ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ : నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగుల విధులకు భంగం కలిగించారంటూ ఢిల్లీ హైకోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ఆప్ నేతలైన రాఖీ బిర్లా, సోమ్‌నాథ్ భారతీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విషయం ఏంటంటే.. 2014లో ఢిల్లీలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యభిచారాన్ని అడ్డుకోవాలని ఆప్ నేత సోమ్‌నాథ్ భారతీ ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీస్ శాఖ స్పందించలేదు. దాంతో విధులు సక్రమంగా నిర్వహించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని జనవరి 20న కేజ్రీవాల్, మరికొందరు నేతలు కలిసి రైలు భవన్ ఎదుట ధర్నా చేశారు. నిబంధనలు ఉల్లంఘించి దాదాపు 250-300మందితో కలిసి కేంద్ర హోంమంత్రి కార్యాలయం వైపు కవాతు నిర్వహించారు.
వీరి చర్యలను అడ్డుకోవాలని చూసిన అధికారులపై దౌర్జన్యానికి దిగారని పోలీసులు వెల్లడించారు.నిషేదిత ఉత్తర్వులను ఉల్లఘించడమే కాకుండా, కార్యకర్తలను ప్రసంగాలతో రెచ్చగొట్టినందుకు కేజ్రీవాల్‌తో సహా మరో ఐదుగురిపై వివిధ సెక‌్షన్ల కింద చార్జీషీట్ దాఖలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నేడు ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కేజ్రీవాల్ చర్యలను తప్పు పట్టింది. ఉద్యోగుల విధులకు భంగం కల్గించారని పేర్కొంది. అయితే ఈ ధర్నాతో ఆప్ నేత సంజయ్ సింగ్, జర్నలిస్ట్ అశుతోష్‌లకు సంబంధం లేదని ఢిల్లీ కోర్టు స్పష్టం చేయడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment