ఉప్పొంగిన ఉత్సాహం..
మలేసియా టౌన్‌షిప్: పట్టాలు అందుకున్న వేళ విద్యార్థుల్లో ఉత్సాహం ఉరకలేసింది. పట్టాలను గాల్లోకి ఎగుర వేశారు. స్నేహితులతో కలిసి స్టెప్పులేశారు. కెమెరాల్లో ఫొటోల్లో తీసుకున్నారు. కూకట్‌పల్లి జేఎన్టీయూహెచ్‌లో గురువారం ఐదో స్నాతకోత్సవం ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. పలు కోర్సుల వారికి పట్టాలు అందజేయడంతోపాటు పీహెచ్‌డీ పూర్తి చేసిన 150 మంది విద్యార్థులకు డాక్టరేట్ ప్రదానం చేశారు. వర్సిటీ ఉపకులపతి రామేశ్వర్‌రావు చేతుల మీదుగా పట్టాలు పుచ్చుకున్నారు. వివిధ కళాశాలలకు చెందిన 98 మంది గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. తమ పిల్లలు గోల్డ్‌మెడల్స్ అందుకునే క్రమంలో వారి తల్లిదండ్రులు పరవశించిపోయారు.
ఆనందంగా ఉంది..
మూడు గోల్డ్ మెడల్స్ సాధించ డం ఎంతో ఆనందంగా ఉంది. అమెరికాకు వెళ్లి ఎంఎస్ పీహెచ్ డీ పూర్తి చేయాలనుకుంటున్నా. ఫార్మసీలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలనేదే నా జీవిత ఆశయం.
- ఎంవీఎన్‌ఎస్ అనూష
సొంతంగా కంపెనీ స్థాపిస్తా..
బీటెక్‌లో గోల్డ్‌మెడల్ సాధించా. ఆస్ట్రేలియాలోని అడ్యులాడే యూనివర్సిటీలో ఎంఈ చేయాలని ఉంది. ఆ తరువాత పీహెచ్‌డీ చేస్తా. సొంతంగా కంపెనీ స్థాపించి సిర్థపడాలని ఉంది.
- కేశభోని రాజేందర్‌గౌడ్
అమెరికాలో ఎంఎస్ చేస్తా..
కంప్యూటర్ సైన్స్‌లో రెండు మెడ ల్స్ సాధించిన. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే సాఫ్ట్‌వేర్ రంగంలోనే స్థిరపడాలని ఉంది. సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించాలనే కోరిక ఉంది.
- అనితారెడ్డి స్వర్ణ