Chirutha Film
-
'చిరుత' హీరోయిన్ ఐస్ బాత్.. కారణం అదేనా?
చిరుత హీరోయిన్ గుర్తుందా? కచ్చితంగా గుర్తుండదు. ఎందుకంటే ఈమె తెలుగులో చేసిన ఫస్ట్ సినిమా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో చేసింది. బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఏం లాభం. టాలీవుడ్లో మరో మూవీ తప్పితే పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. ఇప్పుడు ఏకంగా ఐస్ బాత్ వీడియో హాట్ టాపిక్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా) ఇప్పుడేం చేస్తోంది? 'చిరుత' తర్వతా వరుణ్ సందేశ్ 'కుర్రాడు' మూవీలో హీరోయిన్ గా చేసిన నేహాశర్మ.. ఆ తర్వాత అన్నీ హిందీ సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. అయినాసరే పెద్దగా సక్సెస్ రాలేదు. ఇలా నటిగా పెద్దగా పేరు తెచ్చుకోనప్పటికీ.. అక్క ఐషా శర్మతో కలిసి అందాల ప్రదర్శనలో మాత్రం అస్సలు తగ్గదు. ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంటుంది. ఐస్ బాత్ ఛాలెంజ్ జిమ్ కి వెళ్లడం వర్కౌట్స్ చేయడం లాంటివి కాకుండా ఇప్పుడు ఐస్ బాత్ చేసింది. ఈ మధ్య హీరోయిన్లు రకుల్ ప్రీత్, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ఐస్ బాత్ ఛాలెంజ్ స్వీకరించింది. వాళ్లలానే తనకూడా ఐస్ బాత్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. రెడ్ బికినీలో ఈమె హాట్‌నెస్‌కి టబ్‌లోని మంచు కరిగిపోవడం గ్యారంటీ అని నెటిజన్స్ రొమాంటిక్‌గా కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
ఖరీదైన కారు కొన్న 'చిరుత' బ్యూటీ.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ నటి నేహా శర్మ మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సరసన చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో క్రూక్ సినిమాలో తొలిసారి కనిపించింది. ఆ తర్వాత వరుసగా యమ్లా పగ్లా దీవానా 2, సోలో, తాన్హాజీతో సహా పలు చిత్రాలలో నేహా శర్మ కనిపించింది. ఇటీవల సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది బాలీవుడ్ ముద్దుగుమ్మ. కొత్త కారుకు వెల్కమ్ చెబుతూ తన సోదరి ఐషా శర్మ ఉన్న ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. నేహా శర్మ దాదాపు రూ.1.09 కోట్ల విలువైన మెర్సిడెస్ కారును కొనుగోలు చేసింది. (ఇది చదవండి: అదిరిపోయే లుక్‌తో కాజోల్.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్) నేహా తన ట్విటర్లో రాస్తూ..'మనం కష్టపడి పని చేస్తూనే ఉంటాం. భగవంతుడు మనపట్ల ఎల్లప్పుడూ దయతో ఉంటాడు. మనం కూడా దేవునికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలి' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. వారి పెంపుడు కుక్కతో కలిసి తన కొత్త కారును ఇంటికి స్వాగతించారు. కొత్త కారుకు కొబ్బరికాయ కొట్టేందుకు నేహా శర్మ, చెల్లెలు ఐషా శర్మ ఇబ్బంది పడ్డారు. కాగా.. నేహా 'క్రూక్', 'క్యా సూపర్ కూల్ హై హమ్', 'యమ్లా పగ్లా దీవానా 2', 'యంగీస్తాన్', 'తుమ్ బిన్ 2', 'తాన్హాజీ' వంటి అనేక చిత్రాలలో నటించింది. త్వరలోనే నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన 'జోగిరా సారా రా' చిత్రంలో నటించనుంది. ఇందులో సంజయ్ మిశ్రా, మహాఅక్షయ్ చక్రవర్తి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కుషన్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. May we keep working hard and May God always be kind to us and may we be forever grateful ..#gratitude 🙏 @aishasharma25 pic.twitter.com/DnTFho1wa8 — Neha Sharma (@Officialneha) April 4, 2023 -
రామ్ చరణ్ రికార్డులను తుడిచిపెట్టిన ‘ఉప్పెన’..
వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ‘ఉప్పెన’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఈ మూవీ రికార్డు స్టాయిలో ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టగా.. ఇప్పటికీ అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు రూ.50 కోట్లు వసూలు చేసి రికార్డు స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఉప్పెన చిత్రం మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పేరిట ఉన్న రికార్డులను తుడిచిపెట్టింది. ఇప్పటి వరకు డెబ్యూ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డు రామ్ చరణ్ పేరు మీదే ఉంది. 14 ఏళ్లుగా దీన్నెవరూ టచ్ చేయలేకపోయారు. కాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో వచ్చిన చిరుతతో చరణ్ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. చిరంజీవి కొడుకు కావడంతో చెర్రీ తొలి సినిమా చిరుతకు అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడి చరణ్‌కు మంచి విజయాన్ని అందించిందది. 25 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అత్యధిక కలెక్షన్లు సాధించిన డెబ్యూ హీరోగా చరిత్ర సృష్టించాడు రామ్ చరణ్. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ స్థాయిలో వసూళ్లు ఎవరూ సాధించలేకపోయారు. తాజాగా మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో వారసుడే చిరుత కలెక్షన్లను పూర్తిగా తుడిచేశాడు. కేవలం మూడు రోజుల్లోనే రూ.50 కోట్లు సాధించి చెర్రీ పేరిట ఉన్న రికార్డును వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూడు రోజుల్లోనే తిరగరాశాడు. ఇదిలా ఉండగా చిరుత రికార్డులను బయటి హీరో కాకుండా మెగా హీరోనే క్రాస్ చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా పవర్ అంటే ఈ లెవల్లో ఉంటుందని అంటున్నారు. చదవండి: గుడ్‌న్యూస్: ఓటీటీలోకి ఉప్పెన.. ఎప్పుడంటే ‘ఉప్పెన’ వీకెండ్ కలెక్షన్ రూ. 50 కోట్లు -
చిరు కాపీ కాదు...
ఆ సీన్ - ఈ సీన్ దర్శకుల్లో వ్యక్తిగతంగా తమకంటూ ప్రత్యేక శైలి ఉన్నవాళ్లూ, సినిమాల్లోని పాత్రల ద్వారా తమ ప్రత్యేకతను చాటే డెరైక్టర్లూ కొంతమంది ఉంటారు. కథలు, కథనాల విషయంలోనే కాదు, పాత్రల చిత్రణలో కూడావీళ్లకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ఇది సినీ ప్రపంచంపై శాశ్వత ప్రభావాన్ని చూపగలదు. టాలీవుడ్లో అలాంటి ప్రత్యేకతను చూపిన, చూపుతున్న దర్శకుల్లో ఒకరు పూరి జగన్నాథ్. తన తొలి సినిమా నుంచే కథానాయకుడిని కొత్త హైట్స్‌కు తీసుకెళ్లిన ఈ దర్శకుడు క్రమంగా ఇండస్ట్రీలో తన హీరోని ప్రత్యేకంగా నిలబెట్టాడు. అతడి ఆటిట్యూడ్ ప్రత్యేకమనిపించాడు. మరి ఈ ప్రత్యేకత అంతా పూరి ఓన్ క్రియేషనేనా అంటే... ఒక్కోసారి ఆలోచనలో పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ‘చిరుత’ హీరో క్యారెక్టరయిజేషన్ విషయంలో! పూరీ ‘హీరో’ ప్రత్యేకమైనవాడు. ఆ హీరో ఒక ‘ఇడియట్’, ఒక ‘పోకిరి’. మరి అదే హీరో ‘చిరుత’ దగ్గరికి వచ్చేసరికి తన ఒరిజినాలిటీని కోల్పోయాడు. హాలీవుడ్ సినిమాను గుర్తు చేశాడు. లోకల్ మేడ్ చంటిగాడిని తయారు చేసిన పూరీ, చిరుత హీరో కోసం హాలీవుడ్ వరకూ వెళ్లాడు. ‘స్వెప్ట్ అవే’ హీరో మాదిరిగా తన హీరోను మలిచాడు. అంతేనా... ఏకంగా ఆ సినిమా నుంచి సీన్లను తెచ్చుకొన్నాడు. అందులోని పాత్రలను తన సినిమాకు అన్వయించుకున్నాడు. వాటి ఆటిట్యూడ్‌ను తన సినిమాలోని పాత్రలకు అలవాటు చేశాడు. అంతిమంగా మంచి ఔట్పుట్ వచ్చింది. అయితే మాత్రం... కాపీ అన్న నిజాన్ని కాదనగలమా?! చిరుత సినిమాలోని సీన్లను తనకు ఎంతో ఇష్టమైన ప్రాంతమైన బ్యాంకాక్ బాట పట్టించిన తర్వాత... పూరీని ‘స్వెప్ట్ అవే’ చిత్రంలోని పాత్రలు ఆవహించాయి. ప్రధాన పాత్రలు షిప్ ఎక్కడం దగ్గర నుంచి చిరుత సినిమాలో ‘స్వెప్ట్ అవే’ ఛాయలే కనిపిస్తాయి.హీరోయిన్ పాత్ర పొగరుమోతుతనం, హీరో మంచితనం... ఈ రెండు నైజాలూ ఎలివేట్ అయ్యే సీన్లు ‘స్వెప్ట్ అవే’ సినిమాలోనివి. నిజం చెప్పాలంటే హీరో, హీరోయిన్ పాత్రలకు ఉండే ఆ ఆటిట్యూడ్‌తో జనరేట్ అయ్యే సన్నివేశాలే ‘చిరుత’ను ప్రత్యేకంగా నిలిపాయి. అయితే అవన్నీ కాపీయే. షిప్ ఎక్కబోతూ అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకొంటూ సరదాగా షేక్‌హ్యాండ్ ఇచ్చుకునే సీన్లో హీరోయిన్ గర్వాన్ని ప్రదర్శించడం దగ్గర నుంచి తనకంటే గొప్పవాళ్లు ఎవరూ లేనట్టుగా ఆమె ప్రవర్తించే ప్రతి సన్నివేశం ‘స్వెప్ట్ అవే’లోనివే. ఆ సినిమాలో మడోన్నా ధరించిన పాత్ర తీరులోనే నేహా పాత్ర సాగిపోతుంది. ఆ తర్వాత హీరో, హీరోయిన్లు ఒక చిన్న దీవిలో ఆగి పోయాక వారిద్దరి మధ్య వచ్చే సీన్లన్నీ కాపీనే. హీరో చేపలు పట్టడానికి ఆయు ధాన్ని తయారు చేసుకోవడం, కొండ వాలు నుంచి జాలువారే నీళ్లను తెలివిగా బాటిల్లో పట్టుకొని తాగడం, హీరోయిన్ బుర్రకు అలా నీళ్లను తాగే నేర్పు తట్టక పోవడం... ఇవన్నీ కాపీనే! చేపలు పట్టి ఆహారాన్ని తయారు చేసుకున్న హీరోని డబ్బుతో కొనాలని ప్రయత్నిస్తుంది హీరోయిన్. తన ఆకలిని తీర్చుకోవడానికి ఆమె అతడికి డబ్బును ఎరగా వేస్తుంది. అందుకోసం వంద డాలర్లతో బేరాన్ని మొదలుపెట్టి వెయ్యి డాలర్ల వరకూ వెళ్లి చివరకు కొనలేక పోతుంది. ఇక్కడ హీరోయిన్ అహంభావ పూర్వమైన తీరు, హీరో ఆత్మాభిమానం రెండూ హైలెట్ అవుతాయి. తన బట్టలు ఉతికి తెచ్చిస్తే ఆహారాన్ని ఇస్తానని హీరో చెప్పడం, తప్పని పరిస్థితుల్లో హీరోయిన్ అతడికి సేవలు చేయడం, సార్ అని సంబోధించడం... ఇలా ప్రతి బిట్లోనూ ‘స్వెప్ట్ అవే’నే కనిపిస్తుంది. సిల్వర్ స్పూన్‌తో పుట్టిన హీరోయిన్ ఆ పరిస్థితుల మధ్య గర్వాన్ని వదులుకుని హీరో దగ్గర అణిగిమణిగి ఉంటూ.. చివరకు అతడి ప్రేమలో పడటం ఇక్కడి ఓవరాల్ కాన్సెప్ట్. ‘స్వెప్ట్ అవే’లోని ఈ కాన్సెప్ట్నే పూరీ ‘చిరుత’ సినిమాలోకి తీసుకొచ్చాడు. అంటే, క్యారెక్టర్ ఎలివేషనే కాదు, ట్రాన్స్ఫార్మేషన్ కూడా కాపీనే. ఏ మాత్రం తేడా లేకుండా లాగించేశాడు. రెండు సినిమాలకూ ప్రాణం ఈ సీన్లే. ఈ సీన్సకి ముందు హీరోయిన్ క్యారెక్ట రైజేషన్ ఒకలా ఉంటే.. పూర్తయ్యేసరికి మరోలా మారుతుంది. హీరోకు అనుకూల వతిగా మారిపోతుంది. దానికోసమే పైన చెప్పుకున్న సీన్లన్నీ క్రియేట్ చేయడం జరిగింది. అయితే క్రియేట్ చేసింది మాత్రం హాలీవుడ్‌వాళ్లు. కాపీ కొట్టింది మనం. అంతులేని కాపీతో అడుగడుగునా ‘స్వెప్ట్ అవే’ చిత్రాన్ని దించేశారు. ఎంత సినిమా హిట్టయినా క్రియేటివిటీ మనది కాదన్న నిజాన్ని ఒప్పుకుని తీరాలిగా! - బి.జీవన్‌రెడ్డి