Vaishnav Tej Uppena Movie Beats Ram Charan Chirutha Collections Records - Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌ రికార్డులను తుడిచిపెట్టిన ‘ఉప్పెన’..

Published Tue, Feb 16 2021 10:23 AM | Last Updated on Tue, Feb 16 2021 5:27 PM

Vaishnav Tej Beats Ram Charan Chirutha In Iust Three Days - Sakshi

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయమైన ‘ఉప్పెన’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఈ మూవీ రికార్డు స్టాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయ‌ల షేర్ రాబట్టగా.. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు రూ.50 కోట్లు వసూలు చేసి రికార్డు స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఉప్పెన చిత్రం మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ పేరిట ఉన్న రికార్డులను తుడిచిపెట్టింది. ఇప్పటి వరకు డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు రామ్ చరణ్ పేరు మీదే ఉంది. 14 ఏళ్లుగా దీన్నెవరూ టచ్‌ చేయలేకపోయారు. కాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో వచ్చిన చిరుతతో చరణ్‌ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.

చిరంజీవి కొడుకు కావడంతో చెర్రీ తొలి సినిమా చిరుతకు అప్పట్లో విపరీతమైన క్రేజ్‌ ఏర్పడి చరణ్‌కు మంచి విజయాన్ని అందించిందది. 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు సాధించిన డెబ్యూ హీరోగా చరిత్ర సృష్టించాడు రామ్ చరణ్. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ స్థాయిలో వసూళ్లు ఎవరూ సాధించలేకపోయారు. తాజాగా మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో వారసుడే చిరుత కలెక్షన్లను పూర్తిగా తుడిచేశాడు. కేవలం మూడు రోజుల్లోనే రూ.50 కోట్లు సాధించి చెర్రీ పేరిట ఉన్న రికార్డును వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూడు రోజుల్లోనే తిరగరాశాడు. ఇదిలా ఉండగా చిరుత రికార్డులను బయటి హీరో కాకుండా మెగా హీరోనే క్రాస్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా పవర్‌ అంటే ఈ లెవల్లో ఉంటుందని అంటున్నారు. 
చదవండి: గుడ్‌న్యూస్‌: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే
‘ఉప్పెన’ వీకెండ్‌ కలెక్షన్‌ రూ. 50 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement