రాబోయే లోక్‌సభ ఎన్నికల ద్వారా బాలీవుడ్ నటి, మోడల్ నేహా శర్మ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆమె తండ్రి కాంగ్రెస్ నాయకుడు అజయ్ శర్మ తెలిపారు. బిహార్‌లోని భాగల్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. మహాఘట్‌బంధన్ సీట్ల పంపకంపై చర్చల తర్వాత తమ పార్టీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తే తన కుమార్తెకు నియోజకవర్గం నుంచి టిక్కెట్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేహా శర్మ 2007లో తెలుగులో రామ్‌చరణ్ హీరోగా వచ్చిన ‘చిరుత’ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
“కాంగ్రెస్‌కి భాగల్‌పూర్ నియోజకవర్గం కావాలి. అది మా కంచుకోట. సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. మాకు ఈ సీటు వస్తే ఎవరు పోటీ చేయాలనేది పార్టీ హైకమాండ్‌పై ఆధారపడి ఉంది. పార్టీ నన్ను అడిగితే నేను పోటీ చేస్తాను లేదా బహుశా నా కుమార్తె నేహా శర్మ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం’’ అని అజయ్ శర్మ అన్నారు.
బిహార్‌లో ‘ఇండియా’ కూటమి సీట్ల భాగస్వామ్య ప్రకటన ఈ వారంలో ఉంటుందని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తెలిపారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) హాజీపూర్, జముయితో సహా 5 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టనుంది. హిందుస్థానీ ఆవాస్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. 2019లో బీహార్‌లోని 40 సీట్లకు గాను ఎన్‌డీఏ 39 స్థానాలను కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment