గురుభక్ష్ సింగ్ ఖల్సా
పంజాబ్: వివిధ కేసుల్లో శిక్షలు పడి, జైలు జీవితం పూర్తి చేసుకున్నా తన సహచరులు విడుదల కాకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న గురుభక్ష్ సింగ్ ఖల్సా ఆత్మహత్య చేసుకున్నాడు. విజ్ఞప్తులు, ఆందోళనలు చేసినప్పటికీ, ఖైదీల విడుదలకు స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆయన మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కురుక్షేత్ర జిల్లా ఎస్పీ అభిషేక్ గార్గ్ మాట్లాడుతూ.. ‘పలువురు సిక్క్ రాడికల్స్ విడుదల కోసం గత కొంతకాలంగా గురుభక్ష్ ఆందోళన చేస్తున్నాడు. వారిని విడుదల చేయాలని ట్యాంక్ పైకెక్కి నినాదాలు చేస్తూ.. నీటిలోకి దూకాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని లోక్‌నారాయణ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించార’ని తెలిపారు.
44 రోజుల నిరాహార దీక్ష..
2013లో గురుభక్ష్ సింగ్...శిక్ష పూర్తయిన ఖైదీలను విడుదల చేయాలంటూ 44 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడు. ప్రభుత్వ హామీతో దీక్ష విరమించాడు. కానీ, వారు విడుదల కాకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment