
సోనూసూద్
‘‘పూర్వకాలంలో రాజులు అంత భారీ కిరీటాలు, బరువైన అభరణాలు ఎలా ధరించారా? అని నాకు ఆశ్చర్యంగా ఉంది. సినిమా కోసం ఆభరణాలు ధరించడానికే నాకు సుమారు గంటాగంటన్నర సమయం పట్టేది’’ అంటున్నారు సోనూసూద్. కన్నడ చిత్రం ‘కురుక్షేత్ర’లో ఆయన అర్జునుడి పాత్రను పోషిస్తున్నారు. దర్షన్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ పాత్ర గురించి సోనూ సూద్ మాట్లాడుతూ – ‘‘పౌరాణిక సినిమాలో నటించడం నాకు సరికొత్త అనుభవం. ఈ సినిమా కోసం ఏర్పాటు చేసిన సెట్లు, గుర్రాలు, యుద్ధ వాతావరణంలో 600 మంది ఆర్టిస్టులను చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి సినిమా చేయడం మర్చిపోలేని అనుభూతి’’ అన్నారు. ‘కురుక్షేత్ర’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment