కురుక్షేత్ర టీజర్ : అభిమన్యుడిగా నిఖిల్ | Nikhil Kumar As Abhimanyu In Kurukshetra | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 17 2017 10:18 AM | Last Updated on Sun, Dec 17 2017 10:22 AM

Nikhil Kumar As Abhimanyu In Kurukshetra - Sakshi

జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి తనయుడు  నిఖిల్‌ కథానయకుడిగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘కురుక్షేత్ర’ టీజర్‌ను శనివారం చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. ఈ సినిమాలో పద్మవ్యూహాన్ని చేధించే అభిమన్యుడి పాత్రలో నిఖిల్‌ గౌడ అభిమానులను అలరించనున్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మునిరత్న రూ. 50 నుంచి 60 కోట్లు వ్యయం చేశారు. వృషభాద్రి ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తీస్తున్న ఈ సినిమాకు దర్శకుడు నాగణ్ణ. కన్నడ రెబల్‌ స్టార్‌ అంబరీష్, క్రేజీస్టార్‌ రవిచంద్రన్, యాక్షన్‌కింగ్‌ అర్జున్, డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్, కన్నడ నటుడు శశికుమార్, భారతీ విష్ణువర్ధన్‌ తదితరులు నటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement