చిరుత హీరోయిన్ గుర్తుందా? కచ్చితంగా గుర్తుండదు. ఎందుకంటే ఈమె తెలుగులో చేసిన ఫస్ట్ సినిమా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో చేసింది. బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఏం లాభం. టాలీవుడ్‌లో మరో మూవీ తప్పితే పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. ఇప్పుడు ఏకంగా ఐస్ బాత్ వీడియో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా)
ఇప్పుడేం చేస్తోంది?
'చిరుత' తర్వతా వరుణ్ సందేశ్ 'కుర్రాడు' మూవీలో హీరోయిన్ గా చేసిన నేహాశర్మ.. ఆ తర్వాత అన్నీ హిందీ సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. అయినాసరే పెద్దగా సక్సెస్ రాలేదు. ఇలా నటిగా పెద్దగా పేరు తెచ్చుకోనప్పటికీ.. అక్క ఐషా శర్మతో కలిసి అందాల ప్రదర్శనలో మాత్రం అస్సలు తగ్గదు. ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంటుంది.
ఐస్ బాత్ ఛాలెంజ్
జిమ్ కి వెళ్లడం వర్కౌట్స్ చేయడం లాంటివి కాకుండా ఇప్పుడు ఐస్ బాత్ చేసింది. ఈ మధ్య హీరోయిన్లు రకుల్ ప్రీత్, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ఐస్ బాత్ ఛాలెంజ్ స్వీకరించింది. వాళ్లలానే తనకూడా ఐస్ బాత్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. రెడ్ బికినీలో ఈమె హాట్‌నెస్‌కి టబ్‌లోని మంచు కరిగిపోవడం గ్యారంటీ అని నెటిజన్స్ రొమాంటిక్‌గా కామెంట్స్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!)
Comments
Please login to add a commentAdd a comment