![Vaishnav Tej, Krithi Shetty and Uppena Team In Gajuwaka - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/3/Vaishnav-Tej%2C-Krithi-Shetty.jpg.webp?itok=fg_uj40y)
అక్కిరెడ్డిపాలెం (గాజువాక): ఉప్పెన ఫేం వైష్ణవ తేజ్, కృతిశెట్టి గాజువాకలో సందడి చేశారు. కొత్తగాజువాకలో కేఎల్‌ఎం ఫ్యాషన్ మాల్ ప్రారంభ కార్యక్రమానికి వీరు రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. గాజువాక ప్రధాన రహదారి జనంతో స్తంభించింది. అభిమానులనుద్దేశించి వైష్ణవ తేజ్ మాట్లాడుతూ తొలిచిత్రమే అఖండ విజయం సాధించిందని, దానికి కారణం అభిమానులేనని పేర్కొన్నారు.
అభిమానులు మెచ్చే చిత్రాలు చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు. క్రిష్ దర్శకత్వంలో నటించిన కొండపొలం చిత్రం ఈ నెల 8న విడుదలవుతుందన్నారు. ఆ చిత్రాన్ని ఆదరించాలన్నారు. కృతిశెట్టి మాట్లాడుతూ..విశాఖలో ఉప్పెన షూటింగ్ జరిగిందని, ఇక్కడ ఎన్నో సుందర ప్రాంతాలకు ఫిదా అయ్యాయని చెప్పారు. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటిస్తున్నానని, మరికొన్ని చర్చల దశలో ఉన్నాయని కృతి పేర్కొన్నారు. కేఎల్‌ఎం ఫ్యాషన్ మాల్ వస్త్ర ప్రపంచంలో మరింత రాణించాలని వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment