![Punjab Police Dragged By Car Trying To Stop For Checking Video Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/14/polce.jpg.webp?itok=GtfRnWd-)
పట్నా: పోలీసులు తనిఖీ చేస్తారని.. వాళ్ల నుంచి తప్పించుకోవడానికి వాహనదారులు పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముందుగానే పోలీసులను గ్రహించి మరో రోడ్డును ఎంచుకుంటారు. లేదా వాళ్లకు దొరక్కుండా దూరం నుంచి వేగంగా వెళ్లుతారు. అయినా చాలాసార్లు వాహనదారులు పోలీసులకు దొరికిపోయిన ఘటనలు చూశాం. అయితే తాజగా ఓ పోలీసు కారును తనిఖీ చేయాలని అడ్డగిస్తే.. ఆ వాహనదారుడు అత్యంత వేగంగా అతని మీది నుంచే దూసుకెళ్లుతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని పాటియాలాలో ఓ పోలీసు కారును తనిఖీ చేయాలని అడ్డగిస్తాడు. కానీ, కారు నడిపే వ్యక్తి వేగంగా పోలీసు మీది నుంచే వేగంగా వెళ్లుతాడు.
ఈ క్రమంలో వాహనం వేగంగా వెళ్లటం వల్ల కారును పట్టుకోవాలని ప్రయత్నించిన పోలీసు తలకు అద్దం తగిలి కిందపడిపోయాడు. వేగంగా వెళ్లుతున్న కారు అద్దం బలంగా తగలటంతో పోలీసు కుప్పకూలిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం గాయపడ్డ పోలీసు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిని వ్యక్తి కారును ట్రేస్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ హేమంత్ శర్మా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment