Malaysia Township
-
ముఖానికి కవర్ చుట్టుకుని ఆత్మహత్య
హైదరాబాద్: నగర శివారులో పార్క్ చేసి ఉన్న కారులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖానికి ప్లాస్టిక్ కవర్ బిగించుకుని.. ఆపై కారులోని గ్యాస్ లీక్ చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కేపీహెచ్‌బీ మలేషియా టౌన్షిప్ సమీపంలో శనివారం వెలుగుచూసింది. పార్క్ చేసి ఉన్న కారులో నుంచి దుర్వాసన వస్తుండటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు నెల్లూరు జిల్లాకు చెందిన దినేష్‌గా గుర్తించిన పోలీసులు అతని వద్ద నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ విఫలమవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉప్పొంగిన ఉత్సాహం..
మలేసియా టౌన్షిప్: పట్టాలు అందుకున్న వేళ విద్యార్థుల్లో ఉత్సాహం ఉరకలేసింది. పట్టాలను గాల్లోకి ఎగుర వేశారు. స్నేహితులతో కలిసి స్టెప్పులేశారు. కెమెరాల్లో ఫొటోల్లో తీసుకున్నారు. కూకట్పల్లి జేఎన్టీయూహెచ్లో గురువారం ఐదో స్నాతకోత్సవం ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. పలు కోర్సుల వారికి పట్టాలు అందజేయడంతోపాటు పీహెచ్డీ పూర్తి చేసిన 150 మంది విద్యార్థులకు డాక్టరేట్ ప్రదానం చేశారు. వర్సిటీ ఉపకులపతి రామేశ్వర్రావు చేతుల మీదుగా పట్టాలు పుచ్చుకున్నారు. వివిధ కళాశాలలకు చెందిన 98 మంది గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. తమ పిల్లలు గోల్డ్‌మెడల్స్ అందుకునే క్రమంలో వారి తల్లిదండ్రులు పరవశించిపోయారు. ఆనందంగా ఉంది.. మూడు గోల్డ్ మెడల్స్ సాధించ డం ఎంతో ఆనందంగా ఉంది. అమెరికాకు వెళ్లి ఎంఎస్ పీహెచ్ డీ పూర్తి చేయాలనుకుంటున్నా. ఫార్మసీలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలనేదే నా జీవిత ఆశయం. - ఎంవీఎన్‌ఎస్ అనూష సొంతంగా కంపెనీ స్థాపిస్తా.. బీటెక్‌లో గోల్డ్‌మెడల్ సాధించా. ఆస్ట్రేలియాలోని అడ్యులాడే యూనివర్సిటీలో ఎంఈ చేయాలని ఉంది. ఆ తరువాత పీహెచ్డీ చేస్తా. సొంతంగా కంపెనీ స్థాపించి సిర్థపడాలని ఉంది. - కేశభోని రాజేందర్‌గౌడ్ అమెరికాలో ఎంఎస్ చేస్తా.. కంప్యూటర్ సైన్స్‌లో రెండు మెడ ల్స్ సాధించిన. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే సాఫ్ట్వేర్ రంగంలోనే స్థిరపడాలని ఉంది. సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాలనే కోరిక ఉంది. - అనితారెడ్డి స్వర్ణ -
‘ ఫేస్ టూ వేస్ట్’
చికాకు పడిన మేయర్ మధ్యలో నిలిచిన కార్యక్రమం ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురి ఫిర్యాదు సాక్షి,సిటీబ్యూరో: మేయర్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదిక ‘ఫేస్ టూ ఫేస్’ అభాసుపాలైంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాఫిర్యాదుల్ని పరిష్కరించేందుకు ప్రతినెలా మొదటి శనివారం గంటసేపు నిర్వహిస్తున్నారు. ఇందులో తొలి అరగంట ఫోన్ల ద్వారా వచ్చే ఫిర్యాదుల్ని..అనంతరం వ్యక్తిగతంగా ఇచ్చే ఫిర్యాదుల్ని స్వీకరిస్తారు. శనివారం కార్యక్రమం ప్రారంభం కావడమే నిర్ణీత సమయం కంటే కొద్దిగా ఆలస్యమైంది. ప్రారంభమయ్యాక కూడా ఫోన్ ద్వారా అందే ఫిర్యాదులు మేయర్‌కు సరిగ్గా వినిపించకపోవడం.. మధ్యమధ్య అవాంతరాలు ఎదురవడంతో చిరాకుకు గురైన మేయర్ టెలిఫోన్ ఫిర్యాదులు ఆపాల్సిందిగా ఆదేశించారు. ప్రతినెలా దాదాపు 20 ఫిర్యాదుల్ని ఫోన్‌ద్వారా స్వీకరించేవారు. అలాంటిది ముగ్గురి ఫోన్‌కాల్స్‌తోనే మేయర్ ఫోన్ కార్యక్రమాన్ని ముగించి, వ్యక్తిగత దరఖాస్తుల్ని స్వీకరించారు. జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేవని ప్రజలు విమర్శిస్తుండ గా..ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ సైతం సక్రమంగా లేకపోవడం జీహెచ్ఎంసీ పనితీరుకు అద్దం పడుతోందని పలువురు వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా హాజరైన వారు కూడా ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా తమ సమస్య పరిష్కారం కావడంలేదని వాపోయారు. మలేసియా టౌన్షిప్లో అక్రమ నిర్మాణాల్ని అడ్డుకోవాలని, ప్రజారోడ్డును మూసివేసిన వారిపై ఇంతవరకు ఎలాంటి చర్యల్లేవని గతంలో ఫిర్యాదు చేసిన గోపాలరావు మరోమారు ఫిర్యాదు చేశారు. ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా ఇచ్చిన నీటి, కరెంటు కనెక్షన్లు తొలగించాల్సిందిగా పదేపదే ఫిర్యాదులు చేసిన సీహెచ్ కృష్ణ సంబంధిత డాక్యుమెంట్లతో మరోమారు విషయాన్ని మేయర్ దృష్టికి తెచ్చారు. ఇకపై ఫేస్ టూ ఫేస్‌కు కాకుండా తన చాంబర్‌కు రావాల్సిందిగా మేయర్ ఆయనకు సూచించారు. దాదాపు 20 ఫిర్యాదులు వ్యక్తిగతంగా అందజేశారు.