అమృత్సర్ : ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై 16మంది మహిళలు మరణించిన ఘటన మరువకముందే.. పంజాబ్‌లోని గురుదాస్‌లో డాక్టర్ల నిర్లక్ష్యానికి 16 మంది అంధులుగా మారారు. ఓ స్వచ్చంధ సంస్థ నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ డాక్టర్ల సహకారంతో.. గురుదాస్‌పూర్‌లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించింది.
ఈ శిబిరంలో దాదాపు 200 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేశారు. వారిలో కొందరికి కంటిలో తీవ్ర మంటలు రావడంతో... అమృత్‌సర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి డాక్టర్ల పరీక్షలు నిర్వహించి పూర్తిగా కంటిచూపు పోయినట్లు నిర్ధరించారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ నిమిత్తం ఓ కమిటీని నియమించింది.
ఫ్రీ అని వెళితే...కంటిచూపు కోల్పోయారు
Published Fri, Dec 5 2014 10:58 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM
Advertisement
Advertisement