panjab
-
Diljit Dosanjh: కల్కి సింగర్ వాచ్ ధర తెలిస్తే కంగుతినడం ఖాయం..!
ప్రముఖ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. బడిలో పాఠాలు చదువుకునే రోజుల్లో గురుద్వారలో కీర్తనలు పాడేవాడు దిల్జీత్ దోసాంజ్. తర్వాత ఆ గొంతే అతడికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. పంజాబీ, హిందీ ఇండస్ట్రీలో సింగర్‌గా, నటుడిగానూ రాణిస్తున్నాడు. అంతేగాదు ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'లో 'భైరవ ఏంథమ్' పాటని కూడా పాడారు. ఇక దిల్జిత్ దోసాంజ్ పాటలే గాక మంచి ఫ్యాషన్ ఐకాన్ కూడా. ప్రతి పాటకు అందుకు తగ్గ డిజైనర్ డ్రెస్‌లతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంటాడు. బహుశా ఈ ఆహార్యమే అతడిని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసిందేమో.!. ఇక ఇటీవల జిమ్మీపాలన్ ది టునైట్ షోలో దిల్జిత్ దోసాంజ్ ధరించి వాచ్ అందర్నీ ఆకర్షించింది. ఆయన ఆ షోలో పంజాబీకి చెందిన గోట్ లిరిక్స్, బోర్న్ టు షైన్ వంటి మంచి హిట్ పాటలతో ప్రేక్షకులనూ ఉర్రూతలు ఊగించాడు. ఈ షోలో ఆయన పంజాబీ సంప్రదాయం ఉట్టిపడేలా వేషధారణతో పాటలు పాడారు. అలాగే అందుకు తగ్గట్లు తన సంస్కృతిని తెలియజెప్పేలా గోట్ లిరిక్స్‌లో మంచి హిట్ పాటలతో అలరించారు. ఈ షోలో ఆయన పాడుతూ.. లయబద్ధంగా డ్యాన్స్‌లు చేశారు. ఆ షోలో అందరి దృష్టి ఆయన చేతికి ధగ ధగ మెరుస్తూ కనిపిస్తున్న వాచ్‌పైనే పడింది. విలాసవంతమైన వస్తువుల కలెక్షన్‌కు కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఉండే దిల్జిత్ ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్ సెల్ఫ్వైండింగ్ బ్రాండ్ వాచ్‌ని ఈ షోకి ఎంపిక చేసుకున్నారు. ఈ వాచ్ 18 క్యారెట్ల రోజ్ గోల్డ్ లింక్‌లతో కూడిన స్టెయిన్లెస్ స్టీల్ బ్రాస్లెట్తో రూపొందించారు. అంతేగాదు ఈ వాచ్ ఇండెక్స్ అవర్ మార్క్‌లో సిల్వర్ డయల్ ఉంటుంది. దీన్ని జైన్ ఆభరణాల వ్యాపారులు రూపిందించారట. ఈ వాచ్ మెరిసిపోయేలా మొత్తం వజ్రాలతో పొదిగారు. ఎంత దూరం నుంచి చూసినా వాచ్ చేయిపై మిరుమిట్లు గొలిపే కాంతితో కూడిన ఒక ఆభరణంలా కనిపిస్తుంది. ఇంత లగ్జరీయస్ వాచ్ ధర వింటే మాత్రం కళ్లు బైర్లుకమ్ముతాయి. దిల్జిత్ ఈ లగ్జరీయస్ బ్రాండెడ్ వాచ్‌ని ఏకంగా రూ. 1.2 కోట్లుతో కొనుగోలు చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by The Tonight Show (@fallontonight) (చదవండి: ప్లాస్టిక్ బాటిల్స్‌తో టీ షర్ట్స్..ఏకంగా రూ. 80 కోట్లు..!) -
పీహెచ్డీ ఉన్నా కూరగాయల అమ్మకం
ప్రైవేట్ జాబ్‌లు చేసి.. అవి నచ్చక వ్యాపారం చేసినవారిని చూశాం. చాలీచాలని జీతాలకు కుటుంబాలను పోషించలేక పలు ఆదాయ మార్గాలను వెతుకున్న ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు సంబంధించిన వార్తలు కూడా చదివాం. అయితే తాగాజా ఓ వ్యక్తి నాలుగు మాస్టర్ డిగ్రీలు తీసుకొని.. ఏకంగా న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసి కూరగాయలు అమ్ముతున్నారు. ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పంజాబ్‌కు చెందిన డా.సందీప్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో కాంట్రాక్టు ప్రోఫెసర్‌గా పని చేసేవారు. అనుకోని పరిసస్థితుల్లో ఆయన తన ఉద్యోగం మానేసి ఇల్లూఇల్లు తిరుగుతూ కురగాయలు అమ్ముతున్నారు. యూనివర్సిటీలోని లా డిపార్టుమెంట్లో 11 ఏళ్లపాటు పనిచేసిన సందీప్ సింగ్ నాలుగు మాస్టర్ డిగ్రీలు(న్యాయ శాస్త్రం, పంజాబీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్)తో పాటు లా కోర్సులో పీహెచ్డీ పూర్తి చేశారు. ఇన్నేళ్లపాటు కాంట్రాక్టు ఉద్యోగం చేసిన సందీప్ నెలవారి జీతాల విషయంలో చాలా ఇబ్బందుల ఎదుర్కొన్నారు. జీతాల తగ్గింపు, సరైన సమయానికి సాలరీ రాకపోవటం వంటివి ఆయన్ను తీవ్రంగా వెంటాడాయి. చేసేదేంలేక కూరగాయల అమ్మకాన్ని మొదలుపెట్టారు డా. సందీప్. తాను ఇల్లూ ఇల్లు తిరిగి కూరగాయలు అమ్మె బండికి వినూత్నంగా ‘పిహెచ్డీ సబ్జీవాలా’ అని పేరు పెట్టుకున్నారు. పంజాబ్‌లోని పాటియాలకు చెందిన సందీప్.. ఉద్యోగం కంటే కూడా కూరగాయలు అమ్మటం వల్లనే తాను ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పటం గమనార్హం. మరోవైపు తాను మరో మాస్టర్ డిగ్రీ కోసం చదువకుంటూ.. కూరగాలయలు అమ్మగా వచ్చిన మొత్తంతో టీచింగ్ వృత్తిని మానుకోకుండా పిల్లలకు ట్యూషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. చదవండి: Punjab: వృద్ధులకు నజరానా ప్రకటించిన పంజాబ్ ప్రభుత్వం -
సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారు.. బీజేపీ నేత ఫైర్
బీజేపీ చెత్త రాజకీయలు చేస్తోందన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలపై ఢిల్లీ బీజేపీ నేత మన్జిందర్ సింగ్ సిర్సా మండిపడ్డారు. ‘రిపబ్లిక్ డే’ సందర్భంగా రాష్ట్రాలకు సంబంధించి ప్రదర్శించే ఘాటాల వ్యవహారంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మన్జిందర్ అన్నారు. ఇటీవల ఇదే విషయంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రిపబ్లిక్ డే ఘాటాల విషయంలో పంజాబ్‌పై తీవ్రమైన వివక్ష చూపుతోందని మండిపడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ బీజేపీ నేత మన్జిందర్ స్పందించి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పంజాబ్ రాష్ట్ర ఘాటాన్ని తిరస్కరించడానికి అసలైన నిజం మరోటి ఉందని తెలిపారు. పంజాబ్ రూపొందించే ఘాటంపై మై భాగో జీ, అమరవీరుల ఫొటోలకు బదులుగా.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫొటోలు ఉన్నాయని అన్నారు. భగవంత్ మాన్ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అందుకే పంజాబ్ ఘాటం తిరస్కరణకు గురైందని తెలిపారు. భగవంత్ మాన్.. పంజాబ్ సార్వభౌమత్వాన్ని కేజ్రీవాల్ కాళ్ల వద్ద వదిలేశారని తీవ్రంగా దుయ్యబట్టారు. The real reason for rejection of Punjab Tableau is that it prominently showed pics of Arvind Kejriwal & Bhagwant Mann rather than Mai Bhago Ji or martyrs! Mann Sahab is shamelessly lying; and worst is he has surrendered Punjab’s sovereignty in the feet of Kejriwal. Tussi Ta… pic.twitter.com/qF81TUHOyC — Manjinder Singh Sirsa (@mssirsa) December 29, 2023 ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల సంబంధించిన ఘాటాలను ‘రిపబ్లిక్ డే’ ఉత్సవాలకు పంజాబ్ ఘాటం ఎంపిక చేయకుండా బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోందని ఆప్ నేత ప్రియాంఖ్ కక్కర్ శుక్రవారం విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, అస్సాం, ఉత్తర్ఖండ్లకు చెందిన ఘాటాను వరుసగా ఎంపిక చేస్తోందని.. ఢిల్లీ, పంజాబ్‌లను మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కకు తప్పించిందని మండిపడ్డారు. చదవండి: క్షమాపణ చెప్పిన అస్సాం సీఎం.. శ్లోకంపై క్లారిటీ.. -
Viral Video: ఖవాల్‌జీత్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా
ప్రస్తుతం కూరగాయలు, పండ్లు కోనుగోలు చేయడానికి జనాలు సూపర్ మార్కెట్లు, డెలివరీ యాప్స్‌ను వాడుతున్నారు. అక్కడక్కడా రోడ్డుపై బండ్లు పెట్టుకొని అమ్మెవారి వద్ద కూడా కొనుకున్నా.. కొంతమేరకు తగ్గిందనే చెప్పాలి!. అయితే తాజాగా ఓ వ్యక్తి చేసిన పనికి సోషల్‌మీడియాలో పొగుడుతూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆయన చేసిన ఏంటని అనుకుంటున్నా?. పంజాబ్‌లోని లూథియాకు చెందిన ఖవాల్‌జీత్ సింగ్ పండ్లు కొందామని రోడ్డు పక్కన ఓ వృద్దురాలి పండ్ల బండి వద్దకు వెళ్లాడు. 62 ఏళ్లు ఉన్న ఆ వృద్దురాలతో వద్ద పండ్లు కొనుగోలు చేస్తూ ఆమె వ్యాపారం గురించి అడిగి తెలుకున్నాడు. 12 గంటలు కష్టపడి పండ్లు అమ్మినా తన వద్ద పండ్లు ఎవరూ కొనడంలేదని ఆమె వాపోయింది. దీంతో ఖవాల్‌జీత్.. ఆమె బండిపై ఉన్న సుమారు రూ.3000 విలువగల అన్ని పండ్లను ఒకేసారి కొన్నాడు. View this post on Instagram A post shared by Kawaljeet Singh (@kawalchhabra) ‘నేను పండ్లు కొనడాకి వెళ్లినప్పుడు.. వాటిని అమ్మె వృద్దురాలు ధీనంగా కూర్చుని ఉంది. ముందు రోజు కూడా పండ్లు అమ్ముడుపోలేదని తెలిపింది. ఇప్పటి వరకు కేవలం రూ.100 పండ్లు మాత్రమే అమ్ముడుపోయినట్ల చెప్పింది. అందుకే మొత్తం బండిపై ఉన్న పండ్లు కొనుగోలు చేశాను’ అని ఖవాల్‌జీత్ తెలిపారు. దీనికి సంబధించిన వీడియోను ఆయన తన ఇన్స్టాగ్రామ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏడుపు ఆగలేదు’, ‘చాలా మంచి పని చేశారు సర్దార్జీ’ అని కామెట్లు చేస్తున్నారు. -
ఇంగ్లండ్‌లో సర్దార్జీల సేద్యం!
ఇంగ్లండ్.. వెస్ట్ మిడ్లాండ్స్ ప్రాంతంలోని ఓ చారిత్రక పారిశ్రామిక పట్టణం స్మెదిక్. దశాబ్దాలుగా అక్కడ జీవిస్తున్న వందలాది పంజాబీ సిక్కు కుటుంబీకులు అర్బన్ ఫార్మర్స్‌గా మారారు. వ్యవసాయంతో, భూమితో వారికి అనువంశికంగా ఉన్న భావోద్వేగ, సాంస్కృతిక సంబంధాన్ని స్మెదిక్‌లోని తమ పెరటి తోటల ద్వారా పునరుజ్జీవింపజేసుకున్నారు. స్మెదిక్ పట్టణానికున్నట్టే సర్దార్జీల వలస గాథకూ సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ∙∙ 1779వ సంవత్సరంలో ప్రపంచంలోనే అతి పురాతన ఆవిరి యంత్రాన్ని స్మెదిక్‌లో నెలకొల్పటం పారిశ్రామిక చరిత్రలోనే ఒక మైలురాయి. అందుకే ఆ యంత్రానికి ‘స్మెదిక్ ఇంజిన్’గా పేరు. పారిశ్రామిక విప్లవానికి పునాదులు వేసిన ఈ పట్టణంలో 5 చదరపు మైళ్ల విస్తీర్ణంలో దాదాపు 90 స్టీల్ ఫౌండ్రీలు ఉండేవట. ఆ పరిశ్రమల చిమ్నీల నుంచి నిరంతరం వెలువడే దట్టమైన నల్లటి పొగ కమ్ముకొని ఉంటుంది కాబట్టి.. ఈ పట్టణానికి ‘బ్లాక్ కంట్రీ’ అని పేరొచ్చిందట. శ్వేత జాతీయులతో పాటు అనేక కామన్వెల్త్ దేశాల నుంచి వలస వచ్చిన విభిన్న జాతుల ప్రజలు ఈ శ్రమజీవుల పట్టణంలో జీవిస్తుంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి వలస జీవులు స్మెదిక్‌లో జీవిక కోసం వచ్చి స్థిరపడటం ప్రారంభమైంది. వీరిలో పంజాబీల సంఖ్య ఎక్కువ. 1917లో తొలిగా 50కి పైగా సిక్కు కుటుంబాలు వచ్చి స్థిరపడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత (1945 నుంచి) మరింత మంది సిక్కులు భారత దేశం నుంచి ఇక్కడకు చేరారు. 1961లో ఓ పాత చర్చ్‌ను కొనుగోలు చేసి గురుద్వారాగా మార్చుకున్నారు. స్మెదిక్ జనజీవనంతో సామాజికంగా, భావోద్వేగపరంగా సిక్కు సామాజిక వర్గం మమేకమయ్యే ప్రక్రియ అంతటితో పూర్తయ్యిందని చెప్పొచ్చు. ∙∙ పారిశ్రామిక కాలుష్యం వల్ల సహజ వనరులన్నీ కలుషితమైపోవటం వల్ల కాలక్రమంలో అక్కడి ప్రజల ఆయర్దాయం తగ్గిపోయింది. అటువంటి పరిస్థితుల నుంచి 11 లక్షల జనాభా కలిగిన ఈ పట్టణం ‘గార్డెన్ సిటీ’గా రూపాంతరం చెందుతోంది. ఏడెనిమిదేళ్ల క్రితం నుంచి పనిగట్టుకొని సుమారు 45 వేల కొత్త ఇళ్లను నిర్మించడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించే పని యుద్ధప్రాతిపదికన ప్రారంభమైంది. ఈ క్రమంలో సర్దార్జీల ఇంటిపంటల నైపుణ్యం గురించి స్థానిక పత్రికలు కథనాలు రాయటం ప్రారంభించాయి. పంజాబ్ నుంచి కుటుంబాలను వదిలి ఒంటరిగానో మిత్రులతోపాటో పారిశ్రామిక కార్మికులుగా వలస వచ్చిన తొలినాటి సర్దాజీలు.. అప్పట్లోనే తమ కోసం కూరగాయలు పండించుకోవటం ప్రారంభించారు. ఆ విధంగా వలస జీవులను ఇంటిపంటలు కనెక్ట్ చేస్తూ ఉత్తేజితపరుస్తూ వచ్చాయి. ‘వ్యవసాయంతో, భూమితో ఈ అనుబంధం మా సంస్కృతికి మూలం. ఏ సీజన్లో ఏమి తింటామో అవి పండించుకుంటాం’ అంటున్నారు స్మెదిక్ సర్దార్జీలు సంతోషంగా! (చదవండి: వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా పంటకు ఢోకాలేని వ్యవసాయ పద్ధతి మీకు తెలుసా?) -
ఐపీఎల్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ న్ని వదిలించుకుంటున్న పంజాబ్
-
ప్రకాష్ సింగ్ బాదల్ కు కన్నీటి వీడుకోలు
-
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్ ఏం చెబుతున్నాయంటే?
న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది దేశమంతటా ఆసక్తిగా మారింది. ఇక దేశంలోనే అత్యధిక సీట్లు కలిగిన ఉత్తర ప్రదేశ్‌లో కమలం మరోసారి వికసించనున్నట్లు ఎగ్జిట్‌పోల్ ఫలితాల్లో వెల్లడైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పరిశీలిస్తే.. యూపీలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా..? ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. బీజేపీ, మిత్రపక్షాలతో కలిసి 220 నుంచి 240 వరకు సీట్లు సాధిస్తుందని పోస్ట్ పోల్ సర్వే తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ దాని మిత్రపక్షాలకు కలిపి 140 నుంచి 160 స్థానాలు వస్తాయని పేర్కొంది. బహుజన సమాజ్‌వాదీ పార్టీ 12 నుంచి 18 సీట్లు గెలిచే అవకాశముంది. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం ఆర్ఎల్డీ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా కట్టింది. ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీ మరోసారి గట్టెక్కుతుందా? హోరాహోరీగా సాగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 70 అసెంబ్లీ స్థానాలు గల రాష్ట్ర అసెంబ్లీకి ఫిబ్రవరి 16, 23 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు కావాలి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46.5 శాతం, కాంగ్రెస్ 33.5 శాతం ఓట్లు సాధించాయి. బీఎస్పీ 7 శాతం ఓట్లు సాధించాయి. కాగా, తాజా ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉన్నప్పటికీ ఈసారి ఆప్ కూడా రంగంలోకి దిగడంతో రసవత్తరంగా మారింది. ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామి బీజేపీని ఒడ్డున పడేస్తారా? లేక కాంగ్రెస్ కమలానికి షాకిస్తుందా తేలాలంటే మార్చి 10 వరకు వేచి చూడాల్సిందే! పంజాబ్‌లో ఆప్ అధికారంలోకి రానుందా? పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధికారంలోకి రానుందా? అంటే అవుననే అంటోంది పీపుల్స్ పల్స్ సర్వే. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని అంచనా వేసింది. హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. దీని ఆధారంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 59 నుంచి 66 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అధికార కాంగ్రెస్ 23 నుంచి 28 స్థానాలు గెలుచుకునే చాన్స్ ఉంది. శిరోమణి అకాలీదళ్‌కు 17 నుంచి 21 సీట్లు, బీజేపీకి 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. మణిపూర్‌లో గెలుపెవరిది? మణిపూర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి సీఎం బీరెన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ మరోసారి అధికారాన్ని చేపట్టనున్నట్లు సర్వేల ఫలితాల్లో తేలింది. మొత్తం 60 సీటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 31 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పీపుల్స్ అనే సంస్థ బీజేపీ 25 నుంచి 29 స్థానాల వరకు గెలుచుకోనున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ 17 నుంచి 21 సీట్లు వరకు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలింది. అదే విధంగా ఎన్పీపీ 7 నుంచి 11, ఎన్పీఎఫ్ 3 నుంచి 5, ఇతరులు 2 నుంచి అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందనున్నట్లు పీపుల్స్ పల్స్ పేర్కొంది. బీజేపీ 33 శాతం.. కాంగ్రెస్ 29 శాతం వరకు ఓట్లు సాధించవచ్చని వెల్లడించింది. గోవాలో మిగతా రాష్ట్రాల్లో కంటే భిన్నంగా.. గోవాలో ఫిబ్రవరి 14న ఒకే విడతలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 40 స్థానాలున్న రాష్ట్రలో అధికారాన్ని చేపట్టేందుకు 21 సీట్లు రావాల్సి ఉంది. అయితే గోవాలో ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికల్లో ఆప్ రంగంలోకి దిగడంతో ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి గోవాలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే నెలకొన్నప్పటికీ ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడం గమనార్హం. సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వివరాల ప్రకారం, బీజేపీ 16 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకోనున్నట్లు తెలుస్తోంది. హంగ్ తప్పనిసరైతే.. కింగ్ మేకర్‌గా ఎవరు మారనున్నారో మార్చి 10న తేలనుంది. -
ఆ చిన్నారి బరువుని చూసి డాక్టర్లే ఆశ్యర్యపోతున్నారు!..రక్త పరీక్షలు కూడా నిర్వహించలేరట !
An eight-month-old baby from Punjab: మనం ఇంతవరకు ఎన్నో రకాల వింత జననాలు గురించి విన్నాం. పైగా అలాంటి పిల్లలకి వైద్యులు ఎంతో కొంత చికిత్స అందించి కాపాడే ప్రయత్నాలు కూడా చేసిన ఘటనలు చూశాం. కానీ పంజాబ్‌కి చెందిన చిన్నారి అధిక బరువు సమస్యతో బాధపడుతుంది. అయితే ఇది ఈ రోజుల్లో సర్వసాధారణమే కదా ఇదేమీ అంత పెద్ద సమస్య కాదనుకోకండి. ఎందుకంటే ఆమెకు చికిత్స అందించడం కూడా కష్టమే. అందుకు ఆమె శరీరం తీరే కారణమట. పంజాబ్‌కు చెందిన చాహత్ కుమార్ అనే ఎనిమిది నెలల పాప నాలుగేళ్ల పాప ఉండేంత బరువు(17 కేజీలు) ఉంటందట. పైగా ఆ చిన్నారి తల్లి పుట్టిన నాలుగు నెలల నుంచి అసాధారణంగా బరువు పెరగడం ప్రారంభమైంది. దీంతో ఆమె తల్లిదండ్రలు సూరజ్ కుమార్, రీనా చాలా ఆందోళన చెందారు. అంతేకాదు డాక్టర్లు సైతం ఆ చిట్టితల్లి బరువుని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఆ పాప తల్లి మొదటి ప్రసవంలో కొడుకుని కోల్పోయింది. దీంతో ఆమె ప్రస్తుతం తాను ఈ కుమార్తెను కూడా కోల్పోతానేమో అనే భయంతో గడుపుతోంది. అయితే ఆ పాపకు విపరీతమైన ఆకలి కారణంగా పెద్ద పిల్లలు తినే విధంగానే అన్ని తింటుందని తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. పైగా ఆమెను ఎత్తుకోవడం కూడా కష్టమని చెబుతున్నారు. ఆ పాప అసాధారణ బరువుతో ఊబకాయంతో బాధపడటమే కాక ఆమె శరీరంతో కూడా సమస్యలు ఎదుర్కొంటుంది. అయితే ఆమె శరీరం అత్యంత దళసరిగా ఉంటుంది. ఈ మేరకు వైద్యుడు వాసుదేవ్ శర్మ ఆమె శరీరం అత్యంత దృఢమైనదని, రక్తపరీక్షలు నిర్వహించడం అసాధ్యం అని చెబుతున్నారు. ఆయన ఎన్నోసార్లు పరీక్షలు నిర్వహించిన విఫలమైనట్లు చెప్పారు. పాపం తల్లితండ్రులు మాత్రం తమ పాప సాధారణ స్టితికి రావాలని, అందరి పిల్లల్లా ఆడుకుంటూ హాయిగా జీవించాలని ఆశిస్తున్నారు. అయితే ఈ ఘటన రెండేళ్ల కిందట జరిగినప్పటికి ఇప్పటి ఈ విషయం ఆసక్తికరంగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ‘ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్) -
Supreme Court: ప్రధాని భద్రతా వైఫల్యంపై విచారణకు ప్రత్యేక కమిటీ
న్యూఢిల్లీ: పంజాబ్‌లో ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్ భద్రతా వైఫల్యం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై విచారించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తు ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, చండీగఢ్ డీజీపీ, ఎన్ఐఏ ఐజీ, పంజాబ్ ఏడీజీ (సెక్యూరిటీ) తదితరులు ఉంటారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో కొంత మంది నిరసనకారులు ప్రధాని నరేంద్రమోదీ కాన్వాయ్‌ను ఫ్లైఓవర్‌పై 20 నిముషాలపాటు అడ్డుకోవడంతో ప్రధాని ర్యాలి రద్దయ్యింది. భటిండా విమానాశ్రయం నుంచి హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారక స్థూపం వద్దకు ప్రధాని మోదీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో పంజాబ్‌లో ప్రధాని కాన్వాయ్‌కు భద్రతా వైఫల్యంపై అత్యున్నతస్థాయి విచారణ కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. చదవండి: కరోనా కల్లోలం: భారత్‌లో భారీగా పెరిగిన కేసులు.. -
సిద్ధూకు తలొగ్గిన చన్నీ సర్కార్
ఛండీగఢ్: సొంత పార్టీలోనే నిరసన గళం వినిపించే నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ డిమాండ్‌కు పంజాబ్‌లోని కాంగ్రెస్ సర్కార్ తలొగ్గింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ డిమాండ్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీని మార్చింది. ఇక్బాల్ ప్రీత్ సింగ్సహోతాను తొలగించి, సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి శాశ్వత ప్రాతిపదికన డీజీపీని నియమించేంతవరకు ఛటోపాధ్యాయ కొనసాగుతారని పేర్కొంది. ప్రస్తుతం విజిలెన్స్ బ్యూరో చీఫ్ డైరెక్టర్‌గా ఉన్న సిద్ధార్థ్ ఆ బాధ్యతల్లోనూ కొనసాగుతారు. సెప్టెంబర్‌లో చరణ్‌జిత్‌సింగ్ చన్నీ సీఎంగా ప్రమాణం చేయగానే ఐపీఎస్ అధికారి సహోతాను డీజీపీగా నియమించారు. అయితే తన మీద వచ్చిన ఆరోపణల విచారణకోసం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందానికి నాయకత్వం వహించిన సహోతాను డీజీపీగా నియమించడాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకించారు. డీజీపీగా సిద్ధార్థ్‌ను నియమించాలని ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. -
పాక్‌తో వాణిజ్య చర్చలు వృథా.. సిద్ధూ వ్యాఖ్యలపై విమర్శలు
లుధియానా: పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆ పార్టీ ఎంపీ మనీష్ తివారీ విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు పెంచుకోవటం వల్ల ఇరు దేశాల స్నేహబంధం పెరుగుతుందన్న సిద్ధూ వ్యాఖ్యలను ఖండించారు. భారత్‌పై.. పొరుగు దేశం పెంచుకుంటున్న వ్యతిరేకత ఆగేవరకు పాక్‌తో వాణిజ్య చర్చలు జరపడం వ్యర్థమని స్పష్టం చేశారు. చదవండి: మొదటి వారం రాజ్యసభ సమావేశాలు.. 52 శాతం సమయం వృథా పాకిస్తాన్ ఇండియాలోకి ఉగ్రవాదులను పంపుతోందని మండిపడ్డారు. మారణాయుధాలు, డ్రగ్స్‌ను పాక్ తమ డ్రోన్ల ద్వారా భారత భూభాగంలో చేరవేస్తోందని అన్నారు. ఇలాంటి చర్యలు ఆగేవరకు పాక్‌తో వాణిజ్య చర్చలు జరపడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. కరాచీ సరిహద్దు తెరిచి ఉంటే.. వ్యాపారం కోసం అట్టారీ సరిహద్దును ఎందుకు తెరవలేరని సిద్ధూ ప్రశ్నించిన విషయం తెలిసిందే. -
Punjab: సిద్ధూకు నా సెల్యూట్: సీఎం కేజ్రీవాల్
ఛండీఘర్: పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాటాలను అణచివేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంజాబ్ ప్రభుత్వం నకిలీ హామీలపై నవజ్యోత్ సింగ్ ధైర్యంగా ఖండిస్తున్నారని అన్నారు. అయితే సోమవారం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఇసుక మాఫీయాను రూపుమాపి ధరలు తగ్గించిందన్నారని పేర్కొన్నారు. చదవండి: గతంలో నేనూ ఆటో డ్రైవర్‌నే.. పెండింగ్ చలాన్లు రద్దు చేస్తా: సీఎం అయితే వెంటనే సీఎం చన్నీ వ్యాఖ్యలను సిద్ధూ ఖండించారని తెలిపారు. సీఎం చన్నీ చెప్పే విషయం సత్యం కాదని స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఇసుక మాఫీయా ఇంకా కొనసాగుతోందన్నారని తెలిపారు. అయితే ఇలా తమ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపినందుకు సిద్ధూకు సెల్యూట్ చేస్తున్నానని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. చన్నీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, మొత్తం కాంగ్రెస్ పార్టీ సిద్ధూ గొంతును అణచివేస్తోందని చెప్పారు. గతంలో అమరేందర్ సింగ్.. ప్రస్తుతం సీఎం చన్నీ సిద్ధూను అణచివేస్తున్నారని పేర్కొన్నారు. సిద్ధూ అవకాశవాది అని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధూ ఆప్‌లో చేరనున్నట్లు అమరేందర్ సింగ్ పలుమార్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. చదవండి: పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. అదే విధంగా ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఊహాగానాలకు సీఎం కేజ్రీవాల్ చెక్ పెట్టారు. పంజాబల్‌లో కాంగ్రెస్ తమ సీఎం అభ్యర్థి చన్నీనా? లేదా సిద్ధూనా? అని ప్రకటించలేదన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో కూడా బీజేపీ తమ సీఎం అభ్యర్థి యోగినా? మరోకరా? అనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అదే విధంగా గోవా, ఉత్తరఖండ్‌లో కూడా ఎవరు తమ సీఎం అభ్యర్థులను ప్రకటించలేదన్నారు. అందరి కంటే తామే ముందుగా పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
ప్రతి మహిళకు నెలకు రూ.వేయి ఇస్తాం.. సీఎం ప్రకటన
చంఢీఘర్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపై విమర్శలు గుప్పించారు. ఆయన పంజాబ్‌లోని మోగా జిల్లాలో మాట్లాడుతూ.. పంజాబ్ ఎన్నికలకు సంబంధించి ఆప్ ఇచ్చిన హామీలను చరణ్‌జిత్ కాపీ కొట్టారని మండిపడ్డారు. ‘మీ చుట్టు ఓ నకిలీ వ్యక్తి తిరుగుతున్నాడు. నేను పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హామీలను రెండు రోజుల తర్వాత.. వాటినే తమ పార్టీ హామీలను సీఎం చరణ్‌జిత్ ప్రకటించారు. ఏ హామీలను తీర్చలేడు.. ఆయనో నకిలీ వ్యక్తి’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పంజాబ్‌లోని 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు వేయి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. ఇది ప్రపంచంలోని చాలా పెద్ద పథకమని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు అడగకుండా మహిళలు అర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ పథకం ప్రజయోజనం కలిగిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. -
petrol prices: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.10 తగ్గింపు
ఛండిఘర్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరలపై ప్రభుత్వం భారీ అదనపు తగ్గింపును ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.5 తగ్గిస్తున్నట్లు సీఎం చరణ్‌జిత్ చన్నీ ఆదివారం ప్రకటించారు. గత 70 ఏళ్లలో చమురు ధరలు ఇంతస్థాయిలో తగ్గించడం ఎప్పుడు జరగలేదని, ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. చదవండి: Money Laundering Case: ఈడీ కస్టడికీ అనిల్ దేశ్‌ముఖ్ ఢిల్లీతో పోల్చుకుంటే ప్రస్తుతం పంజాబ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.9 తక్కువగా లభిస్తుందని అన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా లీటర్ పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.5 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయంతో పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు చమురు ధరలపై వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. -
దీపావళి బొనాంజా.. నిర్మాణ కార్మికులకు గుడ్ న్యూస్
చంఢీగడ్: రాష్ట్రంలోని భవన, ఇతర నిర్మాణ కార్మికులకు దీపావళి కానుక అందించనున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ కారణంగా నిర్మాణ పనులు తగ్గటంతో వేలాది మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వారికి ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఆర్థిక సాయం అందిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ బుధవారం ప్రకటించారు. బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు(BOCW)లో రిజిస్టర్ అయిన ప్రతి కార్మికుడికి దీపావళి పండగను పురస్కరించుకొని రూ.3,100 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ట్వీటర్లో పేర్కొన్నారు. సీఎం ప్రకటనతో భవన, ఇతర నిర్మాణ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 3.17 మంది కార్మికులు అధికారికంగా బీఓసీడబ్ల్యూలో రిజిస్టర్ అయి ఉన్నారు. అయితే ఈ ఆర్థిక సాయం నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాలో చేరనుంది. On the eve of Diwali, My Govt. announces financial relief of Rs.3100 each for construction workers registered with BOCW Welfare Board (3.17 lakh workers across the State). A "Shagun" for workers as they have suffered immense losses in the wake of Covid Pandemic. pic.twitter.com/xpnLQRsVDt — Charanjit S Channi (@CHARANJITCHANNI) November 3, 2021 -
రాజీనామా ఉపసంహరించుకున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని కలుసుకున్న అనంతరం తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. సిద్ధూ తన రాజీనామా ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. (చదవండి: ‘అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు) కాగా, రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో తాను లేవనెత్తిన సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తన విధులను యథావిధిగా తిరిగి కొనసాగిస్తునున్నట్లు పేర్కొన్నారు. చరణ్ జిత్ సింగ్ చన్నీ క్యాబినేట్లోని అధికారుల నియమాకాలపై తీవ్ర అసంతృప్తితోపాటు, ఇటీవల చన్నీ కుమారుడి వివాహానికి కూడా సిద్ధూ దూరంగా ఉండటం తదితర పరిణామాలన దృష్ట్య కాంగ్రెస్‌లో అంతర్గత ఉద్రిక్త వాతావరణం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు "సిద్ధూ కూడా తాన తన పదవికి రాజీనామా చేసిన గానీ ‘తాను గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రీల సిద్ధాంతాలను పాటిస్తాను. తాను కాంగ్రెస్ పార్టీలో పదవి ఉన్నా.. లేకున్నా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పక్షాన నిలబడతాను వ్యతిరేక శక్తులు నన్ను కిందకు తోయాలని చూసినా అంతకు మించిన ఆశావాదంతో పంజాబ్‌లో ప్రతి పౌరుడి గెలుపు కోసం కృషి చేస్తాను" అంటూ ట్విటర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. (చదవండి: "నా స్టార్ట్ప్ బిజినెస్‌కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్") -
రూ.50 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించిన పంజాబ్, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు
లక్నో: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ లఖీమ్‌పూర్ ఖేరి ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆ ఘటనలో జర్నలిస్ట్ కశ్యప్ తోపాటు చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 50 లక్షల నష్టపరిహారాన్ని బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కూడా మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల నష్ట పరిహారాన్ని ప్రకటించారు. కాగా, ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరి వద్ద ఆందోళనకారులపైకి కేంద్ర మంత్రి కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతేకాదు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్, ఎస్యూవీ వాహనంలోల ఒకదానిపై కూర్చుని నిరసనకారుల మీదకు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెలువెత్తడంతో ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలతో బీజేపీ ప్రభుత్వం పై దాడి చేస్తున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చన్నీ, బాఘేల్ ఇద్దరూ కూడా లక్నో పర్యటనలో ఉన్నారు. ఇదిలాఉండగా... ఉత్తర ప్రభుత్వం కూడా చనిపోయిన రైతు కుటుంబాలకు 45 లక్షల పరిహారంతోపాటు ప్రభుత్వం ఉద్యోగం, గాయపడిన వారికి రూ. 10 లక్షల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
Navjot Singh Sidhu: పదవి ఉన్నా, లేకున్నా వారి పక్షాన నిలబడతా
చండీగఢ్: పంజాబ్‌లో ఇద్దరు కీలక నేతలు నవ జ్యోత్‌సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాలతో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇరువురు నేతలు తీసుకునే నిర్ణయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. తాజాగా నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందిస్తూ.. తనకు పదవి ఉన్నా.. లేకపోయినా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పక్షాన అండగా నిలబడతానని అన్నారు. చదవండి: పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకారం శనివారం జాతి పిత మహత్మా గాంధీజీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా ట్వీట్ చేశారు. ‘తాను గాంధీ, శాస్త్రీల సిద్ధాంతాలను పాటిస్తాను. నాకు కాంగ్రెస్ పార్టీలో పదవి ఉన్నా.. లేకున్నా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పక్షాన నిలబడతాను. వ్యతిరేక శక్తులు నన్ను కిందకు తోయాలని చూసినా అంతకు మించిన ఆశావాదంతో పంజాబ్‌లో ప్రతి పౌరుడి గెలుపు కోసం కృషి చేస్తాను’ అని ట్విటర్లో పేర్కొన్నారు. గురువారం పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో భేటీ అయిన సిద్దూ.. తిరిగి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకరించినట్లు సమాచారం. పంజాబ్‌లో డీజీపీ, అడ్వొకేట్ జనరల్ నియామకంపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక నియామకాన్ని నిలిపివేస్తామని సీఎం చన్నీ హామీ ఇవ్వడంతో సిద్ధూ మెత్తబడినట్లు తెలుస్తోంది. Will uphold principles of Gandhi Ji & Shastri Ji … Post or No Post will stand by @RahulGandhi & @priyankagandhi ! Let all negative forces try to defeat me, but with every ounce of positive energy will make Punjab win, Punjabiyat (Universal Brotherhood) win & every punjabi win !! pic.twitter.com/6r4pYte06E — Navjot Singh Sidhu (@sherryontopp) October 2, 2021 -
Navjot Singh Sidhu: ముగిసిన పంజాబ్ సీఎం, సిద్ధూ భేటీ
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత సిద్ధూ.. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీతో తొలిసారి భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య సుదీర్ఘ సమావేశం జరగ్గా, సిద్ధూ డిమాండ్లను సీఎం చన్నీ అంగీకరించినట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం నవజ్యోత్ సింగ్ సిద్ధూ మట్లాడుతూ.. పార్టీ, ప్రభుత్వం కలిసిమెలిసి పనిచేయాలని అన్నారు. నిజాయతీ, నమ్మదగిన అధికారులను నియమించాలని అన్నారు. మంగళవారం పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు సిద్ధూ. తన రాజీనామా లేఖలో పరోక్షంగా అమరీందర్ సింగ్‌ను వ్యవహరాన్ని ప్రస్తావించారు. చదవండి: Punjab Crisis: బీజేపీలో చేరికపై అమరీందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు -
Navjot Singh Sidhu: సిద్ధూ ఆప్‌లో చేరబోతున్నాడా?
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు రోజురోజుకు అనూహ్యంగా మారుతున్నాయి. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి, పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడంతో సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఇద్దరు బలమైన నేతలు రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. అయితే నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్.. సిద్దూ చేరిక ఊహాగానాలపై స్పందిస్తూ.. పంజాబ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా బలమైన నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని అన్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆప్‌లో చేరుతారనేది ఊహాత్మకమైన విషయమని తెలిపారు. అటువంటి పరిస్థితులు పంజాబ్ చోటు చేసుకుంటే తామే వెల్లడిస్తామని తెలిపారు. మరోసారి బలంగా చెబుతున్నానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరఫున బలమైన నేతను సీఎం అభ్యర్థిగా నిలబెడతామని స్పష్టం చేశారు. అది ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఆ విషయానికి సంబంధించి తాము ఆలోచించడంలేదని పేర్కొన్నారు. దీంతో నవజ్యోత్ సింగ్ ఆప్‌లో చేరుతారని వస్తున్న వార్తలకు బలం చేకూరుతోంది. నవజ్యోత్ సింగ్ గతంలో ఆప్‌లో కీలక నేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా ఆయన బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కావటంతో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
పిలవకుండానే పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించిన సీఎం
చండీగఢ్: సాధారణంగా ముఖ్యమంత్రి అంటే.. కట్టుదిట్టమైన భద్రత.. ఆయన చుట్టుపక్కల ఒక పెద్ద హడావిడితో కూడిన వాతావరణం ఉంటుంది. సీఎం చుట్టు ఉండే భద్రత సిబ్బంది.. ఆయన అపాయింట్ మెంట్ లేకుండా ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లనివ్వరనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఒక్కొసారి ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా సీఎం భద్రత దృష్ట్యా.. సెక్యురిటీ సిబ్బంది నుంచి చేదు అనుభవం ఎదుర్కోవడం మనం చూస్తునే ఉంటాం. కొంత మంది ముఖ్యమంత్రులు మాత్రం దీనికి భిన్నంగా అవకాశం చిక్కినప్పుడల్లా ప్రజలతో మమేకమవ్వటానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజలు జరుపుకునే పండుగలకు, శుభకార్యాలకు హజరవుతుంటారు. ఆ కోవకు చెందిన వారే ఇటీవల పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చరణ్ జీత్ సింగ్ ఛన్నీ. ఆయన తాజాగా ఒక వివాహ వేడుకలో వధువరులను ఆశీర్వదించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల పంజాబ్ 16 వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చరణ్‌జీత్ సింగ్ చన్నీ బటిండా జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన.. తన కాన్వాయ్ రోడ్డు మండి కలాన్ అనే గ్రామంనుంచి వెళ్తుండగా.. ఒక వివాహ వేడుక జరుగుతోంది. వెంటనే సీఎం తన కాన్వాయ్‌ని ఆపించారు. ఆ తర్వాత కిందకు దిగి .. నూతన దంపతులను పలకరించారు. పెళ్లికుమారుడిని హత్తుకొని మరీ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా ఆ వేడుకలో పెళ్లివారు ఇచ్చిన స్వీట్(పారట్) స్వీకరించి వారిని ఆనందపర్చారు. కాగా, సాక్ష్యాత్తూ.. ఒక సీఎం పిలవకుండా ఆగి.. తమకు శుభాకాంక్షలు తెలిపినందుకు వధువరులు ఆనందంతో ఉప్పోంగిపోయారు. వారితో సీఎం కొద్దిసేపు మాట్లాడారు. వధువరులను సీఎం చరణ్ జీత్ సింగ్ మనసారా ఆశీర్వదించారు. కాగా, దీన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. అయితే, గతంలో చరణ్ జీత్ సింగ్ విద్యార్థులతో కలిసి కపూర్తలాలో చేసిన భాంగ్రా ఫోక్ డ్యాన్స్ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. చదవండి: Charanjit Singh Channi: భాంగ్రా డ్యాన్స్‌తో హల్చల్ -
డ్రగ్స్ కోసం దాడి: అవమానం తట్టుకోలేక ఫ్రెండ్ ఆత్మహత్య
లుధియానా: స్నేహితుడు తీవ్రంగా దాడి చేసి అవమానించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పంజాబ్ లుధియానా సమీపంలోని ఖన్నా సిటీలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుఖ్వింధర్ సింగ్, సోను అనే ఇద్దరు యువకులు స్నేహితులు. అయితే సోను డ్రగ్స్ బానిసగా మారాడు. అయితే సోమవారం రోజు తన స్నేహితుడు సుఖ్వింధర్ సింగ్‌ను మోటర్‌సైకిల్‌పై వెళ్లి డ్రగ్స్ తీసుకురావాలని సోను చెప్పాడు. డ్రగ్స్ కోసం వెళ్లిన సుఖ్వింధర్ కొన్ని గంటల వరకు తిరిగి రాకుండా.. డ్రగ్స్ కూడా తీసుకురాలేదు. దీంతో కోపోద్రిక్తుడైన సోను సుఖ్వింధర్‌పై దాడి చేసి అవమానించాడు. చదవండి: బస్సులో బాలికపై అమానుషం అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన సుఖ్వింధర్.. విషం దాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే సుఖ్వింధర్ కూడా సోనుతో పాటు కొంతకాలంగా డ్రగ్స్ తీసుకోవడంతో అతని శరీరం చికిత్సకు సహకరించలేదని వైద్యులు తెలిపారు. సుఖ్వింధర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సోను కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: ప్రేమికులపై పైశాచికం: మెడలో టైర్లు వేసి.. -
పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం.. సీఎం అమరీందర్‌పై తిరుగుబావుటా..
చండీగఢ్: పంజాబ్‌లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒంటరవుతున్నట్లు తెలుస్తోంది. తాగాజా పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం తలెత్తింది. సీఎం అమరీందర్‌పై నమ్మకం పోయిందంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగరవేశారు. దీనిపై చర్చించడానికి నలుగురు మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. చదవండి: సోనియమ్మకు థాంక్స్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు బయల్దేరినట్లు సమాచారం. కాగా ఇటీవల పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 62 మంది ఎమ్మెల్యేలు హాజరైన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి బలం తగ్గినట్టు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. చదవండి: వివాదంలో బీజేపీ నేత..ఇంటిలో అర్ధనగ్నంగా కూర్చుని -
డ్రైవర్ అమానుషం: పోలీసును బరబరా ఈడ్చుకెళ్లిన కారు
పట్నా: పోలీసులు తనిఖీ చేస్తారని.. వాళ్ల నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముందుగానే పోలీసులను గ్రహించి మరో రోడ్డును ఎంచుకుంటారు. లేదా వాళ్లకు దొరక్కుండా దూరం నుంచి వేగంగా వెళ్లుతారు. అయినా చాలాసార్లు వాహనదారులు పోలీసులకు దొరికిపోయిన ఘటనలు చూశాం. అయితే తాజగా ఓ పోలీసు కారును తనిఖీ చేయాలని అడ్డగిస్తే.. ఆ వాహనదారుడు అత్యంత వేగంగా అతని మీది నుంచే దూసుకెళ్లుతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని పాటియాలాలో ఓ పోలీసు కారును తనిఖీ చేయాలని అడ్డగిస్తాడు. కానీ, కారు నడిపే వ్యక్తి వేగంగా పోలీసు మీది నుంచే వేగంగా వెళ్లుతాడు. ఈ క్రమంలో వాహనం వేగంగా వెళ్లటం వల్ల కారును పట్టుకోవాలని ప్రయత్నించిన పోలీసు తలకు అద్దం తగిలి కిందపడిపోయాడు. వేగంగా వెళ్లుతున్న కారు అద్దం బలంగా తగలటంతో పోలీసు కుప్పకూలిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం గాయపడ్డ పోలీసు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిని వ్యక్తి కారును ట్రేస్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ హేమంత్ శర్మా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
20 రౌండ్ల కాల్పులు: శిరోమణి అకాలీ దళ్ యూత్ వింగ్ నేత హత్య
మొహాలి: శిరోమణి అకాలీ దళ్ యూత్ వింగ్ నేత విక్రమ్‌జిత్ సింగ్ మిద్దుఖేరా అలియాస్ విక్కీ శనివారం దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయనపై విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో మృతి చెందారు. ఈ ఘటన మొహాలీలోని సెక్టార్ 71లో చేటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్యూవీ కారులో కూర్చున్న విక్కీనిపై మాస్కులు ధరించిన నాలుగురు దుండగుల్లో ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కారు నుంచి పరుగులు తీశాడు. దుండగులు వెంబడించి మరీ 20 రౌండ్ల కాల్పులు జరపడంతో విక్కీ మృతి చెందాడు. ఈ ఘటనపై శిరోమణి అకాలీ దళ్ నేత దల్జిత్ సింగ్ చీమా స్పందిస్తూ.. దుండగులు జరిపిన కాల్పుల్లోయూత్ లీడర్ విక్రమ్‌జిత్ సింగ్ మిద్దుఖేరా మృతి చెందినట్లు తెలిపారు. ఆయన సోదరుడు స్థానిక మున్సిపల్ ఎన్నికలు పార్టీ తరఫున పోటీ చేసినట్లు పేర్కొన్నారు. విక్కీ వద్ద లైసెన్స్ తుపాకీ ఉన్నప్పటికీ దుండగలు జరిపిన భీకర కాల్పుల్లో తనను రక్షించుకోలేకపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే విక్కీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను పున: ప్రారంభించండి: డీఎస్‌జీఎంసీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను పున: ప్రారంభించాలని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనెజ్మెంట్ కమిటీ(డీఎస్‌జీఎంసీ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గత ఏడాది మార్చి నెలలో కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ కారిడార్‌ను మూసివేశారు. అయితే తాజాగా దేశంలో కరోనా నియంత్రణలోకి వస్తున్న సమయంలో మళ్లీ తిరిగి కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను ప్రారంభించాలని కోరారు. దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ నిబంధనలు తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్తార్‌పూర్ కారిడార్‌ను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నట్లు డీఎస్‌జీఎంసీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఇక ఈ కారిడార్‌ను నవంబర్, 2019న గురునానాక్ దేవ్ 550 జయంతి సందర్భంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కరోనా మహామ్మరి కారణంగా గత ఏడాది మార్చి నుంచి మూసివేశారు. ఈ కారిడార్ పార్రంభానికి ముందు భారత్‌లోని సిక్కు భక్తులు పంజాబ్‌లోని డేరాబాబా నానక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద గురుద్వారా కార్తాపూర్ సాహిబ్‌ను బైనాక్యులర్ల ద్వారా దర్శించుకునేవారు. అయితే ప్రస్తుతం బైనాక్యులర్లు సదుపాయం కూడా లేదని మంజింద్ సింగ్ తెలిపారు. సిక్కు మత వ్యవస్థాకులు గురు నానక్ దేవ్ ఆయన జీవితంలో చివరి18 ఏళ్లు పాకిస్తాన్ నారోవల్ జిల్లాలోని గురుద్వారాలో గడిపారు. ఈ కారిడార్ ద్వారా సిక్కు మత భక్తులు వీసా లేకుండానే పాకిస్తాన్‌లోని గురుద్వారాను సందర్శించుకుంటున్న విషయం తెలిసిందే. -
పంజాబ్‌లో కొత్త పొత్తు పొడిచింది
చండీగఢ్: పంజాబ్‌లో శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చేతులు కలిపాయి. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్, బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్‌చంద్ర మిశ్రా శనివారం సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నట్టు వెల్లడించారు. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్‌లో బీఎస్పీకి 20 స్థానాలు కేటాయించారు. మిగిలిన 97 స్థానాల్లో అకాలీదళ్ పోటీ చేస్తుంది. పంజాబ్ రాజకీయాల్లో ఇది చరిత్రాత్మకమైన రోజని ఈ సందర్భంగా సుఖ్బీర్సింగ్ బాదల్ వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహాలను రచించడానికి త్వరలోనే ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇన్నాళ్లూ బీజేపీతో కలిసి ఉన్న శిరోమణి అకాలీదళ్ కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత ఏడాది ఎన్డీయేకి గుడ్‌బై కొట్టేసింది. పంజాబ్, హరియాణాకు చెందిన రైతులే ఎక్కువగా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడంతో మోదీ ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క అకాలీదళ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేశారు. ఎస్ఏడీతో పొత్తును బీఎస్పీ చీఫ్ మాయావతి సరికొత్త సామాజిక ముందడుగు అని అభివర్ణించారు. పొత్తుతో సమాఖ్య ప్రజాస్వామ్య విప్లవం ప్రారంభమవుతుందని ప్రకాశ్‌సింగ్ బాదల్ అన్నారు. దళిత ఓటు బ్యాంకు కొల్లగొట్టడమే లక్ష్యం పంజాబ్ రాష్ట్రంలో దాదాపు 32 శాతం ఓట్లు దళితులవే కావడంతో వారి ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా బీఎస్పీతో అకాలీదళ్ చేతులు కలిపింది. జలంధర్, హోషియార్పూర్, నవాన్షహర్, కపుర్తలా జిల్లాల్లో దళితులు అధికంగా కేంద్రీకృతమై ఉన్నారు. డోవుబా ప్రాంతంలో బీఎస్పీకి మంచి ఆదరణ ఉంది. వచ్చే ఎన్నికల్లో మాల్వా ప్రాంతంలో ఏడు సీట్లు, మాజాలో అయిదు, డోవుబాలో ఎనిమిది స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయనుంది. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్, బీఎస్పీ కలిసి పోటీచేసి 13 ఎంపీ స్థానాలకు గాను 11 సీట్లను కొల్లగొట్టి తమ పొత్తుకి ఎదురులేదని నిరూపించాయి. అప్పట్లో మూడు స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ అన్నింట్లోనూ విజయం సాధించింది. మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఒక్కటైన ఆ పార్టీలు వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాగా ఉన్నాయి. చదవండి: బీజేపీ నేతల మూకుమ్మడి రాజీనామా.. ఇరకాటంలో చీఫ్ -
BKU: ఢిల్లీ సరిహద్దులకు చేరుతున్న రైతులు
చండీగఢ్: ఈ నెల 26న రైతులు తలపెట్టిన బ్లాక్‌డే నిరసన సందర్భంగా పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు ఆరు నెలలకు చేరిన సందర్భంగా రైతు సంఘాలు ఈ నెల 26న దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నారు. దీనికి హాజరు కావాల్సిందిగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పంజాబ్ నుంచి భారీ స్థాయిలో రైతులు ఢిల్లీ సరిహద్దులకు వస్తున్నారని భారతీ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రాహణ్) సీనియర్ నేత షింగారా సింగ్ సోమవారం చెప్పారు. యువకులు, పెద్దలు అంతా కలసి తమ వాహనాలతో తిక్రి, సింఘు సరిహద్దులకు చేరుకుంటున్నారు. పంజాబ్‌లోని సంగ్రూర్, పాటియాలా, మనసా, బతిందా, మోగ, గుర్దాస్పుర్, ఫరిద్కోట్ జిల్లాల నంచి రైతులు వస్తున్నట్లు షింగారా తెలిపారు. రైతులు చేపట్టనున్న నిరసనకు కాంగ్రెస్ నేత నవ్‌జోత్ సింగ్ సిద్దు మద్దతు ప్రకటించారు. నిరసన రోజున వారికి సంఘీభావంగా తన ఇంటిపై నల్లజెండా ఎగురవేస్తానని చెప్పారు. (చదవండి: CM Chauhan: జనాలు చస్తుంటే..రాజకీయాలా!) -
పంజాబ్‌లో పోలీసులపై కాల్పులు..ఇద్దరు ఏఎస్ఐల మృతి
లూథియానా: గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి పోలీసులపై కాల్పులకు పాల్పడిన ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్లు మరణించారు. ఈ దుర్ఘటన జాగ్రాన్ టౌన్లో జరిగిందని డీఎస్పీ జీఎస్ బియాన్స్ శనివారం తెలిపారు. కాల్పులు జరిగాక ఏఎస్ఐ భగవాన్ అక్కడికక్కడే మరణించారని, మరో ఏఎస్ఐ దల్విందర్‌సింగ్ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారని వెల్లడించారు. వీరిద్దరూ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (సీఐఏ)లో పని చేస్తున్నారని పేర్కొన్నారు. కాల్పుల ఘటన గురించి తెలిసిన వెంటనే ఐజీపీ నౌ నిహాల్ సింగ్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. డ్రగ్స్ స్మగ్లర్లు, గ్యాంగ్స్టర్స్, గతంలో వీరిద్దరు ఇంటరాగేట్ చేసిన వారిలో ఎవరైనా ఈ దాడికి పాల్పడి ఉండొచ్చనే కోణంలో విచారణ జరుగుతోంది. (చదవండి: సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు) -
దేశంలో దడ పుట్టిస్తోన్న కరోనా విస్ఫోటనం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విస్ఫోటనం దడ పుట్టిస్తోంది. మూడు రోజుల తేడాలో మరోసారి రికార్డు స్థాయిలో లక్షకి పైగా కేసులు నమోదై రికార్డుల్ని తిరగరాశాయి. 24 గంటల్లో 1,15,736 కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కి చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. క్రియాశీల కేసుల సంఖ్య 8,43,473కి చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 6.59 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. కొత్తగా 630 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,66,177కి చేరుకుంది. రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షలు ► పంజాబ్‌లో రాత్రి కర్ఫ్యూ విధించారు. రాజకీయ సమావేశాలపై నిషేధం విధించారు. రాజకీయ నేతలు సమావేశాలు నిర్వహిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని సీఎం అమరీందర్ హెచ్చరించారు. ఆంక్షలు ఈ నెల 30 వరకు అమల్లో ఉంటాయి. ► మహారాష్ట్ర ప్రభుత్వం 9, 11వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్ అయినట్టుగా ప్రకటించింది ► బెంగళూరులో 144 సెక్షన్ విధించారు. భారీ ర్యాలీలు, ప్రదర్శనలకి అనుమతినివ్వరు. అపార్ట్మెంట్లు, విల్లాలలో ఉండే స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, పార్టీ హాళ్ల వినియోగాన్ని నిషేధించారు. 20 వరకు బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన ప్రార్థనలపై కూడా నిషేధం. క్లబ్బులు, పబ్‌లు, రెస్టారెంట్ల సగం సామర్థ్యంతో మాత్రమే నడపాలి. మూడు రెట్లు వేగంతో... కరోనా మొదటి వేవ్‌తో పోల్చి చూస్తే యాక్టివ్ కేసుల సంఖ్య 3 రెట్ల వేగంతో పెరిగిపోతోంది. కేవలం 2 రోజుల్లోనే యాక్టివ్ కేసులు 7 లక్షల నుంచి 8లక్షలు దాటేశాయి. ఏడాది ఆగస్టు 22 నాటికి 7 లక్షలున్న యాక్టివ్ కేసులు సెప్టెంబర్ 2 కల్లా 8 లక్షలు దాటాయి. లక్ష యాక్టివ్ కేసులు నమోదు కావడానికి 8 రోజులు పట్టింది.సెప్టెంబర్ 17న యాక్టివ్ కేసులు అత్యధికంగా 10,17,705 నమోదైతే అతి తక్కువగా ఫిబ్రవరి 11న 1,33,079గా ఉన్నాయి. ఇక పని చేసే చోట వ్యాక్సిన్ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీరు పని చేసే ప్రాంతానికే వైద్య అధికారులు వచ్చి కోవిడ్–19 వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఏప్రిల్ 11 నుంచి టీకా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ బుధవారం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఏదైనా కార్యాల యంలో 45 ఏళ్ల వయసు పైబడిన వారు 100 మందికి పైగా వ్యాక్సిన్ తీసుకోవడానికి సుము ఖంగా ఉంటే అక్కడే వారికి టీకా ఇవ్వడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆ లేఖ లో స్పష్టం చేశారు. ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి వారి కార్యా లయాల్లోనే టీకా కేంద్రాలు ప్రారంభించాలని రాజేశ్ భూషణ్ ఆ లేఖలో పేర్కొన్నారు. -
భారత్ బంద్ పాక్షికం
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ శుక్రవారం పంజాబ్, హరియాణా మినహా మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా విజయవంతమైంది. పంజాబ్, హరియాణాల్లో రోడ్డు, రైలు రవాణాను రైతులు అడ్డుకున్నారు. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో హైవేలను దిగ్బంధించారు. రైళ్లను అడ్డుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిర్వహిస్తున్న రైతు ఉద్యమానికి 4 నెలలు పూర్తయిన సందర్భంగా రైతు సంఘాల ఉమ్మడి వేదిక ‘సంయుక్త కిసాన్ మోర్చా’ శుక్రవారం ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ కారణంగా 4శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయ్యాయని, 35 ప్యాసెంజర్ రైళ్లను, 40 గూడ్స్ రైళ్లను రైతులు అడ్డుకున్నారని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యూపీలోని బల్లియాలో 20 మంది సీపీఐఎంఎల్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ ప్రభావం ఢిల్లీపై పెద్దగా లేదు. -
60 వేల చేరువలో ఒక్కరోజు కేసులు
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 59,118 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గతేడాది అక్టోబర్ 18 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,18,46,652కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 257 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,60,949కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,12,64,637కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.09 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,21,066గా ఉంది. మూడు రాష్ట్రాల్లో.. కొత్త కేసుల్లో 73.64 శాతం కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. వీటిలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లు ఉన్నాయి. ఇందులోనూ మహారాష్ట్రలో అత్యధికంగా 35,952 కేసులు నమోదయ్యాయి. దేశంలో 5.5 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ మహారాష్ట్రలో మరోసారి రాత్రిపూట కర్ఫ్యూను ప్రకటించారు. మార్చి 28వ తేదీ ఆదివారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. అన్ని షాపింగ్‌మాల్స్ రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రానున్న పండుగల్లో జాగ్రత్త: కేంద్రం కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో రానున్న పండుగ రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా శుక్రవారం ఢిల్లీలో మాట్లాడారు. త్వరలో రానున్న హోలీ, ఈస్టర్, ఈద్–ఉల్–ఫితర్ తదితర పర్వదినాల్లో పౌరులు మరింతగా గుమికూడినపుడు కరోనా వైరస్ మరింతగా వ్యాప్తిచెందకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో దేశం ప్రస్తుతం కీలక దశలోకి చేరుకుందని ఈ దశలో అలసత్వం ప్రదర్శించడం మంచిదికాదన్నారు. స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, జిమ్‌లు, ఎగ్జిబిషన్లు వంటి వాటికి సంబంధించి ఈ నెల 23న హోంశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిందని వాటిని అనుసరించాలని సూచించారు. -
ఒక్క రోజులోనే 53 వేలు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తీవ్రతరమవుతోంది. 24 గంటల్లోనే 53,476 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇది ఈ ఏడాదిలోనే అత్యధికం. దీంతోపాటు, గత రెండు రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య లక్ష దాటిపోవడం ఆందోళన కలిగించే అంశం. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 1,17,87,534కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. కొత్తగా నిర్థారణ అయిన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 31,855, పంజాబ్‌లో 2,613, కేరళలో 2,456 ఉన్నాయి. అదేవిధంగా, యాక్టివ్ కేసులు వరుసగా 15వ రోజు కూడా పెరిగి, 3,95,192కు చేరుకుని, మొత్తం కేసుల్లో ఇవి 3.95%గా ఉన్నాయి. రికవరీ రేటు మరింత తగ్గి 95.28%గా ఉందని కేంద్రం తెలిపింది. మహమ్మారితో ఒక్క రోజులోనే మరో 251 మంది మరణించడంతో ఇప్పటి వరకు 1,60,692 మంది చనిపోయినట్లయింది. గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన 54,366 కేసులు నమోదైన రికార్డు ఉంది. ఈ వ్యాధి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,12,31,650కి చేరింది. ఆ రాష్ట్రాల్లో ఎక్కువ రోజువారీ కరోనా కేసులు మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, చత్తీస్‌గఢ్, గుజరాత్‌లలోనే ఎక్కువగా బయటపడుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో ఈ రాష్ట్రాల్లోనే 80.63%వరకు ఉన్నాయని వెల్లడించింది. యాక్టివ్ కేసులు కూడా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లలోనే 74.32%వరకు ఉన్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో 35,952 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26,00,833కు పెరిగింది. -
ఒక రూపాయి జీతం.. సీఎంకు ప్రధాన సలహాదారుగా పీకే
చండీగఢ్: 2022లో పంజాబ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం కోసం పంజాబ్ ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. అందులో భాగంగానే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. సోమవారం ప్రశాంత్ కిషోర్.. సీఎం కెప్టెన్ అమరేంద్ర సింగ్‌కు ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు. ‘ప్రశాంత్ కిషోర్ నాకు ప్రధాన సలహాదారుగా నియమితులవడం చాలా సంతోషంగా ఉంది. పంజాబ్ ప్రజల శ్రేయస్సు కోసం తాము ఇద్దరు కలిసి పనిచేయడానికి ఎదురు చేస్తున్నా’ అని ఆయన తెలిపారు. Happy to share that @PrashantKishor has joined me as my Principal Advisor. Look forward to working together for the betterment of the people of Punjab! — Capt.Amarinder Singh (@capt_amarinder) March 1, 2021 ప్రశాంత్ కిషోర్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు పంజాబ్ మంత్రి మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పదవి కేబినెట్ ర్యాంక్‌తో సమానం. మంత్రి మండలి విడుదల చేసిన నియామక నోటిఫికేషన్లో ఆయన ఈ పదవిలో జీతంగా రూ.1 మాత్రమే తీసుకోనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం అందించే అన్ని సౌర్యాలను ఆయన పొందుతారు. ఇక 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 117 సీట్లకు గాను కాంగ్రెస్ 77 సీట్లను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా ప్రధాన సలహాదారుగా పని చేస్తున్న విషయం తెలిసిందే. చదవండి: విద్యార్థులతో రాహుల్ గాంధీ స్టెప్పులు : వైరల్ -
నాసా రోవర్.. సాఫ్ట్ వేర్ రాసింది మన మహిళే!
మొన్నటి ‘పెర్సీ’ రోవర్‌తో కలిపి నాసా ఇంతవరకు ఐదు రోవర్లను అంగారకుడి మీదకు పంపింది. వాటిల్లో స్పిరిట్, ఆపర్చునిటీ, క్యూరియాసిటీ అనే రోవర్లకు, తాజా పెర్సీ రోవర్‌కు లాండింగ్ సాఫ్ట్ వేర్ రాసింది మన భారతీయ మహిళే! పేరు వందన. పెర్సీ ప్రాజెక్టును విజయవంతం చేసిన స్వాతి టీమ్‌లోని సభ్యురాలు. 2007 నుంచి నాసాలో రోబోటిసిస్ట్గా పని చేస్తున్న వందన పంజాబీ మహిళ. నాసా ఆఫీస్‌లో అంతా వందనను ‘వండీ’ అని పిలుస్తారు. అందరితో ఆమె కలుపుగోలుగా ఉండటమే ఆ ఆప్యాయతకు కారణం. అంగారకుడి పైకి పంపే రోవర్ల నియంత్రణకు స్క్రీన్‌ప్లే వంటి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంలో ఆమె నిపుణురాలు. ఇప్పటి వరకు నాసా పంపిన ఐదు రోవర్లలో ఒక్క సోజర్న్ రోవర్‌కు తప్ప మిగతా వాటన్నిటికీ ఆమే సాఫ్ట్వేర్ రాశారు. వ్యోమగామి కల్పనాచావ్లా జన్మస్థలమైన హర్యానా పక్క రాష్ట్రం పంజాబ్ నుంచే వందన కూడా నాసా వరకు వెళ్లారు. పంజాబ్‌లోని హల్వారా వందన జన్మస్థలం. ఆమె తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో పైలట్. ఉద్యోగ రీత్యా వందన చిన్నప్పుడే ఆయన భారతదేశంలోని ముఖ్య నగరాలన్నీ చుట్టేశారు. వాటిని చుట్టినట్లే ఆమెకు అంతరిక్షాన్నీ చుట్టి రావాలని ఉండేది. హల్వారాలోనే కేంద్రీయ విద్యాలయలో పాఠశాల చదువు పూర్తయింది. చండీగఢ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ అయింది. తర్వాత యూఎస్‌లోని కార్నెగీ మెలాన్ యూనివర్శిటీ (సి.ఎం.యు.) లో రోబోటిక్స్ తీసుకుని మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత పీహెచ్‌డి. చదువుకుంటూనే ఆమె చేసిన పని విమానం నడపడంలో శిక్షణ తీసుకుని పైలట్ లైసెన్స్ సంపాదించడం. చదువుతున్నప్పుడే పార్ట్ టైమ్‌గా దక్షిణమెరికా అటకామా ఎడారిలో ఆస్ట్రోబయాలజీ ప్రయోగాల్లో పాల్పంచుకున్నారు. అటాకామాలో అంగారకుడి పోలిన స్నేహపూర్వకం కాని వాతావరణం ఉంటుంది. అక్కడ పరిశోధనలు చేశారు. ఇక సి.ఎం.యు.లోనైతే నిర్దేశించిన అవసరాలకు తగినవిధంగా రోబోను తయారు చేసి దానిని నియంత్రించే ప్రోగ్రామ్‌ను రాయడంలో వందనకే ఎప్పుడూ ఫస్ట్. అలా ఆమెకు అంగారకుడి మీద, అంగారకుడిపైకి పంపే రోవర్ల మీద పట్టు లభించింది. 2006లో నాసాలో అవకాశం వచ్చింది. అక్కడ ఆమె తొలి ప్రాజెక్టే ‘ప్లెక్సిల్’కు సాఫ్ట్వేర్ రాయడం. ఫ్లెక్సిల్ అంటే ప్లాన్ ఎగ్జిక్యూషన్ ఇంటర్‌ఛేంజ్ లాంగ్వేజ్. అదొక ఆటోమేషన్ టెక్నాలజీ భాష. ఆ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పుడు పెర్సీని అంగారకుడి పైకి దింపింది కూడా నాటి ఫ్లెక్సిల్ సాఫ్ట్‌వేర్‌కు అభివృద్ధి రూపమే. వందన 2007లో నాసా వారి జెట్ ప్రొపల్షన్ లేబరీటరీలో జాయిన్ అయ్యారు. అక్కడ మరింత అధునాతనమైన, మెరుగైన రోబో టెక్నాలజీని కనిపెట్టవలసి ఉంటుంది. అక్కడ ఆమె ప్రతిభ ఆమెను ఆటానమస్ సిస్టమ్స్ ప్రాజెక్టుకు గ్రూప్ లీడర్‌ను చేసింది. ఆ ప్రతిభా నైపుణ్యాలే వందనకు నాసాలో విశిష్టమైన రోబోటిసిస్టుగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. నాసా లేబరేటరీలో రోవర్ల మధ్య వందన -
రోడ్డు ప్రమాదం: మృతదేహంతో 10 కిమీ ప్రయాణం
చండీఘర్: పంజాబ్‌లో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో ఓ కారు ఎదురుగా వస్తున్న సైకిల్‌ను ఢికోట్టింది. అనంతరం కారుపై ఎగిరి పడ్డ మృతదేహంతో దాదాపు 10 కిలో మీటర్లు ప్రయాణించిన ఘటన రాష్ట్రంలో మొహాలీలో చోటుచేసుకుంది. స్థానికుల సమచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు పంజాబ్‌లోని మోహలీకి చెందిన యోగేంద్ర మొండల్‌గా గుర్తించారు. అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. వివరాలు... ఫతేగర్ పట్టణానికి చెందిన నిందితుడు నిర్మల్ సింగ్ జిరాక్పూర్ నుంచి సన్నీ ఎన్క్లేవ్ వైపు కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో మొహాలీలోని ఎయిర్‌పోర్టు రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా సైకిల్‌పై వస్తున్న బాధితుడు యోగేంద్రను ఢీకొట్టాడు. దీంతో అతడు గాల్లోకి ఎగిరి నిర్మల్ సింగ్ కారుపై పడ్డాడు. అయితే నిర్మల్ సింగ్ కారు ఆపకుండా మృతదేహంతోనే 10 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ క్రమంలో అతడు యోగేంద్రను హస్పీటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు చెప్పడంతో సన్నీ ఎన్క్లేవ్ వద్ద మృతదేహాన్ని వదిలి పరారయ్యాడు. దీనిపై మొహాలీ డీఎస్పీ రూపిందర్ దీప్ కౌర్ మాట్లాడుతూ.. ర్యాష్ డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద స్థలంలోని సీసీ కెమెరాల ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. నిందితుడు నిర్మల్ సింగ్‌ను అరెస్టు చేసి అతడిపై ఐపీసీ సెక్షన్ 279, 427, 304, 201 కింద కేసు నమోదు చేసి అనంతరం అతడి కారును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. -
మూడుసార్లు బెయిలు నిరాకరణ.. ఎవరీ నవ్‌దీప్ కౌర్!
‘‘భయపడొద్దు తల్లీ. ఓటమిని అంగీకరించొద్దు. చివరివరకు మనం పోరాడాలి. లేకుంటే వీళ్లు మనల్ని బతకనివ్వరు.’’ – నవ్‌దీప్ కౌర్ తల్లి. ‘‘కొన్నిసార్లు పోరాటమే మార్గం అవుతుంది. ఆ మార్గంలోనే మా అక్క నడుస్తోంది’’ – నవ్‌దీప్ కౌర్ చెల్లెలు రాజ్వీర్ కౌర్. ‘‘అతివాద మూకలు మన ఫొటోను మంటల్లో తగలబెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం ఇండియాలో ఉంటే ఏం జరుగుతుందో ఊహించండి’’. – నవ్‌దీప్ కౌర్‌ను విడుదల చేయాలని కోరుతూ ప్లకార్డ్‌ను ప్రదర్శిస్తున్న ఒక యువతి ఫొటోను, ఉద్యమకారుల పోస్టర్లు తగలబెడుతున్న వారి ఫొటోనూ జత చేస్తూ కమలా హ్యారీస్ చెల్లెలి కూతురు మీనా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు. పంజాబ్ యువతి. వయసు 23. ప్రస్తుతం ఆమె పంజాబ్‌లోని కర్నాల్ జైల్లో ఉన్నారు. ఇరవై మూడేళ్ల ఈ దళిత యువతికి మొదట ఆమె తల్లి, చెల్లి మాత్రమే మద్దతుగా ఉన్నారు. ఈ నెల 6న మీనా షేర్ చేసిన పోస్టుతో యావద్దేశమే కాదు, అమెరికాలోనూ నవ్‌దీప్‌ను వెంటనే విడుదల చేయాలని అక్కడి ఎన్నారైలు డిమాండ్ చేస్తున్నారు! జనవరి 12న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. నేటికి 28 రోజులు. మూడుసార్లు కోర్టు ఆమెకు బెయిలు నిరాకరించింది! ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావం తెలియజేయడం, ఆ ప్రాంతంలోనే తను పని చేస్తున్న ఫ్యాక్టరీలో కొందరిని అకారణంగా తొలగించడాన్ని ప్రశ్నించడం ఆమె చేసిన నేరాలు! వ్యక్తిగా ఆమె నిరసన తెలియజేసినంత కాలం మౌనంగా ఉండి, అవకాశం కోసం చూస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం.. ఆమె ‘మజ్దూర్ అధికారం సంఘటన్’ (మాస్)లో సభ్యురాలిగా చేరి ఒక్క నినాదం ఇవ్వగానే అరెస్ట్ చేయించి, జైల్లో పెట్టించింది. ఫ్యాక్టరీలో మహిళా కార్మికులపై జరుగుతున్న అఘాయిత్యాలను ‘మాస్’ అండతోనే బయటపెట్టగలిగారు నవ్‌దీప్ కౌర్. పర్యవసానమే.. జైలు నుంచి ఆమె బయటికి వచ్చే ద్వారాలు మూసుకుని పోవడం. నవ్‌దీప్ కౌర్‌కు మద్దతుగా కమలా హ్యారిస్ చెల్లెలి కూతురు మీనా పెట్టిన ట్వీట్. ‘‘జైల్లో మా అక్కను చిత్రహింసలు పెడుతున్నారు. ఆమె కాళ్ల మధ్య నుంచి రక్తం స్రవించడాన్ని తాము చూసినట్లు సహ ఖైదీలు మా అమ్మకు సమాచారం పంపారు. అమ్మ బాధపడింది. కానీ భయపడలేదు. ‘పోరాడకపోతే మన బతుకులు ఎప్పటికీ ఇంతే’ అని వర్తమానం పంపింది. మా అక్కడ ధైర్యవంతురాలు. కడవరకు పోరాడుతూనే ఉంటుంది’’ అని రాజ వీర్ కౌర్ తనని కలిసిన మీడియా ప్రతినిధి ఆస్తా సవ్యసాచితో అన్నారు. రాజ్వీర్ ఢిల్లీ యూనివర్సిటీలోనే చదువుతోంది. అక్కను బయటికి తెప్పించేందుకు ఆమే స్వయంగా ఎప్పటికప్పుడు లాయర్‌తో మాట్లాడుతోంది. వారి కుటుంబంలో రాజ్వీర్ ఒక్కరే ఇంత చదువు వరకు వచ్చింది. అక్క నవ్‌దీప్, తమ్ముడూ స్కూల్లో ఉండగానే చదువు మానేశారు. లాక్డౌన్ సమయంలో చేసిన పీకల్లోతు అప్పుల నుంచి తల్లిదండ్రులను గట్టెక్కించడానికి పంజాబ్ నుంచి ఢిల్లీ వచ్చి ఫ్యాక్టరీలో పనికి చేరారు. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మీదే ఆమెను, ‘మాస్’ అధ్యక్షుడు శివకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నవ్‌దీప్ కౌర్ పంజాబ్‌లోని దళిత సామాజిక వర్గమైన ‘మఝబీ సిక్కు’ల అమ్మాయి. నాలుగు నెలల క్రితమే ఆమె పని కోసం ఢిల్లీలో ఆ ఫ్యాక్టరీలో చేరారు. ఢిల్లీ సరిహద్దులలో కొన్ని నెలలుగా ఉద్యమిస్తున్న రైతులతో గొంతు కలిపారు. ఇవన్నీ కూడా ఆమెను అక్రమంగా జైల్లో వేయించడానికి తోడ్పడ్డాయి. జైల్లో పెట్టిన రెండో రోజే.. జనవరి 14 నాటికి.. నడవలేని స్థితికి చేరుకున్నారు నవ్‌దీప్. వైద్య పరీక్షల్లో ఆమె రక్తస్రావానికి లైంగిక అకృత్యాలే కారణం అని నిర్థారణ అయినట్లు బయటికి పొక్కింది. మగ పోలీసులు ఆమెను జననావయంపై లాఠీతో కొట్టిన గుర్తులు బయటపడ్డాయి. జైల్లో నుంచి ఆమె ప్రాణాలతో బయటపడతారా అన్నదే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. చదవండి: కష్టాలను ఎత్తి కుదేయండి తల్లిదండ్రులున్నా అనాథగా పెరిగా -
పాప్ సింగర్ అరెస్టు..
గన్‌లోడ్ చేసి పోలీస్‌కే గురిపెట్టిన కుర్రాడిని అమ్మాయిలు లైక్ చేస్తే చెయ్యొచ్చు. గవర్నమెంట్ మాత్రం డిస్లైక్ చేస్తుంది. అరెస్టు చేసి జైల్లో పెడుతుంది. పంజాబీ పాప్ సింగర్ శ్రీ బ్రార్ ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. నెలక్రితం అతడు విడుదల చేసిన మ్యూజిక్ వీడియో ‘జాన్’.. గన్ కల్చర్‌ను ప్రేరేపిస్తుందన్న ఆరోపణపై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు కోటీ నలభై లక్షల మంది చూసిన ‘జాన్’లో అంతగా మందుగుండు సామగ్రి ఏముంది?! ముంబై: పంజాబ్ సీఎం తన రాష్ట్రం మీద మాట పడనివ్వరు. తన రాష్ట్రాన్ని మాట అనిపించుకునేలానూ ఉండనివ్వరు. ఇప్పుడేమైందో చూడండి. పంజాబ్‌లో శ్రీ బ్రార్ అనే ర్యాప్ సింగర్ ఉన్నాడు. అతడు ‘జాన్’ అనే వీడియో సాంగ్ చేశాడు. పోలీస్‌ల పైనే గన్స్ ఎక్కుపెడతాడు బ్రార్ అందులో. యూత్ బాగా ఎట్రాక్ట్ అయింది ఆ సాంగ్‌కి! కోటీ నలభై లక్షల వ్యూస్ వచ్చాయి. ఎట్రాక్ట్ అయితే అయ్యారు.. గన్ కల్చర్‌కి అడిక్ట్ అవుతారేమోనని పోలీసులు బ్రార్‌ను అరెస్టు చేశారు. ‘‘మంచి పని చేశారు. అరెస్ట్ చేయాల్సిందే అతడిని’ అని సీఎం అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఇంత చిన్న విషయంలో సీఎం కల్పించుకోవడం పెద్ద విషయమే. ఆ వీడియోలోని తారాగణంలో, తాత్పర్యంలో ఉన్న ప్రభుత్వ ధిక్కార ధోరణులే అందుకు కారణం. ‘జాన్’ నెల క్రితమే విడుదలైంది. శ్రీ బ్రార్ తోపాటు వీడియోలో బార్బీ మాన్ అనే లేడీ ర్యాపర్, గుర్నీత్ దొసాంజ్ అనే పాప్ ఆర్టిస్ట్ నటించారు. అందులోని మందు గుండు సాహిత్యం మాత్రం బ్రార్దే. ఈ వీడియో సాంగ్‌లో గుర్నీత్ రెండు చేతుల్తో రెండు గన్స్ పట్టుకుని పోలీస్ స్టేషన్లోకి వెళ్తాడు. స్టేషన్‌లోని పోలీసుల్ని టపాటపామని లేపేసి, లాకప్ లాక్‌లను పేల్చేసి తన ‘అక్యూజ్డ్’ ఫ్రెండ్స్‌ని విడిపించుకుని వెళ్తాడు. ఈ హీరోయిజాన్నంతా బార్బీ ఆరాధన భావంతో చూస్తూ ఉంటుంది. ఈ దృశ్యాల వెనుక మన బ్రార్ రాసిన సాంVŠ రన్ అవుతుంటుంది. ‘నో డౌట్.. నో డౌట్ నీకు మీసాలొచ్చాయ్. నీ పొలంలో కొత్త ట్రాక్టర్ గర్జిస్తోంది. ఓ జాట్ కుర్రాడా.. నీకు నువ్వే ఒక బ్రాండ్. నేరాన్ని శ్వాసించే వాళ్లంతా నీ వైపే. అందుకే వాళ్లను విడిపించేందుకు వెళ్తున్నావ్. పోలీసులకు నువ్వేమిటో చూపించు..’ అని పంజాబీలో బార్బీ మాన్ పాడుతుంటుంది. ఈ సాంగ్.. గన్ కల్చర్‌ని ప్రోత్సహించేలా ఉందని శ్రీ బ్రార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కేసు పెట్టింది పటియాలా సీనియర్ సూపరింటెండెంట్ విక్రమ్ జీత్ దుగ్గల్. హింసను ప్రేరేపించడం, సంఘ విద్రోహశక్తులను పురికొల్పడం, గ్యాంగ్స్టర్లకు ఆశ్రయం ఇమ్మని వీడియోలో ఇన్‌డైరెక్టుగా చెప్పడం.. బ్రార్‌పై ప్రధాన ఆరోపణలు. ‘ప్రిన్స్ ఆఫ్ పటియాలా’ గా 2016లో పాప్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు బ్రార్. చండీగఢ్ కుర్రాడు. కాలేజ్‌లో ఆర్ట్స్ స్టూడెంట్. కరన్ అవుజ్లా, దిల్‌ప్రీత్ థిల్లాన్‌తో కలిసి పాడిన పంజాబీ సాంగ్ ‘యార్ గ్రరీబాజ్’తో ఇతడొకడున్నాడని ఇండీపాప్ సీనియర్ ఆర్టిస్టుల దృష్టిలో పడ్డాడు. పెద్దగా ఆల్బమ్‌లు లేకపోయినా, వచ్చిన కొత్తల్లో చేసిన అరకొర సాంగ్స్.. ఇప్పుడతడిపై వచ్చిన ఆరోపణల్ని పోగొట్టి.. ‘కుర్రాడు మంచివాడే’ అనే ఆలోచన కలిగించేంత బలమైనవి కావు. బ్రార్ ఎన్నో రోజులు జైల్లో ఉండకపోవచ్చు. సీఎం అమరీందర్ సింగ్ శిక్షకు బెదరేలా చేస్తారు కానీ, శిక్ష విధించరని అంటారు. ఇక ‘జాన్’లోని బార్బీ మాన్‌కి బ్రార్‌ని మించిన ప్రొఫైలే ఉంది. ఫిరోజ్ పూర్ అమ్మాయి. పంజాబీ, భాంగ్రా, పాప్‌లో యువతను ఆకట్టుకునే స్వరాభినయం బార్బీది. 2020 జూన్‌లో రిలీజ్ అయిన బార్బీ సింగిల్ ‘తెరీ గలీ’ని ఒక్క నెలలో 2 కోట్ల 90 లక్షల మంది యూట్యూబ్ వ్యూయర్స్ చూశారు. ‘మేరీ సహేలీ’ ట్రాక్‌తో రెండేళ్ల క్రితం మొదలైన బార్బీ కెరీర్ ఇప్పుడు పీక్‌లో ఉంది. బీబీసీ చార్ట్‌లో ఆమె పేరు ఉంది. ఇప్పుడీ ‘జాన్’తోనూ ఆమెకు పేరు వచ్చిందే తప్ప, బ్రార్ సాహిత్యానికి గాత్రమిచ్చినందుకు పంజాబ్ ప్రభుత్వం ఏమీ అనలేదు. -
ఆ వ్యాపారంలో లేం: రిలయన్స్
సాక్షి, న్యూఢిల్లీ: కార్పొరేట్ లేదా కాంట్రాక్ట్ వ్యవసాయ వ్యాపారంలో తాము లేమని రిలయన్స్ సంస్థ స్పష్టం చేసింది. పంజాబ్‌లో తమ జియో సంస్థ టెలికం టవర్ల ధ్వంసం వెనుక స్వార్థ ప్రయోజనాలను ఆశిస్తున్న శక్తులున్నాయని ఆరోపించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు తమ టవర్లను ధ్వంసం చేయకుండా అడ్డుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ పంజాబ్, హరియాణా హైకోర్టులో రిలయన్స్ పిటిషన్ దాఖలు చేసింది. ‘మా గ్రూప్ సంస్థలు ఒప్పంద వ్యవసాయ రంగంలో లేవు. భవిష్యత్తులో ప్రవేశించాలన్న ఆలోచనా లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడా మేం వ్యవసాయ భూమిని కొనలేదు’ అని పిటిషన్లో రిలయన్స్ పేర్కొంది. సంస్థకు చెందిన రిటెయిల్ యూనిట్లు ఆహార ధాన్యాలు సహా నిత్యావసరాలను అమ్ముతాయన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా రిలయన్స్ స్పష్టత ఇచ్చింది. తాము రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయమని వివరించింది. పంజాబ్‌లో ఉన్న 9 వేల జియో టవర్లలో దాదాపు 1,800 టవర్లు ధ్వంసమయ్యాయి. రైతుల పంటలకు న్యాయమైన, లాభదాయకమైన ధరలు లభించాలన్న డిమాండ్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రిలయన్స్ పేర్కొంది. ఆ అఫిడవిట్లో అన్నీ అబద్ధాలే హైకోర్టులో రిలయన్స్ సమర్పించిన అఫిడవిట్లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకే ఆ సంస్థ ఈ పిటిషన్ వేసిందని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) విమర్శించింది. మహారాష్ట్రలో, దేశంలోని పలు ప్రాంతాల్లో రిలయన్స్ భూములను కొనుగోలు చేసిందని పేర్కొంది. భూములను రైతులకు వెనక్కు ఇచ్చాక కోర్టును ఆశ్రయించాలని రిలయన్స్‌కు సూచించింది. -
నేడు 4 రాష్ట్రాల్లో డ్రై రన్
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా టీకా పంపిణీకి యంత్రాంగం సన్నద్ధమైంది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ కానుంది. సన్నద్ధతలో భాగంగా డమ్మీ వ్యాక్సినేషన్ (డ్రై రన్)ను సోమవారం దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాంలలో ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాల్లో 2 రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. డ్రై రన్లో పలు కీలక దశలు ఉంటాయి. ళి ప్రతి జిల్లాలో 100 మందికి అవసరమైన డమ్మీ టీకాను సమీప డిపో నుంచి వ్యాక్సినేషన్ కేంద్రానికి తెస్తారు. ► వ్యాక్సిన్ తీసుకొనే వ్యక్తికి ఎస్ఎంఎస్ పంపిస్తారు. ఇందులో టీకా ఇచ్చే అధికారి పేరు, సమయం వంటి వివరాలుంటాయి. ► టీకా తీసుకున్న తర్వాత అరగంటపాటు అక్కడే కూర్చోవాల్సి ఉంటుంది. ► సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే చికిత్స చేస్తారు. ఈ సమాచారాన్ని సెంట్రల్ సర్వర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చేరవేస్తారు. డ్రై రన్ అంటే? నామమాత్ర పు(డమ్మీ) కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను డ్రై రన్‌గా వ్యవహరిస్తారు. ఇదొక మాక్ డ్రిల్ లాంటిదే. టీకా పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం, లోపాలను గుర్తించే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. -
పెళ్లి: కానుకలొద్దు.. విరాళం ఇవ్వండి!
ఛండీఘర్ : ఇటీవల ఓ కుటుంబం పెళ్లి వేడుకల్లో తీసుకున్న నిర్ణయం పలువురికి స్పూర్తిధాయకంగా నిలుస్తోంది. పెళ్లికి వచ్చిన అతిథుల నుంచి అందే మొత్తాన్ని కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు అందించేందుకు ఆ కుటుంబం నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన చంఢిఘర్ నగరానికి 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న ముక్త్సర్ పట్టణంలో చోటుచేసుకుంది. ఓ పంజాబీ కుటుంబం మంగళవారం పెళ్లి వేడుక నిర్వహించారు. అయితే వివాహానికి వచ్చిన అతిథులు బహుమతులకు బదులుగాడబ్బును అందజేయాలని కోరారు. అంతేగాక ఈ ఆలోచన వెనక అసలు కారణాన్ని వెల్లడించారు. వేడుకలో వచ్చిన డబ్బులను తాము ఉపయోగించకుండా.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు అందిస్తామని తెలిపింది. చదవండి: గృహ నిర్బంధంలో కేజ్రీవాల్: ఆప్ రైతుల ఆహారం, బట్టలు వంటి అత్యవసర వస్తువులను అందించేదుంకు ఉపయోగిస్తామన్నారు. ఈ మేరకు వీడియో ద్వారా బంధువులు, స్నేహితులకు విన్నపించారు. ఇందుకు పెళ్లి స్టేజ్ మీద విరాళ బాక్స్‌ను ఏర్పాటు చేశారు. కాగా కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారీ ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఇవి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని, వెంటనే వీటిని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం పలు మార్లు రైతు సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయయ్యాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు సాయత్రం రైతులతో ఆరోసారి సమావేశమై రైతులకు కొత్త చట్టాలపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేయనున్నారు. -
పద్మ విభూషణ్ వెనక్కి ఇస్తున్న: మాజీ సీఎం
చండీఘర్: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో నిరసనలు చేస్తున్నా విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకను పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతుండగా. తాజాగా పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీదల్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా రైతులకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు తనకు భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా వెనక్కి ఇస్తున్నట్లు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. బాదల్ తన లేఖలో.. రైతుల పట్ల కేంద్రం తీసుకున్న చర్య పట్ల తను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ రైతుల వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్రం కారణంగా అలాంటి రైతులు బాధ పడుతుంటే.. ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషన్ పురస్కారం వల్ల వచ్చిన గౌరవం తనకు అవసరం లేదని బాదల్ రాసుకోచ్చారు. కాగా 2015లో భారత ప్రభుత్వం బాదల్‌ను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఇప్పటికే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత ఎనిమిది రోజులుగా ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనేటి కేంద్ర మంత్రుల భేటీలో రైతులు కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాల వల్ల ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో వివరించారు. అందులో వారు చట్టం లోపాలపై దృష్టి సారించారు. దాని గురించి ఎందుకు భయపడుతున్నారో తెలిపారు. సమావేశం రెండవ భాగంలో ప్రభుత్వ సంస్కరణపై దృష్టి సారించనున్నారు. ఇక్కడ వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, అతని క్యాబినెట్ సహోద్యోగి పియూష్ గోయల్, జూనియర్ మంత్రి సోమ్ ప్రకాష్ రైతులతో సమావేశం కానున్నారు. -
దేశ రాజధానిని తాకిన రైతుల సెగ
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి రైతులు పెద్ద సంఖ్యలో పంజాబ్, హర్యానా నుంచి శనివారం ఉదయం జాతీయ రాజధాని శివార్లలోని నిరంకరి సమగం మైదానానికి రావడం ప్రారంభించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న 'దిల్లీ చలో' మార్చ్‌ను చేపట్టగా.. బురారీలో ఉన్న నిరంకరి మైదానంలోకి వెళ్లడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. "వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు మా నిరసన కొనసాగుతుంది. సుదీర్ఘకాలం మేము ఇక్కడ ఉంటాం" అని స్పష్టం చేశారు.. మైదానంలోనే రైతులు వంటలు చేసుకునేందుకు ఢిల్లీ సర్కార్ ఏర్పాట్లు చేసింది. అలాగే శాంతియుతంగా నిరసన చేపట్టాలని పోలీసులు రైతులకు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఢిల్లీ, హర్యానా సరిహద్దులోని సింగు వద్ద ఇవాళ ఉదయం పంజాబ్ రైతుల సమావేశం జరిగింది. నిరంకరి సమాగం మైదానంలో ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చినప్పటికీ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో తిక్రీ సరిహద్దు వద్ద భద్రత బలగాలు మోహరించాయి. రైతులు ఉత్పత్తి, వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం-2020, రైతుల ధర భరోసా, వ్యవసాయ సేవా చట్టం-2020, సవరణ (ఎసెన్షియల్ కమోడిటీస్) చట్టం అనే 3 చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుత నిరసన రాజ్యాంగబద్ధమైన హక్కు అని, తమపై బాష్పవాయువును ప్రయోగించడం నేరమని రైతులు ఆగ్రహిస్తున్నారు. అయితే.. ఈ మూడు చట్టాల వల్ల దళారి వ్యవస్థ పోతుందని, రైతులు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లలో విక్రయించడానికి వీలు కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు ప్రభుత్వం మద్ధతు ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవచ్చని, ఒకవేళ కొనుగోలు చేసినా సకాలంలో చెల్లింపులు జరగవని రైతులు ఆందోళన చెందుతున్నారు. చట్టాలను నిరసిస్తూ రైతుల బృందం ఫతేఘర్ సాహిబ్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. కొవిడ్-19 మహమ్మారి, శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తమ నిరసనను ముగించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ విజ్ఞప్తి చేశారు. చట్టాలకు సంబంధించిన సమస్యలను రైతు సంస్థల ప్రతినిధులతో చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. -
వ్యవసాయ బిల్లులపై నిరసనలు
చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతన్నలు భగ్గుమన్నారు. తమకు నష్టదాయకమైన ఈ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ప్రధానంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాలు శుక్రవారం అన్నదాతల ఆందోళనలతో అట్టుడికిపోయాయి. దేశవ్యాప్త బంద్‌లో భాగంగా రైతులు ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చారు. రహదారులను దిగ్బంధించారు. వ్యవసాయ బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ తాము పోరాటం ఆపే ప్రసక్తే లేదని నినదించారు. రైతుల నిరసనలతో పంజాబ్, హరియాణాలో జనం రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. గురువారం ప్రారంభమైన రైలు రోకో రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. రైతులు రైలు పట్టాలపై బైఠాయించారు. వ్యవసాయ బిల్లులపై రైతుల ఉద్యమానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ బంద్‌కు మద్దతునిచ్చాయి. ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ రాష్ట్రంలో పలుచోట్ల రోడ్ల దిగ్బంధం చేపట్టింది. వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బిల్లులతో రైతులను బానిసలుగా మారుస్తారా? అని నిలదీసింది. కనీస మద్దతు ధరను రైతుల నుంచి దూరం చేయడం ఏమిటని ప్రశ్నించింది. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించింది. -
దారుణం: కల్తీ మద్యం తాగి 24 మంది మృతి
చండీగఢ్: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సీఎం అమరీందర్ సింగ్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. మృతులంతా అమృత్సర్, గురుదాస్‌పూర్, టార్న్ తరన్ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గురువారం సాయంత్రం కల్తీ మద్యం తాగి అమృత్‌సర్‌లోని తార్సిక్కా మండలం ముచ్చల్, టాంగ్రా గ్రామాలకు చెందిన ఐదుగురు మొదట మరణించినట్లు డీజీపీ దింకర్ గుప్తా తెలిపారు. అదే రోజు రాత్రి ముచ్చల్ గ్రామంలో మరో ఇద్దరు మరణించారని డీజీపీ చెప్పారు. టార్న్ తరన్‌లో నాలుగు, బటాలాలో ఐదు మరణాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 24కు చేరిందని వెల్లడించారు. సీఎం ఆదేశం మేరకు ఈ కేసును డివిజనల్ కమిషన్ జలంధర్‌తో పాటు పంజాబ్ జాయింట్ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ కమిషన్ సంబంధిత జిల్లాల ఎస్పీలతో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
స్వస్థలాలకు చేరిన వీర జవాన్ల మృతదేహాలు
సాక్షి, న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని గాల్వన్ లోయా వద్ద చైనాతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన సైనికుల మృతదేహాలు బుధవారం వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. సోమవారం రాత్రి చైనా దాడిలో 20 మంది భారత సైనికులు వీరమరణం పోందినట్లు ఆర్మీ అధికారులు మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మరణించిన సైనికుల మృతదేహాలను ఉంచిన శవపేటికకు జాతీయా జెండాను కప్పి సైనిక లాంఛనాలతో వారి స్వస్థలాలకు తరలించారు. కాగా మరణించిన సైనికుల్లో బీహార్‌కు చెందివారు అయిదుగురు, పంజాబ్‌కు చెందిన నలుగురు, పశ్చిమ బెంగాల్, ఓడిశా, జార్ఖండ్‌కు రాష్ట్రాలకు చెందిన వారు ఇద్దరూ చొప్పున ఉన్నారు. చత్తీస్గడ్, మధ్యప్రదేశ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ చెందిన ఒక్కొక్కరూ ఉన్నారు. కాగా ఇవాళ సైనికుల మృతదేహాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు జరపనున్నాయి. (సూర్యాపేటలో కల్నల్ సంతోష్ అంతిమయాత్ర) మరణించిన సైనికుల పేర్లు.. 1. కల్నల్ బి. సంతోష్‌బాబు (తెలంగాణ) 2. నాయిబ్ సుబేదార్ నుదురం సోరెన్ 3. నాయబ్ సుబేదార్ మన్దీప్ సింగ్ 4. నాయబ్ సుబేదార్ సత్నం సింగ్ 5. హవిల్దార్ కె పళని 6. హవిల్దార్ సునీల్ కుమా 7. హవిల్దార్ బిపుల్ రాయ్ 8. నాయక్ దీపక్ కుమార్ 9. సిపాయి రాజేష్ ఒరాంగ్ 10. సిపాయి కుందన్ కుమార్ ఓజా 11. సిపాయి గణేష్ రామ్ 12. సిపాయి చంద్రకాంత ప్రధాన్ 13. సిపాయి అంకుష్ 14. సిపాయి గుర్బిందర్ 15. సిపాయి గుర్తేజ్ సింగ్ 16. సిపాయి చందన్ కుమార్ 17. సిపాయి కుందన్ కుమార్ 18. సిపాయి అమన్ కుమార్ 19. సిపాయి జై కిషోర్ సింగ్ 20. సిపాయి గణేష్ హన్స్డా అడ్డుకున్న సంతోష్ నేతృత్వంలోని దళం సూర్యాపేటలో కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు.. కాగా తెలంగాణకు చెందిన కమాండర్ కల్నల్ సంతోష్‌బాబు మృతదేహాన్ని బుధవారం రాత్రి దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి హైదరాబాద్‌లోని హకీంపేటలోని వైమానిక దళానికి తరలించారు. ఆ తర్వాత విద్యానగర్‌లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. జాతియ జెండా కప్పిన సంతోస్ బాబు శవపేటికను సైనికులు అంబులెన్స్ నుంచి బయటకు తీస్తుండగా అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఉద్వేగానికి లోనవుతూ ‘సంతోష్ బాబు అమర్ హ’ అంటూ నినాదాలు చేశారు. గురువారం ఉదయం కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ఆయన స్వస్థలం సూర్యాపేటలో ముగిశాయి. సంతోష్ అంత్యక్రియలకు మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. -
శివలింగంపై అసభ్యకర పదాలు రాసి..
లుధియానా : హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే శివలింగంపై అసభ్యకర పదాలు రాసి కించపరిచారు కొందరు దుండగులు. ఈ సంఘటన పంజాబ్‌లోని లుధియానాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జగరాన్లోని శివాలా చౌక్, శ్రీ సీతా రామ్ మందిర్‌లోని శివలింగంపై అసభ్యకర పదాలు రాసి కించపరిచారు గుర్తుతెలియని వ్యక్తులు. సాయంత్రం దేవుడ్ని దర్శించుకోవటానికి అక్కడికి వచ్చిన ఓ భక్తుడు శివలింగంపై రాసి ఉన్న అసభ్యకర పదాలను చదివి వెంటనే ఆలయ పూజారి బాబా మహేశ్ గిరికి సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పూజారి శివలింగాన్ని శుభ్రం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ( అన్న ఇంటికే కన్నం వేసిన సోదరి ) సీసీటీవీ ఫొటేజీల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫొటేజీల ఆధారంగా ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఆలయ పూజారి బాబా గిరి మాట్లాడుతూ.. ‘‘కొన్ని అసాంఘీక శక్తులు శివలింగంపై అసభ్యకర పదాలు రాసి, మతాల మధ్య చిచ్చుపెట్టడానికి చూస్తున్నాయి. వారిని కఠినంగా శిక్షించాలి’’ అని అన్నారు. ( చైనాలో దారుణ సంఘటన ) -
వణికిస్తున్న రాకాసి మిడతలు
రాకాసి మిడతలు విశ్వరూపం దాల్చుతున్నాయి. ఇథియోపియా, సోమాలియా వంటి తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి పెద్ద గుంపులు గుంపులుగా ఖండాలు దాటి వస్తూ పంటలకు పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. మిడతల దండును ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ఫిబ్రవరిలోనే ఎమర్జెన్సీ ప్రకటించింది. అక్కడి నుంచి మిడతల దండు మన దేశంలోకి ప్రవేశించాయి. రాజస్థాన్, గుజరాత్, పంజా»Œ లతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో కూడా పంటలను నమిలేస్తున్నాయి. రాజస్థాన్‌లోని 18 జిల్లాల్లో, మధ్యప్రదేశ్‌లో 12 జిల్లాల్లో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లోనే 2.05 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం రాకాసి మిడతల దండు దాడికి గురైనట్లు అంచనా. రాజస్థాన్‌లోనే 5 లక్షల హెక్టార్లలో పంటలను మిడతలు స్వాహా చేస్తున్నాయి. ముందుకు విస్తరిస్తున్నాయి. ఈ రాష్ట్రాలకు మిడతల తాకిడి కొత్తేమీ కాదు. అయితే, ఈ ఏడాది సాధారణంగా కన్నా కొన్ని వారాలు ముందుగానే విరుచుకుపడటంతో చేతికి వచ్చే దశలో రబీ పంటలు ధ్వంసమయ్యాయి. గత 27 ఏళ్లలో ఎరుగనంత ఎక్కువ బెడద ఇప్పుడు ముంచుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు. పళ్లాలు, ఇతర పాత్రలు, డబ్బాలను మోగించడం, పెద్దగా శబ్దాలు చేస్తూ మిడతల దండును పారదోలి పొలాల్లోని పంటలను కాపాడుకోవాల్సిందిగా అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ట్రాక్టర్ స్ప్రేయర్లతో, అగ్నిమాపక యంత్రాలతో ప్రభుత్వాలు పురుగుమందులు పిచికారీ చేయిస్తున్నాయి. అయితే, 2.5–3 కిలోమీటర్ల పొడవైన కోట్లాది మిడతల గుంపు పంటల మీద దాడి చేస్తున్నందున డ్రోన్లను రంగంలోకి దింపడం అవసరమని కేంద్ర వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్లాంట్ ప్రొటెక్షన్ క్వారంటైన్ అండ్ స్టోరేజ్ డైరెక్టరేట్‌కు మిడతల దండు నియంత్రణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. దేశంలో ఇప్పటి వరకు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడం చట్టవిరుద్ధం. అయితే, మిడతల విపత్తును ఎదుర్కొనేందుకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేస్తూ కేంద్ర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మిడతలు పగటి పూట ప్రయాణం చేసి రాత్రి పూట చెట్లు చేమలు పంటలపై వాలుతాయి. ఆ సమయంలో పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు. మన దేశంలోకి సాధారణంగా పాకిస్తాన్ మీదుగా మిడతల దండు దాడి చేస్తూ ఉంటుంది. అయితే, ఈ సంవత్సరం తీవ్రత చాలా రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో రెండో వైపు నుంచి కూడా మిడతల ముప్పు ఉండొచ్చని భావిస్తున్నారు. తూర్పు ఆఫ్రికా నుంచి హిందూమహా సముద్రం మీదుగా నేరుగా భారత ద్వీపకల్పంలోని తెలుగు రాష్ట్రాలు సహా అనేక ఇతర రాష్ట్రాలపైనా మిడతల దండు దాడికి దిగవచ్చని అధికారవర్గాలు హెచ్చరిస్తున్నాయి. జూలైలోగా భారత్ వైపు మరిన్ని మిడతల గుంపులు కదిలి వచ్చే అవకాశం ఉందని ఆహార వ్యవసాయ సంస్థ సూచిస్తోంది. -
డ్రగ్స్ కేసులో పంజాబ్ సింగర్ అరెస్ట్
చండీగడ్ : అనారోగ్యం కారణంగా హాస్పటిల్‌లో చేరగా, పరీక్షలు నిర్వహిస్తే అతను మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. పంజాబీ గాయకుడు గురీందర్ పాల్ సింగ్ అలియాస్ బడ్డా గ్రెవాల్ 30 గ్రాముల ఓపియమ్(నల్లమందు) తీసుకోవడంతో.. అనారోగ్యం కారణంగా సొహానాలోని ఎస్‌జీహెచ్‌ఎస్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు ఇచ్చిన సమాచారం మేరకు సోహనా పోలీసులు శుక్రవారం గురీందర్‌ను అరెస్ట్ చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్పిడిఎస్) చట్టంలోని 27, 18 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సబ్ ఇన్స్పెక్టర్ హర్జిందర్ సింగ్ తెలిపారు. మరోవైపు పంజాబ్‌లో యువత మాదకద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నట్లు ఇప్పటికే బహిర్గతమైంది. దీనిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా ప్రధాని మోదీకి గతంలో లేఖ రాశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి హోంశాఖ, ఆరోగ్య, న్యాయ శాఖలతో చర్చించి మరింత కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరారు. -
వివాహేతర సంబంధం; టీవీ నటి దారుణ హత్య..!
డెహ్రాడూన్ : పంజాబ్‌కు చెందిన ఓ టీవీ నటి భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. వివరాలు.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు చెందిన అనితా సింగ్ (29), రవీందర్‌సింగ్ పాల్ భార్యాభర్తలు.. అనితా టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. ఈక్రమంలో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. వివాహేతర సంబంధం కారణంగా భార్య తనను దూరం పెడుతోందని భావించిన రవీందర్ ఆమెను హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం ఢిల్లీకి చెందిన తన మిత్రుడు కుల్దీప్తో పక్కా స్కెచ్ వేశాడు. కుల్దీప్కు చిత్రసీమలో పరిచయాలున్నాయని, అతన్ని కలిస్తే బాలీవుడ్లో అవకాశాలు ఇప్పిస్తాడని నమ్మబలికాడు. దాంట్లో భాగంగానే ఉత్తరాఖండ్‌లోని కలదుంగీకి రవీందర్ అనితను తీసుకెళ్లాడు. అక్కడ కుల్దీప్ని కలిసిన అనంతరం.. ముగ్గురూ ఓ హోటల్లో భోజనం చేశారు. అనితకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చిన నిందితులు.. ఆమె స్పృహ కోల్పోగానే కారులో ఓ అడవిలోకి తీసుకెళ్లి గొంత నులిమి చంపేశారు. ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. అయితే, అనిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటీజీ ఆధారంగా కేసును ఛేదించారు. నిందితులు రవీందర్, కుల్దీప్ను అరెస్టు చేసి జైలుకు తరలించామని నైనిటాల్ ఎస్పీ ఎస్కే.మీనా శుక్రవారం తెలిపారు. -
దారుణం: నడిరోడ్డుపై ఓ జంటను వెంటాడి..
చండీగడ్ : ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటను నడిరోడ్డుపై వెంటాడి కాల్చి చంపిన ఘోరఘటన కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకున్నారన్న కోపంతో యువతి బంధువులే వారిని హతమార్చారు. ఈ ఘటన పంజాబ్‌లోని నౌషేరా గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అమన్‌ప్రీత్ కౌర్(23) అనే అమ్మాయి అదే గ్రామాని చెందిన అమన్‌దీప్ సింగ్‌లు ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. వీరీ ప్రేమ వ్యవహారంపై ముందు నుంచి వ్యతిరేకంగా ఉన్న అమ్మాయి కుటుంబ సభ్యులు వారు వివాహం చేసుకొవడంతో ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో అదివారం ఈ జంట గురుద్వార బీర్ బాబా బుద్ధ సాహీబ్‌ను దర్శించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళ్తుండగా అమ్మాయి బంధువులు వారిపై దాడి చేశారు. ఆ జంట ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వారి వాహనంతో ఢీ కోట్టడంతో వారు కిందపడ్డారు. ఆ తర్వాత వారిని చూసి భయంతో పరుగులు తీస్తున్న ఆ దంపతులను వెంటాడి పలుమార్లు తుపాకితో కాల్పులు జరిపారు. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నౌషేరా గ్రామంలో గత ఏడాది ఓ అమ్మాయి బంధువులు అబ్బాయి కుటుంబ సభ్యులు ముగ్గురిని హతామార్చారని, ఇప్పటికీ ఆ కేసుపై విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కోన్నారు. -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు
బటాలా: పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి బటాలా ప్రాంతంలో జనావాసాల మధ్య ఉన్న బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీ భవంతి పేకమేడలా కూలిపోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది భారీ సంఖ్యలో ప్రమాదస్థలికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ పేలుడు తీవ్రతకు బాణాసంచా ఫ్యాక్టరీ నేలమట్టం కాగా, పలువురు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. భయానక అనుభవం.. బటాలా అగ్నిప్రమాదంపై తమ భయానక అనుభవాలను స్థానికులు మీడియాతో పంచుకున్నారు. ఈ విషయమై రాజ్‌పాల్ ఖక్కర్ అనే వ్యక్తి మాట్లాడుతూ..‘నేను సమీపంలోని గురుద్వారాకు వెళ్లి వస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీంతో నేను నేలపై పడిపోయి స్పృహ కోల్పోయాను. కళ్లు తెరిచిచూసేసరికి ఆసుపత్రిలో ఉన్నాను’ అని తెలిపారు. సాహిబ్ సింగ్ అనే మరో వ్యక్తి స్పందిస్తూ..‘సెప్టెంబర్ 5న గురునానక్ దేవ్ 532వ వివాహ వార్షికోత్సవ వేడుకల నేపథ్యంలో బాణాసంచా కొనుగోలు చేసేందుకు వెళ్లాను. అంతలోనే భారీ తీవ్రతతో పేలుడు సంభవించింది. ఆ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే నేను తిరిగి స్పృహలోకి రావడానికి చాలాసేపు పట్టింది’ అని వ్యాఖ్యానించారు. మృతులకు 2 లక్షల పరిహారం బటాలా దుర్ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. బటాలా అదనపు డిప్యూటీ కమిషనర్ ఈ విచారణ చేపడతారని వెల్లడించారు. అలాగే సహాయక చర్యలను పర్యవేక్షించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి రాజేందర్ సింగ్‌కు సూచించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50,000, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.25 వేలు నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని గురుదాస్‌పూర్ జిల్లా అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు బటాలా సీనియర్ మెడికల్ ఆఫీసర్ సంజీవ్ భల్లా మాట్లాడుతూ.. క్షతగాత్రులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం సెలవుపై ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని వెనక్కు పిలిపించామని పేర్కొన్నారు. రాష్ట్రపతి కోవింద్, రాహుల్ దిగ్భ్రాంతి బటాలా అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశా>రు. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోవడంపై రాహుల్ విచారం వ్యక్తంచేశారు. క్షతగాత్రులు వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు బటాలా దుర్ఘటనపై గురుదాస్‌పూర్ ఎంపీ సన్నీడియోల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కాలువలోకి ఎగిరిపడ్డ కార్లు.. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు తీవ్రతకు సమీపంలోని రెండు భవనాలు కూలిపోయాయి. దగ్గర్లోని కార్లు, ఇతర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని వాహనాలు ఎగిరి సమీపంలోని కాలువలో పడిపోయాయి. పేలుడు ప్రకంపనలకు కిలోమీటర్ దూరంలోని భవనాల అద్దాలు పగిలిపోయాయి. చాలామంది క్షతగాత్రుల తల, కాళ్లకు గాయాలయ్యాయి – విపుల్ ఉజ్వల్, గురుదాస్‌పూర్ డీసీపీ పేలుడు ధాటికి ఛిద్రమైన మృతదేహాలను తీసుకెళ్తున్న పోలీసులు, స్థానికులు -
కేబినెట్ నుంచి సిద్ధూ నిష్క్రమణ
చండీగఢ్: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జోత్ సింగ్ సిద్ధూ పంజాబ్ మంత్రివర్గం నుంచి వైదొలిగారు. గత నెలలోనే ఆయన రాజీనామా చేసినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో విభేదాలు, మంత్రివర్గంలో కీలక శాఖల నుంచి తప్పించడం వంటి పరిణామాల నేపథ్యంలో జూన్‌లోనే రాజీనామా చేసినట్లు ఆదివారం ఆయన ట్విట్టర్లో ప్రకటించారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కు పంపిన ఆ లేఖను సీఎంకు కూడా పంపుతానన్నారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ జూన్ 6వ తేదీన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, స్థానిక పాలన శాఖల బాధ్యతల నుంచి సిద్ధూను తప్పించి ఇంధనం, పునర్వినియోగ ఇంధన శాఖలను కేటాయించారు. దీంతోపాటు పలు ప్రభుత్వ కమిటీల్లో సిద్దూకు స్థానం కల్పించలేదు. ఈ పరిణామాలతో తీవ్ర అసంతృప్తి చెందిన సిద్దూ గత నెల 9వ తేదీన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కలిసి, పరిస్థితిని వివరించడంతోపాటు ఒక లేఖను కూడా అందజేసినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆయన తనకు కేటాయించిన కొత్త మంత్రిత్వశాఖల బాధ్యతలను చేపట్టలేదు. దీంతో సిద్ధూ, సీఎం సింగ్‌ల మధ్య విభేదాలను పరిష్కరించే బాధ్యతను సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు పార్టీ అప్పగించింది. అయితే, సమస్య పరిష్కారం అవుతుందనే ఆశాభావంతో నెల రోజులపాటు వేచి చూసినా ఎలాంటి ఫలితం కనిపించకనే తాజాగా సిద్ధూ తన రాజీనామా లేఖను బహిర్గతం చేసినట్లు సమాచారం. ఈ నెల రోజులు కూడా సిద్ధూ మీడియా, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నారు. సీఎం, సిద్ధూ విభేదాలు ఏమిటి?: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ప్రభావం కనిపించకపోవటానికి స్థానిక పాలన శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్న సిద్ధూయే కారణమంటూ సీఎం అమరీందర్ బాహాటంగా ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో మత విశ్వాసాలకు భంగం కలిగించిన బాదల్ కుటుంబీకులపై కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ అంతకుముందు ఎన్నికల ప్రచారంలో సీఎంను సిద్దూ ప్రశ్నించారు. అదేవిధంగా, తనకు కెప్టెన్ రాహుల్ గాంధీయేనని, తన కెప్టెన్(సీఎం)కు కూడా ఆయనే కెప్టెన్ అంటూ గత ఏడాది సిద్దూ వ్యాఖ్యానించడం విభేదాలకు ఆజ్యం పోసింది. -
‘ఆ ముఖ్యమంత్రి జైలుకెళ్లడం ఖాయం’
చండీగఢ్: మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై శిరోమణి అకాలీదళ్ నేత మంజీందర్ సింగ్ సిర్సా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్లా ఆయన కూడా జైలుకెళ్లడం ఖాయమని సిర్సా పేర్కొన్నారు. 1984 సిక్కుల ఊచకోత కేసును మళ్లీ తెరిచి తాజాగా విచారణ చేపట్టాలంటూ కేంద్ర హోంశాఖ సిట్‌ను ఆదేశించిన నేపథ్యంలోనే సిర్సా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజా విచారణ పూర్తై, ఈ కేసులో కమల్‌నాథ్ నిందితుడని తేలితే ఆయన కటకటాలు లెక్కించడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ను నియమించడంపై గతంలోనే సిర్సా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సిక్కులను చిత్రహింసలకు గురిచేసిన వ్యక్తిని సీఎంగా ఎలా నియమిస్తారని ఆయన బహిరంగంగానే విమర్శించారు. ఇందిర మరణాంతరం జరిగిన ఘటనతో కమల్‌నాథ్ హస్తం కూడా ఉందని ఎంతోకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును మరోసారి విచారించాలంటూ కేంద్ర హోంశాఖ తాజాగా సిట్‌ను ఆదేశించడంతో మరోసారి తెరపైకి వచ్చింది. కాగా సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు విధిస్తూ డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. -
స్థానిక సంస్థల మంత్రిగా సిద్ధూ ఔట్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన కేబినెట్ సహచరుడు నవజ్యోత్‌సింగ్ సిద్ధూపై కొరడా ఝుళిపించారు. చండీగఢ్‌లో గురువారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన పంజాబ్ సీఎం స్థానిక సంస్థలు, టూరిజం, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి బాధ్యతల నుంచి సిద్ధూను తప్పించారు. అనంతరం విద్యుత్, పునరుత్పాదక ఇంధనవనరుల మంత్రిత్వశాఖను సిద్ధూకు అప్పగించారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని పట్టణ, నగర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శనపై సీఎం అమరీందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా సిద్ధూ సరిగ్గా వ్యవహరించలేదనీ, అందువల్లే కాంగ్రెస్ నిరాశాజనక ప్రదర్శన చేసిందని అభిప్రాయపడ్డారు. తన అనాలోచిత చర్యలతో కాంగ్రెస్ లక్ష్యాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చండీగఢ్‌లో గురువారం నిర్వహించిన కేబినెట్ భేటీకి సిద్ధూ గైర్హాజరయ్యారు. మరోవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన అనంతరం సీఎం అమరీందర్ మాట్లాడుతూ.. తాజా మార్పుల వల్ల పాలనలో మరింత పారదర్శకతతో పాటు ప్రభుత్వ విభాగాలను మరింత సమర్థవంతంగా నడపడం వీలవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, ఇప్పటివరకూ సిద్ధూ నిర్వహించిన స్థానిక సంస్థలు టూరిజం శాఖను ఛత్రంజి సింగ్‌కు అమరీందర్ అప్పగించారు. ఆరోగ్యం–కుటుంబ సంక్షేమ శాఖను బల్బీర్ సిద్ధూకు, త్రిప్త్ బజ్వాకు ఉన్నత విద్య, పశుపోషణ–డైరీ, చేపల పెంపకం మంత్రిత్వశాఖలను కేటాయించారు. గుర్ప్రీత్ సింగ్‌కు రెవెన్యూశాఖను, విజయేందర్ సింగ్లాకు పాఠశాల విద్య, రవాణా శాఖను రజియా సుల్తాన్‌కు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖను అరుణా చౌదరికి సీఎం అప్పగించారు. నన్ను బలిపశువును చేశారు: సిద్ధూ సీఎం అమరీందర్ సింగ్ విమర్శలను మంత్రి సిద్ధూ తిప్పికొట్టారు. ‘పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో నేను కీలకపాత్ర పోషించా. నాకు కష్టపడకుండా ఏదీ రాలేదు. గత 40 ఏళ్లుగా నేను అంతర్జాతీయ క్రికెటర్‌గా, క్రికెట్ వ్యాఖ్యాతగా, టీవీ కార్యక్రమాల్లో రాణిస్తున్నా. అలాగే యువతలో స్ఫూర్తి పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా 1300కుపైగా మోటివేషనల్ కార్యక్రమాల్లో ప్రసంగించాను. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం రూ.10,000 కోట్లు కేటాయించాం. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పంజాబ్‌లోని అమృత్సర్, జలంధర్, పటియాలా, ఎస్ఏఎస్నగర్ సహా పలు పట్టణాల్లో గెలిచింది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనకు అందరూ నా శాఖనే బాధ్యులుగా చేశారు. నేను అమరీందర్‌ను నా పెద్దన్నగా భావిస్తాను. ఆయన మాటలను ఎల్లప్పుడూ గౌరవించాను. ఏదైనా విషయముంటే నన్ను వ్యక్తిగతంగా పిలిచి అమరీందర్ మాట్లాడాల్సింది. కానీ ఆయన తీరు నాకు బాధ కలిగించింది. ఇప్పుడు మంత్రిమండలి సమిష్టి బాధ్యత ఏమైంది? సీఎం కుర్చీ నా కుర్చీకి 3 అంగుళాల దూరంలోనే ఉన్నప్పటికీ నాపై అమరీందర్‌కు విశ్వాసం లేదు. నా పేరు, విశ్వసనీయత, పనితీరుపై వచ్చే విమర్శలను దీటుగా తిప్పికొడతా. నేను ఎప్పటికీ కాంగ్రెస్‌వాదినే’ అని సిద్ధూ స్పష్టం చేశారు. -
పంజాబ్ సీఎం సంచలన ప్రకటన
చంఢీగడ్: లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తానని, పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘పంజాబ్‌లో పార్టీ అత్యధిక స్థానాలు గెలిచే లక్ష్యంతో పని చేస్తున్నాం. పార్టీ అధిష్టానం మాపై ఆ బాధ్యత ఉంచింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రతి ఒక్కరు ఇదే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన దానికి బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేస్తాను’’ అని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 13 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం మూడు స్థానాలకే పరిమితమైన విషయం తెలిసిందే. బీజేపీ ఆరు, ఆప్ 4 స్థానాల్లో విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘన విజయం సాధించి పెట్టిన అమరిందర్పైనే ఈసారి కూడా పార్టీ ఆశలు పెట్టుకుంది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తామని కెప్టెన్ ధీమా వ్యక్తం చేశారు. చివరివిడత ఎన్నికల్లో భాగంగా మే 19న పంజాబ్‌లో పోలింగ్ జరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను 77 స్థానాల్లో విజయం సాధించి సీఎంగా అమరీందర్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. -
డోల్‌ను రంజుగా వాయిస్తున్న పంజాబీ యువతి
పంజాబీ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరైన డోల్‌ను భలే రంజుగా వాయిస్తున్న ఈ ఫొటోలో అమ్మాయి జహన్ గీత్ దేవల్. పంజాబ్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతోంది. వాస్తవానికి ఎన్నికల్లో మొదటిసారి ఓటు హక్కు వచ్చింది ఆమెకు ఇప్పుడే. అయినా ఊరూరూ తిరుగుతూ ఓటు వెయ్యండహో అంటూ డోలు వాయిస్తూ ఇతరుల్లో స్ఫూర్తి నింపుతోంది. పంజాబ్‌లో అమ్మాయిలు డోలు వాయించడమంటేనే అదొక వింత. అది మగవాళ్లు మాత్రమే వాయించే వాద్య పరికరం అని పేరుంది. ఆ అడ్డుగోడల్ని ఛేదించి నాలుగేళ్ల క్రితం అంటే పద్నాలుగేళ్ల వయసులోనే జహన్ డోలు పట్టింది. సాధారణంగా పంజాబ్‌లో డోలుని శుభకార్యాల్లో వాయిస్తారు. ‘‘నేను తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాను. ఫస్ట్ టైమ్ ఓటు హక్కు వినియోగించుకునే వాళ్లందరూ ఈసారి తమ ఓటుహక్కు వినియోగించుకోవాలి. తమకు నచ్చిన ప్రతినిధిని ఎంచుకోవాలి‘‘ అంటూ ప్రచారం చేస్తున్నారు ఆమె. ‘‘మనం రాజకీయ నాయకుల్ని గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటాం. వారిలో ఎంత ప్రతిభ ఉందో తెలీకుండానే ఆహో ఓహో అని అంటూ ఉంటాం. ఒక్కోసారి తల్లిదండ్రుల ప్రలోభాలకి కూడా లొంగిపోతాం. కానీ అలా చెయ్యకూడదు. మనకి బంగారు భవిష్యత్ ఎవరి వల్ల వస్తుందో ఆలోచించి ఓటు వెయ్యాలి‘‘ అని అంటున్నారు జహన్. -
పంజాబ్ ‘స్థానికం’లో కాంగ్రెస్ విజయం
చండీగఢ్: పంజాబ్‌లో జిల్లా పరిషత్‌లు, పంచాయతీ సమితులకు ఈనెల 19వ తేదీన జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. మొత్తం 355 జిల్లా పరిషత్ సీట్లలో కాంగ్రెస్ 331, శిరోమణి అకాలీదళ్ 18, బీజేపీ 2 దక్కించుకున్నాయి. అదేవిధంగా 2,899 పంచాయతీ సమితుల్లో కాంగ్రెస్ 2,351, శిరోమణి అకాలీదళ్ 353, బీజేపీ 63, ఆప్ 20, సీపీఐ 1, సీపీఎం 2, ఇతరులు 107 గెలుచుకున్నారు. -
పోలీసును చెట్టుకు కట్టేసి చితకబాదారు
సాక్షి, చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో దారుణం చోటుచేసుకుంది. శాంతిభద్రతలు కాపాడాల్సిన ఓ పోలీసు అధికారే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి స్థానికులు ఆగ్రహించి పోలీసును చెట్టుకు కట్టేసి చితకబాదారు. వివరాలు.. పీకలదాక మద్యం సేవించిన ఓ పోలీసు అధికారి మద్యం మత్తులో తనపై అత్యాచారం చేయబోయాడని ఓ మహిళ స్థానికులకు తెలిపింది. దీంతో స్థానికులు ఆ అధికారిని పట్టుకొని చెట్టుకి కట్టేసి చితకబాదారు. ఈ విషయం తెలుసున్న పోలీసు ఉన్నతాధికారులకు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
రైతుల ఆందోళన దేనికోసం?
ఇటీవల రైతులు, పాల వ్యాపారులు, కూరగాయల వ్యాపారుల నిరసన ప్రదర్శ నల సందర్భంలో చెలరేగిన ఘర్షణలను దృష్టిలో పెట్టు కుని పంజాబ్‌లో పది రోజుల పాటు జరగాల్సిన గావ్ బంద్ (గ్రామాల బంద్)ను కుదించాలన్న నిర్ణయం హర్షించదగ్గ పరిణామం. అనేక కొట్లాట లకు దారితీసిన రైతుల ఆందోళనలు మరోసారి గ్రామీణ ప్రాంతాల్లో రక్తపాతానికి కారణమౌతాయనే భయంతో గావ్ బంద్‌ను మధ్యలోనే విరమించడం మంచి నిర్ణయం. కిందటేడాది మధ్యప్రదేశ్‌లోని మాండసోర్‌లో రైతులు ఆందోళనకు దిగినప్పుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మర ణించారు. ఇలాంటి దురదృష్టకర ఘటన పునరా వృతం కాకూడదనే భావనతోనే గావ్ బంద్‌ను విర మించారు. రైతుల నిరసనకు న్యాయమైన కారణాలు లేవన్న కేంద్రమంత్రి రాధామోహన్‌సింగ్ హరి యాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్... నిజంగా రైతుల పరిస్థితి అంతా బాగుంటే, వ్యవసా యంలో లోపాలే లేకుంటే రైతుల ఆత్మహత్యలు ఎందుకు కొనసాగుతున్నాయనే అనుమానం నాకు వస్తోంది. వ్యవసాయరంగం వ్యవస్థాపరమైన సంక్షో భంలో కూరుకుపోతోంది. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు నిలకడగా కొనసాగడా నికి కర్షకులను కావాలనే ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడకుండా చేస్తున్నారు. ఆర్బీఐ మాజీ గవ ర్నర్, ప్రసిద్ధ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ ఇది వరకు చెప్పిన మాటలే దీనికి తార్కాణం. వ్యవసాయాన్ని ఆర్థికంగా గిట్టుబాటయ్యే వృత్తిగా మార్చాల్సిన అవ సరముందని చెప్పడానికి బదులు ‘‘రైతులను వ్యవ సాయం నుంచి బయటకు తీసుకొచ్చి నగరాలకు తరలించడమే అతి పెద్ద సంస్కరణ. ఎందుకంటే, పట్టణ ప్రాంతాలకు తక్కువ వేతనంతో పనిచేసే కార్మికుల అవసరం ఉంది’’ అని సూత్రీకరించారు. నేడు దేశం ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభం ఓ ‘ఆర్థిక కుట్ర’ ఫలితమని చెప్పవచ్చు. నామమాత్రంగా సైతం పెరగని వ్యవసాయో త్పత్తుల ధరలు వ్యవసాయానికి సంబంధించిన తాజా ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే రైతులకు ఏం దక్కుతోందో స్పష్టమౌతుంది. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం నాలుగో భాగంలో వ్యవసాయోత్పత్తుల ధరలు కేవలం 0.4 శాతం మాత్రమే పెరిగాయని కేంద్ర గణాంక కార్యలయం (సీఎస్ఓ) ప్రకటిం చింది. 2011–12 మధ్య ఐదేళ్ల కాలంలో వాస్తవిక వ్యవసాయ ఆదాయాలు ఏటా అర శాతం కన్నా తక్కువే (ఖచ్చితంగా చెప్పాలంటే 0.44) పెరిగా యని నీతి ఆయోగ్ ఇది వరకటి నివేదికలో వెల్లడిం చింది. వ్యవసాయోత్పత్తుల నికర ధరలు ప్రపంచ వ్యాప్తంగా 1985–2005 మధ్య ఇరవై ఏళ్ల కాలంలో ఎదుగూబొదుగూ లేకుండా నిలిచిపోయాయని ఐక్య రాజ్యసమితి అనుబంధ సంస్థ అంక్టాడ్ కొన్నేళ్ల క్రితం విడుదల చేసిన ఓ నివేదికలో తెలిపింది. 1970 సంవత్సరంలో గోధుమకు క్వింటాలుకు కనీస మద్దతు ధర 76 రూపాయలుంది. 45 ఏళ్ల తర్వాత, 2015లో గోధుమల ధర క్వింటాలుకు రూ. 1435కు పెరిగింది. అంటే గోధుమ మద్దతు ధర 19 రెట్లు పెరిగింది. ఈ నాలుగున్నర దశాబ్దాల కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం, కరవు భత్యం (డీఏ) కలిపి 120 నుంచి 150 రెట్లు పెరిగింది. కళా శాల–విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల వేతనాలు 150 నుంచి 170 రెట్లు, పాఠశాల ఉపాధ్యాయుల జీతాలు 280 నుంచి 320 రెట్లు పెరిగాయి. అయితే, రైతుల ఉత్పత్తులకు చెల్లించే ధరలు ఈ 45 సంవత్సరాల్లో నిజమైన పెరుగుదల లేకుండా దాదాపు నిలకడగా నిలిచిపోయాయి. అంతేగాక, ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలుతో ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 108 రకాల భత్యాలు అందుబాటులోకి వచ్చాయి. కనీస మద్దతు ధర నిర్ణయించే క్రమంలో తమకు కూడా ఇంటి అద్దె అలవెన్స్, వైద్య ఖర్చుల అలవెన్స్, విద్యకు అలవెన్స్, ప్రయాణ భత్యం చేర్చా లని రైతులు ఎప్పుడైనా అడిగారా? అనుమానమే. ఇంతటి అననుకూల పరిస్థితుల్లో దేశానికి ధాన్యాగారంగా పరిగణించే పంజాబ్‌లో ప్రతి ముగ్గురు రైతుల్లో ఒకరు పేదరికంలో జీవిస్తున్నారన్న విషయం ఆశ్చర్యం కలిగించదు. 98 శాతం నికర సాగునీటి సరఫరా సౌకర్యాలతో ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో పప్పుధాన్యాల దిగుబడి సాధి స్తున్నా రైతుల ఆత్మహత్యలకు పంజాబ్ కేంద్రంగా మారిపోయింది. 2000–2017 మధ్య కాలంలో 16,600 మంది పంజాబ్ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని మూడు విశ్వవిద్యాలయాల ప్రతిని ధులు ఇంటింటికీ వెళ్లి జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. సాగు సంక్షోభానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పడం తేలికే. అయితే, నానా కష్టాలు పడి పండించిన పంటకు న్యాయబద్ధంగా దక్కాల్సిన ఆదాయం రైతుకు అందకుండా చేయడమే ప్రధాన కారణం. రాష్ట్ర ఆదాయంలో 88.36 శాతం సొమ్మును జీతాలు, పింఛన్లు చెల్లించడానికి, రుణా లపై వడ్డీలు కట్టడానికి, విద్యుత్ సబ్సిడీ చెల్లించడా నికి పోతే రైతుల సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి మిగి లేది ఎంతో గమనిస్తే సమస్య తీవ్రత అర్థమౌతుంది. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
నాపై కేసు కోర్టులో ఉంది..స్పందించను
హైదరాబాద్ : కాంగ్రెస్ వ్యక్తిగా కాదు భారతీయునిగా మాత్రమే మాట్లాడుతున్నానని, తనపై ఉన్న కేసు కోర్టులో ఉందని,దానిపై స్పందించదలచుకోలేదని పంజాబ్ మంత్రి , మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..క్రికెటర్‌గా, కామెంటేటర్‌గా తాను దేశానికి ఎంతో సేవ చేశానని చెప్పారు. పాలిటిక్స్ అంటేనే తనకు అత్యంత ఇష్టమని, రాజకీయాలను ఒక ప్రొఫెషనల్‌గా కాకుండా ఒక మిషన్‌గా భావిస్తానని అన్నారు. ప్రజల జీవితాలను మార్చే విధంగా రాజకీయాలు ఉండాలని కోరుకుంటానని వెల్లడించారు. తెలంగాణలో ఇసుక పాలసీ అద్భుతంగా ఉన్నదని కొనియాడారు. అక్రమాలు అరికట్టడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. ఆదాయం ఎన్నో రెట్లు పెరిగిందని తెలంగాణ ఇసుక పాలసీ నిరూపించిందని చెప్పారు. రెండు నదులు ఉన్న తెలంగాణలో ఇసుక రాబడి రూ.1300 కోట్లు ఉంటే 4 నదులు ఉన్న పంజాబ్ రాబడి ఎంత ఉండవచ్చునో అర్థం అవుతుందని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ మాఫియాను అరికట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇసుక అక్రమాలకు అడ్డుకట్టవేయగలిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇసుక రేటు నిర్ణయించడం వల్ల సామాన్యులకు లబ్ది చేకూరుతుందని వ్యాఖ్యానించారు. పాలసీ అమలులో చిన్న చిన్న సమస్యలు ఉన్నా విధానం మాత్రం సూపర్ అని కితాబిచ్చారు. ఇదే విధానాన్ని పంజాబ్‌లో అమలు చేయాలనుకుంటున్నామని తెలిపారు. -
తల్లి పదే..కొడుకు పదే..
పంజాబ్: అయినా ఇదేమి చోద్యమమ్మా.. పిల్లల్ని చదివించాల్సిన ఈ లేటు వయసులో ఈ చదువులేమిటో అని నలుగురూ నానా రకాలుగా అవహేళన చేసినా ఆ మహిళ పట్టించుకోలేదు. చదువుకోవాలనే దృఢ సంకల్పంతో పదో తరగతి చదువుతున్న కొడుకుతో కలిసి ఆమె కూడా స్కూలుకు వెళ్లి పాఠాలు నేర్చుకుంటోంది. పంజాబ్‌లోని లుధియానా వాసి అయిన 44 ఏళ్ల రజనీ బాల సంగతి ఇది. ముగ్గురు పిల్లల తల్లి అయిన రజనీ బాల...చదువు మీద మక్కువతో 29 ఏళ్ల తర్వాత మళ్లీ పుస్తకాలు చేతపట్టింది. తల్లీకొడుకులు పదో తరగతి చదువుతున్నారు. ‘నా భర్త చాలాసార్లు పదో తరగతి చదవమని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల చదవలేక పోయాను. కానీ ఇప్పుడు మా పిల్లలు కూడా చదువుకోమని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్న నాకు కనీసం పదో తరగతి విద్యార్హత ఉంటే బాంగుండనిపించింది. దీంతో మా అబ్బాయితో కలిసి స్కూల్లో చేరాను. మా అత్తమ్మ, మా భర్త నాకు చాలా సహకరిస్తున్నారు. రోజు ఉదయాన్నే నన్ను, మా పిల్లల్ని నిద్రలేపి చదివిస్తారు. నా కూతుళ్లు కూడా సహాయం చేస్తారు. ఈ రోజుల్లో కనీసం పదో తరగతి అయినా చదివి ఉండాలి’ అని ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీ బాల తెలిపారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఆమె భర్త రాజ్ కుమార్ సతి కూడా 17 ఏళ్ల విరామం తర్వాత డిగ్రీ పట్టభద్రుడయ్యారు. రజనీ బాలను కూడా డిగ్రీ చదివిస్తానని రాజ్ కుమార్ చెబుతున్నారు. ఓవైపు తన కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకుంటూ, మరో వైపు చదువుకోవాలనే పట్టుదలతో పాఠశాలకు వస్తున్న రజనీ బాలను ఆ పాఠశాల ఉపాధ్యాయులు మెచ్చుకుంటున్నారు. ఏదిఏమైనా చదువు నేర్చుకోవడాని వయస్సు అడ్డురాదని మరో సారి నిరూపించింది రజనీ బాల కుటుంబం. -
‘ఫీల్ ద జైలుకు’ పంజాబ్ నుంచి అక్కాచెల్లెలు
సంగారెడ్డి క్రైం: పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆయుర్వేదిక్ వైద్యురాలు ఉపాసన శర్మ, బ్యాంకు ఉద్యోగి పూనం శర్మ అక్కాచెల్లెళ్లు. సంగారెడ్డిలోని ‘ఫీల్ ద జైలు’ గురించి ఆన్లైన్లో తెలుసుకున్నారు. జైలు సూపరింటెండెంట్ సంతోష్‌రాయ్‌ని ఫోన్లో సంప్రదించారు. జైలు జీవితాన్ని అనుభవించడానికి తేదీలను ఖరారు చేసుకున్నారు. పంజాబ్ నుంచి బయలుదేరిన వారు మంగళవారం సాయంత్రం సంగారెడ్డికి చేరుకున్నారు. జైలు మ్యూజియంలో ఒక్కొక్కరు రూ.500 చొప్పున చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారికి జైలు సిబ్బంది బ్యారక్‌ను కేటాయించి యూనిఫాం, ప్లేట్లను అందజేశారు. ‘ఫీల్ ద జైలు’ గురించి వివరించారు. ఆశ్చర్యానికి లోనైనా వారు జైలు జీవితం గడిపేందుకు ముచ్చటపడ్డారు. జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చినట్లు విలేకరులతో తెలిపారు. ప్రపంచంలోనే ఇలాంటి అవకాశం ఎక్కడా లేదన్నారు. -
సహచరుల విడుదల కోరుతూ ఆత్మహత్య..
పంజాబ్: వివిధ కేసుల్లో శిక్షలు పడి, జైలు జీవితం పూర్తి చేసుకున్నా తన సహచరులు విడుదల కాకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్న గురుభక్ష్ సింగ్ ఖల్సా ఆత్మహత్య చేసుకున్నాడు. విజ్ఞప్తులు, ఆందోళనలు చేసినప్పటికీ, ఖైదీల విడుదలకు స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఆయన మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కురుక్షేత్ర జిల్లా ఎస్పీ అభిషేక్ గార్గ్ మాట్లాడుతూ.. ‘పలువురు సిక్క్ రాడికల్స్ విడుదల కోసం గత కొంతకాలంగా గురుభక్ష్ ఆందోళన చేస్తున్నాడు. వారిని విడుదల చేయాలని ట్యాంక్ పైకెక్కి నినాదాలు చేస్తూ.. నీటిలోకి దూకాడు. వెంటనే స్పందించిన స్థానికులు అతన్ని లోక్‌నారాయణ్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించార’ని తెలిపారు. 44 రోజుల నిరాహార దీక్ష.. 2013లో గురుభక్ష్ సింగ్...శిక్ష పూర్తయిన ఖైదీలను విడుదల చేయాలంటూ 44 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడు. ప్రభుత్వ హామీతో దీక్ష విరమించాడు. కానీ, వారు విడుదల కాకపోవడం గమనార్హం. -
కేజ్రీ క్షమాపణల ఎఫెక్ట్: ఆప్ బాధ్యతలకు బై
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త సమస్య వచ్చి పడింది. పంజాబ్‌లో ఆ పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి ఆప్ ఎంపీ భగవంత్ మన్ తప్పుకున్నారు. పార్టీ రాష్ట్ర చీఫ్ బాధ్యతకు తాను రాజీనామా చేస్తున్నట్లు భగవంత్‌మన్ తన ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శిరోమణి అకాళీ దళ్ నేతకు క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయం పంజాబ్‌లోని తమ పార్టీ నేతలకు దిగ్భ్రాంతిని కలిగించిందని, తామంతా ఇబ్బందుల్లో పడతామని కేజ్రీవాల్ ఎందుకు ఆలోచించలేకపోయారని వారంతా అనుకున్నట్లు సమాచారం. కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పడం వారికి షాకిచ్చినట్లయిందని అభిప్రాయపడ్డట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే భగవంత్ పార్టీ చీఫ్ బాధ్యతలకు రాజీనామా చేశారు. 'నేను పంజాబ్ ఆప్ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను.. కానీ, మత్తు పదార్థాల మాఫియాకు, పంజాబ్‌లో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా నా పోరాటం మాత్రం ఆగదు' అని మన్ ట్వీట్లో చెప్పారు. డ్రగ్స్ మాఫియాలో శిరోమణి అకాళీదల్ నేత బిక్రం సింగ్ మజితియా హస్తం ఉందంటూ కొద్ది రోజులకిందట ఆరోపణలు చేసిన కేజ్రీవాల్.. తాజాగా ఆయనకు క్షమాపణలు చెప్పారు. తన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని, అందుకే తన ఆరోపణలు విరమించుకుంటున్నానని క్షమాపణ లేఖ రాశారు. ఇది పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీని షాక్ గురిచేసింది. -
'పంజాబ్‌కు ఏం కాదు.. కలిసే ఉంటుంది'
సాక్షి, అమృత్సర్ : ఐక్య భారత్‌కే తమ దేశం కట్టుబడి ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. భారత్‌లోగాని, మరెక్కడైనాగానీ విభజన ఉద్యమాలకు తమ దేశం మద్దతివ్వబోదని చెప్పారు. ఖలిస్థాన్ డిమాండ్ తగ్గుముఖం పట్టేందుకు కూడా తన వంతు కృష్టి చేస్తానంటూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌కు ట్రూడో హామీ ఇచ్చారు. పంజాబ్ ఎప్పటికీ కలిసే ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో విడిపోదని ఆయన హామీ ఇచ్చారు. కెనడాలో కొంతమంది సిక్కులు ఖలిస్తాన్ డిమాండ్ చేస్తుండటంతో ట్రూడో పంజాబ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఖలిస్తాన్ డిమాండ్ సరైనది కాదని, ఐక్య పంజాబ్ తమకు కావాలని, ఈ డిమాండ్ తగ్గుముఖం పట్టేందుకు తమకు సహకరించాలని ట్రూడోను సీఎం అమరిందర్ సింగ్ కోరారు. 'నేను ట్రూడోకు చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ ఖలిస్తాన్ అనేది ప్రధాన సమస్య. దీనికోసం వివిధ దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా కెనడా నుంచి ఎక్కువగా వస్తున్నాయి. పంజాబ్‌ను అల్లకల్లోలం చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వాటికి మీరు సహకరించొద్దు. ఐక్యభారత్కు సహకరించాలి' అని తాను ట్రూడోను కోరినట్లు చెప్పారు. అందుకు ట్రూడో నుంచి సానుకూల ప్రకటన వెలువడింది. -
కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఎన్కౌంటర్లో మృతి
ఛండీగడ్: కరడుగట్టిన పంజాబ్ గ్యాంగ్‌స్టర్ విక్కీ గౌండర్, అతని సహచరుడు ప్రేమ్ లాహోరియాలు పంజాబ్-రాజస్థాన్ సరిహద్దులో పోలీస్ ఎన్కౌంటర్లో మృతిచెందారు. గౌండర్ నవంబర్, 2016 నుంచి పరారీలో ఉన్నాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న పంజాబ్‌లోని నాభా సెంట్రల్ జైలు నుంచి గౌండర్‌తో పాటు మరో ఐదుగురు 2016లో తప్పించుకున్నారు. వీరిలో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఉన్నారు. తప్పించుకున్న కొద్ది నెలల్లోనే మిగతా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు కానీ గౌండర్ మాత్రం పట్టుబడలేదు. విక్కీ గౌండర్ అసలు పేరు హర్జీందర్ భుల్లార్. విక్కీ గౌండర్ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాధల్ స్వస్థలమైన లాంబిలోని సారావాన్ బోడ్లా గ్రామవాసి. మరో కరడుగట్టి నేరస్తుడు సుఖా కహ్లావాన్‌ను ఓ కేసు విషయమై పోలీసులు కోర్టుకు తీసుకువెళ్తుండగా ఆయనపై 2015లో దాడి చేసిన వారిలో ప్రధాన నిందితుడిగా విక్కీగౌండర్‌ను పోలీసులు అనుమానిస్తున్నారు. విక్కీ గౌండర్, ఆయన అనుచరులు జైలు నుంచే దందాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ఆరోపణలతో ఇరిగేషన్ మంత్రి రాజీనామా
అమృతసర్ : పంజాబ్ విద్యుత్, నీటిపారుదల శాఖ మంత్రి రాణా గుర్జిత్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. నిన్న (సోమవారం) ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు సమర్పించారు. కాగా ఇసుక క్వారీల వేలంపాట వ్యవహారంలో మంత్రి గుర్జిత్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోట్ల రూపాయల మేరకు ముడుపులు అందుకున్నట్లు మంత్రితో పాటు ఆయన సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గుర్జిత్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి పదవికి రాజీనామా చేసిన వెల్లడించారు. తన రాజీనామాపై తుది నిర్ణయం పార్టీ హైకమాండ్‌తో పాటు, ముఖ్యమంత్రిదేనని గుర్జిత్ తెలిపారు. కాగా మంత్రి గురిజిత్ వంటమనిషి 26కోట్లు వెచ్చించి ఇసుక క్వారీలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో నాలుగు గనులు మంత్రి బినామీలు సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
చేతులు కాలిన తర్వాత ఆప్ నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌కు కొత్త ఇంచార్జ్‌ను నియమించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను పంజాబ్‌కు కొత్త ఇంచార్జ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆప్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ మంగళవారం ఈ మేరకు ప్రకటన చేసింది. అంతకుముందు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న సంజయ్ సింగ్ రాష్ట్ర పార్టీ చీఫ్ పదవికి ఏప్రిల్‌లో రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నియామకం తప్పనిసరి అయింది. అంతేకాకుండా ఇటీవల 414 రాష్ట్ర మున్సిపల్ వార్డులకు జరిగిన ఎన్నికల్లో ఆప్ కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది. వీటిల్లో 267 వార్డులను కాంగ్రెస్ పార్టీనే కొల్లగొట్టింది. అలాగే, 29 మున్సిపల్ కౌన్సిల్స్‌లో 20 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆప్ శరవేగంగా మనీష్ సిసొడియాకు పంజాబ్ బాధ్యతలు అప్పగించింది. -
పాక్ గూఢచారికి ముఖ్యమంత్రి ఆశ్రయం
సాక్షి, చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విమర్శలు చేసింది. పాకిస్తాన్ గూఢచారి అరూసా ఆలమ్‌కు పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఆశ్రయం కల్పించారని ఆప్ పార్టీ నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరా తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో అరూసా ఆలం ప్రస్తుతం బస చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అరూసా ఆలం గురించిన ఖచ్చతమైన సమాచారంతోనే తాను మాట్లాడుతున్నాని సుఖ్‌పాల్ సింగ్ చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనూ.. సుఖ్‌పాల్ సింగ్ ఈ అంశంపైనే ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని రాయడానికి వీలుకాని భాషలో విమర్శలు చేశారు. అసూరా అలంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా సుఖ్‌పాల్ సింగ్ ఖైరా విమర్శలపై తీవ్రంగా స్పందించింది. ఖైరా మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ అభిప్రాయపడ్డారు. -
లుథియానాలో భారీ అగ్నిప్రమాదం
లుథియానా: పంజాబ్‌లోని లుథియానాలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షింగర్ థియేటర్ సమీపంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. అనంతరం మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో చుట్టపక్కల దట్టమైన పొగ అలుముకుంది.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సౌదీలో నరకం అనుభవిస్తున్నా..కాపాడండి!
-
సీనియర్ జర్నలిస్ట్ దారుణ హత్య!
మొహాలి: ఇటీవల బెంగళూరులో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్, త్రిపురలో శాంతను భౌమిక్‌ల దారుణ హత్యల్ని మరువకముందే పంజాబ్‌లో మరో సీనియర్ జర్నలిస్ట్ శనివారం అనుమానాస్పదంగా మృతిచెందారు. మొహాలిలోని ఫేజ్3 బీ2 ఇంట్లో నివాసముంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేజే సింగ్(64), ఆయన తల్లి గురుశరణ్ కౌర్(92)లు తమ గదుల్లో విగతజీవులై కన్పించారు. సింగ్ గొంతు కోసి కత్తితో పొడిచిన దుండగులు, ఆయన తల్లి గొంతు నులిమి హతమార్చి ఉంటారని ముఖ్యమంత్రి కార్యాలయం అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. సింగ్‌ను కలుసుకునేందుకు ఆయన చెల్లి యశ్పాల్ కౌర్ మేనల్లుడు అజయ్ పాల్లు శనివారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట మధ్యలో ఇంటికి రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చిందన్నారు. సింగ్ ఇంటికి ఎలాంటి సీసీటీవీలు బిగించుకోలేదనీ, ఆయన కారు కూడా కనిపించడం లేదని వెల్లడించా రు. పంజాబ్ సీఎం అమరీందర్ ఆదేశాలతో దుండగుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సిట్‌కు ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని తెలిపారు. వీరిద్దరిని హత్యచేసిన దుండగులు.. సింగ్ మెడలోని బంగారు గొలుసును, ఆయన తల్లి గదిలో ఉన్న రూ.25 వేల నగదును ముట్టుకోలేదన్నారు. ఇది దోపిడీ ఘటనలా కన్పించినప్పటికీ అసలు కారణం వేరే ఉంటుందన్నారు. -
విధ్వంసంలో రూ.200 కోట్ల నష్టం
సాక్షి, చంఢీఘడ్ : అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం హరియాణాలో జరిగిన విధ్వంసకాండపైన దృష్టిని కేంద్రీకరించిన మీడియా, అధికారులు పంజాబ్‌లో జరిగిన నష్టం గురించి అంతగా పట్టించుకోలేదు. పంజాబ్‌లో జరిగిన నష్టం గురించి ఇప్పుడిప్పుడే అందిన అంచనా అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. దాదాపు 200 కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లిందని అధికారులు అంచనాకు వచ్చారు. అల్లర్లలో 32 మంది మరణించడం తెల్సిందే. అయితే వారిలో కూడా పది మంది పంజాబీలు ఉన్నారని తేలింది. డేరా అల్లరి మూకలు పంజాబ్‌లోని సదన్‌వాస్ గ్రామంలో విద్యుత్ కేంద్రాన్ని, గులవాన గ్రామంలో రైల్వే స్టేషన్‌ను దగ్ధం చేశాయి. బటిండాలో ఓ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, బనవాలి, ముసాలోని రెండు పెట్రోలు బంకులను దగ్ధం చేశాయి. మానస ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ వద్ద రెండు కార్లను తగులబెట్టాయి. మానక్‌పూర్ ప్రాంతంలోని ఓ పాఠశాల ఫర్నీచర్‌ను, మలాట్‌లోని ఓ రైల్వే స్టేషన్, నంగల్ జిల్లాలో కో-ఆపరేటివ్ సొసైటీ, ఖోఖర్ కలాన్ గ్రామంలో ఓ ప్రభుత్వ గిడ్డంగిని, సంగ్రూర్‌లో పవర్ హౌజ్‌ను అల్లరి మూకలు దగ్ధం చేశాయి. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ఆదేశం మేరకు అధికారులు అల్లర్ల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా ఈ నష్టం 200 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని భావిస్తున్నట్లు వారు మీడియాకు తెలిపారు. -
రూ.1.33 కోట్లు దోచుకెళ్లారు..
పాటియాలా(పంజాబ్): పట్టపగలు అందరూ చూస్తుండగానే బ్యాంకు వ్యాన్‌ను నుంచి రూ.133 కోట్ల నగదును గుర్తు తెలయని వ్యక్తులు సినీఫక్కీలోదోచుకెళ్లారు. పంజాబ్ రాష్ట్రం పాటియాలా సమీపంలో ఈసంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చండీగఢ్ నగరంలోని ఓప్రైవేట్ బ్యాంకుకు చెందిన వ్యాన్ మంగళవారం ఉదయం బానూర్, రాజ్‌పురా పట్టణాల్లోని బ్యాంకు శాఖలకు నగదును అందజేయటానికి బయలుదేరింది. అయితే కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు స్కార్పియో వాహనంలో కొంత దూరం వెంబడించారు. అనంతరం రాజ్‌పురా పట్టణంలోని విద్యాసంస్థలు ఉండే ప్రాంతం గుండా వెళ్తుండగా దానిని అటకాయించారు. వ్యాన్ డ్రైవర్‌పై కాల్పులు జరిపి అందులో ఉన్న దాదాపు రూ.1.33 కోట్ల నగదును ఎత్తుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆ వాహనం కోసం గాలింపు చేపట్టారు. సీసీఫుటేజీలను సేకరించి నిందితుల కోసం పెద్ద ఎత్తున వెతుకులాట ప్రారంభించారు. తీవ్రంగా గాయపడిన వ్యాన్ డ్రైవర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. వ్యాన్‌లో మొత్తం ఏడుగురు ఉన్నట్లు తేలింది. దుండగులు రెండు వాహనాలను వాడినట్లు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు. వాహనాల తనిఖీలు చేపట్టారు. -
రెండు పాకిస్తానీ బోట్లు సీజ్
చండీగడ్(పంజాబ్): ఫెరోజ్‌పూర్ జిల్లాలో రెండు పాకిస్తానీ బోట్లను సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అధికారులు సోమవారం సీజ్ చేశారు. బీఎస్ఎఫ్ జవాన్లు గస్తీ కాస్తున్న సమయంలో పాకిస్తాన్‌కు చెందిన బోట్లు దొన్నా టెల్ మాల్ ఔట్‌పోస్టు వద్ద ఆగి ఉండటం గమనించారు. లొంగిపొమ్మని జవాన్లు హెచ్చరికలు పంపినా పెడచెవిన పెట్టిన నిందితులు నదిలోకి దూకి పాకిస్తాన్ వైపు ఈదుకుంటూ పోయారు. స్వాధీనం చేసుకున్న బోట్లలో సుమారు 45 కిలోల చేపలు ఉన్నాయి. పాకిస్తాన్‌కు పంజాబ్‌కు మధ్య 553 కిలో మీటర్ల సరిహద్దు ఉంది. -
ఆ జైలుపై దాడి పోలీసులకు ముందే తెలుసు
పాటియాలా: దేశంలో సంచలనం సృష్టించిన నభా జైలు దాడి గురించి పోలీసులకు ముందే తెలుసా? తెలిసి కూడా ఎందుకు అప్రమత్తమవ్వలేదు? కేవలం అనుమానాలతోనే సరిపెట్టి పరిణామాన్ని చవిచూశారా? తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా పోలీసులే.. అది కూడా ఈ ఘటన జరగడానికి ముందే కొత్వాలి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్లో రాశారు. గత ఏడాది(2016) నభా జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ గురుప్రీత్ సెఖాన్, మరో నలుగురు సహచరులను తప్పించడంతోపాటు ఖలిస్తాన్ టెర్రరిస్టు హర్మీందర్ మింటూను బయటకు తీసుకొచ్చే ఉద్దేశంతో కొంతమంది ముఠా జైలుపై నేరుగా దాడి చేసిన విషయం తెలిసిందే. జైలు గేటు వద్ద సెంట్రీని బెదిరించి మరీ జైలు లోపలికి వెళ్లి కాల్పులు జరిపి వారితో పరారయ్యారు. ఈ ఘటన పంజాబ్‌లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మింటూను ఇతరులను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఈ కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా పలు రికార్డులు పరిశీలించగా.. జూన్ 3, 2016లో రాసిన ఓ ఎఫ్ఐఆర్లో పెద్దమొత్తంలో సెక్యూరిటీ ఉండే జైలుపై గ్యాంగ్స్టర్లు దాడి చేసే అవకాశం ఉందంటూ పేర్కొన్నారు. అంతేకాదు, హర్మీందర్ సింగ్ రోమీ, తన సహచరులను విడిపించేందుకు కుట్ర జరగొచ్చని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పోలీసు ఉన్నత కార్యాలయాలకు, మేజిస్ట్రేట్‌కు కూడా పంపించారు. అయినప్పటికీ ఎలాంటి జాగ్రత్త లేకుండా ఉండటంపట్ల ఉన్నతాధికారులకు జైలు భద్రతా సిబ్బందిపై పలు అనుమానాలకు తావిస్తోంది. -
కాంగ్రెస్, అకాలీలు తన్నుకున్నారు
అమృతసర్: పంజాబ్‌లో తొలి రాజకీయ పంచాయితీ చోటుచేసుకుంది. అధికార పార్టీ శిరోమణి అకాలీదల్‌కు చెందిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు తన్నుకున్నాయి. దీంతో పెద్ద మొత్తంలో పోలీసు బలగాలను మోహరించారు. మజీతియా నియోజకవర్గంలోని మియాన్ పందేర్ గ్రామంలో ఈ పరిస్థితి నెలకొంది. ఫిబ్రవరి 4న జరగాల్సిన ఎన్నికలు పూర్తయిన అనంతరం ఈ సంఘర్షణలు చోటుచేసుకున్నట్లు అక్కడి పోలీసు అధికారులు చెప్పారు. ఇటుకలు, రాళ్లు ఇరు వర్గాలు రువ్వుకున్నాయని, కొంతమందికి గాయాలు కూడా అయ్యాయని తెలిపారు. ఈ నియోజకవర్గంలో అకాళీదల్ నేత, రెవెన్యూ మంత్రి బిక్రమ్ సింగ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన లల్లీ మజీతియా తలపడుతున్నారు. -
‘మళ్లీ గెలిపిస్తే అమెరికాలో భూములిస్తాం’
లుథియానా: పంజాబ్ ఎన్నికల్లో వాగ్దానాలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. తిరిగి తమకు అధికారంలో కట్టబెడితే చాలు.. చాంతాడంత మేలు చేస్తామంటూ ఇప్పటికే వివిధ ఎన్నికల ప్రచారాల్లో చెబుతున్న శిరోమణి అకాళీదల్(ఎస్ఏడీ) తాజాగా తన మేనిఫెస్టోలో పెద్ద శుభవార్తను తెలియజేసింది. అమెరికాలో, కెనడాలో దాదాపు ఒక లక్ష ఎకరాలను కొనుగోలు చేస్తామని, అక్కడకు వెళ్లి సెటిల్ అయ్యే పంజాబీలకు ఆ భూమిని ఉపయోగిస్తామని తెలిపారు. మిగతా వాగ్ధానాల సంగతి ఎట్లున్నా ఈ ప్రకటన మాత్రం ఇతర పార్టీలకు మాత్రం కాస్తంత గుబులుపుట్టించేందిగానే ఉంది. బుధవారం పంజాబ్ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ఎన్నికల మేనిఫెస్టోను లుథియానాలో విడుదల చేశారు. దీని ప్రకారం అమెరికా, కెనడా వంటి దేశాలకు వలస వెళ్లి అక్కడ ప్రొఫెషనల్ రైతులుగా మారేందుకు ముందుకొచ్చేవారికి తాము లక్ష ఎకరాలు తీసుకొని అందులో కేటాయింపులు చేస్తామని తెలిపారు. అయితే, ఈ ప్రకటన అయితే చేసిందిగానీ, దీనికి ఎవరు అర్హులు? ఎలా దీనిని పొందవచ్చు అనే వివరాలు మాత్రం తెలియజేయలేదు. -
పంజాబ్ గురుదాస్‌పూర్‌లో హై అలర్ట్
-
వారికి యుద్ధమంటే అప్పుడే తెలుస్తోంది
అమృత్ సర్: అక్కడ గన్ పేలలేదు.. ఎలాంటి అప్రమత్తత సంకేతాలు అందలేదు. ఫైటర్ జెట్ బాంబులు అంతకంటే లేవు. వాస్తవానికి ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సమయం కూడా కాదు. కానీ వేల పంజాబ్ లోని వేల కుటుంబాలు మాత్రం అప్పుడే యుద్ధం అంటే ఎలా ఉంటుందో.. యుద్ధం వస్తే ఎలాంటి పరిస్దితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చవిచూస్తున్నారు. పాక్ సరిహద్దకు ఆనుకొని ఉన్న పంజాబ్ గ్రామాలన్నింటిని ఆర్మీ ఖాళీ చేయిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలోని గ్రామాలన్నింటిని ఏ ఒక్కరూ లేకుండా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓ అంచనా ప్రకారం అమృత్ సర్, తార్న్ తరన్, ఫిరోజ్ పూర్, గురుదాస్ పూర్, పఠాన్ కోట్, ఫజిల్కా జిల్లాలకు చెందిన దాదాపు 4 లక్షలమందిని ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు వెయ్యి గ్రామాల్లోని ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు అందడంతో ఆ పని పూర్తి చేయిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి పాకిస్థాన్ భూభాగంలోకి భారత ఆర్మీ చొచ్చుకెళ్లి దాడులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడుల అనంతరం సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాల ప్రజలు అనూహ్యంగా తమ నివాసాలను వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. 'మేం మా వస్తువులన్నింటిని మూటగట్టి ట్రాక్టర్లో వేశాం. కాని ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. కానీ తప్పకుండా వెళ్లాల్సి ఉంది. మరో పది రోజుల్లో మా పంటపొలాలు తూర్చాల్సి ఉంది. త్వరలోనే పరిస్ధితి సర్దుమణుగుతుందని మేం ఆశిస్తున్నాం' అని తమ నివాసాలను విడిచి వెళుతున్న కొంతమంది రైతులు, వ్యక్తులు చెప్పారు. ఇప్పటికే అక్కడి పాఠశాలలు, ఆస్పత్రులు కూడా ఖాళీ చేయించిన విషయం తెలిసిందే. తాజా దాడుల వల్ల సరిహద్దు వెంట నుంచి మొత్తం 15లక్షలమందిని ఆయా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
రాజకీయ కురుక్షేత్ర
-
మంచితనంగా ఇంటికి పిలిచి దారుణం
అమృత్సర్: తమకు ఉన్న పరిచయం మేరకు మంచితనంగా ఓ గృహిణిని ఇంటికి పిలిపించి ఆమె ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేశారు. ఇంటికొచ్చిన స్నేహితురాలిపై దాడి చేసి స్పృహలేనిపరిస్థితుల్లో చనిపోయిందనుకొని ఓ కాలువలో పడేశారు. అదృష్టం కొద్ది ఆమె తిరిగి స్పృహలోకి రావడంతో నేరుగా ఇంటికెళ్లి భర్తకు చెప్పగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే పంజాబ్ లోని అమృత్ సర్ లో గుర్మీత్ కౌర్ అనే ఓ మహిళ ఉంది. ఆమెకు బాజ్ సింగ్, ఫతే అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరిని తీసుకొని తమ ఇంటికి రావాల్సిందిగా మంజిత్ కౌర్ మహిళ ఆహ్వానించింది. ఆమె ఇంటికి రాగానే మంజిత్ కుమారుడు మహిందర్ జిత్, వాళ్లింట్లో పనిచేసే హరిజిందర్ అనే ఇద్దరు వారిపై దాడి చేశారు. ఆమెను కొట్టి చనిపోయిందని కాలువలో పడేసి పిల్లలను ఎత్తుకెళ్లారు. అందులో ఫతేకు ఎనిమిది నెలలు కాగా బాజ్‌కు ఎనిమిదేళ్లు. వీరిని నేరుగా తీసుకెళ్లిన వారు క్షుద్రపూజలకోసం అమ్మేశారు. పోలీసులు నిర్వహించిన గాలింపు చర్యల్లో ఈ విషయం తెలిసింది. బాజ్‌ను రూ.50వేలకు దీరా బాబా నానక్ అనే తాంత్రికుడికి అమ్మినట్లు తెలిసింది. అయితే, బాజ్ తిరగబడినంత పనిచేయడంతో విషయం బయటకు పొక్కుతుందని భయంతో అతడిని హత్య చేసి ఓ ఊరి వద్ద పడేశారు. నేరాన్ని వారు స్వయంగా అంగీకరించడంతో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. -
రైల్వేస్టేషన్ లో కేజ్రీవాల్‌కు నిరసన సెగ
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నిరసన సెగ తగిలింది. ఢిల్లీ రైల్వేస్టేషన్లో ఆయనను గురువారం బీజేపీ మహిళ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాలుగు రోజుల పంజాబ్ పర్యటనలో భాగంగా కేజ్రీవాల్ ఇవాళ ఉదయం చండీగఢ్ బయలు దేరారు. రైల్వేస్టేషన్‌కు చేరుకున్న కేజ్రీవాల్‌ను బీజేపీ మహిళా కార్యకర్తలు అడ్డగించి నినాదాలతో హోరెత్తించారు. మహిళలపై వేధింపులకు ఆప్ నేతలు కేరాఫ్‌గా మారారని, మహిళలను అవమానించేలా మాట్లాడడం ఆప్ నేతలకు అలవాటైపోయిందని విమర్శలు గుప్పించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యేల వ్యవహారంపై కేజ్రీవాల్ స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆప్ నేత అశుతోష్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. -
సుప్రీంకు చేరిన ఉడ్తా పంజాబ్ వివాదం
న్యూఢిల్లీ: అనేక మలుపుల మధ్య 'ఉడ్తా పంజాబ్' వివాదం చిట్టచివరకు సుప్రీంకోర్టుకు చేరింది. సినిమా విడుదలపై స్టే విధించాలంటూ పంజాబ్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు న్యాయస్థానం అంగీకరించింది. ఈ పిటిషన్ ఈరోజు మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశ ఉంది. ఉడ్తా పంజాబ్ సినిమాలో ఒక్క సీన్ మాత్రమే కట్ చేసి, విడుదలకు అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. కాగా పంజాబ్‌లో పెచ్చుమీరుతున్న డ్రగ్ కల్చర్ మీద తీసిన ఉడ్తా పంజాబ్ విడుదలకు ముందే లీక్ అయింది. సినిమా మొత్తం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు సెన్సార్ సభ్యులే ఈ సినిమాను లీక్ చేసినట్లు చిత్ర నిర్మాత ఆరోపిస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్ని అడ్డంకులు తొలగిపోతే ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. -
పాటియాలలో మరోసారి కలకలం!
పాటియాల : పఠాన్‌కోట్ సంఘటన మరవకముందే పంజాబ్‌లో మరోసారి కలకలం రేగింది. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన నలుగురు దుండగులు ఓ వ్యక్తిని తుపాకీతో బెదిరించి కారును అపహరించుకు వెళ్లారు. పాటియాలలోని దష్మిష్ నగర్లో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీసుల కాల్పులు అమానుషం- కేజ్రీవాల్
అమృత్సర్: అమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల పంజాబ్‌లో సిక్కుల పవిత్ర గ్రంధం 'గురు గ్రంధ్ సాహెబ్' ను అవమానించడంతో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. పవిత్ర గ్రంధాన్ని అవమానించినందుకు గాను నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి కేజ్రీవాల్ పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరి మృతికి కారణమయ్యారని ఆరోపించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు మద్దతుగా స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. స్వర్ణదేవాలయంలోకి వీఐపీలు వెళ్లే మార్గంలో కాకుండా సాధారణ భక్తులు వెళ్లే మార్గంలో కేజ్రీవాల్ వెళ్లారు. స్వర్ణదేవాలయంలో ప్రార్థనల అనంతరం రోడ్డు మార్గం ద్వారా బాదిత కుటుంబాలను పరామర్శించడానికి కొట్కపురకు బయలుదేరి వెళ్లారు. గత లోక్‌సభ ఎన్నికలలో పంజాబ్‌లో నాలుగు ఎంపీ స్థానాలను ఆప్ గెలుచుకుంది. కాగా 2017లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ దృష్టి పెట్టింది. -
అమ్మాయి బహిరంగ వేలం
పాట్నా: అమ్మాయిలను అంగట్లో పెట్టి బహిరంగంగా వేలం వేస్తున్నారని, మూడు వేల రూపాయలు పెడితే ఎవరైనా కొనుక్కోవచ్చంటూ ప్రత్యక్ష ఉదాహరణతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ నాయకుడు అరుణ్ శౌరీ 1981లో ఓ పత్రిక సంపాదకుడిగా రాసిన ఓ వార్తా కథనం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ రాజకీయాలను కూడా ఓ కుదుపు కుదిపేసింది. అప్పుడే కాదు ఇప్పటికి కూడా అమ్మాయిలను అంగట్లో పెట్టి అమ్ముతున్నా సంబంధిత ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. బీహార్‌కు చెందిన ఓ 14 ఏళ్ల అమ్మాయిని బహిరంగ వేలంలో పంజాబ్‌కు చెందిన రాజేష్ అనే ఓ యువకుడు 88 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు. ఆ యువకుడి కబంద హస్తాల నుంచి ఓ ఎన్జీవో సంస్థ సహకారంతో బయటపడిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటు పాట్నా, ఆగ్రాలలో అమ్మాయిలను బహిరంగంగానే వేలం వేస్తున్నారని, తనతోపాటు తీసుకొచ్చిన ఓ ఐదుగురు అమ్మాయిలను కూడా అలాగే వేలం వేశారని ఆ బాలిక పోలీసులకు వివరించింది. ‘మూడు నెలల క్రితం పాట్నాలోని ఓ చోట నాతో సహా ఆరుగురు బాలికలను పెళ్లి కూతుళ్ల పేరిట వేలం వేశారు. అందులో నన్ను రఘువీర్ అనే మరో యువకుడి సహాయంతో పంజాబ్‌లోని అబోహర్ పట్టణానికి చెందిన రాజేశ్ అనే యువకుడు 88 వేల రూపాయలకు కొన్నాడు. నన్ను తీసుకొని ఆగ్రాకు వెళ్లి అక్కడ ఓ అంగట్లో ఎక్కువ రేటుకు అమ్మేందుకు ప్రయత్నించాడు. నేను అంత అందంగా లేకపోవడంతో ధర ఎక్కువ పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో నన్ను పంజాబ్ తీసుకెళ్లి ఓ ఇంటిలోని ఓ గదిలో బంధించాడు. మూడు నెలలుగా సరైన తిండి పెట్టకుండా చిత్ర హింసలు పెడుతూ వచ్చాడు. ఆ హింసలను తట్టుకోలేక ఓ రోజు గట్టిగా ఏడిస్తూ కేకలు వేశా....ఆ కేకలు విన్న పొరుగింటివారు ‘సేవా నారాయణ్ సేవా సొసైటీ’ అనే ఎన్జీవోకు ఫిర్యాదు చేశారు. వారు పోలీసుల సహాయంతో వచ్చి నన్ను విడిపించారు’ అని ఆ బాలిక తన గాధను మీడియాకు వివరించారు. పోలీసులు రాజేశ్‌ను, రఘువీర్‌లను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాట్నా అంగట్లో అమ్మిన ఇతర ఐదుగురు బాలికలు విషయమై ఆచూకి తీస్తున్నారు. (నాడు అంగట్లో అమ్మాయిలను వేలం వేస్తున్నారనే విషయాన్ని రుజువు చేయడం కోసం అరుణ్ శౌరీ జర్నలిస్ట్ టీం డబ్బులు చెల్లించి అమ్మాయిని కొనడం కూడా వివాదాస్పదమైంది. ఇది కేవలం సంచలనం కోసమే అలా చేశారని, అది కూడా అమానుషత్వమే అవుతుందన్న విమర్శలు కూడా వెలువడ్డాయి. ఈ సంఘటనలో జర్నలిస్టుల ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేయడం కోసం జగ్మోహన్ ముద్రా అనే నిర్మాత, దర్శకుడు ‘కమల’ పేరిట ఓ బాలివుడ్ చిత్రాన్ని నిర్మించారు. అందులో దీప్తి నావల్, షబానా ఆజ్మీ తదితరులు నటించారు.) -
నదిలో దూకి మరీ అరెస్టు
పంజాబ్: అచ్చం ఓ సినిమా దృశ్యంలాంటి ఘటన. అబ్బురపరిచిన పోలీస్ చేజింగ్.. తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేసిన దొంగలు.. పోలీసుల సాహసంతో చివరికి లొంగుబాటు. ఇది పంజాబ్‌లో సోమవారం జరిగిన ఓ సినీ ఫక్కీలాంటి ఘటన. పంజాబ్‌లో కొందరు దొంగలు ముందుగా ఓ బైక్‌ను దొంగలించారు. ఆ వెంటనే అదే బైక్‌పై వేగంగా దూసుకెళ్తూ ఓ మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ విషయం పోలీసులకు తెలిసి వెంబడించారు. దీంతో కాసేపు దొంగా పోలీసు ఆట నెలకొంది. చివరికి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని ఓ నదిలో బైక్‌ను పడేసిన దొంగలు.. అనంతరం వారు కూడా దూకేశారు. కానీ, పోలీసులు, స్థానికులు కూడా ఆ నదిలోకి దూకి వారిని పట్టుకుని ఆట కట్టించారు. చేతికి సంకెళ్లు వేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పతన్ కోట్ పోలీసులు చేసిన ఈ సాహసం అందరినీ అబ్బుర పరిచింది. -
ఉగ్రదాడిని ఖండించిన రాహుల్, కేజ్రీవాల్
న్యూఢిల్లీ: పంజాబ్‌లోని గురుదాస్ పూర్లో సోమవారం జరిగిన ఉగ్రవాదుల దాడిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. ఉగ్రవాదుల దాడిని తాను తీవ్రంగా ఖండిస్తుననట్టు రాహుల్ ట్విట్ చేశారు. ఈ దాడుల నేపథ్యంలో పంజాబ్ లో సాధ్యమైనంత తొందరగా పరిస్థితి అదుపులోకి రావాలని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మానసిక స్థైర్యం ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్టు రాహుల్ తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. పిరికతనంతో అమాయకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. పంజాబ్ ప్రజలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. అలాగే అపరాధులైన వారిని త్వరలో అరెస్ట్ చేస్తారని భావిస్తున్నట్టు కేజ్రీవాల్ ట్విట్ చేశారు. కాగా, పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలోని గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై సోమవారం ఉగ్రవాదులు చేసిన దాడుల్లో ఐదుగురు పోలీసులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. -
ఉగ్రదాడి జరిగిందిలా..
-
ఉగ్రదాడి జరిగిందిలా..
గుర్దాస్పూర్: పాకిస్థాన్ సరిహద్దుకు అతి సమీపంలోని గుర్ దాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై ఉగ్రవాదులు దాడిచేశారు. సైనిక దుస్తులు ధరించి, అత్యాధునిక ఆయుధాలతో.. సెంట్రీలను కాల్చేసి స్టేషన్ లోకి చొరబడ్డ ముష్కరులు అక్కడ భీభత్సం సృష్టించారు. ఆ తరువాత ఓ భవనంలోకి ప్రవేశించి లోపలి నుంచి కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులతో పోరుకు బీఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని ముఖ్యాంశాలు. పాకిస్థాన్‌లోని నరోవల్ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్ ద్వారా భారత్ లోకి ప్రవేశించారు. జమ్ములోని హరినగర్ నుంచి ఆదివారం అర్ధరాత్రి తరువాత పంజాబ్ కు చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పఠాన్‌కోట్ మీదుగా గుర్దాస్పూర్- జమ్ము హైవేపై వద్దకు చేరుకుని ఓ మారుతీ కారును హైజాక్ చేశారు. అప్పటికే వారు సైనిక దుస్తులు ధరించారు. అదే మార్గంలో జమ్ము వైపు వెళుతోన్న బస్సుపై కాల్పులు జరపగా ఓ ప్రయాణికుడు మరణించాడు. అక్కడి నుంచి హైజాక్ చేసిన కారులో నేరుగా దీనానగర్ పోలీస్ స్టేషన్ వైపునకు బయలుదేరారు. దీనానగర్ లోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద కొన్ని రౌండ్లు కాల్పులు జరిపారు. ఉదయం 5:45 గంటలకు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ముష్కరులు సెంట్రీలపై కాల్చిచంపారు. స్టేషన్ లో భీభత్సం సృష్టించిన తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ హెల్త్ సెంటర్ లోకి ప్రవేశించారు. లోపలి నుంచి ప్రతి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ, ఎన్ఎస్జీ బలగాలు రంగంలోకి దిగి దీనానగర్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను చూట్టుముట్టాయి. ఈలోపే దీనానగర్- పఠాన్ కోట్ మధ్య రైల్వేట్రాక్ పై పేలడానికి సిద్ధంగా ఉన్న ఐదు బాంబులను పోలీసులు గుర్తించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా దీనానగర్ లోని స్కూళ్లు, కాలేజీలు ఇతర కార్యాలయాలన్నీ మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీఅయ్యాయి. దాదాపు 10 గంటల సమయంలో ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ ప్రారంభం. కౌంటర్ ఆపరేషన్ లో ఆర్మీ హెలికాప్టర్ ను కూడా ఉపయోగిస్తున్నారు. ఉగ్రదాడిపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇటు పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తోనూ ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు, ముగ్గురు పౌరులు చనిపోయారు. కౌంటర్ ఆపరేషన్ లో ఓ ఉగ్రవాది హతం. దీంతో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. భద్రతా బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి ఈ కాల్పుల్లో గుర్ దాస్ పూర్ జిల్లా ఎస్సీ బల్జీత్ సింగ్ మరణించారు. ఇప్పటివరకు ఈ ఘటనలో 13 మంది చనిపోయారు. -
ఫ్రీ అని వెళితే...కంటిచూపు కోల్పోయారు
అమృత్సర్ : ఛత్తీస్‌గఢ్ బిలాస్పూర్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై 16మంది మహిళలు మరణించిన ఘటన మరువకముందే.. పంజాబ్‌లోని గురుదాస్లో డాక్టర్ల నిర్లక్ష్యానికి 16 మంది అంధులుగా మారారు. ఓ స్వచ్చంధ సంస్థ నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ డాక్టర్ల సహకారంతో.. గురుదాస్‌పూర్‌లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో దాదాపు 200 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేశారు. వారిలో కొందరికి కంటిలో తీవ్ర మంటలు రావడంతో... అమృత్సర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి డాక్టర్ల పరీక్షలు నిర్వహించి పూర్తిగా కంటిచూపు పోయినట్లు నిర్ధరించారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ నిమిత్తం ఓ కమిటీని నియమించింది. -
‘హవ్’ హమ్ హైద్రాబాదీ!
హైద్రాబాదీ షాయరీలు (కవితా గోష్టులు) ఆహ్లాదకరమైనవి. దక్కనీ భాషలో షాయరీ పాడుతోంటే ప్రేక్షకులు తెరలు తెరలుగా కడుపుబ్బ నవ్వేవారు! ఈ వాతావరణంలో పిల్లలు హైద్రాబాద్‌లోనే పుట్టిపెరుగుతున్నారు. అప్పుడప్పుడూ సకుటుంబంగా ఉత్తరాది బంధువుల దగ్గరకు వెళ్లేవారం. దేశ విభజనలో భాగంగా పంజాబ్ రెండు భాగాలైనప్పటికీ పంజాబ్ నా స్వరాష్ట్రం కదా! పంజాబ్‌లో, ఢిల్లీలో నివసించే బంధువులతో పిల్లలు మాట్లాడేప్పుడు వారి నోటి వెంట హైద్రాబాదీ పదాలు అసంకల్పితంగా వచ్చేవి. ‘ఇది తీసుకో’ అని ఉత్తరాది వాళ్లు అన్నారనుకోండి, ‘వద్దు’ అనదలచుకున్న మా పిల్లలు ‘నక్కో’ అనేవారు! తోటి పిల్లలు ఫక్కున నవ్వేవారు! వారి దృష్టిలో అది మోటు పదం! వద్దు అనాలంటే ‘న’ లేదా ‘నహీ’ అనాలి! ఏకీచ్ అంటే మోటు.. ఏక్హీ అనాలి! మీరు మోటుగా మాట్లాడతారు, సంస్కారం లేదు అని పిల్లలను వెక్కిరించేవారు! నా దృష్టిలో హైద్రాబాదీలతో పోలిస్తే ఉత్తరాదివారికి సగం కూడా కల్చర్ లేదు! లేదంటే వింటారా! ‘నై బోలేతో సున్తే క్యా’! ‘నై బోలేతో సున్తే నై’ ! ‘వద్దంటే వినదు/వినరు’ అనే అర్థం వచ్చే పై మకుటంతో దక్కనీ షాయరీ సిటీలో ప్రాచుర్యంలో ఉండేది. అందులోని అనేక చరణాల్లో కొన్ని... కర్నే కొ జో కామా హైసొ / చేయాల్సిన పనులన్నీ జైసేకే వైసే హీచ్ హై / ఎక్కడివక్కడే ఉన్నాయి నై కర్నేకె కామా కర్రై/ చేయకూడని పనులు చేస్తున్నావు నై బోలేతో సున్తేనై / వద్దంటే వినడం లేదు ఉమర్కె పీఛే మత్ భాగో / వయసు వెనుక పరుగెత్తొద్దు గయేసీ జవానీ ఆతీనై / పోయిన వయసు రాదు మేకప్ గీకప్ నక్కో/మేకప్ గీకప్ వద్దు నైబోలేతో సున్తేనై /వద్దంటే వినడం లేదు అచ్ఛే అచ్ఛే డ్రామే దేఖో / మంచి మంచి నాటకాలు చూడు కిత్తా కిత్తా సమ్ఝాయా/ ఎంతెంతగా నచ్చచెప్పా గంధే ఫిల్మే మత్ దేఖో/ పాడు సినిమాలు చూడొద్దని నై బోలేతో సున్తేనై / వద్దంటే వినడం లేదు సంజీవరెడ్డి మామా ! సమైక్యరాష్ట్రం ఏర్పడిన కొత్తలో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు! హైకోర్టు అన్యాపదేశంగా చేసిన వ్యాఖ్యకు స్పందనగా పదవికి రాజీనామా చేయసారు, ప్రధాని నెహ్రూకు చెప్పకుండా! అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఉండగా విమర్శించడం అంత తేలిక కాదు కదా! సర్వార్ దండా అనే మషూర్ కవి ‘సంజీవరెడ్డి మామా’ అనే షాయరీ రాసారు. విన్నవారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వే అనేక చరణాల్లో ఒక చరణం.. పోలీస్ కి డైరీ మె/ పోలీసుల డైరీలో దండె కి షాయిరీ మె/దండె కవిత్వంలో న ఫుల్ స్టాఫ్ న కామా/ఫుల్స్టాప్ ఉండదు కామా ఉండదు సంజీవ్ రెడ్డి మామా/సంజీవరెడ్డి మామా ఓల్డ్ సిటీలో నేటికీ పాడుకునే ఒక ‘నక్కొ’ నుడికారం పూపీ సాస్ నక్కొ/మేనత్త అత్తగా వద్దు భతీజీ బాబు నక్కొ/సోదరుడి కూతురు కోడలుగా వద్దు బందీ సౌకాన్ నక్కొ/పని మనిషి సవతిగా వద్దు ఘర్ మె సాలా నక్కొ/బావమరిది ఇంట్లో వద్దు కతిల్ పితల్ కా సాజ్ నక్కొ/ఇత్తడి ఆభరణాలు వద్దు బూఢే మరద్ కి రాజ్ నక్కొ/ముసలి వాడితో సంసారం వద్దు ఆహ్లాదకరమైన దక్కనీ సారస్వత వాతావరణంలో పెరిగిన పిల్లలు ఉత్తరాది వారి దృష్టిలో మోటు మనుషులు! ఉత్తరాది వారు హిందీ లేదా ఉర్దూలో మాట్లాడతారు. ఒక ఉత్తరాది వ్యక్తికి హైద్రాబాదీకి జరిగిన సంభాషణను ఆరోజుల్లో హైద్రాబాదీలు హాస్యంగా చెప్పుకునేవారు! ఒక ఉత్తరాది వ్యక్తి హైద్రాబాదీ పిల్లవాడిని అడుగుతున్నాడు ‘ ఈ రోడ్డు హైద్రాబాద్‌కు పోతుందా?’ పిల్లవాడు ‘హవ్ (అవును)’ అన్నాడు. ‘హవ్’ అని నీచంగా మాట్లాడావు నువ్వు అన్నాడు పెద్దాయన. మరేమనాలి సార్ అన్నాడు పిల్లవాడు. ‘జీ హా’ అనాలి అన్నాడు. అంటే ‘హవ్’ నీచమైన పదం అన్నమాట అన్నాడు పిల్లవాడు. పెద్దాయన ‘హవ్’ అన్నాడు! ఇంతటి హాస్యం ఉన్న దక్కనీ.. ఉర్దూ కంటే లేక హిందీ కంటే తక్కువ ఎలా అవుతుంది? అసలు దక్కనీ భాషే ఈ రెండు భాషలకూ మాతృక. ఆ చారిత్రక వైనం మరోసారి.. -
ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!
మోగా: ఇప్పటి వరకు ఏటీఎంలో డబ్బులు దొంగిలించిన సంఘటనల్నే చూశాం. కాని ఏకంగా ఏటీఎంను ఎత్తుకెళ్లిన సంఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన పంజాబ్ లోని మోగా-ఫిరోజ్ పూర్ రోడ్డులో చోటు చేసుకుంది. ఏటీఎంకు కాపాలదారుడిగా ఉన్న సెక్యూరిటీ గార్డు కళ్లల్లో రసాయన పదార్ధాలు చల్లి ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డు పరిస్థితి విషమంగా ఉందని, కళ్లు కనిపించడం లేదని పోలీసులు వెల్లడించారు. ఎత్తుకెళ్లిన ఏటీఎంలో 1,70,600 రూపాయలు ఉన్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. మోటార్ వాహనంలో ఏటీఎంను తరలించారని, హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
రెండు స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు కైవసం చేసుకుంది. పంజాబ్‌లో ఓ స్థానాన్ని, కర్ణాటకలో మరో స్థానంలో విజయం సాధించింది. పంజాబ్ పాటియాల స్థానాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో జమ చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రణీత్ కౌర్ 23,836 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఏఏపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. మరోవైపు కర్ణాటకలోని బళ్లారిలో కూడా హస్తం గెలుపొందింది. బీజేపీ అభ్యర్థి ఓబులేశుపై కాంగ్రెస్ అభ్యర్థి గోపాలకృష్ణ 25వేల ఓట్లతో గెలుపొందారు. మిగతా స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి. -
4 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కౌంటింగ్
న్యూఢిల్లీ : నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ సోమవారమిక్కడ ప్రారంభమైంది. 18 అసెంబ్లీ స్థానాలకు లెక్కింపు జరుగుతోంది. బీహార్‌లో 10, పంజాబ్‌లో 2, మధ్యప్రదేశ్‌లో 3, కర్ణాటకలో 3 స్థానాలకు గతవారం ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో విజయంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఇక కర్ణాటకలోని శికారిపుర, బళ్లారి రూరల్, చిక్కొడి-సదలగ నియోజక వర్గాలకు ఈ నెల 21న ఉపఎన్నికలు జరిగిన వైనం విదితమే. శికారిపుర నియోజకవర్గం ఓట్ల లెక్కింపును శివమొగ్గలోని సహ్యాద్రి కళాశాలలో చేపట్టారు. చిక్కొడి - సదలన నియోజకవర్గం ఓట్ల లెక్కింపును చిక్కొడి లోని ఆర్.డి.కళాశాలలో, బళ్లారి గ్రామీణ నియోజకవర్గం ఓట్లను బళ్లారిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. -
పంజాబ్‌లో ఆప్‌కు మరోజన్మ
దేశంలో ఎక్కడా విజయం సాధించలేకపోయిన ఆప్ పంజాబ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలు - ఫరీద్కోట్, ఫతేగఢ్ సాహెబ్, పాటియాలా, సంగ్రూర్ గెలుచుకుంది. పదహారో లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఆప్ సాధించిన పంజాబ్ విజయం మరీ ప్రత్యేకమైనది. పదహారో లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క అనుభవం. ఇందులో కోటలు కూలిన పార్టీలు గానీ, కోటలు అనూహ్యంగా బలపడిన పార్టీలు గానీ ఊహించని పరిణామాలే ఎక్కువ. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నమోదు చేసిన చరిత్ర మాత్రం దేశంలో ఏ ఎన్నికల విశ్లేషకుడు ఊహించినది కాదు. మరే ఇతర ఎన్నికల సర్వే ఊహించినది కూడా కాదు. దేశమంతటా పోటీ చేసిన ‘చీపురు’ పార్టీ కేవలం పంజాబ్‌లోనే నాలుగు సీట్లు గెలిచి తనకు తానే ఆశ్చర్యపోయింది. నరేంద్ర మోడీ గాలి వీస్తోందని సర్వేలు ప్రారంభమైన సమయంలో, ఒకటి రెండు చోట్లే కావచ్చు, ఆ గాలికి అడ్డుకట్ట వేయగలిగిన పార్టీగా ఆప్ పేరు ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఢిల్లీలో కమల వికాసాన్ని ఆప్ నిరోధిస్తుందని అంచనాలు వచ్చాయి. హర్యానాలోనూ, ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర భాగాలలోనూ ఆప్ ప్రభావం గణనీయంగా ఉంటుందని భావించారు. కానీ ఊహించని విధంగా పంజాబ్‌లో ఆప్ ప్రతాపాన్ని చూపించడమే కొన్ని పార్టీలకూ, నేతలకూ మాట లేకుండా చేసింది. ఈ ఎన్నికలలో దేశం మొత్తం మీద 430 లోక్‌సభ స్థానాలకు ఆప్ అభ్యర్థులను నిలిపింది. వారణాసిలో ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ చేసిన హల్చల్తో ఈ విషయం దాదాపు మరుగున పడింది. ఆయన పేరు మాత్రమే ఈ ఎన్నికలలో ప్రధానంగా వినిపించింది. కానీ ఆయన దారుణంగా ఓడిపోయారు. పంజాబ్‌లో ఉన్న మొత్తం 13 లోక్‌సభ స్థానాలలోనూ ఆప్ అభ్యర్థులను నిలిపింది. ఆప్ ఈ నిర్ణయం ప్రకటించగానే అక్కడి ప్రధాన రాజకీయ పక్షాలు ఎద్దేవా చేశాయి. కానీ దేశంలో ఎక్కడా విజయం సాధించలేకపోయిన ఆప్ పంజాబ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలు- ఫరీద్కోట్, ఫతేగఢ్ సాహెబ్, పాటియాలా, సంగ్రూర్ గెలుచుకుంది. ఎన్నో విశేషాలను దాచుకున్న పదహారో లోక్‌సభ ఎన్నికల ఫలితాలలో ఆప్ సాధించిన పంజాబ్ విజయం మరీ ప్రత్యేకమైనది. ఆప్‌ను స్థాపించి 18 మాసాలైంది. పంజాబ్‌లో లోక్‌సభ అభ్యర్థులను నిలపాలని భావించిన నాటికి అక్కడ పార్టీకి శాఖ కూడా లేదు. ఆదరాబాదరా 12 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కొందరు ఢిల్లీ నుంచి వెళ్లినవారే. చాలామంది అభ్యర్థులు ఆర్థిక సమస్యతో తగిన ప్రచారం కూడా చేసుకోలేకపోయారు. అయినా 24.4 శాతం ఓట్లు ఆప్‌కు వచ్చాయి. అభ్యర్థులు పెద్దగా ప్రాచుర్యం ఉన్నవారూ కాదు. ఫరీద్కోట్ నియోజకవర్గం నుంచి డాక్టర్ సాధూసింగ్ పోటీ చేశారు. ఆయన పదవీ విరమణ చేసిన ప్రిన్సిపాల్, కవి. నిధుల కొరతతో నియోజకవర్గంలోని పది శాతం గ్రామాలలో కూడా ప్రచారం చేయలేకపోయారు. కానీ నాలుగున్నర లక్షల ఓట్లు వచ్చాయి. సంగ్రూర్‌లో వ్యంగ్య రచయిత భగవంత్ మాన్ రెండు లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. పాటియాలా నుంచి పోటీ చేసిన ధరమ్వీర్ గాంధీ హృద్రోగ నిపుణుడు. విదేశ వ్యవహారాల సహాయ మంత్రి ప్రణీత్ కౌర్ ఇక్కడే దారుణంగా ఓడిపోయారు. దీనితో 33 పంజాబ్ అసెంబ్లీ నియోజకవర్గాలలో (మొత్తం 117) ఆప్ ఆధిక్యంలో ఉన్నట్టయింది. మరో 25 స్థానాలలో రెండో స్థానంలో నిలిచింది. పట్టణ, నగర ఓటర్ల అభిమాన పార్టీగా పేరు పొందిన ఆప్ పంజాబ్‌లోని మాల్వా ప్రాంతంలో ప్రతాపం చూపడం విశేషం. ఈ పల్లె ప్రాంతం కేంద్రంగానే ఇటీవలి వ్యవసాయ సంక్షోభం తలెత్తింది. ఈ విజయానికి ఆప్ విజేత ధరమ్వీర్ చెప్పిన కారణాలు తీవ్రమైనవి. రాష్ట్రంలో వెర్రితలలు వేస్తున్న మత్తుమందుల సంస్కృతి గురించి ప్రతిపక్షం కాంగ్రెస్, అధికార అకాలీదళ్-బీజేపీ కూటమి పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆయన విశ్లేషించారు. నిజానికి అకాలీలలో నానాటికీ పెరుగుతున్న అలక్ష్య వైఖరికి ప్రజలు విసిగిపోయారనీ, గుణపాఠం చెప్పడానికి ఓటర్లు ఎదురు చూస్తున్నారనీ దాని ఫలితమే ఈ ఫలితాలనీ ఆయన అభిప్రాయపడుతున్నారు. అకాలీ-బీజేపీ కూటమి అరకొర విజయం, అమృత్‌సర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో బీజేపీ ప్రముఖుడు అరుణ్ జైట్లీ లక్ష ఓట్ల తేడాతో పరాజయం పాలవడం సిక్కులు మోడీ పట్ల వ్యతిరేకంగా ఉన్నట్టే అర్థం చేసుకోవాలని కొందరి భాష్యం. పంజాబ్ అసెంబ్లీకి 2017లో ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి అకాలీ-బీజేపీ కూటమికే కాక, కాంగ్రెస్‌కు కూడా పోటీ ఇస్తూ రాష్ట్రంలో మూడో శక్తిగా ఆప్ ఎదిగే సూచనలు బలంగానే ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. కల్హణ -
గోతిలో పడిన గుర్రం
జలంధర్: వాయు వేగంతో దూసుకెళ్లే గుర్రం అనుకోకుండా గొయ్యిలో పడింది. దాదాపు రెండు గంటలు నరకయాతన అనుభవించింది. బుధవారం పంజాబ్‌లోని జలంధర్ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేసేందుకు రైల్వే ట్రాక్ వెంబడి తవ్విన గుంతలో ఇరుక్కుపోయిన గుర్రాన్ని స్థానికులు అతికష్టమ్మీద పైకి లాగారు. -
జాతీయ కేన్సర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం: ప్రధాని
ములాన్‌పూర్(పంజాబ్): దేశంలో ఏటా పెరుగుతున్న కేన్సర్ కేసులపై ప్రధాని మన్మోహన్సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధితో పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ కేన్సర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని, దీన్ని ప్రాంతీయ కేన్సర్ కేంద్రాలతో అనుసంధానిస్తామని తెలిపారు. కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు అందుబాటు ధరల్లో ప్రపంచస్థాయి చికిత్స అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా పేదలకు తక్కువ ధరల్లో ఆరోగ్య సేవలను అందించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. చండీగఢ్ దగ్గర్లోని ములాన్‌పూర్‌లో రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హోమీబాబా కేన్సర్ ఆస్పత్రి, పరిశోధన కేంద్రానికి ఆయన సోమవారం శంకుస్థాపన చేసి ప్రసంగించారు. ఈ ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే ఏటా 50 వేలమంది రోగులకు అత్యాధునిక చికిత్స అందుతుందని, పంజాబ్‌కే కాకుండా ఇతర ఉత్తరాది రాష్ట్రాల వారికీ ఉపయోగపడుతుందని అన్నారు. కేంద్రం జాతీయ కేన్సర్ నియంత్రణ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 27 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో రాష్ట్రస్థాయి కేన్సర్ కేంద్రాలను స్థాపిస్తున్నామని వెల్లడించారు. ప్రపంచంలో ఏటా నమోదవుతున్న మరణాల్లో 13 శాతం మరణాలకు కేన్సరే కారణమని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఈ వ్యాధి కారణంగా ఏటా 9 లక్షల మంది చనిపోతున్నారని, 11 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో పంజాబ్ గవర్నర్ శివరాజ్ పాటిల్, ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ తదితరులు పాల్గొన్నారు.