రెస్టారెంట్ బిజినెస్‌లోకి రామ్ చరణ్ హీరోయిన్ | Actress Neha Sharma Owns Japanese Restaurant 'Call Me Ten' | Sakshi
Sakshi News home page

Neha Sharma: ఇకపై బిజినెస్ కూడా.. రెండు చేతులా సంపాదన

Published Sun, Sep 22 2024 10:14 AM | Last Updated on Sun, Sep 22 2024 10:28 AM

Actress Neha Sharma Owns Japanese Restaurant 'Call Me Ten'

హీరోహీరోయిన్లు వ్యాపారాలు చేయడం కొత్తేం కాదు. తెలుగు హీరోలు చాలామందికి హైదరాబాద్‌లో పబ్బులు, రెస్టారెంట్స్, జిమ్స్ ఉన్నాయి. ఓవైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు ఈ బిజినెస్ వ్యవహరాలన్నీ చూస్తుంటారు. స్టార్ సెలబ్రిటీలందరూ ఇలా రెండు చేతులా సంపాదించేస్తుంటారు. ఇప్పుడు ఈ లిస్టులో హీరోయిన్ నేహాశర్మ కూడా చేరింది.

(ఇదీ చదవండి: అమెరికాలో పెళ్లి.. సమంతనే స్పెషల్ ఎట్రాక్షన్)

బిహార్‌కి చెందిన ఈమె.. రామ్ చరణ్ తొలి సినిమా 'చిరుత'తో హీరోయిన్ అయింది. తెలుగులో 'కుర్రాడు' అని మరో మూవీ చేసింది. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. మధ్యలో మలయాళ, పంజాబీలో తలో చిత్రంలో నటించింది. రీసెంట్‌గా 'బ్యాడ్ న్యూజ్' మూవీలో కనిపించింది. ప్రస్తుతం 'హేరా ఫేరీ 3'లో నటిస్తోంది.

నటిగా ఓ మాదిరిగా బిజీగా ఉంటున్న నేహ శర్మ.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో దిల్లీలోని వసంత విహార్‌లో 'కాల్ మీ టెన్' పేరు జపనీస్ రెస్టారెంట్‍ ప్రారంభించింది. తద్వారా కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఒకవేళ ఇది విజయవంతమైతే నటిగా కెరీర్ డౌన్ అయినా సరే ఆర్థికంగా ఇబ్బంది ఉండదనమాట.

(ఇదీ చదవండి: తమిళ హీరోయిన్‌పై పోలీస్ కేసు.. అప్పటి గొడవ మళ్లీ)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement