Uppena Movie
-
ఉప్పెన బ్యూటీ.. న్యూలుక్, అస్సలు గుర్తుపట్టలేరు (ఫోటోలు)
-
ఉప్పెన భామకు కలిసిరాని కోలీవుడ్.. అందుకేనా ఈ పాట్లు!
ప్రస్తుతం నటీనటులకు పబ్లిసిటీకి సోషల్ మీడియానే వేదికగా మారిందనే చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్లు సోషల్ మీడియాతోనే క్రేజ్ తెచ్చుకుంటున్నారు. తమ అందమైన ఫొటోలను, తన అభిప్రాయాలను పంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఉప్పెన భామ కృతిశెట్టి ప్రస్తుతం అదేబాటలో నడుస్తోంది. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ వయసు ఇప్పుడు కేవలం 20 ఏళ్లే. అయినప్పటికీ హిందీ, తెలుగు, తమిళం భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ చిన్నది 16 ఏళ్ల వయసులోనే సూపర్ 30 అనే హిందీ చిత్రం ద్వారా నాయకిగా రంగప్రవేశం చేశారు.ఆ తరువాత తెలుగులో ఉప్పెన అనే చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్నారు. దీంతో ఈమె రాత్రికి రాత్రే క్రేజీ నటి అయిపోయారు. అలా కొన్ని చిత్రాల్లో నటించిన కృతిశెట్టికి అక్కడ అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో కోలీవుడ్‌పై కన్నేశారు. అయితే ఇక్కడ ఇంకా సరైన విజయాన్ని అందుకోలేదు. తమిళ దర్శకుడు లింగుసామి, టాలీవుడ్ హీరో రామ్ హీరోగా తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ది వారియర్‌తో కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతిశెట్టికి ఆ చిత్రం నిరాశపరచింది. అదేవిధంగా నాగచైతన్య హీరోగా మరో తమిళ దర్శకుడు వెంకట్‌ప్రభు తెరకెక్కించిన కస్టడి చిత్రంలోనూ కృతిశెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఆమె కేరీర్‌కు ఉపయోగపడలేదు.అయితే కోలీవుడ్‌లో ఈమెకు మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కార్తీకి జంటగా వా వాద్ధియార్, ప్రదీప్ రంగనాథన్ సరసన ఎల్ఐసీ, జయంరవికి జంటగా జీనీ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ఏ ఒక్క చిత్రం హిట్ అయినా, కృతిశెట్టి కోలీవుడ్‌లో పాగా వేసినట్లే. ఈమె కూడా అదే కోరుకుంటున్నట్లు తెలిసింది. ఇకపోతే సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచార ప్రయత్నాలు చేయడం మాత్రం ఆపలేదు. ఇటీవల కృతీశెట్టి పూర్తిగా ముత్యాలు పొదిగిన దుస్తులు ధరించి సొగసులను ఆరబోస్తూ ప్రత్యేకంగా ఫొటో సెషన్ చేయించుకున్నారు. ఆ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ హిట్ కోసం పాట్లు అంటూ జోరుగా కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
ఉప్పెన కేవలం ఆయన కోసమే చేశా: విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఉప్పెన మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఆయన మహారాజా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉప్పెన చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.విజయ్ సేతుపతి మాట్లాడుతూ..'ఉప్పెన సినిమా కేవలం నేను బుచ్చిబాబు కోసమే చేశా. ఆయనకున్న ప్యాషన్ చూసి నేను ఒప్పుకున్నా. చాలా తక్కువ రెమ్యునరేషన్‌కే ఉప్పెన సినిమా చేశా. మామూలుగా అయితే నాలాంటి యాక్టర్స్ చేయడానికి వెనుకాడతారు. కానీ సినిమా పట్ల బుచ్చిబాబుకున్న ప్యాషన్ చూసే ఆ చిత్రంలో నటించా' అని అన్నారు. I did #Uppena only because of @BuchiBabuSana , Less Remuneration కి ఆ సినిమా చేశాను - #VijaySethupathi pic.twitter.com/qRBIGwwFho— Rajesh Manne (@rajeshmanne1) June 10, 2024 -
కూతురి లాంటి ఆమెతో రొమాన్స్ చేయలేను.. స్టార్ హీరో ఆసక్తికర కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మహారాజా మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్ దర్శకత్వంతో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.ప్రస్తుతం విజయ్ ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగాఉప్పెన ఫేమ్ కృతిశెట్టిపై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనతో సినిమాలు ఒప్పుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ..'నేను నటించిన డీఎస్పీ చిత్రంలో కృతిని హీరోయిన్గా తీసుకుంటే చేయనని చెప్పా. ఎందుకంటే ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించా. అది సూపర్‌హిట్‌గా నిలిచింది. అందులో నా కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేయలేనని చెప్పా. కూతురిగా భావించిన కృతిశెట్టితో నటించడం నా వల్ల కాదు' అని అన్నారు. కాగా.. గతంలోనూ విజయ్ సేతుపతి ఇదే విషయాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఉప్పెన తర్వాత రెండు సినిమాల్లో హీరోయిన్గా కృతిని ఎంపిక చేయగా తిరస్కరించారు. -
బేబమ్మగా ఖుషీ
దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ల చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ‘ఉప్పెన’ హిందీ రీమేక్‌లో నటించనున్నారని టాక్. వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ (2021) తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కరోనా సమయంలో విడుదలైన ఈ మూవీ రూ. 100 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రంలో బేబమ్మగా తనదైన నటనతో అలరించిన కృతీ శెట్టి ప్రేక్షకుల మనసుల్లో బేబమ్మగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ హిట్ మూవీని నిర్మాత బోనీ కపూర్ హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ విషయాన్ని పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తెలుగులో అంగీకరించిన రెండో చిత్రం సందర్భంగా చెప్పారట బోనీ. ‘దేవర’ (ఎన్టీఆర్ హీరో) మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు జాన్వీ. ఈ సినిమా షూటింగ్లో ఉండగానే రామ్ చరణ్‌తో నటించే క్రేజీ ఆఫర్ సొంతం చేసుకున్నారీ బ్యూటీ. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ్రపారంభోత్వంలో జాన్వీ కపూర్‌తో పాటు ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన అతిథులతో సరదాగా ముచ్చటించిన బోనీ కపూర్.. ‘‘బుచ్చిబాబు తీసిన ‘ఉప్పెన’ సినిమా చూశాను. కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచన ఉంది. మా చిన్నమ్మాయి ఖుషీ కపూర్‌ని ‘ఉప్పెన’ మూవీ చూడమని చెప్పాను’’ అన్నారట. దీంతో ‘ఉప్పెన’ బాలీవుడ్ రీమేక్‌లో హీరోయిన్గా ఖుషీ నటిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. -
'ఉప్పెన' రీమేక్.. స్టార్ హీరోయిన్ చెల్లెలుకు ఛాన్స్
తెలుగు చిత్రం 'ఉప్పెన' పేరుకు తగ్గట్టుగానే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్. అయినా చిత్రం సంచలన విజయం సాధించింది. వర్ధమాన నటుడు వైష్ణవ తేజ్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంతోనే కృతి శెట్టి ఎంట్రీ ఇచ్చింది. నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళం, బాలీవుడ్లో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తాజాగా రామ్ చరణ్- జాన్వీకపూర్ల కొత్త ప్రాజెక్ట్ RC16 సినిమా ఓపెనింగ్ కార్యక్రం జరిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బుచ్చిబాబు డైరెక్టర్‌గా ఉన్నారు. సినిమా ప్రారంభ కార్యక్రమంలో బోనీ కపూర్ మాట్లాడుతూ.. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఉప్పెన సినిమా చూశానని అది తనకు బాగా నచ్చిందని చెప్పారట. అంతేకాకుండా ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయాలనే అభిప్రాయం ఉన్నట్లు పేర్కొన్నారట. ఈ క్రమంలో తన చిన్న కూతురు ఖుషి కపూర్‌ని ఉప్పెన సినిమా చూడమని బోనీ కపూర్ సలహా ఇచ్చారట. ఒకవేళ బాలీవుడ్లో ఉప్పెన చిత్రాన్ని రీమేక్ చేస్తే అందులో హీరోయిన్గా ఖుషి కపూర్‌ను సెట్ చేయాలని ఆయన ప్లాన్‌లో ఉన్నారట. ముంబైలోని ధీరూబాయ్ అంబానీ స్కూల్లో ఖుషి కపూర్ విద్యాభ్యాసం పూర్తిచేసింది. లండన్ ఫిలిం స్కూల్లో నటనలో శిక్షణ కూడా తీసుకుంది. బాలీవుడ్లో సరైన ఎంట్రీ కోసం ఆమె ఎదురుచూస్తుంది. ఉప్పెన సినిమా అయితే ఆమెకు కరెక్ట్‌గా సెట్ అవుతుందని బోనీకపూర్ ప్లాన్‌లో ఉన్నారట. మరీ ఇందులో ఎంతమేరకు నిజం ఉందో తెలియాలంటే బోనీ కపూర్‌నే క్లారిటీ ఇవ్వాలి. (అక్క జాన్వీ కపూర్‌తో ఖుషి కపూర్) మరోవైపు ఉప్పెన సినిమాను కోలీవుడ్‌లో కూడా రీమేక్ చేయాలనే ప్లాన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తుందట. విజయ్ వారసుడు సంజయ్ దర్శకత్వం వహించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒక వేళ తమిళ్లో ఉప్పెన రీమేక్ అయితే అందులో కృతి శెట్టినే హీరోయిన్గా ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువ అని చెప్పవచ్చు. ఇప్పటికే పలు సినిమాలతో కోలీవుడ్‌లో కృతి శెట్టి బిజీగా ఉంది. ఉప్పెన రీమేక్ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇండస్ట్రీలో రూమర్స్ భారీగానే కొనసాగుతున్నాయి. -
కృతిశెట్టి బెల్లీ డ్యాన్స్... వైరల్ హిట్!
'ఉప్పెన'తో తెలుగులోకి అడుగుపెట్టి భారీ విజయాన్ని అందుకుంది కృతిశెట్టి . ఆ తర్వాత వరసగా విజయాలు అందుకున్న ఆ నాయికను ఈ ఏడాది మాత్రం పరాజయాలే పలకరించాయి. తాజాగా ఆమె మలయాళ చిత్రసీమలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బంగార్రాజు, శ్యాంసింగరాయ్ చిత్రాలతో పర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన కస్టడీ ,మాచర్ల నియోజకవర్గం,వారియర్ వంటి చిత్రాలు పెద్దగా మెప్పించలేదు. దీంతో ఆమె తమిళ్,కన్నడ చిత్రాలపై ఆసక్తి చూపింది. అక్కడ పలు అవకాశాలు దక్కించుకుని దూసుకుపోతుంది. తెలుగులో శర్వానంద్‌తో ఒక సినిమాలో నటిస్తుండగా తమిళ్లో లవ్ టుడే చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్‌కు జోడీగా కృతిశెట్టి నటిస్తుంది. ఆపై మలయాళంలో కూడా ఒక సినిమా ఒప్పుకుంది. దీంతో ప్రస్తుతం ఆమె మళ్లీ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఫ్యాన్స్ కోసం ఎప్పుడూ టచ్‌లో ఉండే బేబమ్మ తాజాగా బెల్లీ డ్యాన్స్ వీడియోతో యూత్ మతులు పోగొడుతుంది. విజయ్ బీస్ట్ సినిమాలోని అరబిక్ కుతు సాంగ్ కు బెల్లీ డాన్స్ చేసింది ఈ బ్యూటీ. తన అందంతో పాటు టాలెంట్‌ను కూడా చూపి అందరినీ మెస్మరైజ్ చేసింది. కృతిశెట్టి చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. -
లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?
ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన 'కృతి శెట్టి' తన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఉప్పెన సినిమా తర్వాత ఆమె నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా హిట్టుగా నిలవగా, బంగార్రాజు సినిమా యావరేజ్‌గా నిలిచింది. అలా ఆమెకు మొదటి మూడు సినిమాలు మాత్రమే హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ మధ్య కాలంలో ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకుల నుంచి నెగటివ్ టాక్ రావడంతో డిజాస్టర్లుగా నిలిచాయి. టాలీవుడ్‌కు ఆమె వచ్చిన కొత్తలో అమ్మడి అదృష్టం ఓ రేంజ్లో ఉండేది. ఏ సినిమా అయినా సరే 'కృతి శెట్టి' కావాలి అనేంతగా తన ఇమేజ్ ఉండేది. అప్పట్లో స్టార్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఎవరైనా సరే సినిమా ఛాన్స్‌లు ఇస్తామని ఈ చిన్నదాని వెనుక తెగ తిరిగారు. అయితే అవకాశాలను మాత్రమే అందుకుంది కానీ, విజయాలను అందుకోలేకపోయింది. ఉప్పెన బ్యూటీ అని తెచ్చుకున్న అదే పేరుతో ఇప్పటికీ కొనసాగుతోంది. (ఇదీ చదవండి: మీ నుంచి చాలా నేర్చుకున్నా.. బన్నీపై బాద్ షా ప్రశంసలు!) ప్రస్తుతం ఈ భామ చేతిలో ఒక సినిమా మాత్రమే ఉంది. రాబోయే రోజుల్లో అవకాశాలు వస్తాయో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. కానీ ఈ బ్యూటీ చుట్టూ అప్పుడప్పుడు పలు రూమర్స్ మాత్రం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిని ఆమె తన టీమ్ ద్వారా తిరిగి సమాధానం కూడా చెబుతూ వచ్చేది. పెళ్లిపై రూమర్స్ తాజాగా కృతి శెట్టి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్‌మీడియాలో భారీగా ప్రచారం జరుగుతుంది. మెగా ఫ్యామిలీకి చెందిన 'వైష్ణవ్ తేజ్'తో ఆమె వివాహం అంటూ నెట్టింట వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. ఉప్పెన సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా సమయంలోనే వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైందని పలు రకాలుగా చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే 'మిస్టర్' సినిమా సమయంలో మా మధ్య ప్రేమ మొదలైందని లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ చెప్పిన విషయం తెలిసిందే. సుమారు 7 ఏళ్లు పైగా వారి ప్రేమను దాచి.. నిశ్చితార్థంతో అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. అదే మాదిరి 'కృతి శెట్టి- వైష్ణవ్ తేజ్'లు కూడా షాకిస్తారా..? కాదూ, ఇవన్నీ రూమర్స్ మాత్రమే అని తిప్పికొడతారో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం తనకు లేనట్లు పలుమార్లు బేబమ్మ చెప్పిన విషయం తెలిసిందే. తనకు ఉన్న టాలెంట్‌కు ఒక మంచి కథ పడితే మళ్లీ ఆమె కెరియర్ ఇండస్ట్రీలో దూసుకుపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ బేబమ్మకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ టాలీవుడ్లో ఉంది. తన సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ హిట్ సినిమాతో ప్రారంభం అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కాబట్టి ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకుని తన కెరియర్‌కు ఫుల్స్టాప్ పెట్టకపోవచ్చని తెలుస్తోంది. -
అల్లు అర్జున్‌కు కంగ్రాట్స్: సీఎం కేసీఆర్
హైదరాబాద్: 69వ జాతీయ సినీ అవార్డుల్లో తెలుగు చిత్రాలు సత్తా చాటడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు సాధించిన నటుడు అల్లు అర్జున్ను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తొలిసారిగా తెలుగు నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే.. అవార్డులు సాధించిన ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అలాగే.. నల్లగొండకు చెందిన ముడుంబై పురుషోత్తమాచార్యులుకి జాతీయ ఉత్తమ సినీ విమర్శకుడిగా అవార్డు దక్కడంపైనా సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. తాజాగా.. రెండు రోజుల కిందట 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సుకుమార్డైరెక్షన్లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ పార్ట్ 1 చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. దీంతో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ దక్కించుకున్న తొలి యాక్టర్‌గా బన్నీ చరిత్ర సృష్టించాడు. ఇక ఆరు అవార్డులతో రాజమౌళి మల్లీస్టారర్ ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. ఉప్పెన ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నెగ్గింది. మొత్తంగా తెలుగు సినిమాకు పదకొండు అవార్డులు దక్కాయి. జాతీయ అవార్డ్ విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? -
జాతీయ అవార్డుల విషయంలో టాలీవుడ్ గళాన్ని వినిపించిన శ్రీలేఖ
69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రసీమ సత్తా చాటింది. ఈ అవార్డుల విషయంలో సౌత్ ఇండియాకు ఎక్కువగా అన్యాయం జరుగుతుంటుందనే విమర్శ గతంలో ఎక్కువగా వినిపించేది. అందులో టాలీవుడ్‌కు మరింత అన్యాయం జరుగుతుందని బహిరంగంగానే పలువురు జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యులపైనే కామెంట్లు చేశారు. 1967లో 15వ జాతీయ అవార్డుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడి అవార్డు ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి నేటి వరకు టాలీవుడ్ నుంచి ఏ ఒక్క హీరోకి ఉత్తమ నటుడి అవార్డు దక్కలేదు. (ఇదీ చదవండి: 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. అదెలా?) తాజాగ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకుని తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. టాలీవుడ్లో ఎన్టీఆర్,నాగేశ్వరావు,కృష్ణ,చిరంజీవి ఇలా ఎందరో సినీ చరిత్రలో గొప్ప నటులున్నా ఇప్పటివరకూ ఎవ్వరికీ ఈ అవకాశం దక్కలేదు. దీంతో ఒక్కోసారి జ్యూరీ సభ్యులపై కూడా విమర్శలు వచ్చేవి. ఈ విభాగంలో తొలి అవార్డును బెంగాలీ నటుడు ఉత్తమ్‌కుమార్ సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎక్కువగా నార్త్ నుంచే ఆధిపత్యం ఉందని చెప్పవచ్చు. నార్త్ హీరోలకే ఎక్కువ అవార్డులు ఇప్పటి వరకు ఈ అవార్డు అందుకున్న వారిలో బాలీవుడ్ నటులు 27, మలయాళం 13, తమిళ్ 9, బెంగాలీ నుంచి ఐదుగురు ఉన్నారు. కన్నడ, మరాఠీ నటులకు మూడేసి చొప్పున అవార్డులను దక్కించుకున్నారు. అత్యధికంగా అమితాబ్ బచ్చన్ నాలుగుసార్లు, కమల్‌హాసన్,అజయ్‌దేవగణ్, మమ్ముట్టి మూడుసార్లు అవార్డు దక్కించుకున్నారు. మోహన్‌లాల్, ధనుష్,మిథున్చక్రవర్తి, సంజీవ్‌కుమార్, నసీరుద్దీన్‌షా, ఓంపురి కూడా రెండేసిసార్లు అవార్డు గెలుచుకున్నారు. విక్రమ్,సూర్య, ప్రకాశ్‌రాజ్,సురేష్‌గోపి,ఎంజీ రామచంద్రన్ వంటివారు కూడా ఈ పురస్కారాన్ని ఒకసారి అందుకున్నారు. శంకరాభరణం చిత్రానికి 4 అవార్డులు టాలీవుడ్ ఎవర్గ్రీన్ సినిమా అయిన శంకరాభరణం చిత్రానికి అప్పట్లో అత్యధికంగా 4 జాతీయ అవార్డులు దక్కగా మేఘ సందేశం సినిమాకు కూడా 4 పురస్కారాలు దక్కాయి. ఆప్పటి నుంచి టాలీవుడ్‌కు అంతగా జాతీయ అవార్డులు వరించలేదనే చెప్పవచ్చు. తాజాగ RRR మూవీకి 6 అవార్డులతో పాటు మొత్తంగా టాలీవుడ్‌కు 11 అవార్డులు దక్కాయి. జాతీయ చలన చిత్ర పురస్కారాల కమిటీ సభ్యుల ముందు తెలుగు చిత్రాల గళాన్ని గట్టిగా వినిపించే వారు ఉంటే తప్పక టాలీవుడ్‌కు న్యాయం జరుగుతుందని ఎంఎం శ్రీలేఖ నిరూపించారనే చెప్పవచ్చు. జ్యూరీ సభ్యురాలిగా ఎంఎం శ్రీలేఖ 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జ్యూరీ సభ్యురాలిగా సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ ఉన్నారు. ఈసారి టాలీవుడ్ సినిమాల ప్రత్యేకత గురించి కమిటీ సభ్యుల ముందు ఆమె గట్టిగానే గళం వినిపించారు. అవార్డుల అనౌన్స్మెంట్ తర్వాత ఎంఎం శ్రీలేఖ తన అభిప్రాయాన్ని ఇలా తెలిపారు. 'ప్రతి ఏడాది తెలుగు సినిమాలంటే కొంచెం నిర్లక్ష్యం. కంటి తుడుపుగా ఒకటో రెండో అవార్డులు ఇస్తున్నారు. దీనిపై జ్యూరీలో గట్టిగా మాట్లాడేవారు కావాలి. తెలుగుకు ఎందుకు ఇవ్వరు? అని మాట్లాడ గలగాలి. అయితే ఆ సినిమాలో విషయం ఉండాలి.. లేకుంటే మాట్లాడలేం' అన్నారు సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. 69వ జాతీయ అవార్డుల్లో దక్షిణాది తరఫున జ్యూరీలో శ్రీలేఖతో పాటు రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ఉన్నారు. మామూలుగా ఫైనల్ ప్యానల్లో భోజ్‌పురి వాళ్లు ఉంటారని శ్రీలేఖ తెలిపారు. వాళ్లకు తెలుగు రాదు అలాంటప్పుడు మహానటి సావిత్రి గురించి ఏం తెలుస్తుందని ఆమె గుర్తుచేశారు. అందుకే జ్యూరీలో ఉన్న తెలుగువారు తెలుగు సినిమాల గురించి గట్టిగా చెప్పాలని పేర్కొన్నారు. 'ఓ జ్యూరీ సభ్యురాలిగా నా అభిప్రాయాన్ని నేను బలంగా చెప్పాను. ఈసారి నేను ఏవైతే రావాలనుకున్నానో దాదాపు వాటికే వచ్చాయి. తొలిసారి తండ్రీ కొడుకులు కీరవాణి అన్నయ్య– కాలభైరవ ఒకే వేదికపై అవార్డులు తీసుకోనుండటం నాకో గొప్ప అనుభూతి.' అని ఎంఎం శ్రీలేఖ తెలిపారు. -
National film awards 2023 :అల్లు అర్జున్... ఉత్తమ నటుడు
జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తొలిసారి తెలుగు సినిమాలు దుమ్ము రేపాయి. మొత్తం పది అవార్డులతో ‘ఎత్తర జెండా’ అంటూ తెలుగు సినిమా సత్తా చాటింది. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తెలుగు నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా ‘పుష్ప... ఫైర్’ అంటూ అల్లు అర్జున్ రికార్డ్ సాధించారు. ఆస్కార్ అవార్డుతో చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ ఆరు అవార్డులతో సిక్సర్ కొట్టింది. వీటిలో ‘హోల్సమ్ ఎంటర్టైనర్’ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’ సొంతం అయింది. 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 లోపు సెన్సార్ అయి, అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను పరిగణనలోకి తీసుకుని జ్యూరీ సభ్యులు అవార్డులను ప్రకటించడం జరిగింది. జాతీయ ఉత్తమ నటీమణులుగా ‘గంగూబాయి కతియావాడి’లో వేశ్య పాత్ర చేసిన ఆలియా భట్, ‘మిమి’ చిత్రంలో గర్భవతిగా నటించిన కృతీ సనన్ నిలిచారు. ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఆర్. మాధవన్ టైటిల్ రోల్ చేసి, స్వీయదర్శకత్వంలో రూపొందించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడిగా మరాఠీ ఫిల్మ్ ‘గోదావరి’కి గాను నిఖిల్ మహాజన్ అవార్డు సాధించారు. ఇంకా పలు విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం గురువారం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఆ విశేషాలు ఈ విధంగా... 69వ జాతీయ అవార్డులకు గాను 28 భాషలకు చెందిన 280 చలన చిత్రాలు పోటీపడ్డాయి. మొత్తం 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలోని ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని నటనకుగాను అల్లు అర్జున్‌కు ఉత్తమ జాతీయ నటుడిగా తొలి అవార్డు లభించింది. ఇదే చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డు సాధించారు. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాకు ఆరు విభాగాల్లో అవార్డులు దక్కాయి. జాతీయ హోల్సమ్ ఎంటర్టైనర్గా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఇదే చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతానికి గాను ఎంఎం కీరవాణి, ఇదే చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్‌కి వి. శ్రీనివాస్ మోహనన్, ‘నాటు నాటు..’ పాట కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, ‘ఆర్ఆర్ఆర్’లోని ‘కొమురం భీముడో..’ పాటకు మేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా కాలభైరవ, ఇదే చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కింగ్ సాల్మన్లకు జాతీయ అవార్డులు దక్కాయి. ఇక ‘నాటు.. నాటు’కి రచయితగా తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న చంద్రబోస్ ‘కొండపొలం’లోని ‘ధంధం ధం.. తిరిగేద్దాం...’ పాటకు జాతీయ అవార్డు అందుకోనున్నారు. దర్శకుడిగా తన తొలి చిత్రానికి జాతీయ అవార్డు దక్కిన ఆనందంలో ఉన్నారు ‘ఉప్పెన’ను తెరకెక్కించిన బుచ్చిబాబు సన. మైత్రీ మూవీ మేకర్స్‌పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ‘ఉప్పెన’ ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఉత్తమ సినీ విమర్శకుడిగా నల్గొండ జిల్లాకి చెందిన ఎం. పురుషోత్తమాచార్యులకు అవార్డు దక్కింది. రెండేళ్లుగా ‘మిసిమి’ మాస పత్రికలో సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతంపై పరిశోధనలు చేస్తూ, పలు వ్యాసాలు రాశారు పురుషోత్తమాచార్యులు. ఇక ఆలియా భట్‌కి ‘గంగూబాయి కతియావాడి’ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కేలా చేయడంతో పాటు మరో నాలుగు విభాగాల్లో (బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మేకప్, ఎడిటింగ్) అవార్డులు వచ్చేలా చేసింది. అలాగే విక్కీ కౌశల్ హీరోగా నటించిన బయోగ్రఫికల్ డ్రామా ‘సర్దార్ ఉద్దమ్’కు ప్రాంతీయ ఉత్తమ హిందీ చిత్రంతో పాటు మొత్తం నాలుగు విభాగాల్లో (సినిమాటోగ్రఫీ, ఆడియోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్) అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి సూజిత్ సర్కార్ దర్శకుడు. తమిళ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కడైసీ వివసాయి’, మలయాళంలో ‘హోమ్’, కన్నడంలో ‘777 చార్లీ’ అవార్డులు గెలుచుకున్నాయి. ఇంకా పలు భాషల్లో పలు చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఇదొక చరిత్ర – నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అల్లు అర్జున్‌గారికి జాతీయ అవార్డు రావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఇదొక చరిత్ర ‘పుష్ప’ షూటింగ్ సమయంలోనే అల్లు అర్జున్ తప్పకుండా నేషనల్ అవార్డ్ కొడతారని సుకుమార్‌గారు అనేవారు.. అది ఈ రోజు నిజమైంది. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ గార్లకు థ్యాంక్స్. దేవిశ్రీ ప్రసాద్‌కి జాతీయ అవార్డ్ రావడం హ్యాపీ. అలాగే మా ‘ఉప్పెన’కి ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డు రావడం గర్వంగా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు, టీమ్‌కి అభినందనలు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు అవార్డులు రావడం సంతోషంగా ఉంది. – నవీన్ యెర్నేని, నిర్మాత మా మైత్రీ మూవీస్ బ్యానర్లో ‘ఉప్పెన, పుష్ప’ చాలా ప్రతిష్టాత్మక చిత్రాలు. జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌గారు చరిత్ర సృష్టించారు. తెలుగు సినిమా చరిత్రలో ఇది చిరకాలం గుర్తుండిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్‌కి అవార్డు రావడం ఆనందంగా ఉంది. ‘ఉప్పెన, పుష్ప’ రెండు విజయాల్లో సింహ భాగం సుకుమార్గారిదే. ‘ఆర్ఆర్ఆర్, కొండపొలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం ఆనందాన్నిచ్చింది. – వై. రవిశంకర్, నిర్మాత ‘‘నా తొలి సినిమాకే జాతీయ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు నవీన్‌గారికి, రవిగారికి, మా గురువుగారు సుకుమార్ గారికి కృతజ్ఞతలు. సినిమా చూడ్డానికి మా ఇంట్లో నన్ను పంపించేవాళ్లు కాదు. అలాంటిది నేను ఒక సినిమాకి డైరెక్ట్ చేయడం, నా ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు రావడం అంటే ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. మా అమ్మగారికి నేషనల్ అవార్డు అంటే ఏంటో కూడా తెలియదు. ఈ అవార్డు గురించి ఆమెకి చెప్పాలంటే. ‘ఇండియాలోనే పెద్ద అవార్డు వచ్చింది’ అని చెప్పాలి’’ అంటున్న బుచ్చిబాబు సనని తదుపరి చిత్రం గురించి అడగ్గా.. ‘‘రామ్‌చరణ్‌గారి కోసం మంచి రా అండ్ రస్టిక్ స్టోరీ రాశాను. నా మనసుకి బాగా నచ్చి, రాసుకున్న కథ ఇది. జనవరిలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. – బుచ్చిబాబు సన, దర్శకుడు పది అవార్డులతో తొలి రికార్డ్ ఈసారి తెలుగు పరిశ్రమ ఎక్కువ జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతో పాటు మరో విశేషమైన రికార్డ్ సాధించింది. అదేంటంటే.. 27వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘శంకరాభరణం’ (1980) సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. 30వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘మేఘ సందేశం’ (1982)కి నాలుగు అవార్డులు వచ్చాయి. అలాగే ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డ్స్‌లో ఐదు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఐదుకు మించి అవార్డులు రాలేదు. 35 ఏళ్లకు రెండు ఐదులు.. అంటే పది అవార్డులు దక్కించుకుని తెలుగు చిత్రసీమ తొలి రికార్డ్‌ని సాధించింది. 69వ చలనచిత్ర జాతీయ అవార్డు విజేతలు ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి..) – కృతీసనన్ (మిమీ) ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ) ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి– మరాఠీ సినిమా) ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ అండ్ కో (గుజరాతీ) ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (నేపథ్య సంగీతం): ఆర్ఆర్ఆర్æ– ఎమ్ఎమ్ కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): పుష్ప– దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్ –ప్రేమ్ రక్షిత్ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ – కొమురం భీముడో..) ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్– కొండపొలం ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ (స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్– కింగ్ సాల్మన్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్– శ్రీనివాస్ మోహనన్ ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (ద కశ్మీరీ ఫైల్స్– హిందీ) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ– హిందీ) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి–హిందీ) ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిళల్– తమిళ్) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్ధమ్–హిందీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : ది మిత్రీ మాలిక్ – మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్ధమ్) (హిందీ) ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి–హిందీ) ఉత్తమ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ – సోనూ కేపీ (చవిట్టు మూవీ–మలయాళం) ఉత్తమ స్క్రీన్‌ప్లే(అడాప్టెడ్): సంజయ్‌లీలా భన్సాలీ, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి– హిందీ) ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా–మలయాళం) ఉత్తమ స్క్రీన్ ప్లే (డైలాగ్ రైటర్): ప్రకాశ్ కపాడియా – ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి– హిందీ) ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్ధమ్ మూవీ–హిందీ) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో – గుజరాతీ) ఉత్తమ ఫిలిం ఆన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ : అవషావ్యూహం (మలయాళం) ఉత్తమ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్–ద రెజోనెన్ ్స (అస్సామీ) ఉత్తమ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్ మెంట్: ఆర్ఆర్ఆర్ ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్): అనీష్ బసు (జీలీ మూవీ– బెంగాలీ) ఉత్తమ ఆడియోగ్రఫీ (రీ రికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్ధమ్–హిందీ) ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం) స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ) (డైరెక్టర్ విష్ణువర్థన్) నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ) ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు ఉత్తమ తెలుగు చిత్రం : ఉప్పెన ఉత్తమ తమిళ్ చిత్రం : కడైసి వివసాయి (ద లాస్ట్ ఫార్మర్) ఉత్తమ కన్నడ చిత్రం : 777 చార్లి ఉత్తమ మలయాళ చిత్రం : హోమ్ ఉత్తమ హిందీ చిత్రం : సర్దార్ ఉద్దామ్ ఉత్తమ గుజరాతీ చిత్రం : లాస్ట్ ఫిల్మ్ షో (ఛెల్లో షో) ఉత్తమ మరాఠీ చిత్రం : ఏక్డా కే జాలా ఉత్తమ మీషింగ్ చిత్రం : బూంబా రైడ్ ఉత్తమ అస్సామీస్ చిత్రం : అనూర్ (ఐస్ ఆన్ ది సన్ షైన్) ఉత్తమ బెంగాలీ చిత్రం : కల్కొకో–హౌస్ ఆఫ్ టైమ్ ఉత్తమ మైథిలీ చిత్రం : సమాంతర్ ఉత్తమ ఒడియా చిత్రం : ప్రతీక్ష్య (ద వెయిట్) ఉత్తమ మెయిటిలాన్ చిత్రం : ఈఖోయిగీ యమ్ (అవర్ హోమ్) ‘పుష్ప’ చిత్రంలో నటనకుగాను అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కడం సంతోషం. తొలిసారి ఈ అవార్డు అందుకోనున్న అల్లు అర్జున్‌కి అభినందనలు. 69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయి. అదే విధంగా పాన్ ఇండియా కాన్వాస్‌లో దూసుకుపోతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు విభాగాల్లో ఈ అవార్డులు దక్కటం ప్రశంసనీయం. డైరెక్టర్ రాజమౌళితో పాటు చిత్ర యూనిట్‌కి అభినందనలు. ఉత్తమ సంగీత దర్శకునిగా దేవీశ్రీ ప్రసాద్ (పుష్ప), ఉత్తమ సాహిత్యానికి చంద్రబోస్ (కొండపొలం) జాతీయ అవార్డుకు ఎంపికవడం అభినందనీయం. – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలుగు సినిమా గర్వపడే క్షణాలివి. జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన బన్నీ (అల్లు అర్జున్)కి శుభాకాంక్షలు. చాలా గర్వంగా ఉంది. రాజమౌళి విజన్‌లో ఆరు అవార్డులు సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు, రెండు అవార్డులు సాధించిన ‘పుష్ప’కు, ‘ఉప్పెన’ టీమ్‌కు, సినీ విమర్శకులు పురుషోత్తమచార్యులకు శుభాకాంక్షలు. – చిరంజీవి ఇట్స్ సిక్సర్.. జాతీయ అవార్డులు సాధించినందుకు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు. ‘పుష్ప’.. తగ్గేదేలే... బన్నీకి, దేవిశ్రీ ప్రసాద్‌లతో పాటు ‘పుష్ప’ టీమ్‌కి శుభాకాంక్షలు. బోస్ (చంద్రబోస్)గారికి మళ్లీ శుభాకాంక్షలు. ‘గంగూబాయి కతియావాడి’తో అవార్డు గెల్చుకున్న మా ‘సీత’ (‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్ సీత పాత్రలో నటించారు)కు కంగ్రాట్స్. ‘ఉప్పెన’ టీమ్‌తో పాటు జాతీయ స్థాయిలో అవార్డులు గెల్చుకున్నవారికీ శుభాకాంక్షలు. – రాజమౌళి నా నేపథ్య సంగీతాన్ని గుర్తించి, నాకు జ్యూరీ సభ్యులు అవార్డును ప్రకటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను . చంద్రబోస్‌గారికి, దేవిశ్రీ ప్రసాద్, కాలభైరవ.. మా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు శుభాకాంక్షలు. – కీరవాణి ఈ జాతీయ అవార్డు మీదే (సంజయ్ సార్, గంగూబాయి.. టీమ్.. ముఖ్యంగా ప్రేక్షకులు). ఎందుకంటే... మీరు లేకుంటే నాకు ఈ అవార్డు దక్కేదే కాదు. చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలను గుర్తుపెట్టుకుంటాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు ఇంకా కష్టపడతాను. ‘మిమి’ సినిమాలో నీ ( కృతీ సనన్ని ఉద్దేశించి) నటన నిజాయితీగా, పవర్‌ఫుల్‌గా ఉంది. ఆ సినిమా చూసి నేను ఏడ్చాను. ఉత్తమ నటి అవార్డుకు నువ్వు అర్హురాలివి. – ఆలియా భట్. ఏఏఏ 69 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీకి రాని ఆ అద్భుతాన్ని తీసుకొచ్చిన ప్రేక్షకులకు, నిర్మాతలకు, దర్శకుడికి, ముఖ్యంగా మా ఫ్యామిలీని పతాకస్థాయికి తీసుకుని వెళ్లిన మా అబ్బాయికి (అల్లు అర్జున్ ) కృతజ్ఞతలు. – అల్లు అరవింద్ ఇంకా వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ తదితరులు తమ ఆనందం వ్యక్తం చేశారు. పది అవార్డులతో తొలి రికార్డ్ ఈసారి తెలుగు పరిశ్రమ ఎక్కువ జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతో పాటు మరో విశేషమైన రికార్డ్ సాధించింది. అదేంటంటే.. 27వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘శంకరాభరణం’ (1980) సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. 30వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘మేఘ సందేశం’ (1982)కి నాలుగు అవార్డులు వచ్చాయి. అలాగే ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డ్స్‌లో ఐదు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఐదుకు మించి అవార్డులు రాలేదు. 35 ఏళ్లకు రెండు ఐదులు.. అంటే పది అవార్డులు దక్కించుకుని తెలుగు చిత్రసీమ తొలి రికార్డ్‌ని సాధించింది. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ భారతదేశ ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త నంబియార్ నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘రాకెట్రీ: ‘ది నంబి ఎఫెక్ట్’ సినిమా రూపొందింది. ఇస్రోలో చేరిన నారాయణన్ స్వదేశీ రాకెట్లను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌లో భాగంగా రష్యా డెవలప్ చేసిన క్రయోజెనిక్ ఇంజ¯Œ ్సని భారత్‌కి తీసుకురావాలనుకుంటారు. ఇదే సమయంలో పాకిస్తా¯Œ కు భారత రాకెట్ సాంకేతిక విషయాలను చేరవేశారనే నెపంతో అరెస్ట్ అవుతారు నారాయణన్. అరెస్ట్ తర్వాత కేరళ పోలీసుల విచారణలో ఆయన ఎలాంటి చిత్రహింసలు అనుభవించారు? ఆ తర్వాత ఆయన జీవితం ఎలా మలుపు తిరిగింది? తనపై వచ్చిన తప్పుడు ఆరోపణల నుంచి నారాయణన్ ఎలా విముక్తి పొందారు? అనే నేపథ్యంలో ‘రాకెట్రీ: ‘ది నంబి ఎఫెక్ట్’ సినిమా రూపొందింది. నంబియార్ నారాయణన్ పాత్ర చేయడంతో పాటు మాధవన్ దర్శకత్వం వహించారు. నారాయణన్ సతీమణి మీన క్యారెక్టర్లో హీరోయిన్ సిమ్రాన్ చక్కగా నటించారు. ప్రత్యేకించి ఆమె పండించిన భావోద్వేగాలు సినిమాకి హైలైట్. హీరో సూర్య అతిథి పాత్రలో మెరవడం కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. నా అభిప్రాయాన్ని బలంగా చెప్పాను – ఎంఎం శ్రీలేఖ ‘‘ప్రతి ఏడాది తెలుగు సినిమాలంటే కొంచెం నిర్లక్ష్యం. కంటి తుడుపుగా ఒకటో రెండో అవార్డులు ఇస్తున్నారు. దీనిపై జ్యూరీలో గట్టిగా మాట్లాడేవారు కావాలి. తెలుగుకు ఎందుకు ఇవ్వరు? అని మాట్లాడ గలగాలి. అయితే ఆ సినిమాలో విషయం ఉండాలి.. లేకుంటే మాట్లాడలేం’’ అన్నారు సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. 69వ జాతీయ అవార్డుల్లో దక్షిణాది తరఫున జ్యూరీలో శ్రీలేఖతో పాటు రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ఉన్నారు. అవార్డులు ప్రకటించిన అనంతరం ఎంఎం శ్రీలేఖ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘‘మామూలుగా ఫైనల్ ప్యానల్లో భోజ్‌పురి వాళ్లు ఉంటారు. వారికి మహానటి సావిత్రి గురించి ఏం తెలుస్తుంది? అందుకే జ్యూరీలో ఉన్న తెలుగువారు తెలుగు సినిమాల గురించి గట్టిగా చెప్పాలి. ఓ జ్యూరీ సభ్యురాలిగా నా అభిప్రాయాన్ని నేను బలంగా చెప్పాను. ఈసారి నేను ఏవైతే రావాలనుకున్నానో దాదాపు వాటికే వచ్చాయి. తొలిసారి తండ్రీ కొడుకులు కీరవాణి అన్నయ్య– కాలభైరవ ఒకే వేదికపై అవార్డులు తీసుకోనుండటం నాకో గొప్ప అనుభూతి. ఇక జ్యూరీ సభ్యులకు ఒత్తిడి ఉంటుందనుకుంటారు.. అలాంటిదేమీ లేదు. నిజాయతీగా నాకు ఏది అనిపిస్తే అది చెప్పాను’’ అన్నారు. ఉప్పెన మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో వైష్ణవ్ తేజ ఒకరు. ఆయన నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సన డైరెక్టర్‌గా, కృతీశెట్టి హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ ముగ్గురూ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సముద్ర తీరాన ఉప్పాడ అనే పల్లెటూరు. స్కూల్ డేస్ నుంచే బేబమ్మ (కృతీశెట్టి) మీద ఇష్టం పెంచుకున్న మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్) నిత్యం తననే ఆరాధిస్తూ ప్రేమిస్తుంటాడు. ప్రాణం కంటే పరువు ముఖ్యం అనుకునే పెద్ద మనిషి శేషారాయనం (విజయ్ సేతుపతి). ఆయన కూతురు బేబమ్మ కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో తన మనసులోని ప్రేమను బేబమ్మకి చెబుతాడు ఆశీర్వాదం. తన స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకున్న బేబమ్మ కూడా ఆశీర్వాదాన్ని ప్రేమిస్తుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం శేషారాయనంకి తెలుస్తుంది. దీంతో ఆశీర్వాదం–బేబమ్మ కలిసి ఊరి నుంచి వెళ్లిపోతారు. ఈ విషయం బయటకి తెలిస్తే తన పరువు పోతుందని ఆర్నెళ్ల పాటు తన కూతుర ు ఇంట్లోనే ఉందని ఊరి జనాలను నమ్మిస్తాడు రాయనం. ఆరు నెలల తర్వాత అయినా బేబమ్మ ఇంటికి తిరిగొచ్చిందా? తన కులం కానివాడు తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో ఆశీర్వాదంని శేషారాయనం ఏం చేశాడు? ఆశీర్వాదం–బేబమ్మ ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యరా ? లేదా అనేది ‘ఉప్పెన’ కథ. 2021 ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. -
బేబమ్మ రెచ్చిపోవడానికి ఇదా అసలు కారణం?
'ఉప్పెన' సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది హీరోయిన్ కృతిశెట్టినే. తొలి చిత్రంతో రూ.100 కోట్ల హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఆ ఫామ్ ని కొనసాగించలేకపోయింది. పలు సినిమాల్లో చేసినప్పటికీ అవి చాలావరకు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి. దీంతో కృతిశెట్టి కెరీర్ ఢమాల్ అయిపోయే దశకు వచ్చేసినట్లు కనిపించింది. దీంతో బేబమ్మ ఆలోచనలో పడిపోయింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో షారుక్ ఖాన్‌కి యాక్సిడెంట్!) 'ఉప్పెన'లో కాలేజీ స్టూడెంట్ గా నటించిన కృతిశెట్టి.. సంప్రదాయబద్ధంగా కనిపించినప్పటికీ ప్రేక్షకుల మనసు దోచేసింది. కుర్రాళ్లకు క్రష్ గా మారిపోయింది. తర్వాత చేసిన సినిమాల్లో పెద్దగా ఎక్స్పోజింగ్ చేయలేదు. 'శ్యామ్ సింగరాయ్'లో మాత్రం నానితో లిప్‌కిస్ సీన్ చేసింది. ఆ సినిమా ఫెయిల్ కావడంతో కృతిశెట్టికి అది పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో ఇకపై గ్లామర్ పాత్రలకు సై అనే హింట్ ఇస్తోంది. అందుకే ప్రస్తుతం ఫొటోషూట్స్ తో రెచ్చిపోతుంది. మలయాళంలో టొవినో థామస్ హీరోగా నటిస్తున్న ఓ పీరియాడికల్ మూవీలో కృతిశెట్టి హీరోయిన్ గా చేస్తోంది. శర్వానంద్ తోనూ ఓ సినిమాలో నటిస్తోంది. వీటి సంగతి పక్కనబెడితే ఇకపై మాత్రం ఇలా కాకుండా స్కిన్ షో, లిప్ లాక్ సీన్లకు అస్సలు అడ్డుచెప్పకూడదని ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. అందుకే తన హాట్ ఫొటోషూట్స్ తో దర్శకనిర్మాతలకు పరోక్షంగా హింట్ ఇస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి కృతి విషయంలో ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
ఉప్పెన హీరోయిన్‌కు వేధింపులు.. ఏకంగా స్టార్ హీరో!
టాలీవుడ్లో ఉప్పెన ఫేం కృతి శెట్టి పేరు తెలియని వారు ఉండరు. తెలుగులో మొదటి సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. తన అందంతో సినీ ప్రియులను కట్టిపడేసింది. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్లో ఛాన్స్‌లు కొట్టేసింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో నటించింది. ఇటీవలే నాగచైతన్య సరసన కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. (ఇది చదవండి: గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్‌తో మళ్లీ కనిపించిన హీరోయిన్!) అయితే గ్లామర్ ఫీల్డ్‌లో అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. హీరోయిన్గా నిలకడగా రాణించాలంటే అన్నింటిని తట్టుకుని నిలబడాలి. ఇటీవలే ఆర్ఎక్స్100 భామ పాయల్ రాజ్‌పుత్ కొందరు డైరెక్టర్స్ తన ఫేమ్‌ని వాడుకుని వదిలేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా కృతి శెట్టి సైతం వేధింపులకు గురైనట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆమెను ఓ స్టార్ హీరో కుమారుడు టార్చర్ చేస్తున్నాడట . ఇటీవలే ఓ హీరో కుమారుడు కృతికి ఫోన్ చేసి తనతో ఫ్రెండ్షిప్ చేయాలని వేధింపులకు గురి చేస్తున్నాడట. ఇటీవల తన బర్త్ డే పార్టీకి రావాలని ఆహ్వానం కూడా పంపినట్లు సమాచారం. పార్టీకి వస్తే డబ్బులు ఎంత కావాలన్నా ఇస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చాడట. అయితే ఆ స్టార్ హీరో కుమారుడు ఎవరా నెట్టింట్లో తెగ వెతికేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. కృతి ప్రస్తుతం శర్వానంద్ సరసన నటిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: ఆ సంఘటనతో నిద్రలేని రాత్రులు.. వీడియో డిలీట్ చేసిన దుల్కర్) -
శర్వానంద్‌పై ఆశలు పెట్టుకున్న కృతి శెట్టి
-
అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కృతిశెట్టి?
ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. ఈ సినిమాతో బేబమ్మగా కుర్రాళ్ల మనసు దోచుకున్న కృతిశెట్టి ఓవర్నెట్లో స్టార్డమ్ దక్కించుకుంది. తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఊహించని విధంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. హ్యాట్రిక్ హిట్స్‌తో రాకెట్లా దూసుకుపోయింది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వరుస ఫ్లాపులు కృతిని వెంటాడుతున్నాయి. చదవండి: శింబుకి షాక్ ఇచ్చిన దీపికా పదుకొణె.. ఆ కండీషన్స్‌కి దిమ్మతిరిగిపోయిందట చివరగా ఆమె నటించిన నాలుగు సినిమాలు డిజాస్టర్ లిస్ట్‌లో చేరిపోవడంతో కృతి కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే ఓ వైపు సినిమాల ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న కృతికి మరోవైపు ట్రోలింగ్ పేరిట విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ మధ్య కృతి ఫేస్‌లో కాస్త మార్పులు కనిపిస్తున్నాయని, ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ రూమర్స్‌పై స్పందిస్తూ.. 'ఇలాంటివి ఎవరు రాస్తారో, ఎందుకు రాస్తారో కూడా అర్థం కావడం లేదు. మాకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఉప్పెనలో ఉన్నట్లు ఇప్పుడు లేను అంటున్నారు. అయినా ఎప్పుడూ ఒకేలా ఉండలేము కదా..ఫీచర్స్ మారుతాయి. అందరిలా నేను కూడా. కొన్నిసార్లు మేకప్, హెయిర్ స్టైల్ వల్ల కూడా మార్పులు కనిపిస్తాయి. అంతమాత్రానా ప్లాస్టిక్ సర్జరీ అంటారా''? అంటూ బేబమ్మ ఫైర్ అయ్యింది. చదవండి: ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అలాంటి కామెంట్స్ చేశారు: కాజల్ -
సినిమాల్లో క్లైమాక్స్ అదుర్స్
-
విజయ్ తనయుడు హీరోగా ఉప్పెన రీమేక్!
తెలుగు చిత్రం ఉప్పెన పేరుకు తగ్గట్టుగానే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్. అయినా చిత్రం సంచలన విజయం సాధించింది. వర్ధమాన నటుడు వైష్ణవ తేజ్ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో నటి కృతి శెట్టి నైతిక ఎంట్రీ ఇచ్చింది. నటుడు విజయ్ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. కాగా తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో నటుడు విజయ్ వారసుడు సంజయ్‌ను హీరోగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సంజయ్ బాల నటుడిగా కొన్ని చిత్రాల్లో నటించినా, ప్రస్తుతం దర్శకత్వంపై మక్కువ చూపుతున్నట్లు తెలిసింది. విదేశాల్లో దర్శకత్వ శాఖలో శిక్షణ పొందిన ఈయన ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ రూపొందిస్తున్నాడు. త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఉప్పెన చిత్ర రీమేక్‌లో సంజయ్‌ని హీరోగా నటింప చేయడానికి ఓ ప్రముఖ నిర్మాత ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం. ఆ చిత్రంలో నటించిన కృతి శెట్టినే తమిళంలోనూ ఎంపిక చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఈమె ఇప్పటికే ది వారియర్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అదేవిధంగా టాలీవుడ్ నటుడు నాగచైతన్య నటిస్తున్న ద్విభాషా చిత్రం కస్టడీలో కూడా ఈమెనే నాయకి. ఇకపోతే ఉప్పెన చిత్ర రీమేక్‌లో నటించడానికి సంజయ్ ఊ అంటాడా? ఊహూ అంటాడా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు
-
క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్.. ఈ సినిమాలు సూపర్ హిట్
ఫస్ట్ సీన్ అదిరిపోవాలి. హీరో ఇంట్రడక్షన్ కేక పుట్టించాలి. ఇంటర్వెల్ బ్యాంక్ మెస్మరైజ్ చేసేలా ఉండాలి. సినిమా అంతా బాగా రావాలనే తీస్తారు కానీ… ఇలా కొన్ని సీన్స్ మీద డైరెక్టర్స్ ప్రత్యే క శ్రద్ధ పెడతారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేస్తూ కథలో లీనం అయ్యేలా చేయాల న్నదే మూవీ మేకర్స్ లక్ష్యం. మరి క్లైమాక్స్ సంగతేంటి ? అత్యంత కీలకం ఇదే. సినిమా అంతా బావుండి చివర్లో చెడిందనుకోండి…ఆడియన్స్ పెదవి విరిచేస్తారు. మూవీ యావరేజ్‌గా ఉన్నా…ఎండింగ్ అదిరిదంటే రిజల్ట్ హిట్టే. మరి అలాంటి క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సినిమాలపై లుక్కేద్దాం. ఉప్పెన సాధారణంగా ప్రేమ కథా చిత్రాల్లో తమ ప్రేమకి అడ్డుపడుతున్న వాళ్లని ఎదిరించి ప్రేమికులు ఒకటవుతారు లేకపోతే పెద్దల పంతాలకు బలైపోతారు. అదీ కాకుంటే హీరో, హీరోయిన్లలో ఒకరు చనిపోతారు. మరొకరు జీవచ్ఛావంలా మిగిలిపోతారు. ఎన్ని ప్రేమకథాచిత్రాలొచ్చినా క్లైమాక్స్‌లు మాత్రం ఇవే. కానీ…ఉప్పెన మాత్రం ఎవరూ ఊహించని రీతిలో ముగింపు తీసు కుంది. మగాడు అన్న పదానికి సరికొత్త అర్థం ఇస్తూ…ఎవరూ ఊహించని క్లైమాక్స్‌ని ఫిక్స్ చేసేశాడు దర్శకుడు బుచ్చిబాబు. తొలి రోజు క్లైమాక్స్ కేంద్రంగా నెగిటివ్ టాక్ నడిచినా…ఆ తరహా ముగింపుకి ప్రేక్షకులు మద్దుతు ప్రకటించారు. ఉప్పెనని వంద కోట్ల క్లబ్లో కూర్చోపెట్టేశారు. రంగస్థలం రామ్ చరణ్ ‘రంగస్థలం’ క్లైమాక్స్ కూడా ఊహించని ట్విస్ట్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. మొదటి నుంచి జగపతిబాబునే విలన్‌గా చూపిస్తూ వస్తారు. నిజానికి ప్రెసిడెంట్‌గారు విలనే. కానీ…మూవీలో అసలు విలన్ మాత్రం కాదు. ఆ విషయం చివరి వరకు ప్రేక్షకులు గమనించకుండా స్క్రీన్‌ప్లే ని చక్కగా రెడీ చేసుకున్నాడు సుకుమార్. చివర్లో ప్రకాష్‌రాజ్ విలన్ అని తెలిసే సరికి సగటు ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఒక మంచి సినిమా చూశామన్న ఫీల్‌తో పాటుగా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో థియేటర్ నుంచి బయటకుకొచ్చారు. ఆర్ఎక్స్ 100 క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వాలని దర్శకుడు డిసైడ్ అయినప్పుడు… ఊహించని మలుపులు. ముసుగులేసుకున్న పాత్రలు లాంటి వాటితోనే కథని అల్లుకుంటాడు. అలాంటి ఒక కథతో యూత్ అటెన్షన్‌ని గెయిన్ చేసిన చిత్రం ఆర్ఎక్స్ 100. పిల్లారా పాటలో సినిమా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేసింది ఆర్ఎక్స్ 100. ఫస్ట్ మూవీతోనే కార్తికేయ హీరోగా మంచి మార్కులు కొట్టేశారు. పాయల్ రాజ్పుట్ కి గ్లామర్ ఇమేజ్ క్రియేట్ చేసింది. అన్నింటికీ మించి క్లైమాక్స్ మాత్రం ఆడియన్స్ ఊహాలకు అందలేదు. యాన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ అన్న ట్యాగ్‌లైన్‌తో మొదటి నుంచి ఆసక్తి రేపిన ఆర్ఎక్స్ 100…క్లైమాక్స్ కోణంలో మాత్రం అలజడి రేపింది. హీరోయిన్ తండ్రి విలన్ అన్నట్టుగా సినిమా ని ముందుకు తీసుకువెళ్లి…మరొకరిని విలన్‌గా చూపించడం చాలా సినిమాల్లో చూసిందే. కానీ దర్శకుడు అజయ్ భూపతి ఏకంగా హీరోయిన్నే విలన్‌గా చూపించేసి ఆడియన్స్‌ని షాక్‌కి గురిచేశాడు. అలానే…చివరకు హీరోని చంపేసి ప్రేక్షకుల్లో భావోద్వేగాలను పూర్తి స్థాయి లో పెంచేసి థియేటర్ నుంచి బయటకు పంపాడు. కేరాఫ్ ‘కంచరపాలెం’ చిన్న సినిమాగా వచ్చి ఘన విజయం సాధించిన కేరాఫ్ ‘కంచరపాలెం’ క్లైమాక్స్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. ఒక్కో కథకి ఏమాత్రం సంబంధం ఉండదు. అసలు వీళ్లందరినీ దర్శకుడు ఎలా కలుపుతాడు ? కలపడా ? ఎవరి కథ వారిదేనా ? ఇలా రకరకాల సందేహాలు సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులని వేధిస్తూనే ఉంటాయి. చివర్లో ఇవి నాలుగు కథలు కాదు. ఒక కథే. ఆ నలుగురు…ఈ రాజే అంటూ దర్శకుడు ఇచ్చే ట్విస్ట్‌కి థియేటర్లు ఈలలతో మార్మో గాయి. ఎలాంటి సినిమా అయినా సరే…మూవీ స్టార్టింగ్‌లో ఈలలు వినిపిస్తాయి. లేకపోతే పవర్ఫుల్ డైలాగో, అదిరిపోయే పాటో వచ్చినప్పుడు విజిల్స్ కామన్. కానీ క్లైమాక్స్‌తో ప్రేక్షకు లు చప్పట్లు, విజిల్స్‌తో సంతోషాన్ని వ్యక్తం చేయడం చాలా అరుదు. ఆ అరుదైన అనుభ వాన్ని కేరాఫ్ కంచరపాలెం సినిమా సొంతం చేసుకుంది. ఎవరు డిఫరెంట్ క్లైమాక్స్‌తో ఆడియన్స్‌ని షాక్ ఇచ్చిన చిత్రాల్లో ఎవరు ఒకటి. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఒక మిస్సింగ్ కేసు గురించి చెబుతూ ఉండటంతో సినిమా మొదలవుతుంది. హఠాత్తుగా ఆ కేసు నుంచి ఆడియన్స్‌కి ఫోకస్‌ని తప్పించి, ఇంటర్వెల్ పాయింట్‌కి అసలు కథతో లింక్ చేయడం. అసలు ఈ స్క్రీన్‌ప్లే నే భలే ట్విస్ట్‌గా అనిపిస్తే…ఇక బాధితురాలే నేరస్తురాలు. హీరోయినే విలన్ అన్న ట్విస్ట్ మరింతగా ప్రేక్షకులకి మజాని ఇస్తుంది. మత్తువదలరా సింపుల్ క్రైమ్ కథని కాంటెంపరరీ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా వెండితెర పై ప్రజెంట్ చేసిన చిత్రం మత్తువదలరా. సీరియస్ సీన్స్‌లోనూ కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడటంతో తొలి రోజు నుంచే సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిలో జరిగే చోటా స్కామ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో కథ మొదలవుతుంది. ఒక 5 వందల రూపాయల కోసం చేసిన చిన్న తప్పు కథానాయకుడి జీవితాన్ని పెద్ద సమస్యలో పడేస్తుంది. విలన్ ఎవరన్నది రివీల్ అయిపోయా క ఇక క్లైమాక్స్ రెగ్యులర్ ఫార్మెట్‌లోనే ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు. కానీ… క్లైమాక్స్‌లో ఊహించని విధంగా నోట్ల రద్దు అంటూ ఇచ్చిన ట్విస్ట్ ఆడియన్స్‌ని థ్రిల్ చేసింది. హిట్ హీరో నాని నిర్మాత అనగానే…హిట్ మూవీ చుట్టూ ఒక అటెన్షన్ ఏర్పడింది. అనుకున్నట్టుగా నే డిఫరెంట్ క్లైమాక్స్‌తో…ఆడియన్స్‌ని థ్రిల్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లో కనిపించకుండా పోయిన ఒక టీనేజ్ అమ్మాయి, ఆ కేస్కి లింక్ అవుతూ మిస్ అయిన మరో యువతి. ఆడి యన్స్ని ఇన్‌స్టంట్‌గా ఎంగేజ్ చేయడానికి దర్శకుడు శైలేష్ కొలను చేసిన ఈ సెటప్ బానే వర్కౌట్ అయింది. హీరోతో పాటుగా ఉంటూ కేసుని పరిశోధన చేస్తున్న అతని మిత్రుడే విలన్ అంటూ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్…థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మిస్టరీ చేధించే డిటెక్టివ్ సినిమాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. కానీ ఎక్కువుగా రావు. ఎందుకంటే…మిస్టరీ జానర్లో సస్పెన్స్‌ని హోల్డ్ చేసి ఉంచడం చాలా కీలకం. అలాంటి కీలక మైన అంశాన్ని వెండితెర మీద చక్కగా పెర్ఫామ్ చేయడంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సక్సెస్ అయ్యాడు. బాధితురాలు అన్నకున్న క్యారెక్టరే…అస్సలు ఈ భూమ్మీదే లేదనుకున్న క్యారెక్టరే…విలన్ అన్న ట్విస్ట్…మిస్టరీ జానర్ ని మజా చేస్తాయి. ఆ! సినిమాకి క్లైమాక్స్ బలం కావాలి. సినిమాకి క్లైమాక్స్ మరింత మైలేజ్ ఇచ్చేలా ఉండాలి. కానీ …క్లైమాక్స్ ట్విస్ట్ మీదే ఆధారపడి కథని రాసేసుకుని, సినిమా తీసేస్తే…అది ఆ! మూవీ నే అవుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. క్లైమాక్స్‌కి వచ్చిన తర్వాత కానీ దర్శకుడి ప్రతిభ అర్థం కాదు. అయితే…అప్పటి దాకా నడిచిన సినిమా మొత్తం ఆడియ న్స్‌కి అయోమయంగానే అనిపిస్తుంది. దీంతో…ఆ ! చిత్రం హిట్ మూవీస్ జాబితా లోకి అయితే ఎక్కలేదు. - దినేష్ రెడ్డి వెన్నపూస, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ -
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన బేబమ్మ..!
-
హీరో వైష్ణవ్ తేజ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
హీరోయిన్ కృతి శెట్టి కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
డాడీతో ఫ్రెండ్లీగా ఉంటా..ముద్దుగా అలా పిలుస్తాడు: కృతీశెట్టి
మా డాడీ వెరీ నైస్. మా ఇద్దరికి మధ్య ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంటుందని అంటోంది సొట్టబుగ్గల భామ కృతీ శెట్టి. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తండ్రి గురించి కృతి ఏమంటున్నారో తెలుసుకుందాం. ఫాదర్స్ డేని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? షూటింగ్‌కి కాస్త బ్రేక్ రావడంతో మా డాడీ కోసం ముంబై వచ్చాను. మా డాడీకి స్వీట్స్ అంటే ఇష్టం. ఈ ఫాదర్స్ డేకి నాన్న కోసం కేక్ ఆర్డర్ చేశాను. డాడీకి షూస్ అంటే చాలా ఇష్టం. అవి కొన్నాను. మీ నాన్నని సంతోషపెట్టే విషయం? ‘నేనే’. కూతురు ఉంటే చాలు ఆయనకు. మీపట్ల మీ డాడీ తీసుకునే కేర్ గురించి? అమ్మానాన్న ఇద్దరూ జాబ్ చేసేవారు. నేను స్కూల్ నుంచి వచ్చేప్పటికి ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు. ‘స్కూల్ నుంచి వచ్చేశావా’ అని రోజూ ఇద్దరూ ఫోన్ చేసేవారు. తినడానికి ఏమైనా రెడీగా ఉంచేవారు. ఏ డ్రెస్ వేసుకోవాలో రెడీగా పెట్టేవారు. ట్యూషన్‌కి వెళ్లే ముందు ఫోన్ చేసేవారు. డాడీ చాలా కేరింగ్. ఒక్కోసారి డాడీ స్కూల్‌కి వచ్చి పికప్ చేసుకుని, రెస్టారెంట్‌కి తీసుకెళ్లేవారు. ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్లం. డాడీ నన్ను వదిలి ఉండేవారు కాదు. మరి.. షూటింగ్స్‌కి మీతో పాటు వస్తుంటారా? వస్తారు కానీ ఓ 15 నిమిషాల తర్వాత ఆయనకు బోర్ కొట్టేస్తుంది. డాడీకి సినిమాలంటే ఇష్టమే కానీ షూటింగ్ విషయంలో మాత్రం ఓపిక తక్కువ. నేను, అమ్మ హైదరాబాద్‌లో ఉంటున్నాం. డాడీకి వర్క్ ఉంది కాబట్టి ముంబైలో ఉంటారు. నన్ను వదిలి ఒక్క 20 రోజులు ఉండగలరు. ఆ తర్వాత డాడీకి బెంగగా ఉంటుంది.. నాకూ అలానే ఉంటుంది. మీ డాడీ చాలా కేరింగ్ అన్నారు. జనరల్‌గా అమ్మాయిలకు చెప్పే జాగ్రత్తలు చెబుతుంటారా? మా డాడీ వెరీ నైస్. ఎందుకంటే ‘అమ్మాయివి కదా అలా ఉండకూడదు.. ఇలా ఉండాలి’ అని ఎప్పుడూ అనలేదు. ‘నువ్వు అమ్మాయివి కాబట్టి కాన్ఫిడెంట్‌గా ఉండాలి. భయపడుతూ ఉండక్కర్లేదు’ అని అంటుంటారు. ఆ మాటలు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంటాయి. మీరు అలిగినప్పుడు నవ్వించడానికి మీ నాన్నగారు, మీ నాన్నకి కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? యాక్చువల్లీ మా ఇద్దరికీ కోపమే రాదు. మాది ‘ఫ్రెండ్లీ కామెడీ రిలేషన్షిప్’. ఫలానా టైమ్‌లో నాన్న నన్ను కోప్పడ్డారు అని చెప్పడానికి నా లైఫ్‌లో ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు. అలానే నేను అలిగిన సందర్భాలూ లేవు. చెప్పాలంటే నాన్న నాకంటే కూల్. ఎగ్జామ్స్‌లో మార్క్స్ తక్కువ వచ్చినప్పుడో, అల్లరి చేసినప్పుడో మందలించలేదా? నాకెప్పుడూ మంచి మార్కులు వచ్చేవి. అల్లరి పిల్లని కూడా కాదు. మీ నాన్న మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ‘బుంగీ’ అని పిలుస్తారు. బుంగీ అంటే అర్థం? అర్థం లేదు. ముద్దుగా అలా అంటారు. లైఫ్‌లో డల్ మూమెంట్స్ సహజం. అలాంటి టైమ్‌లో మీ నాన్న మిమ్మల్ని ఎలా ఓదార్చుతారు? ‘నీకు లైఫ్‌లో బాధ పడే క్షణాలు లేకపోతే ఆనందం విలువ తెలియదు. అందుకని కొన్ని బాధలు ఉండాలి. ఆ బాధను పాజిటివ్‌గా తీసుకుని అధిగమించాలి’ అని మా డాడీ అంటుంటారు. అందుకే ఏదైనా చిన్న చేదు అనుభవం ఎదురైనా పాజిటివ్‌గా తీసుకుంటాను. మీ తండ్రీకూతుళ్లలో ఉన్న కామన్ క్వాలిటీస్? ఇద్దరికీ ఫుడ్ అంటే ఇష్టం. అది కూడా ఫాస్ట్ ఫుడ్. లిమిట్ లేకుండా లాగించేస్తాం. అలాగే ఇద్దరికీ కామెడీ చాలా ఇష్టం. పాత హిందీ సినిమా పాటలను ఇష్టపడతాం. ఇద్దరం కలిసి వింటాం. ఒక్క సినిమా (ఉప్పెన)తోనే మీరు స్టార్ హీరోయిన్ కావడంపట్ల మీ నాన్న చాలా ఆనందపడి ఉంటారు.. సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ కాబట్టి హీరోయిన్ అవుతానంటే మీ నాన్నగారు ఏమన్నారు? అమ్మానాన్న నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీ అంటే ఇద్దరికీ మంచి అభిప్రాయం ఉంది. ‘మనం మంచి పనులు చేస్తే మనకు అంతా మంచే జరుగుతుంది’ అని మా డాడీ అంటారు. ఆ మంచి పనులు చేయడంవల్లే నాకు మంచి జరిగిందని నమ్ముతాను. నా కెరీర్ మంచి షేప్ తీసుకున్నందుకు నాన్న చాలా హ్యాపీ. ప్రౌడ్ ఫీలింగ్ కూడా ఆయనకు ఉంది (నవ్వుతూ). మీ డాడీ విషయంలో మీరు ప్రౌడ్‌గా ఫీలయ్యేది? మా డాడీ అంత మంచి మనిషిని చూడలేదు. సమాజానికి తిరిగి ఇవ్వాలంటారు. పాజిటివ్ పర్సన్. నన్ను కూడా హెల్ప్ చేయమని అంటుంటారు. ఇంత మంచి లక్షణాలున్న వ్యక్తి కాబట్టి డాడీని చూస్తుంటే గర్వంగా ఉంటుంది. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మా నాన్న ఎప్పుడూ ఇంతే హ్యాపీగా, పాజిటివ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. -
జీవితంలో 2 పుట్టిన రోజులుంటే.. ఆ రోజే నాకు మరో బర్త్‌డే: కృతిశెట్టి ఎమోషనల్
‘ఉప్పెన’ మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్లో మెరిసింది కృతిశెట్టి. తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ హిట్ కావడం, బంగర్రాజు, శ్యామ్ సింగరాయ్ కూడా మంచి విజయం సాధించడంతో బేబమ్మ హ్యాట్రిక్ కొట్టింది. దీంతో ఇండస్ట్రీలో లక్కీ గర్ల్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ వారియర్, మాచేర్ల నియోజకం’ వంటి ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే గతేడాది ఆమె నటించిన ఉప్పెన సినిమా విడుదలై నిన్నటి(ఫిబ్రవరి 12) ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బేబమ్మ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. చదవండి: నాన్న పీస్ డేని చెడగొట్టే మిషన్‌లో బిజీ, సితార పోస్ట్ వైరల్ ‘జీవితంలో మనకంటూ రెండు పుట్టిన రోజులు ఉంటే, అందులో ఒకటి... మనం పుట్టినరోజు. ఇంకొకటి.. మనం కెరీర్లో ఏం చేయాలో ఎంచుకున్న రోజు. ఏడాది క్రితం నటిగా పరిశ్రమలో అడుగుపెట్టాను. నేను ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నా.. కాబట్టి ఈరోజు నాకిది మరో పుట్టినరోజుగా భావిస్తున్నా. నేను ఎంతో ఇష్టపడి నటిని అవ్వడం ఒక ఎత్తైయితే, మీ అందరూ ప్రేమ, అభిమానంతో నన్ను ఆదరించడం నాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఇదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. చదవండి: నేను ఆ టైప్ కాదు, నటినని నా బాయ్‌ఫ్రెండ్ వదిలేశాడు: హీరోయిన్ ఈ ప్రయాణాన్ని గుర్తుండేలా చేసిన నా అభిమానులకు కృతజ్ఞతలు. ఇకపై మరింత కష్టపడి మంచి పాత్రలతో అలరిస్తానని మాట ఇస్తున్నా. థాంక్యూ ఆల్’ అంటూ రాసుకొచ్చింది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా గతేడాది 2021 ఫిబ్రవరి 12న విడుదలైంది. కరోనా సమయంలో విడుదలైన ఈ టాలీవుడ్ బాక్సాఫీసుకు బ్లాక్‌బస్టర్ హిట్ అందించింది. చిన్న సినిమాగా విడుదలైన ఉప్పెన రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
సినీ దర్శకులను ఆకర్షిస్తున్న ఉప్పాడ బీచ్‌రోడ్డు
పిఠాపురం(తూర్పుగోదావరి): పైన నీలాల నింగి.. కింద నీలి సముద్రం.. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు.. వాటి అంచుల్లో పాలల్లా పరచుకున్న తెల్లని నురుగు.. మెత్తని ఇసుక తిన్నెలు.. వీనులకు ఆనందాన్నిచ్చే సాగర ఘోష.. ఇటు నేలకు.. అటు సాగరానికి సరికొత్త అందాలను అద్దే మడ అడవులు.. హోప్ ఐలాండ్.. మనసుకు ఆహ్లాదాన్ని అందించే ఇటువంటి విభిన్నమైన ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఉప్పాడ సాగర తీర సౌందర్యం.. వెండితెర ప్రముఖుల్ని మరోసారి ఎంతో ఆకర్షిస్తోంది. ‘నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం..’ అంటూ ‘ఉప్పెన’ సినిమాలో హీరో వైష్ణవ్‌తేజ్ పాడిన పాట.. ఉల్లాసంగా ఆడిన ఆట కుర్రకారు గుండెల్ని ఊపేసింది. ఉప్పాడ సాగర తీర సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రం బంపర్ హిట్ కొట్టడంతో.. దర్శకుల దృష్టి మళ్లీ ఈ ప్రాంతం వైపు మళ్లింది. ఉప్పాడ అందాలు వారిని ఈ ‘తీరానికి లాగేటి దారం’గా మారిపోయాయి. కొత్త సినిమాలతో పాటు టీవీ సీరియళ్ల చిత్రీకరణకు కూడా ఉప్పాడ తీరం కేంద్రంగా మారుతోంది. గతంలో.. చాలాకాలం కిందట ఉప్పాడ తీరంలో సినిమా షూటింగ్‌లు జరిగాయి. రెబల్‌స్టార్ కృష్ణంరాజు హీరోగా, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య తదితర అగ్రశ్రేణి నటులు నటించిన ‘నాకూ స్వాతంత్య్రం వచ్చింది’ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఉప్పాడ తీరంలో జరిగింది. తరువాత రణరంగం, పోరు, కనకం, డియర్ కామ్రేడ్, దుర్మార్గుడు, ఆగ్రహం, ఒక్కడు, జయమ్ము నిశ్చయమ్మురా.. తదితర సినిమాల చిత్రీకరణ ఇక్కడే జరిగింది. తరువాత కొన్నాళ్లు అంతగా షూటింగ్‌లు లేవు. కానీ ఉప్పెన సినిమాతో సాగరతీరం మరోసారి సినిమా షూటింగ్‌లకు నెలవుగా మారింది. ఇప్పుడు తీరంలో తరచుగా ‘క్లాప్.. స్టార్ట్.. రోల్.. కెమెరా.. యాక్షన్.. అంటూ సినిమా షూటింగ్‌ల సందడి కనిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ నటిస్తున్న ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా షూటింగ్ ఈ ప్రాంతంలోని పండూరుతో పాటు అల్లవరం మండలంలోని పలు గ్రామాల్లో జరిగింది. వీటితో పాటు పలు ప్రముఖ బుల్లితెర సీరియల్స్ షూటింగ్‌లు ఇక్కడ జరిగాయి. ఉప్పెన సినిమా షూటింగ్ జరిగిన కాకినాడ ఫిషింగ్ హార్బర్ కాకినాడ నుంచి తుని సమీపంలోని అద్దరిపేట వరకూ ఉన్న సాగరతీరం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్, మడ అడవులు.. చూడచక్కటి లొకేషన్లతో సందర్శకులనే కాదు.. వెండితెర, బుల్లితెర దర్శకుల కళ్లను కూడా కట్టి పడేస్తున్నాయి. కడలి కెరటాలు.. పచ్చని చెట్లు.. ఇసుక తిన్నెలు.. మధ్యలో ఉన్న కాలువలు ఎక్కడో ఉన్న దీవులను తలపిస్తుంటాయి. రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేయడంతో ఇక్కడ షూటింగ్‌లు జరుపుకునేందుకు ఎక్కువ మంది సినిమా వాళ్లు ఆసక్తి చూపుతున్నారు. ఉప్పాడ.. నా కెరీర్‌ను మలుపు తిప్పింది నా తొలి సినిమా షూటింగ్ నా సొంత ఊరిలో జరుపుకోవడం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఏ దర్శకుడికీ దక్కని అవకాశాన్ని నా సొంత ఊరిలో ప్రకృతి నాకు ఇచ్చింది. కాకినాడ – ఉప్పాడ సాగరతీరంలో ఎన్నో అందమైన లోకేషన్లున్నాయి. ఉప్పెన సినిమాలో లొకేషన్లు చూసి, హిందీ నటుడు ఆమిర్‌ఖాన్ సైతం ఇక్కడ షూటింగ్‌కు ఉత్సాహం చూపించారు. ఇప్పటికీ ఎంతో మంది ఫోన్ ద్వారా ‘ఉప్పాడలో అంత మంచి లొకేషన్లున్నాయా? మేమూ సినిమా తీస్తాం’ అని చెబుతున్నారు. షూటింగ్‌కు ఇక్కడి ప్రజల సహకారం ఎంతో బాగుంటుంది. రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాల షూటింగ్‌లు ఉప్పాడ తీరంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. – సానా బుచ్చిబాబు, ఉప్పెన సినిమా దర్శకుడు ‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్‌కు వచ్చిన బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ ఇక్కడ సెట్టింగ్‌లతో పని లేదు కాకినాడ – ఉప్పాడ తీర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు చేస్తే సెట్టింగ్‌లతో పని ఉండదు. అంతా ప్రకృతి అందాలతో ఎక్కడ చూసినా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతిని చిత్రీకరించాలంటే ఇక్కడి కంటే మంచి లొకేషన్లుండవు. సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. తక్కువ ఖర్చుతో మంచి లొకేషన్లలో సినిమాలు తీసుకోవడానికి ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంటుంది. అందుకే ఇక్కడ ‘కనకం 916 కెడిఎం’ సినిమా తీశాం. షూటింగ్‌కు స్థానిక ప్రజలు చాలా సహకరించారు. – రాకేష్ కనకం, సినిమా డైరెక్టర్ కనకం 916 కేడీఎం సినిమా షూటింగ్లో హీరోకు దర్శకుడు రాకేష్ సూచనలు -
టాలీవుడ్లో కొత్త భామల సందడి.. అందాలతో కట్టిపడేసిన భామలు వీరే
ప్రతి ఏటా టాలీవుడ్‌కి కొత్త హీరోయిన్స్ పరిచమవుతుంటారు. వారిలో కొంతమంది తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంటారు. మరికొందరు ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి వెళ్లిపోతుంటారు. ఈ ఏడాది కూడా టాలీవుడ్‌కి చాలా మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. అలా 2021లో తెలుగు తెరను పలకరించిన కొత్త అందాలు ఏంటి? ఎక్కువ మందిని ఆకర్షించిన కొత్త భామలెవరు? ఓ లుక్కేద్దాం. ఉప్పెనలా వచ్చి.. సముద్రమంత ప్రేమను పంచి.. తెలుగు వెండితెరపై ‘ఉప్పెన’లా దూసుకొచ్చిన హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెన చిత్రంలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ.. పక్కింటి అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులనే కాకుండా దర్శక నిర్మాతలను కూడా క్యూ కట్టేలా చేసింది. ఒకే ఒక సినిమాతో కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్, నాగచైతన్య బంగార్రాజు, సుదీర్ బాబు సినిమా, అలాగే నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో నటిస్తుంది. టాలీవుడ్ బ్యూటిరత్నం.. ‘చిట్టి’ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘జాతిరత్నాలు’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతోపాటు తెలుగు ప్రేక్షకుల మది దోచుకుంది. ‘చిట్టి’ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టికి ఎంత క్రేజ్ వచ్చిందో.. ఫరియాకు అంతే వచ్చింది.‘జాతిరత్నాలు’తర్వాత ఈ పొడగరి బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇటీవల విడుదలైన అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో కనిపించి సందడి చేసింది. ప్రస్తుతం నాగార్జున సరసన ‘బంగార్రాజు’లో ఓ ప్రత్యేక గీతంలో చిందులు వేయనుంది. అలాగే విష్ణు హీరోగా తెరకెక్కనున్న ‘డి అండ్ డి’లో సందడి చేయనుందని సమాచారం. ‘రొమాంటిక్’చూపులతో.. డాష్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరితో నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది ఉత్తరాది ముద్దుగుమ్మ కేతిక శర్మ. తొలి సినిమాతోనే తనదైన అందాలతో కుర్రకారు చూపులను తనవైపు తిప్పుకుంది. ఈ మూవీ షూటింగ్లో ఉండగానే.. నాగశౌర్య‘లక్ష్య’మూవీలో చాన్స్ దక్కించుకుంది. తొలి మూవీలో ఏమాత్రం మొహమాటం పడకుండా అందాలతో కనువిందు చేసిన కేతికా.. ‘లక్ష్య’లో తనదైన నటనతో ఆకట్టుకుంది. శ్రీలీల.. అందాల మాయ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్లి సందD’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్న భామ శ్రీలీల. ఈ సినిమాలో శ్రీలీల తన అందంతో అందరిని కట్టిపడేసింది. పెళ్లి సందడి సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయి.. రవితేజ సరసన ఓ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ‘చెక్’తో చెక్ పెట్టి.. కన్ను గీటుతో ఎంతో మంది కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన భామ ప్రియా ప్రకాశ్ వారియర్. . నితిన్ హీరోగా తెరకెక్కిన ‘చెక్’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఇష్క్’తో మరోసారి ఆకట్టుకుంది. తేజ సజ్జా హీరోగా రూపొందించిన చిత్రమిది.. తాజాగా ఆమె కిట్ లో మరో మూడు మీడియం బడ్జెట్ చిత్రాలు జమ అయ్యాయని తెలుస్తోంది. ఆ సినిమాల వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. మీనాక్షి చౌదరి.. అక్కినేని సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో హీరోయిన్గా మారింది మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. తొలి సినిమా విడుదలకు ముందే రవితేజ సరసన ‘ఖిలాడి’లో అవకాశం దక్కించుకుంది. అలాగే హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న హిట్ 2లో ఛాన్స్ కొట్టేసింది. వీరితో పాటు మరికొంతమంది నటీమణులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ వివరాలు.. నవమి - నాంది అమృత - రెడ్ శివానీ రాజశేఖర్ - అద్భుతం లవ్లీసింగ్ - గాలి సంపత్ దియా మీర్జా - వైల్డ్ డాగ్ తాన్యా రవిచంద్రన్ - రాజా విక్రమార్క గీత్ సైని - పుష్పక విమానం కశిష్ ఖాన్ - అనుభవించు రాజా వైశాలి రాజ్ - కనబడుట లేదు మిశా నారంగ్ - తెల్లవారితే గురువారం కృష్ణ ప్రియ - అర్ధ శతాబ్దం ఆర్జవీ రాజ్ - వివాహ భోజనంబు దృశ్య రఘునాథ్ - షాదీ ముబారక్ -
సవాల్‌కి సై అంటున్న.. ఉప్పెన హీరోయిన్
కృతీ శెట్టి ఓ సవాల్‌కి సై అన్నారట. లేడీ ఓరియంటెడ్ సినిమా చేయనున్నారని టాక్. మామూలుగా స్టార్ హీరోయిన్ అనిపించుకుని, ఓ పాతిక సినిమాలకు పైగా చేసి ఉంటే ఆ కథానాయికను నమ్మి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంటారు. అలాంటిది జస్ట్ ఒక్క సినిమా (‘ఉప్పెన’)లో కనిపించిన కృతీ శెట్టితో లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే చిన్న విషయం కాదు. అయితే ‘ఉప్పెన’తోనే తనలో మంచి నటి ఉందని నిరూపించుకున్నారు కాబట్టి కృతీకి ఈ ఆఫర్ వచ్చి ఉంటుంది. రాజ్‌తరుణ్‌తో ‘ఉయ్యాల జంపాల’, నానీతో ‘మజ్ను’ చిత్రాలు తెరకెక్కించిన విరించి వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మించనున్నారని సమాచారం. ఇక నానీతో కృతి నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ ఈ 24న విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. -
గాజువాకలో వైష్ణవ తేజ్, కృతిశెట్టి సందడి
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): ఉప్పెన ఫేం వైష్ణవ తేజ్, కృతిశెట్టి గాజువాకలో సందడి చేశారు. కొత్తగాజువాకలో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రారంభ కార్యక్రమానికి వీరు రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. గాజువాక ప్రధాన రహదారి జనంతో స్తంభించింది. అభిమానులనుద్దేశించి వైష్ణవ తేజ్ మాట్లాడుతూ తొలిచిత్రమే అఖండ విజయం సాధించిందని, దానికి కారణం అభిమానులేనని పేర్కొన్నారు. అభిమానులు మెచ్చే చిత్రాలు చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. క్రిష్ దర్శకత్వంలో నటించిన కొండపొలం చిత్రం ఈ నెల 8న విడుదలవుతుందన్నారు. ఆ చిత్రాన్ని ఆదరించాలన్నారు. కృతిశెట్టి మాట్లాడుతూ..విశాఖలో ఉప్పెన షూటింగ్ జరిగిందని, ఇక్కడ ఎన్నో సుందర ప్రాంతాలకు ఫిదా అయ్యాయని చెప్పారు. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటిస్తున్నానని, మరికొన్ని చర్చల దశలో ఉన్నాయని కృతి పేర్కొన్నారు. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వస్త్ర ప్రపంచంలో మరింత రాణించాలని వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి ఆకాంక్షించారు. -
బేబమ్మ ఓ సునామి
-
Krithi Shetty:అందానికే అసూయ పుట్టించే అందం ‘బేబమ్మ’సొంతం
టాలీవుడ్లోకి ప్రతి ఏడాది చాలామంది కొత్త హీరోయిన్లు వస్తుంటారు. అందులో కొంతమంది మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంటారు. అలా చడీచప్పుడు లేకుండా వచ్చి యువత గుండెల్లో అలజడులు రేపింది కన్నడ బ్యూటీ కృతిశెట్టి. ఆమె హీరోయిన్గా నటించిన చిత్రాల్లో రిలీజైన ఒకే ఒక్క చిత్రం ‘ఉప్పెన’. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించింది. అంతేకాదు ఈ చిత్రంలో ‘బేబమ్మ’గా నటించిన కృతిశెట్టి.. తొలి మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయింది. ఈ రోజు బేబమ్మ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె అందమైన ఫోటోలు మీకోసం. నితిన్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ప్రస్తుతం స్క్రిప్టు పనులను చేసుకుంటున్న చిత్రబృందం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్. కృతిశెట్టి బర్త్‌డే సందర్భంగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీమ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్ని విడుదల చేసిం నాని హీరోగా, కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. అందానికికే అసూయ పుట్టించే అందం కృతిశెట్టి సొంతం చడీచప్పుడు లేకుండా వచ్చి యువత గుండెల్లో అలజడుల సుడిగుండాలను రేపిందీ ముద్దుగుమ్మ ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది ’ఉప్పెన’ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను బాగానే యూజ్ చేసుకుంటోంది ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది -
Krithi Shetty Birthday Special : ‘బేబమ్మ’కు హ్యాపీ బర్త్‌డే
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్‌కు దొరికిన మరో అందమైన హీరోయిన్ కృతి శెట్టి. ఈ పేరు వింటేనే కుర్రకారు గుండెల్లో గుబులు. బేబమ్మ అంటూ తొలిసినిమాతోనే ఈ అమ్మడు సాధించిన క్రేజ్ అలాంటిది మరి. క్యూట్ స్మయిల్‌తో.. చక్కని అందం... అభినయంతో కూడా జనాల్ని కట్టిపడేసింది. తెలుగులో స్పష్టంగా, చాలా చక్కగా మాట్లాడేస్తూ.. టాలీవుడ్లో ఇంత తక్కువ కాలంలో ఇంత ఫాలోయింగ్ సాధించిన ఘనతను కొట్టేసింది. అంతేకాదు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. కృతి శెట్టి పుట్టినరోజు సందర్బంగా ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. అంతేకాదు కృతిశెట్టి కూడా డాక్టరు అవ్వాలనుకుందట. తద్వారా జనాలకు సేవ చేయలనుకుందిట. కానీ అనుకోకుండా సినిమా చాన్స్రావడంతో హీరోయిన్గా సెటిల్ అయిపోయింది. అలాగే డాన్స్ అన్నా, బేకింగ్ అన్నా చాలా ఇష్టమట. లాక్డౌన్ కాలంలో చాలా కేక్స్ కూడా తయారు చేసిందిట ఈ భామ. 2003, సెప్టెంబరు 21న కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించింది కృతి శెట్టి. చిన్నప్పటినుంచే పలు యాడ్స్‌తో తన ప్రత్యేకతను చాటుకుంది. ఐడియా, షాప్పర్స్ స్టాప్, పార్లే, లైఫ్ బాయ్, బ్లూ స్టార్ వంటి సంస్థల యాడ్స్ లో అలరించింది. మోడలింగ్ అలా మొదలు పెట్టిందో లేదో హిందీలో 2019లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'సూపర్ 30' సినిమాలో విద్యార్థిగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ తరువాత తొలిసారిగా 2021 తెలుగు సినిమా "ఉప్పెన" ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో చాన్స్కొట్టేసి, యూత్ క్రష్‌గా మారిపోయింది. ఒకదశలో సూపర్ జోడి నిజ జీవితంలో కూడా జతకడితే బావుండు అన్నంతగా మారిపోయారు క్రేజీ కపుల్. అంతేకాదు ఉప్పెన మూవీ పాటలు కూడా అంతే పాపులర్ అయ్యాయి. అలాగే ఈ మూవీలోని ‘ఈశ్వరా.. పరమేశ్వరా’ పాటకు శివరాత్రి సందర్భంగా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న "శ్యామ్ సింగరాయ్" చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. సెప్టెంబరు 21 ఆమె పుట్టిన రోజు సందర్బంగా 'శ్యామ్ సింగ రాయ్' సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అలాగే అండ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న మరో మూవీలో హీరో రామ్‌తో జతకడుతోంది కృతి శెట్టి. లింగుసామి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ యూనిట్ కూడా కృతి శెట్టి బర్త్ డే పోస్టర్ విడుదల చేసింది. దీంతోపాటు సుధీర్ బాబు సరసన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చేస్తోంది. యూత్ స్టార్ నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే మూవీలో నటించనుంది. ముఖ్యంగా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ‘బంగార్రాజు’ మూవీలో చాన్స్ కొట్టేసింది కృతి శెట్టి. ఈ మూవీలో నాగచైతన్యతో రొమాన్స్ చేసేందుకు రడీ అవుతోంది. మరి తన సెలబ్రిటీ క్రష్ రామ్ చరణ్ అని ప్రకటించిన ఈ అమ్మడు త్వరలోనే రామ్‌చరణ్ సరసన కూడా నటించాలని కోరుకుందాం. Wishing the cutest & sweetest @iamkrithishetty a very Happy Birthday! We are eagerly waiting to show the audience the story of "Aa Ammayi"! ❤️#MohanaKrishnaIndraganti @isudheerbabu @mahendra7997 @kiranballapalli @sudheercotton #AaAmmayiGurinchiMeekuCheppali#HBDKrithiShetty pic.twitter.com/VUolGFlomJ — Benchmark Studios (@benchmarkstudi5) September 21, 2021 #RAPO19 ❤️😍 Love to share screen with @ramsayz sir 😍💖 pic.twitter.com/0T5SZhug0l — KrithiShetty (@imKrithiShetty_) September 21, 2021 -
‘ఉప్పెన’దర్శకుడు స్పీడ్ ఎందుకు తగ్గినట్లు? బుచ్చిబాబు ధైర్యం ఏంటి?
ఉప్పెనతో టాలీవుడ్ కు కనీవినీ ఎరుగని డెబ్యూట్ ఇచ్చాడు దర్శకుడు బుచ్చిబాబు. ఒక కొత్త సినిమాతో ఇటు దర్శకుడు, అటు హీరో హీరోయిన్ అందరూ,ఇండస్ట్రీ షేక్ అయ్యే హిట్ అందుకున్నారు. మెగా హీరో వైష్ణవ్ ఇప్పటికే చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరో వైపు హీరోయిన్ కృతి శెట్టి కూడా టీటౌన్ లో లీడింగ్ యాక్ట్రెస్ గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు మాత్రం పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో దర్శకుడు బుచ్చిబాబు మూవీ కన్ ఫామ్ చేసుకున్నాడని, చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. కాని తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూట్‌తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కొరటాలతో సినిమా చేయనున్నాడు. ఆ వెంటనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మూవీ చేయాల్సి ఉంది. అయితే తారక్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ, బుచ్చిబాబు కోసం డేట్స్ కేటాయిస్తాను అని చెప్పాడట.కెరీర్ లో రెండో మూవీకి యంగ్ టైగర్ లాంటి టాప్ స్టార్, డేట్స్ కన్ ఫామ్ చేడయంతో వెయిట్ చేయడంలో తప్పులేదని,ప్రస్తుతానికి తాను రాసుకున్న కథకు మెరుగులు దిద్దుతున్నాడట బుచ్చిబాబు.నెక్ట్స్ ఇయర్ జులై నుంచి వీరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. -
ఇకపై కృతిశెట్టితో సినిమాలు చేయను : విజయ్ సేతుపతి
Vijay Sethupathi Says NO To Krithi Shetty: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తెలుగులోనూ మంచి ఆదరణ ఉంది. ఇటీవలె విడుదలైన ఉప్పెన సినిమాతో ఆయన తెలుగువారికి మరింత చేరువయ్యారు. తాజాగా శ్రుతిహాసన్‌తో కలిసి లాభం అనే సినిమాలో నటించారు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'ఉప్పెన మూవీ అనంతరం తమిళంలో ఓ ప్రాజెక్టు చేశాను. అందులో మొదట హీరోయిన్గా కృతిశెట్టి అయితే బావుంటుందని మూవీ టీం భావించారు. ఈ విషయం నాతో చెప్పగానే నేను ఈ సినిమా చేయను అని చెప్పాను. ఉప్పెన సినిమాలో ఆమెకు తండ్రిగా నటించి, ఇప్పుడు రొమాన్స్ చేయమంటే నేను చేయలేనని చెప్పా. ఉప్పెనలో కృతి శెట్టికి నేను తండ్రిగా నటించిన విషయం యూనిట్ సభ్యులకు తెలియదు. అందుకే మొదట ఆమెను హీరోయిన్గా అనుకున్నారు. భవిష్యత్తులోనూ కృతిశెట్టితో సినిమా చేయను. ఉప్పెన చిత్రం క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు ఆమె కొంచెం కంగారు పడింది. దీంతో నాకు నీ అంత వయసున్న కొడుకు ఉన్నాడు. నువ్వు కూడా నా కూతురు లాంటిదానివే. భయపడకు..ధైర్యంగా చెయ్ అని ప్రోత్సహించాను. కాబట్టి కూతురిలా భావించిన కృతిశెట్టితో జోడీలా నటించడం నా వల్ల కాదు' అని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. చదవండి : 'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు' నర్సులతో కలిసి సినిమా చూస్తున్న విజయకాంత్ -
చూపుల్తో గుండెకు గాయం చేస్తున్న కృతీశెట్టి
-
బేబమ్మకు 'ఉప్పెన'లా వెల్లువెత్తుతున్న ఆఫర్లు!
-
ఆ హీరోయిన్ని ప్రేమిస్తున్నా : వైష్ణవ్ తేజ్
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టిన హీరో వైష్ణవ్‌తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ యంగ్ హీరో.. తనదైన నటనతో ఒక్క సినిమాతోనే లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ‘ఉప్పెన’సినిమా చూసిన వాళ్లంతా వైష్ణవ్‌కు ఇది తొలి సినిమా అంటే నమ్మలేరు. అంతలా నటించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ యంగ్ హీరో తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా తమ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటినీ వైష్ణవ్ ముందు ఉంచారు నెటిజన్లు. వాటన్నింటికీ ఓపికగా సమాధానం ఇచ్చాడు వైష్ణవ్. ఈ క్రమంలో ‘సోనాక్షి సిన్హా అంటే మీకు ఎందుకు ఇష్టం’అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఆమె అంటే ఇష్టం కాదు ప్రేమని చెప్పాడు. ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తూనే ఉన్నానని వైష్ణవ్ అన్నాడు. ఇక అభిమాన హీరో ఎవరని ప్రశ్నించగా.. రజనీ కాంత్ అని, ఆయన నటించిన శివాజీ మూవీని చాలా సార్లు చూశానని చెప్పాడు. సమంత గురించి ఏమైనా చెప్పండని ఓ నెటిజన్ అడగ్గా.. ఫ్యామిలీ మేన్-2లో సమంత నాకెంతో నచ్చేసిందన్నాడు. కృతిశెట్టిలో నటన కాకుండా దాగి ఉన్న మరో టాలెంట్ ఏంటని ప్రశ్నించగా.. ఆమె మంచి సింగర్ అని చెప్పాడు. తన తరువాతి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నానని, ఆ తర్వాత గిరీశయ్య దర్శకత్వంలో మరో సినిమా పట్టాలెక్కనుందని తెలిపాడు. చదవండి: బన్నీ అస్సలు తగ్గట్లేదుగా.. క్రేజీ ప్రాజెక్టులతో దండయాత్రకు రెడీ ఆ హీరోయిన్ను కాపీ కొడతాను: సమంత -
Krithi Shetty: ‘బేబమ్మ’కు ఓ కోరిక ఉందట.. నెరవేర్చేదెవరు?
ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి. ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది. ఉప్పెన సినిమా విజయంలో కృతిశెట్టి కీలక పాత్ర వహించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వైష్ణవ్ తేజ్‌కు జంటగా బేబమ్మ పాత్రలో తన అమాయకపు నటనతో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. ‘ఉప్పెన’తో భారీ విజయం అందుకున్న ఈ అందాల తార.. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బిజీగా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాని హీరోగా తెరకెక్కుతోన్న శ్యామ్ సింగ రాయ్‌తో పాటు.. సుధీర్ బాబు నటిస్తోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ‘బేబమ్మ’.. పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మీకు ఉన్న కోరిక ఏంటని ఓ అభిమాని ప్రశ్నించగా.. తనకు తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవాలని ఉందని చెప్పింది. ఆ కోరిక నెరవేర్చే దర్శకుడి కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. తనకు టాలీవుడ్ బాగా నచ్చిందని, తెలుగు ప్రేక్షకులు తనపై చూపే ప్రేమ, అభిమానానికి చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. మరి ‘బేబమ్మ’ కోరిక నెరవేర్చే దర్శకుడు ఎవరో చూడాలి. -
బుల్లితెరపై ‘ఉప్పెన’ రికార్డ్.. స్టార్ హీరోలతో సమానంగా!
ఉప్పెన.. ఇటీవల కాలంలో వచ్చిన తెలుగు సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన మూవీ. రికార్డుల మీద రికార్డులను తన పేరు మీద లిఖించుకుంటోంది. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలో బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ కలిసి నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, విలన్‌గా విజయ్ సేతుపతి నటన సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. వెండితెరపై ఓ ఊపు ఊపిన ఉప్పెన.. ఇటు బుల్లితెరపై కూడా తన హవాను కొనసాగించింది. థియేటర్స్ లో 50 రోజులు ఆడిన ఈ చిత్రం ఈ మద్యే నెట్ ఫ్లిక్స్ లోనూ విడుదలైంది. అక్కడా మంచి వ్యూస్ సాధిస్తుంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా స్టార్ మా ఛానెల్లో ప్రసారమయ్యింది. తొలిసారి ప్రసారమైన ఉప్పెనకు ఏకంగా 18.5 టీఆర్పీ రేటింగ్ దక్కింది. డెబ్యూ హీరోల సినిమాలకు ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఈమధ్య కాలంలో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల తర్వాత ఎక్కువ రేటింగ్ పొందిన చిత్రం ఇదే . ఇక అదే రోజున ప్రసారం అయిన విజయ్ మాస్టర్ సినిమాకు 4.86 రేటింగ్ వచ్చింది. చదవండి: మరోసారి ‘బేబమ్మ’తో వైష్ణవ్ తేజ్ రొమాన్స్! లాక్‌డౌన్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ Blockbuster response for #Uppena continues UPPENA TV PREMIERE delivers phenomenal 18.5 ratings 💥#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @MythriOfficial pic.twitter.com/tOPMelkR3l — BARaju (@baraju_SuperHit) April 29, 2021 -
‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్, హీరో ఎవరో తెలుసా!
ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీసుకు బాగానే కలిసోచ్చిందని చెప్పుకొవచ్చు. లాక్డౌన్ తర్వాత విడుదలైన మొదటి సినిమా ‘క్రాక్’ సూపర్ హిట్‌గా నిలిచి శుభారంభాన్ని ఇచ్చింది. ఇక ఆ తర్వాత విడుదలైన ‘ఉప్పెన’ చిత్రం ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇక మార్చిలో విడుదలైన ‘జాతి రత్నాలు’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుల్లెన్త్ కామెడీతో ఈ మూవీ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పటికే ‘క్రాక్’, ‘ఉప్పెన’ సినిమాలను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘జాతి రత్నాలు’ మూవీ కూడా ఈ జాబితాలో చేరింది. తాజా బజ్ ప్రకారం ఈ మూవీని హిందీలో రీమేక్ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరోను కూడా కన్ఫామ్ చేసినట్లు సమాచారం. అయితే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్‌కు కూడా అనుదీప్‌యే డైరెక్టర్‌గా వ్యవహరించన్నాడట. ఇందులో హీరోను కూడా నవీల్ పొలీశెట్టిని అనుకుంటున్నట్లు టాలీవుడ్లో టాక్. కాగా గతంలో నవీల్ పోలీశెట్టి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘చిచోరే’ మూవీలో సహానటుడిగా కనిపించిన విషయం తెలిసిందే. అందుకే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్‌ను కూడా నవీన్‌నే హీరోగా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉందట. అయితే దర్శకుడు అనుదీప్ ఇప్పటికే జాతి రత్నాలు మూవీకి సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను అనుదీప్ పూర్తి చేసినట్లు సమాచారం. చదవండి: ‘జాతిరత్నం’ రేటు పెరిగింది.. మూడో సినిమాకే అన్ని కోట్లా? జాతిరత్నాలు.. అసలు ఏంటా కామెడీ: టీమిండియా క్రికెటర్ -
మరోసారి ‘బేబమ్మ’తో వైష్ణవ్ తేజ్ రొమాన్స్!
చిత్రపరిశ్రమలో కాంబినేషన్‌కి భారీ రెస్పాన్స్ ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే చాలు ఆ దర్శకుడికి, హీరో కాంబోలో మరో సినిమా రావాలని కోరుకుంటారు సినీ అభిమానులు. అలాగే హీరో, హీరోయిన్లు కూడా మరోసారి కలిసి నటిస్తే..ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. అందుకే దర్శక, నిర్మాతలు సైతం అలాంటి జోడీలతో సినిమాలు చేసేందుకు మొగ్గు చూపుతుంటారు. ప్రేక్షకులు కూడా అలాంటి జోడీలను ఆదరిస్తుంటారు. ఇటీవల కాలంలో సిల్వర్ స్క్రీన్‌పై బాగా పాపులర్ అయిన జోడీ ఏదైనా ఉంటదే.. అది వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలదే. ‘ఉప్పెన’లో వీరిద్దరు చేసిన రొమాన్స్ ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చింది. వైష్ణవ్, కృతిల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. దీంతో ఈ ఇద్దరికి వరుసగా భారీ ఆఫర్లు వస్తున్నాయి. అందం, అభినయంతో ప్రతి ఒక్కరి మనసును దోచుకున్న ఈ ‘బేబమ్మ’.. మరోసారి వైష్ణవ్‌తో జోడీ కట్టనున్నందని టాక్. ఉప్పెన సినిమాను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ వైష్ణవ్, కృతితో కలిసి మరో సినిమాను చేయబోతున్నట్లు సమాచారం. అంతే కాదు ఈ సినిమాతో సుకుమార్ టీమ్ నుంచి మరో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ మూడో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలోనటించిన తన రెండో సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇక కృతిశెట్టి విషయానికి వస్తే.. నాని హీరోగా తెరకెక్కుతున్న ‘శ్యామ్ సింగరాయ్’తో పాటు సుధీర్‌బాబు– మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అంతేగాక, రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ నటించే అవకాశాన్ని దక్కించుకుంది. -
అయ్యో.. ‘ఉప్పెన’ కోసం బేబమ్మ ఇంత కష్టపడిందా?
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ ప్రేమ కథా చిత్రం ఈ ఏడాది టాలీవుడ్లో విడుదలైన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. వైష్ణవ్ తేజ్ నటన, కృతిశెట్టి అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామిని సృష్టించింది. ఇక ఈ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత మేకింగ్ వీడియోలని ఒక్కొక్కటిగా యూట్యూబ్‌లో విడుదల చేస్తుంది చిత్రబృందం. ఇప్పటికే ‘జల జల పాతం నువ్వు’పాటతో పాటు..పలు సన్నివేశాల మేకింగ్ వీడియోని విడుదల చేసిన చిత్రబృందం.. తాజాగా మరో మేకింగ్ వీడియోని విడుదల చేసింది. అందులో డైలాగ్స్ చెప్పడానికి ‘బేబమ్మ’ఎంత కష్టపడిందో చూడొచ్చు. మీడియా ముందు సైలెంట్‌గా కనిపించే దర్శకుడు బుచ్చిబాబు..లొకేషన్లో మాత్రం చాలా హుషారుగా ఉన్నాడు. యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు క్లాస్రూమ్ సీన్లను ఎలా చిత్రీకరించారో ఈ వీడియోలో చూడొచ్చు. చదవండి: ‘జలజల పాతం’ మేకింగ్ కష్టాలు, వీడియో వైరల్ -
‘జలజల పాతం’ మేకింగ్ కష్టాలు, వీడియో వైరల్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టీ జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం వంద కోట్లపైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇటీవల సినిమా విడుదలైన నెలరోజుల తర్వాత నుంచి ఉప్పెన టీం సినిమాలోని డిలీటెడ్ సీన్స్, పాటల మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ ప్రేక్షకులలో అసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ మూవీ రోమాంటిక్ సాంగ్ ‘జల జల పాతం నువ్వు..’ మేకింగ్ వీడియోను షేర్ చేసింది చిత్ర యూనిట్. సిల్వర్ స్క్రీన్‌పై సముద్రం మధ్యలో హీరోహీరోయిన్లు పండించిన రోమాన్స్ అంతా ఇంతా కాదు. ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పడానికి ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఫుల్ సాంగ్‌కు వచ్చిన వ్యూస్ యే నిదర్శనం. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించగా.. శ్రేయాఘోషల్, జాస్ ప్రీత్ జాజ్ ఆలపించిన ఈ పాట ఫుల్ వీడియోను ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలై గంటల వ్వవధిలోనే లక్షల్లో వ్యూస్ సంపాదించింది. అంతగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ పాట మేకింగ్ కోసం మూవీ టీం బాగానే చేమటోడిచ్చినట్లు తెలుస్తోంది ఈ తాజా మేకింగ్ వీడియో చూస్తుంటే. ఇక సహజమైన సముద్రాన్ని చూపించేందుకు మన దర్శకుడు బుచ్చి ఎంతగా కృషి చేశారో మీరే చూడండి. చదవండి: ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ఉప్పెనలా ఎగసిపడ్డ జనం ‘ఉప్పెన’ డిలీటెడ్ సీన్.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్ -
ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ‘ఉప్పెన’లా ఎగసిపడ్డ జనం
‘ఉప్పెన’ మూవీతో మెగా మేనల్లుడు పంజా వైష్ణశ్ తేజ్, కృతి శెట్టీలు హీరోహీరోయిన్లుగా వెండితెరకు పరిచమయ్యారు. మొదటి చిత్రంతోనే వైష్ణవ్, కృతీలు భారీ సక్సెస్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఆర్సీగా వైష్ణవ్ తన అమాయకంతో, బేబమ్మగా కృతి అందం, అభినయనంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. దీంతో ఈ క్యూట్ జోడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పడంలో అతిశయోశక్తి లేదు. దీనికి ఈ తాజా సంఘటనే ఉదాహరణ. ఖమ్మంలోని కేఎల్ఎం షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు బేబమ్మ-ఆర్సీలు ముఖ్య అతిథులుగా హజరై షోరూంను ప్రారంభించారు. దీంతో వీరిని చూసేందుకు జనం వేల సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వైష్ణవ్, కృతీలను చూసేందుకు ‘ఉప్పెన’లా ఎగిసిపడ్డ జనసంద్రాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా లాక్డౌన్ తర్వాత విడుదలై సినిమాల్లో ‘ఉప్పెన’ 100 కోట్ల క్లబ్లో చేరిన మొదటి సినిమాగా గుర్తింపు పొందింది. దీంతో ఈ మూవీ హీరోహీరోఇయన్, దర్శకుడు పలు కార్యక్రమాల్లో పాల్గొంటు బిజీ అయిపోయారు. వీరికి ఉప్పెన నిర్మాతల నుంచి విలువైన బహుమతులు అందాయి. ఇటీవల బచ్చిబాబు సనాకు మైత్రీ మూవీ మేకర్స్ విలువైన బెంజ్ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. Khammam lo KLM shopping mall opening lo Uppena Hero Heroines ni choodadaaniki Uppenalaa egasipadina janam... pic.twitter.com/76OgBVLPcX — BARaju (@baraju_SuperHit) April 3, 2021 చదవండి: ‘ఉప్పెన’ డిలీటెడ్ సీన్.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్ ఎన్టీఆర్ కొత్త సినిమా: 60 ఏళ్ల మాజీ వృద్ధ ఆటగాడిగా..! -
బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 8 హిట్ సినిమాలు ఇవే
కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ మహమ్మారి ఎఫెక్ట్‌కు 9 నెలల పాటు థియేటర్స్ మూసేశారు. ఇలాంటి తరుణంలో ప్రేక్షకులు మళ్లీ థియేర్లకు వస్తారా? సినిమా థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ అవుతాయా?అని చిత్ర పరిశ్రమ పెద్దలు ఒకింత భయాందోళనకు గురవుతుండగా.. మేము అండగా ఉంటామని ధైర్యాన్ని నూరిపోశారు తెలుగు ప్రేక్షకులు. సినిమాలు విడుదల చేయండి, థియేటర్స్‌కి తప్పకుండా వస్తామని భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే గత మూడు నెలలుగా విడుదలైన సినిమాలన్నింటిని ఆదరించి చిత్ర పరిశ్రమే షాకయ్యేలా చేశారు. సినిమా సందడి మళ్లీ మొదలైంది. చూస్తుండగానే ఈ ఏడాదిలో మూడు నెలలు గడిచిపోయాయి. ఈ మూడు నెలల్లో టాలీవుడ్లో దాదాపు 66 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో మంచి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నేటితో మొదటి మూడు నెలలు ఫినిష్ అయ్యాయి.మరి ఫస్ట్ క్వార్టర్లో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాయో చూద్దాం. కిర్రాక్ అనిపించిన ‘క్రాక్’ థియేటర్లు రీఓపెన్ అయ్యాక వచ్చిన తొలి బిగ్ మూవీ ‘క్రాక్’. కరోనా భయానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి భరోసా ఇచ్చిన చిత్రమిది. జనవరి 9నదసంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించి నిర్మాతలలో నమ్మకం పెంచేసింది. రవితేజ, శ్రుతీహాసన్ హీరోహీరోయిన్లగా నటించిన ఈ సినిమా దాదాపు 38 కోట్లు వసూలు చేసింది. పోలీసు అధికారి పోత రాజు వీర శంకర్‌గా మాస్ మహారాజా రవితేజ చించేశాడు. చాలా రోజుల తర్వాత మాస్ మహారాజాలోని ఫైర్ తెరపై కనిపించింది. గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విజయ్ ‘మాస్టర్’ పాఠాలు బాగున్నాయి విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ‘ఇళయదళపతి’ విజయ్ ఈ ఏడాది ‘మాస్టర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు సినిమా కాకపోయినా కూడా టాలీవుడ్లో మంచి విజయం సాధించింది మాస్టర్. జనవరి 13న విడుదలైన ఈ సినిమా సినిమా దాదాపు 12 కోట్ల షేర్ వసూలు చేసి, తెలుగులో కూడా విజయ్‌కు భారీ మార్కెట్ ఉందని నిరూపించింది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతికి మంచి మార్కులు పడ్డాయి. పర్వాలేదనిపించిన ‘రెడ్’ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ‘రెడ్’ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' తర్వాత కిశోర్ తిరుమల,రామ్ కాంబోలో హ్యాట్రిక్‌గా వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. సేఫ్‌జోన్‌లోకి వెళ్లింది. యాంకర్ ప్రదీప్ తొలి ప్రయత్నం ఫలించింది యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘30’రోజుల్లో ప్రేమించడం ఎలా. తొలి సినిమాతోనే మంచి హిట్ కట్టాడు. ఈ సినిమా కూడా హిట్ అయిందా అనే అనుమానాలు చాలా మందికి రావచ్చు. కానీ పెట్టిన బడ్జెట్.. అమ్మిన రేట్లతో పోలిస్తే మాత్రం యాంకర్ ప్రదీప్ తొలి సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి.కొందరు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కూడా తీసుకొచ్చింది. రికార్డులు షేక్ చేసిన జాంబి రెడ్డి కరోనా క్రైసిస్ లో కూడా జాంబీలంటూ.. వచ్చి టాలీవుడ్ రికార్డులు షేక్ చేసింది జాంబి రెడ్డి. హాలీవుడ్ కాన్సెప్ట్ తో డిఫరెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లని రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. మెగా మేనల్లుడి రికార్డు.. ‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్లు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఉప్పెన. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతోమంది నిర్మాతలకు ధైర్యం నూరిపోసిన సినిమా ఇది. బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఉప్పెన ఏకంగా 51 కోట్లు షేర్ వసూలు చేసింది. అల్లరి నరేశ్ నట విశ్వరూపానికి ‘నాంది’ 8 ఏళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న అల్లరి నరేశ్‌కు ‘నాంది’తో మంచి విజయం దక్కింది. ‘నా ప్రాణం పోయిన పర్వాలేదు.. న్యాయం గెలవాలి.. న్యాయమే గెలవాలి’ అంటూ అల్లరి నరేశ్ చేసిన నటనకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నరేశ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా 6.5 కోట్ల షేర్ వచ్చింది. చేసిన బిజినెస్‌తో పోలిస్తే సినిమా లాభాల్లోకి వచ్చేసింది. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ‘జాతి రత్నాలు’ నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ జాతిరత్నాలు. అనుదీప్ దర్శకత్వంలో వచ్చినఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 11న విడుదలైన జాతి రత్నాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్లో కూడా పెద్ద సినిమాలకు రానీ కలెక్షన్స్‌తో రాబట్టింది.నిర్మాతలకు దాదాపు 40 కోట్ల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. -
ఎన్టీఆర్ కొత్త సినిమా: 60 ఏళ్ల మాజీ వృద్ధ ఆటగాడిగా..!
దర్శకుడు బుచ్చిబాబు సన మొదటిసారిగా దర్శకత్వం వహించి తెరకెక్కించిన ‘ఉప్పెన’ చిత్రం ఇటీవల విడుదలైన బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో బుచ్చిబాబుతో పని చేసేందుకు స్టార్ హీరోలు, నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో బుచ్చి డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ మూవీ రూపొందనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం బుచ్చి ఎన్టీఆర్ కోసం స్పోర్ట్స్ బెస్డ్ స్ర్కిప్ట్‌ను సిద్దం చేశాడట. పిరియాడికల్ స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం హిందీ మూవీ దంగల్ తరహాలో ఉండనుందట. ఇందులో ఎన్టీఆర్ 60 ఏళ్ల మాజీ ఆటగాడి పాత్ర చూట్టు ఈ కథ తిరగనుంది. కాగా ఇటీవల ఎన్టీఆర్‌ను కలిసి బుచ్చి కథ వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు దీనిపై ఎన్టీఆర్ స్పందించలేదని ఆయన గ్రీన్ సిగ్నిల్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమచారం. ఒకవేళ అంతా ఒకే అయితే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ సంస్థ నిర్మించనుంది. కాగా బుచ్చి బాబు ఇప్పటికే కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని కోసం ఓ మంచి ప్రేమకథ సిద్దచేయమని బచ్చిబాబుకు ప్రపోజల్ పెట్టినట్లు కడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళీ డైరెక్షన్లో మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ చివరి దశలో ఉండటంతో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్‌తో చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ప్యాన్ ఇండియా రేంజ్లో ఎన్టీఆర్ మూవీ..?! భార్య, కూతురు ఫొటో షేర్ చేసిన బన్నీ ‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’ -
‘ఉప్పెన’ డిలీటెడ్ సీన్.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టీ జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం వంద కోట్లపైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. సినిమా విడుదలైన నెలన్నర రోజుల తర్వాత డిలీటెడ్ సీన్స్‌ని ఒక్కక్కటిగా యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంది చిత్ర బృందం. తాజాగా విడుదల చేసిన రెండు డిలీటెడ్ సన్నివేశాలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కాలనీ అమ్మాయితో వైష్ణవ్ తేజ్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. బేబమ్మకు లవ్ లెటర్ ఇచ్చేందుకు ఆశీ పడే ప్రయత్నాలు ఫన్నీగా ఉన్నాయి. అంతేకాదు ఈ సీన్లో గోదావరి జిల్లాలో పాడుకునే జానపద పాటను కూడా పెట్టాడు దర్శకుడు బుచ్చిబాబు. అది కూడా చాలా బాగుంది. అలాగే విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల మధ్య వచ్చే సీన్ కూడా అదిరిపోయింది. సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు సన్నీవేశాలను తొలగించారు. ఇంకా ఇలాంటి సన్నివేశాలు ఎన్ని ఉన్నాయో చూడాలి మరి. -
ఫ్యాన్స్‌కు షాక్ : గూగుల్‌లో కృతిశెట్టి పేరు సెర్చ్ చేయగానే..
తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో బేబమ్మగా కుర్రాళ్ల హృదయాలను దోచేసుకుంది ఈ బ్యూటీ. దీంతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారిపోయింది. అయితే ఈ అమ్మడికి సంబంధించిన ఓ న్యూస్ తికమకపెడుతుంది. కృతిశెట్టి పేరును గూగుల్‌లో సెర్చ్ చేస్తే..ఆమె పేరు అద్వైతగా చూపిస్తుంది. అలాగే కృతిశెట్టి పేరుతో మరో హీరోయిన్ ప్రోఫైల్ ఓపెన్ అవుతోంది. అంతేకాకుండా అద్వైత ప్రొఫైల్‌లో ఆమె ఆరు తమిళ సినిమాల్లో నటించినట్లు చూపిస్తుంది. నిజానికి ఉప్పెన ఫేం కృతి శెట్టికి హీరోయిన్గా ఇది డెబ్యూ మూవీ. దీంతో ఇన్ని చిత్రాలలో ఎప్పుడు నటించిందని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. దీంతో అసలు నిజమైన కృతిశెట్టి ఎవరు? ఈ అద్వైతకు ఉప్పెన ఫేం కృతి శెట్టి ఏమవుతారు అన్నసందేహాలు వ్యక్తమవుతున్నాయి. కృతిశెట్టి పేరుతో ఇంతకుముందు కూడా ఓ హీరోయిన్ ఉన్నారు. అయితే సినిమాల్లో పెద్దగా రాణించకపోవడంతో ఆమె తన పేరును అద్వైతగా మార్చుకుంది. మొన్నటి ఉప్పెన ఫేం కృతిశెట్టికి వికీపీడియాలో ప్రొఫైల్ లేదు. దీంతో ఆమె పేరును సెర్చ్ చేస్తే అద్వైత ప్రొఫైల్ ఓపెన్ అయ్యేది. ప్రస్తుతం కృతి శెట్టి పేరున ప్రొఫైల్ క్రియేట్ అయినప్పటికీ ఆ పేరు సెర్చ్ చేస్తే మాత్రం రెండు ప్రొఫైల్స్, రెండు ఫోటోలు దర్శనమిస్తున్నాయి. దీంతో గూగుల్ మమ్మల్పి కన్ఫ్యూజ్ చేసేస్తుందంటూ ఆమె ఫ్యాన్స్ తికమకపడుతున్నారు. ప్రస్తుతం కృతిశెట్టి నాని ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్‌బాబు– మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటుహీరో రామ్‌కు జోడీగానూ ఓ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తుంది. చదవండి : వైరల్ : 'బేబమ్మ' డ్యాన్స్ వీడియో చూశారా? నితిన్ బర్త్‌డే వేడుకల్లో సింగర్ సునీత దంపతులు -
'ఉప్పెన' దర్శకుడికి బెంజ్ కారు గిఫ్ట్
తొలి సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్ హిట్ అందించాడు బుచ్చిబాబు. భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్ టాలీవుడ్‌కు వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేశాడు. ఇక ఈ సినిమా వంద కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడంతో ఉప్పెన నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ హీరోహీరోయిన్లకు భారీ ఎమౌంట్ గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో వైష్ణవ్ తేజ్‌కు కోటి రూపాయలు, హీరోయిన్ కృతీ శెట్టికి రూ.25 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు బుచ్చిబాబుకు కారు లేదా ఇల్లును ఆఫర్ చేయగా ఆయన కారు తీసుకునేందుకు ఆసక్తి చూపారట. దీంతో తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ బుచ్చిబాబుకు బెంజి జీఎల్సీ కారును బహుమతిగా ఇచ్చారు. దీని విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక కారు తన చేతికి రాగానే తన గురువు సుకుమార్‌ను ఎక్కించుకుని హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కొట్టాడు బుచ్చి బాబు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా వుంటే ఆయన తర్వాతి సినిమా కూడా ఇదే బ్యానర్లోనే చేయనున్నాడు. Blockbuster #Uppena Director@BuchiBabuSana is now a proud owner of the luxurious Benz GLC, gifted by his producers @MythriOfficial. The first ride was reserved for his mentor @aryasukku. #BuchiBabu is committed to work for another film under Mythri Movie Makers. pic.twitter.com/pQMbuQzcBN — BARaju (@baraju_SuperHit) March 25, 2021 చదవండి: ఉప్పెన విజయం: వైష్ణవ్, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్ నన్ను పెళ్లి చేసుకుంటావా?: విజయ్ సేతుపతి -
ఉప్పెన సక్సెస్ పార్టీ.. మెగాస్టార్, బన్నీ సందడి
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టీ జంటగా నటించిన ‘ఉప్పెన’ సినిమా రిలీజ్ అయ్యి నెల దాటినా మూవీపై క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సినిమాకు చెందిన ఏదో ఒక విషయం రోజూ వార్తల్లో నానుతుంది. ఇటీవల ‘జలజల జలపాతం నువ్వు’ అంటూ సాగే వీడియో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాట అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఉప్పెన సినిమా విజయోత్సవ సంబరాలు చేసుకుంది. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్‌తోపాటు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, పాటు అల్లు అర్జున్, సాయి తేజ్, సుకుమార్, హరీష్ శంకర్, గోపిచంద్ మలినేని, పలువురు దర్శకులు, నిర్మాతలు, తదితరులు వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ‘ఉప్పెన’ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. ఇందులో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం, శ్రీమణి రాసిన పాటలు సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయి. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాపై సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించారు. మైత్రిమూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్ అందుకొని ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు రాబట్టింది. అంతేకాకుండా టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగానూ ఉప్పెన రికార్డులు సృష్టించింది. ప్రతీ అంశం ఉప్పెన విజయంలో భాగమై సునామీలా వసూళ్లు కురిపిస్తుంది. చదవండి: ట్రెండింగ్‌లో 'ఉప్పెన' వీడియో సాంగ్.. ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌తో వైష్ణవ్ తేజ్ సినిమా -
ఉప్పెన విజయోత్సవంలో సినీ ప్రముఖుల సందడి..
-
ట్రెండింగ్‌లో 'ఉప్పెన' వీడియో సాంగ్..
సినిమాకు పాటలతోనే మాంచి హైప్ వస్తుందీ రోజుల్లో. అందుకు '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?', 'ఉప్పెన' సినిమాలే లేటెస్ట్ ఉదాహరణ. ఇందులోని పాటలు ఎంత హిట్టయ్యాయో, సినిమాలు అంతకు మించి సూపర్ డూపర్ హిట్టయ్యాయి. కేవలం పాటల కోసమే పని గట్టుకుని థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఇదిలా వుంటే.. గురువారం సాయంత్రం 'ఉప్పెన' చిత్రం నుంచి జలజలజలపాతం నువ్వే.. వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను శ్రేయాఘోషల్, జాస్ప్రీత్ జాజ్ మనోహరంగా ఆలపించారు. అప్పట్లో కేవలం లిరికల్ సాంగ్‌ను మాత్రమే రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఈ మెలోడి పూర్తి వీడియోను విడుదల చేసింది. ఇది 39 లక్షల పై చిలుకు వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. కాగా వైష్ణవ్ తేజ్, ఉప్పెన జంటగా నటించిన చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించాడు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకోవడమే కాక వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమాపై పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే! చదవండి: వంద కోట్లు: రికార్డులు తిరగరాసిన ఉప్పెన -
‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌తో వైష్ణవ్ తేజ్ సినిమా
డైరెక్టర్‌గా అనుదీప్ కేవీ, హీరోగా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాలతోనే టాలీవుడ్‌కు బ్లక్‌బస్టర్ హిట్ అందించారు. ఫుల్ లెన్త్ కామెడీగా అనుదీప్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ మూవీ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుండగా, వైష్ణవ్ ‘ఉప్పెన’ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్ రాబట్టి 100 కోట్ల క్లబ్లో చేరింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ మూవీ సెక్సెస్‌లో మునిగి తెలుగుతూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. అయితే అనుదీప్-వైష్ణవ్ కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ పడిందట. ఇప్పటికే నిర్మాత బీవీఎస్ఎస్ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌కు అడ్వాన్స్ కింద కొంత మొత్తం కూడా చెల్లించాడట. ప్రస్తుతం వైష్ణవ్ క్రిష్ జాగర్లమూడితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే అనుదీప్ వైష్ణవ్ మూడవ సినిమాను సట్స్‌పైకి తీసుకేళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా మార్చి 11న విడుదలై కలెక్షన్ వర్షం కురిపిస్తుండగా ఇక ఫిబ్రవరి 12న విడుదలైన ‘ఉప్పెన’ బ్లక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. చదవండి: అప్పుడే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ జాతి రత్నాలు ట్రైలర్ చూసి సరదాగా నవ్వుకోండి -
కృతిశెట్టి శివరాత్రి స్పెషల్.. డ్యాన్స్ వీడియో అదుర్స్
తొలి సినిమాతోనే బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది హీరోయిన్ కృతిశెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’ సినిమాతో బోలెడంత క్రేజ్ సంపాదించుకుంది ఈ మంగళూరు బ్యూటీ. ఉప్పెన సినిమాలోని పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ‘ఈశ్వరా.. పరమేశ్వరా’ అంటూ సాగే.. పాట గుర్తుంది కదా.! ఈ పాటకు సినిమాలో నాట్యం చేసే ఛాన్స్ కృతిశెట్టికి దక్కలేదు. దీంతో శివరాత్రి సందర్భంగా ఈ పాటుకు స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కృతిశెట్టి. దీనికి సంబంధించిన వీడియోను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ సాంగ్‌లో పలికించిన హావభావాకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బేబమ్మ చాలా టాలెంటెడ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక చంద్రబోస్ రచించిన ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం టాలీవుడ్లో లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్గా మారిపోయిన కృతిశెట్టి..వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే నాని ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్‌బాబు– మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆఫర్‌ను దక్కించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోయిన్గా కృతీ శెట్టిని ఎంపిక చేయారని తెలుస్తోంది. చదవండి : (రెమ్యునరేషన్ భారీగా పెంచిన ‘బేబమ్మ’.. మరీ అంతా!) ఉప్పెన విజయం: వైష్ణవ్, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్) -
అప్పుడే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్
పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. తొలిసారిగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలై బాక్సాఫిసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ మూవీ 100 కోట్ల రూపాయల బడ్జేట్‌లో చేరి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాతో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి అప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేశాడు వైష్ణవ్. దీంతో వైష్ణవ్‌కు ప్రముఖ దర్శకనిర్మాతల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే వైష్ణవ్ ‘ఉప్పెన’తో పాటు దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ షూటింగ్ ‘ఉప్పెన’ విడుదలకు ముందే కంప్లీట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరపుకుంటోంది. అంతేగాక వైష్ణవ్ తన మూడవ సినిమాకు కూడా సంతకం చేశాడట. మనం ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నూతన దర్శకుడి డైరెక్షన్లో వైష్ణవ్ తదుపరి సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమచారం. ఇక వీటితో పాటు వైష్ణవ్ నిర్మాత బీవీ ఎస్ఎన్ ప్రసాద్ నిర్మిచే మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీంతో తొలి సినిమాతోనే అంత్యంత క్రేజ్‌ను సంపాదించుకున్న వైష్ణవ్ వరుస సినిమాలతో టాలీవుడ్లో ఫుల్ బిజీ అయిపోయినట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ మూవీ దర్శకుడికి, హీరోయిన్ కృతి శేట్టికి కూడా పలు దర్శకనిర్మాతల నుంచి ఆఫర్లు, ఖరిదైన బహుమతులు అందుతున్న సంగతి తెలిసిందే. చదవండి: మూవీలో చరణ్ అన్న అలా చేయమని చెప్పాడు: వైష్ణవ్ రికార్డులు తిరగరాసిన ఉప్పెన -
100 కోట్ల క్లబ్లో చేరిన ‘ఉప్పెన’
మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైన బాక్సాపీస్ వద్ద దుమ్మురేపుతోంది. లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. మొదటి రోజే ఈ మూవీ రికార్డు స్టాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వాటిని నిజం చేస్తూ సూపర్ హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందే ఇది వంద కోట్ల సినిమా అవుతుందని డైరెక్టర్ సుకుమార్ జోస్యం చెప్పారు. ఇప్పుడు అక్షరాలా అదే నిజమైంది. ఉప్పెన చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ విషయాన్ని'ఉప్పెన' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఉప్పెన వంద కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 'ఓ మంచి సినిమాను ఏదీ ఆపలేదని మరోసారి ఈ ఉప్పెనతో రుజువైంది. మీ ఉప్పెనంత ప్రేమకి ధన్యవాదాలు'' అని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాతో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి అప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేశారు. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించగా, దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. చదవండి : (ఆ యాడ్స్‌లో ఉన్న చిన్నారి ‘బేబమ్మే’!) (ఉప్పెన విజయం: వైష్ణవ్, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్) Time and again it is proved that nothing can stop Good Cinema ❤️#100CroreGrossForUppena 🌊 మీ ఉప్పెనంత ప్రేమకి ధన్యవాదాలు 🙏❤️#BlockbusterUppena#Uppena#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @ThisIsDSP @aryasukku @SukumarWritings @adityamusic pic.twitter.com/lAWjiaVjc4 — Mythri Movie Makers (@MythriOfficial) March 6, 2021 -
మూవీలో చరణ్ అన్న అలా చేయమని చెప్పాడు: వైష్ణవ్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్ల సునామి సృష్టించి బ్లక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక హీరో, హీరోయిన్, దర్శకుడికి ‘ఉప్పెన’ తొలిసినిమా కావడం, ఇది రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టడంతో వీరి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక హీరోయిన్ కృతీ శేట్టి, హీరో వైష్ణవ్ తేజ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనాలకు మూవీ మేకర్స్ నుంచే కాకుండా పలువురు సినీ ప్రముఖుల నుంచి భారీ స్థాయిలో బహుమతులు అందుతున్నాయి. ఇక మూవీ టీం సెక్సెస్ మీట్లలో పాల్గొంటూ ఫుల్ బీజీ అయిపోయింది. ఈ కార్యక్రమాలకు హాజరవుతున్న టాప్ హీరోలు, దర్శకులంతా హీరోహీరోయిన్, దర్శకుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో హీరో నటన చాలా బాగుందని, ముఖ్యం తన కళ్లు, కనుబోమ్మలతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మూవీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయంటు వైష్ణవ్ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక మొదటి సినిమాతోనే వైష్ణవ్ భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడంతో మెగా హీరోలంతా తెగ సంబరపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణవ్ ఓ అసక్తికర విషయం చెప్పాడు. ‘ఉప్పెన’ మూవీ షూటింగ్ ప్రారంభించే ముందు బావ రామ్ చరణ్ తనకు ఓ సలహా ఇచ్చాడని వెల్లడించారు. ‘రామ్ చరణ్ అన్న మూవీలో నా కనుబొమ్మలను ఎంత వీలైత అంత ఉపయోగించమని చెప్పారన్నాడు. ఇలా చేస్తే మూవీలో నీకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుందని, అది మూవీ సక్సెస్‌కు బాగా ఉపయోగపడుతుందని చెప్పినట్లు వైష్ణవ్ వెల్లడించాడు. ఇక ఇటీవల ‘ఉప్పెన’ గ్రాండ్ సక్సెస్ మీట్ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చెర్రీ మాట్లాడుతూ.. వైష్ణవ్‌ను నాన్న బాబాయ్ సినిమాల్లోకి రమ్మని తరచూ ప్రోత్సహించారని చెప్పాడు. అంతేగాక నటనపై పట్టు సాధించేందుకు పవన్ కల్యాణ్ బాబాయ్ వైష్ణవ్‌ను విదేశాలకు పంపించాడని, నాన్న ఉప్పెన కథ నాలుగుసార్లు విన్నట్లు చరణ్ చెప్పుకొచ్చాడు. చదవండి: ‘ఉప్పెన’ టీమ్‌కు అల్లు అర్జున్ ప్రశంసలు ఆ యాడ్స్‌లో ఉన్న చిన్నారి ‘బేబమ్మే’! ‘ఉప్పెన’ మేకింగ్ వీడియో కూడా అదుర్స్! -
‘ఉప్పెన’ టీమ్‌కు అల్లు అర్జున్ ప్రశంసలు
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించిన ఉప్పెన చిత్రంపై టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన చిత్రం ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇన్ని రోజులు షూటింగ్‌లతో బిజీగా ఉన్న బన్నీ ఆలస్యంగా ఉప్పెన సినిమాను చూశారు. ఈ సందర్భంగా మూవీపై తన అభిప్రాయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఇంత గొప్ప విజయాన్ని అందుకున్నందుకు ఉప్పెన టీం అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా చిత్రీకరించాడని, ఇలాంటి సినిమాను తీసినందుకు బుచ్చిబాబు అంటే గౌరవం ఏర్పడిందదన్నారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు ఆత్మవంటిదన్నారు. విజయ్ సేతుపతి తన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా హీరో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్ గురించి ప్రశంసించారు. ఓ డెబ్యూ చిత్రంలో ఇంతగొప్పగా నటించిన మరో హీరోను నేను చూడలేదంటూ కొనియాడారు. అలాగే అలాగే హీరోయిన్ కృతి శెట్టి.. విజయ్ సేతుపతి నటన గురించి ప్రశంసించారు. కథను నమ్మి మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన సినిమా.. కథలపై వాళ్లకున్న నమ్మకాన్ని, ధైర్యాన్ని తెలియజేస్తుందని తెలిపారు. డీఓపీ, టెక్నికల్ టీం పనితనం బాగుందన్నారు. ఉప్పెన సినిమా తనకు చాలా బాగా నచ్చిందని.. ఇలాంటి అద్భుతమైన సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా బన్నీ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే పుష్ప సినిమాలో నటిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Watched #Uppena. My respect to @BuchiBabuSana for delivering such a wonderful film. Great work by DOP & technical crew. The music by @ThisIsDSP was the soul of the movie. Huge respect for @VijaySethuOffl garu who took the film to another level with his magnetic aura. pic.twitter.com/cIlPwZKRCN — Allu Arjun (@alluarjun) March 4, 2021 చదవండి: హైదరాబాద్ రోడ్లపై దర్శనమిచ్చిన అల్లు అర్జున్ శ్రద్ధా కపూర్ పెళ్లి; వాళ్లకు ఇష్టమైతే నేను సిద్ధమే! -
'ఉప్పెన' టీంకి అల్లు అర్జున్ అభినందనలు
-
ఉప్పెన భామ కృతి శెట్టి చిన్ననాటి ఫోటోస్
-
ఆ యాడ్స్‌లో ఉన్న చిన్నారి ‘బేబమ్మే’!
మొదటి సినిమాలోనే తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది హీరోయిన్ కృతిశెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మగా అందరినీ ఆకట్టుకుంది. వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. అయితే వెండితెరపై హీరోయిన్గా అరంగేట్రంలోనే అదరగొట్టిన ఈ ముంబై చిన్నది.. టాలీవుడ్‌కు కొత్తేమో గానీ కెమెరాకు మాత్రం కొత్త కాదు. చిన్న వయసులోనే పలు వాణిజ్య ప్రకటనల్లో మెరిసిందీ అమ్మడు. ఓ క్లాతింగ్(వస్త్రాలకు సంబంధించిన) యాడ్‌తో పాటు ‘లైఫ్‌బాయ్’, ‘డైరీమిల్క్ చాక్లెట్’ తదితర కమర్షియల్ యాడ్స్‌లో నటించింది. అంతేగాక ఓ ప్రముఖ కంపెనీకి చెందిన పెన్నుల యాడ్‌లో కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంది. ఇక రెండేళ్ల క్రితం హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సూపర్ 30 సినిమాలోనూ కృతి ఓ సన్నివేశంలో తళుక్కుమంది. ఈ నేపథ్యంలో బాల్యంలోనే కెమెరా ముందుకు వచ్చిన అనుభవంతోనే, హీరోయిన్గా తొలి సినిమాలోనే మంచి ప్రదర్శన కనబరిచి అందరి చేతా శభాష్ అనిపించుకుంటోందంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కృతిశెట్టి వాణిజ్య ప్రకటనలపై ఓ లుక్కేయండి మరి! (చదవండి: రెమ్యునరేషన్ భారీగా పెంచిన ‘బేబమ్మ’.. మరీ అంతా! -
రెమ్యునరేషన్ భారీగా పెంచిన ‘బేబమ్మ’.. మరీ అంతా!
తొలి సినిమా ‘ఉప్పెన’తోనే కుర్రాళ్ల ఆరాధ్య దేవతలా మారిపోయింది కృతిశెట్టి. అమాయకపు కళ్లు, సొట్టబుగ్గలతో ఆకట్టుకునే మనోహర రూపం, సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు కట్టిపడేసి ఉప్పెనంత విజయాన్ని సొంతం చేసుకుంది. బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన ఈ ముంబై చిన్నది... వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారిపోయింది. ఇప్పటికే నేచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగరాయ్, సుధీర్‌బాబు– మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక, రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తోంది. ఇటు తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా కృతికి ఆఫర్లు వస్తున్నాయట. ఇదిలా ఉంటే.. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఉప్పెన వసూళ్ల సునామీ కొనసాగుతోంది. దీంతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా హీరో వైష్ణవ్ తేజ్, బేబమ్మకు భారీ మొత్తాన్ని బహుమతిగా ఇస్తున్నట్లు సమాచారం. ఆశీకి రూ. కోటి, బేబమ్మకు 25 లక్షలు ఇచ్చినట్లు టీ-టౌన్ టాక్. ఈ నేపథ్యంలో తనకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడిందట కృతిశెట్టి. ఇల్లు ఉండగానే దీపం చక్కబెట్టుకోవాలన్న చందంగా రెమ్యునరేషన్‌ను ఏకంగా కోటి రూపాయలకు పెంచిందంటూ గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు. ఏదేమైనా మొదటి సినిమాకు పది లక్షల లోపు తీసుకున్న బేబమ్మ.. స్టార్ హీరోయిన్ల మాదిరి ఇప్పటి నుంచే భారీ మొత్తం డిమాండ్ చేయడం సాహసమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘ఉప్పెన’ టీం
సాక్షి, తిరుమల: ‘ఉప్పెన’ సినిమాతో భారీ విజయం అందుకున్నారు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీ శెట్టి, దర్శకుడు బుచ్చి బాబు. వీరందరికి టాలీవుడ్లో ఇది డెబ్యూ చిత్రం కావడం విశేషం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. అదే రేంజ్లో వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ‘ఉప్పెన’ ఘన విజయం సాధించడంతో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం వెంకటేశ్వర స్వామీ ఆశీస్సుల కోసం తిరమల వెళ్లారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీ శెట్టి, నిర్మాత నవీన్, డైరెక్టర్ బుచ్చిబాబు తదితరులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరంతా కాలినడకన కొండెక్కి స్వామిని దర్శించుకున్నారు. హీరో, హీరోయిన్లు కాలినడకన తిరుమల కొండ మెట్లెక్కుతున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలువుతున్నాయి. అనంతరం వీరంతా వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. ‘ఉప్పెన’ టీంతో పాటు తుడా చైర్మన్ చెవి రెడ్డి కూడా ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్న శివన్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తొలిసారి ప్రైవేట్ సంస్థలకు చెందిన ఐదు ఉపగ్రహాలను ప్రయోగించనున్న సంగతి తెలిసిందే. పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ ద్వారా ఈ నెల 28 ఉదయం షార్ నుంచి రోదసిలోకి ఉపగ్రహాలను పంపనున్నారు. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్, ఎంపీ మార్గాని భరత్ తదితరులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: వరంగల్‌లో ఉప్పెన టీం సందడి -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..
-
నాని నో చెప్పాడు.. వైష్ణవ్ ఓకే చేశాడు
ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు సిద్ధం చేసుకునేవారు. ఒకవేళ సదరు హీరోకు ఈ కథ నచ్చకపోతే అది అటకెక్కెది. మరి కొందరు హీరోలు తాము అస్సలు అడుగుపెట్టని జానర్ చిత్రాలు చేయాలంటే వెనకంజ వేసేవారు. అభిమానులు తమను అలాంటి చిత్రాల్లో అంగీకరిస్తారో లేదో.. ఎందుకొచ్చిన తలనొప్పి అని ఊరుకునేవారు. ప్రయోగాల జోలికి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. జానర్‌తో సంబంధం లేకుండా హీరోలు సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. కొత్త కథ అయితే చాలు అంటున్నారు. ఇక గతంలోలా ఓ హీరో కథను రిజెక్ట్ చేస్తే దాన్ని పక్కన పెట్టడం లేదు. మరో హీరోకు ఆ స్టోరి వినిపిస్తున్నారు దర్శక నిర్మాతలు. సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. తాజాగా ఇదే సీన్ రిపీట్ అయ్యింది టాలీవుడ్లో. నాచురల్ స్టార్ నాని రిజెక్ట్ చేసిన ఓ కథను హీరో వైష్ణవ్ తేజ్ అంగీకరించారట. ఆ వివరాలు.. తాజాగా నిర్మాత భోగవల్లి ప్రసాద్ కొత్త దర్శకుడితో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట. యాక్షన్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు తొలుత నానిని హీరోగా అనుకున్నారట. కారణాలు తెలయదు కానీ నాని ఈ కథను రిజెక్ట్ చేశాడట. దాంతో ఈ స్టోరిని మెగా హీరో వైష్ణవ్ తేజ్‌కు వినిపించారట దర్శకుడు. అతడు ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించాడని సమాచారం. త్వరలోనే ఇది పట్టాలెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉప్పెన విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న వైష్ణవ్ వరుసగా సినిమాలు అంగీకరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జంగిల్ బుక్’ సినిమాను పూర్తి చేశాడు ఈ మెగా హీరో. తరువాత అన్నపూర్ణ బ్యానర్లో ఓ చిత్రం.. దాని తర్వాత భోగవల్లి ప్రసాద్ బ్యానర్లో తెరకెక్కించే చిత్రాల్లో నటించనున్నాడు. నాని వద్దనకున్న చిత్రం వైష్ణ్వ్కి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి మరి అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇక వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రం 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో దీన్ని తమిళం, హిందీలో రిమేక్ చేయనున్నారు. బుచ్చిబాబు దర్శకత్వలో వచ్చిన ఉప్పెన చిత్రంలో కృతీ శెట్టి, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. చదవండి: టీజర్: ఫైటింగ్‌కు పెళ్లి కొడుకు రెడీ! డీఎస్పీ, కృతీశెట్టికి చిరంజీవి స్పెషల్ సర్ప్రైజ్ -
ఉప్పెన విజయం: వైష్ణవ్, ‘బేబమ్మ’కు భారీ గిఫ్ట్
డెబ్యూ మూవీతోనే భారీ హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు ‘ఉప్పెన’ హీరో, హీరోయిన్, దర్శకుడు. వైష్ణవ్ తేజ్, ‘బేబమ్మ’ కృతీ శెట్టి, దర్శకుడు బుచ్చిబాబుకి ఇండస్ట్రీలో ఉప్పెననే తొలి చిత్రం. భారీ అంచానాల మధ్య విడుదలైన ఈ చిత్రం అదే రేంజ్లో కలెక్షన్స్ సాధించింది. ఇప్పటి వరకు దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉప్పెన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ హీరో, హీరోయిన్లకు ఊహించని.. భారీ సర్ప్రైజ్ ఇచ్చారట. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో వీరిద్దరికి భారీ ఎమౌంట్ గిఫ్ట్‌గా ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో హీరో వైష్ణవ్ తేజ్‌కి కోటి రూపాయలు.. హీరోయిన్ కృతీ శెట్టికి 25 లక్షల రూపాయలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఇప్పటికే చెక్స్‌ని హీరో, హీరోయిన్లకు ఇచ్చినట్లు సమాచారం. ఇక త్వరలోనే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుకు కూడా ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారట. గతంలో బుచ్చి బాబుకు కారు లేదా ఇల్లుని ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘ఉప్పెన’ చిత్రానికి గాను వైష్ణవ్ తేజ్ 50 లక్షల రూపాయల పారీతోషికం తీసుకోగా.. గిఫ్ట్‌గా అంతకు రెట్టింపు అందుకోవడం విశేషం. ఏది ఏమైనా ఉప్పెన విజయం ఈ మెగా హీరోకు ఇండస్ట్రీలో బలమైన పునాది వేసిందనే చెప్పాలి. ఇక ఈ చిత్రం నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో అల్లు అర్జున్ పుష్ప, మహేష్ బాబు సర్కార్ వారి పాట వంటి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా ఉన్నాయి. చదవండి: బాలీవుడ్లో రీమేక్ కానున్న ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే? -
‘ఉప్పెన’ మేకింగ్ వీడియో కూడా అదుర్స్!
మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పలు రికార్డులను తిరగరాసింది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ను లాభాల్లో ముంచెత్తింది. లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగానూ నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్ సేతుపతి నటన ఈ సినిమా విజయానికి ప్లస్ అయింది. విలన్ పాత్రలో కనిపించిన విజయ్ సేతుపతి యాక్టింగ్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. అంతేకాకుండా టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగానూ ఉప్పెన రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఉప్పెన మేకింగ్ వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మొదటి సినిమాతోనే ఎంతో పరిణతితో నటించిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా టీజర్లు, పాటలు సినిమా విడుదలకు ముందే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. కరోనా నిబంధనల సడలింపుతో ఉప్పెన 100 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైంది. ఇలా ప్రతీ అంశం ఉప్పెన విజయంలో భాగమై సునామీలా వసూళ్లు కురిపిస్తుంది. దీంతో ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీ భాషల్లోనూ రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి : (ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు) (వైష్ణవ్ తేజ్ తొలి పారితోషికం ఎంతంటే?) -
బాలీవుడ్లో రీమేక్ కానున్న ‘ఉప్పెన’
మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈ నెల 12న విడుదలై బాక్సాపీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం... లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్ సేతుపతి నటన ఈ సినిమా విజయంలో సగ భాగం అయింది. ఇప్పటికే ఈ సినిమా రూ.70 కోట్ల కలెక్షన్లు సాధించి సత్తా చాటుతోంది. దీంతో ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీ భాషల్లోనూ రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే తన కుమారుడు సంజయ్‌ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేయాలని తమిళ సూపర్‌స్టార్ విజయ్ భావిస్తున్న్ట్లట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర బృందంతో ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదట ఈ సినిమాను టాలీవుడ్‌తో పాటు తమిళ్లో కూడా విడుదల చేయాలని భావించినా విజయ్ సేతుపతి మాత్రం వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. కథ బాగుందని, డబ్ చేయడం కంటే రీమేక్ చేస్తే మంచి వసూళ్లను రాబడుతుందని సలహా ఇచ్చారట. అంతేకాకుండా తమిళ రీమేక్ రైట్స్‌ను స్వయంగా విజయ్ సేతుపతి తీసుకోబుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ ఉప్పెనను రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఇషాన్ ఖట్టర్, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా ఉప్పెన రీమేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. చదవండి : (‘ఉప్పెన’పై మహేశ్ బాబు రివ్యూ) (బాప్రే.. కేజీఎఫ్ 2 తెలుగు రైట్స్‌కి అన్ని కోట్లా?) -
ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు
‘ఉప్పెన'తో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ రికార్డులను తిరగరాస్తున్నాడు. ఇంత వరకు ఏ డెబ్యూ హీరోకి రాని వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టిస్త్నునాడు. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. ఒక డెబ్యూ హీరోల పేరిట బాలీవుడ్లో ఉన్న రికార్డ్‌ను కూడా వైష్ణవ్ బీట్ చేశాడు. విడుదలైన రెండు రోజులకే ఈ సినిమాకు ఏకంగా 18 కోట్ల షేర్ వచ్చిందంటే రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మించాడు. మరోవైపు ‘ఉప్పెన’ ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కోలీవుడ, బాలీవుడ్‌లోకి కూడా రీమేక్ చేయడానికి సన్నహాలు మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే ఈ సూపర్ హిట్ మూవీని ఓటీటీలోకి కూడా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.7 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్టు సమాచారం. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. చదవండి : ‘ఉప్పెన’పై మహేశ్ బాబు రివ్యూ -
‘ఉప్పెన’పై మహేశ్ బాబు రివ్యూ
మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచమైన చిత్రం ‘ఉప్పెన’. ఈ నెల 12న విడుదలై అద్భత విజయాన్ని అందుకున్న ఈ మూవీ గురించి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. ఈ సినిమాపై ఇప్పటికే బాలయ్య మొదలు చాలా మంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ జాబితాలో తాజాగా సూపర్ స్టార్ మహేశ్ కూడా చేరాడు. ఇటీవల ‘ఉప్పెన’ సినిమాను వీక్షించిన మహేశ్.. ఇదో అద్భుత సినిమా అంటూ చిత్ర యూనిట్‌ని కొనియాడాడు. ఉప్పెన సినిమాకు పని చేసిన వాళ్లలో ఒక్కొక్కరిని ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ‘ఉప్పెన.. ఒక్క మాటలో చెప్పాలంటే క్లాసిక్! బుచ్చిబాబు సానా.. మీరు కలకాలం గుర్తుండిపోయే అరుదైన చిత్రాన్ని రూపొందించారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది’, ‘కొత్త వాళ్లైన వైష్ణవ్, కృతిశెట్టి అద్భుత నటన నా మనసును హత్తుకుంది’, ‘ఉప్పెనకు హార్ట్ దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా ఆల్‌టైమ్ గ్రేట్ మ్యూజిక్ స్కోర్స్‌లో ఒకటిగా గుర్తుండిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు అందించిన సంగీతంలో ఇది అత్యుత్తమం డీఎస్పీ. ఇలానే మంచి మ్యూజిక్ అందిస్తూ ఉండండి’, ‘ఇక చివరిగా ఉప్పెన లాంటి సినిమాను నిర్మించిన సుకుమార్ గారికి, మైత్రీ మూవీ మేకర్స్‌కి హ్యాట్సాఫ్. నేను చెప్పినట్టుగా ఇది కలకాలం గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి. మీ అందరినీ చూసి నాకు చాలా గర్వంగా ఉంది’అని ట్విటర్ వేదికగా ఉప్పెన టీంను ప్రశంసించాడు. ఇక సూపర్ స్టార్ మహేశ్ ప్రశంసతో ఉప్పెన టీం గాల్లో తేలిపోతుంది. #Uppena... One word... CLASSIC! @BuchiBabuSana you've made one of those rare timeless films... Proud of you! — Mahesh Babu (@urstrulyMahesh) February 22, 2021 It’s really heartwarming when you see two newcomers come up with stellar performances.... #VaisshnavTej and @IamKrithiShetty... you guys are stars! — Mahesh Babu (@urstrulyMahesh) February 22, 2021 And finally hats off to @aryasukku garu and @MythriOfficial for backing a project like Uppena. Like I said it’s one of those timeless films... Proud of you guys! — Mahesh Babu (@urstrulyMahesh) February 22, 2021 చదవండి : ‘ఉప్పెన’ మూవీ రివ్యూ డీఎస్పీ, కృతీశెట్టికి చిరంజీవి స్పెషల్ సర్ప్రైజ్ -
వరంగల్‌లో ఉప్పెన టీం సందడి
సాక్షి, వరంగల్ చౌరస్తా : ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ సినిమా హీరో వైష్ణవ్‌తేజ్ , హీరోయిన్ కృతిశెట్టి వరంగల్‌లో సందడి చేశారు. వరంగల్‌లోని రాధికా థియేటర్లో చిత్రం విడుదల కాగా, సోమవారం సాయంత్రం హీరో, హీరోయిన్లతో పాటు ఇతర చిత్రబృందం ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. అలాగే, సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తొలుత వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి తదితరులు హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించారు. వారితో ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ పూజలు చేయించి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ చరిత్ర, శిల్పకళ విశేషాలను వివరించారు. ఆ తర్వాత వైష్ణవ్‌తేజ్ మాట్లాడుతూ అల్లు అర్జున్ నటించిన రాణిరుద్రమదేవి సినిమా ద్వారా కాకతీయ రాజుల గొప్పతనం తెలిసిందని తెలిపారు. అలాగే, వరంగల్‌లోని భద్రకాళి గుడిని కూడా సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. అర్చకులు టక్కరసు సత్యంసురేష్‌శర్మ, సుధాకరశర్మతో పాటు గంగు మణికంఠశర్మ, ప్రణవ్, లింగబత్తిని రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
డీఎస్పీ, కృతీశెట్టికి చిరంజీవి స్పెషల్ సర్ప్రైజ్
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమా ఉప్పెనతోనే రికార్డులు సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మెగా హీరోలను సైతం షాక్‌కు గురి చేస్తూ బాక్సాఫీస్ దగ్గర ఉప్పెనలాంటి వసూళ్లను కురిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా రూ.70 కోట్ల కలెక్షన్లు సాధించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. ఇందులో నటించిన హీరోయిన్ కృతీ శెట్టికి ఇప్పటికే బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. కృతీ శెట్టిని, అభినందిస్తూ ఓ లేఖ పంపించాడు. బ్లాక్‌బస్టర్ సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌కు లేఖతో పాటు ఓ ఖరీదైన బహుమతి అందించాడు. ఈ కానుకలు అందుకున్న ఈ ఇద్దరూ ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయారు. చిరంజీవి రాక్‌స్టార్‌కు పంపిన లేఖలో "డియర్ డీఎస్పీ, ఎగసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతాన్ని ఇస్తావో, చిత్రరంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్‌కు అంతే ప్యాషన్‌తో సంగీతాన్నిస్తావు. నీలో ఉండే నీ ఎనర్జీ సినిమాలకు, మ్యూజిక్కు ఇచ్చే ఈ ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అని రాసుకొచ్చారు. OMG ! 😍 This MEGA GIFT & LETTER frm 1 & Only MEGASTAR Dearest @KChiruTweets Sir made my DAY & YEAR🎶❤️🙏🏻😍 I made a Video 2 share it with U all coz a Tweet cant do Justice😁🎶 Lov U Chiru Sir..Always ❤️🎶🙏🏻@MythriOfficial #Uppena https://t.co/Tn7CqQ16QM — DEVI SRI PRASAD (@ThisIsDSP) February 21, 2021 చదవండి: ఆచార్య@ మారేడుపల్లి.. చిరు గ్రాండ్ ఎంట్రీ 2021ని ఇరగదీయాలని డిసైడ్ అయ్యాను: డీఎస్పీ -
వైరల్: మహేష్ బాబుపై క్లాప్ కొట్టిన బుచ్చిబాబు
తొలి సినిమా ‘ఉప్పెన’తో దర్శకుడు బుచ్చిబాబు సాన సంచలనం సృష్టించారు. ఈ సినిమా ఐదు రోజుల్లో రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ను లాభాల్లో ముంచెత్తింది. అంతేకాదు, హీరోహీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలకు కూడా తొలి సినిమాతో సూపర్ బ్రేక్ వచ్చింది. ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్లకు సంబంధించిన పాత ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టడం మొదలు పెట్టాయి. తాజాగా బుచ్చిబాబు పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘1.నేనొక్కడినే’ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫొటో అది. ఆ ఫొటోలో ఓ షాట్‌కు సంబంధించి మహేష్ బాబుపై బుచ్చిబాబు క్లాప్ కొడుతున్నారు. ‘ఉప్పెన’ సినిమా ముందు వరకు బుచ్చిబాబు.. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. ‘1.నేనొక్కడినే’ సినిమాకు కూడా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ( ‘ఉప్పెన’ దర్శకుడికి మరో బంపర్ ఆఫర్ ) కాగా, ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసేందుకు బుచ్చిబాబుకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా టైంలో ఏర్పడ్డ స్నేహంతో ఎన్టీఆర్ ఈ సినిమా చేయటానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారంట. ఈ సినిమాను కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కించనుందని సమాచారం. -
‘ఉప్పెన’ దర్శకుడికి మరో బంపర్ ఆఫర్
క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చి బాబు సన మొదటిసారిగా దర్శకత్వం వహించి తెరకెక్కించిన ‘ఉప్పెన’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో పరిశ్రమలో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆయనకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నుంచి బుచ్చి బాబుకు భారీ స్థాయిలో బహుమతులు అందనున్న సంగతి తెలిసిందే. ‘డియర్ కామ్రేడ్’, ‘సవ్య సాచి’ చిత్రాల పరాజయం, ఆ తర్వాత లాక్‌డౌన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నష్టాలు చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారిని ‘ఉప్పెన’ లాభాల బాట పట్టించడంతో నిర్మాతలు బుచ్చిబాబును ఇళ్లు కావాలో, కారు కావాలో నిర్ణయించుకోమని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతేగాక ఆయనతో పనిచేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలు క్యూ కడుతున్నారంట. ఇప్పటికే కింగ్ నాగార్జున తన తనయుడు అఖిల్ అక్కినేని కోసం ఓ మంచి ప్రేమకథ సిద్దచేయమని బచ్చిబాబుకు ప్రపోజల్ పెట్టినట్లు వార్తలు వస్తుండగా.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసేందుకు ఆయనకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘నాన్నకు ప్రేమతో..’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాడు. ఈ సమయంలో యంగ్ టైగర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. దీంతో వారిద్దరూ మంచి స్నేహితులు కూడా అయ్యారంట. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బుచ్చిబాబుతో మూవీ చేసేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీని కూడా మైత్రీ మూవీస్ మేకర్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నంలో పిరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో భారీ బడ్జేత్ ఈ చిత్రాన్ని బుచ్చిబాబు రూపొందించనున్నట్లు సమచారం. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాలి మరి. (చదవండి: Mythri Movies: ఉప్పెన దర్శకుడికి బంపరాఫర్!) (మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తారు!) -
స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన తమిళ రీమేక్!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రం 'ఉప్పెన'. ఈ నెల 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి రికార్డులు సృష్టిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం... లాక్డౌన్ తర్వాత విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. దేవీశ్రీ సంగీతం, విజయ్ సేతుపతి నటన ఈ సినిమా విజయంలో సగ భాగం అయింది. అయితే ఈ సినిమాను టాలీవుడ్‌తో పాటు తమిళ్లో కూడా విడుదల చేయాలని తొలుత భావించారట. విజయ్ సేతుపతికి అక్కడ భారీగా క్రేజ్ ఉంది కాబట్టి తప్పకుండా ఉప్పెనను తమిళ్లో డబ్ చేసి విడుదల చేయాలని అనుకున్నారట. కానీ విజయ్ సేతుపతి మాత్రం వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. కథ బాగుందని, డబ్ చేయడం కంటే రీమేక్ చేస్తే మంచి వసూళ్లను రాబడుతుందని సలహా ఇచ్చారట. అందుకే తమిళ్లో విడుదల చేయకుండా కేవలం తెలుగులో మాత్రమే ఉప్పెనను విడుదల చేసింది చిత్ర బృందం. తమిళ రీమేక్ రైట్స్‌ను విజయ్ సేతుపతి తీసుకోబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమాను స్టార్ హీరో కొడుకుతో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగా ఉప్పెన నిలిచింది. అంతేకాకుండా ఈ చిత్రంతో వైష్ణవ్ తేజ్..ఆల్ ఇండియా రికార్డులను బద్దలు కొట్టాడు. దీంతో ఈ సినిమాపై తమిళ హీరో దళపతి విజయ్ కన్ను పడిందట. ఉప్పెన తమిళ రీమేక్‌తో కొడుకు జాన్సన్ సంజయ్‌ను హీరోగా పరిచయం చేయాలని విజయ్ భావిస్తున్నాడట. దీనికి సంబంధించి ఇప్పటికే ఉప్పెన ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్‌తో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే ఉప్పెన తమిళ రీమేక్ పనులు ప్రారంభం కానున్నాయి. మరి అదే జరిగితే హీరోయిన్గా కృతి శెట్టినే తీసుకుంటారా? లేదా కొత్త హీరోయిన్‌తో ప్రయోగం చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. చదవండి : (21 ఏళ్ల ఆల్‌టైం రికార్డులను తుడిచిపెట్టిన ‘ఉప్పెన’ ) (అదేంటో తెలుసుకోలేను.. బుచ్చిబాబుపై సుకుమార్ ఎమోషనల్) -
'ఉప్పెన' విజయోత్సవ వేడుక ఫోటోలు
-
ఉప్పెన సాంగ్: ఆశి-బేబమ్మల డ్యాన్స్
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: కరోనాతో ఏడాదిగా సినీ పరిశ్రమ పూర్తిస్థాయిలో నష్టపోయిన తరుణంలో ‘ఉప్పెన’ సినిమా విడుదలవడం, అభిమానులు, ప్రేక్షకులు దానిని పెద్దహిట్ చేయడం తెలుగుసినీ ఇండస్ట్రీకి ప్రాణం పోసినట్టయ్యిందని మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అన్నారు. బుధవారం రాత్రి స్థానిక వీఎల్‌పురంలో మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్‌లో శ్రేయాస్ మీడియాస్ ఆధ్వర్యంలో జరిగిన ‘ఉప్పెన’ సినిమా విజయోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ సారధ్యంలో ఒక్కొక్కపాట సినిమాకు ప్రాణం పోసిందన్నారు. విజయసేతుపతి, హీరోయిన్ కృతిశెట్టి వారి నటనతో ఆకట్టుకున్నారన్నారు. తొలి సినిమా ఉప్పెన సినిమాతో బుచ్చిబాబు మంచి దర్శకుడిగా, వైష్ణవ్‌తేజ్ మంచినటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. హీరో వైష్ణవ్‌తేజ్ మాట్లాడుతూ సినిమాను పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు, మెగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ హలో రాజమండ్రి, అందరికీ నమస్కారం బాగున్నారా.. మీరిచ్చిన సపోర్టుకు చాలా థ్యాంక్స్ అన్నారు. Watch Aasi-Bebamma Dance For Nee Kannu Neeli Samudram #UppenaBlockbusterCelebrations Watch Live here - https://t.co/JhAdRek5XV#PanjaVaisshnavTej @IamKrithiShetty @VijaySethuOffl @BuchiBabuSana @aryasukku @ThisIsDSP @SukumarWritings @MythriOfficial pic.twitter.com/3IMsR44J5x — BARaju (@baraju_SuperHit) February 17, 2021 దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ తన గురువు సుకుమార్, రామ్‌చరణ్ ఇచ్చిన సపోర్టు వల్లే ఉప్పెన సినిమా పెద్ద హిట్ సాధించిందన్నారు. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమా ‘నీలిసముద్రం.. ప్రేక్షకుల మనస్సు అందులో పడవ ప్రయాణం’ అంటూ పాడి అలరించారు. రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్‌విప్ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ మార్గాని ఎస్టేట్ గ్రౌండ్లో ఉప్పెన సినిమా విజయోత్సవసభ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. హీరో రామచరణ్‌ను చిరంజీవి ఫ్యాన్స్ తరఫున యేడిద బాబి ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించారు. ముందుగా యాంకర్ శ్యామల వ్యాఖ్యాతగా వ్యవహరించగా, శ్రేయాస్ మీడియా సీఈవో శ్రీనివాస్, డిస్ట్రిబ్యూటర్లు వింటేజ్ శివకుమార్, రామకృష్ణ, ఎల్వీఆర్, సతీష్ పాల్గొన్నారు. చదవండి: Mythri Movies: ఉప్పెన దర్శకుడికి బంపరాఫర్! -
ఈ హిట్‌తో తెలుగు సినిమాకి ప్రాణం పోశారు
‘‘కరోనా నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో దెబ్బతింది. ఈ సమయంలో ‘ఉప్పెన’ సినిమాని హిట్ చేయడం ద్వారా తెలుగు సినిమాకు ప్రేక్షకులు ప్రాణం పోశారు’’ అన్నారు రామ్‌చరణ్. పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజైంది. రాజమహేంద్రవరంలో బుధవారం ఉప్పెన విజయోత్సవం జరిగింది. ఈ వేడుకలో రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘తెలుగుతో పాటు ఇతర భాషల్లోని సినిమాలకు కూడా ‘ఉప్పెన’ హిట్ ఓ ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. వైష్ణవ్ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గురువును (సుకుమార్) మించిన శిష్యుడు అని బుచ్చిబాబు నిరూపించుకున్నాడు’’ అన్నారు. ‘‘మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు వైష్ణవ్ తేజ్. ఈ వేడుకలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. -
హృతిక్ రోషన్ రికార్డులను బ్రేక్ చేసిన 'ఉప్పెన’
వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమైన ‘ఉప్పెన’ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మెదటి రోజే ఈ మూవీ రికార్డు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టగా.. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు రూ.50 కోట్లు వసూలు చేసి రికార్డు స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. టాలీవుడ్లో అత్యధికంగా వసూలు చేసిన డెబ్యూ హీరో చిత్రంగా ఉప్పెన నిలిచింది.ఇప్పటి వరకు డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు రామ్ చరణ్ పేరు మీదే ఉంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో వచ్చిన చిరుతతో చరణ్ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అయితే 14 ఏళ్లుగా ఆ రిక్డార్డును ఎవరూ టచ్ చేయలేకపోయారు. తాజాగా మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో వారసుడే చిరుత కలెక్షన్లను పూర్తిగా తుడిచేశాడు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. ఉప్పెన సినిమాతో ఆల్ ఇండియా రికార్డులను బ్రేక్ చేశాడు. హృతిక్ రోషన్ తొలి చిత్రం ‘కహో నా ప్యార్ హై’ సినిమా ఇండియా వైడ్‌గా రూ.41 కోట్లు (నెట్) వసూలు చేసింది. భారత సినీ చరిత్రలో 21 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును ఇప్పుడు ఉప్పెన బద్దలుకొట్టింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఏప్పెన రూ.42 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి కొత్త రికార్డులను నమోదు చేసింది. చదవండి : (గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే.) (Mythri Movies: ఉప్పెన దర్శకుడికి బంపరాఫర్!) -
కారు లేదా ఇల్లు: ఉప్పెన దర్శకుడికి ఆఫర్!
కంటెంట్ బాగుంటే చాలు, కొత్త, పాత, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సినిమాను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన "ఉప్పెన" చిత్రం బాక్సాఫీస్ మీద దాడి చేసి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తన ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తీసిన ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్ అందుకుంటుందని దర్శకుడు సుకుమార్ గతంలోనే చెప్పాడు. ఇప్పటికైతే హాఫ్ సెంచరీని అవలీలగా దాటేయగా, ఈ సినిమా చాలా బాగుందంటూ పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా వుంటే 'డియర్ కామ్రేడ్', 'సవ్యసాచి' సినిమాలతో నిండా మునిగిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ను ఉప్పెన సునామీలా వచ్చి ఆదుకుంది. ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని పూడ్చుతూ లాభాల బాట పట్టించింది. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి.. దర్శకుడు సానా బుచ్చిబాబుకు ప్రత్యేక బహుమతిచ్చేందుకు రెడీ అయ్యారట. ఇల్లు లేదా కారులో ఏది కావాలో కోరుకోమని బుచ్చిబాబును అడిగినట్లు సమాచారం. అయితే ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌కు ఆ రెండూ ఇచ్చినా తప్పు లేదని అంటున్నారు. కాగా మంచి విజయాలు నమోదు చేసుకున్న ఛలో, ప్రతిరోజు పండగే సినిమాలకుగానూ దర్శకులు వెంకీ, మారుతిలకు కార్లు బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పది సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బిజీబిజీగా మారింది. సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో ఓ సినిమా చెయ్యనున్నారు. నేచురల్ స్టార్ నాని – వివేక్ ఆత్రేయతో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్‌తో చేస్తున్న సినిమా ఇటీవలే ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్, నటసింహా నందమూరి బాలకృష్ణ – గోపిచంద్ మలినేని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్, విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబు సానా తన తర్వాతి రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీస్ బ్యానర్లోనే చేయనున్నట్లు సమాచారం. చదవండి: ‘నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా‘నా’బుచ్చిబాబు’ మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తారు! -
అదేంటో తెలుసుకోలేను.. బుచ్చిబాబుపై సుకుమార్ ఎమోషనల్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా హీరోగా పరిచయం అయిన చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ఈ నెల 12న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. టాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లను రాబట్టిన తొలి డెబ్యూ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ ఈ సినిమాను నిర్మించాడు. ఇక తన ప్రియ శిష్యుడి తొలి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సుకుమార్ ఆనందంతో ఉబ్బితబ్బి పోతున్నారు. తన పేరుని నిలబెట్టినందకు గర్వంగా ఉందంటూ ఓ ఎమోషనల్ కవిత రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నువ్వు నన్ను గురువు చేసేసరికి.. నాకు నేను శిష్యుడినై పోయాను. ఇంత గొప్ప సినిమా తీయడానికి, నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావా..?? అని.. నాకు నేను శిష్యుడ్ని అయిపోతే తప్ప అదేంటో తెలుసుకోలేను.. నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సా‘నా’బుచ్చిబాబును ఉప్పెనంత ప్రేమతో అభినందిస్తూ.. ఇట్లు సుకుమార్ ఇంకో శిష్యుడు’అని బుచ్చిబాబు తన భూజాలనే ఒరిగి ఉన్న ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) చదవండి : రాధేశ్యామ్ : ప్రభాస్ కాస్ట్యూమ్స్ కోసం 6కోట్లు! భర్తకు ఖరీదైన కారు గిఫ్టిచ్చిన లాస్య -
జల జల జల జలపాతం నువ్వు.. లిరికల్ సాంగ్
జల జల జల జలపాతం నువ్వు సెల సెల సెలయేరుని నేను సల సల నువు తాకితే నన్ను పొంగే వరదై పోతాను చలి చలి చలి గాలివి నువ్వు చిరు చిరు చిరు అలనే నేను చెర చెర నువు అల్లితే నన్ను ఎగసే కెరటాన్నవుతాను హే... మన జంటవైపు జాబిలమ్మ తొంగి చూసెనే హే... ఇటు చూడకంటూ మబ్బు రెమ్మ దాన్ని మూసెనే ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే ‘‘జల జల‘‘ సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుందీ లోపలా ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఎలాగ బైటపడుతోంది ఈవేళా నడి ఎడారి లాంటి ప్రాణం తడి మేఘానితో ప్రయాణం ఇక నా నుంచి నిన్ను నీ నుంచి నన్నూ తెంచలేదు లోకం ‘‘జల జల‘‘ ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజూ ఎలాగ వెళ్లిపోకుండా ఆపడం ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్లు ఎలాగ దీన్ని గుండెల్లో దా^è డం ఎప్పుడూ లేనిదీ ఏకాంతం ఏక్కడా లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమే సొంతం ‘‘చలి చలి‘‘ చిత్రం : ఉప్పెన రచన : శ్రీమణి గానం : జస్ప్రీత్ జాజ్, శ్రేయా ఘోషల్ సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ -
రామ్ చరణ్ రికార్డులను తుడిచిపెట్టిన ‘ఉప్పెన’..
వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ‘ఉప్పెన’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఈ మూవీ రికార్డు స్టాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టగా.. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు రూ.50 కోట్లు వసూలు చేసి రికార్డు స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఉప్పెన చిత్రం మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పేరిట ఉన్న రికార్డులను తుడిచిపెట్టింది. ఇప్పటి వరకు డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు రామ్ చరణ్ పేరు మీదే ఉంది. 14 ఏళ్లుగా దీన్నెవరూ టచ్ చేయలేకపోయారు. కాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో వచ్చిన చిరుతతో చరణ్ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. చిరంజీవి కొడుకు కావడంతో చెర్రీ తొలి సినిమా చిరుతకు అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడి చరణ్‌కు మంచి విజయాన్ని అందించిందది. 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు సాధించిన డెబ్యూ హీరోగా చరిత్ర సృష్టించాడు రామ్ చరణ్. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ స్థాయిలో వసూళ్లు ఎవరూ సాధించలేకపోయారు. తాజాగా మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో వారసుడే చిరుత కలెక్షన్లను పూర్తిగా తుడిచేశాడు. కేవలం మూడు రోజుల్లోనే రూ.50 కోట్లు సాధించి చెర్రీ పేరిట ఉన్న రికార్డును వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూడు రోజుల్లోనే తిరగరాశాడు. ఇదిలా ఉండగా చిరుత రికార్డులను బయటి హీరో కాకుండా మెగా హీరోనే క్రాస్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా పవర్ అంటే ఈ లెవల్లో ఉంటుందని అంటున్నారు. చదవండి: గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే ‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్ రూ. 50 కోట్లు -
‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్ రూ. 50 కోట్లు
మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఈ మూవీ రికార్డు స్టాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. అదే రికార్డు స్థాయిలో వీకెండ్‌కు కూడా కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ నేపథ్యంలో ఇవాళ దర్శకుడు బుచ్చిబాబు సన పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు మైత్రీ మూవీస్ ట్విటర్ వేదికగా భాకాంక్షలు తెలుపుతూ ‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్లను వెల్లడించింది. ‘మా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, అలాగే ‘ఉప్పెన’ 50 కోట్ల కలెక్షన్లు రాబట్టిన సందర్భంగా ఆయనకు అభినందనలు’ అంటూ మైత్రీ మూవీస్ ట్వీట్ చేసింది. కాగా క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుని సక్సెస్ టాక్‌తో ముందుకెళుతుంది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. Wishing our Director @BuchiBabuSana a Very Happy Birthday ♥ What better gift than a 50Cr Gross Blockbuster Weekend 🌊 - Team #Uppena #HBDBuchiBabuSana pic.twitter.com/by376EaiEo — Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2021 చదవండి: గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే ‘ఉప్పెన’ ఫస్ట్ డే కలెక్షన్లు.. ఆల్‌టైమ్ రికార్డు -
గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే
మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఉప్పెన సినిమాకు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. ఫిబ్రవరి 12 విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకొని సక్సెస్ టాక్‌తో ముందుకెళుతుంది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. తాజాగా ఉప్పెన సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రాబోతుందనే విషయం తెరమీదకు వచ్చింది. కరోనా భయంతో ఇంటికే పరిమితమైన ప్రజలు సినిమాలను ఓటీటీలో చూపేందుకు మొగ్గు చూపించారు. అందుకే ఓటీటీ సంస్థలు సైతం భారీ ధరలు పెట్టి సినిమాలను కొంటున్నాయి. క్రాక్, మాస్టర్ లాంటి సినిమాల విషయంలో ఇదే జరిగింది. ప్రస్తుతం ఉప్పెన సినిమాను ఓటీటీలో ఎప్పుడు విడుదల చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. సినిమా రిలీజ్ అయిన సమయంలో రెండు మూడు వారాల్లోనే ఉప్పెన డిజిటల్లోకి వస్తుందనే వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఈ సినిమా 40 నుంచి 60 రోజుల టైమ్ గ్యాప్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగతా సినిమాలతో పోలీస్తే ఉప్పెన కాస్త ఆలస్యంగానే ఓటిటిలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 26 నుంచి ప్రారంభం కానున్నదని ఒకవైపు టాక్ వినిపిస్తోంది. అదే విధంగా ఏప్రిల్ 11 నుంచి దర్శనం ఇవ్వనుందని మరోవైపు వినికిడి. ఈ రెండింటిలో ఏది వాస్తవమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. ఇక విడుదలకు ముందే పాటలతో భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఉప్పెన మూవీ డిజిటల్ హక్కుల కోసం అమెజాన్, ఆహా సంస్థలు కూడా పోటీ పడగా.. నెట్ ప్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఉప్పెన’ ఫస్ట్ డే కలెక్షన్లు.. ఆల్‌టైమ్ రికార్డు కూతురి గిఫ్ట్‌ను చూసి మురిసిపోతున్న మహేష్ -
‘ఉప్పెన’ ఫస్ట్ డే కలెక్షన్లు.. ఆల్‌టైమ్ రికార్డు
చిరంజీవి మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ‘ఉప్పెన’ చిత్రం తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో రూ.3.08 కోట్లు, వైజాగ్‌లో రూ.1.43 కోట్లు, ఈస్ట్, వెస్ట్ ప్రాంతాల్లో వరుసగా రూ. 0.98 కోట్లు, రూ. 0.81 కోట్లు రాబట్టింది. మొదటి రోజు భారీ స్థాయలో కలెక్షన్లు రాబట్టడంతో వైష్ణవ్ తేజ్ డెబ్యూ హీరోగా తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. ఎక్కడ ఎంత వసూలు చేసిందనే విషయానికి వస్తే.. ► నైజాం.. రూ.3. 08 కోట్లు ►వైజాగ్ రూ. 1. 43 కోట్లు ►ఈస్ట్ రూ. 0.98 కోట్లు ► వెస్ట్ రూ. 0.81 కోట్లు ► క్రిష్ణా రూ. 0.62 కోట్లు ► గుంటూరు రూ. 0.65 కోట్లు ► నెల్లూరు రూ. 0.35 ► ఏపీ మొత్తం రూ. 4. 87 కోట్లు ► సీడెడ్ రూ. 1. 35 కోట్లు ► నైజాం+ ఏపీ రూ. 9.3 కోట్లు ►కర్ణాటక రూ.52 లక్షలు ►తమిళనాడు రూ.16 లక్షలు ►ఓవర్ సీస్లో రూ.34 లక్షలు కాగా మొన్నటి వరకు థియేటర్స్‌లో 50-50 ఆక్యుపెన్సీ మాత్రమే ఉండేది. అయితే ఉప్పెన 100 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైంది. అంతేగాక నేడు రేపు వీకెండ్ కావడంతోపాటు వాలెంటైన్స్ డే కూడా ఉండటంతో ప్రేమికులు ఉప్పెన చిత్రానికి క్యూ కట్టే అవకాశం ఉంది. పైగా మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశాలు ఉప్పెన చిత్రంలో చాలానే ఉండటంతో ‘ఉప్పెన’ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పే ఛాన్స్ ఉంది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీమణి రాసిన 'నీ కన్ను నీలి సముద్రం' పాట భారీ హిట్ కొట్టి ఈ సినిమాకు మరింత విజయాన్ని తెచ్చి పెట్టడంలో కృషి చేసింది. చదవండి: ‘ఉప్పెన’మూవీ రివ్యూ దిశా సోదరి గురించి తెలిస్తే ప్రశంసించక మానరు! -
‘ఉప్పెన’ మూవీ రివ్యూ
టైటిల్ : ఉప్పెన జానర్ : లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల తదితరులు నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ దర్శకత్వం : బుచ్చిబాబు సానా సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్ ఎడిటర్ : నవీన్ నూలి విడుదల తేది : ఫిబ్రవరి 12, 2021 తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మెగా’ఫ్యామిలీ ఓ ప్రత్యేకస్థానం ఉంది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వడమే. అంతేకాదు, వాళ్లలో చాలా మంది టాలీవుడ్లో స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కుర్రాడు కూడా సినీ రంగ ప్రవేశం చేశాడు. అతడే.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సుప్రీంహీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్. ‘మెగా’ఇమేజ్‌ని మోస్తూ ‘ఉప్పెన’సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు వైష్ణవ్ తేజ్. చిరంజీవి కుటుంబం నుంచి మరో వారసుడు వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులకు కూడా ‘ఉప్పెన’పై ఆసక్తి బాగా పెరిగింది. దానికి తోడు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇన్ని అంచనాల నడుమ శుక్రవారం (ఫిబ్రవరి 12న) విడుదలైన ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుంది? 99 శాతం కొత్తవాళ్లతో వచ్చిన ఉప్పెన.. బాక్సాఫీస్ పై విరుచుకుపడుతుందా? లేదా?, వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? అనేది రివ్యూలో చూద్దాం. కథ ఉప్పాడ గ్రామంలోని మత్య్సకార కుటుంబానికి చెందిన ఓ పేదింటి యువకుడు ఆశీ అలియాస్ ఆశీర్వాదం(పంజా వైష్ణవ్ తేజ్). తండ్రి చేసే చేపల వ్యాపారానికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆయనకు గ్రామ పెద్ద, వ్యాపారవేత్త శేషారాయణం(విజయ సేతుపతి) కూతురు బేబమ్మ అలియాస్ సంగీత(కృతి శెట్టి) అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి బేబమ్మను ప్రేమిస్తుంటాడు. కానీ ఈ విషయం బేబమ్మకు తెలియదు. మరోవైపు శేషారాయణంకు పరువు అంటే ప్రాణం. పరువు కోసం ఎంతటి దారుణానికికైనా పాల్పడుతాడు. ప్రాణం పోయినా పర్వాలేదు.. పరువు పోకూడదనే మూర్ఖుడు. తన కూతురు ఎక్కడ ప్రేమలో పడి తన పరువు తీస్తుందనే భయంతో కుర్రాళ్ల గాలి తగలకుండా ఉమెన్స్ కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. తన కూతురు కోసం స్పెషల్‌గా గ్రామానికి ఓ బస్సును కూడా వేయిస్తాడు. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల బేబమ్మ.. ఆశీతో ప్రేమలో పడిపోతుంది. ఓ సంఘటన వల్ల రాయణంకు తన కూతురు ప్రేమలో పడిన విషయం తెలిసి బేబమ్మను కట్టడి చేసే ప్రయత్నం చేస్తాడు. దీంతో బేబమ్మ ఆశీతో కలిసి లేచిపోతుంది. అయితే ఓ కారణం వల్ల ఆశీ.. బేబమ్మను తిరిగి రాయణంకు అప్పగిస్తాడు. తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే బేబమ్మను ఆశీ ఎందుకు తిరిగి అప్పగించాడు? పరువు కోసం ప్రాణాలు ఇచ్చే శేషారాయణం.. తన కూతురి ప్రేమను అంగీకరించాడా లేదా? ప్రేమ దక్కించుకునే క్రమంలో ఆశి ఏం కోల్పోయాడు? చివరకు ఈ జంట ఎలా ఒక్కటైందనేదే మిగతా కథ. నటీనటులు చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన వైష్ణవ్ తేజ్‌కు హీరోగా తొలి సినిమా ఇది. కానీ సగటు ప్రేక్షకులు వైష్ణవ్‌కు ఇది తొలి సినిమా అని గుర్తుపట్టలేరు. అంతలా నటించాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఆశి అనే ఓ పేదింటి కుర్రాడి క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. మొదటి సినిమానే అయినా హీరో ఎంతో పరిణితితో నటించాడు. ఎమోషనల్ సీన్లను అవలీలగా చేసేశాడు. ఇక బేబమ్మ పాత్రకు ప్రాణం పోసింది కృతి శెట్టి. తొలి సినిమాయే అయినా.. చాలా అనుభవం ఉన్న హీరోయిన్లా నటించింది. ఇక వైష్ణవ్ తేజ్ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర విజయ్ సేతుపతిది. శేషారాయణం అనే విలన్ పాత్రలో ఈ విలక్షణ నటుడు ఇన్వాల్వ్ అయిపోయాడు. సేతుపతి యాక్టింగ్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. విశ్లేషణ పరువు ప్రతిష్టలు, ప్రేమతో కూడిన సినిమాలు టాలీవుడ్లో చాలా వచ్చాయి. గొప్పింటి అమ్మాయిని పేదింటి అబ్బాయి ప్రేమించడం, పరువు కోసం ఆ ప్రేమకు హీరోయిన్ నాన్న అడ్డుపడడం. చివరకు ఎలాగోలా హీరో హీరోయిన్లు ఒక్కడవ్వడం చాలా సినిమాల్లో చూశాం. ఇలాంటి సినిమాలు సర్వసాధారణం కూడా. ఈ కథనే కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. విజయసేతుపతి లాంటి విలక్షణ నటుడిని, మెగా కుటుంబం నుంచి ఓ హీరోని తన కథకు సెలెక్ట్ చేసుకోవడంలోనే దర్శకుడు సగం విజయవంతం అయ్యాడని చెప్పొచ్చు. తొలి సినిమా అయినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టించకుండా అనుకున్న కథను కళ్లకు కట్టినట్లుగా తెరపై చూపించాడు. తనదైన స్క్రీన్‌ప్లేతో పాత స్టోరీకి ట్రీట్మెంట్ కాస్త డిఫరెంట్‌గా ఇచ్చాడు. అయితే సినిమా చూస్తున్నంత సేపు పలు సినిమాల్లోని సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు కూడా రొటీన్‌గా సాగుతాయి. ఫస్టాఫ్ చూస్తే నిడివి ఎక్కువైందనే భావన కలుగుతుంది. సెకాండాఫ్‌లో కూడా చాలా సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. క్లైమాక్స్‌లో రీవీల్ అయ్యే ఓ సీక్రెట్ మాత్రం ఈ మూవీకి హైలెట్ అని చెప్పొచ్చు. ఆశీ తండ్రి జాలయ్య సంబంధించిన సన్నివేశాలు ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు వచ్చే సన్నివేశాలు భావోద్వోగాన్ని రేకెత్తిస్తాయి. చివర్లో కృతి శెట్టి, విజయ్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాకు మరో హైలైట్ ఏంటంటే.. దేవిశ్రీ ప్రాసాద్ సంగీతం. తనదైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సినిమా రేంజ్‌ని పెంచేశాడు. విలన్‌కు సంబంధించిన కొన్ని సీన్లకు తన బీజియంతో ప్రాణం పోశాడు. శ్యామ్ దత్ విజువల్స్ బాగున్నాయి. నవీనూలి ఎడిటింగ్ పర్వాలేదు. సెకాండాఫ్‌లో కొన్ని చోట్లు తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తంగా ప్రేమకు సరికొత్త నిర్వచనం చెప్పి మెప్పించడంలో దర్శకుడు కాస్త సఫలమైయ్యాడనే చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్ : విజయ్ సేతుపతి, వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి నటన స్క్రీన్‌ప్లే సంగీతం మైనస్ పాయింట్ రొటీన్ స్టోరీ ఫస్టాఫ్ సాగదీత సీన్లు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఉప్పెన: విజయ్ సేతుపతి అందుకే డబ్బింగ్ చెప్పలేదు..
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాతో మరోసారి తెలుగు తెరపై కనిపించనున్నారు. ఈ సారి పుల్‌లెన్త్ రోల్ చేయనున్నారు. తెలుగులో మొదటి సినిమా అయిన సైరా నరసింహారెడ్డిలో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. అయితే ఈ సారి ఉప్పెనలో చేస్తున్న హీరోయిన్ తండ్రి రాయనం పాత్రకు మాత్రం డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు బొమ్మాలి రవి శంకర్‌తో డబ్బింగ్ చెప్పించారు. ట్రైలర్ విడుదలైన తర్వాత విజయ్ సేతుపతి డబ్బింగ్ వాయిస్‌పై మిశ్రమ స్పందన వచ్చింది. ట్రైలర్ చూసిన చాలా మంది నెటిజన్లు విజయ్ నటనకు తగ్గట్టు ఆ వాయిస్ సెట్ అవ్వలేదని కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. ( ఇంటర్వెల్ లేని విజయ్ సేతుపతి మూవీ! ) తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు బుచ్చిబాబు దీనిపై స్పందించారు. ‘‘ రాయనం పాత్రకు తన వాయిస్ సెట్ అవ్వదని విజయ్ సేతుపతి గారు చెప్పారు. గతంలో ఆయనకు డబ్బింగ్ చెప్పిన నటుడు అజయ్, మరికొంతమందితో డబ్బింగ్ చెప్పిద్దామని అనుకున్నాం. చివరకు బొమ్మాలి రవి శంకర్‌ను ఫైనల్ చేశాం. మామూలుగా ఆయన ఒక రోజులోనే పాత్రలకు డబ్బింగ్ చెబుతారు. అలాంటిది రాయన్న పాత్రకు డబ్బింగ్ చెప్పటానికి మూడు రోజులు టైం తీసుకున్నారు’’ అని అన్నారు. ( మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తారు! ) కాగా, మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. చిత్ర హీరోయిన్ కృతి శెట్టికి కూడా ఇది మొదటి సినిమా. సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 12(రేపు)న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తారు!
‘‘నేను ఎప్పుడూ మా ఇంటి గడప నుంచే కథ వెతుకుతాను. మా ఇంటి లోపల ఏదైనా కథ ఉందా? మా వీధి, మా ఊరు, మా స్నేహితులు.. ఇలా ముందు నా దగ్గర కథే వెతుక్కుంటాను. కల్మషం లేని భావోద్వేగాలతో కూడిన కథే మట్టి కథ. ‘ఉప్పెన’ అలాంటి సినిమాయే’’ అన్నారు బుచ్చిబాబు. వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉప్పెన’. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన విశేషాలు.. ► నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సుకుమార్‌గారు నా లెక్కల మాస్టర్. సినిమాల్లోకి వెళ్లబోతున్నానని చాలా తక్కువమంది స్టూడెంట్స్‌తో ఆయన చెప్పుకునేవారు. వారిలో నేను ఒకడిని. సుకుమార్‌గారు ఇండస్ట్రీకి వచ్చి ‘ఆర్య’ సినిమా తీశారు. డైరెక్ట్‌గా సినిమా అంటే మా ఇంట్లో పంపించరని, నేను ఎమ్బీఏ చదువుకుంటూ సుకుమార్‌గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాలు చేశాను. ► కొన్ని తమిళ సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటి కథలను మన కంటెంట్‌తో కూడా చెప్పవచ్చు కదా అనిపిస్తుంటుంది. లక్కీగా ‘ఉప్పెన’ సినిమా అలాంటిదే. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అల్లుకున్న ఫ్యామిలీ డ్రామా ‘ఉప్పెన’ సినిమా. కూతురిది ఉప్పెనంత ప్రేమ. తండ్రిది ఉప్పెనంత కోపం. ప్రేమకు హద్దులు లేవని చెప్పడమే ఈ సినిమా కథ. ► చిరంజీవిగారికి ఈ కథ చెప్పినప్పుడు ‘హిట్ ఫార్ములా. నువ్వు తీయడాన్ని బట్టి ఉంటుంది. వైషూ (వైష్ణవ్‌తేజ్) నువ్వు చేస్తావా? లేక నన్ను చేయమంటావా?’ అని వైష్ణవ్ తేజ్‌తో అన్నారు. అంటే.. ఆయన సినిమా చేస్తారని కాదు. అదొక కాంప్లిమెంట్. సినిమా కథ బాగుందని చెప్పడం చిరంజీవిగారి అభిప్రాయం. ► క్యాస్ట్ గురించిన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కానీ పరిధి మేరకు ఉన్నాయి. సెన్సార్ వారు ఒక్క కట్ కూడా చెప్పలేదు. దాదాపు 70మందికి పైగా ఈ సినిమా చూశారు. సినిమా బాగోలేదని ఎవరూ చెప్పలేదు. ‘ఇప్పుడు నా కొడుకు చిన్నవాడు. భవిష్యత్‌లో డైరెక్టర్ అవుతాడో లేదో తెలీదు. నా పెద్దకొడుకు (బుచ్చిని ఉద్దేశించి) సినిమా తీశాడనుకుంటాను’ అని సుకుమార్ అన్నారు. సుకుమార్‌గారితో నాది 20 ఏళ్ల పరిచయం. మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తుంటారు. ఒక డైరెక్టర్‌గా కన్నా కూడా సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నాకు పేరువస్తే హ్యాపీ ఫీల్ అవుతాను. ► ‘నాన్నకు ప్రేమతో...’ సినిమా షూటింగ్ స్పెయి¯Œ లో జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్‌కు కథ చెప్పాను. అది ‘ఉప్పెన’ కథ కాదు. మైత్రీమూవీ మేకర్స్ సంస్థలో మరో సినిమా చేయబోతున్నాను. -
నాకూ ఫ్యాన్స్ ఉంటారని ఊహించలేదు
‘‘యాక్టింగ్ అంటే నాకు ఇష్టమే కానీ యాక్టర్‌గా మాత్రం కెరీర్‌ను ఊహించుకోలేదు. నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది. కానీ ‘ఉప్పెన’ కథ విన్నాక ఈ సినిమా చేయాలనిపించింది. కథ విని, ఏడ్చాను. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురవుతారనే నమ్మకం ఉంది’’ అని కృతీ శెట్టి అన్నారు. వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా కృతీ శెట్టి చెప్పిన విశేషాలు. ♦మా స్వస్థలం బెంగళూరు. కానీ ముంబైలో పుట్టి, పెరిగాను. నాన్న వ్యాపారవేత్త. అమ్మ ఫ్యాషన్ డిజైనర్. కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేశాను. దర్శకుడు బుచ్చిబాబు నన్ను ఎక్కడో చూసి ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు. మొదట్లో ఇప్పుడే సినిమాలు చేయకూడదని అనుకున్నాను. ఎందుకంటే సైకాలజీ చదువుకుంటున్నాను. అయినప్పటికీ కథ విందామని వచ్చి, నచ్చడంతో ఓకే చేశాను. ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మ క్యారెక్టర్ చేశాను. బేబమ్మది బబ్లీ అండ్ హైపర్ క్యారెక్టర్. చాలా ఎక్స్‌ప్రెసివ్. నేనే బేబమ్మనని ఊహించుకుని చేశాను. అందుకే స్క్రీన్‌పై అంత బాగా వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ వివేక్, చిత్రబృందం సహాయం చేయడం వల్లే నేను తెలుగు ఇంత త్వరగా, ఇంత బాగా నేర్చుకోగలిగాను. ♦ఈ సినిమా కోసం ప్రత్యేకమైన యాక్టింగ్ క్లాసులు ఏం తీసుకోలేదు. యాడ్స్ చేసిన అనుభవం ఉపయోగపడింది. నాకు వచ్చినదాన్ని సహజంగా చేశాను. తెలుగు నేర్చుకోవడానికి మాత్రం కొన్ని వర్క్ షాప్స్ చేశాం. వైష్ణవ్ తేజ్ బ్రిలియంట్ యాక్టర్. మంచి సపోర్టింగ్ కో స్టార్. విజయ్సేతుపతిగారితో నాకో పెద్ద ఎమోషనల్ సీన్ ఉంది. ఇంత పెద్ద యాక్టర్‌తో ఎలా చేయాలా? అని భయపడ్డాను. కానీ ఆయన హెల్ప్ చేశారు. యాక్టింగ్ టిప్స్ కూడా చెప్పారు. ♦ఓ భావోద్వేగభరితమైన సన్నివేశాన్ని చిత్రీకరించిన తర్వాత, నా నటన చూసి మా సినిమాటోగ్రాఫర్‌తో పాటు చిత్రబృందంలోని కొందరు ఏడ్చారు. అంత బాగా చేసినందుకు నాకు చాలా గర్వంగా, హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా జర్నీలో నాకు ఇదొక మంచి జ్ఞాపకం. అయితే నా ఇంట్రడక్షన్ సీన్ కోసం మాత్రం ఎక్కువ టేక్స్ తీసుకున్నాను. ♦ఈ సినిమాతో అసోసియేట్ అయ్యాక దర్శకుడు సుకుమార్‌ను కలిశాను. ఆయన ఇచ్చిన ధైర్యాన్నే నేను సినిమాలో క్యారీ చేశాను. నా తొలి సినిమాకే సుకుమార్, మైత్రీమూవీ మేకర్స్, దేవి శ్రీ ప్రసాద్‌గారు వంటివారితో అసోసియేట్ అవ్వడాన్ని అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. హీరోయిన్స్‌లో దివంగత నటి శ్రీదేవిగారు, సమంత నాకు స్ఫూర్తి. ♦‘ఉప్పెన’ సినిమాను కొందరు ప్రముఖులు చూశారు. చిరంజీవిగారు బిగ్ స్టార్. నాకు ఇన్స్పిరేషన్. అలాంటి ఆయన మా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నన్ను అభినందించడం చాలా గర్వంగా అనిపించింది. దర్శకులు కొరటాల శివ, సుకుమార్, మా నిర్మాతలు రవిశంకర్, నవీన్గార్లు కూడా నా పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పారు. ♦సోషల్ మీడియాలో నాకు ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయని నా సన్నిహితులు చెప్పారు. నాక్కూడా ఫ్యాన్స్ ఉంటారని ఎప్పుడూ ఊహించలేదు. నిజానికి నేనే చాలామంది స్టార్స్‌కు అభిమానిని. నా అభిమానుల సపోర్ట్ అండ్ లవ్‌కు థ్యాంక్స్. ♦‘ఉప్పెన’ సినిమా విడుదలయ్యాకే కొత్త సినిమాలకు ఓకే చెబుదాం అనుకున్నాను. కానీ కథలు నచ్చడంతో ‘శ్యామ్ సింగరాయ్, ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నాను. -
అందుకే ‘ఉప్పెన’ ఈవెంట్‌కి రాలేదు: నాగబాబు
మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిబ్రవరి 12న విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వేడుకకు చిరంజీవి తప్ప మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ రాలేదు. దానికి గల కారణమేంటో తెలియజేస్తూ మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ చానల్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘వైష్ణవ్ ఇండస్ట్రీకి రాకముందు చదువుకుంటావా? లేక ఇండస్ట్రీకి వస్తావా? అని నేను చాలాసార్లు అడిగాను. కానీ.. ఏదీ కన్ఫర్మ్గా చెప్పకపోయేవాడు. ఓ సారి నేను సీరియస్‌గా సినిమాల్లోకి వస్తావా అని అడిగినా కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేదు. అలాంటిది.. ఓ రోజు నా దగ్గరకు వచ్చి ‘ఉప్పెన’ సినిమాలో యాక్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. మొత్తానికి.. వైష్ణవ్ సినిమాల్లోకే వచ్చాడు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. కళ్యాణ్ బాబు సూచనలతో థాయ్ బాక్సింగ్ నేర్చుకొని వచ్చాడు వైష్ణవ్ తేజ్. మంచి ఫిట్నెస్ ఉన్న కుర్రోడు. పైగా మంచితనం ఎక్కువ. మా నిహారికకు, వరుణ్ తేజ్‌కి వైష్ణవ్ అంటే చాలా ఇష్టం. మా అన్నయ్య, తమ్ముడు కళ్యాణ్ బాబు కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేశారు. కాబట్టి ఆ స్టాండర్డ్స్ రీచ్ కావాలంటే వరుణ్ గానీ, తేజ్ గానీ, వైష్ణవ్ గానీ చాలా కష్టపడాలి. ఇక ‘ఉప్పెన’ మూవీ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మొన్ననే చరణ్ వరుణ్ నిహారిక ఈ సినిమా చూశారు. చాలా బాగుందని చెప్పారు. కథ చాలా రియలిస్టిక్‌గా ఉంది వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాలోనే చాలా బాగా నటించాడు.మొన్న జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మా ఫ్యామిలీ నుంచి ఎవ్వరమూ అటెండ్ కాలేదు. ఇంటిల్లిపాది వెళ్లడం కంటే.. వాడిని వాడిగా ప్రొజెక్ట్ చేయాలనే అలా చేశాము. కాకపోతే.. మా అందరికీ పెద్ద దిక్కు కాబట్టి మా అన్నయ్యను పిలిచారు. ఆ రకంగా వైష్ణవ్ ఆయన బ్లెస్సింగ్స్ దక్కాయి. ఉప్సెన మంచి హిట్ అవుతుదంనే నమ్మకం ఉంది. వైష్ణవ్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయండి’అని నాగబాబు చెప్పుకొచ్చారు. -
నా పరువు నిలబెట్టావ్... గర్వంగా ఉందన్నారు
‘‘ఏ పనినైనా ప్రేమతో చేస్తూ వంద శాతం కష్టపడతాను. అది ప్యాషన్ కూడా అయ్యుండొచ్చు. దాన్ని కూడా ప్రేమ అనే అనుకుంటాను. అందరిలా నాకు ఫెయిల్యూర్ భయం ఉంటుంది’’ అని వైష్ణవ్ తేజ్ అన్నారు. చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన సినిమా ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో వైష్ణవ్ తేజ్ చెప్పిన విశేషాలు. ► నా లైఫ్ జర్నీ కాస్త అటూ ఇటూగా ఉంటుంది. మొదట్లో యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సైంటిస్ట్, ఆస్ట్రోనాట్, ఫార్ములా రేసర్, ఫొటోగ్రాఫర్, 3డీ యానిమేటర్, మూవీ డైరెక్టర్... ఇలా చాలా అనుకున్నాను. నా కెరీర్‌ను నేను డిసైడ్ చేసుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ఓ నాలుగైదేళ్లు నాలో నేను మదనపడ్డాను. లైఫ్‌లో ఏం చేయాలో సరిగా అర్థం కావడం లేదని అమ్మతో చెబుతుండేవాడిని. అసలు ఇవన్నీ ఎందుకు? నలుగురికి ఉపయోగపడకుండా ఈ ప్రాణాలు వృథాగా పోవడం దేనికి అని ఆర్మీకి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాను. ఆర్మీ అప్లికేషన్, అర్హతలను గురించి ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేశాను. ► ఆర్మీకి వెళ్లడానికి సన్నబడ్డాను. సోషల్ మీడియాలో ఆ ఫొటోలను సరదాగా షేర్ చేశాను. సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. ‘నాకేమీ రాదు. నేర్పిస్తే చేస్తాను. వంద శాతం కష్టపడతాను’ అని చెప్పాను. ఆ సినిమాలు ఎందుకో వర్కౌట్ కాలేదు. ఆ సమయంలో బుచ్చిగారు ‘ఉప్పెన’ సినిమా కథతో వచ్చారు. కథ నచ్చింది. అయితే చేయగలనా? అనిపించింది. చిరంజీవి మావయ్యకు చెప్పాను. ‘చాలామంది అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతుంటారు. నీకొచ్చిన అవకాశాన్ని గౌరవించి ప్రయత్నించు. ఒకవేళ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతే అప్పుడు వేరే ఏదైనా ట్రై చెయ్’ అన్నారు. ఇలా ఎవరూ నాకు చెప్పలేదు. అది నాకు బాగా స్ట్రయిక్ అయ్యింది. మా మామయ్యల మాట నాకు అల్టిమేటమ్. నేను కూడా ఆలోచిస్తాను. కానీ వారి మాట వింటాను. ► నెల రోజులు యాక్టింగ్ క్లాసులకు వెళ్లాను. హీరో క్యారెక్టర్ యాస, పాత్ర కోసం దాదాపు 40 రోజులు కష్టపడ్డాను. ఈ సినిమా సెట్లో నేను చాలా నేర్చుకున్నాను. విజయ్ సేతుపతిగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. నటనలో నాకు కొన్ని మెళకువలు చెప్పారు. సినిమా షూటింగ్ పూర్తి చేసి వెళ్లే ముందు మా టీమ్‌లో కొంతమందికి వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చారు. ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. కృతీశెట్టి వారంలో తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేసి, తెలుగులో డైలాగ్స్ చెప్పింది. అది చూసి నేను కూడా ఇతర భాషలు నేర్చుకోవాలని అనుకున్నాను. ► దేవిశ్రీ ప్రసాద్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా సినిమాకు ఇంత బజ్ రావడానికి ముఖ్య కారణం ఆయనే. ‘ఉప్పెన’ ఓటీటీలో విడుదలవుతుందేమోనని నేను కూడా అనుకున్నాను. డైరెక్టర్ బుచ్చిబాబు థియేటర్స్‌లోనే విడుదల చేయాలని పట్టుబట్టారు. అలాగే టీమ్ కూడా సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేద్దామని అనుకున్నారు. క్లైమాక్స్ గురించి సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ప్రేమకథా చిత్రాలు చాలా వచ్చాయి. కానీ ‘ఉప్పెన’ డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన పాయింట్ ఉంది. సినిమా అందరికీ నచ్చుతుంది. ► జానీ, శంకర్‌దాదా, అందరివాడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేశాను. చిన్నప్పుడు బాగా సిగ్గుగా ఉండేవాడిని. ఇప్పుడు నాలో మార్పు వచ్చింది. నాకు యాక్ష¯Œ సినిమాలంటే ఇష్టం. హిందీ చిత్రం ‘ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్’ లాంటి సినిమాలంటే ఇష్టం. ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వస్తే చేస్తాను. ► ప్రతి సినిమాను నేను కొత్తగానే భావిస్తాను. ‘ఉప్పెన’ సినిమాలో నేను చేసిన పాత్ర వేరు. క్రిష్‌గారి డైరెక్షన్లో రూపొందిన సినిమాలో చేసిన క్యారెక్టర్ వేరు. కొన్ని కొత్త ఆఫర్స్ ఉన్నాయి. వాటి గురించి త్వరలో చెబుతాను. ► నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ‘ఉప్పెన’ సినిమాను మా కుటుంబసభ్యులు చూశారు. ‘నాకు చాలా గర్వంగా ఉంది రా.. నా పరువు నిలబెట్టావ్’ అని చిరంజీవిగారు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ► ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలా బాగా మాట్లాడానని చాలామంది అంటున్నారు. అలా మాట్లాడతానని నేను కూడా ఊహించలేదు. క్యాలిక్యులేటెడ్‌గా మాట్లాడటం నాకు రాదు. -
‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు
-
ఉప్పెన కథ విని షాకయ్యా: చిరంజీవి
‘‘ఉప్పెన’ చూసిన వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి అందరికీ ఈ సినిమా గురించి చెప్పాలనిపించింది. ఈ సినిమా అంత బాగా నచ్చింది. అతిశయోక్తి కాదు.. ఇది దృశ్యకావ్యం’’ అన్నారు చిరంజీవి. వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు నిర్మించాయి. ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ – ‘‘సంవత్సరం పాటు చీకట్లో ఉంది ఇండస్ట్రీ. థియేటర్స్ మూసేయాల్సిన పరిస్థితి. మబ్బు కమ్ముకున్నట్లు అనిపించింది. మళ్లీ శుభారంభం వచ్చింది. థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. కానీ థియేటర్స్‌కి ప్రేక్షకులు వస్తారా? లేదా? అని మేం ఆలోచిస్తుంటే.. ప్రేక్షకులు థియేటర్స్‌కి వచ్చారు. సినిమాయే ప్రథమ వినోదం అని నిరూపించారు. ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు. ‘ఉప్పెన’ గురించి చెప్పాలంటే... ఈ కథ విన్నప్పుడు షాకయ్యాను. కరెక్షన్స్ చేయడానికి, ఇన్‌ఫుట్స్ ఇవ్వడానికి ఏమీ లే దు. ఈ కథ అంత బాగా చేశారు. ఎన్నో ప్రేమకథలు చూశాం. కానీ ఇందులో ఉన్న ఎమోషన్స్ మనల్ని కట్టిపడేస్తాయి. మైత్రీ వాళ్లకు ఇది మరో ‘రంగస్థలం’ అవుతుంది. బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభను మెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి. ఈ సినిమా తమిళ దర్శకుడు భారతీరాజాను గుర్తు చేసింది. మన మట్టికథలు, నేటివ్ కథలు రావాలి. ‘ఉప్పెన’ మన నేటివ్ కథ. విజయ్ సేతుపతి విలక్షణ నటుడు. హీరోగానే కాదు... పాత్ర బావుంటే ఏ పాత్రైనా చేస్తాడు. మొదటి సినిమాలోనే కృతి బాగా చేసింది. కచ్చితంగా సూపర్‌స్టార్ అవుతుంది. వైష్ణవ్ మా అందరికీ గర్వకారణం. అంత బాగా చేశాడు. బుచ్చిబాబు తనలోని నటనను రాబట్టుకోవడమే కాకుండా, పరిశ్రమకు మంచి నటుడిని అందించారు. వైష్ణవ్ కళ్లల్లో కళ ఉంటుంది. ‘శంకర్ దాదా’లో చిన్న వేషం వేశాడు. అప్పుడే అనిపించింది.. వీడు మంచి యాక్టర్ అవుతాడని. మొదటి సినిమాకే ఇలాంటి సంస్థలో యాక్ట్ చేయడం వైష్ణవ్ అదృష్టం. ఈ సినిమాను పెద్ద రేంజ్‌కి తీసుకెళ్లింది దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. తన పాటలతో సినిమాపై ప్రత్యేక ఆసక్తిని తీసుకొచ్చాడు దేవి. మైత్రీ మూవీస్ అందరికీ నచ్చిన నిర్మాణ సంస్థ. త్వరలోనే వాళ్ల బ్యానర్లో, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. లవ్ యు బుచ్చీ సుకుమార్ మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. ఈ సినిమా కథను ఆరు గంటలు కూర్చొని చర్చించారు. ఆయన్ను మహావృక్షం అంటారు... అది ఎందుకో అర్థం అవుతోంది. మెగాఫ్యామిలీలో ఆయన జడ్జ్మెంట్ వల్లే చాలామంది హీరోలు రావడం జరిగిందని ‘ఉప్పెన’ సినిమా కథను డిస్కస్ చేసిన తర్వాత అర్థం అయ్యింది. ఆయన చెప్పిన కొన్ని కరెక్షన్స్‌తో ఇంత మంచి సినిమా వచ్చింది. వైష్ణవ్తేజ్ది మంచి ఎక్స్‌ప్రెసివ్ ఫేస్. వైష్ణవ్ మాట్లాడిన తీరు చూస్తుంటే భవిష్యత్‌లో మంచి పొలిటిషియన్ కూడా అవుతాడేమో. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసి, డైరెక్టర్స్ అయిన అందరికీ ఒకటి చెబుతుండేవాడిని. ఎవర్నీ కూడా నేను నా శిష్యులుగా చెప్పుకోలేను అని. ఎవరు వచ్చినా నాకు ఏదో ఒకటి నేర్పి వెళ్లిపోతున్నారు. బుచ్చిబాబుని మాత్రం శిష్యుడని చెప్పుకుంటాను. ఎందుకంటే లెక్కలు చెప్పాను కాబట్టి. అదే నిజం అయ్యింది. తన తోటివారు ఉద్యోగులై బాగా సంపాదించుకుంటున్నారు. వీడు ఏమైపోతాడో అని వాళ్ల అమ్మగారు కంగారు పడుతుండేవారు. నేను ఆవిడను ఓదార్చేవాడిని. నాకు బుచ్చి ‘ఉప్పెన’ కథ చెప్పగానే నా రూమ్ అంతా గంభీరం అయిపోయింది. అంత అద్భుతంగా చెప్పాడు. అప్పుడే రవిగారికి ఫోన్ చేసి, ఇది చిన్న సినిమా కాదు. వందకోట్ల సినిమా అని చెప్పాను. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడని కాదు. వాడికి లెక్కలు చెప్పినందుకు గర్వపడుతున్నాను. లవ్ యూ బుచ్చి. బుచ్చిబాబు ఏం కావాలంటే అది జరిగింది సినిమాలో. దేవి ఇచ్చిన ఒక్కో సాంగ్ ఒక్కో ఆణిముత్యం. ‘నీ కన్ను నీలి సముద్రం’ పాట ‘ఫేస్ ఆఫ్ ది మూవీ’. నిర్మాతలు బడ్జెట్‌కు వెనకాడలేదు. అందుకే ఇది ఇంతమంచి సినిమా అయ్యింది’’ అన్నారు. మా మావయ్యలకు రుణపడి ఉంటాం వైష్ణవ్‌తేజ్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మగారి గురించి మాట్లాడాలి. ఐ లవ్ యూ మా. నువ్వు చేసిన అన్ని త్యాగాలకు థ్యాంక్స్. నువ్వు లేకపోతే మేం (సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్) లేం. అలాగే మా ముగ్గురు మావయ్యలు మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, నాగేంద్ర మావయ్యలు లేకపోతే నేను, మా అన్నయ్య (సాయిధరమ్‌తేజ్) లేం. మాకు ఏం కావాలన్నా చేసి పెడుతూ ఉండేవారు. నేను, మా అన్న మా ముగ్గురు మావయ్యలకు రుణపడి ఉంటాం. ఈ సినిమాకు కథే హీరో. నేను ఓ క్యారెక్టర్ చేసానంతే. మంచి కథను నా దగ్గరకు తెచ్చినందుకు బుచ్చిసార్కు థ్యాంక్స్. ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన నిర్మాతలకు, హీరోయిన్ కృతీశెట్టితో పాటు టీమ్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకు సోల్ దేవిశ్రీ ప్రసాద్‌గారు. ఆయన పాటల వల్లే మాకు ఇంతమంచి గుర్తింపు. చంద్రబోస్, లిరిసిస్ట్ శ్రీమణిగార్లకు థ్యాంక్స్. సినిమాలో ఉప్పెనంత ప్రేమ, ఉప్పెనంత ఎమోషన్స్ ఉన్నాయి. అందరూ ఇంటికి తీసుకుని వెళ్తారని అనుకుంటున్నాను. ఈ సినిమా నాకు చాలా నేర్పించింది’’ అన్నారు. బుచ్చిబాబు మాట్లాడుతూ – ‘‘సుక్కూ సార్... థ్యాంక్యూ. మీ వల్లే నేను దర్శకుడినయ్యాను. ఎలా రాశానో అలానే తీసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. చిరంజీవిగారు ‘ఉప్పెన’ కథ విని మంచి సలహాలు ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్‌గారికి, మా టీమ్ అందరికీ ధన్యవాదాలు. పవన్ కల్యాణ్‌లా పెద్ద స్టార్ అవుతాడు వైష్ణవ్’’ అన్నారు. ‘‘మొదటి సినిమాకే ఇలాంటి అవకాశం రావడం చాలా అదృష్టంగా అనిపిస్తుంది. వైష్ణవ్ బెస్ట్ కో స్టార్’’ అన్నారు కృతీ శెట్టి. విజయ్ సేతుపతి, కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్, చంద్రబోస్, బాబీ, వెంకీ కుడుముల, శివ నిర్వాణ తదితరులు మాట్లాడారు. గోపీచంద్ మలినేని, హరీశ్ శంకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (చదవండి: ఉప్పెన ట్రైలర్ వచ్చేసింది..) (చదవండి: ‘ఉప్పెన’ మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ) -
'ఉప్పెన' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు..
-
పవన్ కల్యాణ్ నా గుండెల్లో ఉంటాడు: హీరో
సాక్షి, హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో వెండితెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలిసారి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఉప్పెన. కృతీ శెట్టి కథానాయిక. ఫిబ్రవరి 12న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చిత్రయూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా తనకెంతో నేర్పించిందని చెప్పుకొచ్చాడు. షూటింగ్ సమయంలో లైట్ పెట్టేటప్పుడు ఒకతని కాలు విరిగిపోయినా సరే అలాగే రెండు రోజులు పని చేశాడని చెప్తూ లైట్మన్లకు, కాస్ట్యూమ్ డిజైనర్లకు, సౌండ్ డిపార్ట్మెంట్కు, ఇలా ప్రతి ఒక్క విభాగానికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపాడు. 'ఉప్పెన' సినిమాలో కథే హీరో అని చెప్పాడు. తను కేవలం ఓ ప్రధాన పాత్ర పోషించానని పేర్కొన్నాడు. కృతీ శెట్టి వారంలోనే తెలుగు నేర్చుకుందని ప్రశంసించాడు. తన మీద నమ్మకముంచిన సుకుమార్‌కు ధన్యవాదాలు తెలిపాడు. సినిమాకు అసలు ప్రాణం దేవి శ్రీప్రసాద్.. ఆయన పాటల వల్లే మా అందరికీ గుర్తింపు వచ్చిందన్నాడు. ఇంతలో అక్కడి అభిమానులు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని అరుస్తుండటంతో "పపర్ స్టార్ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటాడు" అని పేర్కొన్నాడు. దీంతో అభిమానుల కేరింతలు, ఈలలతో సభాప్రాంగణం హోరెత్తిపోయింది. కాగా ఇంత మంది జనాల ముందుకు రావడం వైష్ణవ్‌కు ఇదే తొలిసారి కావడంతో కొంత బెరుకుగా కనిపించాడు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సెలబ్రిటీలు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. (చదవండి: ఉప్పెన పెద్ద విజయం సాధించాలి: జూ. ఎన్టీఆర్) (చదవండి: దర్శకుడు సుక్కు నా అన్నయ్య: డీఎస్పీ) -
2021ని ఇరగదీయాలని డిసైడ్ అయ్యాను..
‘‘2021ని ఇరగదీయాలని డిసైడ్ అయి, ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాను. ఈ సంవత్సరం మ్యూజికల్‌గా నాకు అద్భుతంగా ఉంటుంది. డీయస్పీ (దేవిశ్రీ ప్రసాద్) లో కొత్త వెర్షన్‌ని చూస్తారు’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఆయన సంగీతం అందించిన చిత్రం ‘ఉప్పెన’. చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రమిది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఫిబ్రవరి 12న ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు. ► ‘ఉప్పెన’ పాటలు అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో టాప్‌లో ఉండడం ఎలా అనిపిస్తోంది? అందరూ ఈ పాటలు ఎంజాయ్ చేస్తున్నారు. ‘మీ మ్యూజిక్ వల్లే సినిమాకు ఈ రేంజ్ వచ్చింది’ అని టీమ్ అందరూ చెప్పడం అన్నింటికంటే సంతోషమైన విషయం. ఈ క్రెడిట్ టీమ్‌కే దక్కుతుంది. బుచ్చిబాబు మంచి కథ చేశాడు. దానికి తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చాను నేను. ► మీరు ప్రేమకథలకు సంగీతం ఇచ్చి చాలా రోజులైనట్టుంది? అవును. కెరీర్ ప్రారంభంలో వరుసగా లవ్‌స్టోరీ సినిమాలు చేశాను. ఇప్పుడు ప్రేమకథా సినిమాలే తగ్గిపోయాయి. పెద్ద కమర్షియల్ సినిమాలు, కొత్త కాన్సెప్ట్ సినిమాలు, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలే వస్తున్నాయి. ప్రేమకథలు రావాలి. ‘ఉప్పెన’ మంచి ప్రేమకథ. వరుసగా కమర్షియల్ సినిమాలు, టాప్ స్టార్స్ సినిమాలు చేస్తున్న నాకు ‘ఉప్పెన’ మంచి రిలీఫ్‌లా అనిపించింది. ఈ కథ, కథనం ఫ్రెష్‌గా అనిపించాయి. ఈ సినిమా తర్వాత నేను చేసిన నితిన్ ‘రంగ్ దే’ కూడా పూర్తిస్థాయి ప్రేమకథే. ► సినిమాలో దర్శకుడు సుకుమార్ అసోసియేట్ అయితే మీ మ్యూజిక్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోతుంది. ఏంటా సీక్రెట్? సుకుమార్ ఆలోచనా విధానమే కొత్తగా ఉంటుంది. ఆయన కథలు కూడా అంతే డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటి కొత్త సబ్జెక్ట్ మీద ఎవరు పని చేసినా డిఫరెంట్ మ్యూజిక్కే వస్తుంది. అది మొదటి విషయం. రెండోది మా ఇద్దరి మధ్య ఉన్న బంధం, ఒకరినొకరం అర్థం చేసుకున్న విధానం. సుక్కు నా అన్నయ్య. ‘పుష్ప’ పని మీద వచ్చినప్పుడు బుచ్చిబాబును తీసుకొచ్చి ‘ఉప్పెన’ కథ వినిపించాడు సుక్కు. ► లాక్డౌన్లో ఏం చేశారు? లాక్డౌన్లో ఈ ప్రపంచం మొత్తంలో ఎవరైనా బిజీగా ఉన్నారంటే అది నేనే అనుకుంటాను. ‘ఒకేసారి నాలుగైదు సినిమాలు చేసినప్పుడు కూడా కనిపించేవాడివి, ఇప్పుడు కనిపించడం కూడా లేదు కదరా’ అనేవారు మా అమ్మ. ఇంతకు ముందు చేయడానికి కుదరనవన్నీ లాక్డౌన్లో చేశాను. యూట్యూబ్‌లో చూస్తూ యావిడ్ (ఎడిటింగ్ సాఫ్ట్వేర్) చాలా త్వరగా నేర్చుకున్నాను. ప్రస్తుతం ఏం నేర్చుకోవాలన్నా ఇంటర్నెట్లో దొరుకుతుంది. సరిగ్గా వాడుకోవాలే కానీ చాలా చాలా నేర్చుకోవచ్చు. నేర్చుకుంటావా? నాశనమైపోతావా నీ ఇష్టం. నాకు ఫొటోగ్రఫీ చాలా ఇష్టం. కెమెరాలు చాలా కొనిపెట్టుకున్నాను. అవన్నీ బయటకు తీశాను. డ్రోన్ కెమెరా నేర్చుకున్నాను. పాటలు రాస్తూ, పాటల ఐడియాలు రెడీ చేసి పెట్టుకున్నాను. నాకు మ్యూజిక్ ఇచ్చే కిక్ ఇంకేదీ ఇవ్వదు. వీడియో కాల్స్‌లో సినిమా పాటల రికార్డింగ్ చేశాను. భవిష్యత్తుకి సంబంధించి ఇంకా ప్లాన్స్ ఉన్నాయి. అవన్నీ మెల్లిగా చెబుతాను. ► పెళ్లి విషయం కూడా చెబుతారా? ఆ ఒక్కటీ అడక్కండి (నవ్వుతూ). ► లాక్డౌన్ చాలా నేర్పింది అని చాలా మంది అన్నారు. మీరు నేర్చుకున్న విషయాలు? లాక్డౌన్లో నేను ముఖ్యంగా తెలుసుకున్న విషయాలు రెండు. ఒకటి.. టైమ్ చాలా విలువైనది. చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. రెండోది.. మనల్ని ప్రేమించేవాళ్లకు వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ఈ రెండూ జీవితంలో చాలా ముఖ్యమైనవి. వీటిని కోల్పోతే తిరిగి తెచ్చుకోలేం. ఆరోగ్యం జాగ్ర త్తగా చూసుకోవాలి. ► మీరు ట్యూన్స్ చాలా ఫాస్ట్‌గా ఇచ్చేస్తారట.. దర్శకుడు ట్యూన్ చెబుతున్నప్పుడు ఆ క్షణంలో ఏది అనిపిస్తే అది వాయిస్తుంటాను. చాలాసార్లు ట్యూన్స్ అలానే ఒకే అవుతాయి. ట్యూన్స్ అవలీలగా ఇచ్చినా దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది. చాలా సంవత్సరాల కృషి ఉంటుంది. చిన్నతనం నుంచి నేర్చుకున్న సంగీతం, పడ్డ తపన ఆ సందర్భంలో ఉపయోగపడతాయి. అవుట్‌పుట్ త్వరగా వచ్చినంత మాత్రాన ఈజీ అని కాదు. బిడ్డను కనడం అరగంట పనే కదా అనేయగలమా? పది నెలల శ్రమను తీసివేయలేం కదా. ఇది కూడా అలానే. -
ఉప్పెన పెద్ద విజయం సాధించాలి
‘‘ఉప్పెన’ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా అంతే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయం సాధించాలి’’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. బుచ్చిబాబు సానా మాట్లాడుతూ –‘‘ఈ కథను నేను మొదటగా చెప్పింది ఎన్టీఆర్గారికే. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫోన్ చేసి ఎలా వస్తోంది? అని అడిగేవారు. కథ విని ఆయన ఇచ్చిన ఎనర్జీతో ఈ కథని చిరంజీవి, విజయ్ సేతుపతి, దేవిశ్రీ ప్రసాద్‌గార్లకు కూడా చెప్పాను. అందమైన, ఉద్వేగభరితమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు ఆకర్షణ’’ అన్నారు. ఈ చిత్రానికి సీఈవో: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై, అశోక్ బి. -
ఉప్పెన ట్రైలర్: ‘మరీ ఇంత అందగత్తె పుట్టిందంటే..’
సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదల కానుంది. ఉప్పెనలో మంగళూరు బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుండగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌సేతుపతి నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, మహేశ్ బాబు భాగస్వామ్యం అవ్వగా తాజాగా మరో స్టార్ హీరో ప్రమోషన్స్‌లో ఎంటర్ అయ్యాడు. ఉప్పెన ట్రైలర్‌ను గురువారం సాయంత్రం ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్విటర్లో ఉప్పెన ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. చదవండి: ‘ఉప్పెన’ మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘ప్రేమంటే ఓ లైలా-మజ్నులా, దేవదాసు-పార్వతిలా, రొమియో-జూలియట్‌లా అదో మాదిరిలా ఉండాలిరా’ అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో మొదలవ్వగా.. ప్రేమ, ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం హీరో పడే కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి చెప్పే డైలాగులు, పవర్ఫుల్ విలనిజం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో మరోసారి మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు. మొత్తంగా ప్రేమ, పరువు, కోపం, బాధ ఇలా అన్ని ఎమోషన్లను టచ్ చేసి చూపించారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్-సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ సాధించి రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన రావడంతో రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: రిహన్నా ట్వీట్.. గూగుల్‌లో ఏం సెర్చ్ చేశారంటే? -
జూ.ఎన్టీఆర్ వాయిస్‌తో ఉప్పెన ట్రైలర్!
మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తొలిసారి హీరోగా నటిస్తున్న చిత్రం "ఉప్పెన". కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్రైలర్‌కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారట. మొత్తానికి వైష్ణవ్ సినిమా రిలీజ్ అవకముందే అందరి నుంచి సపోర్ట్ అందుతోంది. (చదవండి: ‘వీడు ముసలోడు అవ్వకూడదే’) ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాలర్‌ట్యూన్లు, రింగ్టోన్లు ఎక్కడా చూసినా ఈ పాటలే మార్మోగిపోయాయి. మరీ ముఖ్యంగా 'నీ కన్ను నీలి సముద్రం..' పాట సంగీత సముద్రంలో అందరితో పడవ ప్రయాణం చేయించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ చిత్రం వాలంటైన్స్ డేకు రెండు రోజుల ముందుగా అంటే ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. సముద్రతీర ప్రాంతంలోని గ్రామంలో ఓ పేదింటి అబ్బాయికీ, ఓ సంపన్న కుటుంబానికి చెందిన కాలేజీ అమ్మాయికీ మధ్య ఏర్పడే ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే పాయింట్‌తో ఈ చిత్రం ఉంటుంది. మరి పాటలను ఆదరించిన ప్రేక్షకులు సినిమాను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. (చదవండి: మహేశ్‌తో స్పెషల్ సాంగ్: మోనాల్ క్లారిటీ!) -
‘ఉప్పెన’ మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ
మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న ప్రేక్షకుల మందుకు రానుంది. రాక్‌స్టార్ దేవిశ్రీపసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల కాగా, తాజాగా నాలుగో పాటను రిలీజ్ అయింది. జల జల జలపాతం అంటూ సాగే పాటను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించగా జస్ప్రీత్ జస్, శ్రేయా ఘోషల్ ఆలపించారు.కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్ ధక్ ధక్’, ‘రంగులద్దుకున్న’ పాటలకు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానే ఆకట్టుకుంది. | -
ఉప్పెన రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలో సందడి!
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఉప్పెన. కీర్తీ శెట్టి ఫీమెల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఉప్పెనకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఇటీవల విడుదల అయిన ఉప్పెన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే ఇప్పటికే విడుదలైన మూడు పాటలు కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకున్నాయి. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తర్వాత విడుదలైన ‘దక్ దక్ దక్’ పాట కూడా అంతే హిట్ అయ్యింది. చదవండి: ‘ఉప్పెన’టీజర్‌పై రామ్‌చరణ్ ఆసక్తికర ట్వీట్ తాజాగా ఈ సినిమా యూనిట్ అభిమానులకు శుభవార్తనందించింది. ఉప్పెనను ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్లో వెల్లడించింది. దీంతో సినిమా అభిమానులు ఆనందంతో మునిగి తేలుతున్నారు. కాగా షిబ్రవరి 19న నితిన్ నటించిన చెక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కంటే ముందే ఉప్పెన థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఉప్పెనలోని పాటలు, టీజర్‌ను బట్టి చూస్తే సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. హీరోగా వైష్ణవ్ తేజ్‌కు ఇది మొదటి సినిమా కావడంతో అతనికి ఎంత వరకు విజయాన్ని అందిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 12 వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ఆర్ఆర్ఆర్: రాజమౌళి కాపీ కొట్టారట! Sailing soon to the Theatres near you #Uppena Releasing on Feb 12th ❤️#UppenaOnFeb12th 🌊#PanjaVaisshnavTej @IamKrithiShetty @BuchiBabuSana @aryasukku @ThisIsDSP @NavinNooli @MythriOfficial @SukumarWritings @adityamusic pic.twitter.com/7MK16dn1Xq — BARaju (@baraju_SuperHit) January 26, 2021 -
పవర్ఫుల్ రోల్
నాయకుడు, ప్రతినాయకుడు, సహాయనటుడు... ఇలా ఏ పాత్రలో అయినా నటించి, మెప్పించగల నటుడు విజయ్ సేతుపతి. త్వరలో విడుదల కానున్న ‘ఉప్పెన’లో ఆయన కీలక పాత్ర చేశారు. శనివారం (జనవరి 16) విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్‌ని విడుదల చేశారు. పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘ఇందులో విజయ్ సేతుపతిది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అద్భుతంగా నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. సముద్రతీర ప్రాంతంలోని ఓ గ్రామంలో ఓ పేదింటి అబ్బాయికీ, ఓ సంపన్న కుటుంబానికి చెందిన కాలేజీ అమ్మాయికీ మధ్య ఏర్పడే ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే పాయింట్‌తో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి సీఈవో: చెర్రీ, మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుద్దీన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై, అశోక్ బి. -
‘ఉప్పెన’టీజర్‌పై రామ్‌చరణ్ ఆసక్తికర ట్వీట్
మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఉప్పెన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎంతో ఆసక్తికరంగా మలిచిన ఈ టీజర్ ప్రేక్షకలోకాన్ని బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా ఉప్పెన టీజర్ చూసిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘టీజర్ చాలా బాగుంది. మై బ్రదర్ పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల జంట చాలా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబుకు, నిర్మాణ సంస్థ మైత్రికి, ఇతర టెక్నీషియన్స్‌కు శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్’ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. This teaser is so beautiful !! My brother #PanjaVaisshnavTej and @IamKrithiShetty make a really fresh pair👍 Wishing the best to @BuchiBabuSana, @MythriOfficial & the entire team of #Uppena. All the best! https://t.co/OH235Lnust — Ram Charan (@AlwaysRamCharan) January 15, 2021 ఇక ఈ మూవీలో తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. శనివారం (జనవరి 16) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో విజయ్ సేతుపతి పెద్దమనిషి తరహాలో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఖద్దర్ చొక్కా, పంచె ధరించిన విజయ్ సేతుపతి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తున్నారు. ఆయన మరో చేతిలో నల్ల కళ్లద్దాలు ఉన్నాయి. Wishing our 'Rayanam' aka @VijaySethuOffl Garu a very Happy Birthday - Team #Uppena 🌊 Just wait to see him in our Trailer, It'll be 🔥🔥#HBDVijaySethupathi#PanjaVaisshnavTej @IamKrithiShetty @BuchiBabuSana @aryasukku @ThisIsDSP @SukumarWritings @adityamusic pic.twitter.com/ZnLa1rCMAR — Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2021 -
సినీ పండగ కళ
సంక్రాంతి మనకు పెద్ద పండగ. సినిమావాళ్లకు ఇంకా పెద్ద పండగ. ఆల్రెడీ థియేటర్స్‌లో పలు సినిమాలు సందడి చేస్తున్నాయి. త్వరలో రాబోయే సినిమాల మీటరేంటో.. మ్యాటరేంటో.. పోస్టర్స్, ప్రోమో రూపంలో వచ్చాయి. సంక్రాంతికి సందడి తీసుకొచ్చిన సినిమాల విశేషాలేంటో చూద్దాం. ► రవితేజ డబుల్ యాక్షన్ చేస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడీ’. రమేశ్ వర్మ దర్శకుడు. సంక్రాంతి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ► 2019లో ‘ఎఫ్2’కి సంక్రాంతి అల్లుళ్లుగా సందడి చేశారు వెంకటేశ్, వరుణ్ తేజ్. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ‘ఎఫ్ 3’ చేస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈసారి ఈ తోడల్లుళ్ల ఫుల్ టార్గెట్ డబ్బు సంపాదనే అట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ► విష్ణు మంచు హీరోగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్ అగర్వాల్, రుహానీ శర్మ ముఖ్య పాత్రలు చేశారు. భారీ ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు జెఫ్రీ చిన్ దర్శకుడు. ఈ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ► ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’గా మారారు అఖిల్. పూజా హెగ్డే జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకుడు. ► సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. కృతీ శెట్టి కథానాయిక. విజయ్ సేతుపతి విలన్. బుచ్చిబాబు సన దర్శకుడు. ఈ సినిమా టీజర్ బుధవారం విడుదలయింది. ► రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు వేణు ఉడుగుల దర్శకుడు. ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తున్నట్టు కొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు. ► మాఫియా నేపథ్యంలో ఉపేంద్ర హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘కబ్జా’. ఆర్. చంద్రు దర్శకుడు. ఈ సినిమాలో సుదీప్ కీలక పాత్రలో నటించనున్నారు. సుదీప్ లుక్‌ను విడుదల చేశారు. ► బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్లాక్ రోజ్’. మోహన్ భరద్వాజ్ దర్శకుడు. సంక్రాంతికి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ► ‘వెయ్యి అబద్ధాలు ఫేమ్ ఎస్తేర్ ముఖ్య పాత్రలో ‘హీరోయిన్’ అనే సినిమా ప్రకటించారు. తిరుపతి ఎస్ఆర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఎస్తేర్ శృంగార తారగా నటించనున్నారు. ► వశిష్ట సింహా, హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘ఓదెల రైల్వేస్టేషన్’ పోస్టర్ విడుదలయింది. ► -
హ్యాపీ బర్త్‌డే బంగారు.. ఐ లవ్ యూ..
పెళ్లి చేసుకుని అత్తారింటిలో అడుగుపెట్టిన మెగా డాటర్ నిహారిక కొణిదెలకు సంబంధించిన ప్రతి విషయం ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె మేనబావ, సాయి ధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ బర్త్ డే సందర్భంగా నిహారిక చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బుధవారం (జనవరి 13) వైష్ణవ్ పుట్టిన రోజు సందర్భంగా నీహ... ‘హ్యాపీ బర్త్‌డే బంగారు!! నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు.. నువ్వు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణించాలని ఆశిస్తున్న. ఆల్ ద వెరీ బెస్ట్ వైష్గా’ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. కాగా, వైష్ణవ్ పుట్టిన రోజు సందర్భంగా అతడు హీరోగా వస్తున్న ‘ఉప్పెన’ మూవీ టీజర్ ఇవాళ విడుదలైంది. (చదవండి: అనసూయ ట్వీట్.. మెగా ఫ్యామిలీలో కలకలం!) కాగా వైష్ణవ్ నీహరికకు మేనబావ అనే విషయం తెలిసిందే. మెగా కుటుంబంలో బావలు, మరదళ్లు అనే తేడా లేకుండా అందరూ అన్నాచెల్లెల్లుగా మెలుగుతుంటారు. ప్రతి వేడుకకు అందరూ ఒకచోట చేరి సందడి చేస్తుంటారు. కాగా గతేడాది జొన్నలగడ్డ చెతన్యతో నిహారిక వివాహం రాజస్తాన్ జోధ్‌పూర్ ప్యాలేస్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తన భర్త చైతన్యతో కలిసి సందడి చేస్తున్న ఫొటోలతో పాటు జిమ్‌కు, షికార్లకు వెళ్లిన ఫొటోలను ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యాక్టివ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త జంట వివాహం ఇటీవల హానీమూన్‌కు మాల్దీవులకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను : నిహారిక) Happiest birthday bangaaru!! You know how much I love you, and I can’t wait to see you rock in this film industry! All the very very best! Vaishaaggaaa!! @vaishnavtej 😘😘🤗🐒 pic.twitter.com/L3fhBmn50G — Niharika Konidela (@IamNiharikaK) January 13, 2021 -
‘వీడు ముసలోడు అవ్వకూడదే’
మెగా వారసుడు వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీ శెట్టి హీరోహీరోయిన్లు దర్శకుడు బచ్చిబాబు సనా రూపొందించిన చిత్రం ‘ఉప్పెన’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇవాళ వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఉప్పెన టీజర్ విడుదల చేసింది. నిమిషం నిడివి గల ఈ టీజర్లోనే సినిమా ఎలా ఉండబోతుందనేది దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. సాధారణంగా ప్రతి సినిమా కథ లాగే పేదింటి అబ్బాయి.. పెద్దింటి అమ్మాయి మధ్య సాగే ప్రేమకథ ఇది. (చదవండి: ‘ఉప్పెన’ మరో సాంగ్.. మెస్మరైస్ చేసిన దేవిశ్రీ) ఇక టీజర్ విషయానికోస్తే.. దేవుడే వరాలు ఇస్తాడని నాకు అర్థమైంది. ఎవరికి పుట్టామో తెలుస్తుంది కానీ, ఎవరికోసం పుట్టామో నాకు చిన్నప్పుడే తెలిసిపోయింది.. అని హీరో చెప్పే డైలాగ్‌తో ప్రారంభం అవుతుంది. ‘వీడు ముసలోడు అవ్వకూడదే’ అని చెప్పే హీరోయిన్ ఆకట్టుకుంటుంది. ఇందులో వైష్ణవ్ మీసాలు తిప్పుతూ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వాస్తవానికి ఉప్పెన గతేడాది వేసవిలో విడుదల కావాల్సింది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడింది. ఆ తర్వాత దర్శకుడు ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదల చేయాలని చూస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించినా.. థియేటర్లు తెరుచుకొవడంతో సినిమాను బిగ్‌స్క్రీన్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీస్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. (చదవండి: ‘నీ కన్ను నీలి సముద్రం’.. మరో రికార్డు) -
‘ఉప్పెన’ మరో సాంగ్.. మెస్మరైస్ చేసిన దేవిశ్రీ
మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రాక్‌స్టార్ దేవిశ్రీపసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా, తాజాగా మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్‌బాబు విడుదల చేశాడు. ‘ఉప్పెన సినిమా నుంచి అందమైన మెలోడి ‘రంగులద్దుకున్న’ను విడుదల చేస్తున్నాను. నా ఫేవరేట్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌కి, సుకుమార్ గారికి, వెండితెరకు పరిచయమవుతోన్న పంజా వైష్ణవ్ తేజ్‌కి, కృతి శెట్టికి, బుచ్చిబాబు సానాకు, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. ఇక పాట విషయానికొస్తే.. ఇదొక మెలోడీ సాంగ్. ‘రంగులద్దుకున్నా తెల్లరంగులవుదాం. పూలు కప్పుకున్నా కొమ్మలల్లె ఉందాం..’ అంటూ ప్రకృతి అందాల మధ్య సాగుతున్న ఈ పాట సినిమాపై అంచనాలు మరింత పెంచేలా ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందిచగా,యాజిన్ నిజర్, హరిప్రియ ఆలపించారు. ఈ పాటను దివంగత గానగంధర్వుడు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు అంకితమిచ్చారు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్ ధక్ ధక్’ పాటలకు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానే ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఈ పాట ఏకంగా140 మిలియన్ వ్యూస్ దాటింది. ఇప్పుడు ఈ మూడో పాట ఎన్ని వ్యూస్ తెచ్చిపెడుతుందో చూడాలి. -
మెగా హీరో సినిమాకు మహేష్ సాయం..
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఉప్పెన. ఈ సినిమాతో వైష్ణవ్ హీరోగా పరిచయం కానున్నారు. కీర్తీ శెట్టి ఫీమెల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే థియేటర్లలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రంతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం కానున్నారు. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఉప్పెనకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. చదవండి: గాజులు ఘల్లుమన్నవే కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలవ్వగా ఇవి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకున్నాయి. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఎంత ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తర్వాత విడుదలైన ‘దక్ దక్ దక్’ పాట కూడా అంతే హిట్ అయ్యింది. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను విడుదల చేయనున్నారు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా. ఉప్పెన సినిమాలోని ‘రంగులద్దుకున్న’ అనే పాటను మహేష్ బాబు నవంబర్ 11న సాయంత్రం 4.05 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. మరి ఈ పాట ఏ స్థాయిలో ఉండనుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. చదవండి: మెగా హీరో సినిమా.. కీలక పాత్రలో రానా? Get ready to dive into the ocean of Love ❤️#Ranguladdhukunna will be on your favorite songs playlist from 11th Nov @ 4:05 PM Thank you Superstar @urstrulyMahesh garu 🎶#Uppena 🌊#PanjaVaisshnavTej @IamKrithiShetty#BuchiBabuSana @ThisIsDSP @aryasukku @adityamusic pic.twitter.com/QtoeXmNQvM — Mythri Movie Makers (@MythriOfficial) November 4, 2020 -
గాజులు ఘల్లుమన్నవే
పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. సోమవారం కృతీ శెట్టి బర్త్‌డే సందర్భంగా ‘క్యూటెస్ట్ అండ్ నేచురల్ యాక్ట్రెస్ కృతీ శెట్టికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ చిత్రబృందం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. చేతులకు గాజులు వేసుకుంటూ అపురూపంగా వాటిని చూసుకుంటోన్న ఆమె లుక్ ఆకట్టుకుంటోంది. ‘‘ఉప్పెన’ చిత్రంలో వైష్ణవ్ తేజ్, కృతి మధ్య కెమిస్ట్రీ ముచ్చటగా అనిపిస్తోంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పాటలు సంగీతప్రియులను అలరిస్తూ టాక్ ఆఫ్ ద టౌ¯Œ గా మారాయి. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులూ పూర్తయ్యాయి. సానుకూల పరిస్థితులు ఏర్పడి, థియేటర్లు తెరుచుకోగానే సినిమాని విడుదల చేయడానికి సన్నద్ధంగా ఉన్నాం’’ అని నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్ సైనుద్దీ¯Œ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై, అశోక్ బి, సీఈవో: చెర్రీ. -
‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి బర్త్‌డే స్పెషల్ ఫోటోలు
-
‘ఉప్పెన’ మూవీ హీరోయిన్ కృతి శెట్టి
-
‘నీ కన్ను నీలి సముద్రం’.. మరో రికార్డు
సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతమందించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. కాగా ఈ చిత్రంలోని తొలి ప్రేమ పాట ‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమే అందుట్లో పడవ ప్రయాణం’ సోషల్ మీడియాలో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రతీ ఒక్క ప్రేమజంటను మైమపరిపిస్తున్న ఈ సాంగ్ మరో రికార్డును అందుకుంది. తాజాగా ఈ వీడియో యూట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అతితక్కువ సమయంలో 50 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా ‘నీ కన్ను నీలి సముద్రం’ రికార్డు సృష్టించింది. ఇక ప్రస్తుతం ఈ పాటకు ఉన్న క్రేజ్ బట్టి మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాటకు శ్రీమణి అందించిన సాహిత్యం ఆకట్టుకోగా.. రక్వీబ్ ఆలమ్ హిందీ లిరిక్స్ మైమరిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. చదవండి: శుభశ్రీ జీ.. మీరు ఎంతో మందికి స్పూర్తి: చిరు చైతూతో కలిసి సాహసయాత్రకు సమంత! -
ఉప్పెన రీమేక్‌లో స్టార్ హీరో తనయుడు
హిట్ సాంగ్స్‌తో రిలీజ్‌కు ముందే క్రేజ్ సంపాదించుకున్న చిత్రం "ఉప్పెన". ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా విజృంభణ కారణంగా వాయిదా పడింది. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.. కృతీశెట్టి కథానాయికగా పరిచయమవుతోంది. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఓ లెటెస్ట్ వార్త ఫిల్మీదునియాలో మార్మోగిపోతోంది. దీని ప్రకారం విజయ్ సేతుపతి ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులు కొన్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ మంచి ప్రేమ కథతో తన కొడుకును హీరోగా పరిచయం చేయాలని చూస్తున్న స్టార్ హీరో విజయ్‌కు కథ వినిపించినట్లు తెలుస్తోంది. (మనసు మనసు దగ్గరైతే ధక్ ధక్ ధక్) ఈ సినిమాపై విజయ్ కూడా ఆసక్తి కనబర్చగా, తన కొడుకు జాసన్ సంజయ్ విదేశాల నుంచి తిరిగి రాగానే మరోసారి చర్చించి దాదాపు సినిమాకు ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తున్న సంజయ్ అది పూర్తవగానే ఈ సినిమాలో నటించే అవకాశాలున్నాయి. అయితే పరిస్థితులు ఎక్కడికక్కడ సద్దుమణిగితే ఈ ఏడాది చివర్లో రీమేక్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తమిళ రీమేక్‌కు డైరెక్షన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కరోనా విలయం ముగిసిన తర్వాతే ఈ రీమేక్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి. (కరోనా.. కొడుకు గురించి హీరో విజయ్ ఆందోళన!) -
‘ఉప్పెన’ నుంచి న్యూలుక్ విడుదల
మెగా మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో తమిళహీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్, రెండు పాటలు మెగా అభిమానులకు తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. చేతిలో సిగరెట్ పట్టుకొని కుర్చిలో కూర్చున్న విజయ్ సేతుపలి మాస్‌లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘రాయనం' అనే విచిత్రమైన పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ కలిసి సంయుక్తంగా ఈ నిర్మిస్తున్నారు. -
ఊపిరి మొత్తం ‘ఉప్పెన’ అయితే ధక్‌ధక్‌ధక్
హీరో సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రంతో దర్శకుడి అవతారం ఎత్తాడు. ఇందులో కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతమందిస్తున్న దేవీశ్రీప్రసాద్ ‘ధక్ ధక్ ధక్’ సాంగ్‌తో మరోసారి మ్యాజిక్ చేశారు. రచయిత చంద్రబోస్ తన లిరిక్స్‌లో ప్రేమ పదనిసలు ఒలికించగా సింగర్స్ శరత్ సంతోష్, హరి ప్రియ అద్భుతంగా ఆలపించారు. ‘నువ్వు నేను ఎదురైతే ధక్ ధక్ ధక్.. మనసు మనసు దగ్గరైతే ధక్ ధక్ ధక్..’ అంటూ సాగే ఈ పాటను ఇప్పటివరకు యూట్యూబ్‌లో పదకొండు లక్షల మందికి పైగా వీక్షించారు. (కాకినాడలో ఉప్పెన!) ఉప్పెన చిత్రం నుంచి జాలువారిన ‘నీ కన్ను నీలి సముద్రం..’ యువత గుండెల్లో రింగురింగుమని మోగుతోంది. అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథతో తెరకక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు నాడు హీరోహీరోయిన్ల లుక్స్‌ను విడుదల చేయగా అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమాలో హీరోయిన్ నవ్వుకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఈ మేరకు సోషల్ మీడియాలో.. ‘ఈ హీరోయిన్ నవ్వులో ప్రియా వారియర్‌ను మించిపోయింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (నీ కన్ను నీలి సముద్రం..) -
నీ కన్ను నీలి సముద్రం
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నీ కన్ను నీలి సముద్రం..’ అనే పాటను డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పాటను జావెద్ అలీ ఆలపించారు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘ఈ వేసవికి ‘ఉప్పెన’ కంటే చల్లనైన, చక్కనైన సినిమా రాదనేది నా ప్రగాఢ నమ్మకం. బుచ్చిబాబు కథ చెప్పిన విధానం చూస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందోననిపించింది. నాకు తెలిసి ఇంత చక్కని పల్లెటూరి ప్రేమ కథ ఈ మధ్య కాలంలో రాలేదు. నాకు బాగా స్ఫూర్తినిచ్చిన ‘సీతాకోకచిలక’ లాంటి అనుభూతి ఉన్న సినిమా ఇది. వైష్ణవ్ తేజ్‌కు ఇంతకంటే బెటర్ డెబ్యూ రాదనుకుంటున్నా. ‘ఉప్పెన’ పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ఏప్రిల్ 2న ‘ఉప్పెన’ సినిమాని విడుదల చేయడానికి నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుకుమార్, వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌దత్ సైనుద్దీన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై., అశోక్ బి, సీఈఓ: చెర్రీ. -
ఉప్పొంగే ప్రేమకథ
సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన బుచ్చిబాబు సన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ‘ఆసి, సంగీత’ పాత్రల్లో వైష్ణవ్, కృతి కనిపించనున్నారు. సినిమాలో హీరోహీరోయిన్ల లుక్స్‌ను వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన ఈ సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవి శ్రీప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వై. అనిల్, బి.అశోక్, సీఈఓ: చెర్రీ. -
కాకినాడలో ఉప్పెన!
హెడ్డింగ్ చదివి కంగారు పడకండి. ఇక్కడ మేం చెబుతున్నది వెండితెర ‘ఉప్పెన’ గురించి. నటుడు చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘ఉప్పెన’. ఈ చిత్రంలో కృతీ శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేసిన బుచ్చిబాబు సన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కాకినాడలో జరుగుతోంది. ఇటీవల మొదలైన ఈ షెడ్యూల్ మరో 30 రోజులు అక్కడే కొనసాగుతుంది. ఆ నెక్ట్స్ గ్యాంగ్టాక్, సిక్కిం ప్రాంతాల్లో 20 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఓ 20 రోజులు షూటింగ్ చేయనున్నారు. దాంతో ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందని తెలిసింది. శ్యామ్ దత్ సైనుద్దీన్ కెమెరామేన్‌గా ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.