ఢిల్లీ : కరోనా (covid-19) సమయంలో ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood) రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల సోనూసూద్ ఓ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో కీలక వ్యక్తులు ‘నాకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారు. నేను తిరస్కరించా. అప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామన్నారు. అదీ వద్దన్నా. రాజ్యసభ ఎంపీగా అవకాశం వచ్చింది. వాటిని వద్దనుకున్నాను. రాజకీయాల్లో (politics) ఉండి దేని కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉండదన్నారు.
స్వేచ్ఛను కోల్పోవడం ఇష్టం లేనందునే రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించినట్లు చెప్పారు. రెండు కారణాలతో రాజకీయం చేస్తారు. ఒకటి డబ్బు కోసం, అధికారం కోసం. వాటిల్లో దేనిపైనా నాకు ఆసక్తిలేదు. ప్రజాసేవ చేస్తున్నాను. ఇందుకోసం ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. నేను ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే చేస్తాను. అదే రాజకీయం చేస్తే జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. స్వేచ్ఛను కోల్పోతామని భయం కూడా ఉంది.
ఎవరైనా ప్రజాదరణ పొందుతున్నప్పుడు జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని అనుకుంటారు. కానీ మనం ఎంత ఎంతుకు ఎదిగితే అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే మీరు అక్కడ ఎంతకాలం నిలదొక్కుకోగలరన్నది ముఖ్యం.
రాజకీయాల్లోకి వస్తే ఢిల్లీలో ఇల్లు, ఉన్నత పదవి, భద్రత, విశిష్ట అధికారాలు ఉంటాయని నాకు చాలా మంది చెప్పారు. అవన్నీ బాగున్నాయి. నేను వాటిని వినడానికి ఇష్టపడుతున్నాను. అంతే తప్పా ఇంకా దేని గురించి ఆలోచించడం లేదు. నటుడిగా కొనసాగుతా. నాలో ఒక నటుడు,దర్శకుడు మిగిలి ఉన్నారు, నేను రాజకీయాలకు వ్యతిరేకం కాదు, గొప్ప పని చేసే రాజకీయ నాయకులను నేను గౌరవిస్తాను’ రాజకీయాలపై సోనూసూద్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment