sonusood
-
ముఖ్యమంత్రిగా అవకాశం.. వద్దనుకున్న సోనూసూద్.. ఎందుకంటే?
ఢిల్లీ : కరోనా (covid-19) సమయంలో ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood) రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇటీవల సోనూసూద్ ఓ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో కీలక వ్యక్తులు ‘నాకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారు. నేను తిరస్కరించా. అప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామన్నారు. అదీ వద్దన్నా. రాజ్యసభ ఎంపీగా అవకాశం వచ్చింది. వాటిని వద్దనుకున్నాను. రాజకీయాల్లో (politics) ఉండి దేని కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉండదన్నారు. స్వేచ్ఛను కోల్పోవడం ఇష్టం లేనందునే రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించినట్లు చెప్పారు. రెండు కారణాలతో రాజకీయం చేస్తారు. ఒకటి డబ్బు కోసం, అధికారం కోసం. వాటిల్లో దేనిపైనా నాకు ఆసక్తిలేదు. ప్రజాసేవ చేస్తున్నాను. ఇందుకోసం ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. నేను ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే చేస్తాను. అదే రాజకీయం చేస్తే జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. స్వేచ్ఛను కోల్పోతామని భయం కూడా ఉంది. ఎవరైనా ప్రజాదరణ పొందుతున్నప్పుడు జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని అనుకుంటారు. కానీ మనం ఎంత ఎంతుకు ఎదిగితే అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే మీరు అక్కడ ఎంతకాలం నిలదొక్కుకోగలరన్నది ముఖ్యం.రాజకీయాల్లోకి వస్తే ఢిల్లీలో ఇల్లు, ఉన్నత పదవి, భద్రత, విశిష్ట అధికారాలు ఉంటాయని నాకు చాలా మంది చెప్పారు. అవన్నీ బాగున్నాయి. నేను వాటిని వినడానికి ఇష్టపడుతున్నాను. అంతే తప్పా ఇంకా దేని గురించి ఆలోచించడం లేదు. నటుడిగా కొనసాగుతా. నాలో ఒక నటుడు,దర్శకుడు మిగిలి ఉన్నారు, నేను రాజకీయాలకు వ్యతిరేకం కాదు, గొప్ప పని చేసే రాజకీయ నాయకులను నేను గౌరవిస్తాను’ రాజకీయాలపై సోనూసూద్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. -
బంగ్లా బాధితులు కన్నీరుమున్నీరు, అండగా సోనూసూద్, వీడియో వైరల్
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల ఉద్యమం తీవ్రరూపం దాల్చి హింసాత్మకం మారిపోయింది. దీంతో ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయేంత తీవ్రంగా తలెత్తాయి. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర గందరగోళ, రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. మరోవైపు పౌరులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని భారతీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వారిపై దాడులు సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి ఒక మహిళ ఆవేదన ఎక్స్‌లో వైరల్‌గా మారింది. దీంతో తన వంతు సాయానికి ఎపుడూ ముందుండే నటుడు సోనూ సూద్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న హిందువులను భారత్‌కు తీసుకువచ్చేందుకు సాయం చేస్తానంటూ ఆమెకు మద్దతు ప్రకటించారు. దీంతో మరోసారి రియల్ హీరో అంటూ సోనూసూద్ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.‘‘తమ ప్రాణాలు పోతాయని భయంగా ఉందని, ఎలాగైనా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భారతదేశానికి చేరాలా చూడాలని’ తాజాగా బంగ్లాదేశ్ కు చెందిన మహిళ ఆ వీడియోలో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్గామారడంతో సోనూ సూద్ స్పందించారు. ”బంగ్లాదేశ్ నుంచి భారతీయులందరినీ తిరిగి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు కచ్చితంగా చేస్తాం. ఇక మీరు ప్రశాంతమైన మంచి జీవితాన్ని పొందుతారు. అంతేకాదు ఇది కేవలం మన ప్రభుత్వ బాధ్యతే కాదు.. మనందరి బాధ్యత కూడా.. జై హింద్” అంటూ ఆయన ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన హిందూవులను కాపాడటానికి దేశంలో ప్రముఖలతో పాటు ప్రతిఒక్కరు స్పందించాలని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. We should do our best to bring back all our fellow Indians from Bangladesh, so they get a good life here. This is not just the responsibility of our Government which is doing its best but also all of us.Jai Hind 🇮🇳 https://t.co/OuL550ui5H— sonu sood (@SonuSood) August 6, 2024 -
అప్పుడు రష్మిక ఇప్పుడు సోనూసూద్..!
-
అరుంధతి @15 ఏళ్లు.. అనుష్క, సోనూసూద్ రెమ్యునరేషన్ అంత తక్కువా?
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా అయితే సంక్రాంతి హంగామా నడుస్తోంది. దాదాపు ప్రతిఒక్కరూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే టైంలో నాలుగు సినిమాలు కూడా రిలీజయ్యాయి. వీటిలో 'హను-మాన్'కు పూర్తిస్థాయిలో పాజిటివ్ టాక్ వచ్చింది. సరే దీని గురించి కాసేపు పక్కనబెడితే ఈ పండగ టైంలో వచ్చి సెన్సేషనల్ హిట్ సాధించిన మూవీ అంటే అందరికీ గుర్తొచ్చేది 'అరుంధతి'నే. ఇప్పుడు ఈ చిత్రం 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు లీడ్ యాక్టర్స్ రెమ్యునరేషన్ సంగతి కూడా చూసేద్దాం. సంక్రాంతి పండక్కి సాధారణంగా ఫ్యామిలీ స్టోరీలతో తీసిన సినిమాల్నే రిలీజ్ చేస్తుంటారు. ఇవి కాదంటే యాక్షన్ ఎంటర్టైనర్, కామెడీ సినిమాల్ని థియేటర్లలోకి తీసుకొస్తుంటారు. అయితే ఈ పండగ హడావుడిలో చాలా అంటే చాలా అరుదుగా హారర్ మూవీస్ వస్తుంటాయి. అలా వచ్చిన చిత్రమే 'అరుంధతి'. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) తెలుగు సినిమాకు గ్రాఫిక్స్ మాయాజాలాన్ని పరిచయం చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన ఈ చిత్రం విడుదలై నేటికి 15 ఏళ్లు పూర్తయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నందులు కైవసం చేసుకున్న 'అరుంధతి'.. టాలీవుడ్లోనే సరికొత్త రికార్డులు సృష్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు ఇటుగా రూ.13 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తీస్తే ఏకంగా రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయట. ప్రధాన పాత్రల్లో నటించిన అనుష్క, సోనూసూద్ రెమ్యునరేషన్ గురించి తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. సినిమా తీసే టైంలో అనుష్క కేవలం ఓ హీరోయిన్ అంతే. దీంతో ఈమెని రూ.కోటి లోపే పారితోషికం ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. మరోవైపు విలన్ పశుపతిగా చేసిన సోనూసూద్‌కి అయితే తొలుత రూ.18 లక్షలే అనుకున్నారు. కానీ ఎక్కువ రోజులు వర్క్ చేయడంతో రూ.45 లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని టాక్. దీనిబట్టి చూస్తే మరీ రూ.కోటిన్నరలోపే ఇద్దరు లీడ్ యాక్టర్స్ పారితోషికం అంటే చాలా తక్కువనే చెప్పొచ్చు. (ఇదీ చదవండి: రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్) One and only Lady Super Star of South India cinema @MsAnushkaShetty ❤️🔥 Oka horror film tho max andhari hero la highest lepina legendary actress anushka !💥💥#15YearsForAnushkaArundhati pic.twitter.com/3XI8TGfR9O — Manjula Reddy (@Manju_Anushka) January 15, 2024 -
ఇండియాలోనే బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్.. ఒకేసారి 15-20 మంది తినేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: శాకాహారం మాత్రమే తినే తనపేరిట మాంసాహార బిర్యానీ రావడం సంతోషంగా ఉందని నటుడు సోనూసూద్ పేర్కొన్నారు. కొండాపూర్‌లోని జిస్మత్ జైల్ మండి రెస్టారెంట్లో శనివారం సోనూసూద్ ఇండియాస్ బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిది అడుగుల విస్తీర్ణంలో ఉండే బిగ్గెస్ట్ ప్లేట్ బిర్యానీని ఒకేసారి 15 నుంచి 20 మంది తినవచ్చన్నారు. ఈ సందర్భంగా జిస్మత్ మండి నిర్వాహకులు గౌతమి, ధర్మ, గౌతమ్‌లను ఆయన అభినందించారు. త్వరలో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, బెంగళూరులో బిగ్గెస్ట్ బిర్యానీ ప్లేట్‌ను సోనూసూద్‌తో అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు తెలిపారు. వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తా.. రాష్ట్రంలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తానని సినీ/చారిటీ స్టార్ సోనూసూద్ వెల్లడించారు. హైదరాబాద్‌తో తనకు దగ్గర అనుబంధం ఉందనీ, తన భార్య తెలుగు మహిళని తెలిపారు. నగరానికి చెందిన ఫిక్కీ లేడీస్ క్లబ్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆయన మహిళా వ్యాపారవేత్తలతో మాట్లాడారు. ఆయనేమన్నారంటే.. ‘కరోనా తీవ్రత తగ్గిపోయినా సమస్యలతో మమ్మల్ని సంప్రదించేవారు తగ్గలేదు. ప్రస్తుతం షిరిడీలో ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే తెలంగాణలో మరొకటి రానుంది. పంజాబ్‌లో దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి సమీప భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలోనూ వృద్ధాశ్రమం, ఓ ఉచిత పాఠశాల ఉండేలా చూడాలనేది మా కోరిక. చాలా రాజకీయ పార్టీలు నన్ను తమవైపు తిప్పుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించిన మాట వాస్తవమే. ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి నాకు లేదు. చిత్ర పరిశ్రమలో ఇంకా చాలా చేయాల్సి ఉంది. చెక్‌లు అందించి సాయం చేయడం మాత్రమే కాదు.. చెక్‌లు అందించి, చారిటీలు చేసే వారు చాలా మంది ఉన్నారు. అయితే పర్సనల్ టచ్ చాలా ముఖ్యం. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న బాలికను నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించాం. ఆమె సోదరుడు తోడుగా వచ్చాడు. కానీ, దురదృష్టవశాత్తూ ఆమెను రక్షించలేకపోయాం. ఆ తర్వాత ఆమె సోదరుడు కూడా మృతి చెందాడు. ఆమె తల్లిదండ్రులు తమ ఇద్దర్నీ కోల్పోయారు. దీంతో వీలైనప్పుడల్లా నాగ్‌పూర్‌లోని వారి తల్లిదండ్రులను కలవడం అలవాటు చేసుకున్నా. ఇదే నేను ఇష్టపడే పర్సనల్ టచ్.. అని సోనూసూద్ చెప్పారు. చదవండి: పబ్‌లు, ఫామ్‌హౌజ్‌లపై పోలీస్ రైడ్స్ -
ఇండియా-ఆసీస్ మ్యాచ్‌లో లైగర్.. సందడి చేసిన బాలీవుడ్ హీరో
భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సినీనటులు కూడా మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియాలకు క్యూ కడతారు. ఇటీవల హైదరాబాద్‌లో ఉప్పల్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో బాలీవుడ్, టాలీవుడ్ నటులు సందడి చేశారు. సోనూ సూద్‌తో కలిసి విజయ్ దేవరకొండ మ్యాచ్‌ను తిలకించారు. విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా ఉప్పల్ మ్యాచ్‌ను వీక్షించారు. వీరంతా టీమిండియాను సపోర్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇటీవల థియేటర్లలో విడుదలైన విజయ్ దేవరకొండ మూవీ లైగర్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూాడ నటుడే. టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించారు. టీమిండియా మ్యాచ్ చూస్తున్న వీడియో క్లిప్‌ను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆగస్టులో దుబాయ్‌లో ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన 2022 ఆసియా కప్ మ్యాచ్‌లోనూ విజయ్ దేవరకొండ సందడి చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన చివరిదైన మూడో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. THE #VijayDeverakonda Cheering & Clapping Along With @ananddeverkonda & @SonuSood Team INDIA 🇮🇳 ❤️🔥🤙@TheDeverakonda #INDvAUS pic.twitter.com/twUN8iI3Ug — Vijay Deverakonda Online Fans (@VDRowdiesOnline) September 25, 2022 -
సోనూసూద్‌కు దక్కిన అరుదైన గౌరవం
పర్లాకిమిడి(భువనేశ్వర్): కరోనా మహమ్మారి సమయంలో అనేక మంది వలస కార్మికులకు సహాయం చేసిన బాలీవుడ్ హీరో సోనూసూద్ ఒడిశాలో టైమ్స్ బిజినెస్ ఆవార్డును హైటెక్ మెడికల్ విద్యాసంస్థల చైర్మన్ డా.తిరుపతి పాణిగ్రాహి చేతుల మీదుగా ఆదివారం అందుకున్నారు. కార్యక్రమానికి ఒడిశా ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి విశాల్ దేవ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ కార్యదర్శి మనోజ్ కుమార్ మిశ్రా, ఒడిశా ఆర్సలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా డైరెక్టర్ టి.ఎస్.షన్బోగే తదితరులు హాజరయ్యారు. అనంతరం సీఎం నవీన్ పట్నాయక్ సోనూసూద్‌ను సన్మానించారు. -
ఒంటి కాలితో పాఠశాలకు వెళ్తున్న చిన్నారి వీడియో వైరల్
ఇంతవరకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన గాథలు విన్నాం. ప్రతికూల పరిస్థితులను దాటుకుంటూ పైకి వచ్చిన వారిని చూశాం. దివ్వాంగులు సైతం అందరివాళ్లలా అన్ని చేయగలమంటూ సాధించిన విజయాల గురించి విన్నాం. అలాంటి వారి కోవకు చెందినదే ఈ చిన్నారి కూడా. విధి మిగిల్చిన విషాదాన్ని పక్కనపెట్టి చక్కగా చదువుకునేందుకు తాపత్రయ పడుతోంది ఈ చిట్టితల్లి. వివరాల్లోకెళ్తే....బిహార్‌లోని జాముయి జిల్లాకు చెందిన సీమా అనే బాలిక ఒంటికాలితో పాఠశాలకు వెళ్తోంది. ఆ చిన్నారికి రెండేళ్లక్రితం జరిగిన ప్రమాదంలో ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. కానీ ఆ విషాదం ఆ చిన్నారి చదువుని ఆపలేకపోయింది. ఆ బాధను ఏ మాత్రం పట్టించుకోకుండా రోజు కి.మీ దూరంలో ఉన్న స్కూల్‌కి ఒంటికాలితోనే వెళ్తోంది. ఈ మేరకు ఆమె ఒంటి కాలుతో స్కూల్‌కి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆ చిన్నారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయన కరోనా సమయంలో ఎంతోమందికి సాయం చేసి అందరి ప్రశంసలను అందుకున్న సంగతి తెలిసిందే. సోనుసూద్ ట్విట్టర్లో "ఆ చిన్నారి ఇప్పుడు రెండు పాదాలపై పాఠశాలకు వెళుతుంది. నేను టిక్కెట్ పంపుతున్నాను. ఆ చిన్నారి రెండు కాళ్లపై నడిచే సమయం ఆసన్నమైంది" అంటూ తన ఎన్జీవ్ సూధా ఫౌండేషన్‌ని కూడా ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ఆ చిన్నారి వీడియో పలువురి ప్రముఖులను కదిలించింది. ఈ మేరకు బిహార్ ప్రభుత్వ భవన నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ అశోక్ చౌదరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ చిన్నారిని ప్రశంసించారు. సీమా లాంటి పిల్లలను గుర్తించి సాయం అందించడమే కాకుండా ఆ చిన్నారికి కూడా తగిన సాయం అందుతుందని చెప్పారు. Bihar: जमुई में एक पैर से 1KM का सफर तय कर स्कूल जाती है बिहार की ये बेटी एक हादसे में मासूम का काटना पड़ा था पैर, हौसला देख करेंगे सलाम pic.twitter.com/pc6vUV2iLb — News24 (@news24tvchannel) May 25, 2022 (చదవండి: చిరకాల కాంక్ష! ఒక వ్యక్తి జంతువులా మారడం కోసం ఏకంగా రూ.12 లక్షలు పెట్టి...) -
ఆసక్తిగా అక్షయ్ కుమార్ 'పృథ్వీరాజ్' ట్రైలర్..
Akshay Kumar Prithviraj Movie Trailer Released: ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిందీ సినిమాలలో పృథ్వీరాజ్ ఒకటి. బాలీవుడ్ యాక్షన్ హీరో టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ఇది. ఈ మూవీకి చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించగా సంజయ్ దత్, అశుతోష్ రాణా, సోనూ సూద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ ఈ సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేయనుంది. ఇటీవల విడుదలై ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మే 9న రిలీజ్ చేశారు మేకర్స్. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నిర్భయ, శక్తివంతమైన యోధుడు సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా రూపొందించారు. 2 నిమిషాల 50 సెకన్ల ఈ ట్రైలర్లో విజువల్స్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. శ్ రాజ్ ఫిల్మ్స్ ‘పృథ్వీరాజ్’తో మొదటిసారిగా చారిత్రక నేపథ్యమున్న సినిమాను రూపొందించడం విశేషం. చదవండి: అక్షయ్ కుమార్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్స్.. కారణమేంటంటే ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నన్ను కాదని సోనూసూద్ సోదరికి సీటిచ్చారు..! అందుకే బీజేపీలోకి..: కాంగ్రెస్ ఎమ్మెల్యే
చంఢీగడ్: రాష్ట్ర ఎన్నికలకు కొన్ని వారాల ముందు తనకివ్వవలసిన సీటును నటుడు సోనూసూద్ సోదరి మాళవికా సూద్‌కు ఇవ్వడం పట్ల అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్జోత్ కమల్ శనివారం బీజేసీ కండువ కప్పుకున్నారు. అనంతరం పంజాబ్‌లోని మోగా నుండి చంఢీగడ్‌లోని బీజేసీ ఆఫీస్‌కు చేరుకున్న కమల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల టికెట్ ఇవ్వకపోవడం నన్ను అవమానించడమేనని’ బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో అన్నారు. రాష్ట్రంలో మరో స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ అధీష్టానం తనను కోరిందని, కాంగ్రెస్ తనని అవమానించినట్టు భావించి తిరస్కరించానని చెప్పుకొచ్చారు. ‘మోగాను సందర్శించేందుకు సిద్ధూ సాహెబ్ వచ్చినప్పుడు కూడా మా ఇంటికి రాకుండా, నేరుగా మాళవికా సూద్ ఇంటికి వెళ్లాడన్నారు. కాంగ్రెస్ మాళవిక సూద్‌ను ఎంపిక చేసుకోవడం పట్ల నాకెటువంటి అభ్యంతరం లేదు. మోగా నుంచి నాకు సీటు ఇవ్వకపోవడమే నాకు బాధగా ఉంది. మాళవిక నాకు సోదరి లాంటిది. ఐతే ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండానే కేవలం సోనూ సూద్ సోదరి అయిన కారణంగా సీటు ఇచ్చారు. యూత్ కాంగ్రెస్ వర్కర్‌గా ప్రారంభించి, శిరోమణి అకాలీ దల్ కంచుకోటను బద్ధలు కొట్టి, మోగాలో కాంగ్రెస్ స్థాపనకు కఠోర శ్రమ పడ్డాను. దాదాపు 21 ఏళ్లగా కాంగ్రెస్‌కు చేసిన సేవ పార్టీ పట్టించుకోలేదని’ వాపోయారు. కాగా గత సోమవారం మాళవికా సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే! ఫిబ్రవరి 14 న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరగనుండగా, ఫలితాలు మార్చి 10 న వెలువడనున్నాయి. చదవండి: Omicron Alert: ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో లాక్డౌన్! -
యువ మహిళా షూటర్ కొనికా లాయక్ ఆత్మహత్య.. సుసైడ్ నోట్ రాసి..
కోల్‌కతా: జాతీయ స్థాయి షూటర్ కొనికా లాయక్ (26) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ యువ క్రీడాకారిణి ఆత్మహత్యకు పాల్పడటం తోటి క్రీడాకారులని దిగ్భ్రాంతికి గురిచేసింది. కోల్‌కతాలో తాను ఉంటున్న హాస్టల్లో కొనికా లాయక్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. షూటింగ్లో రాణించలేకపోతున్నా అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత నాలుగు నెలల్లో నలుగురు క్రీడాకారులు ఆత్మహత్య చేసుకున్నారు. 2021లో సోనూసూద్ రూ. 2.70 లక్షల విలువైన జర్మన్ రైఫిల్‌ను బహుమతిగా అందించడం ద్వారా ఈ క్రీడాకారిణీ వార్తల్లో నిలిచింది. కోనికా కోల్‌కతాలో మాజీ ఒలింపియన్, అర్జున అవార్డు గ్రహీత జోయ్‌దీప్ కర్మాకర్ వద్ద శిక్షణ పొందుతోంది. కోనికా లాయక్ జనవరిలో సోనూ సూద్‌ను ట్యాగ్ చేసి ఓ ట్వీట్ చేసింది. అందులో.. 11వ జార్ఖండ్ స్టేట్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో నేను రజతం, బంగారు పతకం సాధించాను. అయితే, ప్రభుత్వం నుంచి నాకు ఏమాత్రం సహాయం లేదు. దయచేసి సహాయం చేయండని ట్వీట్ చేసింది. తాను ఈ ట్వీట్‌ని సోనూ సూద్‌తో పాటు సంబంధిత మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ అధికారిని కూడా ట్యాగ్ చేసింది. में आपको राइफल दूंगा। आप देश को मेडल दे देना। आपकी rifle आप तक पहुंच जाएगी। @SoodFoundation https://t.co/4JFXdrQl2l — sonu sood (@SonuSood) March 10, 2021 చదవండి: Viral: మరీ ఇంత దారుణమా!.. సొంత చెల్లినే పెళ్లాడిన అన్న.. -
కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. సోనూకు అండగా ఉంటాం
-
Sonu Sood: చిక్కుల్లో సోనూసూద్!
సోనూ సూద్ నివాసాలు, కార్యాలయాల్లో జరుపుతున్న దాడులపై ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించారు. సోనూసూద్, అతని సహచరులు సుమారు రూ.20 కోట్లు పన్ను ఎగ్గోట్టారని ఐటీ శాఖ చెబుతోంది. అంతేకాదు Foreign Contribution (Regulation) Act నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఓ ఐటీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. సోనూసూద్ లెక్కలు చూపని ఆదాయాన్ని అనేక బోగస్ సంస్థల నుండి అసురక్షిత రుణాల రూపంలో తీసుకున్నట్లు చెప్పారు. I-T Dept conducted a search & seizure op at various premises of a prominent actor in Mumbai & also a Lucknow-based group of industries engaged in infrastructure development. 28 premises in Mumbai, Lucknow, Kanpur, Jaipur, Delhi, Gurugram covered: Central Board of Direct Taxes — ANI (@ANI) September 18, 2021 పన్నుల ఎగవేత ఆరోపణలకు సంబంధించి బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌పై శనివారం ఆదాయ పన్ను శాఖ దాడుల్ని మరింత ఉధృతం చేసింది. రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందంతో పాటు మరికొన్ని ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టిన అధికారులు సోనూసూద్ సంబంధం ఉన్న 28 ప్రాంతాల్లో మూడో రోజు సోదాల్ని కొనసాగిస్తున్నారు. ముంబై, లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) అధికారులు తెలిపారు. మండిపడ్డ ఆమ్ ఆద్మీ, శివ్ సేన గత బుధవారం నుంచి ఐటీ అధికారులు సోనూసూద్, అతని సహచరుల ఇళ్లల్లో జరుపుతున్న దాడులపై ఆమ్ ఆద్మీ, శివసేన పార్టీలు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలిచిన సోనూసూద్ టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఒకప్పుడు బీజేపీ సోనూ సూద్‌ని ప్రశంసించేది. కానీ ఢిల్లీ- పంజాబ్ ప్రభుత్వాలు అతనితో సత్సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో పన్ను ఎగవేతదారుడిగా ముద్రవేస్తుందని శివసేన వ్యాఖ్యానించింది. కాగా, మహమ్మారి సమయంలో వలస కార్మికుల్ని వారి స్వగ్రామాలకు చేర్చించిన విధానం జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రివాల్ సోనూని ఆప్ పార్టీ తరపున దేశ్ కా మెంటర్‌గా నియమించారు. అయితే ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్..,సోనూసూద్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. సత్య మార్గంలో లక్షలాది ఇబ్బందులు ఉన్నాయి, కానీ సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది. కష్టకాలంలో ఉన్న సోనుసూద్‌కి మద్దతుగా లక్షలాది కుటుంబాల ప్రార్థనలు ఉన్నాయని ట్వీట్ చేశారు. सच्चाई के रास्ते पर लाखों मुश्किलें आती हैं, लेकिन जीत हमेशा सच्चाई की ही होती है। @SonuSood जी के साथ भारत के उन लाखों परिवारों की दुआएं हैं जिन्हें मुश्किल घड़ी में सोनू जी का साथ मिला था। https://t.co/qsAyYvzkQP — Arvind Kejriwal (@ArvindKejriwal) September 15, 2021 Total 28 premises in Mumbai, Lucknow, Kanpur, Jaipur, Delhi and Gurugram were searched over two days. #SonuSood (HT) pic.twitter.com/9NXtnBQmVx — SaraSushant 🇮🇳 (@SaraSushant2021) September 18, 2021 IT 'survey' at Sonu Sood's premises. #SonuSood pic.twitter.com/Is1v6FHb05 — Satish Acharya (@satishacharya) September 16, 2021 -
సోనూసూద్ నివాసాలపై ఐటీ దాడులు
IT Department Raids on Actor Sonu Sood House in Mumbai: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఎంతో మంది వలస కార్మికులకు, పేద ప్రజలకు సాయం చేస్తూ రియల్ హీరోగా నిలిచాడు నటుడు సోనూసూద్. వలస కార్మికుల బాధలు చూడలేక సొంత ఖర్చుతో వారిని స్వస్థలాలకు చేర్చారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఆయన్ని పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మెంటార్షిప్ ప్రొగ్రామ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ తరుణంలో బుధవారం (సెప్టెంబర్ 15న) ముంబైలోకి ఆయన కార్యాలయాన్ని ఆదాయపు పన్ను శాఖ తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. ముంబై ఆఫీస్‌తో పాటు ఆయనకు చెందిన మరో ఆరు స్థలాల్లో కూడా ఏకకాలంలో తనిఖీ జరిగినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వ కార్యక్రమంలో బ్రాండ్ అంబాసిడర్‌గా చేరిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ పుకార్లు వచ్చాయి. కానీ సోనూసూద్ మాత్రం వీటిపై స్పందించడానికి నిరాకరించాడు. కాగా ఎన్నో మంచి సినిమాలు చేసిన బాలీవుడ్‌తో పాటు ఇతర సౌత్ ఇండియా సినీ పరిశ్రమల్లో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. -
ఆత్మకూరులో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం .. వర్చువల్ గా పాల్గొన్న సోనూసూద్
-
సోనూసూద్‌పై ప్రేమతో టీవీ పగలగొట్టిన బుడ్డోడు.. నటుడి స్పందన
-
కేటీఆర్ ను కలిసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్
-
'నా గర్ల్‌ఫ్రెండ్ ఐఫోన్ అడుగుతుంది.. సోనూభాయ్ హెల్ప్ చేస్తారా'?
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి తన వంతు సాయమందిస్తూ రియల్ హీరో అయిపోయాడు నటుడు సోనూసూద్. ఎవరు ఏ సాయం కావాలని అడిగినా వెంటనే నేనున్నానంటూ వారికి భరోసా కల్పిస్తున్నాడు. నేటికీ ప్రతిరోజూ వేలమంది సోషల్ మీడియా వేదికగా ఆయన్ను సాయం కోసం ఆశ్రయిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ టైంపాస్ మెసేజ్‌లు చేస్తున్నారు. తాజాగా ఓ యూజర్..'భాయ్.. నా గర్ల్‌ఫ్రెండ్ ఐఫోన్ కొనివ్వమని అడుగుతుంది..మీరు ఏమైనా సహాయం చేస్తారా' అంటూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన సోనూసూద్...'అది అవుతుందో లేదో కానీ ఐఫోన్ కొనిస్తే నీ దగ్గర మాత్రం ఏదీ మిగలదు' అంటూ ఫన్నీగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి టైంపాస్ మెసేజ్‌లు ఎందుకు చేస్తారంటూ కొందరు నెటిజన్లు ఆతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, సోనూ భాయ్ భలే ఆన్సర్ ఇచ్చారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.కాగా గతేడాది లాక్డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మిలకు సోనూసూద్ సొంత ఖర్చులతో ఇళ్లకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఏ కష్టమొచ్చిన సాయం అందిస్తూ పేదల పాలిట దేవుడిగా మారాడు. उसका तो पता नहीं, अगर iphone दिया तो पर तेरा कुछ नहीं रहेगा😂 https://t.co/t99rnT8z22 — sonu sood (@SonuSood) June 22, 2021 చదవండి : కొడుక్కి రూ.3 కోట్ల ఖరీదైన బహుమతి: సోనూసూద్ క్లారిటీ! హృదయం ముక్కలైంది.. సోనూసూద్ ఎమోషనల్ -
"సోనుసూద్ అంబులెన్స్" సేవలకు శ్రీకారం..
-
మనసున్న మారాజు
-
సోనూ ఉండుంటే ఆ సినిమా మరోస్థాయిలో ఉండేది
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముందుగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సదాశివ్ పాత్రలో నటించేందుకు అంగీకరించగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక మధ్యలో సినిమా నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దర్శకుడు క్రిష్‌తో కలిసి తన సిక్స్ ప్యాక్‌తో కండల వీరుడిగా, గంభీరంగా నడుస్తున్న సోనూ గెటప్ అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటోంది. దీనికి 'జీవితంలో మంచి కోసం నడవండి... ఏదో ఒక రోజు మీరు సాధిస్తారు' అనే క్యాప్షన్‌తో ఫొటో షేర్ చేశారు. ఈ ఫొటో చూసిన ప్రేక్షకులు సోనూ సినిమాలో నటించి ఉంటే మణికర్ణిక మరో స్థాయిలో ఉండేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తప్పుకోవడంపై అప్పట్లో కొన్ని రూమర్స్ వినిపించాయి. చిత్రంలో మార్పులు చేయాలని, సోనూసూద్ పాత్రను తగ్గించాలని కంగనా వాదించడంతో క్రిష్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత కంగన స్క్రిప్టులో మార్పులు చేశారనే ప్రచారం జరిగింది. (సోనూసూద్‌కి ఐరాస అవార్డ్) View this post on Instagram Walk towards the good in life and one day you will arrive ❣️#throwback A post shared by Sonu Sood (@sonu_sood) on Oct 4, 2020 at 7:43am PDT -
చిన్నారికి సోనూ సూద్ భరోసా
డోర్నకల్: కరోనా కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్న సినీ నటుడు సోనూసూద్‌ను ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ఓ కథనం కదిలించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన దేశబోయిన నాగరాజు, శ్రీలక్ష్మి దంపతుల కుమారుడు హర్షవర్థన్ (06) లివర్ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. ఆయనకు లివర్ మార్పిడి చేయాలని, ఇందుకోసం రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఈ విషయాన్ని గత నెల 22న ‘సాక్షి’వరంగల్ టాబ్లాయిడ్లో ‘చిన్న వయస్సు.. పెద్ద జబ్బు’ఆరేళ్ల బాలుడికి లివర్ సమస్య’శీర్షికన కథనం ప్రచురితమైంది. అయితే, మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న హర్షవర్ధన్ తండ్రి నాగరాజు అంత మొత్తం వెచ్చించలేని పరిస్థితి ఉంది. తన సహచర ఉద్యోగులు రూ.2 లక్షల వరకు సమకూర్చారు. అయినా హర్షవర్ధన్ చికిత్సకు పెద్ద ఎత్తున డబ్బు అవసరముంది. దీంతో మహబూబాబాద్ డిపో కండక్టర్ల ఐక్య వేదిక ఆధ్వర్యాన నాగరాజు, శ్రీలక్ష్మి దంపతులు గురువారం హైదరాబాద్‌లో షూటింగ్‌కు వచ్చిన సినీ నటుడు సోనూసూద్‌ను కలిశారు. హర్షవర్థన్ ఆరోగ్య పరిస్థితిని వివరించడంతో పాటు ‘సాక్షి’క్లిప్పింగ్‌ను ఇవ్వగా, అక్కడే ఉన్న నటులు బ్రహ్మాజీ, శ్రీనివాస్‌రెడ్డి తెలుగు కథనాన్ని సోనూసూద్‌కు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన.. హర్షవర్ధన్ లివర్ మార్పిడి కోసం జరిగే శస్త్రచికిత్స అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తానని హామీ ఇచ్చారు. అక్కడికక్కడే అపోలో ఆస్పత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడి అవసరమైన వైద్యసాయం అందించాలని సోనూసూద్ కోరారు. దీంతో హర్షవర్థన్ తల్లిదండ్రులు నాగరాజు, శ్రీలక్ష్మి, ఆర్టీసీ కండక్టర్ల ఐక్య వేదిక నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
వారందరికీ సోనూసూద్ విజ్ఞప్తి
ముంబై: సోనూసూద్ ఇప్పుడు సాయానికి మారుపేరు లాగా మారిపోయాడు. ఎవరికి ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ వారికి సాయం చేస్తున్నాడు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులను వారి ఇంటికి పంపించి మానవత్వాన్ని చాటుకున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక రైతుకు ట్రాక్టర్ కొనిచ్చాడు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సాయాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు సోనూసూద్ ఒక విజ్ఞప్తి చేశాడు. ఎవరైనా సాయం చేయగలిగిన వారు ఉంటే ఒక రోగిని దత్తత తీసుకోని వారి వైద్య భారాన్ని అంతా మొత్తం భరించాలని కోరారు. అలా చేస్తే పేదరికం సగం పోతుంది అని చెప్పారు. వీలైనంత మంది సాయం చేయాలని అని సోనూసూద్ కోరారు. చదవండి: ‘సోనూ సూద్ పీఎస్4 కావాలి ప్లీజ్’ -
సోనూసూద్ పుట్టినరోజు: 3 లక్షల ఉద్యోగాలు
ముంబై: వెండితెరపై ఆయన భయంకరమైన విలన్. కానీ రియల్‌గా మాత్రం మంచి మనుసున్న వ్యక్తి. కష్టాల్లో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళ్లి చేయూత అందిస్తున్న రియల్ హీరో నటుడు సోనూసూద్. ఈ రోజు (గురువారం) జూలై 30 ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా వలస కార్మికులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. వారిని ఆదుకునేందుకు మరో ముందడుగుడు వేశాడు. కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు తన జన్మదినం కానుకగా 3 లక్షల ఉద్యోగాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘‘నా పుట్టిన రోజు సందర్భంగా ప్రవాస సోదరులకు ప్రవాసిరోజ్‌గర్.కామ్‌లో 3 లక్షల ఉద్యోగాలకు ఒప్పందం కుదుర్చుకున్నాను. మంచి వేతనం, పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఇతర సదుపాయలు కూడా అందుతాయి’’ అంటూ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఇప్పటికే లాక్డౌన్లో వలస జీవులను తన సొంత ఖర్చుతో రవాణా సౌకర్యం కల్పించి గ్రామాలకు చేర్చిన విషయం తెలిసిందే. (చదవండి: భావోద్వేగం, సోనూ సూద్ కంటతడి!) मेरे जन्मदिन के अवसर पे मेरे प्रवासी भाइयों के लिए https://t.co/UWWbpO77Cf का 3 लाख नौकरियों के लिए मेरा करार। ये सभी अच्छे वेतन, PF,ESI और अन्य लाभ प्रदान करते हैं। धन्यवाद् AEPC, CITI, Trident, Quess Corp, Amazon, Sodexo, Urban Co , Portea और अन्य सभी का।#AbIndiaBanegaKamyaab pic.twitter.com/rjQ0rXnJAl — sonu sood (@SonuSood) July 30, 2020 ఈ విషయంలో తనకు మద్దతుగా వచ్చిన పలు సంస్థలు ధన్యవాదాలు తెలిపాడు. లాక్డౌన్లో వలస కార్మికులను తమ సొంతూళ్లకు చేర్చిన సోనూసూద్ ఆ తర్వాత కూడా నిరంతరాయంగా సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ పేద రైతు తన ఇద్దరూ కూతుళ్లతో పొలం దున్నుతూ కష్టపడుతున్న వీడియోకు చలించిన ఆయన ఏకంగా ట్రాక్టర్‌ను కొని పంపించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన టీవీ నటుడి చికిత్సకు డబ్బు సాయం చేశాడు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటున్న హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శారదకు ఉద్యోగం కూడా ఇప్పించాడు. ఇలా కష్టాల్లో ఉన్నవారికి తోచినంత సాయం చేస్తూ సోనూసూద్ అందరి మన్ననలు పొందున్నాడు. (చదవండి: చిరునవ్వుతో నమస్కరించాలి: సోనూసూద్) -
సోనూసూద్ కంటతడి!