Krithi Shetty Shares Emotional Post With on One Year of Uppena Movie - Sakshi
Sakshi News home page

Krithi Shetty: మాటిస్తున్నానంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసిన ‘బేబమ్మ’

Published Sun, Feb 13 2022 6:28 PM | Last Updated on Sun, Feb 13 2022 6:54 PM

Krithi Shetty Shares Emotional Post With On One Year Of Uppena Movie - Sakshi

‘ఉప్పెన’ మూవీతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో మెరిసింది కృతిశెట్టి. తొలి సినిమానే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడం, బంగర్రాజు, శ్యామ్‌ సింగరాయ్‌ కూడా మంచి విజయం సాధించడంతో బేబమ్మ హ్యాట్రిక్‌ కొట్టింది. దీంతో ఇండస్ట్రీలో లక్కీ గర్ల్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్‌ వారియర్‌, మాచేర్ల నియోజకం’ వంటి ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే గతేడాది ఆమె నటించిన ఉప్పెన సినిమా విడుదలై నిన్నటి(ఫిబ్రవరి 12) ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బేబమ్మ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది.  

చదవండి: నాన్న పీస్‌ డేని చెడగొట్టే మిషన్‌లో బిజీ, సితార పోస్ట్‌ వైరల్‌

‘జీవితంలో మనకంటూ రెండు పుట్టిన రోజులు ఉంటే, అందులో ఒకటి... మనం పుట్టినరోజు. ఇంకొకటి.. మనం కెరీర్‌లో ఏం చేయాలో ఎంచుకున్న రోజు. ఏడాది క్రితం నటిగా పరిశ్రమలో అడుగుపెట్టాను. నేను ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నా.. కాబట్టి ఈరోజు నాకిది మరో పుట్టినరోజుగా భావిస్తున్నా. నేను ఎంతో ఇష్టపడి నటిని అవ్వడం ఒక ఎత్తైయితే, మీ అందరూ ప్రేమ, అభిమానంతో నన్ను ఆదరించడం నాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఇదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది.

చదవండి: నేను ఆ టైప్‌ కాదు, నటినని నా బాయ్‌ఫ్రెండ్‌ వదిలేశాడు: హీరోయిన్‌

ఈ ప్రయాణాన్ని గుర్తుండేలా చేసిన నా అభిమానులకు కృతజ్ఞతలు. ఇకపై మరింత కష్టపడి మంచి పాత్రలతో అలరిస్తానని మాట ఇస్తున్నా. థాంక్యూ ఆల్‌’ అంటూ రాసుకొచ్చింది. మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా గతేడాది 2021 ఫిబ్రవరి 12న విడుదలైంది. కరోనా సమయంలో విడుదలైన ఈ టాలీవుడ్‌ బాక్సాఫీసుకు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందించింది. చిన్న సినిమాగా విడుదలైన ఉప్పెన రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement