బేబమ్మగా ఖుషీ | uppena remake in bollywood with khushi kapoor | Sakshi
Sakshi News home page

బేబమ్మగా ఖుషీ

Published Sat, Mar 23 2024 12:14 AM | Last Updated on Sat, Mar 23 2024 12:14 AM

uppena remake in bollywood with khushi kapoor - Sakshi

దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్‌ల చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ ‘ఉప్పెన’ హిందీ రీమేక్‌లో నటించనున్నారని టాక్‌. వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ (2021) తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కరోనా సమయంలో విడుదలైన ఈ మూవీ రూ. 100 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంలో బేబమ్మగా తనదైన నటనతో అలరించిన కృతీ శెట్టి ప్రేక్షకుల మనసుల్లో బేబమ్మగా క్రేజ్‌ సంపాదించుకున్నారు. ఈ హిట్‌ మూవీని నిర్మాత బోనీ కపూర్‌ హిందీలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆ విషయాన్ని పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ తెలుగులో అంగీకరించిన రెండో చిత్రం సందర్భంగా చెప్పారట బోనీ. ‘దేవర’ (ఎన్టీఆర్‌ హీరో) మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు జాన్వీ. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే రామ్‌ చరణ్‌తో నటించే క్రేజీ ఆఫర్‌ సొంతం చేసుకున్నారీ బ్యూటీ. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం  ్రపారంభోత్వంలో జాన్వీ కపూర్‌తో పాటు ఆమె తండ్రి బోనీ కపూర్‌ కూడా పాల్గొన్నారు.

అక్కడికి వచ్చిన అతిథులతో సరదాగా ముచ్చటించిన బోనీ కపూర్‌.. ‘‘బుచ్చిబాబు తీసిన ‘ఉప్పెన’ సినిమా చూశాను. కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాని హిందీలో రీమేక్‌ చేయాలనే ఆలోచన ఉంది. మా చిన్నమ్మాయి ఖుషీ కపూర్‌ని ‘ఉప్పెన’ మూవీ చూడమని చెప్పాను’’ అన్నారట. దీంతో ‘ఉప్పెన’ బాలీవుడ్‌ రీమేక్‌లో హీరోయిన్‌గా ఖుషీ నటిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement