మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టీ జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం వంద కోట్లపైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. సినిమా విడుదలైన నెలన్నర రోజుల తర్వాత డిలీటెడ్ సీన్స్‌ని ఒక్కక్కటిగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంది చిత్ర బృందం. తాజాగా విడుదల చేసిన రెండు డిలీటెడ్ సన్నివేశాలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా కాలనీ అమ్మాయితో వైష్ణవ్ తేజ్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. బేబమ్మకు లవ్ లెటర్ ఇచ్చేందుకు ఆశీ పడే ప్రయత్నాలు ఫన్నీగా ఉన్నాయి. అంతేకాదు ఈ సీన్‌లో గోదావరి జిల్లాలో పాడుకునే జానపద పాటను కూడా పెట్టాడు దర్శకుడు బుచ్చిబాబు. అది కూడా చాలా బాగుంది. అలాగే విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల మధ్య వచ్చే సీన్ కూడా అదిరిపోయింది. సినిమా నిడివిని దృష్టిలో పెట్టుకొని ఈ రెండు సన్నీవేశాలను తొలగించారు. ఇంకా ఇలాంటి సన్నివేశాలు ఎన్ని ఉన్నాయో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment