కే.రాఘవేంద్రరావు డాక్టరేట్‌కు అనర్హుడు:నిర్మాత కే.మురారీ
తమిళ సినిమా : ప్రముఖ దర్శకుడు కే.రాఘవేంద్రరావుపై మరో ప్రముఖ నిర్మాత కే.మురారి నిప్పులు చెరిగారు. రాఘవేంద్రరావు సంస్కారంలేని వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి గౌరవ డాక్టరేట్ బిరుదు అందుకునే అర్హత లేదని మండిపడ్డారు. గోరింటాకు, నారినారి నడుమమురారి, త్రిశూలం, సీతారాముడు తదితర చిత్రాల నిర్మాత మురారి. అదేవిధంగా శతాధిక చిత్రాల దర్శకుడు కే.రాఘవేంద్రరావు. కాగా కే.రాఘవేంద్రరావుతోపాటు మరో ఇద్దరు ప్రముఖులకు వైజాగ్‌లోని గీతం యూ నివర్సిటీ గౌరవ డాక్టరేట్ బిరుదును ప్రకటించింది.
ఈ నేపథ్యంలో దర్శకు డు కే.రాఘవేంద్రరావు డాక్టరేట్ అవార్డు నందుకోనుండటాన్ని నిర్మాత కే.మురారి తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఆయన శుక్రవారం చెన్నైలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి రాఘవేంద్రరావుపై ధ్వజమెత్తారు. రాఘవేంద్రరావు కుసంస్కారి అని అన్నారు. ఒకసారి ఆయన చెన్నైలో మాయాజాల్ సినీథియేటర్‌కు సినిమా చూడటానికొచ్చారని, విషయం తెలిసి తానాయాన్ని ఇంటికి ఆహ్వానించానని చెప్పారు. తన ఇంటిని పరీక్షిస్తున్న రాఘవేంద్రరావుకు తన తల్లి ఫొటోను చూపించగా అంతఅసహ్యంగా ఉందేంటంటూ ఫొటోను కిందపడేసిన కుసంస్కారి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా తాను నిర్మించిన త్రిశూలం చిత్రం హిందీ రీమేక్ హక్కులపై తనకు రావాల్సిన మూడు లక్షల రూపాయలను ఇప్పటికీ తనకివ్వలేదని ఆరోపించారు. అసలు ఆయనేమి సాధించాడని ఆయనకీ గౌరవ డాక్టరేట్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనేమ్మన్నా సామాజిక సేవ చేశాడా..? అంటూ విమర్శించారు. రాఘవేంద్రరావు సొంత కథలతో తెరకెక్కించిన చిత్రాలన్ని ప్లాఫ్‌లేనని అన్నారు. రాఘవేంద్రరావుకు డాక్టరేట్ అనగానే ఇప్పటి వరకూ ఆ బిరుదుపై ఉన్న గౌవరం పోయిందని కే.మురారి అన్నారు.