ఆయన హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌ల విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. హైదరాబాద్ క్యాంపస్‌లో మొక్కను నాటి స్మారక ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఐఎస్బీ మై స్టాంప్, ప్రత్యేక కవర్‌ను విడుదల చేస్తారు. అకడమిక్ స్కాలర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పతకాలను కూ డా ప్రధాని చేతుల మీదుగా పంపిణీ చేస్తాం. – ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల, ఐఎస్బీ డీన్ -
మోదీ హైదరాబాద్ టూర్; ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (గురువారం) ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ స్నాతకోత్సవంలో పాల్గొననున్న నేపథ్యంలో గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి విప్రో జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి గచ్చిబౌలి మధ్యలో ఉన్న ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని లేదా ఉద్యోగుల హాజరు సమయాలలో మార్పులు చేసుకోవాలని ఆయా కంపెనీలకు పోలీసులు అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. గురువారం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా: ► గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లేవారు గచ్చిబౌలి జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని బొటానికల్ గార్డెన్, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, మజీద్ బండ, హెచ్‌సీయూ డిపో ద్వారా లింగంపల్లికి వెళ్లాలి. ► లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వచ్చేవారు హెచ్‌సీయూ డిపో దగ్గర లెఫ్ట్ తీసుకుని మజీద్ బండ, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, బొటానికల్ గార్డెన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కి చేరుకోవాలి. ► విప్రో నుంచి లింగంపల్లికి వెళ్లేవారు విప్రో జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకుని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపనపల్లి ఎక్స్ రోడ్, హెచ్ సీయూ బ్యాక్ గేట్, నల్లగండ్ల నుంచి లింగంపల్లికి వెళ్లాలి. ► విప్రో నుంచి గచ్చిబౌలికి వెళ్లేవారు విప్రో జంక్షన్ దగ్గర రైట్ తీసుకుని ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్ గూడ రోటరీ, ఓఆర్ఆర్, ఎల్ఆండ్ టీ టవర్స్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌కి చేరుకోవాలి. ► కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి జంక్షన్‌కి వెళ్లేవారు కేబుల్ బ్రిడ్జ్ పైకి ఎక్కే ర్యాంప్ దగ్గర రైట్ తీసుకుని రత్నదీప్, మాదాపూర్ పీఎస్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌కి వెళ్లాలి. (క్లిక్: రెండో దశ మెట్రో రూట్ చేంజ్!) డ్రోన్లను ఎగురవేయొద్దు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. భద్రత చర్యలలో ఐఎస్బీ, గచ్చిబౌలి స్టేడియం ప్రాంతాలలో డ్రోన్లను ఎగరేయడానికి అనుమతి లేదు. ఆయా ప్రాంతాల చుట్టూ 5 కి.మీ. పరిధిలో పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు నిషేధం విధించారు. బుధవారం మధ్యాహ్నం 12 నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. (క్లిక్: హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్.. ‘త్రి’ పాత్రాభినయం!) -
జేఎన్టీయూ అనంతపురం స్నాతకోత్సవం.. బంగారు కొండలు వీరే...
ఎంతో మంది జీవితాలకు మంచి పునాది వేసింది జేఎన్టీయూ... సమాజానికి శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్ నిపుణులను అందించింది నాణ్యమైన పరిశోధనలకూ కేరాఫ్‌గా మారింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల్లో అనంత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది జేఎన్టీయూ అనంతపురం. శనివారం 12వ స్నాతకోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అనంతపురం విద్య: జేఎన్టీయూ అనంతపురం 1946లో ఒక కళాశాలగా ఏర్పడింది. విశ్వవిద్యాలయంగా ఏర్పడిన ఆనతి కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకుంది. పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. బీటెక్, బీఫార్మసీ, ఫార్మాడీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందిస్తోంది. విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని నూతన ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తెచ్చింది. వర్సిటీ పరిధిలో అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఉన్న అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏటా 1.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, కలికిరి ఇంజినీరింగ్, పులివెందుల ఇంజినీరింగ్ కళాశాలలు స్వతంత్య్ర ప్రతిపత్తి సాధించాయి. ప్రైవేట్ కళాశాలల్లోనూ పరిశోధన చేయడానికి వీలుగా 16 రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. జాతీయ సేవా పథకాన్ని సమర్థవంతంగా చేస్తున్నందుకు ఇందిరాగాంధీ జాతీయ సేవా పథకం అవార్డు జేఎన్టీయూ, అనంతపురం సొంతం చేసుకుంది. పూర్వ విద్యార్థుల చేయూత క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఇటీవలే వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. ఇక్కడ చదివి ఉన్నత స్థానాల్లో అధిరోహించిన పూర్వ విద్యార్థులు చేయూతనందించారు. రూ.8 కోట్లు వెచ్చించి 100 గదులతో విద్యార్థుల హాస్టల్ నిర్మాణానికి చేయూతనిచ్చారు. పూర్వ విద్యార్థులు ఇచ్చిన సహకారంతో ప్రత్యేకంగా హాస్టల్ నిర్మిస్తుండడం విశేషం. రూ.50 లక్షలు విలువైన ల్యాబ్ సదుపాయాన్ని కూడా పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేశారు. సతీష్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్ భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ–డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) చైర్మన్ డాక్టర్ జి.సతీష్‌రెడ్డికి జేఎన్టీయూ అనంతపురం గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తోంది. గతేడాది ఎస్కేయూ కూడా ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సతీష్‌రెడ్డి జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగంలో 1984లో బీటెక్ పూర్తి చేశారు. ఎంటెక్, పీహెచ్‌డీని జేఎన్టీయూ హైదరాబాద్‌లో పూర్తిచేసిన తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబోరేటరీలో శాస్త్రవేత్తగా చేరారు. వివిధ హోదాల్లో పనిచేసి కీలకమైన డీఆర్డీఓ చైర్మన్ హోదాలో పనిచేస్తున్నారు. 35,177 మందికి డిగ్రీలు.. 81 మందికి పీహెచ్‌డీలు జేఎన్టీయూ అనంతపురం 12వ స్నాతకోత్సవానికి అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులతో పాటు విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. స్నాతకోత్సవానికి చాన్సలర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మొత్తం 35,177 మంది విద్యార్థులకు డిగ్రీలు, 81 మందికి పీహెచ్‌డీలు ప్రదానం చేయనున్నారు. బంగారు కొండలు వీరే... జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో కే. మైథిలి, ఈఈఈలో డి. సుప్రజ, మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎం. సతీష్‌కుమార్‌రెడ్డి, ఈసీఈలో టి. అనూష, సీఎస్ఈలో బి. సరయూ, కెమికల్ ఇంజినీరింగ్‌లో బి. వీరవంశీకుమార్ బంగారు పతకాలను సాధించారు. సువర్ణ విజేత.. సుప్రజ జేఎన్టీయూ అనంతపురం ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పూర్తిచేసిన సుప్రజ ఆరు బంగారు పతకాలు దక్కించుకున్నారు. 9.14 జీజీపీఏ సాధించి బ్రాంచ్ టాపర్‌గా నిలిచారు. అలాగే ప్రొఫెసర్ తిరువెంగళం గోల్డ్‌మెడల్, చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, ప్రొఫెసర్ టీఎస్ రాఘవన్ గోల్డ్‌మెడల్, చండుపల్లి వెంకటరాయుడు– సరోజమ్మ గోల్డ్‌మెడల్, కళాశాల టాపర్ మహిళా విభాగం కోటాలోనూ గోల్డ్‌మెడల్ దక్కించుకున్నారు. ఎలక్ట్రికల్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేస్తానని సుప్రజ పేర్కొన్నారు. చదువుల తల్లి .. మైథిలి జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన మైథిలి మూడు బంగారు పతకాలు దక్కించుకున్నారు. సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ టాపర్‌గా నిలవడంతో పాటు చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్ గోల్డ్‌మెడల్, కే.వెంకటేశ్వరరావు గోల్డ్‌మెడల్‌కు ఎంపికయ్యారు. సివిల్ ఇంజినీరింగ్‌లో చదవాలనే ఆకాంక్షతోనే కష్టపడి చదివానని, బ్రాంచ్ టాపర్ రావడం ఆనందంగా ఉందని మైథిలీ పేర్కొన్నారు. మెకానికల్ టాపర్ .. సతీష్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎం.సతీష్‌రెడ్డి మూడు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. మెకానికల్ బ్రాంచ్ టాపర్‌తో పాటు కళాశాల టాపర్, టీవీ లక్ష్మణరావు గోల్డ్‌మెడల్ దక్కింది. నానోటెక్నాలజీ రంగంపై దృష్టి సారించినట్లు సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. మెకానికల్ రంగంలోని అధునాతన పరిశోధనలే తన లక్ష్యమన్నారు. అగ్రగామిగా తీర్చిదిద్దుతాం జేఎన్టీయూ అనంతపురాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం. నాణ్యమైన పరిశోధనలతో పాటు అత్యుత్తమ బోధన ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించే దిశగా విద్యా ప్రణాళికను సమూలంగా మార్పు చేశాం. కోర్సు పూర్తియ్యేలోపు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి. విద్యార్థుల సర్టిఫికెట్ల భద్రతకు డీజీ లాకర్ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు దక్కేలా కృషి చేశాం. – జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవం.. జరిగేది అప్పుడే!
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ 22, 23వ స్నాతకోత్సవాలు జనవరి 6న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తెలిపారు. మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, పీహెచ్‌డీలు, మెడల్స్, బహుమతులు అందిస్తున్నట్టు చెప్పారు. మెడల్స్, బహుమతులకు ఎంపికైన వారి వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. ఈ నెల 8న జరగాల్సిన ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. టెన్త్ విద్యార్థులకు ‘సర్టిఫికెట్’ ఇవ్వాలి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి సాక్షి, అమరావతి: పదో తరగతి పూర్తయిన తర్వాత వివిధ కారణాల వల్ల చాలా మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని.. వారి కోసం మార్కుల మెమోతో పాటు కోర్స్ కంప్లీట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు రాష్ట్ర పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఇంటర్లో లాంగ్వేజెస్‌తో పాటు ఒకటి లేదా రెండు సబ్జెక్టులు గ్రూప్‌లో ఉంటున్నందున.. పదో తరగతిలో ఆయా సబ్జెక్టులు పాస్ అయిన వారికి ఇంటర్లో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఇవ్వాలని కోరారు. దీని వల్ల డ్రాపౌట్లు తగ్గే అవకాశముందన్నారు. -
ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం.. దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ 81వ స్నాతకోత్సవంలో భాగంగా ఈ నెల 27వ తేదీన జరిగే కార్యక్రమంలో డిగ్రీ పట్టాలను అందుకోవాలనుకునే పీహెచ్డీ అభ్యర్థులు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ శుక్రవారం తెలిపారు. బంగారు పతకాలు అందుకునే అభ్యర్థుల జాబితాను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు. 18 వరకు డిగ్రీ సప్లిమెంటరీ, ఇన్స్టంట్ పరీక్షల ఫీజు చెల్లింపు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కోర్సుల 1, 3, 5 బ్యాక్‌లాగ్‌లతో పాటు కోవిడ్ కారణంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిగ్రీ ఇన్స్టంట్ 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 18 వరకు చెల్లించవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ శుక్రవారం తెలిపారు. రూ.200 అపరాధ రుసుముతో 23 వరకు, రూ.500 రుసుముతో 26, 27 వరకు, రూ.1000 రుసుముతో 28, 29 వరకు, రూ.2000 రుసుముతో నవంబరు 1, 2 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో నవంబరు 3 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునన్నారు. వివరాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ వెబ్సైట్ చూడాలన్నారు. 26 నుంచి ఎంబీఏ పరీక్షలు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6 వరకు ఎంబీఏ రెగ్యులర్ 2వ సెమిస్టర్, బ్యాక్లాగ్ 1వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ తెలిపారు. పరీక్షల టైంటేబుల్‌ను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఓయూ దూరవిద్యలో సెమిస్టర్ విధానం ఉస్మానియా విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్రంలో వివిధ కోర్సులలో సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం ఎంబీఏ కోర్సుకు మాత్రమే ఉన్న సెమిస్టర్ పరీక్ష విధానాన్ని ఇతర పీజీ కోర్సులకు కూడా అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2021–22) ఎంసీఏ కోర్సును మూడు నుంచి రెండు సంవత్సరాలకు కుదించి సెమిస్టర్ పరీక్షను అమలుపర్చనున్నారు. రానున్న విద్యా సంవత్సరం (2022–23) నుంచి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీడీసీఏ కోర్సులకు సెమిస్టర్ పరీక్ష విధానాన్ని అమలు చేస్తామని అధికారులు వివరించారు. అందుకు అనుగుణంగా పీజీ పుస్తకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పీజీ తర్వాత డిగ్రీ కోర్సులకు కూడ సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టేయోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విద్యా సంవత్సరానికి (2021–22) వివిధ కోర్సులలో జోరుగా అడ్మిషన్లు సాగుతున్నాయన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువు పొడిగింపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం,బీఎస్సీ), పీజీ (బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ) పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి ఆలస్య రుసుము రూ. 200 తో చివరి తేదీ అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను https://www.braouonline.in/లో పొందుపర్చినట్లు వెల్లడించారు. వివరాలకు 7382929570/580 లేదా విశ్వవిద్యాలయ 040–23680290/291/294/295 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
వైద్య సిబ్బంది కొరతను తక్షణమే తీర్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వైద్యాన్ని చౌకగా అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సరైన సమయంలో వైద్యం అందించడాన్ని సైతం ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానికసంస్థలు, ప్రైవేటు, కార్పొరేట్ రంగం సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం వైద్య కళాశాల స్వర్ణ జయంతి వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. మహిళలకు సరైన ప్రోత్సాహం అందించాలి దేశంలో వైద్యం మరింత ఖరీదవుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ భారాన్ని మోయలేకపోతున్న విషయాన్ని ప్రతీ ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. స్నాతకోత్సవంలో పతకాలు అందుకున్న వారిలో ఎక్కువమంది యువతులు ఉండటాన్ని ప్రత్యేకంగా అభినందించిన వెంకయ్యనాయుడు... మహిళలకు సరైన ప్రోత్సాహాన్నందిస్తే ఏదైనా సాధించగలరనే దానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. కరోనాపై పోరాటంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా వైద్యులు, వైద్య సిబ్బంది పోషించిన పాత్రను సమాజం ఎన్నటికీ మరిచిపోదన్నారు. అయితే దేశంలో వైద్యులు, రోగుల నిష్పత్తి మధ్య ఉన్న భారీ అంతరాన్ని తగ్గించేందుకు కృషి జరగాలని సూచించారు. వలసవాద విధానాలు విడనాడాలి ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీ, తత్సంబంధిత ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రానున్న రోజుల్లో ప్రతి రెవెన్యూ కేంద్రానికి ఒక సకల సౌకర్యాలున్న ఆసుపత్రి ఏర్పాటు జరగాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. వైద్యరంగం అత్యంత పవిత్రమైన వృత్తుల్లో ఒకటన్న ఉపరాష్ట్రపతి, వైద్య విద్యార్థులు విధుల్లో చేరిన తర్వాత తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారంలో, అక్కడి ప్రజలకు వైద్యం అందించడంలో చొరవ తీసుకోవాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ కొన్ని వలసవాద విధానాలను కొనసాగించడంపై వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మన విధానాలను, మన అలవాట్లను భారతీయీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. చట్టసభలు, విద్య, పరిపాలన, న్యాయ ఇలా అన్నిరంగాల్లోనూ భారతీయ విధానాలను అలవర్చుకోవాలన్నారు. న్యాయవ్యవస్థను జాతీయీకరించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు అభినందనీయమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. చదవండి: మమతా బెనర్జీ ఇటలీ పర్యటనకు అనుమతి నిరాకరణ -
ఘనంగా ఐసీబీఎం స్కూల్ స్నాతకోత్సాహం
-
తీరని అవమానం.. గోల్డ్‌మెడల్ నాకొద్దు!
-
తీరని అవమానం.. గోల్డ్‌మెడల్ నాకొద్దు!
పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో బంగారు పతక విజేత రుబీహాకు చేదు అనుభవం ఎందురైంది. 2018 మాస్ కమ్యూనికేషన్ (ఎంఏ) విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన రుబీహా కాన్వొకేషన్ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ వేదిక నుంచి వెళ్లేంత వరకు తనను తిరిగి హాల్లోకి అనుమతించలేదని రుబీహా ఆరోపించారు. రాష్ట్రపతి విశ్వవిద్యాలయం నుండి బయలుదేరే వరకు దాదాపు 20 నిమిషాలు బయటనే వేచి ఉండాల్సి వచ్చిందని వాపోయారు. స్నాతకోత్సవం ముగిసిన తరువాత ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి వచ్చినప్పుడు, తను హాలు నుంచి బయటికి (బలవంతం చేయనప్పటికీ) రావాలని కోరారని తెలిపారు. ఇది తనకు తీరని అవమానమని కేరళకు చెందిన రుబీహా కంట తడి పెట్టారు. సీఏఏకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయవచ్చనే అనుమానంతోనే తనను కాన్వొకేషన్ హాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. దీనికి నిరసనగా తన సర్టిఫికెట్‌ను మాత్రమే తీసుకుని, గోల్డ్‌మెడల్‌ను తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీకి, సీఏఏకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రతీ ఒక్కరికీ సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దారుణానికి వ్యతిరేకంగా తన బంగారు పతకాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తున్నట్టు చెప్పారు. దీనిపై విద్యావంతులైన యువతగా తాము బలమైన వైఖరి తీసుకోవాలన్నారు. అయితే ఈ ఆరోపణలను విశ్వవిద్యాలయ అధికారులు ఖండించారు. కాగా, విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీలలో రుబీహా క్రమం తప్పకుండా పాల్గొనేవారని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ క్యాంపస్ పర్యటనకు వ్యతిరేకంగా ఆమె నిరసనలకు నాయకత్వం వహించినట్టుగా సమాచారం. మరోవైపు బంగారు పతకాలను గెల్చుకున్న ఇతర విద్యార్థులు ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారట. ఇందులో భాగంగా కొంతమంది కేవలం సర్టిఫికెట్లను మాత్రమే స్వీకరించారు. -
'స్నాతకోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది'
సాక్షి, కాకినాడ : కాకినాడ జేఎన్టీయులో ఏడవ స్నాతకోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్, యునివర్సిటీ కులపతి బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ స్నాతకోత్సవానికి కులపతి హోదాలో హాజరుకావడం సంతోషంగా ఉంది. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, డిజిటల్ ఇండియాలో విద్యార్దులు భాగస్వామ్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే భారత్ బలమైన అణుశక్తిగా ఎదిగిందని, ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కొనేందుకు మోదీ సర్కారు సిద్ధంగా ఉందని తెలిపారు. గాంధీ కలలుగన్న భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ బిహెచ్ఈఎల్ మాజీ సీఎండీ ప్రసాదరావుకు గౌరవ డాక్టరేట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 119 మంది విద్యార్థులు గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్‌డి పట్టాలు అందుకున్నారు. -
శాతవాహన యూనివర్సిటీ ‘పట్టా’పండుగ
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం కల నెరవేరనుంది. యూనివర్సిటీ ఏర్పడిన దశాబ్దం దాటినా స్నాతకోత్సవం జరగలేదు. చాలాసార్లు అధికారులు ప్రయత్నించినా వివిధ కారణాలతో కుదరలేదు. తాజాగా గవర్నర్ కార్యాలయం నుంచి స్నాతకోత్సవ నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఆగస్టు మొదటి వారంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 2017 వరకు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు ఈనెల 31 తేదీ వరకు కాన్వకేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉమేష్‌కుమార్ వెల్లడించారు. పలుమార్లు ప్రయత్నాలు..శాతవాహన యూనివర్సిటీలో స్నాతకోత్సవం నిర్వహించాలని చాలాసార్లు అధికారులు ప్రయత్నించారు. కానీ వివిధ కారణాలతో కుదరలేదు. వీరారెడ్డి వీసీగా పనిచేస్తున్నప్పడు 2014లో నిర్వహించేందుకు ప్రయత్నించినా ప్రత్యేక తెలం గాణ ఉద్యమం తీవ్రతరం కావడంతో అప్పుడు అటకెక్కింది. 2015 నుంచి 2017 వరకు బి.జనార్దన్‌రెడ్డి ఇన్చార్జీ వీసీగా ఉన్నప్పుడూ మరోసారి స్నాతకోత్సవం జరుపాలని నిర్ణయించారు. వివిధ కారణాలతో ఆగిపోయింది. ఆ తర్వాత ఇన్చార్జి వీసీగా 2018 ఆగస్టు 30 నుంచి టి.చిరంజీవులు కొనసాగుతున్న క్రమంలో ఆదిలో స్నాతకోత్సవ ప్రయత్నాలు కొనసాగినా కార్యరూపం దాల్చలేదు. రిజిస్ట్రార్‌గా ఉమేష్‌కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్నాతకోత్సవం నిర్వహణకు కసరత్తు తీవ్రంగా కృషిచేశారు. ఫలితంగా పలుమార్లు వాయిదా పడుతూ చివరకు ఆగస్టు మొదటి వారంలో నిర్వహిం చాలని శాతవాహన అధికారులు భావిస్తున్నారు. గవర్నర్ పచ్చజెండా.. రాష్ట్ర గవర్నర్ శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించడానికి పచ్చజెండా ఊపారు. దీనికి సంబందించిన లేఖ గవర్నర్ కార్యాలయం నుంచి శాతవాహన యూనివర్సిటీ వీసీకి అందించినట్లు సమాచారం. ఇంత వరకు స్నాతకోత్సవం నిర్వహించని శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవం విషయంలో వివిధవర్గాల నుంచి అపవాదు ఎదుర్కొంది. ఈ విషయంపై వివిధ సామాజిక సంఘాలు, పార్జీలు, విద్యార్థిసంఘాలు, పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు, ఉన్నతాధికారులకు విజ్ఞప్తుల ప్రక్నియ కొనసాగుతూ వచ్చింది. గవర్నర్ నుంచి లేఖ రావడంతో మార్గం సుగమమై ఆగస్టు మొదటి వారంలో నిర్వహించడానికి అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. జూలై 31 వరకు దరఖాస్తులు... శాతవాహన యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి 2017 వరకు డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు స్నాతకోత్సవం పట్టా పొందడానికి దరఖాస్తులు చేసుకోవచ్చని రిజిస్ట్రార్ ఉమేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 తేదీ వరకు గడువు ఉందని, అర్హులందరూ శాతవాహన యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. స్నాతకోత్సవం నిర్వహించడంపై శాతవాహన యూనివర్సిటీ వర్గాల్లో చాలా రోజుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్చార్జి వీసీ ఉండగా స్నాతకోత్సవం అవసరమా అని కొన్నివర్గాలు అభిప్రాయం వ్యక్తం చేయగా... కొద్ది రోజుల్లోనే రెగ్యులర్ వీసీని నియమించాలని దరఖాస్తులు కూడా ప్రభుత్వం కోరిందని, రెగ్యులర్ వీసీ వచ్చాక స్నాతకోత్సవం జరుపాలని మరికొన్నివర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా గవర్నర్ కార్యాలయం నుంచి స్నాతకోత్సవంపై సముఖత వ్యక్తం చేస్తూ లేఖ రావడంతో శాతవాహన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి సన్నద్ధమవుతోంది. -
గౌరవ డాక్టరేట్ లేనట్టే!
చారిత్రక విశ్వవిద్యాలయం.. వందేళ్ల వైభవం.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందినఉస్మానియా యూనివర్సిటీ ‘గౌరవం’ ఎవరికీ దక్కడం లేదు. 14 ఏళ్లుగా వర్సిటీ గౌరవడాక్టరేట్కు ఎవరినీ ఎంపిక చేయడం లేదు. ఇటీవల వందేళ్లు పూర్తి చేసుకున్న ఓయూస్నాతకోత్సవం ఈ నెల 17న జరగనుంది. స్వరాష్ట్రంలో నిర్వహించనున్న తొలి వేడుక ఇది. అయితే ఈసారి కూడా ఓయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం లేదని తెలుస్తోంది. తొలుతగౌరవ డాక్టరేట్ సీఎం కేసీఆర్‌కు ప్రదానం చేయాలని ప్రతిపాదించగా వ్యతిరేకత రావడంతో విరమించుకున్న అధికారులు.. ఆ తర్వాత మరెవరినీ ఎంపిక చేయలేదు. మరోవైపుస్నాతకోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరుకాకపోతుండడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. – ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఠాగూర్ ఆడిటోరియంలో ఈ నెల 17న ఉస్మానియా యూనివర్సిటీ 80వ స్నాతకోత్సవం జరగనుంది. అయితే ఈసారి కూడా ఓయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం లేదని తెలుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన గొప్ప వ్యక్తులను గుర్తించి గౌరవ డాక్టరేట్ అందజేస్తారు. కానీ గత 14 ఏళ్లుగా ఓయూ గౌరవ డాక్టరేట్‌కు ఎవరినీ ఎంపిక చేయడం లేదు. ఇటీవల వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏదో ఒక రంగంలో విశిష్ట సేవలందించిన వారిని గుర్తించి గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సీఎం కేసీఆర్‌కు ఓయూ గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేయాలని అనుకున్నారు. కానీ కొందరు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. మరొకరిని ఎంపిక చేయాలనే విషయంలో ఓయూ అధికారులు శ్రద్ధ చూపలేదు. నిబంధనలు కఠినం... స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఓయూ స్నాతకోత్సవం మొక్కుబడిగా జరగనుంది. గౌరవ డాక్టరేట్ ఎంపికకు నియమ నింబంధనలు అతి కఠినంగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. అవి ఈ కాలం నాటి వ్యక్తులకు ఉండాలంటే చాలా అరుదు అంటున్నారు. ఉన్న వారిలోనే మంచి వారిని ఎంపిక చేసి గౌరవ డాక్టరేట్‌ను అందజేయవచ్చు. కానీ ఓయూ అధికారులు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని విస్మరిస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం కవి, గాయకులు అందెశ్రీని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. మారిన పరిస్థితితులకు అనుగుణంగా నిబంధనలు సడలించుకుంటే సమాజం, ప్రజల కోసం పనిచేసే వారిని ప్రోత్సహించేలా గౌరవ డాక్టరేట్ అందజేయొచ్చు. ‘ఓయూ గౌరవ డాక్టరేట్ ఎంపికకు ఈ కాలంలోనూ ప్లేటోలు, అరిస్టాటిల్స్ కనిపించరు కదా.!’ అని సీనియర్ అధ్యాపకులు వ్యాఖ్యానించడం గమనార్హం. ఉన్న వారిలోనే ఒకరిని ఎంపిక చేసి గౌరవ డాక్టరేట్‌ను అందచేస్తే ఓయూ విశిష్టత మరింత పెరుగుతుందన్నారు. ముఖ్య అతిథి ఎంపికపై అసంతృప్తి.. ఓయూ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ పేరును ఖరారు చేయడంపై పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్ నిత్యం ఓయూను సందర్శిస్తారని, తమ కంటే జూనియర్ అని పలువురు సీనియర్ అధ్యాపకులు పేర్కొన్నారు. వందేళ్ల ఓయూలో జరిగే 80వ స్నాతకోత్సవానికి జాతీయ స్థాయిలో పేరున్న వ్యక్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కోరారు. స్నాతకోత్సవానికి కేవలం గవర్నర్ మాత్రమే వస్తుండడం, సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడంపై నిరాశతో ఉన్నారు. దేశమంతటా పర్యటించే సీఎం కేసీఆర్ ఓయూకు రాకపోవడంపై విద్యార్థులు, అధ్యాపకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన దరఖాస్తులు.. ఓయూ స్నాతకోత్సవం నిర్వహణపై సరిగా ప్రచారం లేకపోవడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గింది. మే 31తో గడువు ముగియగా... డిగ్రీ, పీజీ పట్టాకు 600, పీహెచ్‌డీకి 380 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు 292 మందికి బంగారు పతకాలు అందజేయనున్నారు. గత ఆరేళ్లలో లక్షలాది మంది విద్యార్థులు పాస్ కాగా సరైన సమాచారం లేక కొద్ది మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. స్నాతకోత్సవ నిర్వహణపై ఇంత వరకు ఓయూ వీసీ ప్రొ.రాంచంద్రం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అయితే డిగ్రీ, పీజీకి రూ.200 అపరాధ రుసుముతో జూన్ 4 వరకు, పీహెచ్డీ అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. స్నాతకోత్సవానికి ముందు దరఖాస్తు చేసుకుంటే తక్కువ ఫీజు ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రతి కాలేజీకి చేరవేయడంలో అధికారులు విఫలమయ్యారు. వేదికపై కేవలం పీహెచ్డీ అభ్యర్థులకు మాత్రమే పట్టాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఓవైపు పరీక్షలు... ఓయూలో డిగ్రీ, పీజీ, ఇతర కోర్సుల పరీక్షలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇలాంటి తరుణంలో స్నాతకోత్సవ పనులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆరేళ్లుగా స్నాతకోత్సవం జరగకపోవడంతో ప్రభుత్వం, విద్యార్థుల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే జూలై 24తో వీసీ ప్రొ.రాంచంద్రం పదవీ కాలం ముగుస్తుంది. తాను పదవిలో ఉండగానే స్నాతకోత్సవం నిర్వహించాలని ఆయన భావించారు. సిబ్బంది కొరత, వేసవి సెలవులకు అధ్యాపకులు వెళ్లడంతో జవాబు పత్రాల మూల్యాంకనం ఆలస్యమై ఫలితాల్లో జాప్యం జరుగుతోంది. ఒక పక్క పరీక్షలు, ఫలితాలు, మరో పక్క స్నాతకోత్సవం పనులతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ పేర్కొన్నారు. -
శాతవాహనలో స్నాతకోత్సవం ఎప్పుడూ..?!
యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు స్నాతకోత్సవం కీలక ఘట్టం. అలాంటి స్నాతకోత్సవాన్ని శాతవాహన యూనివర్సిటీ స్థాపించి దశాబ్దం దాటినా ఇంతవరకు ఒక్కసారి కూడా నిర్వహించలేదు. దీంతో విద్యార్థులు పట్టాపండుగ భాగ్యానికి నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు స్నాతకోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తున్నప్పటికీ శాతవాహన అధికారులు మాత్రం దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. స్నాతకోత్సవం నిర్వహించాలని విద్యార్థులు ఏళ్ల తరబడి విన్నవిస్తున్నా.. అధికారులు పెడచెవినపెడుతున్నారు. యూనివర్సిటీ అధికారులు, పరీక్షల విభాగం పెద్దగా పట్టించుకోకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. సాక్షి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ ప్రారంభమై పదేళ్లు గడుస్తోంది. వందల సంఖ్యల్లో విద్యార్థులు పట్టభద్రులై వెళ్తున్నప్పటికీ వారు వర్సిటీ ఛాన్స్లర్ చేతులమీదుగా పట్టాలు అందుకునే భాగ్యం మాత్రం కోల్పోతున్నారు. గతంలో ఒకరిద్దరు వీసీల కాలంలో ప్రయత్నాలు ప్రారంభమైనప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత అంతా ఇన్చార్జి వీసీల పాలనే జరుగుతుండడంతో సాధ్యపడలేదని కనిపిస్తోంది. కానీ సంబంధిత విభాగం అధికారుల సోమరితనంతోనే.. స్నాతకోత్సవానికి బ్రేక్ పడుతున్నట్లు యూనివర్సిటీ వర్గాల ద్వారా సమాచారం. ఏదిఏమైనా యూనివర్సిటీ ఈ సంవత్సరం స్నాతకోత్సవం నిర్వహించకుంటే పదేళ్లు గడిచినా పట్టా పండగ నిర్వహించలేదనే అపవాదును ఎదుర్కొవడం ఖాయమని విద్యారంగ నిపుణుల భావన. కార్యరూపం దాల్చని స్నాతకోత్సవం స్నాతకోత్సవం నిర్వహించాలని గతంలో వీరారెడ్డి వీసీగా ఉన్నప్పుడు 2014లో గవర్నర్ చేతులమీదుగా నిర్వహించాలని భావించినా రాష్ట్ర విభజన సమయం కావడంతో అప్పటి పరిస్థితుల్లో ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత 2015 నుంచి 2017 వరకు బి.జనార్దన్‌రెడ్డి ఇన్చార్జి వీసీగా విధులు నిర్వహించిన సమయంలో మరోసారి స్నాతకోత్సవం అంశం తెరమీదికొచ్చినా.. ఆయన మున్సిపల్‌శాఖ కీలక బాధ్యతల్లో ఉండడంతో కుదరలేదు. ఆ తర్వాత స్నాతకోత్సవం నిర్వహించాలనే ఆలోచనకు కూడా ఆయన సమయం కేటాయించే పరిస్థితులు లేకపోవడంతో అది కాస్తా అటకెక్కింది. ఆయన తర్వాత 2017 ఆగస్టు 30 నుంచి టి.చిరంజీవులు ఇన్చార్జి వీసీగా కొనసాగుతున్నప్పటికీ ముఖ్య బాధ్యతల్లో భాగంగా ఆయన హైదరాబాద్‌లోనే ఉంటుండడంతో ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప వర్సిటీకి సమయం కేటాయించడం లేదు. దీనికితోడు ప్రభుత్వం రెగ్యులర్ వీసీ నియామక ప్రక్రియ తుదిదశకు వచ్చింది. ఈ తరుణంలో ఇన్చార్జి వీసీ స్నాతకోత్సవ నిర్వహణకు సముఖత చూపేలా లేరని తెలుస్తోంది. ఇలా దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ స్నాతకోత్సవ కార్యక్రమానికి విద్యార్థులు దూరమవుతున్నారు. రాష్ట్రంలోనే నిర్వహించని ఏకైక వర్సిటీ రాష్ట్రంలో శాతవాహన యూనివర్సిటీతోపాటు మహాత్మగాంధీ, పాలమూరు, తెలంగాణ యూనివర్సిటీలను ఒకేసారి ప్రారంభించారు. ఒక్క శాతవాహన తప్ప అన్ని వర్సిటీలు ఒక్కోసారి స్నాతకోత్సవాన్ని నిర్వహించాయి. ముఖ్యంగా పరీక్షల విభాగం అధికారుల నుంచి ప్రయత్నాలు లేకపోవడమే దీనికి కారణమని విద్యార్థుల్లో చర్చ జరుగుతుంది. కొత్తగా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన ఉమేశ్‌కుమార్ దీనిపై ప్రత్యేక దృష్టిసారించి తీవ్రంగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఈసారి ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఏదిఏమైనా శాతవాహన యూనివర్సిటీ అధికారులు స్నాతకోత్సవంపై దృష్టిసారించి విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి నిర్వహించాలని వివిధ కోర్సుల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే మే లోగా నిర్వహిస్తాం శాతవాహన యూనివర్సిటీ ఏర్పడిన నాటినుంచి స్నాతకోత్సవం నిర్వహించనిది వాస్తవమే. గతంలో కొన్నిసార్లు ప్రయత్నించినా సాధ్యపడలేదని తెలిసింది. బాధ్యతలు చేపట్టిన యూనివర్సిటీలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారంతో పాటు స్నాతకోత్సవంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. మే 2019 లోపు స్నాతకోత్సవానికి ప్రణాళిక రూపొందించి కచ్చితంగా నిర్వహిస్తాం. – ఉమేష్‌కుమార్, శాతవాహన రిజిస్ట్రార్ -
వివాదాస్పదులకు డాక్టరేటా?
ఆంధ్ర విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవం వివాదాస్పదమవుతోంది. ఈ నెల 31న జరిగే కాన్వొకేషన్ నిర్వహణకు అధికారులు తీసుకుంటున్న పలు నిర్ణయాలు అందరి ఆగ్రహానికి కారణమవుతున్నాయి. స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిని ఆహ్వానించడం, వేదిక మార్పు, కళాప్రపూర్ణల ఎంపిక ప్రక్రియ.. ఇలా ప్రతి అంశం వివాదానికి కేంద్రంగా నిలుస్తోందనడంలో సందేహం లేదు. విశాఖ సిటీ : ఆంధ్రవిశ్వవిద్యాలయానికి తొమ్మిది దశాబ్దాల ఘన చరిత్ర ఉంది. లక్షలాది మంది విద్యార్థులకు అక్షర భిక్ష పెట్టిందీ విద్యా సంస్థ. ఇంతటి విశిష్ట విశ్వవిద్యాలయంలో పాలకులు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు వర్సిటీకి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి. ప్రధానంగా స్నాతకోత్సవ ముఖ్య అతిథిగా ఆహ్వానించే వ్యక్తి ఎంతో ప్రముఖుడై ఉండటం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్‌ను పాలకులు ఆహ్వానించారు. విభజన తరువాత ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, ఇవ్వరాదని కేంద్రానికి చెప్పిన ఆ పెద్దమనిషికి ఏయూ ఎర్ర తివాచీ పరవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆయనకు వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను సైతం ప్రదానం చేయనుండడం అందరి మనో భావాలను దెబ్బ తీయడమే. సమైక్యాంధ్ర, ప్రత్యే క హోదా ఉద్యమాలకు ఊపిరిలూదినది ఏయూ నే. అటువంటి ఉద్యమ గడ్డపై హోదావాదాన్ని పక్కన పెట్టడానికి కారణమైన వ్యక్తికి ఉన్నతాసనం వేసి గౌరవించాలనే నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో తమ అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడానికే ఏయూ పెద్దలు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌ను స్నాతకోత్సవానికి ఆహ్వానిస్తున్నారనే గుసగుసలు వర్సిటీలో వినిపిస్తున్నాయి. దీనిని బహిరంగంగా వ్యతిరేకించడానికి పలు వర్గాలు సిద్ధమవుతున్నాయి. వేదిక మార్పు తగదు స్నాతకోత్సవ వేదిక మార్పు సైతం ఆక్షేపణలకు గురవుతోంది. దశాబ్దాల క్రితం నిర్మించి పదుల సంఖ్యలో స్నాతకోత్సవాలకు వేదికగా నిలచిన కట్టమంచి రామలింగారెడ్డి స్నాతకోత్సవ మంది రాన్ని కాదని.. బీచ్‌రోడ్డులో హంగు, ఆర్భాటానికి ప్రాధాన్యం ఇస్తూ నిర్మించిన కన్వెన్షన్ కేంద్రంలో కాన్వొకేషన్ నిర్వహించాలని వర్సిటీ అధికారులు తీసుకున్న నిర్ణయం అందరినీ బాధించింది. దీనిపై పాలకమండలి సభ్యులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, బాహాటంగానే వర్సిటీ అధికారుల నిర్ణయాన్ని తప్పుపట్టినట్టు సమాచారం. స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథి, గవర్నర్, ఇతర అతిథులను తోడ్కొని వీసీ సభికుల మధ్య నుంచి వేదికను అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. కన్వెన్షన్ కేంద్రంలో ఇటా జరగాలంటే మొదటి అంతస్థుకు ఎక్కాల్సిందే. మెట్ల మార్గం లో గవర్నర్ వంటి వ్యక్తిని ఎక్కి రావాలని కోరడం సమంజసం కాదు. దీనితో ఈ ప్రక్రియ నామమాత్రంగా ముగిసే అవకాశం ఉంది. వేదికకు అనుకుని ఉన్న వీవీఐపీ గది వైపు నుంచి మాత్రమే అతిథులు లోనికి ప్రవేశించే అవకాశం ఉంది. ప్రముఖుల విస్మరణ కళాప్రపూర్ణల ఎంపికలో వర్సిటీ అధికారులు ఇష్టారాజ్యంగా, హడావుడిగా నిర్ణయాలు తీసుకున్నారని పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖులను, సాహితీవేత్తలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, జానపదానికి చిరునామాగా నిలుస్తున్న వంగపండు ప్రసాదరావులకు కళాప్రపూర్ణకు పరిశీలించక పోవడం విచారకరమని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతవరకు కేంద్రం పద్మశ్రీ ఇవ్వకపోయినా కనీసం ఆంధ్రవిశ్వవిద్యాలయమైనా గౌరవించి సముచితంగా సత్కరించి ఉండాల్సిందని వీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో జన్మించి తెలుగు రాష్ట్రాలలో జానపదానికి పెద్ద దిక్కుగా నిలచిన వంగపండు ప్రసాదరావు కళాప్రపూర్ణకు ఏవిధంగా అర్హులు కాదో తెలపాలని వీరు వర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. విశ్రాంత ఆచా ర్యులు నలుగురైదుగురితో ముందుగానే ప్రత్యే కం కమిటీ వేసి పేర్లు పరిశీలించాల్సిందని సూ చిస్తున్నారు. ఆదరాబాదరాగా ఆరు రోజుల ముందు పాలక మండలి సమావేశం నిర్వహిం చి నలుగురి పేర్లు గవర్నర్ ఆమోదానికి పం పడం సమంజసం కాదనే వాదన వినిపిస్తోంది. -
మోదీ నిర్ణయం.. మమత షాక్
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఓ నిర్ణయం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం శాంతినికేతన్‌లోని విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ హాజరయ్యారు. అయితే యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా అందించే దేశికొత్తమ్ అవార్డుల ప్రదానొత్సవంలో మాత్రం ఆయన పాల్గొనట్లేదు. దీంతో అవార్డుల వేడుక లేనట్లేనని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ప్రధాని బిజీ షెడ్యూల్ కారణంగా అవార్డులను అందించలేరని ప్రధాని కార్యాలయం బెంగాల్ ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ పరిణామాలపై సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఎంవో కార్యాలయం ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉందని ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఈ వ్యవహారంపై యూనివర్సిటీ అధికారులు స్పందిస్తూ.. గతంలోనూ ఇలాంటి పరిణామాలు జరిగాయని చెబుతున్నారు. అయితే గత ఐదేళ్లుగా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమం.. ఈసారి జరిగి తీరుతుందని అంతా భావించారు. ఇదిలా ఉంటే ఈ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అతిథులతో వేదిక పంచుకోవటం గమనార్హం. అవార్డుల జాబితాపై కూడా... అవార్డుల ఎంపిక పైనా మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వభారతి అకాడమీ కౌన్సిల్ ఈనెల మొదట్లో దేశీకొత్తమ్ అవార్డుల కోసం పలువురు ప్రముఖుల పేర్లను ఎంపిక చేసింది. జాబితాలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, రచయిత అమితవ్ ఘోష్, ప్రముఖ కవి గుల్జర్, పెయింటర్ జోగెన్ చౌదరి, ద్విజెన్ ముఖర్జీ తదితరుల పేర్లు ఉన్నాయి. అయితే అమితాబ్‌తోపాటు ద్విజెన్ పేర్లను అవార్డుకు ఎంపిక చేయలేదు. ‘అర్హత ఉన్న వారికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారో తెలీట్లేదు. ఈ నిర్ణయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది’ అంటూ ఆమె మీడియా ఎదుట అసహనం వ్యక్తం చేశారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో... ప్రధాని నరేంద్ర మోదీ విశ్వ భారతి యూనివర్సిటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక హసీనా కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఇరు ప్రధానులతోపాటు సీఎం మమతా బెనర్జీ వేదికను పంచుకున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీకి స్వయంగా మమతా ఆహ్వానం పలికి, యూనివర్సిటీకి వెంటబెట్టుకొచ్చారు. స్నాతకోత్సవం ముగిశాక బంగ్లాదేశ్ భవన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. వీడియోపై పేలుతున్న జోకులు.. ఇటీవల కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎం మమతా బెనర్జీ కర్ణాటక డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కొద్ది దూరం నడవాల్సి రావటంతో ఆమె డీజీపీ నీలమణి రాజుపై చిందులు తొక్కారు. ఆ పరిణామంతో కుమారస్వామి-దేవగౌడలు కూడా బిత్తరపోయారు. అనంతరం ఆ డీజీపీని బదిలీ చేస్తూ కుమారస్వామి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ప్రధాని రాక సందర్భంగా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హెలిప్యాడ్‌కు దూరంలో ఉన్న మమతను ఇటువైపుగా రావాలంటూ ప్రధాని మోదీ సైగలు చేయటం, ఆమె అక్కడి దాకా నడుచుకుంటూ వచ్చి మోదీకి పుష్ఫగుచ్ఛం అందించటం చూడొచ్చు. మరి తనను అంత దూరం నడిపించిన మోదీపై మమత ఎవరికి ఫిర్యాదు చేస్తుందో చూడాలంటూ పలువురు సెటైర్లు పేలుస్తున్నారు. #WATCH PM Narendra Modi arrives in Shanti Niketan to attend the convocation of Visva Bharati University, received by West Bengal CM Mamata Banerjee pic.twitter.com/dnDE1pZmyf — ANI (@ANI) 25 May 2018 -
ఎస్కేయూ కాన్వొకేషన్ నోటిఫికేషన్ విడుదల
– జులై 20 వరకు దరఖాస్తుకు అవకాశం – ఆగస్టులో స్నాతకోత్సవం ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం(కాన్వొకేషన్) ఆగస్టులో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేశారు. విద్యార్థులకు ఈ నెల 20 నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి జులై 20 చివరి తేదీగా నిర్ణయించారు. తొలిసారిగా కాన్వొకేషన్ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దరఖాస్తుతో పాటు ఫీజును సైతం ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ బ్యాంకింగ్, మీ సేవ ద్వారా ఫీజు చెల్లించొచ్చు. దరఖాస్తు పూర్తయ్యి, ఫీజును చెల్లించిన తర్వాత హార్డ్‌కాపీని ‘ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్, ఎస్కేయూ, అనంతపురం ’ చిరునామాకు రిజిష్టర్ పోస్టు ద్వారా పంపాలి. 2014, 15, 16 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ, పీజీ (రెగ్యులర్, దూరవిద్య), ఎం.ఫిల్, పీహెచ్డీ (రెగ్యులర్) పూర్తి చేసిన వారికి కాన్వొకేషన్ డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. వీరే కాకుండా అంతకుముందే ఉత్తీర్ణతులై.. కాన్వొకేషన్ సర్టిఫికెట్ తీసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే..వారు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు, ఆన్లైన్ దరఖాస్తు తదితర పూర్తి వివరాలను ఠీఠీఠీ.టజుunజీఠ్ఛిటటజ్టీy.్చఛి.జీn అనే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. స్నాతకోత్సవాన్ని ఆగస్టులో ఏ తేదీన నిర్వహిస్తారనే విషయాన్ని గవర్నర్ ముందస్తు అనుమతితో వెల్లడించనున్నారు. -
కట్ అండ్ పేస్ట్ పీహెచ్‌డీలు వద్దు: గవర్నర్
నల్లగొండ : ధనార్జన కోసమే విద్య అనే భావం నుండి యువత బయటపడాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉద్బోధించారు. నల్లగొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రస్తుత కాలంలో విలువలతో కూడిన విద్య ఎంతో ముఖ్యమని, కట్ అండ్ పేస్ట్ పీహెచ్‌డీలు నిరుపయోగమన్నారు. ప్రజల వాస్తవ అవసరాలపై పరిశోధనలు జరగాలన్నారు. నైతిక విలువలను బోధించడంలో అధ్యాపకులదే కీలకపాత్ర అని, నాణ్యమైన, సృజనాత్మక విద్యకు విశ్వవిద్యాలయాలు పెద్ద పీట వేయాలని సూచించారు. చదువుతోనే సమాజంలోని రుగ్మతలకు చరమ గీతం పాడాలని, ఆచార్య దేవోభవ అనే భావాన్ని ఎవ్వరూ మరవొద్దని అన్నారు. జీవితంలో ఆత్మపరిశీలన చాలా ముఖ్యమని, మానవతా విలువలకు నిలయాలు విశ్వవిద్యాలయాలని పేర్కొన్నారు.