ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నిరసన సెగ తగిలింది.
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నిరసన సెగ తగిలింది. ఢిల్లీ రైల్వేస్టేషన్లో ఆయనను గురువారం బీజేపీ మహిళ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాలుగు రోజుల పంజాబ్ పర్యటనలో భాగంగా కేజ్రీవాల్ ఇవాళ ఉదయం చండీగఢ్ బయలు దేరారు.
రైల్వేస్టేషన్‌కు చేరుకున్న కేజ్రీవాల్‌ను బీజేపీ మహిళా కార్యకర్తలు అడ్డగించి నినాదాలతో హోరెత్తించారు. మహిళలపై వేధింపులకు ఆప్ నేతలు కేరాఫ్‌గా మారారని, మహిళలను అవమానించేలా మాట్లాడడం ఆప్ నేతలకు అలవాటైపోయిందని విమర్శలు గుప్పించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యేల వ్యవహారంపై కేజ్రీవాల్ స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆప్ నేత అశుతోష్ను పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు.