ముఖానికి కవర్‌ చుట్టుకుని ఆత్మహత్య | Disstressed over love failure, man commits suicide | Sakshi
Sakshi News home page

ముఖానికి కవర్‌ చుట్టుకుని ఆత్మహత్య

Published Sat, Jul 22 2017 8:22 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

ముఖానికి కవర్‌ చుట్టుకుని ఆత్మహత్య - Sakshi

ముఖానికి కవర్‌ చుట్టుకుని ఆత్మహత్య

హైదరాబాద్‌: నగర శివారులో పార్క్‌ చేసి ఉన్న కారులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ బిగించుకుని.. ఆపై కారులోని గ్యాస్‌ లీక్‌ చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కేపీహెచ్‌బీ మలేషియా టౌన్‌షిప్‌ సమీపంలో శనివారం వెలుగుచూసింది.

పార్క్‌ చేసి ఉన్న కారులో నుంచి దుర్వాసన వస్తుండటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు నెల్లూరు జిల్లాకు చెందిన దినేష్‌గా గుర్తించిన పోలీసులు అతని వద్ద నుంచి సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ విఫలమవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement