kurukshethra
-
రామ్‌లల్లా శిల్పికి శ్రీకృష్ణ విగ్రహం ఆర్డర్!
అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహానికి రూపాన్ని ఇచ్చిన కళాకారుడు యోగిరాజ్ ఇప్పుడు కురుక్షేత్రలో శ్రీ కృష్ణుని భారీ విగ్రహాన్ని తయారుచేసేందుకు సిద్ధం అవుతున్నారు. మహాభారత సమయంలో అర్జునునితో సంభాషిస్తున్న శ్రీ కృష్ణుని భారీ రూపాన్ని యోగిరాజ్ తీర్చిదిద్దనున్నారు. శ్రీరాముని విగ్రహం తరహాలోనే ఈ విగ్రహాన్ని కూడా నేపాల్‌లోని గండకీ నది నుంచి సేకరించిన శాలిగ్రామశిలతో తయారు చేయనున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలో గల బ్రహ్మసరోవర్ ఒడ్డున నిర్మితమవుతున్న 18 అంతస్తుల జ్ఞాన మందిరంలోని గర్భగుడిలో యోగిరాజ్ రూపొందించే శ్రీ కృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మూడు ఎకరాల స్థలంలో 18 అంతస్తుల జ్ఞాన మందిరాన్ని నిర్మిస్తున్నట్లు శ్రీ బ్రహ్మపురి అన్నక్షేత్ర ట్రస్ట్ జ్ఞాన మందిర్ వ్యవస్థాపకులు స్వామి చిరంజీవ్పురి మహారాజ్ తెలిపారు. ఆలయ గర్భగుడిలో అర్జునునికి సందేశం ఇస్తున్న రీతిలో శ్రీ కృష్ణుని భారీ విగ్రహాన్ని తయారు చేయనున్నారు. ఇందుకోసం శిల్పి అరుణ్ యోగిరాజ్‌తో ఇప్పటికే చర్చలు జరిగాయి. త్వరలోనే శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ ఆలయాన్ని సందర్శించనున్నారు. శిల్పి అరుణ్ యోగిరాజ్.. శ్రీకృష్ణుని విగ్రహ తయారీకి అంగీకరించిన నేపధ్యంలో గండకీ నది నుంచి ప్రత్యేక శాలిగ్రామ రాయిని తీసుకురావడానికి ట్రస్ట్ నేపాల్‌ను సంప్రదిస్తోంది. ప్రస్తుతం ఈ ఆలయం నిర్మాణ దశలో ఉంది. 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. 18 అంతస్తుల జ్ఞాన మందిరం అనేక ప్రత్యేకతలతో కూడి ఉంటుంది. గీతలోని 18 అధ్యాయాలు, 18 అక్షోహిణి సేన, 18 రోజుల మహాభారత యుద్ధం, కురుక్షేత్రంలో పవిత్ర సరస్వతి నది రూపం కూడా ఈ ఆలయంలో కనిపించనుంది. -
పూజల పార్టీ బీజేపీ
కురుక్షేత్ర: సమాజంలో పెచ్చరిల్లుతున్న విద్వేషం, పెరిగిపోతున్న భయంతోపాటు నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేపట్టినట్లు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలియజేశారు. పాదయాత్రను ఒక తపస్యగా భావిస్తున్నామని చెప్పారు. పాదయాత్ర అనేది నిరాడంబరతను సూచిస్తుందని, ఇదొక ధ్యానం లాంటిదేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తపస్యను నమ్ముతోందని, అధికార బీజేపీ ఒక పూజల సంస్థ అని విమర్శించారు. తపస్యపై బీజేపీ, ఆర్ఎస్ఎస్కు ఏమాత్రం గౌరవం లేదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కే ప్రజలంతా పూజలు (ఆరాధన) చేయాలని అవి కోరుకుంటున్నాయని ఆక్షేపించారు. బలవంతంగానైనా జనంతో పూజలు చేయించుకోవాలని ప్రధాని మోదీ ఆశిస్తున్నారని మండిపడ్డారు. జర్నలిస్టుల తపస్య అంటే మోదీకి భయమని, అందుకే మీడియా ముందుకు రావడానికి జంకుతున్నారని దుయ్యబట్టారు. హరియాణాలో పాదయాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ ఆదివారం మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటం అనేది తపస్య కోసం జరిగిన యుద్ధమని అన్నారు. ఆ సమయంలో బీజేపీ/ఆర్ఎస్ఎస్ పెద్దలు బ్రిటిష్ పాలకులకు పూజలు చేశారని ఎద్దేవా చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పూజల ప్రభావాన్ని ఎదిరించడానికి లక్షలాది మంది నేడు కాంగ్రెస్ పార్టీతో కలిసి తపస్యలో నిమగ్నమయ్యారని ఉద్ఘాటించారు. హిందూ దేవుళ్ల అభయ ముద్ర నుంచే కాంగ్రెస్ పార్టీ గుర్తు (హస్తం) పుట్టిందని రాహుల్ అన్నారు. తాను ఒక తపస్వినని చెప్పారు. ఇకపైనా తపస్విగానే కొనసాగుతానని వివరించారు. తన యాత్ర రాజకీయ పోరాటం కాదని స్పష్టంచేశారు. బీఎస్సీ లేదా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)కు వ్యతిరేకంగా పోరాడితే అది రాజకీయ పోరాటం అవుతుందన్నారు. తమది ధర్మం కోసం సాగుతున్న సిద్ధాంతపరమైన పోరాటమని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల దేశంలో రైతన్నలు కష్టాల ఊబిలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
మరో బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ఛండీగడ్ : కరోనా..సామాన్య ప్రజానీకం నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఈ వైరస్ బారిన పడగా తాజాగా హర్యానా బీజేపీ ఎమ్మెల్యేకు కూడా కరోనా సోకింది. కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్ నియోజవర్గ శాసన సభ్యుడు సుభాష్ సుధా గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. గురుగ్రావ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన వ్యక్తిగత సహాయకుడు అరుణ్ గులాటి మీడియాకు వెల్లడించారు. దీంతో సుభాష్ సుధా కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్‌కు తరలించారు. కాగా జూన్ 21న సూర్యగ్రహణం నాడు బ్రహ్మ సరోవర్ ఒడ్డున నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్ పాల్గొన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో సాధువులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులతో సహా దాదాపు 200 మంది సమావేశమయ్యారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో వీరందరినీ ట్రేస్ చేసే పనిలో యంత్రాంగం సంసిద్దమైంది. వీరెవరిని కలిశారో అన్న దానిపై కూడా వివరాలు సేకరిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. (మోసపోయిన మన్మోహన్ మాజీ సలహాదారు ) కురుక్షేత్ర జిల్లాలోనే ఇప్పటివరకు 115 కరోనా కేసులు నమోదవగా రాష్ర్ట వ్యాప్తంగా 13,829 కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లోనే 402 కొత్త కోవిడ్ కేసులు వెలుగు చూశాయని హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. హర్యానా రాష్ర్ట వ్యాప్తంగా రికవరీ రేటు 64.48% ఉండగా ప్రస్తుతం 4,689 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది. (ఉగ్రవాదరహిత జిల్లాగా అవతరించిన దోడా ) -
జామ్ తయారీలో ప్రధానమైనది అదే..!
వండడం వస్తే... వంటశాలను మించిన ప్రయోగశాల మరొకటి ఉండదు. ఫుడ్ బిజినెస్‌ను మించిన ఉపాధి మరెక్కడా ఉండదు. హర్యానాలోని కురుక్షేత్రలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ చేసి, ఆ తర్వాత గుజరాత్‌లోని ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఇన్ ఆనంద్’ లో ఎంబీఏ చేసిన సౌమీ ఇదే విషయాన్ని నిరూపించింది. చదువు పూర్తయిన తర్వాత సౌమీ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఉద్యోగం చేసింది. ఐదేళ్ల కిందట బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి స్థాయి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారింది. తనను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చిన ఘనత కూతురికే దక్కుతుందని కూడా చెబుతోంది సౌమీ. సౌమీకి ఉద్యోగం, ఇల్లు, పాపాయిని చూసుకోవడంలో రోజంతా సరిపోయేది. పాపాయికి చిరుతిండి కోసం మార్కెట్లో దొరికే జామ్‌ల మీదనే ఆధారపడక తప్పేది కాదు. ప్యాక్ చేసిన ఆహారంలో, అవి నిల్వ ఉండడం కోసం తయారీదారులు ప్రిజర్వేటివ్‌లు వాడతారు. ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఫుడ్‌కలర్స్ కూడా వాడుతారు. అవన్నీ ప్రభుత్వ ఆహార నియంత్రణ విభాగాలు నిర్దేశించిన మోతాదులోనే ఉంటాయి. కానీ సౌమీ పాపాయి ఆ మేరకు కృత్రిమత్వాన్ని కూడా భరించలేకపోయేది. ఆ జామ్‌లను తింటే అలర్జీ వచ్చేసేది. పైగా పాపాయి జామ్‌లను ఇష్టంగా తినేది. ఇంట్లో జామ్ లేకపోతే మరొకటి ఏదైనా తింటుందని ఒక ప్రయత్నం చేసింది సౌమీ. జామ్ కోసం పాపాయి మంకుపట్టు పడుతోంది తప్ప మరొకటి తినడం లేదు. దాంతో సౌమీ తనే జామ్ తయారు చేసింది. ఇల్లంతా జామ్ బాటిళ్లే! జామ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కృత్రిమమైన ప్రిజర్వేటివ్‌లను, రంగులను కలపకుండా సహజమైన జామ్‌ను చేసింది సౌమీ. మొదటిసారి ఆమె చేసింది స్ట్రాబెర్రీ జామ్. ఆ ప్రయత్నం సక్సెస్ అయింది. పాపాయి ఇష్టంగా తింటోంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యంగా ఉంటోంది. దాంతో సౌమీ ఇంటర్నెట్లో రకరకాల పండ్లతో జామ్‌లను ఎలా చేయాలో నేర్చుకుంది. ఇంట్లో జామ్ బాటిళ్లు వరుసగా బారులు తీరాయి. ఇంటికి వచ్చిన వాళ్లకు గర్వంగా రుచి చూపించేది సౌమీ. రుచి చూసి ప్రశంసించిన వారికి ఒక్కో బాటిల్ ఇచ్చి పంపేది. ప్రతిసారీ ఫ్రీగా తీసుకోవడానికి మొహమాట పడిన స్నేహితులు, బంధువులు ‘ఏదో ఒక ధర నిర్ణయించ’మని సౌమీ మీద ఒత్తిడి తెచ్చారు. ఇదంతా ఆరేళ్ల నాటి సంగతి. 2015లో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి సౌమీ సొంత స్టార్టప్ మొదలుపెట్టింది. తన ఉత్పత్తులకు ‘యమ్మీయమ్’ అనే పేరు పెట్టింది. జామ్‌లతోపాటు పచ్చళ్ల తయారీ కూడా మొదలు పెట్టింది. ఇప్పుడామె ‘స్మాల్ బిజినెస్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్’గా విజయవంతమైన పారిశ్రామిక వేత్తల జాబితాలోకి చేరింది. జామ్‌తో పాటు పచ్చళ్లూ ‘‘రెడీ మేడ్ ఫుడ్‌తో నా పాపాయికి అలర్జీ వస్తున్న కారణంగా నేనీ ప్రయత్నాన్ని మొదలు పెట్టాను. జామ్ తయారీని పరిశ్రమగా మలుచుకున్నప్పటికీ నాలో తల్లి అలాగే ఉంటుంది. పిల్లల సున్నితమైన కడుపుకు ఇబ్బంది కలిగించే ఏ పదార్థాలనూ దగ్గరకు కూడా చేరనివ్వను. జామ్ తయారీలో ప్రధానమైన పని పండ్లను శుభ్రం చేయడం, తరగడమే. రాత్రంతా చక్కెరలో నానపెట్టిన తర్వాత మరుసటి రోజు ఆ పండ్లను అరగంట నుంచి ముప్పావు గంట సేపు ఉడికించాలి. ఇలా చేస్తే ఇక వాటిని నిల్వ చేయడం కోసం కృత్రిమ ప్రిజర్వేటివ్‌ల మీద ఆధారపడాల్సిన అవసరమే ఉండదు’’ అని తన విజయరహస్యాన్ని తెలియచేసింది సౌమీ. ‘‘యమ్మీమమ్ జామ్, పచ్చళ్ల పరిశ్రమలో నా ప్రయత్నం సక్సెస్‌బాట పట్టిన తర్వాత నా భర్త గోపాల్ కూడా తన ఉద్యోగాన్ని వదిలేసి మార్కెటింగ్ పనులు చూసుకుంటున్నారు. సాధారణ ఉద్యోగులుగా ఉన్న మమ్మల్ని వ్యాపారవేత్తలుగా మార్చేసింది మా అమ్మాయి’’ అంటూ నవ్వుతోంది సౌమీ. – మంజీర -
హిట్ సినిమాకు పైరసీ విలన్
ఎంత హిట్ సినిమా అయినా థియేటర్లలో ఆడితేనే నిర్మాతలకు కాస్త లాభం దక్కుతుంది. కానీ విడుదలకు ముందే, లేదా విడుదలైన కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్లో ఆ సినిమా ప్రత్యక్షమైతే నిర్మాతలకు భారీ నష్టం, హీరో, దర్శకులు పడిన కష్టం గంగపాలు అవుతుంది. తెలుగు, తమిళం, మలయాళం సినిమా రంగాలను వెంటాడిన పైరసీ భూతం ఇక ఇప్పుడు కన్నడ సినిమా రంగాన్నీ పీడిస్తోంది. ఈ పైరసీ భూతం వల్ల భారీ బడ్జెట్ సినిమాలకు పెను ఆటంకంగా మారింది. పోకిరీలు, ఆన్లైన్ నేరగాళ్లు గత ఆరేడు నెలల్లో హిట్ సినిమాలను పైరసీ చేసి ఆన్లైన్లో, సోషల్ మీడియాలో పెట్టడం వల్ల శాండల్‌వుడ్‌కు సుమారు రూ. 20 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు సినీవర్గాల అంచనా. దీంతో ఇప్పుడిప్పుడే పైరసీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభమైంది. పలు సినిమాలకు ఆటంకం కేజీఎఫ్, యజమాన, కురుక్షేత్ర, పహిల్వాన్ తదితర కన్నడ చిత్రాలు పైరసీకి గురయి కలెక్షన్లను పోగొట్టుకున్నాయి. పైరసీని నివారించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో నిలువరించడం సాధ్యం కావడం లేదు. దీంతో కన్నడ చలనచిత్ర పరిశ్రమ పెద్దలకు దిక్కుతోచడం లేదు. కోట్లాది రూపాయలు పోసి సినిమా నిర్మిస్తే అది థియేటర్లకు చేరడానికి ముందే ఇంటర్నెట్లో దర్శనమివ్వడం, దాంతో కలెక్షన్లు పడిపోవడం దర్శక నిర్మాతలను ఇబ్బంది పెడుతోంది. సైబర్ క్రైంకు ఫిర్యాదుల వెల్లువ పైరసీపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసు అధికారులకు ఫిర్యాదులు వెల్లువలా అందుతున్నాయి. పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నా పూర్తిస్థాయిలో నిలువరించలేకపోతున్నారు. పైరసీ నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులపై కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ఒత్తిడి చేస్తోంది. ఇటీవల విడుదలైన పహిల్వాన్ చిత్రం పైరసీ కారణంగా సుమారు రూ. 5 కోట్లకు పైగా నష్టాన్ని మూటగట్టుకుందని సినిమా నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శన్ నటించిన యజమాన, కురుక్షేత్ర సినిమాలతో పాటు యష్ నటించిన కేజీఎఫ్ సినిమా కూడా పైరసీ బారిన పడ్డాయి. పైరసీ విషయంలో న్యాయ నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి సలహాలు తీసుకోవాలని కర్ణాటక వాణిజ్య మండలి నిర్ణయించింది. ఆ బృందం ఇచ్చే సలహాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాలని తీర్మానించింది. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక బృందాన్ని సిద్ధం చేసే పనిలో వాణిజ్య మండలి పడింది. మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను కలసి పైరసీ నిందితులను కఠినంగా శిక్షించాలని ఒత్తిడి చేయాలని నిర్ణయించింది. -
అంతా ఆశ్చర్యమే!
‘‘పూర్వకాలంలో రాజులు అంత భారీ కిరీటాలు, బరువైన అభరణాలు ఎలా ధరించారా? అని నాకు ఆశ్చర్యంగా ఉంది. సినిమా కోసం ఆభరణాలు ధరించడానికే నాకు సుమారు గంటాగంటన్నర సమయం పట్టేది’’ అంటున్నారు సోనూసూద్. కన్నడ చిత్రం ‘కురుక్షేత్ర’లో ఆయన అర్జునుడి పాత్రను పోషిస్తున్నారు. దర్షన్ ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ పాత్ర గురించి సోనూ సూద్ మాట్లాడుతూ – ‘‘పౌరాణిక సినిమాలో నటించడం నాకు సరికొత్త అనుభవం. ఈ సినిమా కోసం ఏర్పాటు చేసిన సెట్లు, గుర్రాలు, యుద్ధ వాతావరణంలో 600 మంది ఆర్టిస్టులను చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి సినిమా చేయడం మర్చిపోలేని అనుభూతి’’ అన్నారు. ‘కురుక్షేత్ర’ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజ్ కానుంది. -
పర్యాటకం ఓట్లు రాల్చేనా?
కురుక్షేత్ర.. పురాతన ఆలయాలకు నిలయం. చారిత్రక ప్రాధాన్యత గల 1200 ఏళ్ల నాటి దేవాలయం కూడా ఉందిక్కడ. ఈ నేపథ్యంలో నగరాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది బీజేపీ సర్కారు. ప్రైవేటు రంగ పెట్టుబడులకు అవకాశం కల్పించడం ద్వారా నగరాభివృద్ధికి బాటలు వేసింది. దీంతో కురుక్షేత్ర రూపురేఖలే మారిపోయాయి. నిత్యం ఇక్కడకొచ్చే పర్యాటకులు నాలుగేళ్లతో పోల్చుకుంటే రెట్టింపును మించిపోయారు. హరియాణాలోని 10 లోక్‌సభ నియోజకవర్గాల్లో కురుక్షేత్ర ఒకటి. మే 12న జరిగే ఎన్నికలో ఈ నగరాభివృద్ధి బీజేపీకి ఒక అనుకూలాంశమైంది. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా వున్న నయాబ్ సింగ్ సైనీ.. ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలా కుమారుడైన 26ఏళ్ల అర్జున్ చౌతాలాతో తలపడుతున్నారు. మాజీ మంత్రి నిర్మల్ సింగ్‌ను కాంగ్రెస్ పోటీకి పెట్టింది. ఈ నాలుగేళ్ళలో కురుక్షేత్ర స్వచ్ఛ నగరంగా మారింది. మల్టీప్లెక్సులు నగరానికి సరికొత్త ఆకర్షణగా నిలుస్తున్నాయి. బహుళజాతి బ్రాండెడ్ ఉత్పత్తులు దొరుకుతున్నాయి. దీంతో నగరం పర్యాటకంగా అభివృద్ధి అవుతోంది.. అంటున్నారు యువతీయువకులు. ఈ నియోజకవర్గంలోని సోనిపట్, పానీపట్, కర్నాల్‌లో కురుక్షేత్ర తరహా మార్పులు కనిపించకపోయినా, అక్కడి యువత కూడా మోదీపైనే మొగ్గు చూపుతోంది. కురుక్షేత్రలో వెనుకబడిన కులాల ఆధిపత్యం కొనసాగుతోంది. 2016లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం జాట్లు జరిపిన ఆందోళనతో ఈ ప్రాంతం యుద్ధ క్షేత్రమైంది. -
నిజాయితీపరులకు చౌకీదార్‌ను: మోదీ
కురుక్షేత్ర: దేశంలో అవినీతిని అంతం చేసేం దుకు తమ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. అవినీతిపరులకు తనతో సమస్య ఉందన్న ఆయన.. నిజాయితీపరులు మాత్రం కాపలా దారు (చౌకీదారు)గా తనను నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా ఈ ఏడాది అక్టోబరు 2 నాటికి దేశాన్ని బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చ డంలో గ్రామీణ మహిళల నాయకత్వ పాత్రను గుర్తించే కార్యక్రమం ‘స్వచ్ఛ్‌శక్తి–2019’ మంగళవారం కురుక్షేత్రలో జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. హర్యానాలోని అవినీతిపరులపై ప్రస్తుతం సాగుతున్న దర్యాప్తులతో కొందరు కలవరం చెందుతున్నారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏర్పాటు చేసిన మహా కూటమిని కల్తీ కూటమి (మహా మిలావత్)గా అభివ ర్ణించిన ఆయన.. ‘కల్తీ కూటమిలోని నేతలంతా కలిసి కోర్టులను, మోదీని, దర్యాప్తు సంస్థలను దూషించడం, బెదిరించడంలో పోటీలు పడు తున్నారు. కానీ, ఈ చౌకీదారు వారి దూష ణలు, బెదిరింపులకు అదరడు బెదరడు, ఆగ డు, లొంగడని మీకు తెలుసు. దేశానికి పట్టిన అవినీతి మరకలు, బురదను తొలగించే శుద్ధి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తాం. అందుకు మున్ముందు కూడా మీ ఆశీస్సులు కావాలి’ అని ప్రధాని మోదీ కోరారు. -
ఊహించని మలుపులు
తెలుగులో ఈ ఏడాది రిలీజైన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అభిమన్యుడు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు యాక్షన్ హీరో అర్జున్. అరుణ్ వైధ్యనాథన్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన తమిళ చిత్రం ‘నింబునన్’. ఉమేష్, సుదన్ సుందరం, జయరాం, అరుణ్ వైద్యనాథన్ నిర్మించారు. ప్రసన్న, వరలక్ష్మీ శరత్‌కుమార్, సుమన్, సుహా సిని, వైభవ్, శ్రుతి హరిహరన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో ‘కురుక్షేత్రం’ పేరుతో విడుదల చేయనున్నారు. అర్జున్ కెరీర్లో ఇది 150వ సినిమా కావడం విశేషం. ‘కురుక్షేత్రం’ ట్రైలర్‌ను హీరో నాని బుధవారం విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుందని ఆకాంక్షించారాయన. ‘‘డిఫరెంట్ పోలీసాఫీసర్‌గా అర్జున్ నటించారు. ఊహించని మలుపులు, ఆసక్తికరమైన కథనాలతో ‘కురుక్షేత్రం’ ప్రేక్షకులను అలరిస్తుంది’’అని చిత్రబృందం పేర్కొంది. -
సహచరుల విడుదల కోరుతూ ఆత్మహత్య..
పంజాబ్: వివిధ కేసుల్లో శిక్షలు పడి, జైలు జీవితం పూర్తి చేసుకున్నా తన సహచరులు విడుదల కాకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న గురుభక్ష్ సింగ్ ఖల్సా ఆత్మహత్య చేసుకున్నాడు. విజ్ఞప్తులు, ఆందోళనలు చేసినప్పటికీ, ఖైదీల విడుదలకు స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆయన మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కురుక్షేత్ర జిల్లా ఎస్పీ అభిషేక్ గార్గ్ మాట్లాడుతూ.. ‘పలువురు సిక్క్ రాడికల్స్ విడుదల కోసం గత కొంతకాలంగా గురుభక్ష్ ఆందోళన చేస్తున్నాడు. వారిని విడుదల చేయాలని ట్యాంక్ పైకెక్కి నినాదాలు చేస్తూ.. నీటిలోకి దూకాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని లోక్‌నారాయణ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించార’ని తెలిపారు. 44 రోజుల నిరాహార దీక్ష.. 2013లో గురుభక్ష్ సింగ్...శిక్ష పూర్తయిన ఖైదీలను విడుదల చేయాలంటూ 44 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడు. ప్రభుత్వ హామీతో దీక్ష విరమించాడు. కానీ, వారు విడుదల కాకపోవడం గమనార్హం. -
కర్ణుడిగా అర్జునుడు!
వెండితెర కర్ణుడిగా ఎన్టీఆర్, జెమినీ గణేశన్... ఇలా ఎందరో గొప్ప నటులు నటించారు. రీసెంట్గా హీరో విక్రమ్ కూడా ఈ క్లబ్లో చేరారు. ఇప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్ ‘కురుక్షేత్ర’లో కర్ణుడి పాత్రలో కనిపించబోతున్నారు. నాగన్న దర్శకత్వంలో దర్శన్, అంబరీష్, వి. రవిచంద్రన్, అర్జున్, నిఖిల్ కుమార్, హరిప్రియ ముఖ్య తారలుగా మహాభారతం బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. కన్నడ ప్రముఖ రచయిత రానా రాసిన ‘గదాయుధ’ బుక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా కౌరవరాజు దుర్యోధనుడి పాత్ర చుట్టూ సినిమా సాగుతుందని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
నిర్భయ కంటే దారుణమైన ఘటన.. అట్టుడుకుతున్న కురుక్షేత్ర
ఛండీగఢ్ : ఢిల్లీ నిర్భయ కంటే దారుణమైన అత్యాచార ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికను పైశాచికంగా కబళించిన మృగాలు.. అనంతరం ఆమెను దారుణంగా హతమార్చి ఓ కాలువలో పడేశారు. శనివారం సాయంత్రం ఘటన వెలుగులోకి రాగా.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఇప్పుడు ఆ ప్రాంతమంత నిరసన ప్రదర్శనలతో హోరెత్తిపోతుంది. బాధిత కుటుంబ కథనం ప్రకారం... కురుక్షేత్ర జిల్లా ఝాంసా గ్రామంలో బాలిక కుటుంబం నివసిస్తోంది. ఆమె తండ్రి ఓ టైలర్. బాలిక గ్రామంలో ఉన్న ఓ పాఠశాలలో 10 తరగతి చదువుతోంది. అదే గ్రామంలో ఉంటున్న ఓ యువకుడి(20)ని ప్రేమించిన బాలిక కొద్దిరోజుల క్రితం అతనితో వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే బాలిక హత్యాచారానికి గురైంది. జింద్ జిల్లా బుద్ధ ఖేర్ గ్రామంలోని కాలువ ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహాన్ని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటన వెలుగు చూసింది. బాలిక మృతదేహాన్ని రోహ్తక్లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రికి ఫోరెన్సిక్ విభాగానికి తరలించి శవ పరీక్షలు నిర్వహించారు. తల్లిదండ్రులు సదరు యువకుడిపైనే అనుమానం వ్యక్తం చేస్తుండగా.. ఘటనకు అతడికి సంబంధం ఉన్నట్లు ఇప్పటిదాకా రుజువులేవీ లభించలేదని పోలీసులు చెబుతున్నారు. అత్యంత కిరాతకంగా... ఇక బాలిక మృతదేహానికి పరీక్షలను నిర్వహించిన డాక్టర్ ఎస్కే దత్తార్వాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత పైశాచికంగా ఆ బాలికను అత్యాచారం చేసి చంపారని ఆయన చెబుతున్నారు. మొత్తం బాలిక శరీరంపై ముఖం, తల, ఛాతీ, చేతులు ఇలా వివిధ భాగాల్లో 19 గాయాలున్నాయని.. నిందితులు ఆమె ఛాతీపై కూర్చోవటంతో ఊపిరితిత్తులు దారుణంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ‘‘దాదాపుగా ఆమె శరీరవయవాలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. మర్మాంగాల్లో వస్తువులను చొప్పించటంతో బాలిక పేగులు దెబ్బతిన్నాయి. మృగాల కంటే హీనంగా బాలికను అత్యాచారం చేశారు. నిర్భయ ఘటన కంటే ఇది మరీ ఘోరంగా ఉంది’’ అని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. కాగా హరియాణాలో గడిచిన 48 గంటల్లో ఇప్పటివరకూ మూడు అత్యాచార సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కురుక్షేత్రలో ఆందోళన... ఘటన వెలుగులోకి రావటంతో మహిళా, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిందితులను నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగి చుట్టు పక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. ఆందోళనకారులు శాంతించాలని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పిలుపునిచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని ఆయన అన్నారు. బాలిక తండ్రి ఫోటో ‘‘నా కూతురికి న్యాయం చేకూరాలి. ఆమె అతి దారుణంగా చంపబడింది. భవిష్యత్తులో మరే తండ్రికి ఇలాంటి దుస్థితి కలగకుండా.. నిందితులను కఠినంగా శిక్ష విధించాలి’’ అని బాలిక తండ్రి డిమాండ్ చేస్తున్నారు. కేసును సీబీఐకి అప్పగించి.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని.. నిర్భయ ఫండ్ నుంచి 50 లక్షలు బాలిక తల్లిదండ్రులకు అందజేయాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు బాలిక మృతదేహాంతో కుటుంబ సభ్యులు నిరసన చేపట్టగా.. చివరకు హర్యానా మంత్రి కేకే బేడీ కాలపరిమితితో కూడిన దర్యాప్తునకు హమీ ఇవ్వటంతో ఆందోళన విరమించి బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఈ కేసులో అసలు నిందితులను అరెస్ట్ చేసేదాకా శాంతియుత నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తామని మహిళా సంఘాలు ప్రకటించాయి. ముందస్తు జాగ్రత్తగా భారీ ఎత్తున్న భద్రతా దళాలను అక్కడ మోహరించారు. మరొక ఘటన.. పానిపట్‌లో మరో దళిత మైనర్‌ను కొందరు దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఆదివారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక(11) ను ఎత్తుకెళ్లిన దుండగులు ఘటన అనంతరం సమీపంలోని ఓ చెత్త కుప్పలో బాలిక శవాన్ని పడేశారు. ఆనవాళ్లు దొరక్కుండా బాలిక బట్టలను కాల్చి పడేశారు. ఈ ఘటనకు సంబంధించి బాలిక ఇంటి పక్కన ఉండే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పానిపట్ ఎస్పీ వెల్లడించారు. కాగా, గత నెలలో హిస్సార్‌లో ఆరేళ్ల బాలికను అతికిరాతంగా అత్యాచారం చేసి చంపగా.. ఆ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. -
కురుక్షేత్ర టీజర్ : అభిమన్యుడిగా నిఖిల్
జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి తనయుడు నిఖిల్ కథానయకుడిగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘కురుక్షేత్ర’ టీజర్‌ను శనివారం చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. ఈ సినిమాలో పద్మవ్యూహాన్ని చేధించే అభిమన్యుడి పాత్రలో నిఖిల్ గౌడ అభిమానులను అలరించనున్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మునిరత్న రూ. 50 నుంచి 60 కోట్లు వ్యయం చేశారు. వృషభాద్రి ప్రొడక్షన్ బ్యానర్‌పై తీస్తున్న ఈ సినిమాకు దర్శకుడు నాగణ్ణ. కన్నడ రెబల్ స్టార్ అంబరీష్, క్రేజీస్టార్ రవిచంద్రన్, యాక్షన్‌కింగ్ అర్జున్, డైలాగ్ కింగ్ సాయికుమార్, కన్నడ నటుడు శశికుమార్, భారతీ విష్ణువర్ధన్ తదితరులు నటించారు. -
శాండల్‌వుడ్‌లో కురుక్షేత్ర
మహాభారత యుద్ధంలో ముఖ్యఘట్టమైన కురుక్షేత్రం పేరుతో కన్నడ సిని మా రాబోతోంది. అది కూడా సాదాసీదా బడ్జెట్, మామూలు నటీనటులతో కాదు. కళ్లుచెదిరే వ్యయం, తారాగణంతో కురుక్షేత్రకు రంగం సిద్ధమైంది. ఆ సినిమా చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే అంటున్నారు నిర్మాత మునిరత్న. తెలుగు సినిమా రంగంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన బాహుబలి, బాహుబలి–2 సినిమాలు సూపర్‌హిట్ కావడం తో.. ఇదే దారిలో కన్నడ సినిమా రంగంలో కూడా భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మాణానికి పునాది పడింది. బెంగళూరుకు చెందిన సినీ నిర్మాత మునిరత్న కురుక్షేత్ర పేరుతో రూ.60 కోట్ల బడ్జెట్‌తో ఈ కన్నడ సినిమా నిర్మిస్తున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరు యశ్వంతపురలో ఉన్న ప్రభాకర్ కొరే సమావేశం హాల్లో ముహూర్తం షాట్‌ను సీఎం సిద్ధరామయ్య క్లాప్‌కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. ఎంపీ బీ.కే. హరిప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ వేడుకల్లో హీరోలు రవిచంద్రన్, దర్శన్‌తో పాటు రెబల్ స్టార్ అంబరీష్, నటి హరిప్రియ, ప్రముఖ నటులు అర్జున్ సర్జా, శశికుమార్, రవిశంకర్ పాల్గొన్నారు. దుర్యోధనునిగా హీరో దర్శన్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ దుర్యోధనునిగా నటిస్తున్న ఈ సినిమా నిర్మాణం ఈ నెల 9వ తేదీ నుంచి షూటింగ్ ఆరంభమవుతుంది. షూటింగ్ మొత్తం హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. దీనికోసం 16 సెట్లను ఏర్పాటు చేసినట్లు నిర్మాత తెలిపారు. విరామం లేకుండా షూటింగ్ పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి ప్రజల ముందుకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారు. సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్‌ను రెడీ చేసినట్లు చెప్పారు. చిత్రం వ్యయం రూ.60 కోట్లుగా చెబుతున్నారు. హీరో దర్శన్‌కు ఇది 50వ సినిమా కావడం విశేషం. బహుబాష నటి స్నేహ ద్రౌపది పాత్రలో కనిపిస్తారు. సినిమాలోని ముఖ్య పాత్రలను పోషిస్తున్న నటులు భీష్ముడు : అంబరీష్ కృష్ణుడు : రవిచంద్రన్ కర్ణుడు : అర్జున్ ద్రోణాచార్యుడు : శ్రీనివాసమూర్తి ధృతరాష్ట్రుడు : శ్రీనాథ్ కుంతీదేవి : లక్ష్మి ధర్మరాజు : శశికుమార్ దుశ్శాసనుడు : రవిశంకర్ అభిమన్యుడు : నిఖిల్‌కుమార్ భీముడు : డ్యానిష్ నటి హరిప్రియ ఒక ప్రత్యేక నృత్యగీతంలో అలరించనుంది. మరికొంతమంది ప్రముఖ నటులూ సినిమాలో నటించనున్నారు.