బాబు మోహన్‌కు గౌరవ డాక్టరేట్ | Honorary Doctorate to Babu Mohan | Sakshi
Sakshi News home page

బాబు మోహన్‌కు గౌరవ డాక్టరేట్

Published Fri, Jan 22 2016 3:28 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

బాబు మోహన్‌కు గౌరవ డాక్టరేట్

బాబు మోహన్‌కు గౌరవ డాక్టరేట్

సిటీబ్యూరో: ప్రముఖ హాస్యనటుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాబు మోహన్‌కు హర్వెస్ట్  బైబిల్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అమెరికన్ మిషన్స్ టీమ్స్ గౌరవ డాక్టరేట్ అందజేసింది. గురువారం రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో  భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, వర్సిటీ డెరైక్టర్ ప్రవీణ్ వర్మ ఆయనకు డాక్టరేట్‌ను అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్న బాబు మోహన్ గెలిచినా ఓడిన అంథోల్‌ను మారువని ప్రజానాయకుడన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ మాణిక్యరెడ్డి, విశ్రాంత డీజీపీ స్వర్ణజిత్ సేన్, బాబు మోహన్ సతీమణి ఇందిర విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement