doctorate
-
అలాంటి చిల్లర కవులు ఎక్కువయ్యారు!
విద్యకు సాటి వచ్చే ధనం లేదనేది సుభాషితం. కాని నేటి వ్యాపార యుగంలో ధనం అన్ని రంగాలనూ శాసిస్తున్నట్టే... విద్య మీద కూడా ఆధిపత్యాన్ని చలాయిస్తూ దాన్ని అంగడి సరుకుగా దిగజారుస్తోంది. నేడు సాధారణ డిగ్రీలు మొదలుకొని విద్యారంగంలో అత్యున్నత అర్హతలకు సంబంధించిన పట్టాల వరకు కొనగలిగిన స్తోమత ఉన్నవారికి లభించడం ఈ దుఃస్థితికి నిదర్శనం.ముఖ్యంగా విదేశాలలోనూ, ఉత్తర భారతదేశంలోనూ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న నకిలీ విశ్వవిద్యాలయాలు విక్రయిస్తున్న ఈ డిగ్రీలను ప్రచార వ్యామోహం గల సంపన్నులు తమ పేర్లకు అలంకారాలుగా తగిలించుకొని, అవి తమ ప్రతిభాచిహ్నాలుగా చాటుకుంటున్నారు. ఊరేగింపులు, అభినందన సభలు, విందులు, వినోదాలు ఏర్పాటు చేసుకొని అవి తమ కీర్తి కిరీటాలుగా జనాన్ని భ్రమపెడుతున్నారు. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి తనకో విదేశీ సంస్థ డాక్టరేట్‌ను ఇవ్వజూపితే ‘డాక్టరేట్ ఇంత తేలికా?’ అని నిజాయతీగా వ్యాఖ్యానించడమే కాదు, తెచ్చుకున్న ఆ డాక్టరేట్ బిరుదును ఎప్పుడూ తన పేరు ముందు, కనీసం ‘నవ్విపోదురు గాక’ పుస్తక రచయితగా కూడా ఉపయోగించలేదు. అలా ప్రలోభాలకు లొంగకుండా అర్హత లేని బిరుదులను తోకలుగా ఉపయోగించని వారు అరుదు. నకిలీ విద్యార్హతలతో ఆత్మవంచనకు, పరవంచనకు పాల్పడుతున్న పెద్దమనుషులే ఎక్కువ.డాక్టరేట్ల సంతర్పణకు కాణాచులుగా మన విశ్వవిద్యాలయాలను చెప్పుకోవాలి. పీహెచ్డీ పట్టాల కోసం పరిశోధనలు ఉద్యోగాలకో, పదోన్నతులకో అవసరం కావడంతో నాటి ప్రమాణాలు దిగజారుతున్నాయి. ఈ జాతరలో పరిశోధక విద్యార్థులు అడ్డదారులను వెతు క్కుంటుంటే పర్యవేక్షకులు వారి కోర్కెలకు అనుగుణంగా తోడ్పడి లబ్ధి పొందుతున్నారు. ‘కాదేదీ కవిత కనర్హం’ అన్నట్లు పరిశోధన ఆవశ్యకత లేని, కేవలం ‘మెథడాలజీ’ చట్రంలో ఇమిడ్చి పీహెచ్డీ పట్టాను పొందే సులభమైన, ఎందుకూ పనికిరాని అంశాన్ని పరిశోధక విద్యార్థికి సూచించడం... విద్యార్థి ఆర్థికంగా ఆశపెడితే సిద్థాంత గ్రంథాన్ని తామే అన్నీ రాసి ఇవ్వడం కొందరు పర్యవేక్షక గురువులు చేస్తున్న నిర్వాకాలు. విశ్వవిద్యాలయాల వెలుపల సిద్ధాంత గ్రంథ రచనకు ధరను మాట్లాడుకొని రాసిపెట్టడం వృత్తిగా కలిగిన నిరుద్యోగ మేధావులు కూడా ఉండడంతో కొందరు పరిశోధకులు వారు అడిగిన డబ్బిచ్చి శ్రమ పడకుండా ‘డాక్టర్లు’ అనిపించుకుంటున్నారు.తెలుగే కాదు, ఆంగ్లం, హిందీ వంటి ఇతర భాష ల్లోనూ, సాంఘిక విజ్ఞాన శాస్త్ర విభాగాల్లోనూ పరిశోధనల స్థాయి భిన్నంగా లేదు. కొందరు ప్రబుద్ధులు ఎలాగోలా ‘పీహెచ్డీ’ అనిపించుకుంటే చాలని పూర్వుల కృషిని కొల్ల గొట్టి రాసిన సిద్ధాంత గ్రంథాలకు కూడా అయ్యవార్ల ఆశీస్సులతో ఆమోద ముద్రను వేయించుకొని ‘మమ’అంటున్న సందర్భాలు కూడా లేక పోలేదు. అయితే పరిశోధనలన్నీ కాకి బంగారం బాపతేననీ, యోగ్యతకూ నిజాయతీకి స్థానం లేదనీ అనడం కువిమర్శే అవుతుంది. విశ్వవిద్యాలయాలు వివిధ రంగాలలో– ప్రతిభామూర్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్లను, కళాప్రపూర్ణ వంటి బిరుదులనూ ప్రకటించడం ఆనవాయి తీగా వస్తోంది. అయితే వాటిని కానీ, కొన్ని ప్రామాణిక సంస్థలు ఇస్తున్న బిరుదులను కానీ విశ్వనాథ, శ్రీశ్రీ, జాషువా, పుట్టపర్తి, సినారె, ఆరుద్ర వంటి దిగ్దంతులెవరూ ఎప్పుడూ, ఎక్కడా భుజకీర్తులుగా వినియోగించుకోలేదు. ఏనుగులపై ఊరేగించినా, గురుతుల్యుల చేత గండ పెండేరాలతో సన్మానింపబడినా వారు వాటిని స్వోత్కర్షగా వాడుకోలేదు. కానీ నేడు కీర్తి కాంక్షతో అభినవ కృష్ణదేవరాయలం అనుకునే కవి పోషకులు, ‘అంతా కవులము కామా’ అనుకునే చిల్లర కవులు ఎక్కువయ్యారు. చదవండి: ఇది మాయ కాక మరేమిటి?వారు ఆశ్రిత కవులకు ‘కవిరత్న’, ’కవిశేఖర’, ‘కవితిలక’ వంటి బిరుదులను ప్రదానం చేసి శాలువాలను కప్పడం... వీరు మరునాడు స్థానిక పత్రికలలో ఆ సత్కారాల గురించి ఘనంగా రాయించుకోవడం ప్రహస నమైపోయింది. ఇటీవల కొన్ని సంస్థలు ఏకంగా కొందరు స్థానిక కవులకు ‘గౌరవ డాక్టరేట్’లను కూడా ప్రదానం చేస్తున్నాయి. కొంతనయం– పద్మ పురస్కారాలను కూడా ప్రకటించడం లేదు! ఏ హక్కు, అధికారం లేకుండా ఎవరు పడితే వారు ఇలా బిరుదులనివ్వడం, ప్రతిభాశూన్యులైన కవులు కూడా వాటిని అలంకారాలుగా ప్రదర్శించడం సమాజానికి హానికరం. దీనికి నియంత్రణ అవసరం!చదవండి: ఎవరిని ఎలా పిలవాలి?ఇటీవల ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు రాహుల్ ద్రావిడ్‌కు బెంగుళూరు విశ్వవిద్యాలయం వారు ‘గౌరవ డాక్టరేట్’ను ప్రకటిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించడమే గాక ‘అవసరమనుకుంటే ‘నేను థీసిస్‌ను సమర్పించి డాక్టరేట్ తీసుకుంటాను కాని ఉచితంగా కాదు’ అని వ్యాఖ్యానించడం అభినందనీయం. ఆదర్శవంతులు ముఖ్యంగా రాజకీయ, చిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు ఎటువంటి ప్రలోభాలకూ లోను కాకుండా గౌరవ డాక్టరేట్ల ప్రత్యేకతను కాపాడుతారని ఆశిద్దాం.- పైడిపాలవిశ్రాంత తెలుగు ఉపన్యాసకులు -
Action King Arjun: అర్జున్ సర్జాకు గౌరవ డాక్టరేట్ తో సత్కారం
-
Ram Charan Photos: గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ (ఫొటోలు)
-
వీకే నరేష్‌కి డాక్టరేట్ ప్రదానం
నటుడు వీకే నరేష్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ‘ఐఎస్ సీఏహెచ్ఆర్’ నుంచి ఆయన ‘సార్’ అనే బిరుదుతోపాటు డాక్టరేట్‌ని అందుకున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో వీకే నరేష్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్’ సంస్థతో పాటు ‘ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్)’ కలిసి నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేష్‌కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌తో పాటు లెఫ్టినెంట్ కల్నల్‌గా ఆయన్ను నియమించినట్లు సన్నిహితులు తెలిపారు. ఇకపై నరేష్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై నరేష్ ప్రసంగించినందుకు గుర్తింపుగా ఈ గౌరవాలు దక్కాయి. -
Rukhsar Saeed: టేస్ట్ ఆఫ్ కశ్మీర్
కశ్మీర్ పేరు చెప్తే అందమైన ప్రదేశాలే గుర్తొస్తాయి. కాని ఆ లోయలో దాగిన రుచులు అన్వేషిస్తే తప్ప తెలియదు. శాకాహారమైనా మాంసాహారమైనా స్వచ్ఛమైన దినుసులతో గుమ్మెత్తిస్తారు. ‘మేము ఎలా వండుతామో నా వంట చూసి తెలుసుకోండి’ అని కశ్మీర్ వంట చేసి చూపుతోంది రుక్సార్ సయీద్. కశ్మీర్ మహిళలు పెద్దగా పాల్గొనని ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ తాజా సిరీస్‌కు రుక్సార్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. పోటీని తట్టుకుని టాప్ 12లో నిలిచిన ఆమెను చూసి కశ్మీర్లో ఆడవాళ్లు గర్విస్తున్నారు. సోనీ లివ్‌లో ప్రసారమవుతున్న తాజా సీజన్ ‘మాస్టర్ షెఫ్ ఆఫ్ ఇండియా’ కోసం రుక్సార్ సయీద్ (33) ‘షబ్ దేక్’ అనే కశ్మీరీ వంట చేసింది. ‘ఇది మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు, మా అమ్మ నుంచి నాకు అందిన వంట. ముదురు గుమ్మడికాయ, నాటుకోడి, ఆల్‌బకారా ఎండుగుజ్జు వేసి చేస్తాం. చాలా బాగుంటుంది’ అంది. జడ్జీలుగా ఉన్న ప్రముఖ షెఫ్‌లు వికాస్ ఖన్నా, రణ్వీర్ బ్రార్, పూజా ధింగ్రా... కొద్దిగా రుచి చూసి ‘అద్భుతం’ అన్నారు. ఆమె ఇంకో ఎపిసోడ్లో ‘షికారా రైడ్’ అనే అల్పాహారం చేసింది. మటన్ కోఫ్తాను, పుదీనా మసాలాతో రంగరించి చేసింది. టేస్ట్ అదిరిందని వేరే చె΄్పాలా? ‘కశ్మీర్ లోయంతా రకరకాల మసాలా దినుసులు, మేం మాత్రమే తినే ఆకుకూరలు, కాయగూరలు ఉన్నాయి. వాటిని వండే పద్ధతి అందరికీ తెలియదు. మాస్టర్ షెఫ్ ద్వారా దేశమంతటికీ ఆ రుచులను తెలియజేయాలనుకుంటున్నాను’ అంటుంది రుక్సార్ సయీద్. ఆమె సంకల్పం గట్టిదిలాగుంది. తాజా సీజన్లో మహా మహా వంటగాళ్లు, వంటగత్తెలు పోటీ పడితే తుది జాబితాలో 22 మంది ఉంటే, వారిలో చాలామందిని అధిగ‘మించి’ టాప్ 12కు చేరింది రుక్సార్. దాంతో కశ్మీర్లో ఇప్పుడు ఈ షోను అక్కడి స్త్రీలు చూస్తున్నారు. రుక్సార్‌ను తమ ప్రతినిధిగా, తమ సామర్థ్యాలకు కొలమానంగా చూస్తున్నారు. ‘ఆ సంతోషం చాలు నాకు. నన్ను స్ఫూర్తిగా తీసుకుని స్త్రీలు ముందుకు రావాలి’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో డాక్టరేట్ రుక్సార్ సయీద్‌ది పుల్వామా జిల్లాలోని పామ్పోర్ అనే ్రపాంతం. నిత్యం మంచు కురిసే ఈ ్రపాంతంలో కవులు ఎక్కువ. ‘నేను కవిత్వం రాయను. కాని ప్లేట్లో పదార్థమే ఒక కవిత్వమంత అందంగా అమర్చగలను’ అంటుంది రుక్సార్. ఫుడ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేసిన రుక్సార్ అందరిలా ఏ లెక్చరర్ పోస్ట్‌కో వెళ్లలేదు. ‘నాకు ఆహారం మీద సంపూర్ణ అవగాహన ఉంది. ముఖ్యంగా ఫ్రోజెన్ ఫుడ్‌ను సరిగా అమ్మగలిగితే తక్షణం వేడి చేసుకుని తినాలనుకునేవారికి మేలు జరుగుతుంది. కాని ఆహారంలో కల్తీ ఎక్కువ. ఈ కల్తీ విషంతో సమానం. అందుకే నేను ఏ కల్తీ లేని ఫ్రోజెన్ ఫుడ్‌ను అమ్మాలని ఖాలిస్ ఫుడ్స్ పేరుతో చిన్న సంస్థను మొదలుపెట్టాను. చికెన్ ఉత్పత్తులను కశ్మీర్లో అమ్ముతున్నాను. కశ్మీర్లో ఉద్యోగం చేయడం కన్నా ఉద్యోగాలు కల్పించడమే ఎక్కువ అవసరం అని నేను భావిస్తాను. నిరుద్యోగం పోవాలంటే ఇలాగే చేయాలి. నా సంస్థ బాగా నడుస్తోంది. కాని దేశవ్యాప్తంగా పంపాలంటే కొన్ని చిక్కులు ఉన్నాయి. ఈ లోపు నేను, నా బ్రాండ్ తెలియడానికి మాస్టర్ షెఫ్ ్రపోగ్రామ్‌కు వచ్చాను’ అని తెలిపింది రుక్సార్. అంతే తేడా ‘వంట అందరు ఆడవాళ్లూ చేస్తారు. కాని ఫుడ్ షోలలో ఆ వంటను శాస్త్రీయంగా చేయాలి. అంతే తేడా. కశ్మీర్లో వంట తెలిసిన యువతీ యువకులు బాగానే ఉన్నారు. నేను ఈ షో ద్వారా గడించిన అనుభవంతో వారికి సాయం చేయాలనుకుంటున్నాను. ఆహారం తయారు చేయడంలో మెళకువలు తెలిపి వారు ఫుడ్ జాయింట్లు ఏర్పాటు చేసుకుని తమ కాళ్ల మీద తాము నిలబడేలా చూడాలనుకుంటున్నాను. ఇందుకు కావాల్సిన సామాగ్రి నేనే సమకూరుస్తాను’ అంది. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న రుక్సార్ తన భర్త సాదిక్ అహ్మద్ సహకారం వల్లే ఇలా షోకు వచ్చినట్టుగా తెలిపింది. ‘ఆడవాళ్లూ.. ప్రయత్నించండి. ఓడిపోవద్దు’ అనేది రుక్సార్ సందేశం. -
సంకల్పమే సగం బలం
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్య చట్టం ఊగిసలాడుతున్న సమయం అది. శాసన నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం అవసరాన్ని గుర్తించారామె. ‘ఐ విల్’ (ఇండియన్ ఉమెన్ ఇన్ లీడర్షిప్) కోర్సు చేశారు. మహిళల జ్ఞానం... విజ్ఞత పరిపూర్ణమైనదని గ్రామీణమహిళలను చైతన్యవంతం చేశారు. బ్యూటీ కాంటెస్ట్ కూడా సామాజిక చైతన్యానికి ఒక మాధ్యమం అని గుర్తించారు. ఇప్పుడు ఆ కిరీటాన్ని కూడా గెలుచుకుని... తెలుగు రాష్ట్రాల్లో విజేతగా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీలలో తనను తాను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. డాక్టర్ విజయ శారదారెడ్డి... విద్యాసంస్థలను నిర్వహించిన దిట్ట. చదువు చెప్పాలన్నా, చదువు చెప్పించాలన్నా తాను అంతకంటే పెద్ద చదువులు చదివి ఉండాలనేది ఆమె నమ్మకం. అందుకే ఎం.ఎ హిస్టరీ, ఎంఈడీ చేశారు. ఎంబీఏ, ఎం.ఎస్సీ. సైకాలజీ, ఎం.ఫిల్, పీహెచ్డీ చేశారు. గౌరవపూర్వకంగా మరో డాక్టరేట్ అందుకున్నారు. సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ పొందారు. పదివేల మందికి పైగా సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించారు. యూఎస్, యూకేల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చేశారు. బెంగళూరు ఐఐఎమ్ నుంచి ‘ఐ విల్’ కోర్సు చేశారు. ‘పెళ్లినాటికి నేను చదివింది బీఎస్సీనే. పై చదువులన్నీ పెళ్లి తర్వాతనే. పెళ్లి అనేది మహిళ అభివృద్ధికి దోహదం చేయాలి తప్ప, మహిళ ఎదుగుదలకు అవరోధం కాకూడదని, సంకల్ప బలం, భాగస్వామి సహకారం ఉంటే ఏదైనా సాధించగలమనే వాస్తవాన్ని సాటి మహిళలకు తెలియచెప్పడానికి ఇన్నేళ్లుగా నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనడంలో ఉద్దేశం కూడా అదే. ఈ పోటీల్లో అరవైఏళ్లు నిండిన వయసు మహిళల విభాగం ‘సూపర్ క్లాసిక్’లో పాల్గొని ‘మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ విజేతనయ్యాను’’ అన్నారామె. ఉన్నది ఒకటే ఆప్షన్! మిసెస్ ఇండియా పోటీల్లో భాగంగా ‘తెలంగాణ– ఆంధ్రప్రదేశ్’ సూపర్ క్లాసిక్ ఫైనల్స్ హైదరాబాద్‌లో సెప్టెంబర్ 24వ తేదీన జరిగాయి. ఎనిమిది నెలల నుంచి దశల వారీగా జరిగిన పోటీలవి. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దాదాపు ఇరవై సెషన్స్ జరిగాయి. పోటీలో ఎవరెవరున్నారో కూడా తెలియదు. ఒక్కో సెషన్స్‌లో పాల్గొంటూ మాకిచ్చిన టాస్క్‌ను ఒక నిమిషం వీడియో ద్వారా ప్రెజెంట్ చేస్తూ వచ్చాం. ఈ పోటీల ద్వారా నాకు ఓ కొత్త ప్రపంచం గురించి తెలిసింది. మేధోపరమైన జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, మానసిక పరిణతి– పరిపక్వత, సమయానుకూలంగా స్పందించడం, సమాజాన్ని అర్థం చేసుకునే కోణం వంటివన్నీ ఉన్నాయి. నా పోటీదారుల బలాలేమిటో నాకు తెలియదు. నాకున్న ఆయుధం ‘నేను గెలిచి తీరాలి’ అనే పట్టుదల మాత్రమే. పోటీల్లో పాల్గొనప్పుడు మనకుండేది గెలవాలనే ఆప్షన్ ఒక్కటే. ప్లాన్ బీ ఉండకూడదు. ఏ అవకాశాన్నీ తేలిగ్గా తీసుకోలేదు. ప్రతి రౌండ్లో ప్రజెంటేషన్స్ చాలా థియరిటికల్‌గా ఇచ్చాను. ఫైనల్ రౌండ్లో విజేతలను ప్రకటించేటప్పుడు కూడా ‘నేను రన్నర్ అప్ కాదు’ అనుకుంటూ ఆత్మస్థయిర్యంతో ఉండగలిగాను. ఇవే విజేతను చేశాయి! మన సమాజంలో... అరవై ఏళ్లు వచ్చాయంటే ‘ఒక చోట కూర్చుని కృష్ణా! రామా! అనుకునే సమయం, అనే భావనను మహిళలు కూడా ఒంటబట్టించుకున్నారు. నిజానికి భగవంతుడిని తలుచుకోవడానికి వార్ధక్యం రానవసరం లేదు. నా దైనందిన జీవితంలో ఎప్పుడూ దైవపూజ కూడా ఒక భాగంగా ఉండేది. ఉదయం మూడున్నరకు రోజు మొదలయ్యేది. వంట, పూజ, ఇంటి పనులన్నీ ముగించుకుని ఏడున్నరకంతా స్కూల్లో ఉండేదాన్ని. అప్పట్లో రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాల్సిన అవసరమే నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా నేను చెప్పేదేమిటంటే... అరవై నిండాయని మనతెలివితేటలు, అనుభవాలను అటకెక్కించాల్సిన అవసరం లేదు. కుటుంబం కోసం పని చేయాల్సిన అవసరం లేకపోతే సమాజం కోసం పని చేద్దాం. చిన్నప్పుడు మనకు తీరకుండా ఉండిపోయిన సరదాలను తీర్చుకుందాం. నాకు బొమ్మలేయడం ఇష్టం. ఇప్పుడు ప్రశాంతంగా బొమ్మలు వేసుకుంటున్నాను. మహిళలు సాధించలేనిది లేదు! చంద్రయాన్ ప్రాజెక్టులో తమను తాము నిరూపించుకున్నా, రాకెట్‌తో సమానంగా దూసుకుపోతున్నా సరే మహిళలు సమానత్వ సాధన కోసం పోరాడాల్సిన దుస్థితి ఇంకా పోలేదు. మహిళలను అణచి వేసింది సమాజమే, ప్రోత్సహించాల్సింది కూడా సమాజమే. ప్రభుత్వాలు చట్టం చేసి సరిపుచ్చకుండా వాటి అమలుతోపాటు మహిళలకు ప్రోత్సాహం కల్పించాలి. ‘ఐ విల్’ కోర్సు చెప్పేది కూడా అదే. ప్రతి మహిళలో నాయకత్వ లక్షణాలు అంతర్లీనంగా ఉంటాయి. అవి బహిర్గతమయ్యే అవకాశం ఆమెకివ్వాలి. నేను గమనించినంత వరకు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న మహిళలకు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు ఉండడం లేదు. మధ్యతరగతి మహిళలు ఉన్నత చదువుల ఆకాంక్షను బ్యాంకు లోన్ల సహకారంతో సాధించుకుంటున్నారు. ఇక అల్పాదాయ వర్గాల మహిళలు మాత్రం ఎటువంటి అవకాశం లేక ఆశలను చిదిమేసుకుంటున్నారు. ఈ గ్యాప్‌ని స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రభుత్వాలు భర్తీ చేయగలిగితే వారి జీవితాలు కూడా కాంతులీనుతాయి. నా వంతుగా మహిళలను చైతన్యవంతం చేయడానికి ప్రతి మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్నాను’’ అన్నారామె పరిపూర్ణంగా నవ్వుతూ. ప్రతి రోజూ అమూల్యమే! సౌందర్యమంటే బాహ్యసౌందర్యమే అయితే నా ఎత్తు, నా మేనిఛాయ అందాల పోటీలకు సరిపోవు. ప్రకటన చూసిన వెంటనే ఫోన్ చేసి మాట్లాడాను. ‘బ్యూటీ’ అనే పదం పరిధిని విస్తరించడంతోపాటు బ్యూటీ అంటే దేహసౌందర్యమనే అపోహను తొలగించడం, అందం అంటే కొలతలకు లోబడి ఉండడం కాదని తెలియచేయడంతోపాటు ‘ఇన్నర్ బ్యూటీ’ ప్రాధాన్యతను సమాజానికి తెలియచెప్పడానికే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళ జీవితం పెళ్లికి ముందు – పెళ్లి తర్వాత అనే వర్గీకరణ చట్రంలో ఉండిపోతోంది. ఆ చట్రంలో ఉండిపోయిన చాలామంది మహిళల్లో తమను తాము కోల్పోయిన భావన కలుగుతుంటుంది. మన జీవితంలో ప్రతిరోజూ అమూల్యమైనదేనని మహిళలకు తెలియచెప్పడానికి నేను ఈ పోటీలో పాల్గొన్నాను. – డాక్టర్ విజయ శారదారెడ్డి మిసెస్ తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
Naina Jaiswal: నైనా జైస్వాల్‌కు డాక్టరేట్.. అతి పిన్న వయసులోనే..
Table Tennis Player Naina Jaiswal: దేశంలోనే అతిపిన్న వయస్కురాలైన ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ 22 ఏళ్ల వయస్సులోనే పీహెచ్‌డీలో డాక్టరేట్ డిగ్రీ పొందారు. హైదరాబాద్‌లోని నారాయణగూడ ప్రాంతానికి చెందిన నైనా జైస్వాల్.. ఏపీలోని రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి ‘మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్ పాత్రపై అధ్యయనం’ అనే అంశంపై నైనా జైస్వాల్ పరిశోధన చేశారు. ఈ సందర్భంగా నైనా జైస్వాల్‌ను రిసెర్చ్ గైడ్, యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ఎం. ముత్యాల నాయుడు అభినందించారు. కాగా టీటీ ప్లేయర్‌గా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు అందుకున్న నైనా.. చదువులోనూ తనకు తానే సాటి. ఎనిమిదేళ్లకే పదో తరగతి కంప్లీట్ చేసిన నైనా.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్, 15 ఏళ్లకు మాస్టర్స్‌లో డిగ్రీ సాధించారు. ఈ క్రమంలో ఆసియాలోనే చిన్న వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అరుదైన రికార్డు సృష్టించారు. మోటివేషనల్ స్పీకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నైనా.. తన తల్లి భాగ్యలక్ష్మితో కలిసి ఎల్ఎల్బీ చదువుతున్నారు. చదవండి: నేను మూడేళ్లు ఇక్కడే ఆడాను.. అతడొక అద్భుతం! ఏ బౌలర్ కైనా చుక్కలే: రోహిత్ -
దివ్యమైన ప్రతిభ
సత్యభామ.. శ్రీ కృష్ణుడు.. వేంకటేశ్వరుడు.. పద్మావతి.. దివ్యమైన పాత్రలన్నింటినీ ఆమె ఆహార్యంతో అందంగా రూపుకడుతుంది.వైకల్యం ఆమె అభిలాషను అడ్డుకోలేకపో యింది. అడుగు కదపలేదు అనుకున్నవారి అంచనాలను ఆవలకు నెట్టి పట్టుదలతో అవరోధాల మెట్లను అధిరోహించింది. రంగస్థల నటిగా గుర్తింపుతో పాటు స్వరమాధురిగానూ పేరొందింది. కళారంగంలో రాణిస్తూనే దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సేవా పెన్నిధిగానూ ప్రశంసలు అందుకుంటోంది.ఆమెప్రతిభకు గుర్తింపుగా మూడుసార్లు రాష్ట్రపతి పురస్కారం వరించింది.ఖమ్మం జిల్లావాసి అయిన డాక్టర్ పొట్టబత్తిని పద్మావతి కృషి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. హైదరాబాద్‌లోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని మునుగనూరులో ఉంటున్నారు డాక్టర్ పద్మావతి. ఆమెకు ఏడాది వయస్సులో పో లియో సోకడంతో రెండు కాళ్ళు చచ్చుబడి పో యాయి. తన పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు ఆమె భవిష్యత్తుపై ఆందోళనకు గురయ్యేవారు. అయితే పద్మావతి ఐదేళ్ల వయస్సులో సెయింట్ మేరీస్ పో లియో పునరావాసం పర్యవేక్షకురాలు ఆస్ట్రేలియాకు చెందిన క్లారా హీటన్ కు పరిచయం అయ్యారు. క్లారా దత్తత తీసుకోవడంతో పద్మావతి జీవితం కొత్త మలుపు తిరిగింది. క్లారా పర్యవేక్షణలో పద్మావతికి పలు మార్లు శస్త్ర చికిత్స జరిగింది. పాదాలు, నడుము.. భాగాలు శస్త్ర చికిత్సతో సరి చేశారు. అప్పటి వరకు మంచానికే పరిమితమైన ఆమె క్యాలిపర్సు, కర్రలు సహాయంతో క్రమంగా అడుగులు వేయడం మొదలు పెట్టింది. కాలు కదల్చలేని స్థితిలో మంచం మీద ఉండి చదువులో ప్రతిభ కనబరుస్తూ ఎదిగిన తీరు పద్మావతి మాటల్లో మన కళ్ల ముందు కదలాడుతుంది. సేవాభిలాష గానం, నాటక రంగంలో ఉన్న ఆసక్తితో పద్మావతి క్యాలిపర్సు సహాయంతోనే ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. సత్యభామ, శ్రీకృష్ణుడు, వేంకటేశ్వరుడు తదితర పాత్రలను సమర్ధంగా పో షించి దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చి, ఎన్నో అవార్డులను పొందారు. వేగేశ్న ఫౌండేషన్ ద్వారా సంగీతంలో శిక్షణపొందడంతో పాటు, డిగ్రీ పూర్తి చేసి, ఆ సంస్థలోనే సంగీత ఉపాధ్యాయురాలుగా దివ్యాంగులకు శిక్షణ ఇస్తున్నారు. దివ్యాంగులకు సాయపడాలనే సంకల్పంతో మునుగనూరులో పద్మావతి ఇ న్ స్టిట్యూట్ ఫర్ ద (డిజ్) ఏబుల్డ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా దివ్యాంగులకు కంప్యూటర్, నృత్యం, సంగీతం, టైలరింగ్.. వంటి వృత్తి విద్యా కోర్స్‌లలో శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పిస్తున్నారు. ప్రశంసలు.. పురస్కారాలు పద్మావతి ప్రతిభకు ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. మూడుసార్లు రాష్ట్రపతి అవార్డులు అందుకున్నారు. ఓ వైపు కళలు, మరోవైపు సామాజిక సేవారంగంలో ప్రతిభ చూపుతున్న ఆమెను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సెన్సార్ బోర్డు సభ్యురాలుగా, నంది అవార్డు జ్యూరీ కమిటీ మెంబర్‌గా సేవలందించిన పద్మావతి 2017లో రాష్ట్ర ప్రభుత్వం రోల్ మోడల్ అవార్డును అందుకున్నారు.. కళాకారిణిగా ప్రతిభ చూపినందుకు 2009లో రాష్ట్రపతి అవార్డు లభించింది. వైకల్యంతో బాధపడుతున్నా పలు రంగాలలో రాణించినందుకు గాను 2011లో రాష్ట్రపతి చేతులు మీదుగా స్త్రీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు ఆమె. దివ్యాంగులకు చేస్తున్న సేవను గుర్తించి 2022లో రాష్ట్రపతి సర్వశ్రేష్ట దివ్యాంగ న్ అవార్డుతో సత్కరించారు. దివ్యాంగులకు సేవచేయాలనే సదాశయంతో నడుపుతున్న ఇన్స్టిట్యూట్కు చేయూతనందిస్తే మరిన్నో ప్రయోజన కరమైన పనులను చేయగలననే ఆశాభావాన్ని పద్మావతి వ్యక్తపరుస్తు న్నారు. తన గమనమే ప్రశ్నార్ధకం అవుతుందనుకున్నవారి మాటలను పక్కనపెట్టి, పట్టదలతో ప్రయత్నించి, గెలుస్తున్న ఆమె జీవితం ఎందరికో ఆదర్శమవుతుంది. – శ్రీరాం యాదయ్య, హయత్‌నగర్, హైదరాబాద్, సాక్షి -
ప్రశ్నపత్రం ప్రచురణ ఎక్కడనే పరిస్థితి దాపురించింది
కేపీహెచ్‌బీకాలనీ: విద్యార్థులు గతంలో పరీక్షలంటే ఎలా చదవాలని అడిగే వారని.. ప్రస్తుతం ప్రశ్నపత్రం ప్రచురణ ఎక్కడ జరుగుతోందని అడిగే పరిస్థితి దాపురించిందని రాష్ట్ర గవర్నర్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించి పరోక్షంగా పోటీ పరీక్షల లీకేజీ అంశాన్ని ప్రస్తావించారు. పదేళ్ల కిందట మెడికల్ కళాశాలలో తాను విద్యార్థులకు క్లాస్ తీసుకుంటుండగా పరీక్షలు రాసేందుకు సర్వ సన్నద్ధమైన ఓ విద్యార్థి తనను ప్రశ్న పత్రాలు ఎక్కడ తయారవుతాయంటూ ప్రశ్నించడం ఆ నాడు జోక్‌గా ఉంటే ప్రస్తుతం అది వాస్తవరూపం దాల్చడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జేఎన్టీయూహెచ్ 11వ స్నాతకోత్సవం శనివారం వర్సిటీ ఆవరణలోని ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా పీహెచ్డీ, ఎంటెక్, ఎం.ఫార్మ్. ఎంబీఏ, ఎంఎస్‌ఐటీ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఎస్, ఫార్మ్–డి, ఫార్మ్ డి (పీబీ), పీజీ డిప్లొమా, బీటెక్, ఇంటిగ్రేటెడ్ అండ్ ఎంఓయూ కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులకు పట్టాలతో పాటు పతకాలను ప్రదానం చేశారు. విద్యార్ధులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ గురువుల ద్వారా ఆర్జించిన జ్ఞానాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా సమాజ వికాసానికి పంచినప్పుడే సార్ధకత లభిస్తుందన్నారు. సమాజానికి ఉపయోగపడని విద్యా డిగ్రీలు, పతకాలు ఎన్ని సాధించినా వ్యర్ధమేనని వ్యాఖ్యానించారు. నిత్యం టెక్నాలజీతో సహజీవనం చేస్తున్న ప్రస్తుత రోజుల్లో ఆ సాంకేతికతను సన్మార్గంలో వినియోగించుకున్నప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇంటా, బయటా ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో కొంతమంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. ఉద్యోగాలు వెతుక్కునే స్థితి వద్దని, ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలని పిలుపునిచ్చారు. ఎప్పుడూ కరెన్సీ మాత్రమే లెక్కబెట్టడం కాదని, కేలరీస్‌ను కూడా లెక్కించాలని పేర్కొంటూ ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేశారు. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉద్భోదించారు. -
వరంగల్‌కు చెందిన కిరణ్మయికి డాక్టరేట్
సాక్షి, వరంగల్: చెన్నైలోని ప్రతిష్టాత్మక బీఎస్ అబ్దుల్ రహమాన్ క్రీసెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో చేసిన పరిశోధనకు గాను వరంగల్ నగరానికి చెందిన ఠంయ్యాల కిరణ్మయికి డాక్టరేట్ లభించింది. ఎకోఫ్రెండ్లీ ఫర్ది సింథసిస్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ బెస్ట్ హిటిరోసైకిల్స్ అనే అంశంపై డాక్టర్ కార్తికేయన్ పర్యవేక్షణలో ఆమె పీహెచ్డీ పూర్తి చేశారు. కిరణ్మయి గతంలో వరంగల్ ఎల్బీ, సీకేఎం, హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విద్యను అభ్యసించారు. -
రావినూతల శశిధర్‌కు న్యాయశాస్త్రంలో పీహెచ్డీ డాక్టరేట్
ఉస్మానియా యూనివర్సిటి న్యాయశాఖ విభాగంలో ‘‘యాంటి టెర్రరిజం లాస్ ఇన్ పోస్ట్ 9/11 వరల్డ్ అండ్ ఇండియన్ లాస్ - ఎ కంపారేటివ్ స్టడీ’’ అనే అంశంపై ప్రొఫెసర్ ఎస్. బీ. ద్వారకానాథ్ గారి పర్యవేక్షణలో పరిశోధన చేసిన రావినూతల శశిధర్‌కు ఉస్మానియా యూనివర్సిటి డాక్టరేట్‌ను ప్రదానం చేసింది . అమెరికా జంట టవర్ల పేలుళ్ళ అనంతరం తీవ్రవాదాన్ని అణిచివేయడానికి వివిధ ప్రపంచ దేశాలు చేసిన తీవ్రవాద వ్యతిరేఖ చట్టాలు మరియు వాటి పనితీరు, ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు వాటి ప్రభావం , ఐక్య రాజ్య సమితి వివిధ విభాగాల ఏర్పాటు మరియు వాటి పనితీరు, భారత దేశంలో వివిధ రూపాలలో ఉన్న తీవ్రవాద మూలాలు, తీవ్రవాదాన్ని అణిచివేయడంలో భారత్ లో ప్రస్తుతం ఉన్న చట్టాల పనితీరు, నూతన చట్టాల ఆవశ్యకత, తీవ్రవాద వ్యతిరేఖ చట్టాల అమలులో భారతదేశ కోర్టుల పాత్ర, కఠిన చట్టాల ఆవశ్యకత - మానవ హక్కులు రక్షణ తదితర అంశాలపై లోతైన అధ్యయనంతో కూడిన పరిశోధన థిసిస్‌ను రావినూతల శశిధర్ సమర్పించారు. ఈ పరిశోధనకు సంబంధించిన పలు అంశాలపై రావినూతల శశిధర్ వ్రాసిన పలు ఆర్టికల్స్‌ను ప్రముఖ లీగల్ జర్నల్స్ ప్రచురించాయి, పరిశోధనలో భాగంగా జాతీయ భద్రతకు సంబంధించిన పలు జాతీయ స్థాయి సెమినార్లలో కూడా శశిధర్ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య తీవ్రవాదాన్ని అణిచివేయడంలో ప్రస్తుత చట్టాల పనితీరుపై విస్తృత పరిశోధన చేసి అంతర్జాతీయ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై మరియు భారత దేశంలోని చట్టాలలో రావాల్సిన మార్పులపై ఈ పరిశోధనలో చేసిన పలు సూచనలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని పలువురు న్యాయ నిపుణులు శశిధర్ ను అభినందిస్తున్నారు. రాష్ట్రంలో అనేక విద్యార్థి ఉద్యమాలకు మరియు సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన రావినూతల శశిధర్.. తీవ్రవాద వ్యతిరేఖ చట్టాలపై విస్తృత పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డు సాధించడం పై పలువురు అభినందించారు. -
సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర్రావుకు డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర్రావుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ఆధునిక తెలుగు సాహిత్యం–లౌకిక వాదం అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి ఆయనకు ఈ డాక్టరేట్ లభించింది. ఆచార్య చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో నాగేశ్వర్రావు సిద్ధాంత గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామానికి చెందిన అండాలు, నర్సింహ దంపతులకు 1964లో జన్మించిన నాగేశ్వర్రావు.. గత 33 ఏళ్లుగా పలు దినపత్రికల్లో పనిచేస్తూ 6 దేశాల్లో పర్యటించారు. ప్రారంభం నుంచి వార్త దినపత్రికలో పని చేస్తున్న ఆయన ప్రస్తుతం స్టేట్ బ్యూరో చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నాగేశ్వర్రావుకు ఓయూ డాక్టర్ డిగ్రీ లభించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. -
సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్
-
డైరెక్టర్ శంకర్‌కు అరుదైన గౌరవం
తమిళ సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు శంకర్. జెంటిల్మెన్తో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ముదల్వన్, బాయ్స్, శివాజీ, ఇండియన్, ఎందిరన్, ఐ, ఎందిరన్–2 ఇలా ఒక దానికి ఒకటి పూర్తి భిన్నంగా చిత్రాలు చేసి స్టార్ డైరక్టర్‌గా ప్రసిద్ధికెక్కారు. అలాగే సినీ దర్శకుడిగా 30 ఏళ్ల మైలురాయిను టచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు వేల్స్ ఇంజినీరింగ్, రీసెర్చ్ విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. శుక్రవారం పల్లావరంలోని వర్సిటీ ఆవరణలో 12వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు ధ్రువపత్రాలు, పతకాలను ప్రదానం చేశారు. అనంతరం వివిధ రంగాలలో విశేష సేవలందించిన ప్రముఖులను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు. అందులో దర్శకుడు శంకర్, అణు శాస్త్ర విజ్ఞాన కేంద్రం డైరక్టర్ అజిత్‌కుమార్ మొహతీ, భారతీయ క్రికెట్ క్రీడాకారుడు సురేష్ రైనా, నాటి జూన్ బ్లూ గ్రూప్ అధ్యక్షుడు విక్రమ్ అగర్వాల్ గౌరవ డాక్టరేట్ పురస్కారాలు అందుకున్నారు. ముందుగా వేల్స్ విశ్వవిద్యాలయం చైర్మన్ ఐసరి గణేష్ అతిథులకు స్వాగతం పలికారు. -
సురేష్ రైనాకు అరుదైన గౌరవం..!
Suresh Raina Doctorate: టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనాకు అరుదైన గౌరవం దక్కింది. చెన్నైలోని ప్రముఖ వేల్స్ యూనివర్శిటీ రైనాను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా రైనా అభిమానులతో పంచుకున్నాడు. "ప్రతిష్టాత్మక వేల్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ గౌరవాన్ని పొందినందుకు సంతోషంగా ఉంది. నాపై చూపించిన ప్రేమకు, అభిమానానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చెన్నై నాకు సొంత ఇల్లు వంటింది. ఇది ఇప్పటికీ నాకు చాలా ప్రత్యేకమైనదిగా ఉండిపోతుంది" అని రైనా ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత రైనా ఐపీఎల్లో మాత్రం కొనసాగాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రైనా ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. కాగా ఐపీఎల్-2022కు ముందు రైనాను చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా రీటైన్ చేసుకోలేదు. దీంతో అతడు వేలంలో పాల్గొన్నాడు. అయితే మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనాను ఐపీఎల్-2022 వేలంలో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవడం అందరనీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక వేలంలో అమ్ముడుపోని రైనా ఐపీఎల్లో కామెంటేటర్‌గా సరికొత్త అవతరామెత్తాడు. ఇక భారత తరపున 18 టెస్టులు, 226 వన్డేలు,78 టీ20లు ఆడిన రైనా.. వరుసగా 768, 5615, 1605 పరుగులు సాధించాడు. I am humbled to receive this honour from the outstanding institution VELS Institute of Science & technology & Advanced Studies @VelsVistas @IshariKGanesh Sir. I am moved by all the love & thank you from the bottom of my heart. Chennai is home & it has a special place for me ❤️✨ pic.twitter.com/bZenkMwid8 — Suresh Raina🇮🇳 (@ImRaina) August 5, 2022 చదవండి: KL Rahul: వాళ్లు ఉన్నారుగా! మనకి కేఎల్ రాహుల్ అవసరమా?! అనిపించేలా.. -
నేడు జస్టిస్ ఎన్వీ రమణకు ఓయూ గౌరవ డాక్టరేట్
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ప్రదానం చేయనున్నట్లు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. గురువారం ఆయన వర్సిటీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్, ఓయూ చాన్స్‌లర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షతన వర్సిటీ క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే 82వ స్నాతకోత్సవంలో ఈ డాక్టరేట్‌ను అందజేయనున్నట్లు చెప్పారు. ఇది ఓయూ 48వ గౌరవ డాక్టరేట్ అని, 21 ఏళ్ల అనంతరం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దానిని ప్రదానం చేస్తున్నామని వివరించారు. 361 మందికి పీహెచ్డీ డిగ్రీలు, వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులకు 55 బంగారు పతకాలు అందచేయనున్నట్లు వీసీ తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణ, ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీనగేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
Narala Rama Reddy: అవధాన ఉద్దండుడు
సాక్షి, ప్రొద్దుటూరు : ఆయన అవధానంలో పాండిత్య ప్రదర్శన ఉండదు. అందమైన కవిత్వం ఉంటుంది. సాహిత్యంలో బరువైన పదసంపద ఉండదు. సున్నితమైన భావాలతో హృదయ స్పందన కలిగించడమే ఆయన శైలి. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు 1980 ప్రాంతంలో సరస్వతి పుత్రుడు పుట్టపర్తి నారాయణాచార్యులకు సాహిత్య రంగంలో గౌరవ డాక్టరేట్‌ను బహూకరించారు. 42 ఏళ్ల తర్వాత వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అవధాని నరాల రామారెడ్డికి ఇదే యూనివర్సిటీ వారు గత నెల 24న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. 1948 జూన్ 22న నరాల బాలిరెడ్డి, వెంకటమ్మ దంపతులకు రెండో సంతానంగా రామారెడ్డి జన్మించారు. ఐదో తరగతి తర్వాత 6 నుంచి 11వ తరగతి వరకు శ్రీకృష్ణ గీర్వాణ ఉన్నత పాఠశాలలో చదివారు. అక్కడ తన పెద్దనాన్న కుమారుడు నరాల వెంకటరామిరెడ్డి ప్రధానోపాధ్యాయుడు. 1959లో గీర్వాణ పాఠశాలలో చేరినప్పుడే జీవితం మలుపు తిరిగింది. సంస్కృతాంధ్ర భాషలపై పట్టు సాధించారు. 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు పల్లె వెంకటరెడ్డి తెలుగు పాఠాలు బోధించారు. తెలుగు పండితులైన పల్లె వెంకటరెడ్డి పారిజాతపహరణం నాటకాన్ని రచించారు. ఆయనలాగే పద్యాలు రాయాలని రామారెడ్డి ప్రయత్నం చేశారు. 1964లో 11వ తరగతి ఉత్తీర్ణుడైన తర్వాత ఉన్నత చదువులు చదివేందుకు ప్రొద్దుటూరులో డిగ్రీ కళాశాల లేదు. స్థానికంగా పాలిటెక్నిక్ కళాశాల మాత్రమే ఉండగా.. ఆ చదువుపై ఇష్టం లేకపోవడంతో తిరుపతిలోని టీటీడీ నిర్వహిస్తున్న ప్రాచ్య కళాశాలలో ఏ విద్వాన్ చదవడానికి సిద్ధపడ్డారు. చదువుతోపాటు ఉచిత భోజన వసతి కల్పిస్తుండటంతో ప్రాచ్య కళాశాలలో చేరారు. ప్రాచ్య కళాశాలలో ప్రవేశించిన తర్వాత సంస్కృతాంధ్ర భాషలపై మక్కువ పెంచుకుని పద్యాలను అలవోకగా అల్లే శక్తిని సంపాదించారు. 16వ ఏటనే అవధానం 1965లో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో బులుసు వెంకటరామమూర్తి అష్టావధానం జరిగింది. ఈ అవధానాన్ని చూసిన రామారెడ్డి హాస్టల్ గదుల్లోనే తోటి విద్యార్థులతో అవధానం నిర్వహించేవారు. అదే ఏడాది స్థానిక రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రప్రథమ అవధానం జరిగింది. విజయవంతంగా నిర్వహించినందుకు పండితులు ఆయనను ప్రశంసించారు. విద్యార్థి దశలోనే శ్రీకాళహస్తి, పాకాల, చిత్తూరు, పుత్తూరు ప్రాంతాల్లో 20 అవధానాలు నిర్వహించారు. 1968లో ఎ.విద్వాన్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. తాను విద్యాభ్యాసం చేసిన శ్రీవెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగ బాధ్యతలను చేపట్టాలనుకున్నారు. తండ్రి అకాల మరణంతో కుటుంబ బాధ్యతలు నిర్వహించడానికి, తండ్రి చేసిన రూ.10 వేలు అప్పు తీర్చడానికి సోదరుడైన నరాల వెంకటరామారెడ్డి ప్రోద్బలం వల్ల ప్రొద్దుటూరులోని శ్రీమలయాళస్వామి ఓరియంటల్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. అధ్యాపకునిగా పని చేస్తూ.. ప్రైవేటుగా ఎంఏ (తెలుగు) పూర్తి చేశారు. 1972 మార్చి 30న కర్నూలు జిల్లా కోవెలకుంట్ల గ్రామానికి చెందిన గువ్వల యల్లారెడ్డి, పుల్లమ్మ ఏకైక పుత్రిక సరోజను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు సతీష్, కుమార్తెలు మనస్విని, ఉదయని ఉన్నారు. వీరు ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడ్డారు. అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి 2006లో పదవీ విరమణ చెందారు. చంధస్సు, అలంకారాలు, ప్రబంధాలను బోధించి విద్యార్థుల హృదయాల్లో చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశ, విదేశాల్లో అవధానాలు దేశ, విదేశాల్లో వందల అవధానాలు నిర్వహించారు. 1968లో అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లెలో చేసిన అవధానం జయప్రదం కావడం వల్ల.. అవధాన రంగంలో గుర్తింపు లభించింది. 1969లో బెంగళూరు ఆంధ్ర విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో, 1972లో జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నెల్లూరులో, 1974లో గుంటూరులో ప్రముఖుల సమక్షంలో అవధాన కార్యక్రమాలు నిర్వహించారు. 1973లో చెన్నైలో తాజ్కోరమండల్, అశోక్ హోటల్లో వేర్వేరుగా ప్రముఖల సమక్షంలో నిర్వహించారు. ఓ కార్యక్రమానికి పద్మశ్రీ డి.భానుమతి, మరో కార్యక్రమానికి సినీ నిర్మత ఎంఎస్ రెడ్డి అధ్యక్షత వహించారు. దేశ విదేశాల నుంచి ఆహ్వానాలు అందాయి. అమెరికాలో... 1992లో జూలైలో ‘ఆటా’ అధ్యక్షుడు టి.సదాశివారెడ్డి ఆహ్వానం మేరకు 9 వారాలపాటు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అష్టావధానాలను నిర్వహించి ప్రవాసాంధ్రుల ప్రశంసలు అందుకున్నారు. న్యూయార్క్‌లో శిరోమణి అవార్డు, న్యూజెర్సి, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలెస్, వాషింగ్టన్, హ్యూస్టన్, సెయింట్‌లూయిస్, డెట్రాయిట్ నగరాల్లో ప్రతిభ చాటారు. తర్వాత నాటా ఆహ్వానంతో మూడు మార్లు, ఆటా ఆహ్వానంతో నాలుగు మార్లు, తానా ఆహ్వానంతో ఒక సారి మొత్తం 8 సార్లు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అవధాన నైపుణ్యం ప్రదర్శించారు. డాలస్‌లో అష్టావధానం నిర్వహించి ‘అవధాన కౌస్తుభ’ బిరుదు పొందారు. చికాగోలో అష్టావధానం నిర్వహించి కనకాబి సత్కారంతోపాటు ‘అవధాని సౌరభౌమ’ బిరుదు పొందారు. ► నరాల రామారెడ్డి 1965 నుంచి 2018 వరకు సుమారు వెయ్యి అష్టావధానాలు నిర్వహించారు. ► 2012లో సంస్కృతంలో ప్రసిద్ధి గాంచిన శాలివాహన గాథాసప్తశతిలోని 300 శ్లోకాలను అనువాదం చేసి భావకవితా శైలిలో 300 తేటగీతులను తెలుగు పాఠకులకు అందించారు. 2018లో 400 పద్యాలతో ‘అవధాన సౌరభం’ గ్రంథాన్ని ప్రచురించారు. సంస్కృత సాహిత్యంలో అలంకార శాస్త్రంలో సుప్రసిద్ధ సంస్కృత శ్లోకాలు, కొన్ని చాటు శ్లోకాలు, ప్రసిద్ధం సంస్కృత కవుల శ్లోకాలను తెలుగులో అనువాదం చేసి ‘అనువాద మాధురి’ పేరుతో ప్రచురిస్తున్నారు. కర్ణుని జీవితంలో విశిష్ట ఘట్టాల ఆధారంగా కర్ణ జననం నుంచి సూర్యునిలో కలిసిపోవు వరకు ఇతివృత్తాన్ని తీర్చిదిద్ది ‘కర్ణభారతం’ అనే కావ్య రచన చేశారు. ► 978–80 ప్రాంతంలో శోభన్‌బాబు నటించి న ‘కార్తీక దీపం’, కృష్ట నటించిన ‘కలవారి సంసారం’ సినిమాలకు పాటలు రాశారు. ► 2000లో డాక్టర్ సి.నారాయణరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు, బండారు దత్తాత్రేయ సమక్షంలో రసమయి అవార్డు అందుకున్నారు. ► 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా హంస అవార్డు అందుకున్నారు. ► తిరుపతిలో చదివిన నరాల రామారెడ్డి 1971లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ అధ్యక్షతన, 1980లో దివాకర్ల వెంకట అవధాని, ఆ ఏడాదిలోనే శ్రీనివాస ఆడిటోరియంలో బీఎన్ రెడ్డి, 1981లో యూనివర్సిటీ రజతోత్సవం సందర్భంగా మహాకవి దాశరథ అధ్యక్షతన అవధాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ప్రతిభను గుర్తించిన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గత నెల 24న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. -
సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణకు డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణకు వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాను ప్రకటించింది. ‘తెలుగు సినిమాల్లో జానపద కథాంశాలు– అధ్యయనం’అనే అంశంపై డా.భట్టు రమేశ్ పర్యవేక్షణలో పరిశోధన చేశారు. 1896 నుంచి ఇప్పటివరకు 90 ఏళ్ల తెలుగు సినీ ప్రస్థానంలో 8,600 పైగా చలనచిత్రాలు తెలుగులో నిర్మాణమయ్యాయని ఈ పరిశోధనలో పేర్కొన్నారు. 1938 ‘గులేబకావళి కథ’తో మొదలైన జానపద సినిమాలు ‘బాహుబలి’వరకు సినీరంగంలో చూపిన ప్రభావాన్ని చారిత్రిక దృష్టితో, సమగ్ర వ్యూహంతో పరిశోధించారని, అంతర్జాతీయంగా వివిధ దేశాల జానపద గాథలు సినిమాలుగా తెరకెక్కిన తీరు, వేర్వేరు భారతీయ భాషల్లో వచ్చిన సినిమాల్లో జానపద కథాంశాల తీరు, తెలుగు సినిమాల్లో జానపద లక్షణాలు, కథాంశాల విశ్లేషణను ఈ పరిశోధనలో అందించారని పరిశీలకులు తెలిపారు. ఇప్పటిదాకా తెలియని ఎన్నో అంశాలను ఈ పరిశోధన వెల్లడి చేసిందని, భవిష్యత్ పరిశోధనలకు రిఫరెన్స్ పుస్తకంగా నిలుస్తుందని హరికృష్ణను అభినందించారు. -
లారెన్స్‌కు గౌరవ డాక్టరేట్
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్‌కు గౌరవ డాక్టరేట్ వరించింది. సినీ గ్రూప్ డాన్సర్‌గా జీవితాన్ని ప్రారంభించిన లారెన్స్ ఆ తర్వాత నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు, నిర్మాత అంటూ అంచలంచెలుగా ఎదిగారు. అయితే ఈయనలో సేవాభావం అనే మరో మానవతా కోణం కూడా ఉంది. ఎందరో అనాథలను వికలాంగులను చేరదీస్తూ వారికి కొండంత అండగా ఉండటంతో పాటు వారికోసం ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది: సాయి పల్లవి అదే విధంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా వెంటనే స్పందించి సాయం అందిస్తుంటారు. ఆయన సేవలను గుర్తించిన అంతర్జాతీయ నేర నిరోధక సంస్థ, మానవ హక్కుల సంఘం కలిసి గౌరవ డాక్టరేట్ ప్రకటించాయి. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగింది. రుద్రన్ చిత్ర షూటింగ్లో ఉన్న లారెన్స్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. బదులుగా ఆయన తల్లి హాజరై గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చదవండి: వైరల్.. వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్ స్టార్స్ -
భర్త ఆటో డ్రైవర్.. భార్యకు డాక్టరేట్
బంజారాహిల్స్ (హైదరాబాద్): భర్త ఆటో డ్రైవర్.. అయితేనేం అతని భార్య పట్టుదలతో డాక్టరేట్ సాధించారు. మహబూబ్‌నగర్ జిల్లా బొడ్డెమ్మ పాటలు, జనజీవన చిత్రన అనే అంశాన్ని పరిశోధనాంశంగా తీసుకుని తగిలి శ్యామల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సంపాదించారు. మహబూబ్‌నగర్ జిల్లా తెల్కపల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన శ్యామల బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఓయూ ఓరియంటల్ విభాగం తెలుగు శాఖ నుంచి డాక్టరేట్ పొందారు. శ్యామల ఆంధ్రసారస్వత పరిషత్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా బొడ్డెమ్మ ఆటలో పాటలను ముందు తరాల వారికి లిఖితరూపకంగా అందించాలనుకున్నారు. బొడ్డెమ్మ పాటలను పరిశోధనాంశంగా తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. తన పీహెచ్డీ సిద్ధాంత గ్రంథానికి సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు పర్యవేక్షకులుగా వెంకట్‌రెడ్డి, సిల్మా నాయక్ సహకరించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా శ్యామల భర్త చెరుకు రాంచందర్ ఆటో నడుపుతూ తనను చదివించారని ఆయన కష్టాన్ని వృథా చేయకుండా ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. (క్లిక్: 80వ పుట్టినరోజు.. కేజీల విత్తనాలు) -
ప్రముఖ నటుడు రవిచంద్రన్‌కు గౌరవ డాక్టరేట్
శివాజీనగర: బెంగళూరు నగర విశ్వవిద్యాలయం ప్రప్రథమంగా స్నాతకోత్సవంలో కన్నడ సినీ నటుడు, క్రేజీ స్టార్ వి. రవిచంద్రన్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. సోమవారం సెంట్రల్ కాలేజీ ఙ్ఞానజ్యోతి సభా మందిరంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ చేతుల మీదుగా రవిచంద్రన్ సహా 30మంది వివిధ రంగాల ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను బహుకరించారు. మంత్రి సీఎన్ ఆథ్వథ్ నారాయణ మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్లుగా సినిమాలో చూపించడం ఆయన కళ అని అన్నారు. -
తమిళ హీరో శింబుకు గౌరవ డాక్టరేట్, ఏ యూనివర్శిటీ ఇచ్చిందంటే
తమిళ స్టార్ హీరో శింబుకు అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకుగానూ తమిళనాడులోని ప్రముఖ వేల్స్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ విషయాన్ని శింబు స్యయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ సందర్భంగా తనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన వేల్స్ యూనివర్శిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు. ఈ గౌరవాన్ని తమిళ సినిమాకు, తన తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు. చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. కాగా తన జీవితంలో సినిమా ఉండటానికి వారే కారణమని, అందుకే ఈ గౌరవాన్ని వారిక అంకితమిస్తున్నట్లు చెప్పాడు. అంతేగాక తనని ఇంతవరకు తీసుకువచ్చిన తన అభిమానులకు ఈ సందర్భంగా శింబు ధన్యవాదాలు తెలిపాడు. ఈ కార్యక్రమానికి శింబు తల్లిదండ్రులు టి.రాజేందర్, ఉష కూడా హాజరయ్యారు. దర్శకుడు, నటుడు టి. రాజేందర్ కుమారుడిగా బాల నటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శింబు హీరోగా ఆకట్టుకున్నాడు. అంతేగాక విభిన్న పాత్రలను ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తమిళనాట ఎంతోమంది అభిమానులను, ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు శింబు. Thanking all the committee members of Vels University & @IshariKGanesh for bestowing the Honorary Doctorate upon me. I dedicate this huge honour to Tamil cinema, my Appa & Amma! Cinema happened to me because of them! Finally - my fans, #NeengailaamaNaanilla Nandri Iraiva! ❤️ pic.twitter.com/YIc6WyGCvR — Silambarasan TR (@SilambarasanTR_) January 11, 2022 -
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి ఎన్టీఆర్ వర్సిటీ డాక్టరేట్
లక్డీకాపూల్: ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డాక్టరేట్‌తో గౌరవించింది. యూనివర్సిటీ 22, 23 వార్షికోత్సవాల్లో భాగంగా నాగేశ్వర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, వర్సిటీ చాన్స్‌లర్ అయిన బిశ్వ భూషణ్ హరిచందన్ డాక్టరేట్ ప్రదానం చేశారు. గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌కు వచ్చిన సందర్భంగా డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డిని గవర్నర్ సత్కరించారు. వైద్య వృతిలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి నిబద్ధతకు ఈ అవార్డు మరో మైలురాయి వంటిదని గవర్నర్ అన్నారు. -
ఎన్ఆర్ఐ కోటేశ్వరరావుకు గౌరవ డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: తన సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ఎన్నో అవార్డులు స్వీకరించిన ఎన్ఆర్ఐ కోటేశ్వరరావుకు ఏపీయూ వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు తాజాగా గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు. ఈ విషయాన్ని సోమాజిగూడలో ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన స్వగ్రామమైన నెల్లూరు జిల్లా కావలికి ఏదైనా చేయాలనే తపనతో పలు సేవా కార్యక్రమాలు చేశానన్నారు. అందులో భాగంగా బ్లడ్‌బ్యాంక్, కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా శ్మశానవాటిక ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలకు గతంలో హిందూ రతన్ అవార్డుతో పాటు పలు అవార్డులు వచ్చాయన్నారు. తాజాగా గౌరవ డాక్టరేట్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. డాక్టరేట్ రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేస్తానని ఆయన తెలిపారు. -
ఎన్జీఆర్ఐ ఉద్యోగికి డాక్టరేట్
వరంగల్ నగరానికి చెందిన ఆడేపు శ్రీధర్‌కి ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో ఆయన ఈ పట్టా అందుకున్నారు. సైన్స్ కమ్యూనికేషన్ ఇన్ సీఎస్ఐఆర్ ఆర్గనైజేషన్స్ - ఏ సెంట్రో మెట్రిక్స్టడీ ఆన్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఆడేపు శ్రీధర్ రీసెర్చ్ పేపర్స్ పలు జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. హబ్సిగూడలోని సీఎస్ఐఆర్ - ఎన్జీఆర్ఏలో టెక్నికల్ ఆఫీసర్ లైబ్రరీగా ఆయన ఉద్యోగం చేస్తున్నారు. -
ఓయూలో ఇరవైఏళ్లుగా ప్రకటించని గౌరవ డాక్టరేట్లు
ఉస్మానియా యూనివర్సిటీ వివిధ రంగాల్లో విశిష్టసేవలు అందించిన గొప్ప వ్యక్తులను గుర్తించి ఉస్మానియా యూనివర్సిటీ అందించే గౌరవ డాక్టరేట్లు మరుగునపడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రతిష్టాత్మక ఈ డాక్టరేట్‌కు ఇరవై సంవత్సరాలుగా ఎవరినీ ఎంపిక చేయడం లేదు. జాతీయ, అంతర్జాతీయ, స్థానికంగా ప్రముఖ వ్యక్తులను ఎంపిక చేసి 1917 నుంచి వర్సిటీ ప్రతి స్నాతకోత్సవానికి గౌరవ డాక్టరేట్లను అందించేది. ఆరుగురు నిజాం నవాబ్‌లతో పాటు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ ప్రధానులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ మన్మోహన్సింగ్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్, మాజీ రాష్ట్రపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబు రాజేంద్రప్రసాద్, పీఎల్ఓ (పాలస్తీనా) అధ్యక్షుడు యాసర్ అరాఫత్ తదితరులకు ఈ గౌరవం దక్కింది. అధికారులు శ్రద్ధ చూపితే మళ్లీ అవకాశం వందేళ్ల శబాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకొని 104వ ఏడులోకి అడుగిడిన ఓయూ 80 స్నాతకోత్సవాలు జరుపుకొని 2001 వరకు 47 మందికి గౌరవ డాక్టరేట్లను అందచేసింది. కొన్ని స్నాతకోత్సవాల్లో ఒకటి కంటే ఎక్కువ గౌరవ డాక్టరేట్లను అందించిన ఘనత నాటి వీసీలకు, అధికారులకు దక్కింది. ఓయూలో 1982, 1986 సంవత్సరాలలో జరిగిన స్నాతకోత్సవాల్లో ఐదుగురికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. యూనివర్సిటీ అధికారులు శ్రద్ధ చూపితే మళ్లీ ప్రతి స్నాతకోత్సవానికి జాతీయ, అంతర్జాతీయ, స్థానికంగా విశిష్టసేవలు అందించిన వారిని గుర్తించి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయవచ్చు. రాజకీయ జోక్యంతో వీసీ వెనుకడుగు ఓయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 2017లో ప్రముఖ వ్యక్తులను గురించి గౌరవ డాక్టరేట్‌ను అందజేయాలని నాటి వీసీ ప్రొ.రామచంద్రం నిర్ణయించారు. కానీ రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకుల జోక్యం వల్ల వీసీ వెనుకడుగు వేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, తెలంగాణ పునఃనిర్మాణం, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఓయూ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాలనుకున్నారు. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు గొడవ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది నాటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అని, ఆమెకు ఓయూ గౌరవ డాక్టరేట్‌ను అందజేయాలని, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతచారిని గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేయాలని టీజీవీపీ విద్యార్థి నాయకులు కోరారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు ఇవ్వాలని జాగృతి విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. దీంతో గౌరవ డాక్టరేట్ ఎంపికను పక్కన పెట్టారు. అయితే అక్టోబరులో జరిగే 81వ స్నాతకోత్సవానికి గొప్ప వ్యక్తులను ఎంపిక చేసి ఓయూ గౌరవ డాక్టరేట్‌ను అందజేసి సంప్రదాయాన్ని కొనసాగించాలని పలువురు సీనియర్ ప్రొఫెసర్లు పేర్కొన్నారు. ఇంత వరకు ఓయూ గౌరవ డాక్టరేట్లు అందుకున్న వారిలో... ఓయూ గౌరవ డాక్టరేట్లను 1917 నుంచి 2001వ సంవత్సరం వరకు 47 మంది అందుకున్నారు. వారిలో జాతీయ, అంరత్జాతీయ, స్థానికంగా విశేష సేవలు అందించిన గొప్ప వ్యక్తులు ఉన్నారు. దేశ అధ్యక్షులు, ప్రధానులు, న్యాయమూర్తులు, ప్రొఫెసర్లు, కవులు, రచయితలు, సంఘ సేవకులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు ఉన్నారు. -
17 ఏళ్లకే పీహెచ్డీ, అది కూడా ఆ సబ్జెక్ట్‌లో!
చదువుకు వయసుతో సంబంధం లేదని ఎంతోమంది నిరూపిస్తుంటే.. అతిపిన్న వయసులో డిగ్రీలు పూర్తిచేసి ఔరా అనిపిస్తున్నారు మరికొందరు. పీహెచ్డీ చేయాలంటే.. పది, పన్నెండు తరగతులు, డిగ్రీ, పీజీ, ఎంఫిల్ చదవాల్సిందే. ఇవన్నీ చదివి పీహెచ్డీ పూర్తి చేసేనాటికి సాధారణంగా చాలామందికి తల నెరుస్తుంది. కానీ అమెరికాకు చెందిన ఓ టీనేజర్ అమ్మాయి అతి చిన్నవయసులో పీహెచ్డీ పూర్తిచేసి అబ్బురపరుస్తోంది. ఎక్కువమంది కష్టంగా భావించే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్ పొంది చరిత్ర సృష్టించింది. సంకల్పం గట్టిదైతే సాధించలేనిది ఏదీ ఉండదని 17 ఏళ్ల కింబెర్లీ స్ట్రాంబుల్ చాటిచెబుతోంది. అమెరికాలోని మోంటానాకు చెందిన కింబెర్లీ.. కాలిఫోర్నియా ‘ఇంటర్కాంటినెంటల్ యూనివర్సిటీ’ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్డీ పూర్తిచేసి ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. ‘బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రపంచ నాయకత్వ ప్రాధాన్యం...’ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఆమె డాక్టరేట్ చేసింది. వివిధ సబ్జెక్టుల్లో డాక్టరేట్ పొందిన ప్రపంచ అతిపిన్న వయస్కుల జాబితాలో మూడోవ్యక్తిగా కింబెర్లీ్ల నిలిచింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇంత చిన్నవయసులో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్‌ను ఎవరూ పొందకపోవడం గమనార్హం. కింబెర్లీ మాట్లాడుతూ..‘‘ఇప్పుడు నేను చాలా సంతోషంగానూ ప్రశాంతంగానూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. తరువాత ఏం చేయాలి? తరువాత ఏం చేయాలి? అనుకుంటూ ముందుకు సాగి చివరికి డాక్టరేట్ పొందాను’’ అని కింబెర్లీ్ల చెప్పింది. ‘‘ప్రస్తుతం నేను చట్టపరమైన అంశాలపై పనిచేస్తున్నాను. వయసు పరంగా చాలా వివక్షకు గురయ్యాను. అయినప్పటికీ నేను ఆర్జించిన జ్ఞానంతో ఎగ్జిక్యూటివ్ మేనేజ్‌మెంట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని కింబర్లే చెప్పింది. కింబర్లే కాకుండా ఆమె అక్క కూడా 18 ఏళ్లకే మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసింది. ప్రస్తుతం తన చెల్లి కూడా చిన్నవయసులో డిగ్రీలు పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ‘‘మేము ఎప్పుడూ పిల్లల్ని అలా చదవండి, ఇలా చదవండి అని బలవంతపెట్టలేదు. వాళ్లకు ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే ప్రోత్సహించాము. కింబెర్లీ్ల ఇష్టంతో చదివి డాక్టరేట్ సాధించింది’’ అని ఆమె తండ్రి జార్జ్ చెప్పారు. తను పీహెచ్డీ పూర్తిచేయడంలో మేమూ ఎంతో కష్టపడ్డామని, ఆమెకు అన్నిరకాలుగా సాయం చేస్తూ.. డాక్టరేట్ వచ్చేంతవరకు కృషిచేశామన్నారు. చదవండి: మోస్టు డేంజరస్ రోడ్లు ఎక్కడున్నాయంటే? -
కళా సృజనకు డాక్టరేట్..వరి కంకులతో అద్భుతాలు!
బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్లలో సాధారణ రైతు కుటుంబానికి చెందిన సింగంశెట్టి శివనాగేశ్వరమ్మ వివాహానికి ముందు ఏడో తరగతితో చదువు ముగించారు. సుమారు 40 ఏళ్ల తరువాత ఇటీవల ఓపెన్ యూనివర్సిటీలో బీకాం పూర్తి చేశారు. వరి కంకులకు సృజనను అద్ది కళా ఖండాలను సృష్టిస్తున్న ఆమెను గౌరవ డాక్టరేట్ వరించింది. విజ్ఞాన, పారిశ్రామిక, కళారంగాల్లో పరిశీలనాత్మక పరిశోధనలు చేసిన వారికి అందించే గౌరవ డాక్టరేట్‌ను యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ (ఎక్స్టర్నల్ స్టడీస్ అండ్ రీసెర్చ్) వైస్ చాన్సలర్ డాక్టర్ ఫ్రెడ్రిక్ ఫ్రాన్సిస్ అందించారు. వరి కంకులే ఆమె నేస్తాలు గ్రామీణుల జీవనం అన్నప్రాసన నుంచి మరణం వరకు వరి ధాన్యంతోనే ముడిపడి ఉంటుంది. అంతటి ప్రాశస్త్యం గల వరి కంకులు, గడ్డిపోచలతో అందాలొలికే అపురూప ఆకృతుల్ని అల్లుతూ శివనాగేశ్వరమ్మ అందరి మన్ననలు పొందుతోంది. ఒడ్ల కుచ్చులు, వరి కంకుల తోరణాలు, హారాలు, బొకేలు, గడ్డిపోచలతో బొమ్మలు, బౌద్ధ స్థూపాలు, నమూనాలు, భావపురి భావదేవుని గాలి గోపురం, బాపట్ల గడియార స్తంభం, పెళ్లి పల్లకి, మీనా, ఒడ్లపురి చుట్టిల్లు, పూరిల్లు, తెరచాప పడవలు, దేవతల దుస్తులను తయారు చేసిన ఆమె వాటిని వివిధ ఆలయాలకు అందించారు. ఔరా అనిపించే ఆమె నైపుణ్యానికి డాక్టరేట్ వరిచింది. ఆమె కళా సృజనకు ఇది కొత్త స్ఫూర్తినిచ్చింది. తయారీ ఇలా వేమూరు మండలం పెరవలికి చెందిన ఎస్ఎస్ రంగయ్య కుమారుడు సుబ్బారావును 1978లో ఆమె వివాహం చేసుకున్నారు. అనంతరం బాపట్ల రైలు పేటలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వరి కంకులు, గడ్డిపోచలతో తయారుచేసే అనేక ఆకృతుల కోసం బీపీటీ రకానికి చెందిన వరి కంకులు, గడ్డి పోచలను ఉపయోగిస్తున్నామని శివనాగేశ్వరమ్మ తెలిపారు. వరి కోతకు వారం రోజులు ముందుగా కావాల్సిన వరి కంకులను ఎంపిక చేసుకుని పొలం నిలువుపై కోత కోసి తెచ్చిన వరి పనలను నీడలో ఆరబెడతారు. ఈ విధంగా చేయడం వల్ల కంకుల్లో గింజలు రాలకుండా ఉంటాయి. గడ్డి పోచల్లో పెళుసుదనం లేకుండా మెత్తగా ఎంతకాలమైనా ఉంటాయని చెబుతున్నారు శివనాగేశ్వరమ్మ. -
డాక్ట‘రేట్లు’..డాక్టరేట్లోయ్!
సాక్షి, హైదరాబాద్: ‘మీరు ఏదైనా కారణాలతో డాక్టర్ కాలేకపోయారా? కనీసం గౌరవ డాక్టరేట్ పొందాలన్న మీ ప్రయత్నాలు ఫలించలేదా? అయితే, నిరాశ వద్దు.. వెంటనే సంప్రదించండి.. గ్లోబల్ పీస్ యూనివర్సిటీని. కేవలం రూ.20వేల నుంచి రూ.40 వేలకే డాక్టరేట్ ఇస్తాం. మీ విద్యార్హతలతో పనిలేదు, మీరెలాంటి సంఘసేవ, సామాజిక బాధ్యతలు, కళా సేవలు చేయాల్సిన అక్కర్లేదు. అడిగినంత చెల్లించండి.. మీకు నచ్చిన డాక్టరేట్ తీసుకెళ్లండి’అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఈ వ్యవహారం డీజీపీ మహేందర్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. ఈ సర్టిఫికెట్ల కుంభకోణంపై సరైన విచారణ జరిపించాలని, సర్టిఫికెట్లు ప్రదానం చేసినవారిని, తీసుకున్నవారిని అరెస్టు చేయాలని లోక్‌సత్తా నాయకులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ దందా దక్షిణ భారత్‌లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల్లో పలు నకిలీ విశ్వవిద్యాలయాలు వీటిని తమకు తోచిన ధరకు విక్రయించేస్తున్నాయి. గౌరవ డాక్టరేట్లతోపాటు, పలు ఆర్ట్స్ అండ్ సైన్స్‌ల్లోనూ ఈ డాక్టరేట్లు ఇస్తుండటంతో వీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవల ఈ ముఠా వ్యవహారాలు వెలుగులోకి రావడంతో కర్ణాటకలోని మైసూరు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. తీసుకున్న వారిపై చర్యలేవి..? మైసూరు, బెంగళూరు, చెన్నై, పుదుచ్చేరి ప్రాం తాల్లో ఈ నకిలీ వర్సిటీలు చెలరేగిపోతున్నాయి. యూనివర్సల్ పీస్ వర్సిటీ, లింకోక్వింగ్, గ్లోబల్‌ఆక్స్‌ఫర్, ఇంటర్నేషనల్ పీస్ వర్సిటీ, కింగ్స్ వర్సిటీ పేరిట పలువురు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి వీటికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి ఎలాంటి అనుమతులు లేవని విద్యావేత్తలు చెబుతున్నారు. వీరి కార్యకలాపాలు మన రాష్ట్రం దాకా విస్తరించాయి. తెలంగాణలో ఉమ్మడి వరంగల్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో ఈ దం దా జోరుగా సాగుతోంది. దీని కోసం సబ్జెక్టును బట్టి రూ.20 వేల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పైగా ఈ సర్టిఫికేట్ల ప్రదానోత్సవాలను దక్షిణ భారత్‌లోని ప్రముఖ హోటళ్లలో వైభవంగా నిర్వహిస్తుండటం పోలీసులనే నివ్వెరపరుస్తోంది. ఆగస్టులో కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన రాజకీయ, విద్యా, ఆర్థిక, వ్యాపార రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు డాక్టరేట్లు అందుకున్నా రు. చివరకు ఎలాంటి విద్యార్హత లేని రియల్టర్లు, బిల్డర్లు కూడా వీటిని సంపాదిస్తుండటం విశేషం. బయటపడిందిలా?... ఈ సంగతి తేలుద్దామని కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో గ్లోబల్ పీస్ యూనిర్సిటీని సంప్రదించగా.. ఎలాంటి సామాజిక సేవ చేయకపోయినా రూ.40 వేలు చెల్లిస్తే సామాజిక సేవ విభాగంలో డాక్టరేట్ జారీ చేస్తామన్నారు. కానీ, తన వద్ద రూ.20 వేలే ఉన్నాయని చెప్పడంతో 50 శాతం డిస్కౌంట్‌తో డాక్టరేట్ జారీ చేశారు. దీంతో ఈ గుట్టు రట్టయింది. ఈ నకిలీ డాక్టరేట్ల స్కాంపై ఉస్మానియా వర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ .. యూజీసీకి ఇటీవల ఫిర్యాదు చేసింది. ఇలాంటి వారి వల్ల నిజంగా డాక్టరేట్ పొందిన వారికి గుర్తింపు, విలువ లేకుండా పోతాయని కరీంనగర్‌కి చెందిన లోక్‌సత్తా ఉద్యమకారుడు శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సర్టిఫికెట్ల స్కాంపై సీఎం, డీజీపీలకు శనివారం ఫిర్యాదు చేశామన్నారు. -
నగదుకు నకిలీ గౌరవ డాక్టరేట్
మైసూరు: అదో పెద్ద హోటల్. సమావేశ గదిలో కోలాహలం. కొందరు స్నాతకోత్సవ గౌన్లు ధరించి.. డాక్టరేట్లు అందుకోబోతున్నామనే ఆనందంలో ఉన్నారు. ఇంతలో పోలీసులొచ్చారు. ముగ్గురిని అరెస్ట్‌చేశారు. అక్కడి నకిలీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన కొందరు ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ అనే నకిలీ వర్సిటీ పేరుతో దందా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మైసూర్లో ఓ హోటల్‌పై దాడిచేశారు. ఔత్సాహికుల నుంచి భారీగా డబ్బు తీసుకుని నకిలీ డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నట్లు నంబియార్, శ్రీనివాస్, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆ సమయంలో హోటల్లో సుమారు 142 మందికి గౌరవ డాక్టరేట్ పట్టాలిస్తున్నారు. -
శేఖర్.. సూపర్
సంగారెడ్డి అర్బన్: సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌తో పాటు, ఐదు ఆవార్డులు సొంతం చేసుకొని పల్పనూరి శేఖర్ ఆదర్శంగా నిలిచారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి కూత వేటు దూరంలో ఉన్న చిమ్నాపూర్‌లో జన్మించిన శేఖర్ 2002లో అంబేడ్కర్ యువజన సంఘం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా, అనాథలకు అండగా నిలిచారు. దళితుల సమస్యలపై పోరాటాలు చేశారు. వివిధ సంస్థల్లో పని చేస్తూనే బహుజన భీమ్ సోల్జర్ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న దివ్యదిశ అనాథ ఆశ్రమంలో చిన్నారులకు నిత్యావసరాలు, దుస్తులు పంపిణీ, 2007లో నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేశారు. «కంది మండలం ధర్మసాగర్ చెరువులో 360 ఎకరాల దళితులు భూములు కబ్జాకు గురైతే వారి భూములు తిరిగి ఇప్పించడంలో కీలక పాత్ర పొషించారు. క్రైస్తవ జేఏసీ తరపున చర్చిల్లో పలు సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా, నిరుపేదలకు నిత్యావసరాలు, దుస్తులు పంపిణీ చేశారు. హత్నూర మండలంలో ఓ పరిశ్రమ యాజమాన్యం ఇద్దరు మూగ దంపతుల భూమిని కబ్జా చేస్తే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేశారు. 2017లో హైటెన్షన్ వైర్ల భూ బాధితులకు నష్ట పరిహారం ఇప్పించడంలో ఆయన కీలక పాత్ర పొషించారు. ఆపదలో ఉన్న వారికి అండగా.. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా తాను స్వయంగా రక్తదానం చేసి మనవత్వాన్ని చాటుకున్నారు. అపదలో ఉన్నవారికి అండగా నిలువడంతో పాటు కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి సేవలు అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులైన్స్ డ్రైవర్లు హైదరాబాద్‌కు తీసుకెళ్లడానికి డబ్బులు అడగటంతో జెడ్పీ చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. ఆసుపత్రుల్లో మృతిచెందిన బాలింతలు, చిన్నారుల పక్షాన న్యాయ పోరాటాలు చేశారు. గౌరవ డాక్టరేట్, ఐదు అవార్డులు సొంతం.. 18 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గానూ, శేఖర్‌ను గుర్తించి జూన్ 20న అంతర్జాతీయ గ్లోబల్ యునివర్శిటీ చాన్స్‌లర్, ప్రొఫెసర్ల చేతుల మీదుగా కర్ణాటక రాష్ట్రం బెంగుళూర్లో డాక్టరేట్‌ను అందకున్నారు. 2007లో నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట తరపున జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. 2014లో బెస్ట్ సోషల్ వర్కర్‌గా ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 2015లో ప్రొఫెసర్ జయశంకర్ జాతీయ అవార్డును తీసుకున్నారు. 2016లో అంబేడ్కర్ జాతీయ అవార్డును ఢిల్లీలో సొంతం చేసుకున్నారు. సేవలకు గుర్తింపుగా విశిష్ట సేవరత్న అవార్డును 2019లో తిరుపతిలో అందుకున్నారు. -
ఈ కుక్కకు అరుదైన ఘనత!
వర్జీనియా: అమెరికాలోని వర్జీనియా టెక్ యూనివర్శిటీ తమ సిబ్బందిలో ఒకరికి శుక్రవారం గౌరవ డాక్టరేట్ డిగ్రీతో సత్కరిచింది. అయితే ఆ ఉద్యోగి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే! డాక్టరేట్ అందుకున్న ఉద్యోగి మనిషి కాదు కుక్క. దాని పేరు మూస్ డేవిస్. అయితే కరోనా కాలంలో ఆన్లైన్లో 2020లో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసిన వారికి గ్రాడ్యుయేషన్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో 8 ఏళ్ల మూస్కు వెటర్నర్ మెడిసిన్‌లో గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ విషయాన్ని యూనివర్శిటీ పాలకమండలి ఓ ప్రకటనలో పేర్కొంది. డాక్టర్ మూస్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ యూనివర్శిటీ విద్యార్థులకు, సిబ్బందికి సహాయపడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్నో కార్యక్రమాల్లో తన సేవలను అందిచినందుకుగాను మూస్ సేవలను గుర్తించి డాక్టరేట్ ఇచ్చినట్లు వర్సిటీ అధికారులు చెప్పారు. కాగా ఈ లాబ్రడార్ రిట్రీవర్ కుక్క 2014 నుంచి యూనివర్శిటీలో ఉందని, కుక్ కౌన్సెలింగ్ కేంద్రంలో పనిచేస్తున్న నాలుగు శునకాలలో ఇది ఒకటి అని తెలిపారు. (తిమింగలాన్ని కాపాడిన వ్యక్తికి జరిమానా) ‘మూస్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ యూనివర్శిటీ క్యాంపస్‌లో యాక్టివ్‌గా పనిచేస్తుంది. అయితే మానసిక అనారోగ్యంతో బాధపడే విద్యార్థులను ఉల్లాసంగా ఉంచుతుంది. క్యాంపస్ విద్యార్థులంతా మూస్‌ను ఇష్టపడతారు’ యూనివర్శిటీ యానిమల్ అసిస్టెన్స్ థెరపి ప్రొగ్రామ్ సలహాదారుడు డేవిస్ పేర్కొన్నాడు. ఆయన మూస్ ఆరోగ్య బాధ్యతను చుసుకుంటారు. ‘‘డాక్టర్ మూస్ ఇటీవల ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ విద్యార్థులకు, సిబ్బందికి సహాయం చేస్తుంటుంది. ఈ వ్యాధి చికిత్సలో భాగంగా మూస్కు ప్రస్తుతం రేడియేషన్, కీమోథెరపీతో పాటు ఇతర చికిత్స జరుగుతుంది. అయినప్పటికీ ఎప్పుడు ఉత్సాహంగా సాధారణ ఆరోగ్యవంతమైన జీవిలా కనిపిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నాడు. మూస్ వర్జీనియా టెక్ యూనివర్శిటీలో తన ఆరు సంవత్సరాలలో 7,500కు పైగా కౌన్సెలింగ్ సెషన్లలో, 500లకు పైగా ట్రీచ్ ఈవెంట్స్ సహాయం చేసింది. ఖాళీ సమయంలో ఇది ఈత, టగ్-ఆఫ్-వార్లు ఆడానికి ఇష్టపడుతుంది. (ఇలా మాస్కు తీయకుండా తినేయండి) View this post on Instagram Moose is so happy to serve the Hokie Nation, sharing smiles, tail wags, and his calming presence. On Friday, he humbly accepted an honorary doctorate from @vamdvetmed. We often say that we will never know Moose’s full impact. He is beloved by so many. The story of his DOG-torate has been making a splash nationally and internationally, and we are thrilled to know that Moose’s story is bringing hope and smiles to people all over the world. Moose leads his junior colleagues, Wagner, Derek, and Carson as the therapy dog team continues to serve at VT. #utprosim . Congratulations, Dr. Moose! See links in bio. @virginia.tech @vtmdvetmed @studentsatvt @cookcounselingcenter @vtrecsports @hokiewellness @hokiesports @servicedogsva @guidingeyes @camilleschrier @the_hokiebird @vtgrowley #hokies @hokiepets @huffpost @goodmorningamerica @hodakotb @todayshow @latenightseth @fallontonight @theellenshow @colbertlateshow A post shared by Moose, Derek, Wagner & Carson (@vttherapydogs) on May 17, 2020 at 8:29am PDT -
తెలుగోడి సత్తా; 33 డాక్టరేట్లతో గిన్నిస్ రికార్డ్
సాక్షి, హైదరాబాద్: భాగ్య నగరానికి చెందిన వైద్యుడు సాగి సత్యనారాయణ అత్యధికంగా 33 డాక్టరేట్ డిగ్రీలు చేసి మూడోసారి గిన్నిస్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. అందులో 22 పీహెచ్‌డీలు, ఆరు డీలిట్ (డాక్టర్ ఆఫ్ లిటరేచర్)లు, 5 డాక్టర్ ఆఫ్ సైన్స్‌లు ఉన్నాయి. స్పిరిచ్యువాలిటీ, ఆస్ట్రాలజీ, జనరల్ అండ్ క్లినికల్ సైకాలజీ, మెడికల్ సైన్సెస్, లిటరేచర్, ఆల్టర్నేటివ్ మెడిసిన్, యోగా అండ్ స్పిరిచ్యువాలిటీ, సైకాలజీ, యోగా అవేర్నెస్, మెడికల్ ఆస్ట్రాలజీ, పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, థెరప్యూటిక్ సైకాలజీ, హెల్త్ అండ్ సైన్సెస్, బ్రహ్మజ్ఞానం అంశాలపై ఆయన ఈ పట్టాలను అందుకున్నారు. ఏడాది కాలంలో వరుసగా 72 పుస్తకాలు రచించడంతోపాటు అవి ముద్రణకు నోచుకున్న నేపథ్యంలో 2016 జనవరి 28న డాక్టర్ సాగి తొలిసారి గిన్నిస్ రికార్డులోకి ఎక్కారు. 2006 ఏప్రిల్ నుంచి 2012 జనవరి మధ్యలో 125 పుస్తకాలు రచించడంతో 2016 ఆగస్టు 28న రెండోసారి గిన్నిస్‌కు ఎక్కారు. ఈ నెల మూడోసారి ప్రపంచ గిన్నిస్ రికార్డులో ఆయన పేరు నమోదైంది. సాగి సత్యనారాయణ గుంటూరులో ఎంబీబీఎస్ విద్య పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలపై ఆయనకు మంచి పట్టు ఉంది. వైద్య, ఆరోగ్య, జనరల్, ఆధ్యాత్మిక, సోషల్ సైన్స్, యోగా, వేదాలు, సైకాలజీలపై అనేక వ్యాసాలు రాయడమే కాకుండా ఆయా అంశాలపై పరిశోధనలు సాగించారు. మన దేశంలోని ఐదు విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ సాయిలో వివిధ దేశాలకు చెందిన తన పరిశోధనల సారాంశం పంపి.. 25 వర్సిటీల నుంచి డాక్టరేట్లను సాధించారు. మల్కాజిగిరిలో సాయంత్రం పూట ఉచితంగా పేదలకు వైద్య సేవలు అందిస్తూ మంచి మనసును చాటుకున్నారు. -
షారుక్‌కు మరో అరుదైన గౌరవం
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా మెల్బోర్న్కు చెందిన లా ట్రోబ్ యూనివర్సిటీ షారుక్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేయనున్నట్లు ప్రకటించింది. ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్న షారక్.. మహిళలు, పిల్లల కోసం ‘మీర్’ అనే సంస్థను స్థాపించి.. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షారుక్ కృషిని అభినందిస్తూ.. ‘డాక్టర్ ఆప్ లెటర్స్’ను ప్రదానం చేయనున్నట్లు సదరు యూనివర్సిటీ ప్రకటించింది. త్వరలో మెల్బోర్న్లో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేడుకలకు షారుఖ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. డాక్టరేట్‌పై షారుక్ స్పందిస్తూ.. 'లా ట్రోబ్ అనేది ప్రముఖ యూనివర్సిటీ. చాలా కాలంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలతో సంబంధాలు కొనసాగిస్తుంది. మహిళా సమానత్వం కోసం కృషి చేస్తోంది. అటువంటి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందడం గౌరవంగా భావిస్తున్నా. నా పేరును సూచించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా' అని పేర్కొన్నారు. వచ్చే నెల 9న బుందూరలోని మెల్బోర్న్ క్యాంపస్‌లో షారుక్‌కు ఈ డాక్టరేట్‌ను ప్రధానం చేస్తారు. -
కొడుకిచ్చిన డాక్టరేట్
డాక్టర్ స్రవంతి సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగిని. ఒక వైపు ఉద్యోగ నిర్వహణ, మరోవైపు తల్లిగా నిర్విరామ శ్రమ. రెండేళ్లకోసారి బదలీలు. ఉద్యోగరీత్యా తరచు క్షేత్రస్థాయిలో తిరగాల్సి రావడం. వీటన్నిటి ఒత్తిడిలో ఆటిజంతో బాధపడుతున్న తన కుమారుడ్ని చూసుకోవడం ఆమెకు శక్తికి మించిన బాధ్యత అయింది. అయినా కూడా ఆమె నిస్పృహ చెందలేదు. మానసిక ఎదుగుదల లేని తన బిడ్డను కంటికి రెప్పలా కాడుకుంటూ వస్తున్నారు. అంతేకాదు, తనబిడ్డలా ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈ సమస్యకు పరిష్కారమేమిటి అనే అంశాలపై ఆమె పరిశోధన చేశారు. ఎస్వీయూ నుంచి డాక్టరేట్ పొందారు. ఆ వివరాలు స్రవంతి మాటల్లో..‘‘మా స్వస్థలం అనంతపురం జిల్లా. ఉద్యోగ రీత్యా తిరుపతిలో స్థిరపడ్డాం. సాంఘిక సంక్షేమ శాఖలో వివిధ ప్రాంతాల్లో పనిచేశాను. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే రవికుమార్‌తో 1996లో వివాహమైంది. 1999లో బిడ్డ పుట్టాడు. పేరు చందన్. అయితే ఏడాది వయస్సు వచ్చినా వాడిలో ఎలాంటి స్పందనలు లేవు. చాలాచోట్ల చూపించాం. ఫలితంలేదు. మూడు సంవత్సరాల వయస్సు వున్నప్పుడు సికింద్రాబాద్‌లోని ఎన్ఐహెచ్ఎం సంస్థ వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాం. ఆటిజం అని చెప్పారు! ఈ సమస్యతో బాదపడేవారు వారిలో మానసిక ఎదుగదల వుండదు. చూసేవాళ్లు ఎవరూ లేక చందన్‌ని వెంట పెట్టుకునే విధులకు హాజరయ్యేదాన్ని. ఓసారి చందన్ తనకు తెలియకుండా మా ఇంటికి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. దాంతో శరీరమంతా షాక్‌కు గురై 16 సర్జరీలు జరిగాయి. ఆ సందర్భంలో ఎంతో ఒత్తిడికి గురయ్యాను. నా బిడ్డకు ఇలా అవుతోందేమిటి అని మనోవేదనకు గురయ్యాను. సాధారణంగా తల్లిదండ్రులు ఈ సమస్యతో బాధపడే పిల్లలను కొంత నిర్లక్ష్యం చేస్తారు. బాగా వుండే పిల్లలపై చూపే శ్రద్ధ వీరిపై చూపరు. ఆ స్థితి నా బిడ్డకు రాకూడదనే లక్ష్యంతో ఇంకో బిడ్డను వద్దనుకున్నాను. ఇలాంటి సమస్య ఉన్న పేరెంట్స్‌కి పరిష్కారం చూపాలని అనుకుని పరిశోధనకు పూనుకున్నాను. ఈ పరిశోధనకు నా అనుభవమే గ్రంథాలయమైంది. ఇల్లే ప్రయోగశాలగా మారింది. నా బిడ్డే నా పరిశోధనకు కేంద్రబిందువయ్యాడు. పదకొండేళ్ల పరిశోధన నేను 1992లో సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగంలో చేరాను. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చందన్‌ని కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చాను. ఆటిజంపై పరిశోధన కోసం 2008లో ఎస్వీయూ సైకాలజీ విభాగంలో పిహెచ్‌డీకి చేరాను. ‘హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్ బిహేవియర్ ఆఫ్ ఆటిస్టిక్ మెంటల్లీ చాలెంజ్డ్ చిల్డ్రన్’ అనే అంశాన్ని తీసుకున్నాను. అలా పదకొండేళ్ల నా పరిశోధనలో అనేక విషయాలను తెలుసుకున్నాను. ఆటిజం ఉన్న పిల్లలు తమకు ఏం కావాలో చెప్పలేరు. కమ్యూనికేట్ చేయలేరు. కొంతమంది ఎక్కువగా మాట్లాడుతుంటారు. అలాంటి వారిని నియంత్రించలేం. ప్రతి చిన్నవిషయానికీ బాధపడుతుంటారు, భయపడుతుంటారు. వీళ్ల విషయంలో ఎక్కువ శ్రద్ద చూపాలి. ఆటిజం ఉన్నపిల్లలను త్వరగా గుర్తించలేం. అయితే తగినంత ప్రత్యేక పద్దతుల్లో రెండుమూడు వారాల్లోనే గుర్తించవచ్చు. ఇలా గుర్తించినప్పుడు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటేకొంత మేలు చేకూరుతుంది. రీహాబిలిటేషన్ కల్పించాలి ఆటిజంతో జన్మించిన పిల్లలు తమ తప్పులేకపోయినా తమ ప్రమేయం లేకుండానే భూమిపైకి వస్తారు. ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకూడదు. బిడ్డలు లేని స్థితికన్నా ఎవరో ఒకరు ఉన్నారన్న సంతోషంతో వారిపట్ల ప్రేమానురాగాలు చూపిస్తూ పెంచాలి. వృద్ధులు, అనాథలకు ఆశ్రమాలు ఉన్నాయి. కాని ఇలాంటి వారికి ఆశ్రమాలు లేవు. ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థలు చొరవ చూపి రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు బతికి ఉన్నంత వరకు ఎలాంటి సమస్య వుండదు. అయితే వారు చనిపోయాక ఏమిటనేదే ప్రశ్నార్థకం. నా పరిశోధనలో గరిష్టంగా అరవై సంవత్సరాల వయస్సు వున్న మానసిక ఎదుగదల లేని వ్యక్తిని కూడా గుర్తించాను. మన రాష్ట్రంలో ఈ తరహా తొలి పరిశోధన బహుశా నేను చేసిందే కావచ్చు. సైకాలజీ విభాగం ప్రొఫెసర్ డి.జమున పర్యవేక్షణలో నేను ఈ పరిశోధన చేశారు’’ అని తెలిపారు డాక్టర్ స్రవంతి. బూచుపల్లి హరిమల్లికార్జున రెడ్డి, సాక్షి, తిరుపతి ఫొటో: షేక్ మహమ్మద్ రఫీ సంగీతంతో చికిత్స నా బిడ్డ ఎలాంటి స్పందన లేకుండా వుండడం, మానసిక ఎదుగదల లేకపోవడంతో చిత్రవధ అనుభవించాను. పరిష్కారం దిశగా ప్రయత్నించాను. ఈ ప్రయాణంలో నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. కొన్ని పాటలకు బిడ్డ స్పందించడం గుర్తించాను. ఐదు పాటలను ఎంచుకుని ఆకలి, బాధ, దుఃఖం, సంతోషం, కోపం వీటికి.. స్పందించేలా చేశాను. అప్పుడు చందన్ తనలోని భావాలను ఈ పాటలకు ప్రతిస్పందించడం ద్వారా నాకు అర్థమయ్యేలా చేసేవాడు. -
శిఖరానికి డాక్టరేట్
అరుణిమా సిన్హా ఒకప్పుడు జాతీయ స్థాయి ఫుట్‌బాల్, వాలీబాల్ ప్లేయర్. ఇప్పుడు పర్వతారోహకురాలు. అరుణిమ 2013, మే 21వ తేదీన ఎవరెస్టును అధిరోహించారు. ప్రపంచంలోనే ఎవరెస్టును ఎక్కిన తొలి మహిళగా రికార్డు సాధించారు! తొలి మహిళా?! జపాన్ మహిళ జంకో తాబేకి ఆ రికార్డు ఉంది కదా! నిజమే. జంకో తాబే ఎవరెస్టును అధిరోహించిన తొలి మహిళ. అరుణిమది అంతకంటే పెద్ద రికార్డు, మనసును కదిలించే రికార్డు. స్ఫూర్తిని నింపే రికార్డు. వెక్కిరించిన విధిని ఒక్క తోపు తోసేసి శిఖరం పైకి నడిచిన విజయం ఆమెది. ఒక ఘర్షణలో ప్రమాదవశాత్తూ కాలిని (ఎడమ) పోగొట్టుకున్న అరుణిమ కృత్రిమ కాలితో ఎవరెస్టును అధిరోహించారు. ప్రపంచంలోనే తొలిసారి ఎవరెస్టును ఎక్కిన వికలాంగ మహిళగా రికార్డు సాధించారు. ఆ తర్వాత అనేక రికార్డులకు ఆమె గౌరవాన్ని తెచ్చారు. ఆఫ్రికాలో కిలిమంజరో, యూరప్‌లోని ఎల్బ్రస్, ఆస్ట్రేలియాలోని కోస్‌కుయిజ్‌కో, సౌత్ అమెరికాలోని ఆకాంకాగువా, ఇండోనేసియాలో కార్స్టెంజ్ పిరమిడ్లను అధిరోహించారు. ఈ పర్వతాలన్నీ ఆమె స్ఫూర్తి ముందు తలవంచాయి. ఇప్పుడు ఆమె దీక్షకు గుర్తింపుగా యుకెలోని స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీ పురస్కరించింది. గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. కాలు ఎలా పోయింది? 2011, ఏప్రిల్ 12వ తేదీ. ఉత్తర ప్రదేశ్, అంబేద్కర్ నగర్ కి చెందిన అరుణిమ ఢిల్లీకి వెళ్లడానికి లక్నోలో రైలెక్కింది. జనరల్ కోచ్‌లో ఉన్న అరుణిమ మీద దొంగల చూపు పడింది. ఆమె మెడ మీద వాళ్ల చెయ్యి పడింది. ఆమె మెడలో ఉన్న బంగారు దండ, బ్యాగ్‌లో డబ్బు దొంగల పాలు కాకుండా కాపాడుకోవడానికి వారితో పెనుగులాడింది అరుణిమ. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) ఉద్యోగం కోసం పరీక్ష రాయడానికి వెళ్తున్న అమ్మాయి కావడంతో దొంగలకు లొంగిపోవడానికి సిద్ధంగా లేదామె. ఆ పెనుగులాటలో ఆమెను రైల్లోంచి బయటకు తోసేశారు దొంగలు. ఆమె ప్రయాణిస్తున్న రైల్లోంచి పక్కనే ఉన్న పట్టాల మీద పడిందామె. ఆ పట్టాల మీద మరో రైలు వస్తోంది. ఆ రైలు రావడం కనిపిస్తోంది, తనను తాను రక్షించుకోవడానికి పక్కకు తిరిగిందామె. దేహం పూర్తిగా పట్టాల మీద నుంచి బయటపడనేలేదు. మరో రెండు సెకన్లయితే పూర్తిగా పక్కకు దొర్లిపోయేదే, అంతలోనే వచ్చేసింది రైలు. కాలి మీదుగా వెళ్లిపోయిందా రైలు. మోకాలి కింద భాగం నుజ్జయిపోయింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నాలుగు నెలల కాలం బెడ్‌మీదనే గడిచిపోయింది. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చిందామె. కోలుకున్న తరవాత జీవితాన్ని సాహసోపేతంగా గడపాలని. ఎవరెస్టును అధిరోహించాలనే కోరిక కూడా ఆ నిర్ణయంలోంచి పుట్టినదే. కృత్రిమ కాలితో శిక్షణ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉత్తరాలు, టెలిఫోన్ ద్వారా బచేంద్రిపాల్‌ను (ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ మహిళ) సంప్రదించింది అరుణిమ. బచేంద్రిపాల్ పూర్తి సంపూర్ణ సహకారాలందించారామెకి. అరుణిమ సోదరుడు ఓంప్రకాశ్ ప్రోత్సహించాడు. ప్రోస్థెటిక్ లెగ్ అమర్చిన తర్వాత పర్వతారోహణ శిక్షణ మొదలైంది. మొదట 2012లో హిమాలయాల్లోని ఐలాండ్ పీక్‌ను అధిరోహించి, ఫిట్నెస్ విషయంలో నిర్ధారణకు వచ్చింది. తర్వాత ఏడాది ఎవరెస్టును అధిరోహించింది. ఆ అనుభవాలను ‘బార్న్ అగైన్ ఆన్ ద మౌంటెయిన్’ అని పుస్తకంగా రాసింది అరుణిమ. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తోపాటు టెన్సింగ్ నార్గే అవార్డులతో అరుణిమలోని స్ఫూర్తిని గౌరవించింది. తనలాంటి వాళ్ల కోసం ఆరు పర్వత శిఖరాలను పూర్తి చేసుకున్న తర్వాత యుకె లోని స్ట్రాత్‌క్లైడ్ యూనివర్శిటీ గడచిన గురువారం నాడు గ్లాస్గోలో జరిగిన గ్రాడ్యుయేషన్ సెరిమనీలో అరుణిమకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ‘ఈ పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు యువతకు మంచి సందేశాన్నిస్తాయి. సంకల్పశుద్ధితో చేసిన పనిని ప్రపంచం గుర్తిస్తుందనే సంకేతాన్ని జారీ చేస్తాయి’ అంది అరుణిమ. ఆమె స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న అరుణిమ ఫౌండేషన్ సేవలను కూడా స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆమె స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్‌కి మానసిక, శారీరక ఆరోగ్య సేవలతోపాటు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రోత్సాహం, మహిళల సాధికారత అవగాహన వంటి కార్యక్రమాలను తన చారిటీ ద్వారా నిర్వహిస్తోంది. అరుణిమ ఇప్పటి వరకు ఆరు శిఖరాలు అధిరోహించింది. అన్ని ఖండాల్లోని ప్రముఖ శిఖరాలను అధిరోహించాలని, ప్రతి శిఖరం మీదా భారత పతాకాన్ని ఆవిష్కరించాలనీ ఆమె ఆశయం. – మంజీర -
మార్గదర్శకంగా ఉండాలి
హైదరాబాద్: కుల, మతాలకు అతీతంగా సేవాభావం కలిగి సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని టీఎన్జీఓ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ సూచించారు. క్రైస్ట్ న్యూ టెస్ట్‌మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ ఆదివారం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందించింది. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వర్సిటీ వీసీ శోభన్‌బాబు తెలిపారు. సామాజిక సేవలో భాగంగా మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు స్వర్ణపతకాన్ని అందించారు. ఈ సందర్భంగా స్వామి గౌడ్ మాట్లాడుతూ..డాక్టరేట్ హోదా బాధ్యతను పెంచుతుందన్నారు. వివిధ రంగాలకు చెందిన లయన్ విజయ్‌కుమార్, వేణుకుమార్ చుక్కల, ఎన్ఎల్ నరసింహరావు, పి. రామలింగేశ్వరశర్మ, వరదా వెంకటేశ్వరరావు, కొండె గౌరీ శంకర్, సుగుణ, భాస్కర్‌రావు, శ్యాంసుందర్, జి.వెంకటేశ్వర్లుకు డాక్టరేట్లను అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మహేంద్రవాడ వెంకటేశ్వరరావు, టీఎన్జీఓ ప్రతినిధులు, వర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు శ్రీనివాస్‌గౌడ్‌కు గౌరవ డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్‌కు ‘క్రిస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఆదివారం ఉదయం 10గంటలకు అమీర్‌పేట్‌లోని సితార ఆడిటోరియంలో ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ వీసీ శోభన్‌బాబు ప్రకటన విడుదల చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం సహా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని డాక్టరేట్‌ను ప్రదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రాహుల్ గాంధీ వీడియోపై దుమారం
సాక్షి, ముంబై : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. యూపీఏ పాలనలో ఆర్థిక రేటు ఎందుకు పడిపోయిందన్న ప్రశ్నకు సమాధానమివ్వని రాహుల్.. తర్వాత మరో వ్యక్తి అడిగిన ప్రశ్నకు బదులివ్వటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాహుల్ సింగపూర్, మలేషియాలో మూడు రోజుల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే(మార్చి 8-10వ తేదీ వరకు). తాజాగా సింగపూర్ జాతీయ యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి హాజరైన రాహుల్ ప్రసంగించారు. ఆపై సభికులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ సమాధానమిచ్చారు. అంతలో ఓ ఫ్రొఫెసర్ కాంగ్రెస్ హయాంలో(రాహుల్ గాంధీ కుటుంబ పాలనలో..) దేశ ఆర్థిక రేటు కనిష్టానికి పడిపోయిందని.. కానీ, అధికారం కోల్పోయిన సమయంలో ఒక్కసారిగా పైకి లేచిందని, దానికి కారణాలు చెప్పాలంటూ కోరాడు. అయితే ఆ ప్రశ్నకు సమాధానం దాట వేసిన రాహుల్.. తర్వాత కాంగ్రెస్ పాలనను పొగిడిన వ్యక్తికి ఉత్సాహంగా బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోను తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కానీ, అక్కడ జరిగింది ఒకటి అయితే ఈ వీడియోను కాంగ్రెస్ మార్చేసి మరోలా మార్చేసిందని ఆ ఫ్రొఫెసర్ చెబుతున్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని.. లేని పక్షంలో రాహుల్ పై కేసు వేస్తానని అతను అంటున్నాడు. ఇక కాంగ్రెస్ వ్యతిరేకులు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. -
మోహన్‌బాబుకు డాక్టరేట్ ప్రదానం
కొరుక్కుపేట (చెన్నై): ప్రముఖ సినీ నటుడు, విద్యావేత్త ఎం.మోహన్‌బాబుకు చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఎంజీఆర్ వర్సిటీ 26వ స్నాతకోత్స వాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2,197 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. అలాగే విద్యారంగానికి విశిష్ట సేవలు అందించినందుకు గాను ఎం.మోహన్ బాబుకు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. తనకు సినీ జన్మనిచ్చిన రాష్ట్రం తమిళనాడని అన్నారు. దర్శక దిగ్గజం దివంగత దాసరి నారాయణరావు తనకు తొలిసారి అవకాశాన్ని ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఎంజీఆర్ పేరు మీదుగా ఉన్న విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంజీఆర్ వర్సిటీ వ్యవస్థాపక చాన్స్‌లర్ ఏసీ షణ్ముగం, డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఏసీఎస్ అరుణ్‌కుమార్‌తో పాటు మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న, కుమారుడు మనోజ్ పాల్గొన్నారు. -
సంగీతారెడ్డికి గౌరవ డాక్టరేట్
మక్వారీ యూనివర్సిటీ ప్రదానం సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాకు చెందిన మక్వారీ యూనివర్సిటీ గురువారం అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. భారత్‌లో ఆరోగ్య సంరక్షణ కోసం చేపడుతున్న అనేక మార్పులకు, ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సమాచార సాంకేతికతలో చేస్తున్న కృషికి, నిబద్ధతకు గుర్తింపుగా ఆమెకు ఈ డాక్టరేట్ దక్కింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాక్క్యూరీ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఎస్ బ్రూస్ డౌటన్ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. రెండు సంస్థల మధ్య ఒప్పందం...: మక్వారీ వర్సిటీ, అపోలో హాస్పిటల్స్... పరస్పర ప్రయోజనాలు కలిగించే దీర్ఘకాలిక విద్యా మార్పిడిని చేపట్టాయి. ఈ ఒప్పందంలో భాగంగా... మక్వారీ పరిధిలోని నాలుగేళ్ల డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులు.. ఇకపై హైదరాబాద్‌లోని అపోలోలో 5 నెలలపాటు నిర్వహించే క్లినికల్ లెర్నింగ్‌ను పూర్తి చేస్తారు. కాగా, మక్వారీ విశ్వవిద్యాలయం అందిస్తున్న ఎండీ ప్రోగ్రామ్‌తో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్.సి.రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
విజయ నిర్మలకు గౌరవ డాక్టరేట్
-
విజయ నిర్మలకు గౌరవ డాక్టరేట్
భారతదేశంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా రికార్డ్ సృష్టించిన విజయ నిర్మల మరో ఘనత సాధించారు. నటిగా, దర్శకురాలిగా సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ యూకే లోని రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. 1957లో నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తరువాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. దర్శకురాలిగానూ తన మార్క్ చూపించి ఎన్నో విజయాలను నమోదు చేసింది. -
మన్సూర్ రహమాన్‌కు అమెరికా డాక్టరేట్
కర్నూలు(హాస్పిటల్): యూనివర్సిటీ ఆఫ్ సౌత్ అమెరికా గౌరవ డాక్టరేట్‌ను ఉస్మానియా కళాశాల అధ్యాపకులు డాక్టర్ మన్సూర్ రహమాన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కళాశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. కరస్పాండెంట్ అజ్రాజావేద్ మాట్లాడుతూ అర్థశాస్త్ర ఆచార్యులుగా 13 సంవత్సరాలుగా డాక్టర్ రహమాన్ అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యనిర్వాహక సభ్యులుగా కూడా సేవలందించారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సిలార్ మహమ్మద్, రాయలసీమ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్, రంగారెడ్డి, నరేంద్రకుమార్, వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధించి సాధిస్తా: రాహుల్ ద్రవిడ్
బెంగళూరు యూనివర్సిటీ ప్రకటించిన గౌరవ డాక్టరేట్‌ను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించాడు. ‘క్రీడల్లో ఓ సబ్జెక్టును ఎంచుకుని పరిశోధించి డాక్టరేట్‌ను సంపాదిస్తాను తప్ప గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించను’ అని స్పష్టం చేశాడు. ఈ నెల 27న బెంగళూరు యూనివర్సిటీ 52వ స్నాతకోత్సవం సందర్భంగా ద్రవిడ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తామని ప్రకటించగా అతను పైవిధంగా స్పందించాడు. ప్రస్తుతం అతను అండర్–19 భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీకుమార్‌కు డాక్టరేట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ) : జేఎ¯ŒSటీయూకే ఇంజినీరింగ్ కళాశాలలో ఈఈఈ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.శ్రీకుమార్‌కు జేఎ¯ŒSటీయూకే డాక్టరేట్ ప్రదానం చేసింది. ‘డిజై¯ŒS అండ్ ఇంప్లిమెంటేష¯ŒS ఆఫ్ మేగ్జిమమ్ పవర్ పాయింట్ ట్రాకింగ్ ఆఫ్ బూస్ట్ కన్వర్టర్ సప్లయిడ్ పీవీ సిస్టమ్ యూజింగ్ ఇంజినీరింగ్ ఇంటిలిజెంట్ కంట్రోలర్’ అంశంపై ఈయన జేఎ¯ŒSటీయూకే ఇ¯ŒSఛార్జి రిజిస్ట్రార్, ఈఈఈ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు పర్యవేక్షణలో సమర్పించారు. -
మనసు మాట వినండి
► లేదంటే నా వయసుకు వచ్చాక బాధపడతారు: షారుఖ్ ► ‘మనూ’స్నాతకోత్సవంలో బాలీవుడ్ సూపర్ స్టార్ ► విద్యార్థి దశలో ఎంతో ఉత్సాహం.. ఎన్నో ఆకాంక్షలు.. ► తల నిండా వెంట్రుకలుంటాయి.. ► కాలం గడిచే కొద్దీ అవి తగ్గిపోతాయి ► లోకంలో విద్యకు మించిందేమీ లేదు ► షారూఖ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం ► అనారోగ్యంతో హాజరు కాలేకపోయిన రాష్ట్రపతి ప్రణబ్ సాక్షి, హైదరాబాద్: ‘‘విద్యార్థి దశలో అంతులేని ఉత్సాహం... భవిష్యత్తుపై ఎన్నో ఆకాంక్షలు.. తల నిండా వెంట్రుకలు ఉంటాయి.. కాలం గడిచే కొద్దీ ఇవన్ని తగ్గిపోతాయి. జీవితంలో ఏం సాధించాలన్నా విద్యార్థి దశ కీలకం. మనసు ఏం చెబితే అదే చేయాలి. మనసుకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవాలి.. లేదంటే మీరు(విద్యార్థులు) నా వయసు, తల్లిదండ్రులు, గురువుల వయసుకు చేరిన తర్వాత మనసు చెప్పినట్లు ఎందుకు చేయలేదన్న బాధ కలుగుతుంది..’’అని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ యువతకు సూచించారు. లోకంలో విద్యకు మించిందేమి లేదని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మనూ) 6వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఉర్దూ భాషకు చేసిన సేవకు గుర్తింపుగా షారుక్‌ఖాన్, రేఖ్తా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంజీవ్ సరఫ్లకు వర్సిటీ యాజమాన్యం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా షారుక్ మాట్లాడుతూ... తన తల్లి పుట్టినిళ్లయిన హైదరాబాద్‌లో ఈ పురస్కారం అందుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ‘‘ఈ గౌరవం అందుకునే అర్హత నాకు ఉందో నాకు లేదో తెలియదు.. మీరు ఇచ్చారు కాబట్టి సంతోషంగా స్వీకరిస్తున్నా..’అంటూ చమత్కరించారు. తల్లిదండ్రులు ఈ రోజు బతికి ఉంటే చాలా ఆనందించేవారన్నారు. ఉన్నత విద్యావంతుడైన తన తండ్రికి చదువు పట్ల ఎంతో మమకారం ఉండేదని, చాలా అందమైన ఉర్దూ మాట్లాడేవారని పేర్కొన్నారు. తనకు లభించిన కొద్దో గొప్పో మాట్లాడే జ్ఞానం తండ్రి నుంచే అబ్బిందన్నారు. విద్య, ఉర్దూ భాష పట్ల ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. స్నాతకోత్సవంలో 276 మంది వర్సిటీ విద్యార్థులకు పీహెచ్డీ, ఎంఫిల్, 2,885 మంది విద్యార్థులకు గ్యాడ్యుయేషన్ పట్టాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ చాన్స్‌లర్ జఫర్ సరేష్వాలా, వీసీ డాక్టర్ ముహమ్మద్ అస్లాం పర్వేజ్, వర్శిటీ పాలకవర్గం, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్నాతకోత్సవానికి హాజరు కాలేకపోయారు. విద్యార్థులను ఉద్దేశించి షారుక్ ఖాన్ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. చెస్.. టైప్‌రైటర్.. పాత కెమెరా.. డబ్బుల్లేకపోయినా తన తండ్రి తమకు చాలా ప్రేమానురాగాలను పంచారని షారుక్ చెప్పారు. ‘‘డబ్బుల్లేక నా ప్రతి జన్మదినానికి తండ్రి ఆయన ఏదో ఒక పాత వస్తువును కానుకగా ఇచ్చేవారు. ఉర్దూ పదాలతో ఆ వస్తువు గొప్పతనాన్ని అందంగా వివరించి నచ్చజెప్పేవారు. అలా తొలి కానుకగా విరిగిపోయిన చదరంగం సెట్‌ను ఇచ్చారు. దాంతో జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చని చెప్పారు. కలిసిమెలిసి పరస్పర సహకారంతో ఎలా పని చేయాలి.. జీవితంలో ముందుకు వెళ్లడానికి ఒక్కోసారి వెనక్కి తగ్గాల్సి రావచ్చు.. జీవితంలో ఏ వ్యక్తి చిన్నవాడు కాదు.. ఎవరితోనైనా అవసరం పడొచ్చు.. ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోవాలి.. జీవితంలో విజయం సాధించేందుకు త్యాగాలు తప్పవన్న విషయాలను చదరంగం నేర్పుతుంది. ఇక రెండో కానుకగా నా తండ్రి టైప్‌రైటర్ ఇచ్చారు. దాంతో రాస్తే చెరపడం కష్టం కావడంతో ఎంతో ఏకాగ్రత్తతో టైపింగ్ చేయాల్సి ఉంటుంది. జీవితంలో అభ్యాసంతో ఏదైన సాధించవచ్చని ఆ టైప్‌రైటర్ నేర్పింది. మూడో కానుక పాత కెమెరా. అందులోంచి చూస్తే అందమైన దృశ్యాలు కనిపిస్తుండేవి. అయితే ఆ కెమెరా ఫోటోలు తీసేందుకు పనికొచ్చేది కాదు. మనలోని సృజనాత్మకత, ఆకాంక్షలకు తగ్గట్లు చాలా మంది జీవితాలు ఉండవని ఆ కెమెరా ద్వారా తండ్రి బోధించారు’’అని షారుక్ వివరించారు. మనసు బాగోలేనప్పుడు కవిత్వం రాస్తా తన మనసుకు నచ్చిన నటనా రంగంలో అడుగుపెట్టి విజయం సాధించానని, జీవితంలో కొందరికే ఈ అదృష్టం దక్కుతుందని షారుక్ అన్నారు. మనలోని సృజనాత్మకతను ప్రపంచం స్వీకరించాలన్న నిబంధన లేదన్నారు. ‘‘కష్టకాలంలో ఒంటరిగా ఉన్నప్పుడు మన సృజనాత్మకతే మనకు తోడుగా నిలుస్తుంది. నాకు కవిత్వం రాయడం రాకపోయినా మనసు బాగో లేనప్పుడు రాస్తుంటా’’అని చెప్పారు. ఈ సందర్భంగా తాను రాసిన ‘హమ్నే తుమ్హారీ రాహ్మే రోరోకే టబ్ భర్దియా...వోహ్ ఆకే నహకే చలేగయే’కవితను ఉటంకించారు. ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు ఇలా కవిత్వం రాస్తే మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. కొంచెమైనా పిల్లల అమాయకత్వం ఉండాలి.. ప్రతి ఒక్కరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ (హస్య చతురత) ఉండాలని షారుక్ అన్నారు. చిన్నపిల్లాడిలో ఉండే అమాయకత్వాన్ని కొంచెమైనా కలిగి ఉంటే జీవితం ఆనందంగా సాగుతుందన్నారు. మన గురించి మంచి, చెడు రెండు రకాలుగా చెప్పేవారుంటారని, వాటిని ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’దృష్టితో స్వీకరిస్తే జీవితం సాఫీగా సాగిపోతుందన్నారు. తల్లిదండ్రులు మనకు ఇచ్చిన ఈ విలువైన జీవితాన్ని ప్రేమించాలని, జీవితంపట్ల దృఢమైన నమ్మకం కలిగి ఉండాలన్నారు. -
షారూక్‌కు మనూ గౌరవ డాక్టరేట్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం మనూ ఆరో స్నాతకోత్సవం సందర్భంగా వైస్ చాన్స్‌లర్ చేతుల మీదుగా షారుక్ ఖాన్ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. షారుక్‌తో పాటు రేఖ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంజీవ్ సరాఫ్‌కు మనూ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. మనూ నుంచి డాక్టరేట్‌ను అందుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా షారుక్ ఖాన్ వ్యాఖ్యానించారు. మా తల్లిదండ్రులు ఉంటే చాలా సంతోషించేవారని.. తల్లి బర్త్ ప్లేస్ హైదరాబాదే అని షారుక్ గుర్తుచేసుకున్నారు. -
సైనా నెహ్వాల్‌కు గౌరవ డాక్టరేట్
-
మహాజన్‌కు ద.కొరియా వర్సిటీ డాక్టరేట్
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు దక్షిణ కొరియాలోని హాంకూక్ విదేశీ వ్యవహారాల విశ్వవిద్యాలయం(హెచ్‌యూఎఫ్‌ఎస్) గౌరవ డాక్టరేటును శనివారం ప్రదానం చేసింది. పార్లమెంటేరియన్ల పనిని ప్రజలు అరుదుగా గుర్తిస్తారని, ఈ గౌరవం ప్రత్యేకమైందని మహాజన్ ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం ఆమె నేతృత్వంలోని పార్లమెంటు సభ్యుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న కార్యకలాపాలకు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లోని చట్టాలకున్న ఉమ్మడితత్వానికి ఈ డాక్టరేటు చిహ్నంగా నిలుస్తుందని స్పీకర్‌ను ఉటంకిస్తూ లోక్‌సభ ప్రకటన జారీ చేసింది. ఈ వర్సిటీ అంతర్జాతీయ అవగాహన పెంపుకు ఎంతో కృషి చేస్తోందని సుమిత్రాప్రశంసించారు. -
ఏఎన్‌యూ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు డాక్టరేట్
ఏఎన్‌యూ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగ కోఆర్డినేటర్ డాక్టర్ జి. చెన్నారెడ్డికి ఆంధ్రా యూనివర్సిటీ ఇటీవల పీహెచ్డీ డాక్టర్‌రేట్‌ను ప్రధానం చేసింది. రెండో పీహెచ్‌డీని అందుకున్న డాక్టర్ జి. చెన్నారెడ్డిని సోమవారం వీసీ ఆచార్య ఎ. రాజేంద్రప్రసాద్, యూనివర్సిటీ అధికారులు అభినందించారు. రెండు పీహెచ్‌డీలు చేసిన డాక్టర్ చెన్నారెడ్డి అధ్యాపకులకు, పరి శోధకులకు ఆదర్శమని వీసీ పేర్కొన్నారు. గతంలో ఇంగ్లీష్‌లో పీహెచ్డీ చేసి 2006లో ఏఎన్‌యూ ఇంగ్లీష్ విభాగంలో రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధుల్లో చేరిన డాక్టర్ చెన్నారెడ్డి తరువాత ఆంధ్రాయూనివర్సిటీ ఎడ్యుకేషన్ విభాగంలో ఆచార్య నిమ్మా వెంకటరావు పర్యవేక్షణక్షలో ‘ఉత్తరాంధ్రలో బీఈడీ కళాశాలల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల ఆంగ్లభాషా నైపుణ్యం ’ అనే అంశంపై ఇటీవల పీహెచ్డీ గ్రంథాన్ని సమర్పించారు. డాక్టర్ చెన్నారెడ్డి పర్యవేక్షణలో ఇప్పటి వరకు ఇంగ్లీష్ విభాగంలో 8 పీహెచ్‌డీలు, 25 ఎంఫిల్‌లు ప్రదానం చేయబడ్డాయి, 40 అంతర్జాతీయ, 25 జాతీయ స్థాయి జర్నల్స్‌లో ఆయన పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. 2007 నుంచి 2009 వరకు డాక్టర్ చెన్నారెడ్డి ఏఎన్‌యూ జర్నలిజం విభాగానికి కోఆర్డినేటర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా జర్నలిజం డిపాట్మెంట్ అధ్యాపకులు, పూర్వవిద్యార్థులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
ఆదిత్య ప్రొఫెసర్ శ్రీనివాస్‌కు డాక్టరేట్
గండేపల్లి : సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలల వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాయుడు శ్రీనివాస్‌కు డాక్టరేట్ లభించినట్టు విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి తెలిపారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, లెబిలింగ్ సెర్వికల్ లుంబర్ స్ఫైన్ ఎంఆర్ ఇమేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లుంబర్ ఇంటర్ విల్టిబ్రల్ డిస్క్S్ప యూజింగ్ స్టేటిస్టికల్ ఫ్యూచర్స్‌పై చేసిన పరిశోధనల జేఎన్టీయూకే పీహెచ్డీ అందజేసినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టీకే రామకృష్ణారావు, ఎ.రమేష్ తదితరులు శ్రీనివాస్‌కు అభినందనలు తెలియజేశారు. -
డాక్టరేట్ గ్రహీత శర్మకు సన్మానం
తుని రూరల్ : తుని మండలం వి.కొత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12 ఏళ్లు అధ్యాపకుడిగా పని చేసి, రసాయన శాస్త్ర విభాగంలో ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన ఈరంకి సీతారామ సుబ్రహ్మణ్య శర్మను గురువారం ఘనంగా సన్మానించారు. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి.సి.రవిచంద్రకుమార్ అధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు సుబ్రహ్మణ్యశర్మను అభినందించారు. అంతకు ముందు పీజీ విద్యార్థులకు రసాయనశాస్త్రాన్ని బోధించే గెస్ట్ లెక్చరర్ల ఎంపిక ప్రక్రియను కాకినాడ పీఆర్ కళాశాల అధ్యాపకులు వి.మల్లికార్జున శర్మ, సుబ్రహ్మణ్యశర్మ పూర్తి చేశారు. గెస్ట్ లెక్చరర్లు పీజీలో క్రొమటోగ్రఫీ, సైక్లో అలే్కన్లు అంశాలను బోధిస్తారని ప్రిన్సిపాల్ తెలిపారు. అధ్యాపకులు వి.సత్యనారాయణ, గోవిందు, మురళి, సంతోషి పాల్గొన్నారు. -
అరుణ కుమారికి డాక్టరేట్
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగ పరిశోధక విద్యార్థిని టి.అరుణ కుమారికి వర్సిటీ డాక్టరేట్ లభించింది. విభాగ ఆచార్యులు ఎన్. సత్యనారాయణ పర్యవేక్షణలో ‘ గోవింద్ మిశ్రా కి ఉపన్యాసన్ మే చిత్ర సామాజిక జీవన్’ అంశంపై జరిపిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. గురువారం ఉదయం వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు అరుణ కుమారికి ఈ మేరకు ఉత్తర్వులు అందజేసి అభినందించారు. గోవింద్ మిశ్రా నవలల్లో చిత్రించిన సామాజిక జీవనపు అంశాలను తన పరిశోధనలో వివరించారు. ఈ సందర్భంగా అరుణను విభాగ ఆచార్యులు, పరిశోధకులు అభినందించారు. -
శ్రీనుకు డాక్టరేట్
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగ పరిశోధక విద్యార్థి బోగి శ్రీనుకు వర్సిటీ డాక్టరేట్ లభించింది. మంగళవారం ఉదయం ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉత్తర్వులను అందించారు. విభాగ ఆచార్యులు డాక్టర్ బి.బి.వి శైలజ పర్యవేక్షనలో ‘కెమికల్ స్పెసిఫికేషన్ స్టడీస్ ఆన్ ఎల్–ఏస్పిరజిని అండ్ గై ్లగిజిని కాంప్లెక్సెస్ విత్ సమ్ ఎసన్షియల్ మెటల్ అయాన్స్ ఇన్ ఆక్వా–ఆర్గానిక్ మిక్సర్స్’ అంశంపై తన పరిశోధన జరిపారు.జీవసంబంధ లైగండ్‌లను ఉపయోగించి ఆవశ్యకత, లోహ అయానులతో సంశ్లిష్ట సమ్మేళనాల స్తిరత్వాన్ని, కంప్యూటర్ మోడలింగ్ స్టడీద్వానా జరిపిన అధ్యయనానికి డాక్టరేట్ లభించింది. -
భువనచంద్రకు డాక్టరేట్
ప్రదానం చేసిన అకాడమీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్ సంస్థ సాహిత్య సేవకు గాను అందజేత చింతలపూడి : మారుమూల పల్లె నుంచి ప్రసిద్ధ సినీ గేయ రచయితగా ఎదగడమే కాక సాహిత్యంలోనూ తన ప్రతిభ చూపుతున్న మెట్ట ఆణిముత్యం భువనచంద్రకు అరుదైన గౌరవం దక్కింది. కర్నాటకలోని అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ ఈ నెల 11న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ విషయాన్ని చింతలపూడి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లంశెట్టి సత్యనారాయణ గురువారం విలేకరులకు తెలిపారు. డాక్టరేట్ అందుకున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. విద్యాభ్యాసం అంతా చింతలపూడిలోనే.. పశ్చిమగోదావరి జిల్లా, చింతలపూడికి చెందిన ఊరకరణం గుర్రాజు(భువనచంద్ర) సినీ గేయ రచయితగా ప్రసిద్ధి చెందారు. అంతేకాకుండా సినీ మాటల రచయితగా, కథకుడిగా, నవలా రచయితగా కూడా రాణిస్తున్నారు. ఆయన రచించిన ‘వాళ్లు’ అనే ఆధ్యాత్మిక నవల విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భువనచంద్ర రచించిన అనేక కథలు స్వాతి, నవ్య వారపత్రికల్లో ప్రచురితమయ్యాయి. భువనచంద్ర పుట్టింది కృష్ణాజిల్లా గుళ్లపూడి గ్రామంలో. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యేశ్వరశర్మ, చంద్రమౌళీశ్వరీదేవి. భువనచంద్రకు రెండేళ్ల వయస్సులో కుటుంబంతో సహా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వచ్చేశారు. అప్పటి నుంచి ఆయన విద్యాభ్యాసం చింతలపూడిలోనే సాగింది. సైనికులకు అంకితం ఇస్తున్నా.. డాక్టరేట్ రావడం సంతోషంగా ఉంది. అయితే నేనెప్పుడూ అవార్డుల కోసం ఏదీ రాయలేదు. అవార్డు అనేది ఒక అలంకారం మాత్రమే. మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి బోర్డర్లో కాపు కాస్తున్న సైనికులే కారణం. ఒక సినిమా రచయితగా కాకుండా సైనికుడికి ఇచ్చిన గౌరవంగా నాకు అందిన డాక్టరేట్‌ను భావిస్తున్నాను. అందుకే అకాడమీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్ ఇచ్చిన డాక్టరేట్‌ను 18 ఏళ్లు సైనికుడిగా పని చేసిన నేను భారత సైనికులకు అంకితమిస్తున్నాను. అలాగే నా తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లు, లైబ్రరీలో నేను ఎక్కువ పుస్తకాలు చదివి ఈ స్థాయికి రావడానికి ప్రోత్సహించిన లైబ్రేరియన్ దాశరథి, మేడుకొండూరి రామకృష్ణలకు కృతజ్ఞతలు. వచ్చేనెలలో మరో నాలుగు పుస్తకాలు ఎమ్మెస్కో వారు విడుదల చేస్తున్నారు. వాటిలో చింతలపూడి ఆశ్రమానికి చెందిన శ్రీ బోధ, బోధానందామృతం నవలలు కాగా, మిగిలిన రెండు పుస్తకాలు కథా సంపుటాలు. ఆశ్రమంలో నా చిన్నతనంలో జరిగిన సంఘటనలు, స్వామీజీ చెప్పిన మంచి మాటలను ఈ పుస్తకాల్లో పొందు పరిచాను. భావి తరాలకు ఈ పుస్తకాలు మార్గదర్శకమవుతాయి. -భువనచంద్ర, ప్రసిద్ధ సినీ గేయ రచయిత -
బాబుకు డాక్టరేట్ ఇవ్వకుండానే..
షికాగో స్టేట్ వర్సిటీ మూసివేత సాక్షి, హైదరాబాద్: షికాగో స్టేట్ యూనివర్సిటీ (సీఎస్‌యూ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డాక్టరేట్ ప్రదానం చేయకుండానే మూతపడింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో వర్సిటీని మూసివేస్తున్నట్టు సీఎస్‌యూ అధ్యక్షుడు డాక్టర్ థామస్ కల్హన్ ప్రకటించారు. చంద్రబాబుకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు సీఎస్‌యూ ప్రతినిధులు గత డిసెంబర్ 18న వెల్లడించారు. వాస్తవానికి అమెరికాలో షికాగో యూనివర్సిటీ అని ఒకటి, చికాగో స్టేట్ యూనివర్సిటీ అని మరొకటి ఉన్నాయి. షికాగో యూనివర్సిటీకి ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. షికాగో స్టేట్ యూనివర్సిటీనే షికాగో వర్సిటీగా భావించిన చంద్రబాబు ఉప్పొంగిపోయారు. కానీ తర్వాత అసలు విషయం తెలిసింది. చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తానన్నది షికాగో స్టేట్ యూనివర్సిటీ అని. ఇది 1867లో ఒక చిన్న స్కూలుగా ప్రారంభమై క్రమేణా విశ్వవిద్యాలయ స్థాయికి చేరింది. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోటీలో లేకపోవడంతో ఈ యూనివర్సిటీ ప్రమాణస్థాయి వేయికిపైగా ర్యాంకుకు దిగజారింది. దాంతో అటు అమెరికా ప్రభుత్వం కానీ ఇటు ఇల్లినాస్ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు ఇవ్వడం లేదు. దీంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇవేమీ తెలియకుండానే చంద్రబాబు.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ తన పనితీరు మెచ్చి డాక్టరేట్ ప్రదానం చేయడానికి ముందుకొచ్చిందంటూ అప్పట్లో బడాయికి పోయారు. -
‘బడాయి’ బాబు.. ఇప్పుడేమంటావ్?
- చంద్రబాబుకు డాక్టరేట్ ప్రదానం చేస్తామన్న చికాగో స్టేట్ యూనివర్శిటీ మూసివేత హైదరాబాద్: సీఎం చంద్రబాబునాయుడుకు డాక్టరేట్ ప్రదానం చేస్తామని ప్రకటించిన చికాగో స్టేట్ యూనివర్శిటీ(సీఎస్‌యూ) మూతపడింది. అమెరికాలో ఇలినాస్ రాష్ట్రం నిధులను సమకూర్చకపోవడంతో యూనివర్శిటీని మూసివేస్తున్నట్లు సీఎస్‌యూ అధ్యక్షుడు డాక్టర్ థామస్ కల్హన్ శుక్రవారం ప్రకటించారు. అమెరికాలో చికాగో యూనివర్శిటీ అనే పేరుతో ఒకటి.. చికాగో స్టేట్ యూనివర్శిటీ పేరుతో మరొక విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఇందులో చికాగో యూనివర్శిటీ అత్యంత ప్రసిద్దికెక్కింది. నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేకపోవడం వల్ల చికాగో స్టేట్ యూనివర్శిటీకి అమెరికా ప్రభుత్వంగానీ.. ఇలినాస్ రాష్ట్ర ప్రభుత్వంగానీ ఎలాంటి నిధులు సమకూర్చడం లేదు. ఇదేమీ పట్టని చంద్రబాబు.. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూనివర్శిటీ తనకు డాక్టరేట్ ప్రదానం చేయడానికి ముందుకొచ్చిందంటూ అప్పట్లో బడాయికి పోయారు. ఇప్పుడు ఆ విశ్వవిద్యాలయం మూతపడటంతో అప్పట్లో పోయిన బడాయిని ఇప్పుడెలా సమర్థించుకుంటారో మరి! -
డాక్టరేట్ వద్దన్న ప్రధాని
న్యూఢిల్లీ: బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకునేందుకు ప్రధాని మోదీ తిరస్కరించారు. అలాంటి డిగ్రీలు అంగీకరించబోనంటూ తన విధానాన్ని వెల్లడించారు. ఫిబ్రవరి 22న మోదీ బెనారస్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఆ సమయంలో డాక్టరేట్‌తో సత్కరిస్తామని యూనివర్సిటీ ప్రతిపాదించగా.. వద్దని సున్నితంగా తిరస్కరించారు. -
బాబు మోహన్‌కు గౌరవ డాక్టరేట్
సిటీబ్యూరో: ప్రముఖ హాస్యనటుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాబు మోహన్‌కు హర్వెస్ట్ బైబిల్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అమెరికన్ మిషన్స్ టీమ్స్ గౌరవ డాక్టరేట్ అందజేసింది. గురువారం రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, వర్సిటీ డెరైక్టర్ ప్రవీణ్ వర్మ ఆయనకు డాక్టరేట్‌ను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న బాబు మోహన్ గెలిచినా ఓడిన అంథోల్ను మారువని ప్రజానాయకుడన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మాణిక్యరెడ్డి, విశ్రాంత డీజీపీ స్వర్ణజిత్ సేన్, బాబు మోహన్ సతీమణి ఇందిర విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు డాక్టరేటా?
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా ఏం సాధించారని షికాగో యూనివర్సిటీ చంద్రబాబునాయుడుకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. 19 నెలల కాలంలో లెక్కలేనన్ని కుంభకోణాలు చేసినందుకా ఈ డాక్టరేట్ అని ధ్వజమెత్తారు. ఇలాంటి డాక్టరేట్లు ఇక్కడి పాలనలో మగ్గుతున్న ప్రజలు ఎలాగో ఇవ్వరు, అందుకే సప్త సముద్రాల అవతల ఉన్న వర్సీటీ నుంచి డాక్టరేట్ తెచ్చుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు డాక్టరేట్ ఇవ్వడంతో షికాగో విశ్వవిద్యాలయ స్థాయి ఇంతగా తగ్గిపోయిందా అన్న అనుమానం, బాధ కలుగుతోందని రోజా వ్యాఖ్యానించారు. మూడు వందలకు పైగా వాగ్దానాలు చేసి ఏ ఒక్కటీ అములు చేయకపోవటం ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఏనాడూ కనీవినీ ఎరుగని సంఘటన అని అందుకే ఈ డాక్టరేట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. -
బాబుకు చికాగో వర్సిటీ గౌరవ డాక్టరేట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు చికాగో యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఏపీ అభివృద్ధికి కృషిచేస్తున్నందుకు ఈ డాక్టరేట్ ప్రకటించినట్లు యూనివర్సీటీ స్పష్టం తెలిపింది. చంద్రబాబు దార్శనీయకత, ప్రతిభసామర్థ్యాలు గొప్పవని ఈ సందర్భంగా వర్సిటీ కొనియాడింది. 1867 ఏర్పాటైన చికాగో వర్సిటీ ఒక విదేశీ నేతకు డాక్టరేట్ ప్రకటించింది. -
జర్మనీలో 102 ఏళ్ల బామ్మకు డాక్టరేట్!
బెర్లిన్: జర్మనీలో 102 ఏళ్ల ఓ బామ్మ డాక్టరేట్ అందుకోబోతున్నారు! అదీ తన 25వ ఏట పూర్తి చేసిన పరిశోధనకు. పరిశోధన అప్పుడే పూర్తయినా ఇన్నాళ్లు జాప్యం కావడం కారణం.. ఆమె తల్లి యూదు కావడమే! బెర్లిన్‌కు చెందిన ఇంగెబోర్గ్ రాపోపోర్ట్ అనే మెడికల్ ప్రొఫెసర్ 1938లోనే డిప్తీరియాపై పీహెచ్డీ చేసింది. అయితే ఆమె తల్లి యూదు అని తెలియడంతో నాటి నాజీ అధికారులు ఇంగెబోర్గ్ సమాధాన పత్రాలను పక్కనపెట్టారు. పీహెచ్డీ ఆగింది. ఇన్నాళ్లకు ఆమె తనయుడు టామ్(ఈయనా మెడికల్ ప్రొఫెసర్) దీనిపై హంబర్గ్ వర్సిటీకి వెళ్లి ఆరా తీశారు. అయితే నిబంధనల ప్రకారం మౌఖిక పరీక్షకు హాజరుకావాల్సిందేనని అధికారులు చెప్పారు. దీంత్లో బామ్మ మళ్లీ పుస్తకాల దుమ్ము దులిపి, మౌఖిక పరీక్ష పాసైంది. వచ్చే వారం డాక్టరేట్ అందుకోబోతోంది. ఇంత పెద్ద వయసులో డాక్టరేట్ అందుకున్న మహిళగా రికార్డు కూడా సృష్టించబోతోంది. -
హీరోయిన్‌కు గౌరవ డాక్టరేట్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్‌కు అహ్మదాబాద్‌లోని రాయ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. భారతీయ సినిమా రంగానికి ఆమె చేసిన సేవలు, వెండితెర మీద మహిళ బలాన్ని చూపించే ప్రయత్నాలు చేయడం లాంటి కారణాలతో ఆమెకు ఈ డాక్టరేట్ ఇస్తున్నారు. దీనిపై విద్యాబాలన్ సంతోషం వ్యక్తం చేసింది. ''ఇంత గౌరవం దక్కడం నిజంగా చాలా అద్భుతం. సినీ పరిశ్రమలో పదేళ్లు పూర్తి చేసుకున్న ఈ సంవత్సరంలోనే డాక్టరేట్ కూడా రావడం మరింత ప్రత్యేకం" అని విద్యాబాలన్ తెలిపింది. ఏ నటికైనా వాళ్లు చేసిన కృషికి ఇంతకంటే పెద్ద ప్రశంస మరొకటి ఉండదని కూడా చెప్పింది. పరిణీత సినిమాతో బాలీవుడ్ రంగప్రవేశం చేసిన విద్యాబాలన్.. 'డర్టీ పిక్చర్' లాంటి సినిమాల్లో కూడా ధైర్యంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే, మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్న 'హమారీ అధూరీ కహానీ' సినిమాలో విద్యాబాలన్ నటిస్తోంది. ఇందులో ఇమ్రాన్ హష్మి, రాజ్‌కుమార్ రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
నటుడు వివేక్‌కు గౌరవ డాక్టరేట్
చెన్నై: ప్రముఖ సినీ నటుడు వివేక్‌ను చెన్నై సెమ్మంజేరిలో గల సత్యభామ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సోమవారం ఘనంగా సన్మానించింది. సత్యభామ వర్సిటీలో 24వ స్నాతకోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రముఖ తమిళ నటుడు వివేక్‌ను, శక్తి మసాలా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డెరైక్టర్ పీసీ.దురైసామిని వర్సిటీ గౌరవ డాక్టరేట్లతో సత్కరించింది. సత్యభామ వర్సిటీ చాన్సలర్ కల్నల్ డాక్టర్ జెప్పియార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్ డాక్టర్ ఏఎస్ కిరణ్‌కుమార్ పాల్గొని విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ఆ దిశగా ముందుకు సాగాలన్నారు. వివేక్ మాట్లాడూ సొంత ప్రయత్నాలతో ప్రతి ఒక్కరూ రాణించాలని, దీనికి ఎంజీఆర్, జెప్పియార్లను ఆదర్శంగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ బీ.షీలారాణి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్‌ఎస్‌రావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ కేవీ.నారాయణ్, వర్సిటీ డీన్ డాక్టర్ టీ.శశిప్రభ తదితరులు పాల్గొన్నారు. -
మారిషస్ అధ్యక్షుడికి లవ్లీ వర్సిటీ డాక్టరేట్
జలంధర్: మారిషస్ అధ్యక్షుడు రాజ్‌కేశ్వర్ పుర్యాగ్ను ప్రతిష్టాత్మక లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఈ నెల 20, 21వ తేదీల్లో నిర్వహించిన నాలుగో స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయనకు డాక్టరేట్ అందజేసినట్లు వర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. పంజాబ్ గవర్నర్ కప్తాన్‌సింగ్ సోలంకి, సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్‌తో పాటు లవ్లీ గ్రూప్ చైర్మన్ రమేశ్ మిట్టల్, వైస్ చైర్మన్ నరేశ్ మిట్టల్, వర్సిటీ చాన్స్‌లర్ అశోక్ మిట్టల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని.. ఈ స్నాతకోత్సవంలో 2013, 2014 బ్యాచ్‌లకు చెందిన 306 మంది అకడమిక్ టాపర్లతో పాటు మొత్తంగా 30,878 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశామని తెలిపింది. ఈ సందర్భంగా తనను డాక్టరేట్‌తో సత్కరించిన లవ్లీ వర్సిటీకి మారిషస్ అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. -
ముకేశ్ అంబానీకి ఐసీటీ డాక్టరేట్
న్యూఢిల్లీ: దేశీ వ్యాపార రంగానికి అందించిన సేవలకు గానూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ముకేశ్ అంబానీకి ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ) డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ముకేశ్ అంబానీ ఐసీటీలోనే 1979లో కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తిచేశారు. ఈయనకు ముందు ఈ డాక్టరేట్‌ను భారతరత్న అవార్డు గ్రహీత, ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త డా.సీఎన్ఆర్ రావు, ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ఎంఎం శర్మతో పాటు మరొక వ్యక్తి పొందారు. -
గిరుల ఝరి... గీతానాయక్
- మేకల కల్యాణ్ చక్రవర్తి, సాక్షి ప్రతినిధి, నల్లగొండ గిరిజనవర్గం నుంచి అంచలంచెలుగా ఎదిగి ఏకంగా డాక్టరేట్ దక్కించుకున్న గీతానాయక్ తన పరిశోధనలకు కూడా అణగారిన వర్గాలకు లబ్ధి కలిగించే ఉపాధి హామీ పథకాన్నే అంశంగా ఎంచుకున్నారు. ముఖ్యంగా తనలాంటి గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో ఈ పథకం ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలుసుకోవాలను కున్నారామె. అందుకే నల్లగొండ జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలు తీరుపై పరిశోధన చేసి డాక్టరేట్‌ను పొందారు. ఈ సందర్భంగా ఆమె సక్సెస్ స్టోరీ. గీతానాయక్‌ది నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కొక్కిరాల గౌరారం. తండ్రి పోలీసుశాఖలో విశ్రాంత ఉద్యోగి. తల్లి గృహిణి. అత్యంత వెనుకబడిన లంబాడ సామాజికవర్గంలో జన్మించిన ఆమె ఐదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. ఆరోతరగతి నుంచి, ఇంటర్మీడియట్ వరకు చలకుర్తి క్యాంపు నవోదయ పాఠశాలలో చదువుకున్నారు. వెంటనే ఆమెకు నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా ఉద్యోగం లభించింది. ఆ వెంటనే వివాహం కూడా అయిపోయింది. కానీ ఆమెకు ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. ఏదో సాధించాలనే తపనతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేశారు. అక్కడితో ఆగకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చదివి, ఆ కోర్సులో యూనివర్శిటీ టాపర్‌గా నిలిచారు. పీజీ చేసినా గీతలోని విద్యాకాంక్ష చల్లారలేదు. నెట్ పరీక్ష రాసి జూనియర్ రీసెర్చ్ ఫెల్లోషిప్ సాధించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కేటగిరీలో ఈ ఘనత సాధించిన ఎస్టీ మహిళల్లో తొలి మహిళ గీతానాయక్. ఫెలోషిప్‌కు వెళ్లాలంటే ఉద్యోగానికి సెలవుపెట్టాలి. అయితే అధికారులు అందుకు అంగీకరించలేదు. జూనియర్ అసిస్టెంట్‌కు పీహెచ్డీ అవసరమా అని కామెంట్లు చేసిన వారూ ఉన్నారు. అయినా ఆత్మస్థైర్యంతో లాస్ ఆఫ్ పే తో వెళ్లిపోయారు. తర్వాత ఉపాధి హామీ పథకం అమలుపై నల్లగొండ జిల్లాలో చేసిన పరిశోధనకు గాను ఆమెకు డాక్టరేట్ లభించింది. విశేషం ఏమిటంటే... జేఆర్ఎఫ్కు వెళ్లిన మూడు నెలలకే జూనియర్ లెక్చరర్ ఉద్యోగం, ఆ తర్వాత మూడునెలలకే డిగ్రీ కళాశాల లెక్చరర్ ఉద్యోగం సాధించటం. మహిళల కోసమే... పరిశోధన కోసం ఉపాధి హామీ పథకాన్నే ఎందుకు ఎంచుకున్నారనే దానికి సమాధానంగా తాను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడి పరిస్థితులు ముఖ్యంగా గ్రామాల్లోని మహిళలకు ఆర్థిక సాధికారత ఏ మేరకు సాకారమవుతుందనే అంశాలను తెలుసుకునేందుకే ఎంచుకున్నా నంటున్నారు గీతానాయక్. ఈ పథకం అమలులో కొన్ని లోపాలున్నా... మొత్తంమీద మహిళలకు కొంత ఆర్థిక భరోసా లభించిందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో సమానంగా స్త్రీలకు వేతనం ఇవ్వడమనే విప్లవాత్మక మార్పునకు నాంది పలికిందని సంతృప్తి వ్యక్తం చేశారామె. ఇప్పటి వరకు ఆమె 12 జాతీయస్థాయి సెమినార్లు, రెండు అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇద్దరు పిల్లలున్నా... గీతానాయక్ సక్సెస్ స్టోరీ వెనుక ఆమె అకుంఠిత దీక్ష, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ముఖ్యంగా భర్త చంద్రకాంత్ నాయక్ అండ, అలాగే ఆమె గైడ్ డాక్టర్ వై.పార్థసారథి, ఉద్యోగ సహచరుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్.సురేష్, ఫెలో స్కాలర్స్ రమేష్, డాక్టర్ వెంకట రామిరెడ్డిల సహకారం ఎంతగానో ఉన్నాయి. పెళ్లి అయి, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా తన చదువుల ప్రస్థానాన్ని ముందుకు సాగించి, లక్ష్యసాధన పూర్తి చేసిన గీతానాయక్‌ను చూస్తే యూత్‌కి రోల్ మోడల్‌గా అనిపిస్తారు. ‘‘వెనుకబడిన వర్గాలు, అణగారిన ప్రజలకు ఆర్థిక వనరుగా ఈ పథకం ఉంది. ఈ పథకం ద్వారా వారి జీవనశైలిలో కూడా మార్పు వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఈ పథకం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునేందుకే దీనిపై పరిశోధన చేశా’’ - డాక్టర్ గీతానాయక్ -
యువ శాస్త్రవేత్త పురస్కారానికి డాక్టర్ సతీష్ ఎంపిక
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ బాటనీ విభాగంలో డాక్టరేట్ పూర్తిచేసిన డాక్టర్ సుతారి సతీష్ యువ శాస్త్రవేత్త పురస్కారానికి ఎంపికయ్యూరు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు (ఎస్ఈఆర్బీ) డీఎస్టీ వారు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. 2013లో పీహెచ్డీ చేసిన సతీష్ ఈ పురస్కారం అందుకోనుండడం విశేషం. గ్రేటర్ హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలు రకాల కాలుష్యాల వల్ల పర్యావరణంలో సంభవిస్తున్న మార్పులు... దానికనుగుణంగా మారుతున్న మొక్కల అనుక్రమం... సహజ, కాలుష్య ప్రాంతంలో పెరుగుతున్న మొక్కల అనుక్రమం వంటి పలు అంశాలపై 3 సంవత్సరాలపాటు పరిశోధన చేయనున్నారు. క్షేత్ర పర్యటనలో వెల్లడైన అంశాలను నివేదికను అందజేసి మార్గదర్శకాలను సూచిస్తారు. కేయూలోని బాటనీ విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వత్సవాయ ఎస్ రాజు పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తిచేసిన సతీష్ అంతర్జాతీయ జర్నల్స్‌లో పది పరిశోధన పత్రాలు ప్రచురించారు.18 జాతీయ ,అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాలను సమర్పించారు. 2009 నుంచి 2011 వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్ వారి ఫెల్లోషిప్, 2012-2013లో యూజీసీ న్యూఢిల్లీ నుంచి ఫెల్లోషిప్ అందుకున్నారు. ప్రస్తుతం యువశాస్త్రవేత్త పురస్కారంతో మరో మూడు సంవత్సరాలపాటు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్‌లో ప్రముఖ శాస్త్రవేత్త సీనియర్ ఆచార్యులు ఎంఎన్వీ ప్రసాద్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేయనున్నారు. -
'మురారీ వ్యాఖ్యలు విని షాక్ అయ్యా'
చెన్నై: దర్శకుడు కె.రాఘవేంద్రరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిర్మాత కె.మురారీ క్షమాపణ చెప్పాలని సీనియర్ నిర్మాత, జి.ఆర్.పి ఆర్ట్స్ అధినేత ఆర్.వి. గురుపాదం డిమాండ్ చేశారు. ఇటీవల గీత విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టర్ బిరుదును అందుకున్న ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆ బిరుదుకు అర్హుడు కాదంటూ నిర్మాత మురారీ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన ఆర్.వి.గురుపాదం మురారీ చర్యల్ని తీవ్రంగా ఖండించారు. ఆయన చెన్నైలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మురారీ వ్యాఖ్యలు విని షాక్ అయ్యానన్నారు. తెలుగు సినిమా గర్వించ దగ్గ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి బాబా వంటి గొప్ప భక్తిరస కథా చిత్రాలను తెరపై ఆవిష్కరించిన ఖ్యాతి రాఘవేంద్రరావుదన్నారు. ఆదుర్తి సుబ్బారావు, వి.మధుసూదనరావు, వి.బి.రాజేంద్ర ప్రసాద్, కె.ఎస్.ఆర్ దాసు దాసరి నారాయణ రావు లాంటి తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రను తిరిగి రాసిన దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరన్నారు. కమర్షియల్ దర్శకుడిగా తనదైన ముద్రవేసుకున్న రాఘవేంద్రరావుది నేటి స్టార్ హీరోలు వెంకటేష్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటివారిని తెరకు పరిచయం చేసిన ఘనత అన్నారు. ఎన్టీ రామారావు, అక్కనేని నాగేశ్వరరావు, చంద్రబాబులాంటి వారికి అత్యంత సన్నిహితులైన రాఘవేంద్రరావును చాలా కొన్ని చిత్రాలు నిర్మించిన మురారీ విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. వ్యక్తిగత కారణాలతో ఒక వ్యక్తిని బహిరంగంగా విమర్శించడం హర్షనీయం కాదన్నారు. ఈ వ్యవహారంలోకి మురారీ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. లేని పక్షంలో వ్యవహారం చాలా వరకు వెళుతుందని హెచ్చరించారు. కె.మురారీ అంశాన్ని హైదరాబాద్‌లోని చిత్ర పరిశ్రమకు చెందిన అన్ని శాఖల ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆర్.వి.గురుపాదం వెల్లడించారు. -
మిస్సైల్స్ రూపకర్త అవినాశ్ చందర్‌కు డాక్టరేట్
విశాఖపట్నం:మిస్సైల్స్ రూపకర్త, కేంద్ర రక్షణశాఖ శాస్త్రసాంకేతిక సలహాదారు డాక్టర్ అవినాశ్ చందర్‌కు గీతం విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. గీతమ్ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా డాక్టర్ అవినాశ్ చందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు డాక్టర్ ఆఫ్ సైన్స్ ప్రదానం చేశారు. సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ, దర్శక నిర్మాత రాఘవేంద్రరావు, పారిశ్రామికవేత్త మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్లకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. ** -
కే.రాఘవేంద్రరావు డాక్టరేట్‌కు అనర్హుడు:నిర్మాత కే.మురారీ
తమిళ సినిమా : ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్రరావుపై మరో ప్రముఖ నిర్మాత కే.మురారి నిప్పులు చెరిగారు. రాఘవేంద్రరావు సంస్కారంలేని వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి గౌరవ డాక్టరేట్ బిరుదు అందుకునే అర్హత లేదని మండిపడ్డారు. గోరింటాకు, నారినారి నడుమమురారి, త్రిశూలం, సీతారాముడు తదితర చిత్రాల నిర్మాత మురారి. అదేవిధంగా శతాధిక చిత్రాల దర్శకుడు కే.రాఘవేంద్రరావు. కాగా కే.రాఘవేంద్రరావుతోపాటు మరో ఇద్దరు ప్రముఖులకు వైజాగ్‌లోని గీతం యూ నివర్సిటీ గౌరవ డాక్టరేట్ బిరుదును ప్రకటించింది. ఈ నేపథ్యంలో దర్శకు డు కే.రాఘవేంద్రరావు డాక్టరేట్ అవార్డు నందుకోనుండటాన్ని నిర్మాత కే.మురారి తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఆయన శుక్రవారం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రాఘవేంద్రరావుపై ధ్వజమెత్తారు. రాఘవేంద్రరావు కుసంస్కారి అని అన్నారు. ఒకసారి ఆయన చెన్నైలో మాయాజాల్ సినీథియేటర్కు సినిమా చూడటానికొచ్చారని, విషయం తెలిసి తానాయాన్ని ఇంటికి ఆహ్వానించానని చెప్పారు. తన ఇంటిని పరీక్షిస్తున్న రాఘవేంద్రరావుకు తన తల్లి ఫొటోను చూపించగా అంతఅసహ్యంగా ఉందేంటంటూ ఫొటోను కిందపడేసిన కుసంస్కారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను నిర్మించిన త్రిశూలం చిత్రం హిందీ రీమేక్ హక్కులపై తనకు రావాల్సిన మూడు లక్షల రూపాయలను ఇప్పటికీ తనకివ్వలేదని ఆరోపించారు. అసలు ఆయనేమి సాధించాడని ఆయనకీ గౌరవ డాక్టరేట్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనేమ్మన్నా సామాజిక సేవ చేశాడా..? అంటూ విమర్శించారు. రాఘవేంద్రరావు సొంత కథలతో తెరకెక్కించిన చిత్రాలన్ని ప్లాఫ్లేనని అన్నారు. రాఘవేంద్రరావుకు డాక్టరేట్ అనగానే ఇప్పటి వరకూ ఆ బిరుదుపై ఉన్న గౌవరం పోయిందని కే.మురారి అన్నారు. -
ఉప్పొంగిన ఉత్సాహం..
మలేసియా టౌన్షిప్: పట్టాలు అందుకున్న వేళ విద్యార్థుల్లో ఉత్సాహం ఉరకలేసింది. పట్టాలను గాల్లోకి ఎగుర వేశారు. స్నేహితులతో కలిసి స్టెప్పులేశారు. కెమెరాల్లో ఫొటోల్లో తీసుకున్నారు. కూకట్పల్లి జేఎన్టీయూహెచ్లో గురువారం ఐదో స్నాతకోత్సవం ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. పలు కోర్సుల వారికి పట్టాలు అందజేయడంతోపాటు పీహెచ్డీ పూర్తి చేసిన 150 మంది విద్యార్థులకు డాక్టరేట్ ప్రదానం చేశారు. వర్సిటీ ఉపకులపతి రామేశ్వర్రావు చేతుల మీదుగా పట్టాలు పుచ్చుకున్నారు. వివిధ కళాశాలలకు చెందిన 98 మంది గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. తమ పిల్లలు గోల్డ్‌మెడల్స్ అందుకునే క్రమంలో వారి తల్లిదండ్రులు పరవశించిపోయారు. ఆనందంగా ఉంది.. మూడు గోల్డ్ మెడల్స్ సాధించ డం ఎంతో ఆనందంగా ఉంది. అమెరికాకు వెళ్లి ఎంఎస్ పీహెచ్ డీ పూర్తి చేయాలనుకుంటున్నా. ఫార్మసీలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలనేదే నా జీవిత ఆశయం. - ఎంవీఎన్‌ఎస్ అనూష సొంతంగా కంపెనీ స్థాపిస్తా.. బీటెక్‌లో గోల్డ్‌మెడల్ సాధించా. ఆస్ట్రేలియాలోని అడ్యులాడే యూనివర్సిటీలో ఎంఈ చేయాలని ఉంది. ఆ తరువాత పీహెచ్డీ చేస్తా. సొంతంగా కంపెనీ స్థాపించి సిర్థపడాలని ఉంది. - కేశభోని రాజేందర్‌గౌడ్ అమెరికాలో ఎంఎస్ చేస్తా.. కంప్యూటర్ సైన్స్‌లో రెండు మెడ ల్స్ సాధించిన. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే సాఫ్ట్వేర్ రంగంలోనే స్థిరపడాలని ఉంది. సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాలనే కోరిక ఉంది. - అనితారెడ్డి స్వర్ణ -
సాహిత్య భీష్ముడికి డాక్టరేట్
పండిత కవిగా, ప్రముఖ పరిశోధకులుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తికి గౌరవ డాక్టరేట్ లభించింది. సాహితీరంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన హైదరాబాద్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆయనకు గౌరవ పురస్కారం అందజేసింది. పాలమూరు జిల్లా సాహితీవనంలో కలికితురాయిగా, సాహిత్య భీష్ముడిగా పేరొందిన ఆయన చిన్నతనం నుంచి పేదరికాన్ని అనుభవిస్తూనే అంచెలంచెలుగా ఎదిగి సాహితీ రంగానికి వన్నెతెచ్చారు. నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన ఈ సాహిత్య భీష్ముడు 84ఏళ్ల పడిలో ఉన్నా నేటికీ కలం కదిలించనిదే పొద్దుగుంకనివ్వడు. నిరంతర పరిశోధకుడిగా ఉంటూ ఎన్నో రచనలు చేసిన కపిలవాయి సాహితీ అభిమానులకు, ఎందరో విద్యార్థులకు గురువుగా మారారు. పాలమూరు దేవాలయాల చరిత్ర, శాసనాలు, మరెన్నో సాహిత్య అంగాలను పరిశోధన చేసి పుస్తకరూపం ఇచ్చిన ఆయన నడిచే గ్రంథాలయంగా మారారు. ఆయన పై పరిశోధనలు చేసి ఎందరో ఎంఫిల్ సాధిం చారు. పాలమూరు జిల్లా విజ్ఞాన సర్వస్వంగా చరిత్రకారులు కపిలవాయిని విశ్లేషిస్తారు. 14సంవత్సరాల చిరుప్రాయంలోనే రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించిన కపిలవాయి పద్యం, గద్యం, వచన కవితలు, గేయాలు, నాటకాలు, కథలు, నవలలు, సంకీర్తనలు, హరికథలు, చారిత్రక కావ్యాలు, వ్యాఖ్యానాలు, చిత్రకవిత్వం, పరిష్కరణాలు, ద్విపదాలు, ఉదాహరణ ప్రక్రియలు లాంటి దాదాపు 80వరకు రచించారు. తాళపత్ర గ్రంథ సేకరణ, విశ్లేషణలో కూడా ఆయన నేర్పరి. సన్మానాలు.. పురస్కారాలు కపిలవాయి ఎన్నో బిరుదులు, అవార్డులు, సన్మానాలు అందుకున్నారు. కవితా కళానిధి, పరిశోధక పంచానన, కళాకేసరి లాంటి బిరుదులు ఆయన కృషితో లభించిన వాటిలో కొన్ని. దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డిలతోపాటు గవర్నర్లు, ప్రముఖ కళా వేదికలు, సాహిత్య సంస్థల నుంచి సన్మానాలు అందుకున్నారు. కపిలవాయి రచనలు భాగవత కథాతత్వం, ఆలగ్రామ శాస్త్రం, పాలమూరు జిల్లా దేవాలయాలు, శ్రీ మత్ప్రతాపరిగి ఖండం, కుటుంబగీత, మాంగళ్య శాస్త్రం, దుర్గా భర్గా శతకాలు, ఆర్యా శతకం, స్వర్ణ శకలాలు, గీతాచతుష్పదం, రుధ్రాధ్యాయం, యోగాసక్తా పరిణయం, యయాతి చరిత్రలతోపాటు మరో 70 కావ్యాలను, సుమారు వందకుపైగా పరిశోధనలు, రచనలు ఉన్నాయి. -
MYS ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్
-
సరస్వతీపుత్రుడు ఈ రైతు బిడ్డ
మునగపాక యువకుడికి డాక్టరేట్ మల్టీనేషనల్ కంపెనీలో ప్రిన్సిపల్ ఇంజినీర్ ఉద్యోగం పేదరికంలో పుట్టినా పట్టుదల, కృషి ఉంటే ఏ రంగంలో అయినా రాణించ గలమని నిరూపించాడు మునగపాక గ్రామానికి చెందిన ఆడారి రామభద్రరావు. వ్యవసాయం చేసుకుంటూ చదివించుకున్న కొడుకు ఉన్నత స్థాయికి ఎదగడం పట్ల తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మునగపాకకు చెందిన ఈ యువకుడు ముంబాయి ఐఐటీ నుంచి డాక్టరేట్ అందుకున్నాడు. మునగపాక: మైక్రో చిప్ డిజైనింగ్‌లో కాంపౌండ్ సెమీ కండక్టర్స్ ఫర్ అడ్వాన్స్డ్ నానో ఎలక్ట్రానిక్స్‌లో చేసిన పరిశోధనకు గాను నాలుగు రోజుల క్రితం ముంబాయిలో పిహెచ్డి ప్రదానం చేశారు. దీనివలన తక్కువ పరిమాణం గల చిప్‌లో స్టోరేజి సామర్ధ్యం పెరుగుతుంది. డాక్టరేట్ పొందిన రామభద్రరావు మునగపాకలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆడారి జగ్గారావు కుమారుడు రామభద్రరావు పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోను, ఇంటర్ అనకాపల్లి ఎఎంఎఎల్ కళాశాలలోను, బీఎస్సీ విశాఖ ఎవిఎన్ కళాశాలలో చదువుకున్నాడు. ఆసెట్లో 26వ ర్యాంక్ సాధించి ఎమ్మెస్సీ చేశాడు. గేట్లో 27వ ర్యాంక్‌తోపాటు శాస్త్రవేత్త ప్రవేశపరీక్షలో బిఎఆర్‌సి, డిఆర్‌డిఒ సంస్థల్లో ఉత్తీర్ణత సాధించి, సైంటిస్టుగా ఎదిగాడు. వివిధ అంశాలపై రామభద్రరావు చేసిన పది పరిశోధనలు అంతర్జాతీయంగా ప్రచురితం కాగా 12 అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని ప్రసంగించారు. రామభద్ర రావు చేసిన పరిశోధనల్లో ఒకటి పేటెంట్ హక్కు కూడా పొందడం విశేషం. ఐబిఎం వంటి పలు సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్న రామభద్రరావు ప్రపంచ మొదటి శ్రేణి ఎలక్ట్రానిక్స్ కంపెనీ టీఎస్ఎంసి చైనాలోని తైవాన్ బ్రాంచిలో చేరి రీసెర్చ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రిన్సిపల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. మెరుగైన ప్రభుత్వ మౌలిక సదుపాయాలతోపాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల సహకారం, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత విద్యను సాధించవచ్చని రామభద్రరావు నిరూపించాడు. -
ఎల్ఆర్. ఈశ్వరికి గౌరవ డాక్టరేట్ ప్రదానం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ‘మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల’ లాంటి హుషారెత్తించే పాటలతో ఏడో దశకంలో యువత మతి పోగొట్టిన గాయని ఎల్ఆర్. ఈశ్వరి శనివారం ఇక్కడ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ఆమెతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో నలుగురు ఈ గౌరవ పురస్కారాలను స్వీకరించారు. అకాడమీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్, న్యూ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హెచ్‌టీ. సాంగ్లియానా గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. నాటక రంగంలో 12 నంది అవార్డులు అందుకున్న విజయవాడకు చెందిన పీవీఎన్. కృష్ణ, కర్ణాటక సంగీతంతో పాటు రచనా వ్యాసంగంలోని శ్రీకాకుళానికి చెందిన వీఆర్ఎల్. రాజేశ్వరి, మరణానంతరం దేహదానంపై సమాజంలో అవగాహన కల్పిస్తూ ఇప్పటి వరకు పది వేల దేహ దానాలు చేయించిన పశ్చిమ గోదావరి జి ల్లాకు చెందిన గూడూరు సీతా మహాలక్ష్మి, ఖమ్మం జిల్లాకు చెందిన సమాజ సేవకుడు డాక్టర్ శ్రీనివాస్‌లు డాక్టరేట్లను అందుకున్నారు. ఈ సందర్భంగా సాంగ్లియానా ప్రసంగిస్తూ సమాజ సేవలో నిమగ్నమైన అనేక మందికి తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దిశగా అకాడ మీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్, న్యూ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీలు సాగిస్తున్న కృషిని అభినందించారు. -
రతన్ టాటాకు కెనడా యూనివర్శిటీ డాక్టరేట్
టొరంటో: దేశీ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు కెనడా యార్క్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్‌కు కొత్త ఆవిష్కరణలు(ఇన్నొవేషన్), కార్పొరేట్ సామాజిక బాధ్యతల(సీఎస్ఆర్) నిర్వహణకుగాను ప్రపంచ ప్రసిద్ధి చెందిన యార్క్ యూనివర్శిటీ నుంచి రతన్‌టాటా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఎల్లవేళలా సంప్రదాయ విజ్ఞానానికిమించిన వినూత్న ఆలోచనలు రతన్లో కనిపిస్తుంటాయని ఈ సందర్భంగా యూనివర్శిటీ ప్రొఫెసర్ డర్క్ మాటెన్ టాటాను ప్రశంసించారు. -
నేడు పలువురికి డాక్టరేట్లు
బళ్లారి టౌన్ : విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి శనివారం ఏర్పాటు చేస్తున్న రెండవ స్నాతకోత్సవంలో సమాజంలోని వివిధ రంగాల్లో సేవలందించిన ఎనిమిది మందికి డాక్టరేట్లు ప్రదానం చేయనున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ గాంధేయవాది, సంఘ సంస్కర్త అన్నా హజారేకు డాక్టర్ ఆఫ్ లా, దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జాకబ్ క్రాస్టకు డాక్టర్ ఆఫ్ లా, ముస్లిం వర్గాల సంక్షేమ అభివృద్ధికి పాటు పడుతున్నన దావణగెరెకు చెందిన సీఆర్.నాసిర్ అహ్మద్‌కు డాక్టర్ ఆఫ్ లా అండ్ సోషల్ అవార్డు, తుమకూరు విశ్వవిద్యాలయంలో కులపతిగా పని చేసి 29 పరిశోధనలు చేసి రసాయనశాస్త్రంలో పలు సేవలు అందించిన డాక్టర్ ఎస్ఈ శర్మకు డాక్టర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్, సంఘ సేవకుడు సంగన బసవ స్వామికి డాక్టర్ ఆఫ్ లాను ప్రదానం చేయనున్నారు. ఆధ్యాత్మిక రంగంలో విశిష్ట సేవలందించినందున ఈయనకు డాక్టరేట్ ఇవ్వనున్నారు. ప్రముఖ కన్నడ సినీ నటుడు శివరాజ్‌కుమార్‌కు డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్‌ను, బళ్లారి జిల్లాకు చెందిన రంగస్థల కళాకారిణి సుభద్రమ్మ మన్సూరుకు డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ ప్రదానం చేయనున్నారు. ఈమె జిల్లాలోనే కాక ఇతర జిల్లాలోనూ పౌరాణిక నాటక ప్రదర్శనలో తనదైన శైలిలో పాత్రలు పోషించి పలు అవార్డులు దక్కించుకోవడంతో ఆమెకు ఈ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. విజ్ఞాన రంగం లో పేరుగాంచిన ఉడుపికి చెందిన యూఆర్. రావ్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్ అండ్ స్పేస్ రీసెర్చ్ అవార్డును అందజేయ నున్నారు. అయితే స్నాతకోత్సవానికి అన్నా హజారే గైర్హాజరవుతున్నట్లు యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ మంజప్ప డీ.హొసమని చెప్పారు. ఆయనకు ఇటీవల ఓ చిన్న రోడ్డు ప్రమాదం జరిగినందున హాజరు కాలేకపోతున్నారని తెలిపారు. -
చదువుకున్న చోటే..గౌరవ సత్కారం
కేయూ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ అందుకోనున్న సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ రామ్మోహన్రావు కాకతీయ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కావడం, స్నాతకోత్సవ ముఖ్య అతిథి కూడా ఆయనే కావడం ఈసారి ప్రత్యేకత. కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ 20వ స్నాతకోత్సవానికి క్యాంపస్‌లోని నూతన ఆడిటోరియం సిద్ధమైంది. సోమవారం ఉదయం 11గంటలకు స్నాతకోత్సవం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటివరకు యూనివర్సిటీలో 19 స్నాతకోత్సవాలు జరగ్గా 35మంది ప్రముఖులు గౌరవ డాక్టరేట్లు అందుకున్నా రు. హైదరాబాద్‌లోని సెంట్రల్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డెరైక్టర్ సీహెచ్ రామ్మోహన్‌రావుకు ఈసారి గౌరవ డాక్టరేట్ అందించనున్నారు. గౌరవ డాక్టరేట్ పొందేవారినే ముఖ్య అతిథిగా కూడా ఆహ్వానించాలనే నిబంధన ఈసారి ఉండడంతో రామ్మోహన్రావే ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. గతంలో నిర్వహించిన స్నాతకోత్సవాల్లో ఒకరి నుంచి ఆరుగురి వరకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వ గా ప్రస్తుతం ఒక్కరికే ఇవ్వాలనే నిబంధన వి దించారు. ఏర్పాట్లు పూర్తి స్నాతకోత్సవం కోసం యూనివర్సిటీలో ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఆడిటోరియంను ముస్తాబు చేశారు. గెస్ట్‌హౌస్‌ను రంగులతో తీర్చిదిద్దారు. వీసీ, రిజిస్ట్రార్ పర్యవేక్షణలో వివిధ కమిటీలు పలు విధులు నిర్వర్తిస్తున్నాయి. నిరాశపరిచిన గవర్నర్ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వస్తారని యూనివర్సిటీ అధికారులు భావించి నప్పటికీ ఆయన రావడం లేదని గవర్నర్ పేషీ నుంచి శనివారమే యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందింది. దీంతో గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు అందుకోవాలని ఆశపడిన పీహెచ్డీ పూర్తిచేసిన విద్యార్థులు నిరాశ చెందు తున్నారు. గవర్నర్ స్థానంలో కేయూ వీసీ వెంకటరత్నం పట్టాలు, బంగారు పతకాలు ప్రదా నం చేస్తారు. ఈ స్నాతకోత్సవంలో డిగ్రీ,పీజీ, డిప్లోమా కోర్సుల్లో 174 గోల్డ్‌మెడల్స్, 510 వర కు పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేయనున్నా రు. నోటిఫికేషన్ ఇచ్చాక సకాలంలో స్నాత కో త్సవంపై దృష్టి సారించకపోవటంతో 150 మంది వరకు విద్యార్థులు తమ పట్టాలను తీసు కెళ్లారు. 2010 మే 25నుంచి ఈనెల 10వతేదీ వరకు అవార్డు పొందిన అభ్యర్థులకు కూడా పీ హెచ్డీ పట్టాలను అందించనున్నారు. ఆయా అభ్యర్థులకు పాస్‌లు, బ్యాడ్జీలు అందజే శారు. రామ్మోహన్రావు అందుకున్న అవార్డులు యంగ్ సైంటిస్ట్ అవార్డ్ ఆఫ్ ది ఇండియన్ అసోసియేషన్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్(1990) యంగ్ సైంటిస్ట్ అవార్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ (1982) శ్రీనివాసయ్య మెమోరియల్ అవార్డ్(1996) ది సొసైటీ ఆఫ్ బయాలాజికల్ కెమిస్ట్రీ (ఇండియా) రోహతో అవార్డ్ ఫస్ట్ ఏసియన్ క్యాటరాక్ట్ కాన్ఫరెన్స్(1996-చైనా) శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ (1999) రాన్‌బ్యాక్సీ అవార్డ్ ఫర్ బేసిక్ మెడికల్ సెన్సైస్(2000) జేసీ బోస్ నేషనల్ ఫెల్లోషిప్,డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్అండ్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా (2011) ది స్టేట్ ఇంటలెక్చువల్ ఆనర్ గ్రేట్ సన్ ఆఫ్ ది సాయిల్ (2010) బిరెస్ చంద్రగుహ మెమోరియల్ లెక్చర్ అవార్డ్ ఐఎన్ఎస్ఏ (2014) మెంబర్షిప్ ఇన్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఇవికాక పలు అసోసియేషన్లలో మోహన్‌రావుకు మెంబర్షిప్ ఉంది. అమెరికా అసోసియేషన్ ఫర్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యూలర్ బయాలజీ( యూఎస్ఏ). అసోసియేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్విజన్ అండ్ ఆఫ్తాల్మాలజీ (యూఎస్ఏ), ఇండియన్ ఫొటో బయాలజీ సొసైటీ (ఇండియా), సొసైటీ బయాలజికల్ కెమిస్ట్రీ (ఇండియా). 2009 నుంచి 2011వరకు ఇండియన్ బయోఫిజికల్ సొసైటీకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. 2012 నుంచి ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రామ్మోహన్రావు కేయూ పూర్వ విద్యార్థే స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ అందుకోనున్న సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ రామ్మోహన్రావు కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న వారే. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన ఆయన జనవరి19, 1954న మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. హుజూరాబాద్‌లోనే హైస్కూలు విద్య పూర్తిచేసిన మోహన్‌రావు ఓయూలో బీఎస్సీ పూర్తిచేశారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తిచేశారు. 1984లో హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్న రామ్మోహన్రావు 2009 నుంచి సీసీఎంబీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన వద్ద 17మంది పరిశోధక విద్యార్థులు పీహెచ్డీ చేశారు. 13మంది పోస్ట్ డాక్టరల్ ఫెల్లోషిప్‌కు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. జాతీయ, అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్స్‌లో ఎడిటోరియల్ బోర్డ్ సభ్యుడిగా వ్యవహరించిన డాక్టర్ రామ్మోహన్రావు ప్లాంట్స్ఫీల్డ్లో నూతన ఆవిష్కరణలకు గాను నాలుగు యూఎస్ పేటెంట్లు కలిగి ఉన్నారు. జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షుడిగాను వ్యవహరిస్తున్న ఆయన ‘సైన్స్ ఫర్ ది పీపుల్స్ మూవ్మెంట్’కు తనవంతు సహకరిస్తున్నారు.