జర్మనీలో 102 ఏళ్ల బామ్మకు డాక్టరేట్! | in germany a women received doctorate at 102years | Sakshi
Sakshi News home page

జర్మనీలో 102 ఏళ్ల బామ్మకు డాక్టరేట్!

Published Tue, Jun 2 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 3:03 AM

జర్మనీలో 102 ఏళ్ల బామ్మకు డాక్టరేట్!

జర్మనీలో 102 ఏళ్ల బామ్మకు డాక్టరేట్!

 బెర్లిన్: జర్మనీలో 102 ఏళ్ల ఓ బామ్మ డాక్టరేట్ అందుకోబోతున్నారు! అదీ తన 25వ ఏట పూర్తి చేసిన పరిశోధనకు. పరిశోధన అప్పుడే పూర్తయినా ఇన్నాళ్లు జాప్యం కావడం కారణం.. ఆమె తల్లి యూదు కావడమే! బెర్లిన్‌కు చెందిన ఇంగెబోర్గ్ రాపోపోర్ట్ అనే మెడికల్ ప్రొఫెసర్ 1938లోనే డిప్తీరియాపై పీహెచ్‌డీ చేసింది. అయితే ఆమె తల్లి యూదు అని తెలియడంతో నాటి నాజీ అధికారులు ఇంగెబోర్గ్ సమాధాన పత్రాలను పక్కనపెట్టారు. పీహెచ్‌డీ ఆగింది. ఇన్నాళ్లకు ఆమె తనయుడు టామ్(ఈయనా మెడికల్ ప్రొఫెసర్) దీనిపై హంబర్గ్ వర్సిటీకి వెళ్లి ఆరా తీశారు. అయితే నిబంధనల ప్రకారం మౌఖిక పరీక్షకు హాజరుకావాల్సిందేనని అధికారులు చెప్పారు. దీంత్లో బామ్మ మళ్లీ పుస్తకాల దుమ్ము దులిపి, మౌఖిక పరీక్ష  పాసైంది. వచ్చే వారం డాక్టరేట్ అందుకోబోతోంది. ఇంత పెద్ద వయసులో డాక్టరేట్ అందుకున్న మహిళగా రికార్డు కూడా సృష్టించబోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement