
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్‌కు ‘క్రిస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ’ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఆదివారం ఉదయం 10గంటలకు అమీర్‌పేట్‌లోని సితార ఆడిటోరియంలో ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
ఈ మేరకు యూనివర్సిటీ వీసీ శోభన్‌బాబు ప్రకటన విడుదల చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం సహా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని డాక్టరేట్‌ను ప్రదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు.