కోనరావుపేట (వేములవాడ): ‘‘ఊర్లో బతుకబుద్ధి అవు తలే. వేరేవాళ్లు చెప్పే మాటలకు బాధనిపిస్తోంది. అమ్మా.. నన్ను కొట్టినందుకు బాధలేదు. చెల్లిని మంచిగా చూసుకో. ఈ పేదబతుకు నాకొద్దు. చెల్లెకు మంచిగా పెళ్లి చేయండి. అమ్మా.. అన్నా.. బావా.. డాడీ.. నేను వెళ్తున్నా..’’అని ఓ బాలుడు స్నేహితుడికి సెల్ఫీ వీడియో పంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండ లంలోని కమ్మరిపేటతండాలో ఈ ఘటన జరిగింది.
కమ్మ రిపేటతండా (వట్టిమల్ల)కు చెందిన భూక్యా రాజు, జ్యోతి దంపతులకు దినేశ్, దీప్తి అనే పిల్లలు ఉన్నారు. దినేశ్ (17) గతేడాది వరకు కోనరావుపేట మండలంలోని ధర్మా రం హాస్టల్‌లో ఉంటూ ఎనిమిదో తరగతి వరకు చదువుకు న్నాడు. ఈ ఏడాది చదువు ఆపేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు.
రెండు రోజుల క్రితం ఓ దుకాణంలో సిగరెట్ ప్యాకెట్ దొంగిలించాడని దుకాణం యజమా ని దినేశ్ తల్లిదండ్రులకు చెప్పగా.. తల్లి కోపంతో దినేశ్‌ను కొట్టింది. దీంతో గురువారం ఉదయం 10 గంటలకు దినేశ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. స్నేహితుల దగ్గరికి వెళ్లాడని భావించిన తల్లిదండ్రులు వరినాట్లు వేసేందుకు పొలానికి వెళ్లారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో..
గురువారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన దినేశ్, తాను చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి స్నేహితునికి పంపాడు. అయితే అతను పాఠశాలకు వెళ్లిపోగా.. సెల్‌ఫోన్‌ను అతని తండ్రి తీసుకెళ్లాడు. రాత్రి పది గంటలకు స్నేహితుడి తండ్రి ఇంటికొచ్చాక వీడియో చూసి వెంటనే దినేశ్ తల్లిదండ్రులకు చెప్పాడు.
అందరూ కలసి దినేశ్ కోసం అటవీ ప్రాంతంలో గాలించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు వట్టిమల్ల శివారు అటవీ ప్రాంతంలో దినేశ్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. కోనరావుపేట ఎస్సై రమాకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుని మృతికి దుకాణం యజమాని మాలోత్ కాంతి కారణమని మృతుని తండ్రి రాజు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment