
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకీ ముందు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు కరోనా బారినపడ్డారు. ఇవాళ(సోమవారం) ఆయన ఢిల్లీలో ప్రధానిని కలవాల్సి ఉంది. కానీ అంతకుముందే నిర్వహించే సాధారణ వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది.
అయితే సీఎంకు కరోనా లక్షణాలు లేవని, అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌లోకి వెళ్లారని హిమాచల్ ప్రభుత్వ ప్రతినిధి ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోదీతో భేటీ వాయిదా పడినట్లు చెప్పారు.
సీఎం సుఖ్వీందర్, డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభ సింగ్‌తో పాటుు 38 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీతో పాటు డిసెంబర్ 16న రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత మూడో రోజే సీఎం వైరస్ బారినపడ్డారు. సుఖ్వీందర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులను కూడా కలిశారు.
చదవండి: TPCC Chief: బీఆర్‌ఎస్‌పై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment