చంఢీఘర్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీపై విమర్శలు గుప్పించారు. ఆయన పంజాబ్‌లోని మోగా జిల్లాలో మాట్లాడుతూ.. పంజాబ్ ఎన్నికలకు సంబంధించి ఆప్ ఇచ్చిన హామీలను చరణ్‌జిత్ కాపీ కొట్టారని మండిపడ్డారు. ‘మీ చుట్టు ఓ నకిలీ వ్యక్తి తిరుగుతున్నాడు. నేను పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హామీలను రెండు రోజుల తర్వాత.. వాటినే తమ పార్టీ హామీలను సీఎం చరణ్‌జిత్ ప్రకటించారు. ఏ హామీలను తీర్చలేడు.. ఆయనో నకిలీ వ్యక్తి’ అని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పంజాబ్‌లోని 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు వేయి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. ఇది ప్రపంచంలోని చాలా పెద్ద పథకమని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు అడగకుండా మహిళలు అర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ పథకం ప్రజయోజనం కలిగిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment