
హైదరాబాద్: కుల, మతాలకు అతీతంగా సేవాభావం కలిగి సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని టీఎన్జీఓ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ సూచించారు. క్రైస్ట్ న్యూ టెస్ట్‌మెంట్ డీమ్డ్ యూనివర్సిటీ ఆదివారం ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందించింది. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వర్సిటీ వీసీ శోభన్‌బాబు తెలిపారు.
సామాజిక సేవలో భాగంగా మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు స్వర్ణపతకాన్ని అందించారు. ఈ సందర్భంగా స్వామి గౌడ్ మాట్లాడుతూ..డాక్టరేట్ హోదా బాధ్యతను పెంచుతుందన్నారు. వివిధ రంగాలకు చెందిన లయన్ విజయ్‌కుమార్, వేణుకుమార్ చుక్కల, ఎన్‌ఎల్ నరసింహరావు, పి. రామలింగేశ్వరశర్మ, వరదా వెంకటేశ్వరరావు, కొండె గౌరీ శంకర్, సుగుణ, భాస్కర్‌రావు, శ్యాంసుందర్, జి.వెంకటేశ్వర్లుకు డాక్టరేట్లను అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మహేంద్రవాడ వెంకటేశ్వరరావు, టీఎన్జీఓ ప్రతినిధులు, వర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment