neha sharma
-
ఎల్లె ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2024..సందడి చేసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
రెస్టారెంట్ బిజినెస్‌లోకి రామ్ చరణ్ హీరోయిన్
హీరోహీరోయిన్లు వ్యాపారాలు చేయడం కొత్తేం కాదు. తెలుగు హీరోలు చాలామందికి హైదరాబాద్‌లో పబ్బులు, రెస్టారెంట్స్, జిమ్స్ ఉన్నాయి. ఓవైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు ఈ బిజినెస్ వ్యవహరాలన్నీ చూస్తుంటారు. స్టార్ సెలబ్రిటీలందరూ ఇలా రెండు చేతులా సంపాదించేస్తుంటారు. ఇప్పుడు ఈ లిస్టులో హీరోయిన్ నేహాశర్మ కూడా చేరింది.(ఇదీ చదవండి: అమెరికాలో పెళ్లి.. సమంతనే స్పెషల్ ఎట్రాక్షన్)బిహార్‌కి చెందిన ఈమె.. రామ్ చరణ్ తొలి సినిమా 'చిరుత'తో హీరోయిన్ అయింది. తెలుగులో 'కుర్రాడు' అని మరో మూవీ చేసింది. ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయింది. మధ్యలో మలయాళ, పంజాబీలో తలో చిత్రంలో నటించింది. రీసెంట్గా 'బ్యాడ్ న్యూజ్' మూవీలో కనిపించింది. ప్రస్తుతం 'హేరా ఫేరీ 3'లో నటిస్తోంది.నటిగా ఓ మాదిరిగా బిజీగా ఉంటున్న నేహ శర్మ.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో దిల్లీలోని వసంత విహార్‌లో 'కాల్ మీ టెన్' పేరు జపనీస్ రెస్టారెంట్ ప్రారంభించింది. తద్వారా కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. ఒకవేళ ఇది విజయవంతమైతే నటిగా కెరీర్ డౌన్ అయినా సరే ఆర్థికంగా ఇబ్బంది ఉండదనమాట.(ఇదీ చదవండి: తమిళ హీరోయిన్‌పై పోలీస్ కేసు.. అప్పటి గొడవ మళ్లీ) -
Neha Sharma : చిరుత హీరోయిన్ క్యూట్ లుక్స్
-
An Inch.. ఆర్ట్ పంచ్! రూపం సూక్ష్మం.. కళ అనంతం!
అద్భుతమైన కళాకృతిని సృష్టించాలంటే అతిపెద్ద కాన్వాస్లే అక్కర్లేదు.. అంగుళం చోటు చాలు.. అని నిరూపిస్తున్నారీ సృజనాత్మక చిత్రకారులు. నగరానికి చెందిన యువ ఆర్కిటెక్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాన్ ఇంచ్ ఆగస్ట్.. సృజనలోని లోతుల్ని స్పృశిస్తూ కళా ప్రపంచంలోని విశేషాలను, విచిత్రాలను ఆవిష్కరిస్తోంది.ఇన్స్టాగ్రామ్ వేదికగా నిర్వహించే ఆన్లైన్ ప్రాజెక్ట్ ‘యాన్ ఇంచ్ ఆగస్ట్’ ఈ నెల అంతా జరుగుతుంది. అత్యంత చిన్నదైన ప్రదేశంలో అత్యుత్తమ కళాప్రతిభను ప్రదర్శించడం ఈ పోటీలో వైవిధ్యం. కేవలం ఒక అంగుళం చతురస్రంలో క్లిష్టమైన, అర్థవంతమైన కళాఖండాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఈ ఆన్లైన్ ఈవెంట్ ఆహా్వనిస్తోంది. సూక్ష్మ కళారూపాలలో సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రేరేపిస్తూ యువ ఆరి్టస్టులకు సవాల్ విసురుతోంది. ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని కళాభిమానులు, ఆర్కిటెక్ట్స్ మేఘాలికా, నేహా శర్మలు 2018లో వార్షిక ఛాలెంజ్‌గా ప్రారంభించారు. డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్పి్టంగ్, 3డీ మోడలింగ్, మ్యాక్రో ఫొటోగ్రఫీలలో ప్రవేశం ఉన్నవారి కోసం దీనిని నిర్వహిస్తున్నారు.అంగుళంలో భళా.. అనిపించండి ఇలా..ఈ ఆన్లైన్ ఛాలెంజ్ అధికారికంగా ప్రారంభం అవడానికి ముందు, ఎప్పటిలాగే బేగంపేటలోని పంచతంత్ర కెఫెలో జులై ఆఖరి ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు కళాభిమానులకు ప్రీ–ఓపెనింగ్ మీట్ నిర్వహించారు. ఈ ఛాలెంజ్ గురించి విశేషాలు వివరించడంతో పాటు తోటి కళాకారులతో పరస్పర చర్చలు జరిగాయి. ఒక అంగుళం పరిమితిలో సృజనాత్మక ఆవిష్కరణ ప్రక్రియ ఎలా అనేదానిపై సూచనలు కూడా ఈ మీట్ ద్వారా నిర్వాహకులు అందించారు. రోజుకు ఒకటికి తగ్గకుండా కళాకృతిని పోస్ట్ చేయడం ద్వారా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చు.ఇంచ్ ఇంచై.. వటుడింతై.. అంగుళం–పరిమాణంలోని ఆవిష్కరణల్లో పాల్గొనడానికి వయస్సు, నైపుణ్య స్థాయితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ ఆన్లైన్ పోటీ అవకాశం అందిస్తోంది. దీంతో ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 7వేలకు పైగా వన్ ఇంచ్ ఆర్ట్ వర్క్స్‌తో మంచి రెస్పాన్స్ అందుకుంది. కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కాకుండా కళాకారులతో సమావేశాలు నిర్వహించడం, టీ–వర్క్స్‌లో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వంటి వాటి ద్వారా ఈ ఛాలెంజ్ ఇంచ్ ఇంచై వటుడింతై అన్నట్టుగా ప్రాచుర్యం పెంచుకుంటోంది.సృజనకు పదును పెట్టడమే లక్ష్యం..కళలకైనా, సృజనకైనా ఆకాశమే హద్దు. చిట్టి చిట్టి కళాకృతులను సృష్టించడం ద్వారా కళాసృష్టిలోని వైవిధ్యాన్ని చూపించడమే ఈ యాన్ ఇంచ్ ఆగస్ట్ ముఖ్యోద్దేశ్యం. ఈ కార్యక్రమం తొలిదశలో ఫొటోగ్రఫీ యాడ్ చేయలేదు. కానీ కొందరి అభ్యర్థన మేరకు అంగుళం లోపల ఉన్న సబ్జెక్ట్‌ని ఫొటో తీయడాన్ని కూడా జతచేశాం. హైదరాబాద్‌లో ఇంత మంది మ్యాక్రో ఫొటోగ్రాఫర్స్ ఉన్నారని మాకు తెలీదు అని మాతో ఇప్పుడు చాలా మంది అంటున్నారు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది కళాకారులకు గుర్తింపు లభిస్తోంది. అంతకు మించి మేం దీని నుంచి ఏమీ ఆశించడం లేదు. ఛాలెంజ్ ముగిసిన తర్వాత ఈ నెలాఖరులో పోస్ట్ మీటప్ను నిర్వహించనున్నాం. దానిలో కళాకారులు పాల్గొని నెల రోజుల పాటు తాము అందుకున్న సృజనాత్మక అనుభవాలను పంచుకుంటారు. – మేఘాలిక, నేహాశర్మ, నిర్వాహకులుఇవి చదవండి: భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థ -
తండ్రి ఓటమిపై స్పందించిన ‘చిరుత’ హీరోయిన్
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తికనబరిచింది. ఈ ఎన్నికల్లో కంగనా రనౌత్, అరుణ్ గోవిల్ తదితర నటులతో పాటు బాలీవుడ్ నటి నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ కూడా పోటీ చేశారు. ఆయన బీహార్‌లోని భాగల్పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. అయితే జేడీయూ అభ్యర్థి అజయ్ మండల్ చేతిలో శర్మ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.తన తండ్రి ఓటమిపై నేహా శర్మ ఆవేదనతో సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె తమ కుటుంబానికి ఎదురైన అనుభవాన్ని కవితారూపంలో రాశారు. తన కుటుంబం తదుపరి అధ్యాయం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నదని ఆమె దానిలో పేర్కొన్నారు.‘ఇది మాకు కష్టమైన రోజు. మేము అన్నివిధాలా పోరాడాం. మా నాన్నను నమ్మి ఆయనకు ఓటు వేసిన వారికి కృతజ్ఞతలు. మేము తదుపరి దశలో సాగే ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. ఓటమితో కుంగిపోకుండా ఎప్పుడూ ముందుకు సాగాలని మనం గుర్తుంచుకోవాలి. పర్వతంలా ధృడంగా నిలవాలి. సింహంలా గర్జించాలి. నిర్భయంగా నిలబడాలి. ధైర్యంగా ముందుకు సాగాలి’ అని నేహాశర్మ రాశారు. ఆమె భాగల్పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగిన తండ్రి తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. నేహా శర్మ తెలుగులో రామ్‌చరణ్ సరసన ‘చిరుత’ సినిమాలో నటించారు. -
చిరుత హీరోయిన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్‌తోనే భయపెట్టేశారు!
ప్రస్తుతం అంతా ఓటీటీల యుగం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే సరికొత్త సిరీస్‌లు, సినిమాలు సినీ ప్రియులను అలరించేందుకు వస్తున్నాయి. ముఖ్యంగా హారర్, క్రైమ్ జానర్ లాంటి కథలు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటికే ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కుతోంది. తాజాగా మరో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. నేహా శర్మ నటించిన తాజా వెబ్ సిరీస్ 36 డేస్ ఓటీటీలో సందడి చేయనుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే మర్డర్ మిస్టరీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు 'సీక్రెట్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ట్రైలర్లోనే ట్విస్టులు భయపెట్టేలా ఉన్నాయి. ఇవాళ విడుదల చేసిన ట్రైలర్‌తో ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశారు. ఈ సిరీస్‌లో పూరబ్ కోహ్లి, శృతి సేఠ్, చందన్ రాయ్ సన్యాల్, షరీబ్ హష్మి, అమృతా ఖాన్విల్కర్ కీలక పాత్రల్లో నటించారు. అయితే మర్డర్ మిస్టరీ సిరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. నేహా శర్మ టాలీవుడ్లో చిరుత మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన మెరిసింది. -
ఎన్నికల ప్రచారంలో 'రామ్ చరణ్' హీరోయిన్.. ఎవరికోసమో తెలుసా?
పాట్నా: 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా.. సినీతారలు కూడా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే రామ్ చరణ్ సరసన 'చిరుత' సినిమాలో హీరోయిన్గా నటించిన 'నేహా శర్మ' ఇటీవల బీహార్ రోడ్‌షోలో పాల్గొంది.కాంగ్రెస్ పార్టీ తరపున భాగల్పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న నటి నేహా శర్మ తండ్రి అజిత్ శర్మకు మద్దతుగా ఈమె రోడ్‌షోలో కనిపించింది. బంకా, కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియాతో సహా బీహార్‌లోని వివిధ జిల్లాల గుండా ఆమె రోడ్‌షోలలో తన ప్రయాణం కొనసాగించింది. దీనికి సంబంధించిన వీడియో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వీడియో షేర్ చేస్తూ.. ఎవరైనా హృదయంలో స్థానం ఇస్తే, అక్కడ శాశ్వతంగా జీవిస్తారని చెబుతారు. మీరు నాపట్ల చూపిన ప్రేమ, ఆదరణ నా హృదయాన్ని నింపేసింది. పిర్పైంటి, కహల్‌గావ్‌కు సాదర స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు అంటూ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించింది. గతంలో నేహా శర్మ రాజకీయాల్లోకి రావచ్చని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల అరంగేట్రం చేయడం లేదని పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఆమె తండ్రి అజిత్ శర్మ ఆమెకు రాజకీయాల్లో చేరే అవకాశాన్ని అందించినప్పటికీ.. ఆమె ప్రస్తుతం తన నటనా వృత్తిపై దృష్టి పెట్టినట్లు నివేదికలు తెలిపాయి. View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) -
‘చిరుత’ హీరోయిన్ పొలిటికల్ ఎంట్రీ!
రాబోయే లోక్‌సభ ఎన్నికల ద్వారా బాలీవుడ్ నటి, మోడల్ నేహా శర్మ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆమె తండ్రి కాంగ్రెస్ నాయకుడు అజయ్ శర్మ తెలిపారు. బిహార్‌లోని భాగల్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. మహాఘట్బంధన్ సీట్ల పంపకంపై చర్చల తర్వాత తమ పార్టీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తే తన కుమార్తెకు నియోజకవర్గం నుంచి టిక్కెట్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేహా శర్మ 2007లో తెలుగులో రామ్‌చరణ్ హీరోగా వచ్చిన ‘చిరుత’ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. “కాంగ్రెస్‌కి భాగల్పూర్ నియోజకవర్గం కావాలి. అది మా కంచుకోట. సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. మాకు ఈ సీటు వస్తే ఎవరు పోటీ చేయాలనేది పార్టీ హైకమాండ్‌పై ఆధారపడి ఉంది. పార్టీ నన్ను అడిగితే నేను పోటీ చేస్తాను లేదా బహుశా నా కుమార్తె నేహా శర్మ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం’’ అని అజయ్ శర్మ అన్నారు. బిహార్‌లో ‘ఇండియా’ కూటమి సీట్ల భాగస్వామ్య ప్రకటన ఈ వారంలో ఉంటుందని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తెలిపారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) హాజీపూర్, జముయితో సహా 5 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టనుంది. హిందుస్థానీ ఆవాస్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. 2019లో బీహార్‌లోని 40 సీట్లకు గాను ఎన్డీఏ 39 స్థానాలను కైవసం చేసుకుంది. -
సంక్రాంతి స్పెషల్.. అలా కనిపించిన హాట్ బ్యూటీస్.. చూస్తే అంతే!
యాంకర్ అనసూయ సంక్రాంతి సోయగాలు సంక్రాంతి స్పెషల్.. మంచు విష్ణు క్యూట్ ఫ్యామిలీ మత్తెక్కించే పోజుల్లో హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ చీరలో ధగధగా మెరిసిపోతున్న 'కేజీఎఫ్' బ్యూటీ భర్తతో కలిసి సంక్రాంతి విషెస్ చెప్పిన అమలాపాల్ పాలరాతి బొమ్మలా మెరిసిపోతున్న రష్మిక గ్లామర్ ట్రీట్ ఇచ్చిన 'చిరుత' బ్యూటీ నేహశర్మ నడుము చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న హీరోయిన్ వేదిక View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by janany (@janany_kj) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Gehna Sippy (@gehnasippy11) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Mirnalini Ravi (@mirnaliniravi) -
చూపు తిప్పుకోలేనంత అందంగా నేహా.. ఆ హీరోయిన్ ఇప్పటికే అలానే!
బ్లాక్ డ్రస్‌లో మరింత అందంగా యాంకర్ వర్షిణి ఒంపు సొంపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్ స్రవంతి టూ పీస్ బికినీలో హీరోయిన్ తాన్య హోప్ ఆ సినిమాకు రెండేళ్లు.. హీరోయిన్ సారా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పూలతో బిగ్‌బాస్ అశ్విని.. మీరు వీడియో చూస్తే అంతే ఇక ఉప్పొంగే అందాలతో రచ్చ లేపుతున్న నేహాశర్మ ఎర్రని చీరలో ధగధగా మెరిసిపోతున్న ఐశ్వర్య మేనన్ మనాలి టూర్లో చిల్ అవుతున్న హీరోయిన్ ఆషికా డ్రాగన్ ఫొటోతో అవాక్కయ్యేలా చేస్తున్న రితికా సింగ్ View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
పింక్ శారీలో శ్రీలీల అందాలు.. నిహారికకు లావణ్య స్పెషల్ విషెస్
►పింక్ శారీలో శ్రీలీల అందాలు ►నగలతో మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి ►శారీలో అనసూయ హోయలు ►నిహారికకు వరుణ్‌తేజ్, లావణ్య స్పెషల్ విషెస్ ►ప్రియా భవానీ శంకర్ స్మైలీ లుక్స్ ►వీకెండ్ మూడ్‌లోనే నేహాశర్మ ►ఎల్లో డ్రెస్‌లో అరియానా గ్లోరీ అదిరిపోయే పోజులు View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
రామ్ చరణ్ ఫస్ట్ హీరోయిన్ అలా.. రష్మిక ఏమో చీరలో ఇలా!
పెట్ డాగ్‌తో చిల్ అవుతున్న తమిళ బ్యూటీ రమ్య నాటీ పోజుల్లో 'జబర్దస్త్' యాంకర్ రష్మి గౌతమ్ నడుము ఒంపుసొంపులతో రెచ్చగొడుతున్న అనసూయ బర్త్ డే ఫొటోలు షేర్ చేసిన హాట్ బ్యూటీ నేహాశర్మ కేక పుట్టించేలా నభా నటేశ్ అందాల విందు బ్లాక్ చీరలో కవ్విస్తున్న హీరోయిన్ రష్మిక ఈ మధ్య తెగ రెచ్చిపోతున్న మంచు లక్ష్మీ 'గుంటూరు కారం' మీనాక్షి చౌదరి క్యూట్ స్టిల్స్ View this post on Instagram A post shared by Ramya Pandian (@actress_ramyapandian) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Anukreethy Vas (@anukreethy_vas) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) -
శ్రీలీల హాట్ లుక్.. ధగధగా మెరుస్తున్న రాశీఖన్నా
ఊరమాస్ సాంగ్ కోసం శ్రీలీల హాట్‌గా జిగేల్మని మెరిసిపోతున్న రాశీఖన్నా న్యూయార్క్ వీధుల్లో సమంత సింగరం క్యూట్ పోజుల్లో హీరోయిన్ రీతూవర్మ టూపీస్ బికినీలో ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ చీరకట్టులో డిఫరెంట్‌గా కనిపిస్తున్న అనుపమ చిరిగిన ప్యాంటులో కాకరేపుతున్న తాన్య ఫుల్ హ్యాపీ మూడ్‌లో పాయల్ రాజ్‌పుత్ View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Tanya S Ravichandran (@itstanya_official) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
'చిరుత' హీరోయిన్ ఐస్ బాత్.. కారణం అదేనా?
చిరుత హీరోయిన్ గుర్తుందా? కచ్చితంగా గుర్తుండదు. ఎందుకంటే ఈమె తెలుగులో చేసిన ఫస్ట్ సినిమా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో చేసింది. బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఏం లాభం. టాలీవుడ్లో మరో మూవీ తప్పితే పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. ఇప్పుడు ఏకంగా ఐస్ బాత్ వీడియో హాట్ టాపిక్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా) ఇప్పుడేం చేస్తోంది? 'చిరుత' తర్వతా వరుణ్ సందేశ్ 'కుర్రాడు' మూవీలో హీరోయిన్ గా చేసిన నేహాశర్మ.. ఆ తర్వాత అన్నీ హిందీ సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. అయినాసరే పెద్దగా సక్సెస్ రాలేదు. ఇలా నటిగా పెద్దగా పేరు తెచ్చుకోనప్పటికీ.. అక్క ఐషా శర్మతో కలిసి అందాల ప్రదర్శనలో మాత్రం అస్సలు తగ్గదు. ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంటుంది. ఐస్ బాత్ ఛాలెంజ్ జిమ్ కి వెళ్లడం వర్కౌట్స్ చేయడం లాంటివి కాకుండా ఇప్పుడు ఐస్ బాత్ చేసింది. ఈ మధ్య హీరోయిన్లు రకుల్ ప్రీత్, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ఐస్ బాత్ ఛాలెంజ్ స్వీకరించింది. వాళ్లలానే తనకూడా ఐస్ బాత్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. రెడ్ బికినీలో ఈమె హాట్‌నెస్‌కి టబ్‌లోని మంచు కరిగిపోవడం గ్యారంటీ అని నెటిజన్స్ రొమాంటిక్‌గా కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
ఖరీదైన కారు కొన్న 'చిరుత' బ్యూటీ.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ నటి నేహా శర్మ మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సరసన చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లో క్రూక్ సినిమాలో తొలిసారి కనిపించింది. ఆ తర్వాత వరుసగా యమ్లా పగ్లా దీవానా 2, సోలో, తాన్హాజీతో సహా పలు చిత్రాలలో నేహా శర్మ కనిపించింది. ఇటీవల సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది బాలీవుడ్ ముద్దుగుమ్మ. కొత్త కారుకు వెల్కమ్ చెబుతూ తన సోదరి ఐషా శర్మ ఉన్న ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. నేహా శర్మ దాదాపు రూ.1.09 కోట్ల విలువైన మెర్సిడెస్ కారును కొనుగోలు చేసింది. (ఇది చదవండి: అదిరిపోయే లుక్‌తో కాజోల్.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్) నేహా తన ట్విటర్లో రాస్తూ..'మనం కష్టపడి పని చేస్తూనే ఉంటాం. భగవంతుడు మనపట్ల ఎల్లప్పుడూ దయతో ఉంటాడు. మనం కూడా దేవునికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలి' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. వారి పెంపుడు కుక్కతో కలిసి తన కొత్త కారును ఇంటికి స్వాగతించారు. కొత్త కారుకు కొబ్బరికాయ కొట్టేందుకు నేహా శర్మ, చెల్లెలు ఐషా శర్మ ఇబ్బంది పడ్డారు. కాగా.. నేహా 'క్రూక్', 'క్యా సూపర్ కూల్ హై హమ్', 'యమ్లా పగ్లా దీవానా 2', 'యంగీస్తాన్', 'తుమ్ బిన్ 2', 'తాన్హాజీ' వంటి అనేక చిత్రాలలో నటించింది. త్వరలోనే నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన 'జోగిరా సారా రా' చిత్రంలో నటించనుంది. ఇందులో సంజయ్ మిశ్రా, మహాఅక్షయ్ చక్రవర్తి కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కుషన్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. May we keep working hard and May God always be kind to us and may we be forever grateful ..#gratitude 🙏 @aishasharma25 pic.twitter.com/DnTFho1wa8 — Neha Sharma (@Officialneha) April 4, 2023 -
గోవా బీచ్‌లో నేహా.. సంగీత్కి రకుల్ రెడీ..‘చిట్టి’ బ్లాక్&వైట్ స్టిల్స్
► సిస్టర్ పిక్ అంటూ అక్క కాజల్ అగర్వాల్‌తో కలిసి దిగిన ఫోటోని నిషా అగర్వాల్ తన అభిమానులతో పంచుకుంది ► రెడ్ కలర్ డ్రెస్‌లో అందంగా ముస్తాబై సంగీత్కి వెళ్తున్న రకుల్ ప్రీత్‌సింగ్ ► బ్లాక్ డ్రెస్‌లో బ్లాక్ &వైట్ పిక్ షేర్ చేసిన ఫరియా అబ్దుల్లా ► మెగాస్టార్ ఇంట క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అయింది. ఈ వేడుకలో మెగాహీరోలంతా పాల్గొన్నారు. ఆ ఫోటోని వరుణ్తోజ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు ► గోవాలో సేద తీరుతున్న నేహాశర్మ View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) -
చిరుత పిల్ల సోయగాలు చూడతరమా? (ఫొటోలు)
-
12 ఏళ్ల తర్వాత ఫేం వచ్చింది: డీజే టిల్లు హీరో సిద్దు
DJ Tillu Movie Success Meet In Visakhapatnam: ప్రేక్షకుల అభిమానం పూర్తిస్థాయిలో పొందేందుకు 12 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చిందని డీజే టిల్లు హీరో సిద్ధు అన్నారు. సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో డీజే టిల్లు సినిమా విజయోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో ఏదో సాధించాలని ప్రతి ఒక్క నటుడు, డైరెక్టర్, రచయితకు ఉంటుందని.. ఈ రోజు అందరి కల నెరవేరిందన్నారు. చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు గుంటూరు టాకీస్ సినిమా విజయం సాధించినా.. అనుకున్నంత పేరు రాలేదన్నారు. ఎన్నో భయాందోళన పరిస్థితుల మధ్య డీజే టిల్లు సినిమాను చిత్రీకరించామన్నారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సినిమాలోని డైలాగ్ చెప్పి ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ నేహా మాట్లాడుతూ వైజాగ్‌లో వేరే సినిమా షూటింగ్లో ఉన్న సమయంలోనే.. డీజే టిల్లు సినిమా కోసం ఆఫర్ వచ్చిందన్నారు. చదవండి: బోయపాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోన్న హీరోయిన్! ఇప్పుడు అదే సిటీలో సినిమా విజయోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. డైరెక్టర్ విమల్ మాట్లాడుతూ తన స్కూల్ ఫంక్షన్లు ఇదే సిటీలో జరిగాయని, ఇక్కడే వేదికలపై చాలా సార్లు డ్యాన్స్‌లు చేశానని గుర్తు చేసుకున్నారు. వైజాగ్‌కు చెందిన తనను ఈ వేదికపై నిలబెట్టిన సినీ అభిమానులకు రుణపడి ఉంటానన్నారు. అనంతరం భువనేష్ అనే అభిమానికి హీరో సిద్ధు తన జాకెట్‌ను బహుమతిగా అందించారు. సినిమా టైటిల్ సాంగ్‌కు హీరో హీరోయిన్లు డ్యాన్స్ చేసి అభిమానుల్లో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వంశీ, ఇతర నటులు పాలొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆ ఫోటో చూసి సెట్స్‌లో నాతో విచిత్రంగా ప్రవర్తించారు: హీరోయిన్
Neha Sharma About Her Morphed Photo: 'చిరుత' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. తొలి సినిమాతో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌కే పరిమితమైన ఈ భామ ఇటీవలె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది. తన ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై నేహా మాట్లాడుతూ.. 2018లో నా ఫోటో ఒకటి మార్ఫింగ్ చేసి దానికి సెక్స్ టాయ్‌ను జత చేశారు. ఆ సమయంలో నేను 'ఇల్లీగల్' అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాను. రోజూ లాగే ఆరోజు కూడా సెట్స్‌పైకి వెళ్లినప్పుడు అందరూ నాతో విచిత్రంగా ప్రవర్తించారు. ఎవరూ నాతో మాట్లాడలేదు. ఏదో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలేం జరిగింది? ఇందుకు అందరూ ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అని అనుకున్నా. అప్పుడే ఒకరు నా దగ్గరికి వచ్చి ఆ మార్ఫింగ్ ఫోటోను చూపించారు. ఇది నెట్టింట వైరల్ అవుతుందని చెప్పారు. అది చూసి షాక్ అయ్యాను. నాకే ఎందుకు ఇలా జరిగిందని చాలా బాధపడ్డాను. అప్పటికింకా చాలా యంగ్ ఏజ్‌లో ఉన్నా. ఇలా ఎందుకు చేస్తారు? అంత పనిలేకుండా ఉన్నారా అని చాలా బాధపడ్డా. కానీ నిజం ఏంటో నాకు తెలుసు. కానీ ఏది ఏమైనా ఇలా మార్ఫింగ్ చేయడం ఏమాత్రం మంచిది కాదు అని పేర్కొంది. చదవండి: ఫారెన్ అమ్మాయితో రెండో పెళ్లి.. స్పందించిన మంచు మనోజ్ -
డూడులమ్మలు...
మొదట ఏమిటోగానీ ఇప్పుడు ‘డూడుల్’ అనేది పక్కింటి అబ్బాయి పేరు విన్నంత సహజమైపోయింది. నిఘంటువు అర్థం ప్రకారం ‘డూడుల్’ అంటే వోన్లీ వన్ వే... అదే ఫన్ వే! కొందరు మహిళా ఇలస్ట్రేటర్లు ఆ దారి తప్పకుండా, ఒకవైపు వినోదం పంచుతూనే మరోవైపు సామాజికస్పృహకు ప్రాధాన్యత ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నేహాశర్మ’(దిల్లీ) ‘నేహా డూడుల్స్’ పేరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ‘స్త్రీ సాధికారత’ను ప్రధాన వస్తువుగా తీసుకొని ఆమె డూడుల్స్ రూపొందిస్తుంటుంది. తన కళాత్మక అంశం చాలామందికి రియాలిటీచెక్లా ఉపయోగపడుతుంది. ‘డూడుల్స్‌లో ఉమెన్ ఎంపవర్మెంట్ ఎందుకు? హాయిగా నవ్వించవచ్చు కదా! అనుకుంటారు చాలామంది. అయితే సామాజిక విషయాలను డూడుల్స్‌గా ఎంచుకున్నంత మాత్రాన సీరియస్‌గానే చెప్పాలనే రూల్ ఏమీ లేదు కాదా! సున్నితంగా నవ్విస్తూనే విషయాన్ని సూటిగా చెప్పవచ్చు అని చెప్పడానికి ‘నేహా డూడుల్స్’ ఉదాహరణగా నిలుస్తాయి’ అని చెబుతుంది నేహాశర్మ చిరకాల ఫాలోవర్ రమ్య. సలోని పటేల్ (కోల్‌కతా) రూపొందిస్తున్న డూడుల్స్ చూస్తే ఎవరికైనా అర్థమయ్యే విషయం ఒక్కటే...‘జీవితాన్ని గ్లోబ్ మోసినంత భారంగా మోయనక్కర్లేదు. చిన్న జీవితాన్ని ప్రతిరోజూ పెద్దపండగలా జరుపుకోవచ్చు’ ‘ఎప్పుడైన మనసు బాగలేకపోతే నా దృష్టి సలోని సృష్టించే డూడుల్స్పై మళ్లుతుంది. హాయిగా నవ్వుకుంటాను. కొత్త ఉత్సాహంతో పనిచేస్తాను’ అంటుంది జాన్వీ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒకసారి యాదృచ్ఛికంగా ఆమె సలోని వేసిన డూడుల్స్‌ను ఇన్స్టాగ్రామ్ లో చూసింది. ఇక అప్పటి నుంచి రెగ్యులర్‌గా ఫాలో అవుతోంది. వైబ్రంట్ కలర్స్, ఇమేజరీలతో ఆకట్టుకుంటుంది దిల్లీకి చెందిన భావ్య దోషి. రోజూ వినే సాధారణ సంభాషణలే ఆమె రూపొందించే డూడుల్స్‌లో కొత్త సొగసును సంతరించుకుంటాయి. బిగ్గరగా నవ్విస్తాయి. ‘కంటెంట్ కోసం జుట్టు పీక్కోవాల్సిన పనిలేదు. మన చుట్టూ ఉన్న జీవితం నుంచే ఎంతో సృష్టించుకోవచ్చు’ అంటుంది కోల్‌కతాకు చెందిన శ్రేయా కుందు. ‘శ్రేయా రూపొందించే డూడుల్స్‌లో బొమ్మలు కనిపించవు. ఎక్కడో ఒకచోట మనకు పరిచయం ఉన్నవారు కనిపిస్తారు. అదే శ్రేయా ప్రత్యేకత’ అంటుంది శ్రేయా అభిమాని సత్య. ఇక ఆకాంక్ష కుంచె నుంచి జాలువారే డూడుల్స్ ఆకట్టుకునేలా ఉండడమే కాదు కాసేపు ఆలోచించేలా చేస్తాయి. నవ్వించడం మంచిదే. నవ్వించడం ద్వారా మంచిని చెప్పడం అందులోనూ సునిశితంగా... కళాత్మకంగా బోధించడం అంతకంటే మంచిది కదా! -
షేక్ చేస్తున్న బిగ్‌బాస్ విన్నర్ పాట!
ముంబై: చిన్నారి పెళ్లి కూతురు నటుడు శివ(సిద్దార్థ్ శుక్లా), నేహా శర్మల రోమాంటిక్, ఎమోషనల్ సాంగ్ ‘దిల్ కో కరార్ ఆయా’ యుట్యూబ్‌ను షేక్ చేస్తోంది. నిన్న(శుక్రవారం) ఈ పాట యుట్యూబ్లో విడుదలైంది. విడుదలైన 9 గంటల్లోనే ఈ పాట 25 లక్షల వ్యూస్ సంపాదించి యుట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. ‘దిల్ కో కరార్ ఆయా’ అంటూ సాగే ఈ పాట లింక్‌ను శుక్లా అభిమానుల కోసం శుక్రవారం ట్విటర్లో పంచుకున్నారు. ‘దీనిని మీరు ఇష్టపడతారని ఆశిస్తున్నాను... ఈ పాటపై మీ అభిప్రాయాన్ని నాకు తెలపండి’ అని ట్వీట్లో పేర్కొన్నాడు. Hope you guys like it.. let me know...https://t.co/ZjYlePGHrv — Sidharth Shukla (@sidharth_shukla) July 31, 2020 శుక్లా, నేహా రోమాంటిక్ పాట సంగీత ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు ఫిదా అవుతూ నెటిజన్లు కామెంట్స్‌లో హర్ట్ ఎమోజీల వర్షం కురిపిస్తున్నారు. ‘తన అభిమానుల కోసం సిద్దార్థ్ శుక్లా మరోసారి ప్రేమ, సంతోషాన్ని విస్తరించారు. ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది. ఆయన నుంచి నా కళ్లు తిప్పుకోలేకపోయాను’, ‘సిద్దార్థ్ హర్ట్... చూస్తూనే ఉండండి’, ‘ఈ పాట మొత్తం ప్రేమ, ఎమోషన్స్‌తో నిండి ఉంది’ అంటూ అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. -
న్యూ ఏజ్ లవ్
శ్రీ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘బాయ్స్’. దయానంద్ దర్శకుడు. నేహా శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గీతానంద్, శ్రీహాన్, రోనిత్‌రెడ్డి, సుజిత్, అన్షులా, జెన్నీఫర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 4న రెగ్యులర్ షూటింగ్ ఆరంభం అవుతుంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దామోదర ప్రసాద్ కాప్ ఇచ్చి, దర్శకునికి స్క్రిప్ట్‌ని అందించారు. ‘రథం’ నిర్మాత రాజా కెమెరా స్విచాన్ చేశారు. నటి, నిర్మాత సుప్రియ, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా కూడా అతిథులుగా పాల్గొన్నారు. దయానంద్ మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా ‘బాయ్స్’ నా తొలి చిత్రం. న్యూ ఏజ్ లవ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. కథ నచ్చి. నిర్మాతలు సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. మంచి టీమ్ కుదిరింది’’ అన్నారు. నేహా శర్మ మాట్లాడుతూ– ‘‘సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేస్తాం. టాకీ అంతా హైదరాబాద్‌లో చిత్రీకరించి, పాటలకు గోవా వెళతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్, కెమెరా: వెంకట్ ప్రసాద్, కో–ప్రొడ్యూసర్: బాలచంద్ర. -
ఒక హీరో.. నాలుగు కథలు
దుల్కర్ సల్మాన్ హీరోగా బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో మలయాళం, తమిళం భాషల్లో రూపొందిన చిత్రం ‘సోలో’ బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. నేహా శర్మ, ధన్సిక కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో నాజర్, సుహాసిని కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని నిర్మాత గాజుల వెంకటేశ్ ‘అతడే’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలో సీడీని నిర్మాత రాజ్‌కందుకూరి విడుదల చేసి, డాక్టర్ గౌతమ్ కశ్యప్, నిర్మాత వెంకటేశ్‌కు అందించారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘4 వినూత్న కథలు ఈ సినిమాలో ఉంటాయి. అన్ని షేడ్స్‌లోనూ హీరో బాగా నటించారు. మూవీ చూస్తుంటే డబ్బింగ్ అనే ఫీలింగ్ కలగదు’’ అన్నారు. ‘‘ఎంతో ఇష్టపడి తీసుకున్న ఈ సినిమా తెలుగులో కూడా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్. మాటల రచయిత గౌతమ్ కశ్యప్, లిరిక్ రైటర్ పూర్ణాచారి పాల్గొన్నారు. -
ఫిట్నెస్ చాలెంజ్‌ని స్వీకరించిన హీరోయిన్లు: వైరల్
సాక్షి, సినిమా : కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విసిరిన ఫిట్నెస్ సవాల్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. భారతీయులంతా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో రాజ్యవర్ధన్ సింగ్ ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ అనే చాలెంజ్‌ను సోషల్ మీడియాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజ్యవర్ధన్‌తో మొదలై విరాట్, హృతిక్, అనుష్క శర్మ, పీవీ సింధు, సైనాలు సహా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించిన వారిలో ఉన్నారు. ఈ సవాల్ స్వీకరించిన అఖిల్ తాను జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ .. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, వరుణ్ ధావన్‌లకి ఈ సవాల్ విసిరాడు. వీరిలో చైతూ ముందుగా స్పందించి తన ఫిట్ నెస్ వీడియో షేర్ చేస్తూ ఈ ఛాలెంజ్ లో సమంత, నిధి అగర్వాల్ , సుశాంత్ లు పాల్గొనమని కోరాడు . దీనికి స్పందించిన సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలెంజ్ స్వీకరిస్తున్నానని చెబుతూ ‘పుల్ అప్’ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ చాలెంజ్‌ను ఉపాసన కామినేనికొనిదెల, శిల్పారెడ్డి, రకుల్ ప్రీత్‌సింగ్‌కి విసురుతున్నాను అంటూ సమంత తన పోస్ట్‌లో పేర్కొంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లు లావణ్య త్రిపాఠీ, నేహ శర్మ కూడా ఈ చాలెంజ్‌ను స్వీకరించి తమ ట్విటర్లో వీడియోను పోస్ట్ చేశారు. వెన్నెల కిషోర్ ‘బాబాయ్ ఇసారి ఇంకొంచెం వేయిట్’ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసి నెటిజన్లని ఆకట్టుకుంటున్నారు. For years every time my trainer said ‘pull up’ I would fake a head ache , a bad day at work ,a stomach ache, tooth ache, my non-existent puppy is terribly sick and I have to leave blah blah blah . So although this is far from a pull up I am glad that I finally have decided to try. We are never too old to change . Fitness for me has never been about looking good , it is about discipline , respect , confidence and strength . #humfittohindiafit I challenge @upasanakaminenikonidela @shilpareddy.official and @rakulpreet A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on May 25, 2018 at 6:23am PDT Andd @iamSushanthA @parupallik challenge accepted ! Happy to be a part of this 😊 now I challenge @swatisemwal , @RaashiKhanna and @ItsMePragya 💪🏻#HumFitTohIndiaHit c’mon girls keeeel it And hula hoop act was the fun part of my workouts 😋 pic.twitter.com/K7kbSNEbtt — LAVANYA (@Itslavanya) May 25, 2018 I accept your challenge @iamSushanthA ...fitness is a lifestyle for me and here’s my video for #humfittohindiafit #fitnesschallenge ..and I challenge the two people who I feel swear by fitness @aishasharma25 @ant_pecs pic.twitter.com/XRYbRJQnhC — Neha Sharma (@Officialneha) May 25, 2018 Babaiiiii..Eesari inkonchem weight💪🏻💪🏻..@iamSushanthA bhayyo, here is my fitness challenge ka raw n nonedited video🙄..aint into fitness but i WILL get to it🤗🤗..thx to #HumFitTohIndiaFit initiative🙏🏼..and I challenge mr cuteness @23_rahulr and milky sensation @AdiviSesh pic.twitter.com/bD5RbYHKU0 — vennela kishore (@vennelakishore) May 26, 2018 -
ప్యారిస్‌లో డాన్ లవ్
సెంటిమెంట్స్ లేని సెటిల్మెంట్స్ చేస్తూ సూట్‌కేసులు అందుకుంటూ దాదాగిరి చేసుకునే డాన్ అతను. మూడు గన్స్, ఆరు సూట్కేసుల్లా అతని లైఫ్ సాగుతుంది. కానీ సడన్‌గా గన్ పక్కన పెట్టి గులాబీ పట్టుకున్నాడు. ఎందుకలా అంటే.. డాన్ మనసులో ప్రేమ చిగురించింది. అది ఎంత స్ట్రాంగ్ అంటే.. ఆ అమ్మాయి కోసం ఏకంగా ఇండియా నుంచి ప్యారిస్ వెళ్లాడు. నెక్ట్స్ ఏమైంది అంటే.. ‘చెప్పమండి.. ఎలాగూ థియేటర్స్‌కి వస్తాంగా. చూసి, మా జుంగ లవ్ ఎలా ఉందో చెప్పండి’’ అంటున్నారు చిత్రబృందం. ‘కాష్మోరా’ ఫేమ్ గోకుల్ దర్శకత్వంలో ‘పిజ్జా’ ఫేమ్ విజయ్ సేతుపతి, సాయేషా, నేహా శర్మ ముఖ్య పాత్రల్లో రూపొందుతున్న సినిమా ‘జుంగ’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. టైటిల్ టీజర్‌ను శనివారం రిలీజ్ చేశారు. వేసవిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.