ప్రపంచంలోనే తొలి 'బయోనిక్ ఐ': అంధుల పాలిట వరం ఈ ఆవిష్కరణ! | Worlds First Bionic Eye Developed Bring Hope For Blindness | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే తొలి 'బయోనిక్ ఐ': అంధుల పాలిట వరం ఈ ఆవిష్కరణ!

Published Tue, Oct 1 2024 3:35 PM | Last Updated on Tue, Oct 1 2024 4:37 PM

Worlds First Bionic Eye Developed Bring Hope For Blindness

సాంకేతికతో కూడిన వైద్య విధానం సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతోంది. బాధితులకు కొత్త ఆశను అందించేలా ఆధునిక వైద్య విధానం కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో భాగంగానే తాజాగా పరిశోధకులు 'బయోనిక్‌ ఐ'ని అభివృద్ధి చేశారు. జెన్నారిస్‌ బయోనిక్‌ విజన్‌ సిస్టమ్‌ అని పిలిచే ఈ ఆవిష్కరణ అంధత్వంతో బాధపడుతున్న లక్షలాదిమందికి కొత్త ఆశను అందిస్తోంది. అసలేంటీ ఆవిష్కరణ? ఎలా అంధులకు ఉపయోగపడుతుంది..?

సాంకేతిక పుణ్యమా అని.. వైద్య విధానంలోని ప్రతి సమస్యకు పరిష్కారం క్షణాల్లో దొరుకుతుంది. ఆ దిశగానే చేసిన అధ్యయనంలో అంధత్వ చికిత్సకు సంబంధించిన కొంగొత్త ఆవిష్కరణకు నాంది పలికారు ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. వారంతా ప్రపంచంలోనే తొలి బయోనిక్‌ కంటిని అభివృద్ధి చేశారు. దీన్ని 'జెన్నారిస్ బయోనిక్ విజన్ సిస్టమ్' అని పిలుస్తారు. 

అంధత్వంతో బాధపడుతున్న వారికి కంటి చూపుని ప్రసాదించేలా కొత్త ఆశను రేకెత్తిస్తుంది. సాంకేతికతో కూడిన ఈ అత్యాధునిక చికిత్స విధానం అంధత్వ చికిత్సలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది. ఈ జెన్నారిస్‌ వ్యవస్థ అనేది వందేళ్లుగా చేస్తున్న పరిశోధనలకు నిలువెత్తు నిదర్శనం. నిజానికి పుట్టుకతో అంధత్వంతో బాధపడుతున్నవారికి కంటి చూపుని ఇవ్వడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే..? మనం కళ్లతో నేరుగా చూడలేం. మన కంటిలోని ఆప్టిక్‌ నరాలు మెదడుతో కనెక్ట్‌ అయ్యి ఉంటేనే ఇది సాధ్యం. 

ఇంతవరకు మన వైద్య విధానంలో ఈ దిశగా చికిత్స అభివృద్ధి చెందలేదు. ఎన్నాళ్లుగానో అపరిషృతంగా ఉన్నా ఆ సమస్యకు పరిశోధకులు ఈ సరికొత్త ఆవిష్కరణతో పరిష్కరించారు. ఈ జెన్నారిస్‌ సిస్టమ్‌ ఆప్టిక్‌ నరాలకు బదులుగా నేరుగా మెదడుకి దృష్టి సంకేతాలను పంపుతుంది. ముందున్న చిత్రాన్ని గ్రహించేలా అనుమతిస్తుంది. అయితే దీన్ని జంతువులపై ట్రయల్స్‌ నిర్వహించి.. సత్ఫలితాలు వస్తే గనుక మానవులపై ట్రయల్స్‌ని విజయవంతంగా నిర్వహించేలా సన్నద్ధమవతామని పరిశోధకులు చెబుతున్నారు. 

ప్రస్తుతం గొర్రెలపై ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సాంకేతికత ప్రధాన భాగం మెదడు నమునాకు విద్యుత్ ప్రేరణ అందించేలా వైర్‌లెస్‌ ఇంప్లాట్‌ను కలిగి ఉంటుంది. ఇది మెదడు ఉపరితలానికి కనెక్ట్‌ అయ్యి ఉంటుంది. ఇది చిన్న పాటి విద్యుత్‌ పల్స్‌తో మెదడు కణాలను ఉత్తేజపరిచేలా వైర్‌లెస్‌గా ప్రోగ్రామ్‌ చేసి ఉంటుంది. ఇది కస్టమ్‌ డిజైన్‌ హెడ్‌కేర్‌ ధరించే సూక్ష్మ కెమెరాను పోలి ఉంటుంది. 

కెమెరా ద్వారా క్యాప్చర్‌ చేసిన హై రిజల్యుషన్‌ ఇమేజ్‌లు విజన్‌ ప్రాసెసర్‌ యూనిట్‌ ద్వారా ప్రాసెస్‌ చేస్తుంది. ఆ తర్వాత ఈ సంకేతాలు 11 పరికరాలకు వైర్‌లెస్‌గా ప్రసారమవుతాయి. ఇవి మెదడులో శస్త్రచికిత్స ద్వారా అమర్చిన టైల్స్‌ అనే పరికరానికి రిసీవ్‌ అవుతాయి. అవి విజువల్‌ కార్టెక్స్‌లోని న్యూరాన్‌లను ఉత్తేజపరిచి దృశ్యం కనిపించేలా చేస్తుంది. ఇది దాదాపు 100 డిగ్రీల వీక్షణ క్షేత్రాన్ని అందిస్తుంది. అంటే ఇది మానవ కన్ను పరిధితో పోలిస్తే కొంచెం తక్కువే అయిన్పటికీ.. గణనీయమైన సెన్సార్‌ సాంకేతికత గలిగిన ఈ పరికరం మంచి విజన్‌ని అందించడం విశేషం . 

(చదవండి: మానసిక ఆరోగ్యంపై శృతి హాసన్‌ హెల్త్‌ టిప్స్‌!)

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement