
అర్జున్
తెలుగులో ఈ ఏడాది రిలీజైన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అభిమన్యుడు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు యాక్షన్ హీరో అర్జున్. అరుణ్ వైధ్యనాథన్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన తమిళ చిత్రం ‘నింబునన్’. ఉమేష్, సుదన్ సుందరం, జయరాం, అరుణ్ వైద్యనాథన్ నిర్మించారు. ప్రసన్న, వరలక్ష్మీ శరత్‌కుమార్, సుమన్, సుహా సిని, వైభవ్, శ్రుతి హరిహరన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగులో ‘కురుక్షేత్రం’ పేరుతో విడుదల చేయనున్నారు. అర్జున్ కెరీర్‌లో ఇది 150వ సినిమా కావడం విశేషం. ‘కురుక్షేత్రం’ ట్రైలర్‌ను హీరో నాని బుధవారం విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుందని ఆకాంక్షించారాయన. ‘‘డిఫరెంట్ పోలీసాఫీసర్‌గా అర్జున్ నటించారు. ఊహించని మలుపులు, ఆసక్తికరమైన కథనాలతో ‘కురుక్షేత్రం’ ప్రేక్షకులను అలరిస్తుంది’’అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment