
నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఈనెల 9వ తేదీన అనుబంధ శివాలయంలో శిలన్యాస పూజలు చేస్తున్న క్రమంలో కొందరు అధికారులు చెప్పులు వేసుకొని పూజలు చేయడం బాధాకరమని బీజేపీ మండల అధ్యక్షుడు రచ్చ శ్రీనివాస్ అన్నారు.
చెప్పులు వేసుకుని పూజలు చేసిన దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ యాదగిరిగుట్ట పట్టణంలోని వైకుంఠద్వారం వద్ద మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అపవిత్రతకు పాల్పడిన అధిరులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మిట్ట శంకర్, రాయగిరి రాజు, రంగ సత్యం, చిత్తర్ల కృష్ణ, శేఖర్, శ్రీను, సంతోష్, ఠాగూర్ నవీన్, కట్కం మనోహర్, చైతన్యగౌడ్, భాస్కర్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment