ప్రముఖ సింగర్ దర్శన్ రావల్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలు ధరల్ సురేలియాను ఆయన పెళ్లాడారు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు సింగర్. ఈ వివాహా వేడుకలో బంధువులతో పాటు సన్నిహితులు కూడా పాల్గొన్నారు.
తాజాగా సింగర్ దర్శన్ రావల్ తన పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. సింగర్ దర్శన్ పలు సూపర్ హిట్ సినిమాలకు తన గాత్రాన్ని అందించాడు.
దర్శన్ కెరీర్..
దర్శన్ రావల్ 2014లో ఇండియాస్ రా స్టార్ మొదటి సీజన్‌లో పాల్గొన్నాడు. ఆషోలో ఒడిశాకు చెందిన రితురాజ్ మొహంతి చేతిలో ఓడిపోయాడు. ఆ తరవాత ది టాలెంట్ హంట్ షో అతనికి మంచి వేదికను ఇచ్చింది. అప్పటి నుంచి బాలీవుడ్‌లో ప్లేబ్యాక్ సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. 2015లో షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన హిమేష్ రేష్మియాకు ధన్యవాదాలు. లవ్‌యాత్రి చిత్రంలోని చోగడ పాటతో అతనికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత షేర్షా చిత్రం నుంచి కభీ తుమ్హే, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీలోని ధిండోరా బజే రే, ఇష్క్ విష్క్ రీబౌండ్ సినిమా నుంచి సోనీ సోని లాంటి సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా గుజరాతీలో పాటలు కూడా పాడారు. తెలుగు హీరో నాని నటించిన జెర్సీ చిత్రంలోని నీదా పదధాని అనే తెలుగు సాంగ్‌ను అలపించారు దర్శన్ రావల్.
Comments
Please login to add a commentAdd a comment